మత్స్య మహా పురాణము
11 - సూర్యవంశానువర్ణనము
ఋషయః: ఆదిత్యవంశ మఖిలం వద సూత యథాక్రమమ్ !
సోమవంశం చ తత్త్వజ్ఞ యథావ ద్వకు మర్హసి॥
సూతః: వివస్వా న్కశ్యపా త్పూర్వ మదిత్యా మభవ త్పురా ।
తస్య పత్నీత్రయమభూ త్సంజ్ఞా రాజ్ఞీ ప్రభా తథా॥
రేవతస్య సుతా రాజ్ఞీ రైవతం సుషువే సుతమ్ ।
ప్రభా ప్రభాతం సుషుపే త్వాష్ట్రి సంజ్ఞా తథా మనుమ్॥
యమశ్చ యమునా చైవ యమళౌ తౌ బభూవతుః ।
తత స్తేజోమయం రూప మపహన్తీ వివస్వతః ॥
నారీ ముత్పాదయామాస స్వశరీరా దనిన్దితామ్ ।
త్వాష్ట్రి స్వరూపరూ పేణ సామ్నా ఛాయేతి భామినీ॥
కిం కరో మీతి పురత సంస్థితా తా మభాషత ।
ఛాయే త్వం భజ భర్తారం మదీయం చ వరాజ్గనే॥
అపత్యాని మదీయాని మాతృ స్నే హేన పాలయ ।
తథోత్యుక్త్వా చ సా దేవ మగా ద్ధర్మాయ సువ్రత॥
కామయామాస దేవోపి సంజ్ఞేయమితి చాదరాత్ ।
జనయాయాస సావర్ణి మనుం మానుషరూపిణమ్॥
సవర్ణత్వాచ్చ సావర్ణో మనో ర్వైవస్వతస్య తు ।
తత శ్శనిం చ తపతీం విష్టిం చైవ క్రమేణ తు॥
ఛాయాయాం జనయామాస సంజ్ఞేయమితి భాస్కరః ।
ఛాయా స్వపుత్రే త్వధికం స్నేహం చక్రే మనౌ తదా ॥
పూర్వో మను స్తతః క్షాన్తో యమ శ్చ క్రోధమూర్ఛిత ।
స నర్జయామాస తదా పాద ముద్యమ్య దక్షిణమ్॥
శ శాప చ యమం ఛాయా భక్ష్యతే క్రిమిసంచయైః ।
పాదోఽయ మేకో భవతః పూయశోణితవిప్రవః॥
నివేదయామాస పితుర్యమ శ్శాప మమర్షితః ।
నిష్కారణ మహం శప్తో మాత్రా దేవ సకోపయా॥
బాలభావా న్మయా తద్వ దుద్యత శ్చరణ స్సకృత్ ।
మనునా వార్యమాణాపి మమ శాప మదా ద్విభో॥
ప్రాయేణ మాతా చాస్మాక మసమా స్నేహతో యతః ।
దేవోప్యాహ సమం భూయః కిం కరోమి మహామతే॥
మౌర్ఖ్యా త్కశ్చన దుఃఖీ స్యా దథవా కర్మసనలేః ।
అనివార్యో భవస్యాపీ కా కథాఽన్యేషు జనుషు॥
కర్తారం కర్మపాకస్తు స క్రిమీ న్భక్షయిష్యతి ।
క్షేదం చ రుధిరం చైవ పుంసోఽయ మపనేష్యతి॥
ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: మీరు పురాణ తత్వమును ఎరిగినవారు. తాము మాకు సూర్యచంద్రవంశ ముల వృత్తాంతములను సంప్రదాయమున ప్రతిపాదింపబడిన విధమున యథా క్రమమున తెలుప వేడుచున్నాము.
