మత్స్య మహా పురాణము
135 - దేవపరాజితులగు మయాది దానవుల దీనస్థితి
సూతః : ప్రమథై సమరే భగ్నా స్త్రైపురా స్తే మయాదయః ।
వివిశు స్త్రీపురం భీతాః ప్రమథై ర్బగ్న గోపురమ్॥
శీర్ణదంష్ట్రా యథా నాగా భగ్న శృజ్గా యథా వృషాః ।
యథా విపక్షా శ్శకునా మేఘాః క్షీణోదకా యథా॥
మృతప్రాయా స్తథాదైత్యా దై న్యేన వికృతాననాః ।
బభూవు స్తే విమనసః కథం కార్యం భవేదితి॥
అథ తాక్ల్మానమనస స్తదా తామరసాననః ।
ఉవాచ దైత్యాన్ దైత్యానాం పరమోధిపతి ర్మయః॥
కృత్వా మోరాణి యుద్ధాని ప్రమథై స్సహ సామరైః ।
త్రాసయిత్వా సురాన్యుద్ధే ప్రమథా నమరై స్సహ॥
విజితప్రథమం దైత్యాః పశ్చాత్తైరపి తాగితాః ।
ప్రవిష్టా నగరం ప్రస్తాః ప్రమథై ర్బృశ దుఃఖితాః॥
అప్రియంవో మహతాప్తం దేవై ర్నా సత్ర సంశయః ।
వృషాణా మీవ నో భజ శ్శృణ్భ జసమోభవత్ ॥
అహో కాలస్యహి బల మహో కొలోతిదుర్జయః ।
యత్రీదృశస్య దుర్గస్య ఉపరోధ్య మాగతః॥
ఏవంవదతి దైత్యేనే మయే బుద్ధిమతాంవరే।
బభూవు ర్నిష్పభా దైత్యా గ్రహా సూర్యోదయే యథా॥
తాపీపాలా స్తతో భ్యేత్య నభః కాల ఇవామ్బుదాః ।
మయహు ర్యమప్రఖ్యం ప్రాఞ్జలి ప్రశ్రయాన్వితాః॥
సూతుడు ఋషులతో ఇట్లు చెప్ప నారంభించెను: ప్రమథుల చేతిలో యుద్ధమున భంగము నంది: మయాది త్రిపుర దుర్గ దానవులు భయమంది ప్రమథుల చేతిలో విరిగిన గోపురాదులు గల త్రిపురమును ప్రవేశించిరి. వారెల్లరును కోరలు చిదికిన సర్పములవలెను కొమ్ములు విరిగిన వృషభములవలెను. బెక్కలు పోయిన పక్షులవలేను నీరు లేకుండ పోయిన మేఘములవలెను అయిరి. దైన్యముతో వారి ముఖములు వికృతము లయ్యెను. వారు మృతప్రాయు లయిరి. ఇక మీదట తాము ఏమి చేయవలయునో తోచని వారయిరి. ఇట్లు వాడిన మనస్సులతో నున్న దానవులను చూచీ పద్మము వలే వికసితమగు ముఖముగలవాడయి దే న్యములేక దైత్యో తముడగు మయుడు ఇట్లు పలికెను: దైత్య దానవులారా! మీరు ప్రమధులతోను దేవతలతోను ఘోర యుద్ధములు చేసితిరి. వానియందు దేవతలను ప్రమథులను భయ పెట్టితిరి. మొదట మీరే వారిని గెలిచితిరి. కాని తరువాత వారి చేతిలో ఓడిపోతిరి. ఇపుడు ప్రమథుల చేతిలోనే దెబ్బలు తిని మిగుల దుఃఖ మంది భయపడుచు నగరమును ప్రవేశించితిరి. దేవతల చేతిలో మీకు ఎంతయో దుఃఖము ప్రాప్తించినది. ఇందు ఏ మాత్ర మును సందేహము లేదు. మనకు కలిగిన ఈ అవమానము వృషభములకు జరిగిన శృంగభంగము వంటిది. ఈనాడు ఇటువంటి త్రిపుర దుర్గమునకే ఇటువంటి ముట్టడి తటస్థించిన దనిన అహో: కాలమహిమ ఎంత యాశ్చర్యకరమయినది కాలము ఎట్టి (మనవంటి) వారికిని జయింపరానిదనుట ఆశ్చర్యకర మే కదా
