మత్స్య మహా పురాణము
258 - దేవతామూర్తి విశేష లక్షణములు – శంకర-తాండ వేశ్వర-త్రిపురదాహేశ్వర భైరవేశ్వరాది మూర్తుల లక్షణములు.
సూతః : అతఃవరం ప్రవక్ష్యామి దేవాకారా న్వి శేషతః ।
దశతాల స్మృతో రామో బలి ర్వైరోచని స్తథా॥
వారాహో నారసింహశ్చ సప్తతాళశ్చ వామనః ।
మత్స్య: కూర్మో వినిర్దిష్టా యథాశోభం స్వయమ్భువా॥
అతఃపరం ప్రవక్ష్యామి రుద్రాద్యాకార ముత్తమమ్ ।
ఆపీనోరుభుజస్కన్ద స్త ప్రకాష్చోనసన్నిభః॥
శుక్లార్కరశ్మిసజాత శ్చనాజితజటో విభుః ।
ద్వ్యష్టవర్పాకృతి సోపి జటామకుటభూషితః,
బాహూ వారణహస్తాభౌ వృత్తజజోరుమణలః ।
ఊర్ధ్వ కేశస్తు కర్తవ్యో దీర్ఘాయతవిలోచనః॥
వ్యాఘ్రచర్మపరీధానః కటిసూత్రత్రయాన్వితః ।
హార కేయార సమ్పన్నో భుజగాభరణ స్తథా॥
బాహవశ్చాపి కర్తవ్యానానాభరణభూషితాః ।
ఓనోరుగడ్డఫలకః కుఱ్ఱలాభ్యా మలజృతః॥
ఆజానులమ్బిబాహుశ్చ సౌమ్యమూర్తి సుశోభనః ।
ఖేటకం వామహస్తే తు ఖడ్గం చైవ తు దక్షిణే॥
శ క్తిం దణ్ణం త్రిశూలం చ దక్షిణే వినివేశ యేత్ ।
కపాలం వామపార్శ్వే తు నాగం ఖట్వాజ మేవచ॥
ఏకశ్చ వరదో హస్త స్తథాక్షవలయాపరః ।
వైశాఖం స్థానకం కృత్వా నృత్యాభినయసంస్థితః॥
నృత్య నశభుజః కార్యో గజచర్మధర స్తథా ।
తథా త్రిపుర దా హే చ షోడశైవ తు బాహవః॥
శజ్ఖం చక్రం గదా శార్జం ఘణ్టా తత్రాధికా భవేత్ ।
తథా ధనుః పినాకం చ శరో విష్ణుమయ స్తథా॥
చతుర్భుజోష్టబాహుర్వా జ్ఞానయోగేశ్వరో మతః ।
తీక్ష్ణనాసాగ్రదశనః కరాళవదనో మహా॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను : ఇక మీదట ఆయా దేవతారూపములను వి శేషా కారమున-వేరువేరుగా చెప్పెదను; రామమూర్తియు విరోచన పుత్రుడగు బలి మూర్తియు వరాహమూర్తియు నరసింహ మూర్తియు దశ కాల ప్రమా ణములు; వామనమూర్తి స ప్రతాళ ప్రమాణము; మత్స్య కూర్మ మూర్తులు శోభగానుండునట్లు ఎంత పరిమాణముతో నైన నిర్మించవచ్చును. అని స్వయంభూ బ్రహ్మ చెప్పెను.
ఇక మీదట రుద్రాది మూర్తుల లక్షణముల చేప్పేద ను. ఈశ్వరమూర్తి. బాగుగ బలిసిన ఊరువులు భుజములు భుజ స్కంధములు తప్తకాంచన సమాన శోభ శుక్ల రవి కిరణ రాశి ప్రకాశము చంద్రాంకిత జటాక లాపము పదునారు సంవత్సరముల వయస్సు జటా మకుట భూషణములు గజహస్త సమాన బాహువులు వృత్త జం ఘోరు మండలములు ఊర్ధ్వ కేశములు దీర్ఘాయత విలోచనములు వ్యాఘ చర్మ వస్త్రము మూడుకటి సూత్రములు హార కేయురాలంకారములుభుజగాఓఓ భరణములు నానాభరణ భూషిత బాహువులు బలిసిన విళల గండ ఫలకము కుండలాలంకారములు ఆజాను లంబీ బాహు వులు సౌమ్యమగు మూర్తి కలిగి శోభించుచుండును; ఎడమ చేతులందు ఖేటకము కపాలము సొగము ఖట్వాంగమును కుడి చేతులందు ఖడ్గశ క్తి దండత్రిశూలములు నుండును.