సూతు డిట్లు చెప్పనారంభించెను: పూర్వము కశ్యప ప్రజాపతికి అదితి యందు సూర్యుడు, కుమారుడుగా జనిం చెను. అతనికి సంజ్ఞా రాజీ ప్రభా అనువారు ముగ్గురు భార్యలు. రేవతుని కూతురు రాజ్లి, ఆమె కుమారుడు రైవతుడు, ప్రభా కుమారుడు ప్రభాతుడు. త్వష్ట ఆను ప్రజాపతి కూతురు అగు సంజ్ఞకు వైవస్వతుడను మనుపును యముడు యమున అను కవలును కలిగిరి. సూర్యుని తేజోమయమగు రూపమును సహింపజాలక సంజ తన శరీరము నుండి పవిత్రురాలును సుందరియు నగు స్త్రీని జనింపజే పేను. ఆమేయును సంజ్ఞరూపములో సమానమగు రూపము కలిగియుండెను: ఆమె పేరు ఛాయ. నేనిపు డేమి చేయవలయును? అనుచు తన ఎదుట నిలిచిన ఛాయతో సంజ్ఞ ఇట్లనెను: నీవు స్త్రీలలో ఉత్త్రమురాలవు. నీవు నా భర్తను భర్తగా గ్రహించియుండుము. నా సంతానమగు ఈ ముగ్గురను ప్రీతితో రాపాడు చుండుము. అని సంజ్ఞ కోరగా ఛాయ అంగీకరించి ధర్మము నాచరించు తలంపుతోనే సూర్యునికడకు పోయేను. ఆతడు కు ఆమెను సంజ్ఞనుగా తలచి ఆమెతోనే కామముస ప్రవృత్తుడయ్యెను. సూర్యునకు ఛాయ యందు మనుష్య రూపుడగు సావర్ణి మనువు పు టైను. అతడు తండ్రితో సమానముగా వర్ణము కలవాడు. కనుకనే అతనికా పేరు కలిగెను. పిమ్మట సూర్యునికి ఛాయ యందే శని తపతి ఏషి అను ముగ్గురు సంతానము కలిగిరి. ఛాయ తన పుత్రుడగు సావర్ణి మనువు పై అధికముగా ప్రేమ చూప సాగెను. దానిని సంజ్ఞ మొదటి కుమారుడగు వైవస్వతుడు మనువు) సహించెను. కాని యముడు సహించక క్రోధో దేక ము చెందెను. అతడు తన కుడి కాలు ఎత్తి చాయను బెదరించెను. నీ ఈ పాదము ఎల్లుడును చీము ర క్తము కారు చుండును. దానిని క్రిములు తినుచుండును. అని ఛాయ యముని శపించెను. "
యముడును ఆ శాపమును సహించలేక సూర్యుని కడకు పోయి ఇట్లు పలికెను: దేవా !. మా అమ్మ (ఛాను). మా అన్న దమ్ముల. అక్క చెల్లెండ్ర -అందర యందును సమానముగా స్నేహ భావము చూపుటలేదు. అది సహించలేక నేను చిన్న తనపు స్వభావముచే ఒక్క మాకు కాలు ఎత్తితిని. కోపించి మా అమ్మ సన్ను శపించినది. . వైవస్వతుడు వలదని బ్రతిమాలు చున్నను ఆమె వినలేదు. అది విని సూర్యుడు యమునితో "నాయనా ! నీవు తెలియనివాడవు కావు. ఒక్కో క్కరికి తన మూర్ఖత్వము చేతను మరియొకరికి కర్మ వశ మునసు దుఃఖము కలుగుచుండును, ఈ రెండు విధములలో దేని చేతనైనను దుఃఖముననుభవించుట శివునకును తప్పించుకొసరానిది. ఇతరుల విషయము చెప్పవలసినదేమున్నది? జీపుల కర్మ విపాకము వారిని క్రిముల చేత భక్షింప జేయును. కర్మానుభవము వలన పాపము అనేది ) చీము రక్తము కారుట క్షీణించి పోవును.” అనెను.
