10 - పృథువు మొదలగు వారు భూమిని గోవుగా చేసి పిదుకుట  

ఋషయః బహుభి ర్ధరణీ భుక్తా భూపాలై శ్శ్రూయతే పురా

పార్థివాః పృథివీయోగా త్పృథివీ కస్య యోగతః

 కీమర్థం చ కృతా సంజ్ఞా భూ మేః కిం పరిభాషితా

గౌ రితీయం చ విఖ్యాతా సూత కస్మా ద్బ్రవీ నః

 బ్రాహ్మణకృతవేనమథనమ్

సూతః: వంశే స్వాయమ్బవే త్వాసీ దజ్గో నామ ప్రజాపతిః

 మృత్యోశ్చ దుహితా తేనపరిణీతాతు దుర్ముఖి

సునీథా నామ తస్యాభూ ద్వేనో నామ సుతః పురా

 ఆధర్మనిరతః కామీ బలవా న్వసుధాధిపః

లోకే వ్యధర్మకృఙ్ఞాతః పర భార్యాపహారకః

మమన్థు ర్భ్రాహ్మణా స్తస్య బలా ద్దేహ మకల్మషాః

  తత్కాయా న్మథ్యమానాత్తు ని షేతు ర్ల్మేచ్యజాతయః

 శరీరే మాతు రం శేన కృష్ణాజ్ఞానసమప్రభాః

 పితు రజ్గస్య చాంశేన ధార్మికో ధర్మకారకః

ఉత్పన్నో దక్షిణా దస్తా త్సధనుః(సశరో గదీ)  కవచీ శరీ

దివ్య తేజోమయవపు సురత్న కనకాజ్గదః

 పృథురోమాఽభవ త్త్రస్మా త్త్రతః పృథు రజాయత

  స విప్రై రభిషిక్త స్సం స్తపః కృత్వాఽతిదుష్కరమ్

 విష్ణో ర్వరేణ సర్వస్య ప్రభుత్వ మగమతభుః

 నిస్స్వాధ్యాయవషట్కారం నిర్ధనం వీక్ష్య భూతలమ్

 దగ్ధు మైచ్ఛత్త్రతః కోపా చ్చరే ణామితవిక్రమః

 తతో గోరూప మాస్థాయ భూః పలాయితు మైచ్ఛత

 పృష్ఠతోఽనుగత స్తస్యాః పృథు ర్దీప్తశరాసనః  

ఋషులు సూతుని ఇట్లడిగిరి: పూర్వము రాజులెందరో భూమిని అనుభవించిరని వినుచున్నాము. పృథివిని పాలించిన వారు కావున పృథివీ శబ్దపు సంబంధముచే రాజులకు పార్థివులు అను పేరు ఏర్పడినది. పృథివి అనుశ బ్దము మరి ఏ శబ్ద సంబంధముచే ఏర్పడినది? భూమికి ఆ పేరు ఏ అర్థమును తెలుపుటకయి పరిభాషగా (సంకేతముగా) చేయ బడినది? అట్లే భూమికి గౌః గో) అను పేరును వచ్చినది కదా? ఇందులకు హేతువేమి? మాకు తాము తెలుపవేడెదము.  సూతుడు ఇట్లు చెప్పు నారంభించెను: స్వాయంభువమను వంశమున అంగుడను రాజు జన్మించెను. మృత్యుని కూతురు దుర్ముఖ అగు సునీథ ఆతని భార్య. వేనుడు అతని కుమారుడు. అతడు బలశాలి రాజై యుండియు ఎల్లప్పుడు అధర్మమునం దాస క్తి కలవాడు. కామపరుడు. లోకము నందును ఆధర్మమునే ఆచరించెడి వాడు. పర భార్యలను అప హరించెడువాడు. బ్రాహ్మణులు ఆతని దేహమును బలము కొలది మథించిరి. మథింపబడుచుండిన ఆతని దేహము నుండి మేచ్ఛజాతుల వారు ఉత్పన్నులయిరి. వారందరును తల్లి అగు సునీథ) అంశమును బట్టి కాటుకవలె నల్లని దేహచ్ఛాయ కలవారు. ఆ వేనుని కుడి చేతి నుండి తండ్రియగు అంగుని అంశమును బట్టి ధర్మము నెరిగినవాడును ధర్మము నాచరించు వాడును ఆచరింపజేయు వాడును అగు వాడొకడు జనించెను. అతడు కవచమును ధనుర్బాణములను ధరించి ఉండెను. దివ్య తేజోమయ శరీరమును మంచి రత్నములు తాపటము చేసిన బంగారు భుజకీర్తులును కలిగి ఉండెను. పృథు (లావగు) రోమములు కలవాడగుటచే అతడు పృథువన ప్రసిద్దుడు అయ్యెను. విప్రులు అతనిని చక్రవర్తిగా ఆభిషేకించిరి. అతడు దుష్కరమగు తపస్సాచరించెను. విష్ణు వరముచే ఆతడు సర్వ జగత్తునకును ప్రభువుగా నయ్యెను. భూతలమున స్వాధ్యాయముగాని వషట్కారము (యజ్ఞక్రియలు) గాని ధనముగానీ లేకుండుట చూచి కోపము కలిగి అమితమగు విక్రమము కల ఆ పృథుడు శరముతో భూమిని దహింప సంకల్పించెను. అంతట భూదేవి గోరూపమును ధరించి పారిపోసాగెను. ప్రజ్వలించుచున్న ధనువు ధరించి పృథుడు ఆమెను వెంట నం టెను.

తతః స్థిత్వైక దేశే తు కిం కరోమితి సాఽబ్రవీత్

 పృథుర వ్యవద ద్వాక్య మీప్సితం దేహి సువతే

 వృథ్వాదీకృతధరణీ దోహనమ్

సర్వస్య జగత శ్శీఘ్రం స్థావరస్య చరస్య చ

తథేతి చాబ్రవీ ద్బూమిం దుదోహ చ నరాధిప

 స్వకే పాణౌ వృథు ర్వత్సం కృత్వా స్వాయమ్బవం మనుమ్

 తదన్న మభవ ద్దుగ్ధం ప్రజా జీవన్తి యేన వై

 ఋషిభి ర్దుహ్యమానాయాం వత్స స్సోమ స్తథాఽభవత్

దోగ్ధా బృహస్పతి రభూ త్పోత్రం వేదా స్తపో రసః

 దేవైశ్చ వసుధా దుగ్ధా దోగ్ధా మైత్ర స్తథాభవత్

ఇన్ద్రో వత్స సమభవ త్క్షీర మూర్జస్కరం బలమ్

 దేవానాం కాఞ్చనం పాత్రం పితృణాం రాజతం తథా

అ న్తక శ్చాఽభవ దోగ్ధా యమో వత్స స్స్వధా రసః

 ప్రవాళ పాత్రం నాగానాం తక్షకో వత్సకోఽభవత్

 విషం క్షీరం తతో దోగ్ధా ధృతరాష్ట్రోఽభవ త్పునః

 అసురైరపి దుగ్ధేయ మాయ సే శత్రుపీడనమ్

 పాత్రే మాయాం తథా వత్సః ప్రాహ్లాదిశ్చ విరోచనః

 దోగ్ధా(ద్విమూర్దాతత్రాసీన్మాయ)విమూఢ స్తత్రాసీన్మాయా యేన ప్రవర్తితా యజైశ్చ వసుధా

దుగ్ధా పురాన్తర్దాన మీప్సుభిః

 కృత్వా వైశ్రవణం వత్స మామపాత్రే మహీపతే

 ప్రేతర క్షోగణై ర్దుగ్ధా ధరా రుధిర ముల్బణమ్

  రౌప్య నాభోఽ భవ ధోగ్ధా సుమాలీ వత్స ఏవ తు

గన్దర్వేశ్చ పున ధోగ్ధా వసుధా సాప్సరోగణై  

అంతట భూదేవి ఒకానొక చోట నిలువబడి నేను నీకై ఏమి చేయవలయును? అని అడిగేను. సువ్రతా! (సత్కార్య ములను చేయుదానా!) చరాచర రూపమయిన సర్వ జగత్తునకును శీఘముగా కోరికలను తీర్చుము. అని పృథువు అనెను. భూదేవి సరే అనెను. పృథు చకవ రి స్వాయంభువ నునువును దూడగా చేసి గోరూప యగు భూమిని తన చేతియందే పిది కెను. ఆ వచ్చిన క్షీరము ప్రజలు జీవించుటకు సాధనము అగు అన్నముగా ఆయ్యెను. బృహస్పతి దోగ పిదుకు వాడు కాగా ఋషులు సోముని దూడనుగా చేసి వేదములనెడి పాత్రయందు పాలు పిరికిరి. ఆ పాలు తపస్సుగా అయ్యేను. దేవతలు భూమిని పిరికిరి. దోగ్ధ మై! తుడను దేవుడు. ఇంద్రుడు దూడ. బంగారు పాత్ర : 1. సామర్థ్యము నిచ్చు బలము క్షీరము పితరులు వెండి పాత్రలో భూమిని పిదికిరి. అ నకుడు (ప్రాణులను అంతమొందించు వాడగు పితృరాజు) దోగ్ధ. యముడు (ప్రాణుల పుణ్యపాపముల నిర్ణయించి తదనుగుణముగా ఫలముల నిచ్చుదేవుడు) దూడ. స్వధా (కారముతో ఇచ్చు ద్రవ్యము) క్షీరము. నాగులు పగడపు పాత్రలో తక్షకుని దూడనుగా ధృతరాష్ట్రుడను నాగుని దోగ్గనుగా చేసి విషము అను క్షీరమును భూదేవి నుండి పిసికిరి. అసురులును గోరూపయగు భూమిని పిసికిరి. వారిది ఇనుప పాత, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు దూడ. మాయలను ప్రవర్తిల్ల జేయువాడగు విమూఢుడను వాడు దేగ్గ. శత్రువులను పీడించుట శత్రువుల పై మాయ ప్రయోగించుట అనునవి పాలు. కుబేరుని దూడనుగా చేసి యక్షులు ఆ ను (కాలని మట్టి పాత్రలోనికి అంతర్ధానము అను పాలను పిదికిరి. రౌప్యనాభుడు దొగ్గగా సుమాలి దూడగా పేతలును రక్షస్సులును భయంకరమగు రక్తమును పాలనుగా పిసికిరి.

