183 - అవిముక్త మాహాత్మ్యము-ఈ క్షేత్ర విశిష్టతకు హేతువులు॥ 

ఈశ్వరః : సేవితం బహుభి స్సీద్ధై రపునర్భవకాజ్జిభిః

విదిత్వా తు పరం క్షేత్ర మవిముక్తం సమాశ్రయేత్

తద్గుహ్యం దేవదేవస్య త తీర్థం తత్తపోవనమ్

 పరం స్థానం తు తే యా న్తి సమ్బవ స్తి న తేపునః

జ్ఞానే విహిత నిష్ణానాం పరమానన్ద మిచ్ఛతామ్

 యా గతి ర్విహితా సుభు సావిముక్తే మృతస్య తు

 భవస్య ప్రీతి రతులా హ్యవిముక్తే హ్యనుత్తమా అసజ్యేయం ఫలం తత్ర హ్యక్షయా చ గతి ర్భవేత్

 పరం గుహ్యం సమాఖ్యాతం శ్మశానమితి సంజ్ఞితమ్

 అవిముక్తం న సేవ నే వణ్చితా స్తే నరా భువి

 అవిముకే స్థితైః పుష్యైః పాంసుభి ర్వాయునేరితైః

 అపి దుష్కృతకర్మాణో యస్య ని పరమాం గతిమ్

 అవిముక్తగుణా వక్తుం దేవదానవమానవై 

న శక్యంతేప్రమేయత్వా త్స్వయం యత్రభవ స్థితః

 నాహితాగ్ని ర్నయజ్వావా నశుచి ససరోపి వా

 అవిము కే వ సేద్యస్తు స వస్తే దీశ్వరాలయే

 తత్ర నాపుణ్యకృత్కళ్చి తృసాదా దీశ్వర స్యచ

జ్ఞానేనా జ్ఞానతో వాపి స్త్రీయావా పురు షేణ వా

 యత్కించి దశుభం కర్మం కృతం మానుషబుద్దినా

 అవిముక్తం ప్రవిష్టస్య తత్సర్వం భస్మసాద్భవేత్

 సరిత సాగరా శ్మైలా సీర్ధాన్యాయత నానిచ

భూత ప్రేత పిశాచాశ్చ గణా మాతృగణా స్తథా

 శ్మశానక పరీవారః ప్రియ స్తస్య మహాత్మనః

తే నమ్చు స్తి శమ్భుంచ శమ్బుస్తా న్న విముణ్చాతి

రమతేచ గజై సార్ధ మవిము క్రే స్థితః ప్రభుః

దృష్వైతా శీనకృపణా నాపదుష్కృతకర్మిణః

 కృపయా తస్య దేవస్య జాయతే పరమాగతిః

భక్తానుక మీ భగవాం స్తిర్యగ్యోనిగతేష్వపి

భవత్యేవ పరం స్థానం యత్ర యా ని చ యాజ్ఞికాః

భృగవోజ్గిరసస్సిద్దా ఋషయశ్చ మహావ్రతాః

 అవిముక్తాగ్నినా దగ్ధా హ్యగ్నౌ తూలమివాహితమ్

ఈశ్వరుడిట్లనెను : పునర్జన్మ రాహిత్యము కోరు సిద్దులనేకులు సేవించినదగు ఆవిముక్త క్షేత్ర మహిమ నేరిగి ఆ పరమ క్షేత్రము నాశ్రయముగా చేసికొనవలెను ఆది దేవ దేవుని గుహ్య స్థానము-గుహ్య తీర్థము-తపోవనము దానికేగిన వారు మరల జన్మించరుపరమానందము కోరి జ్ఞానమునందు సమాహిత చిత్తులగు వారికి కలుగు ఉత్తమ గతి ఆవిముక్తమున మరణించినంతనే కలుగును: భవునకు దీనియందుగల ప్రీతి అనుత్త మమును అసమానమును; అచట అసంఖ్యేయమగు ఫల మును ఆక్షయ గతియు లభించును; ఇది పరమగుహ్యమగు శ్మశానము; దీనిని సేవింపని నరులు వంచితులయినట్లే; అచటి ధూళి రేణువులు గాలికి ఎగిరివచ్చి తాకినంతనే పాపకర్ములు కూడ ము క్తినందుదురు; శివుని నిత్య నివాసమగు ఆవిముక్తపు గుణములు ఇంతింతఇటివి అని చెప్ప శక్యముకానివి; వానిని దేవ దానవ మానవులెవ్వరును వర్ణింప జాలరు; ఆహితాగ్ని - యజ్ఞకర్త శుచికాక తస్కరుడే ఐనను అవి ముక్తమున వసించువాడు ఈశ్వరాలయమున వసించినట్లే; అచట పుణ్యవంతుడు కాని వాడెవ్వడును లేడు; శ్రీ కాని పురుషుడు కాని తెలిసియే మానవ సహజ బుద్ధితోనో చేసిన ఏ పాప కర్మమయినను ఆవి ము క్షమును ప్రవేశించినంతనే ఈశ్వర ప్రసాదమున నశిం చును; నదులు సముద్రములు పర్వతములు క్షేత్రములు తీర్థ ములు భూత ప్రేత పిశాచములు ప్రమథగణ మాతృ గణములు మొదలగు శ్మశాన సహజ పరివారములు అన్ని యు ఆ మహాత్ము నకు శివునకు ప్రియములు; అవి శివుని విడువవు; శివుడు వానిని విడువడు; ఆ ప్రభువచట నుండి గణములతో విహరించు చుండును: పాప దుష్కృత కారులగు దీనులను కృపణులను అతడు దయతోచూచి అచట నుండు వారికి పరమగతి నొన గును; భక్తాను కంపా వరుడగు ఆ భగవానునకు తిర్యగ్యోని గతములగు పశుపక్ష్యాది ప్రాణులయందును దయయే; భృగ్వంగిరసాదులగు మహావ్రతులగు సిద్దులును పరమ ఋషులును తమ పాపములు అగ్ని యందు వేసిన దూదివలె దగ్గ మగుట కై ఎచటికి యాత్ర చేయుదురో అట్టి అవిముక్తము పరమో త్తమ స్థానమెట్లు కాక పోవును? 