ఏవ ముక్త స్తవ స్తే పే యమ స్తీవ్రం సహాయశాః ।
గోకర్ణతీర్దే వైరాగ్యా త్ఫలమూలానిలాశనః॥
ఆరాధయ న్మహాదేవం వర్షాణా మయుతాయుతమ్ ।
వరం ప్రాదా న్మహాదేవ స్సంతుష్ట శ్శూలభృ త్త్రదా॥
వవ్రే స లోకపాలత్వం పితృలోకస్య పాలనమ్ ।
ధర్మాధర్మాత్మక స్యాపి జగతస్తు పరీక్షణమ్॥
ఏవం న లోకపాలత్వ మగమ చ్చూలపాణినా ।
పితృణా మాధిపత్యం చ ధర్మాధర్మస్య చానమ॥
వివస్వా నథ(తద్జ్ఞాత్వా సంజ్ఞాయా) తత్త్వజ్ఞ స్సంజ్ఞాయాః కర్మ చేష్టితమ్ ।
త్వష్టు సమీప మగమ దాచచస రోషవాక్॥
త్వష్టృకృతసూర్య తేజశ్శాతనమ్॥
త మువాచ తత స్త్వష్టా సా న్త్వపూర్వం తదా వచః ।
తదాఽసహన్తీ భగవం స్తేజ స్త్రీవ్రం తమోనుదమ్॥
బడ బారూప మాస్థాయ (మత్సకాశం సమాగతా) త్వత్సకాశా దీహాగతా ।
నివారితా మయా సా చ త్వద్బయేన దివాకర॥
యస్మా దవిజ్ఞానమనా మత్సకాశం త్వ మాగతా ।
తస్మాన్మదీయం భవనం ప్రవేష్టుం న త్వమ ర్హసి॥
ఏవముక్తా జగామాశు మరు దేశ మనిన్దితా ।
బడబారూప మాస్థాయ భూతలే సంప్రతిష్ఠితా ॥
తస్మా త్ప్రసాదం కురు మే యద్యనుగ్రహభా గహమ్ ।
అపనేష్యామి తే తేజః కృత్వా య స్త్రీ దివాకర॥
రూపం తవ కరిష్యామి లోకానన్దకరం ప్రభో ।
తథోత్యుక్త స్స రవిణా భ్రమౌ కృత్వా దివాకరమ్॥
పృథక్చకార త త్తేజ శ్చక్రం విష్ణోః ప్రకల్పయత్ ।
త్రిశూల చాపి రుద్రస్య వజ్ర మింద్రస్య బాధికమ్॥
దైత్యదానవసంహర్తు స్సహస్రకిరణాత్మకమ్ ।
రూపం చోప్రతిమం చక్రే త్వష్టా పద్భ్యామృతే మహత్॥
న శశాకాథ నన్ద్రుష్టుం యదా రూపం రవేః పునః ।
అర్చాస్వపి తతః పాదౌ న కశ్చిత్కార యే ద్రచేః॥
యః కరోతి స పాపిష్ణగతి మాప్నోతి నిన్దితామ్ ।
కుష్టరోగ మవాప్నోతి లో కేఽస్మి న్దుఃఖసంయుతః॥
తస్మా న్న ధర్మ కామార్థీ చితే ష్వాయతనేషు చ ।
న కశ్చి త్కారయే త్పాదౌ దేవ దేవస్య ధీమతః॥
సూర్యుడు పలికినది విని మహాయశ శ్శాలియగు యముడు తీవ్రమగు తపస్సు నాచరించెను. అతడు గోకర్ణ తీర్థమున కోటి సంవత్సరముల పాటు వే రాగ్యమును పూని పండ్లు దుంపలు వేళ్లు గాలి ఆహారముగా శివుని ఆరాధించెను. త్రిశూల ధారి మహాదేవుడు సంతుష్టుడె వరము కోరుకొమ్మనెను. యముడును లోక పాలత్వమును పితృ లోక పాలనాధి కారమును ధర్మాధర్మ స్వభావములతో నడచు జగములను నిరీక్షించ చుండుటయు కోరెను. శివుననుగ్రహమున యమునకీ చూడధికారములును లభించెను.
వాస్తవ స్థితిని ఎరిగి సూర్యుడును రోషము చెంది త్వష్టకడకుపోయి సంజ్ఞ చేసిన పని తెలి పెను. త్వష్ట అతనితో ప్రార్థనా పూర్వకముగా ఇట్లు పలికెను : భగవన్ ! ఆనాడు సంజ్ఞ చీకటులను పారదోలు నీ తీవ్ర తేజమును సహించలేనిదయి నీ కడనుండి బయలుదేరి ఆడు గుర్రపు రూపముతో , కడకు వచ్చెను. నేను నీకు భయపడి ఆమెను నా ఇంటికి రావలదని వారించితిని. నీవు నీ భర్త హృదయమును ఎరుగక ఆతని అనుమతి లేక) నా దగ్గరకు వచ్చితివి. కనుక నీవు నొ గృహమును ప్రవేశింపదగదు. అని నేను అనగా "ఆ సు గుణవతి భూలోకము నందలి మరు దేశమునకు పోయినది. ఆమె ఇప్పుడును అదే ఆడు గుర్రపు రూపముతో అచ్చట తానుండదగిన చోటు దొరుకక తిరుగుచు) ఉన్నది. నేను నీయనుగ్రహము పొందదగిన వాడని మీరు భావించిన చో నన్ను ఆను గ్రహించుడు. మీ దేహమును యంత్రము నందు ఉంచి మీ తీవ్ర తేజస్సును కొంత పోగొట్టుదును. మీ రూపము ప్రాణులకు ఆనందకరము అగునట్లు చేయుదును. త్వష్ట మాట లను రవి అంగీక రించెను. త్వష్టయును భాస్కరుని తరిమెన పట్టు యంత్రమునందుంచి ఆతని తీవ్ర లేజస్సులో కొంత భాగము వేరు పరచెను. దానితో అతడు విష్ణుని చక్రమును శివుని త్రిశూలమును దైత్యదానవ సంహర్త అగు ఇంద్రుని వజ్రమును చేసెను.
