మత్స్య మహా పురాణము
146 - తారకాసుర ఉత్పత్తి
బ్రహ్మ పలికిన ఈ మాటలు విని వజ్రాంగుడు దైత్యు డయ్యు తపోవంతుడు కావున బ్రహ్మ తన నోటితో పలికిన మాట (అర్థము)ను హృదయమున ఆలోచించుచు ప్రాంజలియై ఇట్లనేసు: మీ ఆజ్ఞచే సమాధినుండి లేచిన నాకు నా భార్య బెదరించబడి దీనురాలయి చెట్టు క్రింద ఏడ్చుచు కనబడెను॥ నేను బాధనొందుచున్న చిత్తముతో ఆమెతో ఇట్లంటినిః “పిరికిదానా! ఇట్లు ఏలయున్నావు? ఏదియో (చేయరానిది) చేయదలచియున్నావు॥ అది ఏ మో చెప్పుము॥" దేవా! వాచస్పతీ! నేనిట్లడుగగా భీతురాలయి యున్న ఆ సుందరి మనోహరాక్షరములతో హేతుయుక్తముగా ఈ వాక్యమును పలికెను: రౌద్రుడగు దేవరాజు నాభర్త కనబడుట లేదు గదాయని నన్ను భయ పెట్టెను; అలక్ష్యముగా చూచెను; కొట్టెను; ఎన్నో విధముల పీడించేను॥ దుఃఖమునకు ఆంతు కనబడక ప్రాణములు వదల పూనియున్నాను॥ ఈ దుఃఖశోక మహాసముద్రము నుండి తరింపజేయు (తారకుడగు) కుమారుని ఇమ్ము॥ ఇట్లామె పలుక గా సంక్షోభము చేంది స్వర్గ వాసుల జయమునకు సమర్థుడగు కుమారుని ఆమెకు ఇచ్చుటకై ఘోర తపస్సాచరింతును॥
ఏతచ్ఛ్రుత్వా వచోదేవః పద్మగర్భోద్భవ స్తదా ।
ఉవాచ దైత్యరాజానం ప్రసన్న శ్చతురాననః॥
బ్రహ్మా : అలం తేతపసా వత్స మా క్లే శేదు స్తరేవిశ ।
పుత్రస్తేతార కోనామ భవిష్యతిమహాబలః॥
దేవసీమ నినీకా నధమ్మిల్లస్యవిమోక్షణః ।
ఇత్యుకోదైత్యనాథస్తు ప్రణిపత్య పితామహమ్॥
ఆగత్యానన్దయామాస మహిషీం హర్షితాననః ।
తా దమ్పతీకృతార్థాతు జగ్మతు స్వాశ్రమంముదా॥
వజ్రాణేనాహితం గర్భం వరాజీవర వర్ణినీ ।
పూర్ణంవర్ష సహస్రం చ దధారోదక సమ్ల్పుతా॥
తారకాసురోత్పత్తిః॥
తతో వర్షసహస్రా నే వరాక్టీసుపు వేసుతమ్ ।
జాయమానేతు దైత్యేనే తస్మిన్లోక భయజ్కరే॥
చచాల సకలాపృథ్వీ సముద్రాశ్చచక మిరే ।
చేలు ర్మహీధరాస్సర్వే వవుర్వాతాశ్చ భీషణాః॥
జైపుర్ణప్యంమునివరా నేదుర్వ్యాలమృగాఅపి ।
చన్దసూర్యౌ జహుః కాంతిం సనీహారా దిశాభవః ॥
జాతేమహాసురే తస్మి నృర్వేచాపిమహాసురాః ।
ఆజగ్మురషితా సత్ర తథాచాసురయోషితః॥
జగ్ముర్షరసమావిష్టా ననృతుశ్చాసురాజునాః ।
తతో మహోత్సవోజాతో దానవానాం ద్విజోత్తమాః॥
విషజ్ఞమనసో దేవా స్సమ హేన్షా స్తదాభవః ।
వరాజీస్వసుతం దృష్ట్వా హద్దేణాపూరితా తదా॥
బహు మేనే న దేవేన్దవిజయంతు తథైవసా ।
జాతమాతస్తు దైత్యశో స్తార కశ్చణ్ణవిక్రమః॥
అభిషిక్తో సురై స్సర్వైః కుజమ్భమహిషాదిభిః ।
సర్వాసుర మహారాజే పృథివీతులనక్షమైః॥
సతుప్రాప్య మహారాజ్యం తారకో మునిసత్తమాః ।
ఉవాచదానవ శ్రేస్ఠో యుక్తి యుక్తమిదంవచః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే తారకోత్పత్త్యాదికథనం నామ షట్చ
