మత్స్య మహా పురాణము
163 - పాద్మకల్ప వృత్తాంతారంభము॥ మనువు నారాయణ నాభీపద్మోద్భవమును గూర్చి ప్రశ్నించుట॥
మనుకృత నారాయణసాభిపద్మోద్భవాది ప్రశ్నా ॥
ఋషయః: కథితం నరసింహస్య మాహాత్మ్యం విస్తరేణచ ।
పునస్తస్యైవ మాహాత్మ్యమన్యద్విస్తరతో వద॥
పద్మరూపమభూ దేత త్కథం హేమమయం జగత్ ।
కథంచ వైష్ణవీ సృష్టిః పద్మమధ్యేఽ భవత్పురా॥
సూత: శుత్ర్వాచ నరసింహస్య మహాత్మ్యం రవినన్దనః।
విస్మయోత్ఫుల్లనయనః పునః పప్రచ్ఛ కేశవమ్॥
మనుః : కథం పాద్మే మహాకల్పేఽభవత్పద్మమయం జగత్ ।
జలార్ణవగత స్యేహ నాభౌ జాతం జనార్దన॥
ప్రభావాత్పద్మనాభస్య స్వపతస్సాగరామ్బసి ।
పుష్కరేషు కథం భూతా దేవా స్సర్షిగణాః పురా॥
ఏతదాఖ్యా నిఖిలం యోగం యోగ విదామ్పతే ।
శృణ్వత స్తస్య మే కీర్తిర్న తృప్తిరుపజాయతే॥
కీయతా చైవ కాలేన నేతే వై పురుషోత్తమః ।
య స్తం వై స్వపితిచ కోఽస్య కాలస్య సమ్భవః॥
కియతో వాఽథకాలేన హ్యు తిష్ఠతి మహాయశాః ।
కథం చోత్థాయ భగవాన్త్ససర్జ నిఖిలం జగత్॥
కథమేకార్ణవే శూన్యే నష్టే స్థావర జజ్గమే ।
దగ్ధదేవాసురనరే ప్రణష్ణోరగరాక్షసే॥
నష్టానిలానలే లో కే నష్టాకాశ మహీతలే ।
కేవలం గహ్వరీ భూతే మహాభూత విపర్యయే॥
విభుర్మహాభూతపతిర్మహాతేజా మహాకృతిః ।
ఆస్తే సురవర శేష్ఠో విధిమాస్థాయ యోగవాక్॥
శృణు యాం పరయా భక్త్యా బ్రహ్మన్మే తద శేషతః ।
వక్తుమర్హసి ధర్మజ్ఞ యశో నారాయణాత్మకమ్॥
శ్రద్ధయా చోపవిష్టానాం భగవస్వస్తుమర్హసి ।
ఋషులు సూతు నిట్లడిగిరి : నరసింహ రూపుడగు నారాయణుని మాహాత్మ్యమును విస్తరముగ చెప్పితివి॥ మరలను ఆ దేవునిదే మరియొక మాహాత్మ్యమును విస్తరించి చెప్పుము॥ విష్ణు నాభినుండి పద్మరూప మె ట్లేర్పడెను? హేమపద్మ మయమగు జగ మెట్లు ఏర్పడెను? నిష్ణువు ఆ పద్మ మధ్యమునుండి సృష్టినే భ్రారంభించి సాగించేను? అనగా సూతు డిట్లనెను: నర సింహుని మాహాత్మ్యమును విని వైవస్వతుడు విస్మయమున కన్నులు వికసింప మత్స్యరూప కేశవుని మరల నీట్లడిగేను: పూర్వము "పాద్మ మహాకల్పమున జలార్ణవమందు జలమున నిద్రించుచుండిన పద్మనాభుని ప్రభావమున అతని నాభి యందుండి పద్మమయ పద్మపు పరిణామమగు జగత్తు ఎ టైర్చ డేను? పూర్వము ఆది కాలమందు దేవతలును ఋషిగణములును పుష్కరముల జలముల-పద్మముల య :దుండి ఎట్లు కలిగిరి? దేవా! జనార్ధనా! నీవు యోగవేత్తలకు ఆధిపతివి॥ కావున ఈ యోగప్రవృత్తి ప్రవర్తిల్లిన క్రమమునంతను నాకు తెలుపుము॥ అతని గుణ కీ ర్తనము వినుచుండగా నాకు ఎంత కును తృ వియే కలుగుట లేదు॥ పురుషోత్తముడు (సముద్ర జలములందు) ఎంతకాలము పండుకొనును? ఎంత కాలము ని దిం చును? ఈ కాలసృషి ఎట్లు? ఎంతకాలమున కతడు మేలుకోంచి లేచును? తరువాత ఈ నిఖిల జగత్తును ఎట్లు సృష్టించేను? మొదట నుండిన (ఆది) ప్రజాపతు లెందరు? సనాతనమగు (ఆనాది ప్రవాహ రూపమగు ) చిత్రలోకమును ఆత డెట్లు నిర్మించేను? ఈ జగము ఏకార్ణవము శూన్యము అయి స్థావర జంగమ ప్రాణులు పదార్థములు నశించి దేవాసుర నర నాగ రాక్షసులెల్ల నశించి ఆకాశము పొయు పు అగ్ని పృథివి నశించి పంచభూతములలో నీ రోకటి మాత్రము మిగిలియుండగా) మహాభూత సూక్ష్మములు కూడ లేక కేవలము గహ్వరము మహాశూన్యము) కాగా విభువు సర్వవ్యాపి) మహాభూతములకు కూడ అధినాధుడు మహాతేజస్కుడు (స్వయం ప్రకాశుడు) మహాకార వంతుడు దేవ శ్రేష్టుడు అగు నారాయణుడు యోగ ప్రక్రియ నాశ్రయించి యోగవంతుడై (యోగము॥ అన్నియు లయమందిన ఏకైక తత్వముగా నుండుట అని ఇచట అర్థము) ఎట్లుండెను? ధర్మజుడవును పరబ్రహ్మరూపుడవు నగు దేవా! పరమథ కీతో అది యంతయు వినగోరుచున్నాను॥ కావున నొక దియంతయు చెప్ప వేడుచున్నాను॥ శ్రద్ధతో కూర్చుండియున్న మా కందరకును భగవన్! సారాయణాత్మక మగు భగవతీ ర్తిని ప్రతిపాదింపుడు॥ అనేను॥
శ్రీమత్స్యః : నారాయణస్య యశస శ్రవణే యా తవ స్పృహా॥
తద్వంశ్యాన్వయభూతస్య న్యాయ్యం రవికులర్షభ ।
శృణుష్వాదిపురాణేషు వేదేభ్యశ్చ యథా శ్రుతమ్॥
బ్రాహ్మణానాం చ వదనా చ్చ్రుత్వా వై సుమహాత్మనామ్ ।
యథా చ తపసా దృష్ట్వా బృహస్పతిసమద్యుతిః॥
పరాశరసుత శ్రీమాన్గురు ర్ద్యైపాయనోఽ బ్రవీత్ ।
త త్తేఽహం కథయిష్యామి యథాశక్తిర్యథా శ్రుతిః॥
యద్విజ్ఞాతుం మయాశక్యమృషి మాత్రేణ సత్తమాః ।
కథం సముత్స హే జ్ఞాతుం పరం నారాయణాత్మకమ్॥
విశ్వాయనోయం బ్రహ్మాపి న వేదయతి తత్వతః ।
తత్కర్మ విశ్వవేదానాం తద్రహస్యం మహర్షిణామ్॥
తమీడ్యం సర్వయజ్ఞానాం తత్తత్వం సర్వదర్శినామ్ ।
తదధ్యాత్మవతాం చిన్యం నరకం చ వికరిణామ్॥
దేవానామధిదైవం యదధియజ్ఞం చ సంజ్ఞితమ్ ।
తద్భూతమవిభూతం చ తత్పరం పరమర్షిణామ్॥
స యజ్ఞో వేదనిర్దిష్టస్త తపః కవయే విదుః ।
సకర్తా కారకో బుద్దిర్ధర్మః క్షేత్రజ్ఞ ఏవచ॥
ప్రణవః పురుషశ్శాస్తా ఏక శ్చేతి విభావ్యతే ।
ప్రాణః ప ఞ్చవిధ శ్చైవ ధ్రువమ క్షర ఏవచ॥
కాలః పాకశ్చ పక్తాచ ద్రష్టా స్వాధీన ఏవ చ ।
ఉచ్యతే వివిధై ర్భావై స్స ఏవాయం న తత్పరః॥
స ఏవ భగవా న్త్సర్వం కరోతి వికరోతిచ ।
సోఽస్మా నారయతే సర్వమన్యేపి వ్యాకులీకృతాః॥
యజామహే తమేవాద్యం తమేవేచ్ఛామ నిర్వృతాః ।