అప్పటికిని త్వష సూర్యుని రూపమును చూడజాలక పోయెను. అందుచే ఆతడు సూర్యుని కిరణములను ఇంకను తగ్గించి సహ స కిరణములు మాత్రమే కలిగిన సాటిలేని గొప్ప అంద మైన రూపమును ర ..కి కలిగించేను.
(కిరణములను సంస్కృతమున కరములు పాదములు అని కూడ అందురు. ఈ చెప్పిన దానిని ఒట్టి త్వష్ట సూర్యుని పాదములను తీసివే నెను.)
అందుచేతనే నాటి నుండి తరువాత ఇప్పటికిని ఎవరును సూర్యునికి పాదములు న్న ట్లుగా అతని ప్రతిమను నిర్మింపజేయరాదు. అను ని షేధము ఏర్పడినది. ఒకవేళ అటు పాదములు గల రవి ప్రతిమ చేయి )చినచో ఆ పాపిష్టుడు నిందితమగు గతిని పొందును; కుష్ఠ రోగమును పొందును. ఈ లోకమున దుఃఖములను పొందును. కావున ధర్మమును కామమును కోరినవారెవ్వరును చిత్త్రరువుల యందును ఆలయములందును దేవ దేవుడును, మహాబుద్ధి శాలియును నగు సూర్యునకు పాదములు నిర్మింపజేయరాదు.
తత స్స భగవా న్గత్వా భూలోక మమతాధిపః ।
కామయామాస కామార్తో ముఖ మేవ దివాకరః॥
అశ్వరూ పేణ మహతా తేజసా చ సమావృతః ।
సంజ్ఞాచ మనసా క్షోభ మగమ ద్భయపీడితా॥
నాసాపుటాభ్యా ముత్సృష్టః పరోఽయమితి శజ్కయా ।
తస్య రేత స్స్రవా జ్ఞాతా వశ్వినా వితి న శ్శ్రుతమ్॥
దస్రౌ దస్రోష్ట సంజాతౌ నాసత్యౌ నాసికాం గతౌ ।
జ్ఞాత్వా చిరార్చితం దేవం సన్తోష మగమ త్పరమ్॥
విమానే నాగమ త్స్వర్గం పత్నాః సహ ముదాన్వితః ।
సావర్ణోపి మను ర్మేరా వద్యావ్యాస్తే తపోధనః॥
శని ప్తపోబలా దాయా ద్గ్రహసామ్యం తతః పునః ।
యమునా తపతి చైవ పున ర్నద్యౌ బభూవతుః॥
విష్టి ర్ఘోరాత్మికా తద్వ త్కాలత్వేన వ్యవస్థితా ।
మనోర్వైవస్వతస్యాథ దశ పుత్త్రా మహాబలాః॥
ఇళస్తు ప్రథమ స్తేషాం(పుత్త్రేష్ట్యా)పుత్రేషు సమజాయత ।
ఇక్ష్వాకుః కుశ నాభశ్చ అరిష్టో ధృష్ట ఏవ చ॥
నరిష్యన్తః కరూశ శ్చ శర్యాతిశ్చ మహాబలః ।
పృషదశ్వోఽథ నాభాగ స్సర్వే తే దివ్యమానుషాః॥
అభిషిచ్య మనుః పుత్త్ర మేళం జ్యేష్టం స ధార్మిక ।
జగామ తపసే భూయో (మహేన్ద్రవనమాలయం) హిమవచ్చిఖరం పరమ్॥
అథ దిగ్జయసిద్ధ్యర్థ మిళ : ప్రాయా న్మహీ మీమామ్ ।
భ్రామ్య న్ద్వీపాని సర్వాణి భృత స్ససంప్రసాధయత్॥
సూర్యవంశ్య స్యేళస్య శరవణే స్త్రీరూపప్రాప్తి:॥