న సా గతిః కురుక్షేత్రె గజ్గా ద్వారేథ పుష్కరే

 యా గతి ర్విహితా పుంసా మవిముక్తనివాసీవామ్

 తిర్యగ్యోనిగతా గత్వా యేవీముక్తే కృతాలయాః

కాలేన నిధనం ప్రాప్తి స్తే యా న్తి పరమాం గతిమ్

 మేరుమన్గర మా లేపి రాశిః పాపస్య కర్మణః

అవిముక్తం సమాసాద్య తత్సర్వం వ్రజతి క్షయమ్

శ్మశానమితి విఖ్యాత మవిముక్తం శివాలయమ్

 తద్దుహ్యం దేవదేవస్య త తీర్థం తత్తపోవనమ్

 తత్ర బ్రహ్మాదయో దేవా నారాయణ పురోగమాః

 యోగిన శ్శతశ సిద్దా భగవనం సనాతనమ్

 ఉపాసనే శివే భక్తా మద్భక్తా మత్పరాయణాః

 యా గతిర్జా నతపసాం యా గతి ర్యజ్ఞయాజినామ్

 ఆవిముకే మృతానాం తు సా గతి ర్విహితా సదా

 సంహర్తారశ్చ కర్తార స్తస్మిన్బహ్మాదయ స్సురాః

సమ్రాడ్విరాణ్మయా లోకా జాయ న్తో హ్యపునర్భవాః

మహాజన స్తవశ్చైవ సత్యలోక స్తథైవచ

 మనసః పరమో యోగో భూతభవ్యభవిష్యచ 

బ్రహ్మాదిస్థావరా స్తస్య యోనిం సొజ్యవిమోక్షయోః

అవిముక్తం న ముహ్చో స్తి నరా స్తే నైవ వజ్చతాః

ఉత్తమం సర్వతీర్థానాం స్థానానా ముత్తమం తథా

తాణా ముత్తమం చైవ శ్మశానానాం తథైవచ

 తటాకానాంతు సర్వేషాం కూపొనాం ప్రోతసాం తథా

శైలానా ముత్తమం శైలం తీర్ధానా ముత్తమం తథా

 మియద్భిర్ఘరభక్తీ శ్చ హ్యవిముక్తం తు సేవ్యతే

 బ్రహ్మణః పరమం స్థానం బ్రహ్మణ్కా ధ్యాసితంతు యత్

 బ్రహ్మణా సేవితం నిత్యం బ్రహ్మణా చైవ రక్షితమ్

తస్యైవ సప్తభువనం కాణ్చనో మేరుపర్వతః

 మనసః పర మో యోగః ప్రీత్యర్థం బ్రహ్మణ స్సలు

 బ్రహ్మాతు తత్ర భగవాం స్త్రిసన్య మీశ్వరే స్థితః

 పుణ్యాత్పుణ్యతమం క్షేత్రం పుణ్యకృది ర్ని షేవితమ్

ఆదిత్యోపాసనం కృత్వా విప్రాశ్చామర తాం గతాః 

ఆవిముక్త నివాసులకు కలుగు ఉత్తమగతి కురు క్షేత్రమునను గంగా ద్వారమునను పుష్కరమునను కలుగదు; తిర్యకాణులయినను అచటికి పోయి అది తమ నివాసముగా చేసికొనినచో తమ కాలము వచ్చి మృతినందీ ముకు లగుదురు; మేరు మందర పర్వత సమాన పాపరాశియయినను అవిముక్తము నకు పోగానే నశించును; ఇది మహా శ్మశా నము నిత్య శివాలయము దేవ దేవుని గుహ్యమగు తీర్ష మును తపోవనమును; అచట శివుడనగు నాయందు భక్తిగల బ్రహ్మ విష్ణ్వాది దేవతలును యోగులును సిద్దులును వందలకొలదిమంది మద్భక్తులు నన్నే పరమగతిగా భావించి భగవానుడు సనాతనుడు (శాశ్వతుడు) నగు నన్ను పాసింతురు; జ్ఞాన తపోవంతులకు యజ్ఞక ర్తలకు కలుగు ఉత్తమగతులు అవిముక్త నివాసులకు కలుగును; లోకకర్తలును లోక సంహార కులునునగు బ్రహ్మాది దేవతలును సమ్రాట్ విరాట్స్వరూపులగు ఈశ్వరతత్వములును పునర్జన్మము కలుగనీయని ఉత్తమ లోకములును మహర్ణన స్తపస్సత్యలో కాదులును నా నుండి ఉద్భవించునవన్ని యు ఎచట నుండు వారికి లభించునో ఏది మనస్సునకును భూతభవిష్య వర్తమానములకును బ్రహ్మాది స్థావరాంత భూతములకును సాంఖ్యత త్వమునకును ముక్తికిని జన్మ హేతువో అట్టి ఆవిముక్తము నాశ్రయించువారు వంచితులు కాక తమ జన్మమును సఫల మొనర్చుకొన్న వారే యగుదురు; ఆది అన్ని తీర్థములందు స్థానములందు క్షేత్రములందు శ్మశానములందు తటాక ములందు కూపములందు జల ప్రవాహములందు శైలములందును ఉత్తమ మయినది; దీనిని శివ భక్తులు మృతినందబోవుచు సేవించినను ముక్తు లగుదురు; ఇది బ్రహ్మకు పరమస్థానము; బ్రహ్మకు ఆశ్రయము; బ్రహ్మచే సేవితము; బ్రహ్మచే రక్షితము; బ్రహ్మలోకములగు స ప్రభువనములును ఇవియే; కాంచన మేరుపర్వతము ఇదియే; ఇది మానన పరమయోగము; ఇది బ్రహ్మకు పరమ ప్రీతికరము; ఇచట భగవానుడగు బ్రహ్మ త్రిసంధ్యములందును ఈశ్వరుని యందు ఉండును ఇది పుణ్యమగు వానిలో పుణ్యతమమగు స్థానము; పుణ్యము చేసినవారే దీనిని సేవింతురు; ఇచట ఆదిత్యోపాసన మొనర్చిన విప్రులు ఆమరత్వము నందిరి;

