మత్స్య మహా పురాణము
245 - శ్రీ వామనమూర్తీ వచ్చినపుడు బలి శుక్రుల సంవాదము.
శౌనకః : సపర్వతవనా ముర్వీం దృష్ట్వా సజ్జోభితాం బలిః ।
పప్రచ్ఛోశ నసం శుద్ధం ప్రణిపత్య కృతాజ్జలిః॥
ఆచార్య క్షోభ మాయాతా సాద్రిద్వీపవనా మహీ ।
కస్మాచ్చ నాసురా న్బాగా బ్రతిగృహని వహ్నయః॥
ఇతి పృషోథ బలినా కావ్యో వేదవిదాం వరః ।
ఉవాచ దైత్యాధిపతిం చిరం ధ్యాత్వా మహామతిః॥
ఆవతీర్ఘ జగద్యోనిః కశ్యపస్య గృహే హరిః ।
కామనేనేహ రూ పేణ పరమాత్మా సనాతనః॥
స నూనం యజ్ఞ మాయాతి తవ దానవపుల్గవ ।
తత్పాదన్యాసవిక్షోభా దియం ప్రచలితా మహీ॥
కమ్ప నే గిరయశ్చామీ క్షుభితో మకరాలయః ।
నైనం భూతపతిం భూమి సమర్థ వోడు మీశ్వరమ్॥
సదేవాసురగన్ధర్వయక్షరాక్షసపుజువా ।
ఆనేనైవ భృతా భూమి రాపో॥॥॥గ్నిః పవనో నభః॥
ధారయ త్యఖిలా నీ మన్వాదీంశ్చ మహాసురాక్ ।
ఇయ మధ్య జగద్దెతో ర్మాయా కృష్ణస్య గహ్వరీ॥
ధార్యధారక భావేన యయా సమీడితం జగత్ ।
తత్సన్నిధానా దసరా భాగార్జా నాసురోత్తమ॥
భుజ్జతే నాసురా న్భాగా నమీ తేనైవ వహ్న యః ।
బలి: ధన్యోహం కృతపుణ్యశ్చ యన్మే యజ్ఞపతి స్వయమ్॥
యజ్ఞ మభ్యాగతో బ్రహ్మ న్మత్తః కోభ్యధిక పుమా ।
యం యోగిన స్సదోద్యుక్తాః పరమాత్మాన మవ్యయమ్॥
ద్రష్టు మిచ్ఛ ని దేవేశం సమేధ్వర ము వైష్యతి ।
హోతా భాగ ప్రదో యం చ యముద్దాతా చ గాయతి॥
త మధ్వరేశ్వరం విష్ణుం మత్తః కోన ఊపైష్యతి ।
సర్వేశ్వరేశ్వరే కృషే మదధ్వర ముపాగతే॥
యన్మయాచార్య కర్తవ్యం తన్మమాదేష్ట మర్హసి ।
పర్వతవన సహితయగు ఊర్వ సంక్షుభితమగుట చూచి బలి శుద్దుడగు శుక్రుని కృతాంజలియై నమస్కరించి “ఆచార్యా! పర్వత ద్వీపవన సహితయగు మహి కలత చెందుచున్నది; పహ్నులును ఆసుర భాగములను అందుకొనుటలేదు; ఏల?” అనెను; మహామతియు వేద విద్వరుడునగు కావ్యుడు శుక్రుడు చాల సేపు ధ్యానమందుండి దైత్యాధిపతియగు బలితో ఇట్లనెను; జగత్కారణుడు సనాతనుడు పరమాత్ముడునగు హరి ఇపుడు వామనరూపుడే కశ్యపునింట అవతరించినాడు; దానవపుంగవా! అతడిపుడు నీ యజ్ఞమునకు వచ్చుచున్నాడు కాబోలును; అతని పొదవ్యాస విక్షోభమున ఈ మహి ప్రచలిత మగుచున్నది; అద్రులు కంపించుచున్న వి; సముద్రములు కలగుచున్న వి; భూతపతియగు ఈ ఈశ్వరుని భూమి మోయ జాలకున్న ది? దేవాసుర యక్ష గంధర్వ రాక్షస సమేతయగు పృథివిని పృథివ్య పేజో వాయ్వాకాశములను ఆతడే మోయు చున్న వాడు; మన్వాదులను మహాసురులను నతడే వహించుచున్నాడు; జగత్కారణుడగు కృష్ణుని మాయ గంభీరయ్నది; ఆ మాయ ధార్యధార కభావముతో ఈ జగత్తును పీడించుచున్నది; అసురోత్తమా! అతని సంనిధియంద సురులు యజ్ఞ భాగార్హులు కారు; అందు చేతనే ఈ వహ్నులు అసుర హవిర్బాగములను గ్రహింపకున్న వి; ఆన విని బలి ఇట్లనెను: బ్రహ్మన్ ! నేను ధన్యుడను; కృతవుణ్యుడను; ఏలయన యజ్ఞపతియే స్వయముగా నా యజ్ఞమున కేతెంచినాడు. నాకంటే గొప్పవాడింకెవడు? ఏ అవ్యయుడు దేవేశుడునగు పరమాత్ముని దర్శింపగోరి యోగులు సదోద్యుక్తులై యుందురో అతడే నా యజ్ఞమునకు రానున్నాడు. యజ్ఞమున హోత ఎవనికి హవిర్భాగములిచ్చునో ఉద్గాత ఎవనినుద్దేశించి గానము చేయునో అట్టి ఆధ్వ రేశ్వరుడగు విష్ణుని నేను కాక మరెవ్వరు పొందును? ఇట్టి సర్వేశ్వరుడగు కృష్ణుడు నాయజ్ఞమునకు వచ్చిన ఈ సమయమున నేను ఏమి చేయవలయునో ఆదేశింప ప్రార్ధించుచున్నాను
శుక్రః : యజ్ఞ భాగభుజో దేవా వేదప్రామాణ్య తోసుర॥
త్వయా తు దానవా దైత్యా మఖభాగభుజః కృతాః ।
అయంచ దేవ స్సత్వస్థః కరోతి స్థితిపాలనమ్॥
విసృషే రను చా నేచ స్వయ మత్తి ప్రజాః ప్రభుః ।
త్వత్కృతే భవితా నూనం దేవో విష్ణు స్టీతో స్థితః॥
విదిత్వైత న్మహాభాగ కురు యత్న మనాగతమ్ ।
త్వయాహి దైత్యాధిపతే స్వల్ప కేఒపి హి వస్తుని॥
ప్రతిజ్జా న హి వోడవ్యా వాచ్యం సామ వృథాఫలమ్ ।
నాల దాతు మహం దేవ దైత్య వాచ్యం త్వయా వచః॥
మరుతాం వై విభూత్యర్థం ప్రవృత్త స్స మహాసుర ।
బలిః : బ్రహ్మ నథ మహం బ్రూయా మన్యేనాపి హి యాచితః॥
నా స్త్రీతి కీము దేవేన సంసారామౌఘహారీణా ।
వ్రతోపవానై ర్వివిధైః ప్రతిసజ్జాహ్యతే హరిః॥
స చే ద్వక్యతీ దేహీతి గోవిన్దః కి మతోధికమ్ ।
యదగ్గ ముపహారాద్యా దమశాచగుణాన్వితై ॥
యజ్ఞాః క్రియ నే దేవేశ స్స మాం దేహీతి వశ్యతి ।
తతాదు సుకృతం కర్మ తపస్సుచరితం తు నః॥
యన్మయా దత్త మీ కేశ స్వయ మాదాస్యతే హరిః ।
గురో నా స్త్రీత్యహం వచ్యే న తమాగత మీశ్వరమ్॥
వజ్చయే యది తం ప్రాప్తం వృథా మే జన్మనః ఫలమ్ ।
యజేస్మిన్యది యజేశో యాచతే మాం జనార్దనః॥
నిజమూర్ధాన మప్యత ప్రదాస్యా మ్య విచారితమ్ ।
నా స్త్రీతి యన్మయా నోక్త మన్యేషామపి యాచతామ్॥
వక్ష్యామి కథ మద్యైత న్న తదభ్యస్త మచ్యుతే ।
శ్లాఘ్య ఏవ సుధీరాణాం దానా దాపత్సమాగమ॥
నాబాధకారి యద్దానం తదణ్ణి బలవత్కథమ్ ।
మద్రాష్ట్రే నాసుఖీ కశ్చిన్న దరిద్రో న చాతురః॥
నాభూషితో న చోద్విగ్నో న స్రగాది వివర్జితః ।
హృష్టః పుష్ట స్సుగన్దిశ్చ తృప్త స్సర్వసుఖాన్వితః॥
జన స్సర్వో మహాభాగ కిముతాహం సదా సుఖీ ।