మహాబుద్ధిశాలియగు మయుడు ఇట్లు పలుకుచుండ అది వినుచున్న దైత్యదానవ శేషులు సూర్యోదయము కాగానే ; గ్రహములవలే కాంతిహీనులయిరి. అదే సమయమున వర్షాకాల మేఘములవంటి నీలకాయులై స వాపీపాలురు వచ్చి వినయము కలవారై దోసిలి యొగ్గి యమునివంటి మయునితో ఇట్లు పలికిరి:
యా సాఽమృతరసా గూడా వాపీ వై నిర్మితాత్వయా ।
సదేవాసుర శార్దూల పీతా కేనాపి సంవృతా॥
సమాకులోత్పలవనా సమీనాణ్డజపజజా ।
వాపీయాద్య త్వయా సృష్టా మృతసళ్ల వనాత్మికా॥
పీతా నో వృషరూ పేణ కేనచి ద్దైత్యనాయక ।
వాపీపాలవచ శ్శ్రుత్వా మయో సురవరః ప్రభుః॥
కష్ట మేత తకృతోచ్య దితిజా నిద మబ్రవీత్।
మయా మాయాబలకృతా వాపీ పీతాసురా యది॥
వినష్టాఃస్మ నసన్దేహ స్త్రీపురం దానవాగతమ్ ।
నిహతాన్నిహతాక్ దైత్యా సాజీవయతి దై వతై ॥
ఐపీ;యదిహి సావాపీ పీతాసాపీతవాససా ।
కోన్యో మన్మాయయా గుప్తా వాపీ మమృతదాయినీమ్,
పాస్యతే విష్ణుమజరం వర్జయిత్వా గదాధరమ్ ।
సుగుహ్యమపి దైత్యానాం నాన్యస్య విదితం యతః॥
యతో మతౌశలం జ్ఞాతం విబుధై స్సర్వతోముఖిః ।
సమోయం రుచిరోదేశ విద్రుమో విగతాచలః॥
తే వయం విర థా స్తస్మా ద్బాధ న్తస్మా నణాన్సురాః ।
తే యూయం యది మన్యధ్వం సాగరోపర్యధిష్ఠితాః॥
ప్రమథానాం మహావేగం సహామ హ మనోజవమ్ ।
ఏతేషాం న సమారమ్బా స్తస్మి శ్లాగరసమ్ర్పవే॥
నిరుత్సాహా భవిష్య ని దుర్గే మార్గం వినాఒమరా।
యుధ్యతాం నిఘ్నతాం శత్రూ నహితానాం ద్రవిష్యతామ్॥
సాగరోఽమ్బరసఙ్కాశ శ్శరణం నో భవిష్యతి ।
ఎవరికిని ఎరుగరానట్లు అమృతరసపూర్ణమయిన 'అమృతరసా' అను వాడిని. నీవు నిర్మించితివి గదా దేవ దానవు లెల్లర లో ఉత్తముడవగు మయా దాని నెవరో రహస్యముగా తావీ వేసిరి. అనగా మరికొందరు దానవులు వచ్చి ఇట్లనిరి. మృత సంజీవనశక్తిగల వాపిని నీవు సృజించితివి గదా దైత్యనాయకా! దాని నెవడో వృషభ రూపమున వచ్చి తావెను. ఎడములేక కలువలగుంపులతో మత్స్యములతో పనులతో పద్మములతో కూడియుండు దానియందే మయు నీరే లేకుండ పోయినది.