అన్యేపి యే త్రయో వర్జా భవభ క్తా స్సమాహితాః

అవిముక్తే తనుం త్యక్త్వా గచ్ఛంతి పరమాం గతిమ్

 అన్యా యాః కామచారిణ్యః స్త్రియో భోగపరాయణాః

కాలేన నిధనం ప్రాప్తి గచ్చంతి పరమాం గతిమ్

ఆప్టా మాసాన్వీహార స్య యతీనాం సంయతాత్మ నామ్

 ఏకత్ర చతురో మాసా శబ్దం వా నివ సే త్పునః

 ఆవిముకే ప్రవిష్టానాం విహారస్తు నవిద్యతే

న దేహో భవితా తత్ర దృష్టం శాస్త్రే వరాననే

 మోక్షాహ్యసంశయ సత్ర పఞ్చత్వంతు గతస్యచ

శ్రియః పతివ్రతాయాశ్చ భవభక్తి స్సమాహితాః

అవిముక్తీ తు స న్యక్వా(జ్య) గచ్ఛన్తి పరమాం గతిమ్

 యత్రయోగశ్చ మోక్షశ్చ ప్రాప్యతే దుర్లభో నరై

 అవిముక్తం సమాసాద్య నాన్యద్ధచ్చే తపోవనమ్

 సర్వాత్మనా భవ సేవ్యో బ్రాహ్మణేన నసంశయః

 ఆవిముకే వ సేద్యస్తు మమ తుల్యో భవేన్నరః

 యతో మయా న ముక్తంహి అవిముక్తం తతః స్మృతమ్

ఆవిముక్తంన సేవ నే మూఢా యే పాపసంయుతాః

 విణ్మూత్రరేతసాం మధ్యే తే వస నీ పునఃపునః

 కామః క్రోధశ్చ లోభశ్చ దమ్బః స్తమ్బోతిమత్సర

నిద్రా తనీ తథాలస్యం పైశున్య మీతి తే దశ

 అవిము క్రే స్థితా విఘ్నా శ్మ కేణ విహితాస్స్వయమ్

 వినాయకోపసర్గశ్చ సతతం మూఠ్నీ తిష్ఠతి

 పుణ్య మేత ద్భవేత్సర్వం భక్తానా మనుకమ్పయా

 వరం గుహ్యమితి జ్ఞాత్వా తత్తచ్ఛాస్తాను మోదనాత్

వ్యాహృతం దేవదేవైస్తు మునిభి సత్వ దర్శిభిః

 మేదసా వివుతా భూమి రవిము కేతు వర్జితా

 పూతా సమభవత్సర్వా మహాదేవేన రక్షితా

 సంస్కార స్తేన క్రియతే భూమే రన్యత్ర సూరిభిః 

ప్రియా! ఇతరులను మూడు వర్ణములవారును (క్షత్రియ వైశ్య శూద్రులును) సమాహితులయి భవునియందు భక్తి గలిగి ఈ అవీ ము క్షమున తనువు విడిచినచో పరమగతి నందుదురు ఇతరలగు కామ స్వేచ్చా)చారిణులును భోగపరా యణలగు స్త్రీలు కూడ ఇచట నివసించుచో తమ కాలము వచ్చి మృతి నందిన తరువాత పరమగతి (ముక్తి) నందుదురు నియత మనస్కులగు యతులు