మత్స్య మహా పురాణము
229 - దేవతార్చా వికారోపశాంతి.
గర్గః : దేవతార్చాః ప్రనృత్య ని వేప నే ప్రజ్వలంతిచ ।
ఆరటంతి రుద న్యేతాః ప్రస్విద్య ని హసన్తచ॥
ఉత్తిష్టని విషీద ని ప్రధానంతీ ధమంతిచ ।
భజ్య నే విక్షిపంతేచ శ స్త్రీణ ప్రహర స్తి చ॥
అధోముఖాశ్చ తిష్ఠని స్థానాత్ స్థానం చల నీచ ।
వమ న్యగ్నిం తథా ధూమం స్నేహం రక్తం తథా వసామ్॥
శ్రీ ఏవ మాద్యాశ్చ దృశ్య నే వికారా స్సహసోత్తితాః ।
లిజ్ఞాయతనవిపేషు తత్ర వాసం న రోచయేత్॥
రాజో వా వ్యసనం తత్ర స చ దేశో వినశ్యతి ।
దేవయాత్రాసు చోత్పాతా నృష్ట్వా దేశ భయం వదేల్॥
ఈ పితామహస్య హర్మ్యేషు తత్ర వాసం న రోచయేత్ ।
పశూనాం రుద్రజం జేయం నృపాణాం లోకపాలజమ్॥
జ్ఞేయం సేనాపతీనాం తు యత్స్యా త్స్కన్దవిశాఖజమ్ ।
లోకానాం విష్ణుసమ్భూతం విశ్వకర్మ సముద్భవమ్॥
వినాయకోద్భవం జ్ఞేయం గణానాం యే తు నాయకాః ।
దేవ పేష్యా న్నృప పేష్యా దేవక్రీభి న్నృపశ్రియః॥
వాస్తు దేవోద్భవం జ్ఞేయం గ్రహాణామివ నాన్యథా ।
దేవతానాం వికారేషు శ్రుతి వేత్తా పురోహితః॥
దేవతార్చాం తు గన్గాద్యై స్నాన మాచ్ఛాద్య భూషయేత్ ।
వూజయేచ్చ మహాభాగ గడ్గమాల్యాన్న సమ్పదా॥
మధుపరేణ విధివ దుపతిషే దన స్తరమ్ ।
తల్లిజేన చ మ శ్రేణ స్థాలీపాకం యథావిధి॥
పురోధ జుహుయా ద్వహ్నౌ సప్తరాత్ర మతస్త్రితః ।
విప్రాశ్చ పూజ్యా మధునాన్న పానై స్సదక్షిణం సప్తదినం నరేన్డ॥
ప్రాప్తే ష్టమేహ్ని క్షితిగో ప్రదానై స్సకాఞ్చనై శ్శాంతి ముపైతి పాపమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే అర్చావికారోపశమనం నామ ఏకోన త్రింశదు త్తర ద్విశతత మోఽధ్యాయః॥
గర్గుడు ఆత్రితో ఇట్లు చెప్పెను: దేవాలయములందలి ఆర్చామూర్తులు (దేవతా విగ్రహములు) విశేషముగా నృత్యము చేయును; వణమును; ప్రజ్వలించును; గట్టిగా అర చును; ఏడుచును; చెమర్చును; నవ్వును; లేచును; దుఃఖించును; పరుగేత్తును; ఊదును; విరుగును; కదలును; ఆయుధముతో కొట్టును; తలలు వంచుకొని నిలుచును; ఒక చోటినుండి మరియొక చోటికి కదలును; ఆగ్ని ని పొగను నూనేను (జిడ్డును) రకమును వనను కక్కును; ఈ విధములగు వికారములు దేవాలయములందో బ్రాహ్మణుల ఇండ్లయందో కనబడును; ఆట్టి చోటులందు నివాసము విడువవలయును; వీనిచే రాజునకయినను వ్యసనము (ఆపద) కలుగును.దేశమునకై న నాశము కలుగును; ఇట్టి ఉత్పాతములు దేవతల జాతర అందు కనబడుచో దేశ మునకు భయము కలుగును; ఆభయములు హర్మ్యములందు బ్రహ్మవలనను పశువులకు రుద్రుని వలనను నృపులకు లోక పాలుర వలనను సేనాపతులకు స్కందునివలనను విశాఖుని వలనను ( ఈ ఇద్దరును కుమార స్వామి రూపభేదములే) లోక (రాజ్య) జనులకు విశ్వకర్మ విష్ణువుల వలనను గణ నాయకులకు వినాయకుని వలనను రాజ సేవకులకు దేవ సేవకుల వలనను నృపస్త్రీలకు దేవతా స్త్రీల వలనను ఆ పదలు ఈ ఉత్పాతముల ఫలముగా కలుగును; గ్రహాదులయందు కలుగు ఉత్పాత దర్శనములు వాసుదేవుని వలన కలుగును; దేవతార్చామూర్తులందు ఈ వికారములు కన బడినపుడు వేదవేత్తయగు పురోహితుడు ఆ మూర్తిని స్నానమాడించి వస్త్ర గంధ భూషణాదులతో కప్పివేయవలెను; అలంకరించవలెను; గంధమాల్యాన్నాది సంపదలతో ఆర్చన చేయవలెను; తరువాత మధుపర్కముతో (తేనెతో కలిపిన గోక్షీరముతో) మూర్తిని సేవించవలెను; ఆ దేవతా సంబంధి మంత్రములతో యథావిధిగ స్థాలీపాకము జరిపి ఆచరువుతో ఏడహోరాత్రములు హెచ్చరిక తో హోమము చేయవలెను; ఈ ఏడు దినములును విప్రులను. తేనె అన్న పానములు దక్షి ణలు-వీనితో పూజించవలెను; ఎనిమిదవ దినమున విప్రులకు గోభూదానములు జరుపవలయును; దీనిచే ఉపద్రవములు శాంతించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఆర్చావికారోప శమనమను రెండు వందల ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 229 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a comprehensive treatise on royal astrology, analyzing planetary conjunctions, star alignments, and celestial movements indicating national fortunes. Bhagavān Matsya details how specific alignments of Shani, Mangala, Bṛhaspati, and Rāhu influence war outcomes, economic prosperity, weather patterns, and dynastic stability. Understanding these celestial indicators enables royal astrologers to advise the monarch on opportune times for diplomatic, economic, and military initiatives.