జగా మోపవనే శమ్బో రశ్వాకృష్ణః ప్రతాపవాక్ ।
కల్పద్రుమలతాకీర్ణం నామ్నా శరవణం మహత్॥
రమతే తత్ర దేవేశ స్సోమ స్సోమార్ద శేఖరః ।
ఉమయా సహిత స్తత పురా శరవణే కృతః॥
పున్నామ సత్వం యత్కిఞ్చి దాగమిష్యతి నో వనే ।
స్త్రీత్వమేష్యతి తత్సర్వం దశయోజనమణ్డలే॥
తరువాత అమరులకు అధిపతియగు భగవానుడు సూర్యుడు భూలోకమునకు పోయేను. అతడు మహాతేజస్సుతో 1 కమ్మ బడిన వాడును అశ్వ రూపమును ధరి )చినవాడును ఐ ఆమేకడకు పోయెను. ఆ దివాకరుడు కామారుడుగా ఉండే నందున ఆడు గురపు రూపమున ఉన్న సంజ్ఞ ముఖమునే తన కామ ప్రవృ తికి సాధనముగ చేసికొనెను. ఆమె తన భర్తను గుర్తించక ఆతడెవరో పరుడు అను భ్రాంతిచే మన స్సునందు భయముచే భాధనొంది కలవరపాటు చెందెను. ఆమే సూర్యుని వీర్యమును తన ముక్కు పుటముల ద్వారమున వదలివేసెను. ఇట్లు జరిగిన ' ఈ రేతఃస్రావమువలన పుట్టిన ఇద్దరు దేవతలే అశ్వినులు అని మనము సంప్రదాయమున) వినుచున్నాము.
నా కల (ముక్కుల నుండి పుట్టినందున నాసత్యులు అనియు దసము అశ్వము) యొక్క ఓష్ఠము ( పెదవుల నుండి పుట్టుటచే దసులనియు అశ్వి దేవతలకు పేరు లేర్పడినవి.
తరువాత సంజ్ఞ తాను పూర్వము చాలకాలము క్రిందట అర్చించిన తన పతియే ఇతడని సూర్యుని గుర్తించి మరల సంతోషము నందేను. రవియు విమానము పై తన భార్యతో కూడ స్వర్గమునకు వెళ్లెను.
సూర్యునకు ఛాయయందు కలిగిన సూర్య సాపల్లి తపోధనుడుగా ఈనాటికిని మేరు పర్వతమునందున్నా డు. శని తపస్సాచరించి తన తపోబలము గ్రహములతో సమానత్వము పొందినాడు.
యమున తపతి అను ఇరు కన్యలును నదులే 6. విప్షి అను కన్య మాత్రము ఘోర రూపురాలు (మిగుల నల్లనిది). ఈమె కాల రూపురాలయి ఉవేవ స్వత మనువునకు మహాబలులగు పదిమంది కుమారులు కలిగిరి. వారిలో మొదటి వాడు ఇళుడు. ఇంకను ఇక్ష్వాకుడు కుశనాభుడు అషుడు ధృష్ణుడు సష్యంతుడు కరూశుడు శర్యాతి పృషదశ్వుడు "భాగుడు అనువారు తొమ్మిది మంది. ధర్మమును ఎరిగి అనుష్టి చు ధార్మికుడగు వైవస్వపడు జ్యేష్ట పుర్తుని ఇశుని రాజ్యమునందభి షేకించి ! శేష్టమగు హిమపచ్చిఖరమునకు (మ హేంద్ర వనమునకు) పోయి అందరకంటే మిన్న గా తపమాచరింపసాగెను.