కూడ ఇతర ప్రదేశములం దయినచో సంవత్సరమున ఎనిమిది మాసములు సంచరించుచు నాలుగు మాసము లొక చోట నుండుట విహితము; ఈ ఆవిముక్తమున ప్రవేశించిన తరువాత వారు సంచరించుచుండ నక్కరలేదు (ఈ ఆవిము క్షమున యతులు ఏడాది పొడవునను కదలక ఓ కేచోట నున్న ను దోషము కాదు) అచట నుండు వారికి దేహము ఉండదు అని శాస్త్రమునందు కనబడుచున్నది అచట పంచత్వము (మరణము) నందిన వారికి ముక్తి కలుగుట నిస్సంశయము; భవునియందు భక్తలయి సమాహితచిత్తలగు పతివ్రతలగు స్త్రీలును ఆవిముక్తమున దేహ త్యాగ మొనర్చి పరమగతి నందుదురు ఇచట నరులకు దుర్లభమగు భోగముక్తులు రెండును లభించును కావున ఇటకు వచ్చినవారు మరి యే తపోవనమునకును పోవ పనిలేదు బ్రాహ్మణుడు సర్వభావముతో భవుని సేవింపవలయును; ఆట్లు ఆవిముక్తమున వసించు విప్రుడు నాతో సమానుడగును; నేను దాని నెన్నడును విడువను కావుననే దాని కవిముక్తమని పేరు; దానిని సేవింపని మూడులు పాపయుతులయి మరల మరల మలమూత్ర రేతస్సుల నడుమ నుండువారే యగుదురు; కొమము క్రోధము లోభము దంభము స్తంభము (విర్రవీగుట) ఆతిమత్సరము నిద్రబద్దకము- అలసత్వము పిశునత్వము (కొండె ములు చెప్పుట) అను పదియు ఆవిము క్షమున ఇంద్రుడు స్వయముగ ఏర్పరచిన విఘ్నములు; వినాయకుడు కలిగించు ఉపసర్గము (ఉపద్రవము) పదునొకొండవది ఎప్పుడును తలమీద కూర్చుండి యుండును; ఇన్ని యున్న ను ఇవి భక్తుల నను గ్రహించు బుద్దతో వారికి శుభకరములే యగునను ఈ పరమ రహస్యము శాస్త్రముల పరిశీలించిన దేవదేవులును తత్వ దర్శులగు మునులును వచించిరి; మధు కైటభుల మేదస్సుతో తడిసినందున భూమికి మేదినియని వ్యవహారము కలిగెను; అముక్తమునందలి భూమికి మాత్రము వారి మీద స్సుతోడి సంబంధము లేదు; కావున ఇతర స్థానములందలి భూమికి వలె ఇచటి భూమిని సంస్కరింపకున్న ను ఆది స్వాభావికముగా పవిత్రము అగునని నిర్ణయించి మహాదేవుడిచటి భూపవిత్రతను రక్షించుచున్నాడు