అనగా వాపీపాలురు పలికిన మాటలు విని దైత్యవరుడును ప్రభువును నగు మయుడు 'ఇది ఎంత జరుగరాని బాధాకరమగు విషయము జరిగినది' అని ఒకమారు పలికీ దానవులతో ఇట్లు పలికేను: అసురులారా! నేను నా మాయా బలముతో నిర్మించిన 'అమృతరస' వాపినే ఎవరో తెవిపోయినారనినదానవులారా! మన త్రిపుర దుర్గము కూడ లేకుండ పోయినదనియే నిస్సందేహముగా చెప్పవచ్చును. దేవతల చేతిలో ఎన్ని మారులు చచ్చినవారినే నను దైత్య దానవులను మరల మరల ఆజీవింపజేయుచుండిన అమృతరస వాహిని ఎవరో త్రివిర నిన అది ఎవరో కాదు పీతాంబరుడగు విష్ణువే తావియుండును. నేను నా మాయతో గుప్తపరచి నిర్మించిన అమృత జలదాయినియగు 'వాపి'ని ఆజరుడును గదాధరుడును నగు విష్ణువు తప్ప మరి ఎవ్వరు పానము చేయగలరు? ఏలయన మిగుల గూఢముగా నుంచినదై నను దైత్యుల ప్రతియొక విషయమును మరి ఎవ్వరికిని తెలియకున్నను అతనికి తప్పక తెలియును. దేవతలు సహజముగా సర్వతోముఖులు కారు; ఐనను వారు సర్వతోముఖులయి ఇది ఎరిగి రనిన అది విష్ణువు పనియే.
ఇదిగో! మన దుర్గము ఇపుడున్న ప్రదేశము చూడుడు.చదునే న బయలు; దీనియందు వృక్షములు లేవు; పర్వతములు లేవు. అందుచేత మనము రథాది చతురంగ బలముండియు లేనివారమయితిమి. అందుచేతనే మనలను ప్రమథులును దేవతలును బాధించగలుగుచున్నారు. కనుక ఇది ఎరిగి మీరు ఇష్టపడినచో మనము సముద్రోపరితలమును మన ఆశయముగా ఏర్పరచుకొందము. అట్లయినచో ప్రమథులు ఎంతగా మనోవేగము గలవారే అయినను వారి వేగమును మనము ఓర్చుకొనగలము. వారు చేయు సంరంభములును ప్రయత్నములును అన్ని యు సాగర జల మధ్యమున శ క్తిహీనములగును. అమరులును అచటికి వచ్చుటకు మార్గముండదు. కావున పోరును నిరుత్సాహులగు దురు. ఏలయన సాగరము ఆకాశ మువంటిదే. మనము శత్రువులతో యుద్ధము చేసినను వారిని కొట్టినను తరిమినను సాగరము మనకు ఆశ్రయముగా నుండగా వారు మనలను ఏమియు చేయజాలరు.
త్రిపురై స్సహ దానవానాం సాగర ప్రవేశః
ఇత్యుక్త్వా స మయో దై త్యా దైత్యానా మధిప స్తదా॥
త్రిపురేణ యయాతూర్ణం సాగరం సిందువల్లభమ్ ।
సాగ రేశ్వర సఙ్కాశ ముత్పపాత పురంవరమ్॥
ఆవతస్థుః పురాణ్యేవ గోపురాభరణేనతు ।
అపకా నేథ త్రిపురే త్రిపురారి స్త్రీలోచనః॥
పితామహ మువాచేదం వేద వాద విశారదమ్ ।
పితామహః దృడం భీతా దానవా భగవక్ హి తే॥
విపులం సాగరంసర్వే దానవా స్ట్రిపురా గతాః ।
యత ఏవహి తే యాత్రా స్త్రీపురేణతు దానవాః॥
తత ఏవహి తాంస్తూర్లం ప్రాపయస్వ పితామహ ।
సింహనాదం తతఃకృత్వా దేవా దేవరథంతదా॥
పరివార్య యయుర్ఘృష్ణా సాయుధాః పశ్చిమోదధిమ్।
తతోఒమరామరగురుం పరివార్య శివం హరమ్॥
అనుయాన్తో యయుస్తూర్ణం సాగరం దానవాలయమ్ ।
అథ చిరుపతాక భూషితంవా పటహాడమ్బరశజ్ఞనాదితమ్॥
త్రిపుర మభిసశ్య దేవతా విబుధబలాః ప్రణదు ర్యథాఘనాకి ।
అసురవర పురపి దారుణే జలధర ఇవ మృదజగహ్వరః,