తాండవేశ్వర మూర్తికి-ఒక చేతియందు వరద ముద్ర రెండవ చేతియందు అక్షమాల యుండును. ఇతడు వైశాఖమను స్థానకము (నృత్యభంగి విశేషము) తో నృత్యాభినయమందు ఉండును; దశ భుజుడును గజ చర్మధారియు నై నృత్యమొనర్చుచుండును.
త్రిపురదా హేశ్వరమూ ర్తికి షోడశ బాహువులు; దశ భుజమూర్తి యందుకంటే ఈ మూర్తియందు శంఖము చక్రము గద శార్జధనువు ఘంట పినాక ధనువు విష్ణుమయశరము అను ఆరాయుధములధీక ముగా నుండును.
యోగేశ్వర మూర్తియందు చతుర్భుజములో అష్ట భుజములో యుండును. భైరవేశ్వర మూ ర్తికి నా సాగ్రమును దంతములును తీక్షములయినవి; ముఖము భయంకరము; ఈ మూర్తిని ప్రత్యాయతనము (ఉపాలయము)నందేకాని మూలాయ తనము (ప్రధానాలయము) నందు ప్రతిష్టించరాదు.
భైరవ శ్శస్యతే లో కేప్రత్యాయత సంస్థితః ।
న మూలాయతనే కార్యో భైరవస్తు భయజ్కరః॥
నరసింహో వరాహో వా తథాన్యే చ భయజ్కరాః ।
నాధికాజ్గాన హీనాబ్ధాః కర్తవ్యా దేవతాః క్వచిత్॥
స్వామినం ఘాతయే న్యూనా కరాళవదనా తథా ।
ఆధికా శిల్పినం హన్యా త్కృశా చై వార్థనాశినీ॥
వక్రనాసా తు దుఃఖాయ సజ్జప్తాజీ భయజ్కరీ ।
కృతోదరీ తు దుర్భిక్షం నిర్మాంసా ధననాశినీ॥
చిపిటా దుఃఖరోగాయ ఆత్రేతా నేత్రనాశినీ ।
దుఃఖదా హీనవక్రా చ పాణిపాదకృశా తథా॥
హీనాథ్లా హీనజడ్డా చ భ్రమోన్మాదకరీ నృణామ్ ।
శుష్క వక్షాతు రాజానం కటిహీనా చ యా భవేత్॥
పాణిపాదవిహీనో యో జాయతే మార కో మహాక్ ।
జఙ్ఞాజానువిహీనా చ శత్రుక ల్యాణకారిణీ॥
పుత్తమిత్రవినాశాయ హీనవక్షస్థలా తు యా ।
సమ్పూర్ణావయవా యా తు ఆయుర్లక్ష్మీప్రదా సదా॥
ఏవం లక్షణ మాసాద్య కర్తవ్యః పర మేశ్వరః ।
స్తూయమాన స్సురై స్సర్వై స్సమస్తా దర్శయే దృవమ్॥
శకేణ నన్దనా చైవ మహాకాళేన శ జ్కరమ్ ।
ప్రణతా లోకపాలాస్తు పార్శ్వే తు గణనాయకాః
నృత్యదృఢీ రిటి క్ర్చైవ భూత భేతాళసంవృతః ।
సర్వే హృష్టాస్తు కర్తవ్యా స్సువ నః పర మేశ్వరమ్॥
గన్షర్వవిద్యాధరకిన్న రాణా మథాప్సరోగుహ్యక నాయకానామ్ ।
గణై కనేకై శృతశో ఒమ రేంద్రై ర్మునిప్రవీరై రపి నమ్యమానమ్॥
ధృతాక్షసూత్రై శ్శతశః ప్రవాళపుష్పోపహారప్రచయం దధద్భిః ।
సంస్తూయమానం భగవంత మీడ్యం నేత్రత్రయేణామరమర్త్యపూజ్యమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే ఈశ్వరప్రతిమాలక్షిణాదికథనం నామ అష్టపఞ్చాశదు త్తర ద్విశతత మోధ్యాయః॥