యే భక్తా వరదం దేవ మక్షరం పరమం పదమ్

దేవదానవగన్దర్వా యక్షరక్ష మహోరగా

 అవిముక్త ముపాసంతే తన్నిష్థా స్తత్పరాయణాః

తం విశంతి మహాదేవ మాజ్యాహుతి రివానలమ్

 తంవై ప్రాప్య మహాదేవ మీశ్వరాధ్యుషితం శుభమ్

 అవిముక్తే కృతార్దోస్మీ త్యాత్మాన ముపలక్షయేత్

ఋషిదేవాసురగణె ర్జపహోమపరాయణైః

 యతిభి ర్మోక్ష కామైశ్చ హ్యవిముక్తం ని షేవ్యతే

 నా విముక్తీ మృతః కశ్చిన్నరకం యాతి కిల్బిషీ

 ఈశ్వరానుగృహీతాహి సర్వే యా న్తి పరాంగతిమ్

 ద్వియోజన మథార్డు చ తత్తేత్రం పూర్వపశ్చిమమ్

అర్ధయోజనవి స్తీర్ణం దక్షిణో తరత స్థితమ్

 వారాణసీ నదీ యాచ యావచ్ఛుక్షనదీ తు వై

ఏతత్తేత్రస్య విస్తారః ప్రోక్తో దేవేన ధీమతా

 లబ్ద్వి యాగం చ మోక్షం చ కాజ్ఞ్యతే జ్ఞాన ముత్తమమ్

 అవిముక్తం న ము ఇ్చ ని మన్నిష్ణా మత్పరాయణాః

 అస్మిన్వస ని యేమర్త్యా న తే శోచ్యాః కథక్చన

 యోగ క్షేత్రే తపః క్షేత్ర సిద్ధగధ్ధర్వసేవితే

 సరిత సాగరా శ్మైలా అవిము కే సమా శితాః

 భూర్లో కే చా నరి క్షేచ దివి తీర్థాని యానిచ

 అతీత్య వర్తతే సర్వాణ్య విముక్తం ప్రభావతః

 యేతు ధ్యానం సమాసాద్య యుక్తాత్మాన స్సమాహితాః

 సన్ని యమ్యేస్ట్రియ గ్రామం జప నీ శతరుద్రీయమ్

అవిము కే స్థితా నిత్యం కృతార్థా స్తే ద్విజాతయః

భవభక్తిం సమాసాద్య రమనే తే సునిశ్చితాః

సంహృత్య భ క్తితః కామా న్విషయేభ్యో బహి శ్రితాః

 శ క్తితః స్సంగతో ముక్తా శ్శక్తిత స్తపసి స్థితాః

 న తేషాం పునరావృత్తిః కల్పకోటి శతై రపి

 కరణా నీహచాత్మాన మపునర్భవభావితాః

 తం వై ప్రాప్య మహాదేవ మీశ్వరం నిర్బయా స్థ్సితాః

 ఆవిముక్తేతు గృహ్యంతే భవేన విభునా స్వయమ్