ఏతద్విసృష్టమాత్రం యద్దానబీజం మహాఫలమ్॥
బలి వచనములు విని శుక్రుడిట్లనెను: అసురా! వేద ప్రామాణ్యానుసారము యజ్ఞ భాగార్డులు దేవతలయియుండ నీవు దైత్యదానవులను యజ్ఞభాగ భోక్తలనుగా చేసితివి; ఈ దేవుడు. సత్వగుణాశ్రయుడై లోక స్థితి పాలనములను. చేయును. ఇది సృష్టికి తరువాత; ఆంతమందతడే ప్రజలను తినును; నీమూలమున నతడా విష్ణుదేవుడు స్థితియందు (లోక పొలన కృత్యమందు) ఉన్నాడు. మహాభాగా! ఇది ఎరిగి రానున్న దాని గూర్చి చేయవలసిన యత్నము చేయుము. దైత్యపతీ! అతడు నీకడకు వచ్చి నిన్నే అల్ప వస్తువడిగినను ఇత్తునని ప్రతిజ్ఞ చేయకుము. ఫలితము లేని సామ. (మృదు) వచనములు పలుకుము. నేను దానము చేయ శక్తుడను కాను. అనుము; ఏలయన మహాసురా! అతడు దేవతల యభ్యుదయమున ప్రవృత్తుడయియే ఇటకు వచ్చుచున్నాడు. ఆన విని బలి ఇట్లనెను: బహ్మన్! ఇతరులు యాచించినను. లేదని ఎట్లు చెప్పుదును; సంసార దోష రాశ్యపహారియగు హరి యాచించినపుడిం కెట్లు మాట అందును? హరి యనగా వివిధ. ములగు వ్రతోపవాసములతో ఆరాధింపబడి అనుగ్రహింపజేసికొనబడువాడు. నన్ను ఆట్టిగోవిందుడే దేహి' యనుచోనాకు అంత కంటే గొప్పదనమిం కేమియుండును? ఎవని నిమిత్తమయి దమశాచ గుణాన్వితులగు ఉపాసకులు ఉపహారాదీకమర్పింతురో యజ్ఞములాచరింతురో అట్టి దేవేశుడు నన్ను దేహియని యాచించనున్నాడు; ఇందువలన నేనింతవర కాచరించినది సుకృతమే యనియు సుతప సేయనియు నిశ్చయింపవచ్చును. ఏలయన నేనిచ్చు దానిని ఈశులకును ఈశుడగు హరి స్వయముగ గ్రహించనున్నాడు. గురోః స్వయముగా ఆ ఈశ్వరుడే రాగా నేను నా స్త్రీ అనను. తానై వచ్చిన హరిని నేను. వంచించుచో నా జన్మ ఫలము వ్యర్థమగును. ఈ యజ్ఞమునందు యక్షేశుడగు జనార్ధనుడే యాచించుచో ఇవుడు నాశిరము. నైన ఆవిచారితముగ ఇత్తును. ఇతరులు యాచకులుగా వచ్చినను నా స్త్రీ ఆనని నేను ఈనాడు అచ్యుతుని విషయమున అల వాటు లేని ఆ మాట ఎట్లు పలుకగలను? ధీరులకు దానము వలన ఆపదలు కలిగినను కొనియాడదగినదే. అయ్యా! బాధకారికాని దానము బలము కలది ఎట్లగును? నారాష్ట్రమునందు అసుఖ దరిద్రుడు ఆతురుడు (రోగి) అభూషితుడు. ఉద్విగ్నుడు పుష్పమాలాది రహితుడు ఎవడును లేడు. ప్రతియొకడును హరముతో పుష్టితో సుగంధానుభవములతో తృ ప్తితో నర్వసుఖములతో నున్నాడు. సదా సుఖవంతుడనగు నామాట చెప్పనేల? ఈ మహాపురుషునందీ దానము వదలి నంతనే యది మహాఫలదమగును. భృగు శార్దూలా! ఈ విషయమును నీయనుగ్రహము వలననే ఎరిగితిని.