త్వారింశదుత్తరశతతమోఽధ్యాయః॥
పద్మగర్భోద్భవుడు చతుర్ముఖుడునగు ఆదేవుడు ప్రసన్నుడై ఆదైత్యరాజవచనమునకు సమాధాన ముగా ఇట్లు పలికెను: నాయనా! నీవు తపస్సు చేయుట మానుము॥ దుస్తరమగు క్లేశమునందు ప్రవేశించకుము॥ దేవతా సువాసినుల ఆందములగు కొప్పులు వీడిపోవునట్లు చేయగల తారకుడను పుతుడు నీకు కలుగును॥ బ్రహ్మ ఇట్లు పలుకగా దైత్యనాథుడా వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి హరపూర్ణముఖుడై తన భార్యకడకు వచ్చి ఆమెనానంద పరచెను॥ ఆ దంపతులు కృతార్థులయి మోదముతో తమ యాశ్రమముసకు ఏగిరి; మహాసుందరియగు ఆవరాంగి వజ్రాంగుడు తన యందు నిలిపిన గర్భమును తాను నీటియందు తడియుచు నిండుగా వేయేండ్లు మో నేను॥ తరువాత వరాంగి కుమారుని కనెను॥ లోక భయంకరుడగు దైత్యేంద్రుడు (తారకుడు) జన్మించునపుడు సకల పృథ్వియు చలించెను॥ సముద్రములు కంపిల్లేను॥ పర్వతములు కదలెను॥ భయంకర వాయువులు వీచెను॥ మునీంద్రులు శాంతికై జప్యమంత్రములు జపించిరి; క్రూర మృగములును భయముతో కూతలు పెట్టెను॥ చంద్రసూర్యుల కాంతిత గ్లెను॥ దిశ లందు మంచు కమ్మెను॥ సర్వులగు అసురులును ఆసురాంగనలును ఆ బాలుడు జన్మించిన చోటికి సంతోషముతోవచ్చి హరా వేశ ముతో దానవాంగనలు నాట్యము చేసిరి॥ దానవులు మహోత్సవములు జరుపుకొనిరి॥ మహేంద్రాది దేవతల మనములు విషాదముతో నిండెను॥ వరాంగి తన సుతుని చూచి హరపూర్ణురాలయ్యెను॥ దేవేంద్రుని జయించుట పెద్దపనిగా॥ ఆమెకు అనిపించ లేదు॥ ఇదెంత పనిలేమ్మను కొనెను॥ పుట్టిన వెంటనే చండ విక్రముడగు ఆతార కుడు పృథి వినే ఎత్తి ఊప గలిగిన కుజంభ మహిషాదులగు అసురులచేత సర్వాసురమహారాజుగా అభి షేకింపబడెను॥ మునిసత్తములారా! ఆ తారకుడు తనకు మహారాజత్వము లభించగానే దానవ శేషుడు కావున అందులకు తగినయు క్తియుక్తమగు వచనమునిట్లు పలికెను:
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున తార కోత్పత్తి కథనమను నూటనలువది యారవ అధ్యాయము॥
Summary of chapter 146 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the ultimate duel between seven-day-old Bhagavān Kārttikeya and the giant Asura king Tārakāsura. Tārakāsura deployed immense mystical illusions, creating dark storms, fiery blazes, and thousands of demon replicas; however, Kārttikeya neutralized every illusion with His divine arrows, displaying absolute calm and peerless martial skill.