వత్సం చిత్రరథం కృత్వా గ న్ద న్పద్మదళే తథా

 దోగ్ధా పసురుచిర్నామ గానవేదస్య పారగః

గిరిభి ర్వసుధా దుగ్ధా రత్నా ని వివిధాని చ

 ఔషచాని చ దివ్యాని దోగ్ధా మేరు ర్మహాబలః

 వత్సోఽభూద్దిమవాం సత్ర పాత్రం శైలమయం పునః

 వృక్షైశ్చ వసుధా దుగ్ధా క్షీరం ఛిన్న ప్రరోహణమ్

  పలాశపాత్రే దోగ్ధా తు సాలః పుష్పలతాకులః

 ప్లక్షోఽభవ త్త్రతో వత్స స్సర్వ వృక్షవనాధిపః

  ఏవ మన్యైశ్చ వసుధా తథా దుగ్ధా యథేప్సితమ్

 ఆయుర్ధనం చ సౌఖ్యం చ పృథౌ రాజ్యం ప్రశాసలీ

  న దరిద్ర స్తథా కశ్చి న్నరో వై న చ పాపకృత్

నోపసర్గో (నచార్తో భూత్పృథౌ) న వై కోక్తిః పృథౌ రాజ్యం ప్రశాసతి

 నిత్యం ప్రముదితా లోకా దుఃఖశోక వివర్జితాః

ధనుష్కోట్యా చ శై లేన్ద్రా నుత్సార్య స మహాబలః

 భూమణ్డలం సమం చక్రే లోకానాం హితకామ్యయా

 నగరగ్రామదుర్గాణి న చాయుధధరా నరా

(క్షయాతిశ యదుఖంచ) పుత్త్రాదిభి ర్న దుఃఖం చ న త్వశాస్త్రస్య చాదరః

 నానీతిమ న్తః పురుషాః పృథా రాజ్యం ప్రశాంతి

 కథితాని చ పాత్రాణి తత్క్షీరం చ మయా తవ

 యేషాం యేన రుచి స్తత్ర తేభ్యో దేయం విజ్ఞానతా

 యజ్ఞశ్రాద్ధేషు సర్వేష మయా తుభ్యం నివేదితమ్  

దుహితృత్వం గతా యస్మా త్పృధోః పృథ్వీ తతో మహీ

 తదానురాగయోగాచ్చ పృథివీ విశ్రుతా బుదై

ఇతి శ్రీ మత్స్యమహాపురాణీ మత్స్య మనుసంవాదే పృథ్వాది

కృతధరణీదోహనం నామ దశ మోఽధ్యాయః

గంధర్వులును అప్సరోగణమును గాన వేద (సంగీత తత్వము నెరిగిన వసురుచి దోగ్ధగా చిత్ర రథుడు దూడగా తామర పూ రేకునందు సుగంధములనెడి పాలు పిరికిరి. పర్వతములును శైలమయమైన పాత్రలో హిమవంతుడు దూడగా మేరువు డోగ్గగా రత్నములనెడి పాలను పిరికిరి, పూవులతో తీగలతో వ్యాప్తమైయున్న ఏపి చెట్టు దోగ్టగా అన్ని చెట్టులకు వనములకు అధిపతియగు జువ్వి చెట్టు దూడ గా మోదుగ ఆకుల పాత్రయందు ఛిన్న ప్రరోహణము (నర కినను మరల మొలచుట) అను క్షీరమును వృక్షములు ఏది కెను.