విదితం భృగుశార్దూల మయేతత్ త్వత్ప్రసాదతః ।
ఏత ద్విజానతో దానబీజం పతతి చేద్గురో॥
జనార్దన మహాపాత్రే కిం న ప్రాప్తం తతో మయా ।
మత్ప్రదాన మవా ప్యైష యది పుష్ణాతి దేవతాః॥
ఉపభోగా ద్దశగుణం దానం శ్లాఘ్యతరం తతః ।
మతసాదపరో నూనం యజైనా రాధితో హరిః॥
తేనాభ్యోతి న సన్దేహో దర్శనా దుపకారకృత్ ।
అథ కో పేన విభ్యేతి దేవభాగోపరోధినమ్॥
మాం నిహంతుమనా శ్చైవ వధ శ్లాఘ్యతరచ్యుతాత్ ।
యన్మయం సర్వమేవేదం నాప్రాప్యం తస్య విద్యతే॥
స మాం యాచితు మభ్యేతి నానుగ్రహ మృతే హరిః ।
సృజత్యాతేచ్ఛయా సర్వం చేత సైవాపహని యః॥
స మాం హన్తుం హృషీ కేశః కథం స్వయము వైష్యతి ।
ఏతద్విదిత్వా న గురో దానవిఘ్నకరేణచ॥
త్వయా భావ్యం జగన్నాథే గోవిన్డే సముపస్థితే ।
శౌనకః : ఇత్యేవం వదత స్తస్య ప్రాప్త స్త్రీత్ర జగత్పతిః॥
సర్వదేవమయోచిస్త్యో మాయావామనరూపధృక్ ।
తం దృష్ట్వా యజ్ఞవాటా నః ప్రవిష్ట మసురాః ప్రభుమ్॥
జగ్ము స్సభాసదః క్షోభం తేజసా తస్య నిష్పభాః ।
జేపుశ్చ మునయ సత్ర యే సమేతా మహాధ్వరే॥
బలి శ్చైవాఖిలం జన్మ మేనే సఫల మాత్మనః ।
తత స్సష్ణోభమాపన్నో న కశ్చి త్కిఞ్చి దుక్తవా॥
ప్రత్యేకం దేవదేవేశం వూజయామాస చేతసా ।
ఆథాసురపతిం ప్రహ్వం దృష్ట్వా మునివరాంశ్చ తొజ్॥
దేవదేవపతి స్సాక్షా ద్విష్ణు ర్వమనరూపధృక్ ।
తుష్టాన యజ్ఞం వహ్నించ యజమాన మథ ర్విజః॥
యజ్ఞకర్మాధికారస్థా నదస్యా న్తవ్యసమ్పదః ।
తతః ప్రసన్నా స్త్వఖిలా వామనం ప్రతి తత్క్షణాత్॥
గురూ! ఇంత ఎరిగిన నా చేతి దానబీజము జనార్దనుడను మహాపా క్షే)త(పొలమందే పడినచో నాకిక లభించని దేముండును? ఈతడు "నావలన దానమందు కొని దానితో దేవతలకు పుష్టి కలిగించుచో ఈ హరి నాచే యజ్ఞ ద్వారమున నారా ధీతుడై నాయందనుగ్రహము చూపిన