దేవదానవ గంధర్వ యక్షరక్షో మహానాగాది భక్తు లెవరు ఆవిము క్ర వాసియు వరదుడు అక్షరుడు వరమపద రూపుడు నగు మహాదేవుని పరమగమ్యముగ శ్రద్ధతో భావించి ఉపాసింతురో వారు ఆజ్యాహుతి అగ్ని హోత్రమునందు వలే శివునియందే ప్రవేశింతురు; ఈశ్వరున కాశ్రయమును శుభమును నగు ఆవిముక్తమును చేరిన వారు తాము మహాదేవునందే చేరిరని భావించవలయును; జపహోమ పరాయణులగు ఋషులును దేవాసురులును ము కాములగు యతులును అవిము క్షము సాశ్రయింతురు; ఇచట మృతి నందిన పాపియు ఎవడును నరకము నందడు; దీని నాశ్రయించినవా రెల్లరును ఈశ్వరాను గ్రహమున పరమగతి నందుదురు; ఈ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు రెండున్నర యోజనములు రెండు యోజనము లని లోగడ చెప్పబడినది); దక్ష్మిణో తరముల వెడలుపు అర్ధ యోజనము; ఇది వారాణసీ నదీ శుక్ల నదుల నడుమ నున్న ది; అని ఈ క్షేత్ర విస్తారము ధీమంతుడగు మహాదేవుడు చెప్పెను; ఉత్తమ జ్ఞానమును మోక్షమును కోరి యోగసాధన నాశ యించి మన్నిష్ణులు (నాయందే శ్రద్ధ కలవారు) మత్పరాయణులు (నన్నే పరమగమ్యముగా భావించినవారు) ఆయి అవిము క్షమును వీడువక ఇట నివసించినవారు శాచ్యులుకారు (అభినందింపబడవలసినవారే); అన్ని నదులును సముద్రములును పర్వతములును యోగ క్షేమమును తపః క్షేత్రమును సిద్ద గంధర్వ సేవితమును నగు ఆవిముక్తమునందే యుండును; ఆవిముక్తము భూమ్యంతరిక్ష ద్యులోకములందలి సకల తీర్థము లను తన ప్రభావముచే అతిశయి )చి యున్నది; ద్విజులు ఎవరు నిరతమును ఆవిముక్తమునందే యుండి ధ్యాన మవలంబించి మనస్సును భవునందు యోజించి నమాహితచిత్తులయి ఇంద్రియముల నిగ్రహించి శత రుద్రియ(మను వేద భాగమును జపింతురో వారు కృతార్థులు; అట్టి భవభక్తులు నిశ్చయ ముగ ఆనంద మందుదురు; భక్తి కలిగి కామములనుప సంహరించి విషయ సుఖములకు బహిర్భూతులై శ క్తి ననుసరించి అన్ని సంగ ములను విడిచి తన మాచరించుచు ఇంద్రియములను మనస్సునునిగ్రహించుకొని ఆవిముక్త వాసులగు వారు శతకోటి కల్పముల తరువాత కూడ మరల జన్మింపరు; వారు పునర్జన్మ రహితులయి మహాదేవుడగు ఈశ్వరుని చేరి నిర్భయులయి యుందురు; ఇచట నుండువారిని భవుడు తానే దగ్గరకు తీసికొనును