దనుతనయనినాదమిశ్రితః ప్రతినిధిసజ్ఞుభితార్ణవోపమమ్ ।
అథ భువనపతి ర్గతిస్సురాణామరిమృగయాం ప్రతి లబ్దలుబ్దబుద్ధిః॥
త్రిదశగుణపతిం హ్యు వాచ శక్రం త్రిపురగడం సహ నిరీక్ష్య శత్రుమ్ ।
త్రిదశగణపతే నిశామయేతత్ త్రిపురని కేతన ముత్తమం సురేంద్ర ।
యమవరుణకుబేరషణ్ముఖి సైస్సహ గణ వైరపి హన్మి తావదేవ,
విహితపర బలాభిఘాతభూతం యద్యుదధిమధ్యగతాః పురాణితస్థుః ।
ససుర గణవృత స్సమర్థ ఈశో హ్యుదధి మగా త్రిపురం నిహన్తు మేక ॥
ఇతిపరిగణయత్ దితే స్తనూజా హ్యవతస్థు ధ్రవణార్ణవోపరిష్టాత్ ।
(ఆ)భిభవతి త్రిపురం సదానవేన్దం శరవర్ష ర్ముసలై శ్చ వజ్రకల్పైః॥
అహమపి రథవర్య మాశ్రిత స్సురగణవర్య భవామి పృష్ఠతః ।
అసురవరవధార్థముద్యతానాం ప్రతివిదధామి సుఖాయవోనఘ॥
ఇతిభవవచనప్రచోదితో దశశతనయనవపు స్సముద్యతః ।
త్రిపురపుర జిఘాంసయా హరిః ప్రవికసితామ్బుజలోచనో యయా॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే త్రిపురోపాఖ్యా నే త్రిపుర సహిత దానవానాం సాగర ప్రవేశాదికథనం నామ పఞ్చతింశదుత్తరశతత మోధ్యాయః॥
దైత్యాధిపుడగు మయుడు దానవులతో ఈ విధముగా పలికి త్రిపుర దుర్గముతో కూడ సర్వనదీనాధుడగు సముద్రునికడకు పోయెను. సాగ రేశ్వర సమీపమునకు ఆ త్రిపురము ఎగిరిపోయెను. త్రిపురములును వాని ఆయా గోపురములును ఇతరాలంకారములును ఆ దుర్ల మెగురుటలో "ఏమియు చేద బొక అట్లే ఉండెను. త్రిపుర దుర్గమట్లు తన స్థానమునుండి తొలగిపోవుటచూచి తిపురారియు త్రిలోచనుడునునగు శివుడు వేదవాదమునందు నిపుణుడగు బ్రహ్మ దేవునితో నిట్లు పలికెను. భగవన్! పీతామహా! దానవులందరును చాల ఎక్కువగా భయమందిరి. అందుచే త్రిపుర వాసులగు దానవులెల్లరు విపులమగు మహాసముద్రములోనికి వెళ్ళినారు. కావున నీవు శీఘ్రమే మనరథమునక్కడకు చేర్చుము. అనగా వెంటనే మహాదేవ రథమును చుట్టుముట్టి దేవతలందరును సాయుధులై హర్షముతో పశ్చిమ సముద్రమునకు పోయిరి. (దీనినిబట్టి దానవులు తమ త్రిపుర దుర్గముతో కూడ పశ్చిమ సముద్రము లోనికి పోయిరని తెలియును. ఇది ఈనాటి అరేబియా సముద్రమే.) అంతట అసురులందరును అమరులకు గురుడు (తండ్రిరక్షకుడు) అగు శుభకరుడగు హరుని పరివారించి అతనిని అనుసరించి త్వరితముగా దానవులకు ఆశ్రయమగు సొగర ప్రదేశమునకు పోయిరి. మనోహరములగు పతాక లతో అలంకృతములయి పటహముల ఆడంబరములతో నిండినదియు, శంఖముల ధ్వనులతో పూరితమునును త్రిపుర దుర్గము కనబడగానే దేవతలును దేవతా సైనిక జనులును మేఘములవలె గర్జన ధ్వనులు చేయసాగిరి. వెలుపల దేవతల విషయము ఇట్లుండ త్రిపుర దుర్గ మునందును దారుణములగు మృదంగ ధ్వనులు గంభీరమయి మేఘధ్వనులవలే వినబడుచుండ ఆవి దానవుల ధ్వనులతో మిశ్రితమయి సముద్ర ధ్వనితో సమానమయి వినబడుచు ఆ త్రిపుర దుర్గము సముద్రమునకు ప్రతినిధియేమో యనిపించుచుండెను.