ప్లేయగును. ఈ విధముగ వినియుక్తమగు దాన ధనము దానిని నేననుభవించు నంతకంటే పది రెట్లు ఫలమునిచ్చినదగును. అట్టి దానము శ్లాఘనీయము. ఇదియే నిజమగుచో అతడు తన దర్శనము చేతనే నాకుపకారము చేయదలచి వచ్చుచున్నాడనుట నిశ్చయము. ఒకవేళ నేను దేవతల యజ్ఞభాగములను విరోధించు చున్నా నను కోపముతోనే నన్ను చంపవచ్చు చున్నా డా? అచ్యుతుని చేత నేను వధింపబడుటయు కొనియాడదగినదే కదా! ఈ విశ్వమంతయు యన్మయమో అట్టి హరికి లభించనిదేమున్నది? అయినను ఆతడు నన్ను యాచింపవచ్చుట నాయందలి అనుగ్రహము చేతనే కాని వేరు హేతువుచే కాదు. తన ఇచ్చాశక్తి బలముచే సర్వమును సృజించి తన చేత ముతోనే లయమందించు హృషీ కేశుడు న్వయముగా నన్ను చంపవచ్చుటకు హేతువు మరిం కేమయియుండునో? కావున నిది యెరిగి గురూ! జగన్నాథుడగు గోవిందుడు వచ్చినపుడు నీవు దానవిఘ్నకరుడవు కారాదు. అని అతడిట్లనుచుండగనే జగత్పతి సర్వదేవమయుడు అచింత్యుడునగు హరి వామనరూపధారియే యటకు వచ్చేను. యజ్ఞవాటమున ప్రవేశించిన యా ప్రభుని చూచి సభాసదులగు అసురులు అతని తేజము చే నిష్పభులై క్షోథమందిరి. ఆ మహాధ్వరమున కచట సమేతులయిన మునులు వేదముల పఠించిరి. బలి తన జన్మమంతయు నఫలమయ్యెననుకొనెను; ఆట ఏయొక్కడును కలతనందిన వాడే కాని మాటలాడిన వాడు లేకుండెను. ప్రతియొక్కడును ఆ దేవదేవేశుని తనమనమునందే పూజించెను. అంతట వినీతు డగు ఆ ఆసురపతిని ఆ మునివరులను చూచి సాక్షాత్ దేవదేవపతియు వామన రూపుడునగు విష్ణుడు ఆ యజ్ఞమును వహ్ని ని యజమానుని ఋత్విజులను (యజ్ఞ కర్మాధికారములందున్న సదస్యులను యజ్ఞార్థ ద్రవ్య సంపదలను ప్రశంసించెను. తత్తణమే ఎల్లరును వామనుని విషయమున ప్రసన్ను లయిరి. యజ్ఞవాటస్థితుడగు ఆ ధీరునుద్దేశించి సాధువాదములు చేసిరి.