(ఈ భైర వేశ్వరమూర్తి యే కాదు;) నారసింహ వరాహాది భయజ్కరమూర్తులు ఏవియు అధి కాంగములుగాగాని హీనాంగములుగాగానీ ఎక్కడను ఎప్పుడును చేయరాదు. భయంకరముఖముగలమూర్తులనుగా చేసినచో స్వామికినీ శిల్పికిని నాశము కలిగించును; ఆర్థనాశమును చేయును; వక్ర నాసిక గల మూర్తి దుఃఖమును తక్కువ పరిమాణముగల అవయవ ములతో నున్నచో భయమును-కృశోదరియగు మూ ర్తి దుర్భిక్షమును -మాంసము (ప్రుష్టి) లేని మూర్తి ధననాశమును చప్పిట ముక్కుగల మూర్తి దుఃఖమును రోగమును - కన్నులు లేని మూర్తి నేత నాశమును ముఖము హీనమయినచో దుఃఖమును పీలగానున్న కాలు నేతులు గలదియు హీనాంగయు హీనజంఘయు భ్రమోన్మాదములను కలిగించును; ముఖముగాని కటి గాని లోపముతోనున్న చో రాజును చంపును; కాలు నేతులలో లోపమున్న ను ఆమూర్తి అధికముగా మృత్యువును కలిగించును; ఏక్కలును మోకాళ్లును నఠిగాలేని మూర్తి శత్రువులకు క్షేమకరము; వక్షఃస్థలమున లోపమున్న చో పుత్త మి త్త వినాశకరము; సంపూర్ణావయవమూర్తి ఆయువును ఐశ్వర్యమును కలిగించును.
ఈ లక్షణ దోషములవలని హని నేరిగి అవిలేని లక్షణములతో పర మేశ్వర మూర్తిని నిర్మించవలయును. ఆమూర్తిని అన్ని వైపులయందుండి సకల సురులును స్తుతించుచుండవలయును; ఇంద్రుడు నంది మహాకాలుడు లోక పాలురు పార్శ్వములందు గణనాయకులు ప్రణతులయియుండ నృత్యమాడుచున్న భృంగియురిటియు భూత భేతాళులును హపూర్ణులై ఆయనను స్తుతించుచున్న ట్లును గంధర్వ విద్యాధర కింగరాప్సరోరుహ్య కాది దేవతాగణములును ఆమర నాయకు లును ముని ప్రవీరులును ఆయనను నమస్కరించుచున్న ట్లును మూ ర్తిని నిర్మించవలెను. అసురులును మానవులును ఆక్ష సూత్రములను ప్రవాళములను పుష్పములను ధరించియుండి ఉపహార ములుగా ఈశ్వరునకు అవిఆర్పించుచుండ త్రినే త్రముగ పరమేశ్వర మూర్తి భేదములుండవలయునుయ.
శ్రీమత్స్యమహాపురాణము మహా పురాణమున ఈశ్వర ప్రతీమాధి లక్షణ కథనమును రెండు వందల ఏబది ఎనిమిదవ అధ్యాయము.
Summary of chapter 257 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the elaborate Vedic consecration rites and housewarming ceremonies known as Gṛha-pravesha performed prior to occupying a newly completed home. Bhagavān Matsya instructs the householder to choose an auspicious astrological day, decorate the entrance with floral garlands, mango leaves, and auspicious pots filled with sanctified water. The officiating priests perform fire oblations to Vāstu Purusha, the Lokapālas, and Navagrahas, sprinkling holy water throughout all rooms while chanting protective Vedic hymns. The ceremony concludes with feeding Brāhmaṇas, honoring artisans and laborers, and distributing charity, filling the house with auspicious vibrations and permanent prosperity.