ఉత్పాదితం మహా క్షేత్రం సిద్ద్యంతే యత్రమానవాః

 ఉద్దేశ మాత్రం కథితా హ్యవిముక్తగుణా స్తథా

సముద్ర స్యేవ రత్నా నా మవిముక్తస్య విస్తరమ్

 మోహనం తదభక్తానాం జూనాం బుద్ధివర్గ నమ్

 మూఢ ఫేపి న పశ్య స్తి శ్మశానమతి మోహితాః

 హన్యమానోపి యో విద్వాన్ వస్తే ర్విఘ్న శతై రపి

 స యాతి పరమం స్థాసం యత్ర గత్వా న శోచతి

జన్మమృత్యుజరాముక్తం పర జ్ఞానం శివాలయమ్

అపునర్మరణానాం హి సా గతి ర్మోక్షకాల్షిణామ్

 యం ప్రాప్య కృతకృత్యస్యా దితి మన్యేత పజ్జితః

న దానై ర్న తపోభిర్వా న యజై ర్నా ఓ విద్యయా

 ప్రాప్యతే గతిరిష్టా తు యావిము కేతు లభ్యతే

 నానావర్ణా వివర్ణాశ్చ చడ్డాలా యే జుగుప్సితాః

 కిల్బిషైః పూర్ణదేహాశ్చ ప్రకృ ష్టిః పాత కైరపి

 భేషజం పరమం తేషా మవిముక్తం విదుర్బుధాః

 జాత్య నర సహ సేషు హ్యవిముకే మియేత యః

 భక్తీ విశ్వేశ్వరే దేవే న స భూయోప్ జాయతే

 తత్ర జప్తం హుతం దత్తం తప సప్తం తథా కృతమ్

సర్వ మక్షయ మేతస్మి న్న విముకే న సంశయః

 కాలేనోపర తా యా న్తి భవసాయుజ్యతాం ధ్రువమ్

కృత్వా పాపసహస్రాణి పశ్చా తన్హాపమేత్య వై

 ఆవిము క్తీ వియు జ్యేత స యాతి పరమాం గతిమ్

 ఉత్తరం దక్షిణం వాపి అయనం న వికల్పయేత్

 సర్వ స్తేషాం శుభః కాలో హ్య విము క్తీ య న్తయే

 న తత్ర కాలో మీమాంస్యో శుభం పొ యది వా శుభమ్

 తస్య దేవస్య మాహాత్మ్యా తౌణ్ రద్భుతకర్మణః

 సర్వేషామేవ నాధస్య సర్వేషాం విభునా స్వయమ్

శ్రుత్వేద మృషయ న్సర్వే స్కన్దేన కథితం పురా

 ఆవిముక్తాశ్రయం పుణ్యం భావయన్ కరణే శ్శుభై కి

ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవీదేవసంవాదే అవిముక్త

మాహాత్మ్యే త్ర్యశీత్యుత్తర శతత మోధ్యాయః