యో వక్తా యచ్చ వక్తవ్యం యచ్చాహం య ద్భ్రవీమి వః॥
శ్రూయతే యచ్చ వై శ్రావ్యం యచ్చా న్యత్పరిజల్ప్యతే ।
యత్కథా శ్చైవ వర్త న్తే శ్రుతయో వాథ తత్పరాః॥
విశ్వం విశ్వపతిర్యశ్చ స తు నారాయణస్సృతః ।
యత్సత్యం యదమృత మక్షరం పరం య ద్యద్భూతం పరమమిదుచ యద్బవిష్యమ్॥
య త్కిఞ్చచ్చరమచరం యద స్తి చాన్య త్తత్సర్వం పురుషవరః ప్రభుః పురాణః ॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసందాదే నారాయణనాభిపద్మోద్భవ
ప్రశ్నా దికథనం నామ త్రిషష్ట్యుత్తర శతత మోఽధ్యాయః॥
నారాయణుని యశమును వినవలెనని నీకు కోరిక కలుగుట ఓ రకుల శేషా! ఆ నారాయణాంశ భూతుడగు రామునకు మూల పురుషుడవగు నీకు సముచితమే॥ వేదములనుండి గ్రహింపబడి ఆది పురాణములయందు ( ఈ ఆది పురాణములనునవి ఈనాడు మనకు లభించుచున్న పురాణములకంటే విలక్షణమయి వేదములవలే వైదిక శబ్దరూపములతో వే దిక ఛందములతో నున్న వాజ్మయములు॥ వీనినీ ఆపస్తంబాదీ మునులు తమ ధర్మసూతములయం దచటచట ఉదా హరించినారు॥) వినబడుచున్న విధమున తెలి పేదను; వినుము; అని మత్సుడు మనువునకు చెప్పిన విధమున ఋషులారా! నేను (సూతుడను) మీకు చెప్పేదను॥ ఈ ఆది పురాణములయందలి విషయములను బృహస్పతి సమ విజ్ఞాన తేజముగలపరా శర సుతుడు మా గురుడు నగు ద్వైపాయనుడు తపముచే దర్శించి (బ్రాహ్మణులకు తెలుపగా) ఆ బ్రాహ్మణుల నోటినుండి విన్నది వినినట్లు నా శ క్తికొలది ఋషిమాత్రుడనగు నాకు తెలియ శక్యమయినంత మాత్రము మీకు తెలి పెదను॥ విశ్వము లకు ఆశ్రయుడగు బ్రహ్మయును ఏ తత్త్వమును హ స్తవరూపమున తెలుపజాలడో 'ఆట్టి నారాయణాత్మక పరతత్వమును ఎవరు ఎరుగగలరు? ఆ నారాయణ తత్వము సర్వవేదములచే ప్రతిపాద్యమగు (యజ్ఞాది వై దిక) కర్మానుష్టానము; అది మహర్షులకును ఎరుగ రాని రహస్యము; సర్వయజ్ఞములందు స్తుతింపబడు తత్త్వము; సర్వదర్శులగు వారు దర్శించు త త్వ మడి; ఆధ్యాత్మ (ఆత్మ అనగా ఇట దేహము; దేహము నాశ్రయించియుండు ఆయా సూక్ష్మత తంములు అధ్యాత్మ తత్స ములు) తత్వ విచారకులు ఆలోచింపవలసిన తత్వమది; విరుద్ధ కర్మల నాచరించువారికి నరక మును ఆ తత్వమే; దేవత లలో అధిదేవతతత్వము యజ్ఞములలోని అధియజ్ఞ తత్త్వమును భూతములయందలి ఆధిభూతత త్వమును పర మరులకును అందరాని పరతత్వమును వేదములచే నిర్దేశింపబడిన యజ్ఞమును తపస్సును కర్త॥కారకుడు (కర్మ పేరకుడు॥కర్మ సాధనములు) బుద్ధి-ధర్మము॥ క్షేత్రజ్ఞుడు (దేహమునందుండు చేతనత త్వము) (భగవదుపాసన సాధనమగు ప్రణవము ఉపాస్యుడగు) పురుషుడు (ఆంతర్యామియై) శాసించువాడు॥ ఇవన్నియు ఒక్కటియే యని భావన చేయబడు తత్వమును (ప్రాణాపానవ్యానోదాన సమానములను) పంచవిధ ప్రాణములును ధ్రువమగు అక్షరతత్వమును కాలమును (కాలవశమున కలుగు) పరిపాక మును పరిపాక ము నొందించువాడును వీటికి ద్రష్ట సాక్షి ) యగు వాడును స్వాధీనుడు (స్వతంత్రుడును) వివిధ భావము { రూపము)లతో ఉన్నట్లు చెప్పబడువాడును అతడే; అతనికంటే పరుడు - గోప్పవాడు) ఎవరును లేరు; ' ఆ భగవానుడే సర్వమును సృష్టించును; పరిణమింపజేయును; మన చే చేయించును; అన్యులను తన్ను పాసించనివారిని) వ్యాకుల పరచును; ఆద్యుడగు ఆ నారాయణునే యజించుచున్నాము; అతనినే పొందుకోరుచున్నాము; అతని వలన ఆనందము నందగోరుచున్నా ము; వినబడునదియు వినదగినదియు పరిజల్పనము చేయబడునదియు అసంబద్ధముగా అనావశ్యకముగా మాటలాడుట పరిజల్పనము) చెప్పువాడును చెప్పబడునదియు చెప్పదగినదియు నేను మీ కేది చెప్పుచున్నానో ఆదియు ఎవ రిని కూర్చిన మాటలు జరుగుచున్న వో అతడును శ్రుతులు యత్పరములై (ఎవనిని తెలుపుచు) ఉన్న వో అతడును విశ్వ మును విశ్వ రక్షకుడును సత్యమును ఆమృతత త్వమును అక్షర నశించని తత్వమును పరమ తత్వమును భూతము గడచినది) ఈ పదమును వర్తమానము॥ఇప్పుడు జరుగుచున్నది) భవిష్యమును చరమును (చలించునది) అచరమును (కదలని వస్తువు ) ఈ చెప్పిన దేదియు కాక మిగిలినది ప్రతియొక్కటియు పురుష! శ్రేష్ఠుడు ప్రభువు పురాణుడు ఈ విశ్వము ఆను పురమునందు చైతన్య రూపుడై శ్వాసించువాడు - పుర+అన-పురాణ)ను ఆ నారాయణుడే॥
ఇది శ్రీమత్స్య మహాపురాణమున నారాయణ నాభీ పద్మోద్భవ ప్రశ్నా ది ప్రతిపాదనమను నూట ఆరువది మూడవ అధ్యాయము॥
Summary of chapter 163 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes how the immense fury of Bhagavān Narasimha remained unpacified even after the destruction of Hiraṇyakashipu, terrifying the Devas and Prajāpatis who hesitated to approach Him. The great child-devotee Prahlāda stepped forward with tearful devotion, prostrating himself at Bhagavān Narasimha's lotus feet and chanting sublime prayers of total surrender. Pacified by Prahlāda's pure love, Bhagavān Narasimha gently placed His divine hand on Prahlāda's head, crowned him as the sovereign ruler of the Asura realm, and blessed him with eternal devotion.