తరువాత దిగ్విజయమును సాధించుటకై ఆ ప్రతాపవంతుడగు ఇళుడు ఈ భూమిము.) దంతటను అన్ని ద్వీష ముల యందును సంచరించుచు రాజులను అందరను తనకు లోబరచుకొనెను. ఆ దిగ్గయ యాతా క్రమములో అతడు (ఇలుడు దిగ్విజయము కోరి అశ్వమును మంత్రపూర్వకముగా వదిలి అది భూమండల మందంతట తిరుగుచుండ తానును దాని వెంట పోవుచుండెను. ఆ యశ్వము అట్లు పోవుచు శరవణములోనికి పోగా ఇలుడును దానిననుసరించి ఆ ఉద్యానములో ప్రవేశించెను. అని అర్ధము)తన గుర్రము తీసికొనిపోగా శిపుని ఉద్యానవనముకు పోయెను ఆ ఉద్యానము కల్పవృక్షపులతలతో వ్యాప్తమయి (సుందరమయి) నది. చాల పెద్దది. గొప్పది. దాని పేరు శరవణము. దాని యందు అర్ధచంద్రుని శిరోభూషణముగా ధరించు వాడును దేవేశుడును అగు సోముడు (స+ఉమా) పర మేశ్వరుడు పార్వతి (ఉమతో కూడి విహరించుచు ఆనం దించుచుండును. దశ యోజన వేశాల్యము గల మా యీ వనమునందు పురుషప్రాణి ఏది వచ్చినను అట్టి ప్రతి యొక పురుష ప్రాణియు స్త్రీత్వమును పొందును. అని పూర్వము ఒకప్పుడు పార్వతి ఈ వన విషయమున ఒక వ్యవస్థ కట్టడి చేసెను.
అజ్ఞాతసమయో రాజా వృత శ్శరవణే పురా ।
స్త్రీత్వ మాప విశన్నేవ బడబాఽశ్వోఽ భవ తచా॥
పురుషత్వే కృతం సర్వం స్త్రీరూ పే విస్మృతం సృప ।
ఇళేతి సౌఽభవ న్నారీ పీవోన్నతఘన స్తనీ॥
ఉన్నతశ్రేణిజమనా పద్మపత్రాయతేక్షణా ।
పూర్ణేన్దువదనా తన్వీ విలాసోల్లసితేక్షణా॥
స్థూ లోన్న తాయతభుజా నీలకుఞ్చితమూర్ధజా ।
తనులోమా సుదశ నా మృదుగమ్బీర భాషిణీ॥
శ్యామా గౌ రేణ వర్ణేన హంసచారణగామినీ ।
కామరూపగుణోపేతా తనుతామ్రనఖాంకురా॥
భ్రమమాణా వనే తస్మింశ్చింతయామాస భామినీ ।
కో మే పితా వా భ్రాతా వా కా మే మాతా భవే దిహ॥
కస్య భర్తు రహం దత్తా దృగ్వర్ణస్య భూతలే ।
సా చిన్తయన్త దదృశే సోమపుత్రేణ చాజ్గనా॥
ఇళారూపసమాక్షిప్తో మనసా వర వర్ణినీమ్ ।
బుధస్తు కామయామాస తాం వనే కామపీడిత:॥
విశిష్టాకారవా న్దణ్డీ సకమణ్డలుపుస్తకః ।
వేణుదణ్డకృతానేక పవిత్రకరణో నృప॥
ద్విజరూప శ్శిఖీ బ్రహ్మ నిగద న్రుక్మకుణ్ణలే ।
బహుభి శ్చాన్వితో ధత్తే సమిత్పుష్పకుశోదకై ॥
కీలాన్విష్య వనే తస్మి న్నా జుహావ స తా మిళమ్ ।
బహిర్వన స్యా న్తరితః కిల పాదపమణ్డలే॥
ససభ్రమ మక స్మాచ్చ సోపాలమ్బ మీదం వద ।
త్యక్త్వాగ్ని హోత్ర శుశ్రూషాం క్వ గతా మన్దిరా స్మమ॥
ఇయం విహార వేళా తే గమితా తవ ససాంప్త్రతమ్ ।