మానవులకు సిద్ధి కలుగుటకే ఈ క్షేత్రమును శివు డుత్పాదించెను ఆవిముక క్షేత్ర గుణములను ఉద్దేశ (పేరులు చెప్పుట) మాత్రముగా ఇట్లు తెలిపితిని; అవి నముద్రపు రత్నములవలే అనంతములు; భక్తులు కానివారి బుద్ధికిని మోహమును (ఇంకను మూఢత్వమును) భక్తులగు ప్రాణులకు బుద్ది వృద్ధిని కలిగించును; మూఢులు మోహితులయి ఇది శ్మశానమే యను భావముతో చూతురు; వందల విఘ్నములు కలుగుచున్న ను ఇట వసించు వివేకులు శోకరహితమగు పరమవద మందుదురు; ఆది జన్మజరామరణములు పోగొట్టు పరమ జ్ఞాన ప్రదమగు శివాలయము; పునరావృత్తి రహిత ముక్తి కోరువారి కది పరమగతి; దీనిని చేరితిని కాని కృతకృత్యుడ నయితినని భావించువాడు వివేకి; ఆవిము క్షమున లభించు ఇష్టగతి దానములతో యజ్ఞములతో తపముతో విద్యలతో లభించక పోవచ్చును; సంకరవర్థులు వర్ణరహితులు (ఏ వర్ణవ్యవస్థయు లేని దేశ ములవారు) చండాలురు జుగుప్సితులు (జనులచే అనహించుకొనబడు వారు) పాపపూర్ణ శ రీరులు మహాపాతకులు నగు వారికి ఇది పరమౌషధము; అని పండితులు చెప్పుచున్నారు; వేలకొలదిగా గల ఆయా ప్రాణి జాతు లందు పుట్టియున్న దేహధారియైనను అవిముక్త క్షేత్రమున మృతి నందినవాడు విశ్వేశ్వర భక్తు డే; వానికి పునర్జన్మ ముండదు; అందు ఆచరించిన జపహవన దానతపస్సు లన్నియు అక్షయ ఫలప్రదములు; ఇట్టివి చేసినవారు అచట నివ సించుచు తమ కాలము వచ్చి మరణమంది నిశ్చయముగ శివసాయుజ్య మందుదురు; పాప సహనములు చేసినను పశ్చాత్తాప మందీ అవీము క్షమున మరణించినను ముక్తి లభించును; అందు మరణించుటలో ఈ కాలము శుభమా అశుభమా యని మీమాంస చేయ పనిలేదు; స్థాణు(శాశ్వత)రూపుడు అద్భుత కార్యసమర్థుడు సర్వరక్షకుడు సర్వవిభుడు నగు ఆ మహా దేవుని మాహాత్మ్యముచే ఉత్తరాయనమో దక్షిణాయన మో ఏదయినను మంచిదే

పూర్వము స్కందుడు చెప్పిన ఈ అవిముక్త క్షేత్ర విషయక వృత్తాంతమును విని ఋషులు ఎల్లరును తమ తమ శుభములగు అంతః కరణములతో దానిని భావన చేసిరి

ఇది శ్రీమత్స్య మహాపురాణమున స్కంద-ఋషి- సంవాదాంతర్గత దేవీదేవ సంవాద రూపమగు అవిముక్త మాహాత్మ్యము అను నూట ఎనుబది మూడవ అధ్యాయము