అంతట సకల భువనాధిపతియు సురలకు గతియునగు హరుడు శత్రువులనేడు మృగములను వేటాడ వలయునను లోభముగల లుబ్ధకుని (వేటగానీ) వంటి బుద్ధి కలిగినవాడై దేవశత్రువులగు తై పుర దానవులు బలవంతు లయి జల మధ్యగతమయిన త్రిపుర దుర్గమునందుండుట చూచి దేవగణాధిపతియగు ఇంద్రునితో ఇట్లు పలికెను: దేవేంద్రా! ఇటు చూడుము; త్రిపుర దుర్గమను ఈ దానవపుర మెంత ఉత్తమముగా నున్న దో చూడుము. ఏమయిన నా కేమి లెక్క? యమ వరుణ కుబేర షణ్ముఖులును ప్రమథగణాధిపతులును నాకు తోడు పడగా అంతటి దానిని గూడ నాశము చేయుదును. పరబలముల నభిహతము చేయు ఏప్రదేశమున ఈ త్రిపురదుర్గమున్నదో అట్టి సముద్ర దేశము నకు పోవుదము పదండు-- భవుడగు శివుడు త్రైలోక్యమను రథమును ఆరోహించి తాను కడు సమర్థుడు గావున త్రిపుర దుర్గమును మరల ముట్టడించదలచి సముద్రముకడకు వచ్చును'.
అని ఇట్లు జరుగునని ఊహించి దైత్యులు లవణ సముద్రపు పైభాగమునందు దుర్గమును నిలుపుకొని యున్నారు. కనుక మీరు వారిని లెక్క పెట్టక దానవేంద్ర సహితముగా త్రిపుర దురమును శరవర్షములతో ముసల వజ్రాఘాతములతో ముట్టడి చేయుడు. నేనును నారథవరము నారోహించి సురేంద్రా! మీ వెనుకనే వచ్చు చుందును. అసురవరులను వధించుటకు ఉద్యమించిన వారికి ఏమేమి చేయవలయునో ఆ సహాయమంతయు చేయుదును.
ఇట్లు అనిన శివుని మాటల పేరణతో ఇంద్రుడు సన్నద్ధుడై త్రిపుర దుర్గమును నాశ మొందించు తలంపుతో కడు వికసించిన లోచన పద్మములతో ముందునకు సాగిపోయేను.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున హరి అమృతవాపీపానము చేయుట-త్రిపుర దానవులు సముద్రము ప్రవేశించుట.హరుడు అటకు పోవుట అను నూట ముప్పది యేదవ అధ్యాయము.
Summary of chapter 135 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the heartbroken lamentation of Rati over the ashes of her husband Kāmadeva, moving the forest creatures to tears. Meanwhile, Goddess Pārvatī experienced deep humiliation that her physical beauty had failed to win Mahādeva's heart. Realizing that divine love cannot be attained through physical charm or forceful desire, Goddess Pārvatī resolved to discard her royal ornaments and undertake supreme, grueling penance in the high Himalayas to win Mahādeva through pure spiritual devotion.