283 - ధరాధాన విధానము.

శ్రీమత్స్యః : అథాత స్సమ్పవక్ష్యామి ధరాదాన మనుత్తమమ్

 పాపక్షయకరం నృణా మమజ్గళ్యవినాశనమ్

కారయే త్పృథివీం హైమీం జమ్బూద్వీపానుకారిణీమ్

మర్యాదపర్వతవతీం మధ్యే మేరుసమన్వితామ్

లోకపాలాష్టకో పేతాం నవవర్గ సమన్వితామ్

నదీనద సమో పేతా మ నే సాగర వేష్టితామ్

మహారత్న సమాకీర్ణం వసురుదార సేవితామ్

హేమ్నః పలసహసేణ తదథేనాపి శ క్తితః

శతత్రమేణ వా కుర్యాద్ ద్విశ తేన శతేన వా

కుర్యా త్పజ్చపలా దూర్వ మత కోపి విచక్షణకి

తులాపురుషవ తుర్యా ల్లో కేశావాహనం బుధః

ఋత్విజ్మణపసమార భూషణాచ్ఛాదనాదికమ్

 వేద్యాం కృష్ణాజినం కృత్వా తిలానా ముపరి న్య సేత్

తథా ష్టాదశ ధాన్యాని రసాంశ్చ లవణాదికాక్

 తథాష్టా పూర్ణకలశా నమస్తా త్పరికల్పయేత్

వితానకంచ కౌశేయం ఫలాని వివిధాని చ

 తథాంశుకాని రమ్యాణీ శ్రీ ఖడ్గశకలానిచ

 ఇత్యేవం రచయిత్వా తా మధివాసనపూర్వకమ్

శుక్లమాల్యామ్బరధర శ్శుక్తాభరణభూషితః

 ప్రదక్షిణం తతః కృత్వా గృహీతకుసుమాఞ్జలి

 పుణ్యం కాలమథాసాద్య మంత్రా నేతా నుదీరయేత్

శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను : ఇపుడిక అను(అత్యు) త్తమమును మానవులకు ఆమంగల్య (అశుభ)మును నశింపజేయునదియు పాపక్షయకరమునగు ధరాదానవిధానమును తెలి పెదను. బంగరుతో జంబూ ద్వీపమును అనుకరించు (పోలిన) పృథివీ ప్రతిమను చేయించవలెను. దానియందు మర్యాదా (నాలుగు దిక్కులయందలి అవధి) పర్వతములును నడుమ మేరువును అష్టలోకపాలురును నవవర్షములును నదీ నదములును అంతమందు (చివరి హద్దుగా చుట్టును) సాగరమును నుండవలయును. ఈ పృథివీ ప్రతిమ మహారత్న సమాకీర్ణ (వ్యాప్త)మై అష్టవసు ద్వాదశాదిత్యై కాదశ రుద్ర సేవితమయి యుండవలెను. ఇది వేయియో ఐదువందలో మూడువందలో రెండువందలో ఒకవదయో పలముల బంగరుతోగాని ఐదు పలములకు పైగా ఎంత తూకపు బంగారుతోనే నను ఆశక్తుడయినను విచక్షణుడే చేయించవలయును; ఇదియెరిగీ తులాపురుషదానమందువలేనే లోకపాలావాహనమును ఋత్విజులను మండపమును సంభారములను భూషణములు వస్త్రములు మొదలగువానిని సమకూర్చుకొనవలయును; ఈ పృథ్వీప్రతిమను వేదియందు పరచిన కృష్ణాజినము పై తిలలయందుంచవలెను; దగ్గరలో ఆష్టాదశ ధాన్యములను లవణాది రస ద్రవ్యములను అష్టపూర్ణకలశములను పట్టు వితానకము (మేలుకట్టు)ను వివిధ ఫలములను రమ్యములగు ఆంశుకము (సన్నని మేలగు వస్త్రము)లను శ్రీఖండ శకలము మంచిగందపు కర్రముక్కలను ఉంచవలయును; ఇట్లన్ని యు అమర్చి ఈ ప్రతిమకు అధివాసనమును జరిపి తెల్లని వస్త్రములను పూవులనుదాల్చి సర్వాభరణభూషితుడై పుణ్యసమయమురాగానే దోసిటపూవులు తీసికొని ఈ ప్రతిమాదికమును ప్రదక్షిణించి ఈ మంత్రములనుచ్చరించవలయును :

