14 - (పితరుల కన్యయగు అచ్చోద చరితము) -  అగ్నిష్వాత్త పితరుల చరితము

సూతః: లోకా స్సోమపథానామ యత్ర మారీచనన్దనాః

 వర్తన్తే దేవపితరో యా న్దేవా భావయన్త్యలమ్

 అగ్ని ష్వాత్రా ఇతి ఖ్యాతా యజ్వానో యత్ర సంస్థితాః

అచ్చోదానామ తేషాంతు మాననీ కన్యకా సరిత్

 అచ్ఛోదంనామచ సరః పితృభి ర్నిర్మితంపురా

 అథతత్ర తపశ్చక్రే దివ్యం వర్ష సహస్రకమ్

ఆజగ్ముః పితర స్తుష్టాః కిల దాస్యామ తే వరమ్

 దివ్యరూపధరా స్సర్వే దివ్యమాల్యానులేపనాః

సర్వే యువానో బలినః కుసుమాయ ధసన్ని భాః

 తన్మధ్యే మావసుంనామ పితరం వీక్ష్య సాజ్గనా

వవ్రే వరార్దినీ సజం కుసుమాయుధ పీడితా

 యోగభ్రష్టాతు సా తేన వ్యభిచారేణ భామినీ

 ధరా మస్పృశతీ పూర్వం పపాతాథ భువస్స్థలే

తథాచ మాససుర్యస్మా ధిచ్చాం చక్రే న తాం ప్రతి

 ధైర్యేణ తస్య సాలోకే అమావా స్యేతి విశ్రుతా

 పితృణాం వల్లభా తస్మా ద్దత్తస్యాక్షయకారకా

 ఆచ్ఛోదాఽధోముఖీ దీనా లజ్జితా తపసః క్షయాత్

సో పితృ న్ప్రార్థయామాస పునరాత్మసమృద్దయే

 విలజ్జమానా పితృభి రిధముక్తా తపస్విని

 భవిష్యదర్థ మాలోక్య దేవకార్యంచ తేతదా

 ఇద మూచు ర్మహాభాగా ప్రసాదా చ్చుభయా గిరా

దీవి దివ్యశ రీరేణ యత్కిఞ్చ త్రియతే బుధై

 తేనైవ తత్కర్మఫలం భుజ్యతే వర పర్ణిని

సద్యః ఫల న్తి కర్మాణి దేవత్వే ప్రేత్య మాను షే

తస్మాత్త్వం పుత్రి తపసా ప్రాప్స్య సే ప్రేత్య తత్పలమ్

అష్టావింశే భవిత్రీ త్వం ద్వాపరే (మత్స్య)శమీనయానిజా

వ్యతిక్రమ్య పితృణాంత్వం కష్టం కుల మవాప్స్యసి

 తస్మా ద్రాజ్ఞో వసోఃక న్యా త్వమవశ్యం భవిష్యసి

 కన్యా భూత్వైవ లోకాన్త్స్వా నునఃప్రాప్స్యసి దుర్లభా

పరాశరస్య వీర్యేణ సుత మేక మవాప్స్యసి

 ద్వీ పేతు బదరీప్రాయే బాదరాయణ మచ్యుతమ్

 స వేద మేకం బహుధా విభజిష్యతి తే సుతః

 పౌరవస్యాత్మజౌ ద్వౌతు సముద్రాంశస్య శ న్తనో

విచిత్రవీర్యతనయ స్తదా చిత్రాజ్గదో నృపః

 ఇమవుత్పాద్య తనయౌ క్షత్రియా వస్యధీమతః

 పౌష్ఠపద్యష్ట కారూ పితృలోకే భవిష్యసి

 నామ్నా సత్యవతీ లో కే పితృలో కే తథాఽష్టకా

ఆయురారోగ్యదా నిత్యం సర్వకామఫలప్రదా

భవిష్యసి పరేలో కే నదీత్వం చ గమిష్యసి

పుణ్యతోయా సరిచ్చ్రేష్టా లో కే ష్వచ్ఛోదసంజ్ఞితా

ఇత్యుక్త్వా సగణ స్తేషాం తత్రైవాన్తధీయత

సాప్యవాపసు చారిత్రఫలం యత్కథితం పురా

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే పితృవంశీయాచ్చోదో పాఖ్యానవర్ణనం నామ చతుర్దశోఽధ్యాయః

చతుర్దశాధ్యాయము (పితరుల కన్యయగు అచ్ఛోద చరితము.) అగ్ని ష్వా తపితరుల చరితము (పురాణములందును శాస్త్రములందును చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వీరిలో మూడు మూర్తిలేని గణములు. ఆ గణముల పేర్లు 1. వై రాజులు 2. అగ్ని ష్వాత్తులు 6. బరిషదులు; మూర్తి కలవి నాలుగు గణములు. 1. సుకాలినః 2. హవిష్మంత? 8. ఆజ్యపాః 4. సోమపాః. వీరిలో మొదటి గణము విషయము పదుమూడవ అధ్యాయమున రెప్పబడినది. ఈ అధ్యాయమున రెండవ గణమువారీ విషయము చెప్పబడును.

ప్రతి గణము విషయము ను తెలియవలసిన విషయములు -1. ఆ గణము వారు నివసించు లోకము. 2. ఆ గణము పేరు. కి. వారి తండ్రి నామము 4. ఆ గణము వారిని ఆరాధించు వారు. 5. వారి మానసీక న్యా నామము.)

సోమ పథములను లోకములు గలవు. వీనియందు మరీచి అను ప్రజాపతికి కుమారులు అగు పితృదేవతలు నివసింతురు. వీరిని దేవతలు ఆరాధింతురు. ఈ పితరులకు అగ్నిష్వాత్తులు అని పేరు. (అగ్ని షు- ఆత్త్ర = అగ్నులయందు సమగ్రముగా హవిస్సు వేల్చి యజ్ఞములను చేసినవారు. వీరందరును యజ్వలు యజ్ఞములను చేసినవారు.