ఏ హ్యేహి పృథుల శ్రేణి నాయాతా కేన హేతునా॥
ఇయం సాయన్తనీ వేళా విహారస్యాతివర్తతే ।
కృత్వోపలేపనం పుష్పై రలజ్గురు గృహం మమ॥
సా త్వబ్రవీ ద్విస్మృతాఽహం సర్వ మేత త్త్రపోధన ।
ఆత్మానం తవ శీలం చ కులం చ వద మేనమ॥
బుధః ప్రోవాచ తాం తన్వీ మిళం వై వరవర్ణీనీం ।
అహం చ కాముకో నామ బహు విద్యో బుధ స్సృతః॥
తేజస్వినః కులే జాతః పితా మే బ్రాహ్మణాధిపః ।
ఇతి సా తస్య వచనా తృవిష్టా బుదమన్దిరమ్॥
(రమ్యస్తంభ) రమ్భస్తమ్భసమాకీర్ణం దివ్య (మాయా) మక్తా వినిర్మితమ్ ।
ఇళా కృతార్థా మాత్మానం మేనే తద్భవనస్థితా॥
అహో గేహ మహోరూప మహో ధన మహో కులమ్ ।
మమ చాస్య పురా భర్తు రహో లావణ్య ముత్త్రమమ్॥
రేమే చ సా తేన సము మతికాల మిళా తలః ।
సర్వభోగమయే గేహే యథేన్ద్రభవనే తథా॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే సూర్యవంశవర్ణన నామైకాదశోఽధ్యాయః ॥
పూర్వము ఎప్పుడో ఇపుడు చేసిన ఈ వ్యవస్థ తెలియని రాజు ఇలుడు ఆ శరవణములో ప్రవేశించిన వెంటనే శ్రీ. అయ్యెను. అతని అశ్వమును బడబ (ఆడు గుర్రము) అయ్యెను. రాజు వెంటనే తాను పురుషుడుగా ఉన్నప్పుడు చేసిన ప్రతి పనిని మరచెను. ఆమే ఇక అను పేర శ్రీ అయ్యేను. ఈ రూపములో ఆమె వక్షోజములు బలిసినవై ఉన్నతములై యుండెను. ఆమే పిఱుదులును కటి ప్రదేశమును ఉన్న తమయి ఉండెను. ఆమె కన్నులు తామరపూరే' లవలే విశాల ములయి యుండెను. ఆమె ముఖము నిండు చందురుని పోలియుండెను. ఆమె శరీరము అంత స్థూలముకొక సన్న నై యుండెను. ఆమె చూపులు ఒయ్యారపు కదలికలచే మెరయు చుండెను. అంతవరకు సంతానమును కని ఉండని యావ నములో ఉండెను. ఆమె మేను బంగారు . చాయతో ఉండెను. ఆమె హంసవలె నడచుచుండెను. కోరికల రేకె తించు రూపమును శృంగార గుణములును కలిగి యుండెను. ఆమె గోళ్ళ మొలకలు పలుచనై ఎర్రనయి యుండెను.
ఇటువంటి ఆ సుందరి ఇళ' ఆ శరవణమను ఉద్యానమునందు అటునిటు తిరుగుచు తను: "మనస్సులో “నా సాయన ఎవరో ! అమ్మ ఎవరో ! - సోదరులు జవ్వరో ! . ' ఎవరిని భర్తగా చేసి నన్ను అతనికి ఇచ్చిరో ! 'భూలోకమున అతడు ఏ వర్ణము వాడో ?”. అని ఆలోచింపసాగెను. ఆమే ఇట్లాలోచించుచు తిరుగుచుండగా ' చంద్రుని పుత్రుడగు బుధుడు ఆమెను చూచెను.. ఆమె సౌందర్యము అతనిని ఆకర్షించెను. కామము పీడింపగా.. ఆ ఉద్యానమునందే అతడామె యందు అనురాగము చెందెను [అతడు, ఆమె విషయమున తన కోరిక తీర్చుకొనుట.కై ఒక ఉపాయము చేసెను.)