నమస్తే సర్వదేవానాం త్వమేవ భవనం యతః

 ధాత్రీచ సర్వభూతానా మతః పాహి వసున్దరే

 వసు ధారయతే యస్మా ద్వసు చాతీవ నిర్మలమ్

 వసున్దరా తతో జాతా తస్మా త్సాహి భయా దలమ్

చతుర్ముఖోపి నో గచ్చే ద్యస్మా దన్తం తవాచలే

 అనన్తాయై నమ స్తస్మా తాహి నంసార కర్గమాత్

త్వమేవ లక్ష్మీర్గోవిందే శివే గౌరీతి సంస్థితా

 గాయత్రీ బ్రహ్మణః పార్శ్వే జ్యోత్స్నా చ శౌ రనౌ ప్రభా

బుద్ది ర్బృహస్పతౌ ఖ్యాతా మేధా మునిషు సంస్థితా

విశ్వం వ్యాప్య స్థితా యస్మా తస్మా ద్విశ్వమ్బరా స్మృతా

ధృతిః స్త్రీః క్షమా క్షోణీ వృథ్వీ వసుమతీ రసా

 ఏతాభి ర్మూర్తిభిః పాహి దేవి సంసారసాగరాత్

 ఏవ ముచ్చార్య తాం దేవీం బ్రాహ్మణేభ్యో నివేదయేత్

 ధరార్ధంవా చతుర్భాగం గురవే ప్రతిపాదయేత్

 శేషం చై వాథ ఋత్విగ్భ్యః ప్రణిపత్య విసర్జయేత్

 ఆనేన విధినా యస్తు కుర్యాద్దేమదరాం శుభమ్

పుణ్య కాలేతు స మా ప్లే స పదం యాతి వైష్ణవమ్

 విమానేనారవర్లేన కిజిణీజాలమాలినా

నారాయణపురం గత్వా కల్పత్రయ మథావి శేవ సేత్

పితృ న్పుతాంశ్చ పౌత్తాంశ్చ తారయే దేకవింశతిమ్

ఇతి పఠతియఇత్తం య శ్శృణోతి ప్రసజ్జా దపి కలుషవితానై ర్ముక్త దేహ స్సమస్తాత్

 దివ మమరవధూ భి ర్యాతి సమ్పార్యమానః పుర మమర సహస్రైస్సేవితం చన్దమౌళేః

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే ధరాప్రదానికో నామ త్య్రశీత్యుత్తర ద్విశతతమోధ్యాయః

“వసుంధరా! నమస్తే! సర్వదేవులకును నీవే భవనమవు. సర్వ భూతములకును ధాత్రి ధరించునది యు - తల్లియు పోషించునదియు)వి. కావున ఇట్టి నీవు మమ్ము రక్షించుము; వసువును. అనగా బంగారును.ధనమును - ఆందును. ఆతి నిర్మలమగు దానిని ధరింతువు గావున “వసుంధర' అనబడుచున్నావు; కావున మమ్ము నీవు భయముల నుండి మిక్కిలిగా కాపాడుము; అచలా! (కదలనిదానవగు ఓ భూమీ!)చతుర్ముఖుడు కూడ నీఅంతమును ఆందుకొనజాలడు; కొవుస అనంతయనబడు నీకు నమః; ఇట్టి దానవు కావున నీవు దయతో మమ్ము సంసారపు బురద నుండి కాపాడుము; గోవిందునీ యొద లక్ష్మియు శివునియొద్ద గౌరియు బ్రహ్మయొద్ద గాయత్రియు చంద్రుని యందలి వెన్నె లయు రవియందలి ప్రభ యు బృహస్పతియందలి బుద్దియు మునుల యందలి మేధయు నీవేయయి యున్నావు; విశ్వమంతటిని వ్యాపించియున్నావు కావున నీవు “విశ్వంభర' (విశ్వమంతట నిండి దానిని మోయునది-బిభర్తి) అనబడుచున్నావు; ధృతి-శాంతి క్షమ-క్షోణి పృథ్వి-వసుమతి-రన. ఈ మూర్తులతోనున్న దేవీ; సంసార సాగరమునుండి నన్ను కాపాడుము.”