వారి మానసపుత్రి అచ్చోదా అను ఆమె. ఆమె నదీరూపురాలు ఐనది. ప్వూము పితృదేవతలు అచ్ఛోదమను సరస్సును సృష్టించిరి. ఆ సర సీరమున ఈమే వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించెను. పితరులు సంతుష్టులై ఆమె కడకు వచ్చిరి. నీ కే . వరము కావలెనో ఇత్తుము. కోరుకొనుము -అనిరి. వారందరును దివ్యములగు రూపముల ధరించినవారు దివ్యములగు మాలికలు పుష్పములు దాల్చి సవారు. దీవ్యగంధములు పూసికొనినవారు. యువకులు; బలశాలురు; మన్మథుని వంటివాడ. వారిలోనుండి “మావసుడు' అను పితరుని ఆమె కామపరవశురాలై వరునిగా కోరుకొనెను ఆ సుందరి ఈ వ్యభిచార దోషము చేత యోగ భ్రష్టురాలయ్యెను. అంతవరకును దేవభావమున భూమిని తాకకయున్న ఆమె భూస్థలి పై పడిపోయేను.

కాని పూవసుడు ఆ అచ్చోదను కామించక ధైర్యముతో ఉండెను. అందుచే ఆమె “మావస్య' (మావసునికి ప్రియురాలు) కాలేదు. కనుక ఆమెకు ‘అమావస్య' అను పేరు వచ్చెను (మావస్యకానిది) తన తపస్సుచే పితరులను మెప్పించినందున ఈ అచ్ఛోద లేదా ఆమావాస్య పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమయినది. అందుచే అమావస్యా (అమావాస్యా) తిథియందు పితరులకు ఆర్పించినది అక్షయమగును. అనంతఫలమును ఇచ్చును.

.

తన తపస్సు తస ఈ దోషము ఏ క్షీణించుటవలన అచ్ఛోద దీనురాలయి ముఖము వంచుకొని సిగ్గుపడుచు తాను మరల తన తపస్సును సమృద్ధి నొందించుకొనుట కై ఉపాయమును తెలుపవలసినదిగా తన తండ్రులగు పితరులను వేడుకొనెను. ఆ మహాభాగులు అనుగ్రహము కలవారైరి. వారు జరుగబోవు విషయములను దేవకార్యమును తమ ధ్యాన దృష్టితో) దర్శించిరి. శుభమగు వాక్కుతో వారు ఆ తపస్విని (తపోవంతురాలు.జాలిపడదగిన దీనురాలు) తో ఇట్లు పలికిరి: సుందరియగు పు తీ: వివేకవంతులగు వారు (భూలోక సంబంధి కానటువంటి) దివ్య శ రీర ముతో చేసిన ఏ కర్మమున కై నను ఫలమును వారు అదే శరీరముతో అనుభవింతురు. మానుష శరీరములో నున్న వారు మాత్రము తాము చేసిన కర్మల ఫలములను కొన్ని చిన్ని ఆ దేహమును విడిచిన తరువాత ఆనుభవింతురు. (సవు మనుష్య స్త్రీగా అయియు "పు. కనుక) నీవు తపస్సు ఆచరించినచో దాని ఫలమును నీవు ఈ దేహమును విడిచిన తరువాత మరియొక జన్మము లో కాని దేవలోక మునకాన్ని అనుభవింతుపు.

ఇప్పుడు నీవు నీ తండ్రుల విషయమున చ్యతిక్రమము (నియమము తప్పి కామ బుద్ధిని చూపుట) చేసితివి. కనుక ఇరువది ఎనిమిదవ ద్వాపరయుగమున చేప కడుపున జన్మించి నీచమగు కులమును చేరుకొందువు. ఇది జరుగుటకే నీవు తప్పక వసుడను రాజునకు కూతురపు అగుదువు. కన్యగా ఉండి (కన్యాత్వము చెడక యే చివరకు మరల దుర్లభములగు నీతోక ములను నీవు చేరెదవు. ఎట్లన-పరాశరుని పర్యముతో ఒక కుమారుని కనేదవు. ఆతడు సాక్షాత్ అచ్యుతు నారాయణు) డే. బదరీవృక్షములు తరచుగా కల ద్వీపమున జనించుటచే అతనికి బాదరాయణుడు . అని వ్యవ హారము కలుగును. ఆ సికుమారుడు ఒకటిగా ఆయి యున్న వేదమును నాలుగుగా విభజించును. సముద్రుని అంశ చేత జనించిన పూరు వశీయు డై న శంతనుని వలస చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అసు ఈమారులను ఇద్దరను క నెదవు. భూలోకమున నీకు త్యవతి అని పేరు. పితృలోకమున నీకు అష్టకా. అని పేరు. అచట నీవు పౌష్టపదీ-అషకా-(భాద్రపద శుక్ల పూర్ణిమ గడచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి) రూపముతో ఉందువు. నీవు పర (పితృ) లోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తువు.

నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్చో ' అను పేర పుణ్యజలములుగల నదీ శ్రేష్టవేయుందువు.

ఇట్లు పలికి ఆ పితృగణము అచ్చటనే అంతర్ధానమును పొందిరి. ఆ అచ్ఛోదయను పితృ కన్య:మును వారిచే ఇంతవరకును చెప్పబడిన సత్కర్మ ఫలమును పొందెను.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున పితృకన్యయగు అచ్ఛోద చరితమను చతుర్దశాధ్యాయము.