బుధుడు ఒక విశిష్టమయిన రూపము ధరించెను. అతని చేతులయందు దండము కమండలువు పుస్తకమును ఉండెను. బ్రాహ్మణ రూపము శిఖ బంగారు కుండలములును దాల్చి ఉండెను. వేదము చెప్పుచుండెను. తమ చేతులందు వేణు దండములు ధరించి సమిధలు పుష్పములు కుశ లు ఉదకము చేత పట్టుకొనియున్న అనేకులు అగు బ్రహ్మచారులు అతని వెంట నుండి.. ఇట్టి రూపముతో పరివారముతో ఆ బుధుడు (ఇళ తప్పిపోగా ఆమె కొరకై ) వేదకుచున్న వానివలె నటించుచు ఆ శరవణమున ఆమెను గట్టిగా పిలువసాగెను. బుధుడు ఆ శరవణమునకు వెలుపలనే (లోపలకు వచ్చినచో తానును స్త్రీగా మారుసను భయమున చెట్ల గుబురు చాటున నుండి తడబాటు పడుచు ఆకస్మికముగా మందలింపు మాట లతో ఈ విధముగా పలుకసాగేను. “అగ్ని హోత్ర కాలములో చేయవలసిన నాశుశ్రూష చేయక విడిచి నా ఇంటి నుండి ఎక్కడకు వెళ్ళితివి ? నీవు విహరించు వేళ ఇప్పుడు ముగిసిపోయినది. ఓ సుందరీ ! రమ్ము-రమ్ము ! ఇంకను రాకున్నావు. కారణమేమి ? సాయంకాలమున నీవు విహరింపదగిన సమయము గడచిపోవు చున్నది. నా ఇంటికి రమ్ము. వచ్చి ఇల్లు అలికి పూలతో అలంకరించుము."
ఈ మాటలు విని ఇళ ఇట్లు పలికెను. “తపోధనా నేను ఈ విషయమంతయు మరచితిని. మీరు ఎవరో మీ కులమేమో శీలమే మో చెప్పవేడుచున్నాను.”
బుధుడు మిగుల సౌందర్యవతియగు ఇళతో ఇట్లు పలికేను: “నేను కాముకుడు అను పేరుతో ప్రసిద్ధుడను. అనేక ములగ విద్యల నెరిగిన వాడను. (కనుక) బుధుడను ప్రసిద్ధి వహించి యున్నాను. తేజస్వి (కాంతి గలవాడు. చంద్రుడు) అనువాని కులము (వంశము-ఇల్లు) నందు పుట్టిన వాడను. నా తండ్రి బ్రాహ్మణులకు (ద్విజులకు-అనగా పక్షులకు) అధిపతి (చంగ్రుడు) ; ఇట్లు పైకి తాను బ్రాహ్మణు డై నట్లును రహస్యార్థమున తాను చంద్రుని కుమారుడు, బుధుడనియు మాటలాడగా ఆమె అతని ఆ మాటలు విని బుధుని గృహమునకు పోయి దాని యందు ప్రవేశించెను. ఆది మనోహర ములగు స్తంభములతో వ్యాపింపబడి యున్న ది. దివ్యములగు ము తైములు అంతట కూర్చబడి యున్నవి. ఇదీ యంతయు చూచి ఆ ఇళ ఆ ఇంటిలో ఉండుటవలన తాను కృతార్జురాలయెనని తలచేను. ఎంతో మేచ్చదగిన ఇల్లు! ఎంతో మెచ్చదగిన రూపము. ఎంతో ప్రశంసింప దగిన ధనము. ఎంతో పొగడదగిన వంశము. ఎంతో కాలము" - - - నుండియు ఇతడే నా భర్త. ఇతని లావణ్యము ఉత్త్రమమైనది. అని ఆమె సంతోషపడెను,
నాటి నుండియు చాలకాలము వరకు ఇళ ఇంద్రభవనము వంటిదిగా తనకు తోచుచు సర్వభోగములతో నిండిన ఓ ఇంటియందు ఆ బుధునితో కూడ విహరించి ఆనందించెను.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున సూర్య వంశ వర్ణనమున ఇళా బుధసమాగమమగు ఏకాదశాధ్యాయము.
Summary of chapter 11 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the narrative of the Sūrya-vaṁsha, beginning with the Sun deity Vivasvān, born of Maharshi Kaśyapa and Aditi, and his wife Saṁjñā, daughter of the celestial architect Vishvakarmā. Unable to endure Vivasvān's intense heat, Saṁjñā substituted her shadow-form Chhāyā and departed to perform penance; from Vivasvān and Saṁjñā were born Vaivashvata Manu, Yama, and the river goddess Yamunā, while from Chhāyā were born Shani, Sāvarṇi Manu, and Tāpatī. King Vaivashvata Manu, desiring offspring, performed a sacred sacrifice that resulted in the birth of Ilā, who later transformed into a male named Sudyumna due to a divine curse upon Śiva's forest; while wandering as a beautiful woman, Ilā united with Budha, giving birth to Purūravas, the progenitor of the Chandra-vaṁsha.