ఈ విధముగనే ఇతరులును ఇతర ప్రాణులును తమ కోరికల కొలది భూమిని పిదికి. పృథుడు రాజ్యమును ఏలుచుండగా ప్రజలకు ధనము ఆయువు సౌఖ్యము కొరత లేకుండెను. దరిద్రుడు. కానీ పాపములు చేయు వాడు కాని ఎవడును లేకుండెను. ఉపదవములుకాని వేరపు మాటలు కాని లేకుం డేను. ప్రాణులన్నియును దుఃఖ శోక ములు లేక మిగుల సంతోషముతో ఉండెను. ఆ మహాబలుడు లోకముల హితమును కోరి తన వింటికొసతో పర్వతములను (గ్రామము లను నగరములను దుర్గములను నిర్మించుటలో పంటలను పండించుటలో అడ్డము వచ్చినచో) దూరముగా నెట్టి వేసి భూమండలమును నగరములను. గ్రామములను దుర్గములను సమములనుగా సమతలము సందున్న వి) చే నెను. కొడుకులు మొదలగు చిన్న లవలన పెద్దలకు దుఃఖముగాని సాధ్యయనము లేని వానికి ఆదరము కాని లేకుండెను. పురుషులలో ఎవరును నీతి లేని వారు లేకుండిరి.

ఎవరికి ఎవరికి సంబంధించినవి ఏ.పాత్రములో ఏ క్షీరములో నీకు తెలిపితిని. దానములు పూజలు చేయునపుడు ఆయా పాత్రలలో ఎవరికి ఏది ఇష మో ఎరిగి వారికి ప్రీతిగా వాటిని దానము చేయుటయో పూజోదులలో ఉపయోగించుటయే చేయవలెను. యజ్ఞములును శ్రాద్ధములును చేయునపుడు వీనిని పాటించవలెను. 

 ఈ చెప్పిన విధమున భూమి పృథువున . కూతురుగా ఆయి ఆయన వాత్సల్యమును పొందినది - కావున ఆమెకు వృథివ్ అను నామము - ప్రసిద్దము య్యెను. 

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మరమను సంచారమున పృథువు మొదలగు వారు భూమినిపిదు:ట యను. దశ మాధ్యాయము.