బలికృతవామనపూజాది
యజ్ఞవాటస్థితం ధీరం సాధుసాధ్వి తుదై రయ ।
అర్ఘ్యమాదాయ చ బలిః ప్రోద్భూతపులక స్తథా॥
పూజయామాస గోవిన్దం ప్రాహ దేవం చ సోఒసురః ।
బలిః : సువర్ణరత్న సజ్జానాం గజానా మమితం తథా॥
శ్రియో వస్తాణ్యలజారాం స్తథా గ్రామాంశ్చ పుష్కలాక్ ।
సర్వాదిసక్కులా ముర్వీం త్వం గృహాణ యడేప్పితమ్॥
తద్దదామి వృణు ష్వేద మర్థయస్వ చ యత్ర్పియమ్ ।
ఇత్యుక్తి దైత్యపతినా ప్రీతిమానచ్యుత స్తతః॥
ప్రాహ సస్మితగమ్బీరం భగవా స్వామనాకృతిః ।
మమాగ్నిశరణార్థాయ దేహి రాజన్న దత్రయమ్॥
సువర్ణ గ్రామరత్నాది తదర్థిభ్యః ప్రదీయతామ్ ।
బలిః : త్రిభిః ప్రయోజనం కిం తే పదైః పదవతాం వర॥
శతం శతసహస్రంవా పదానాం మార్గ తాం భవాక్ ।
వామనః : ధర్మబుద్ధ్యా దైత్యపతే కృతకృత్యోస్మి తావత్యా॥
అన్యేషా మర్థినాం విత్త మిచ్ఛతాం దాస్యతే భవాః ।
శౌనక: : ఏతచ్చుత్వా తు గదితం వామనస్య మహాత్మనః॥
దదౌ తస్మై మహాబాహు ర్వమనాయ పదత్రయమ్ ।
పాణౌ తు పతితే తోయే వామనోభూ దవామనః॥
సర్వదేవమయం రూపం దర్శయామాస తత్క్షణణాత్ ।
ఆనందముచే పులకించి బలి అర్ఘ్యము చేబూని గోవిందుని పూజించి ఆ దేవునితో ఇట్లనెను: సువర్ణ మో రత్న సంఘములో గజములో వస్త్రములో అలంకార ములో గ్రామములో సర్వ పర్వతాది సహిత పృథివియో పుష్కలముగ యథే పితముగ గ్రహించుము. నీకు ప్రియమగునది కోరుకొనుము. ఇది కావలయునని యాచించుము. ఇత్తును. అని దైత్య పతియన అచ్యుతుడు ప్రీతినంది వామనాకృతియగు ఆ భగవానుడు చిరునవ్వుతో గంభీరముగ ఇట్లనెను: రాజా!నాకు అగ్ని శాలకుగా మూడడుగులిమ్ము; సువర్ణ గ్రామ రత్నా దికమును అది కోరువారికిమ్ము. అనగా బలి పురుషోత్తమాః మూడడుగులతో అగునదేమీ? నూరడుగులో వేయి యడుగులో అడుగుము. ఆన వామనుడు 'దైత్యపతీ! ఆ మాత్రపు ధర్మబుద్ధితోనే కృతకృత్యుడను. నీవు ధనార్డులగు ఇతరులకు అది ఇత్తువు కాని.' అన విని మహాబాహుడా బలి మహాత్ము డగు వామనునకు పదతయమిచ్చెను. దాన జలము తన చేతియందు పడగానే వామనుడు ఆవామనుడయ్యెను. అతడు తత్తణమే సర్వదేవమయరూవమును చూ పెను.
శ్రీవామనేన సర్వదేవమయ స్వరూపప్రదర్శనం.
చంద్రదసూర్యౌ చ నయనే ద్యౌ ర్మూర్గా చరణౌ క్షితి॥
పాదాజ్జ్గుళ్యః పిశాచాశ్చ హస్తాజుళ్యస్తు గుహ్య కాః ।
విశ్వే దేవాశ్చ జానుస్థా జట్టే సాధ్యా స్సురోత్తమాః॥
యక్ష నఖేషు సమ్భూతా రేఖాభ్యోఒప్సరస స్తథా ।
దృష్టా ఋణ్య శేషాణి కేశా స్సూర్యాంశవః ప్రభో॥
తారకా రోమకూపాణి రోమాజ్యోషధయ స్తథా ।
బాహవో విదిశ సత్ర దిశ శ్నోతే మహాత్మనః॥
ఆశ్వినౌ శ్రవణే తస్య నాసా వాయు రహాత్మనః ।
ప్రసాద శ్చనమా దేవో మనో ధర్మం సమాశ్రితః॥
సత్యం తస్యాభవ ద్వాణీ జిహ్వాదేవీ సరస్వతీ ।
గ్రీవాఒదితి ర్దేవమాతా విద్యా స్త ద్బలయ స్తథా॥
స్వర్గద్వార మభూ నైత్రం త్వష్టా పూషా చ తద్రువో ।
ముఖే వైశ్వానర శ్చాస్య వృషణా తు ప్రజాపతి॥
హృదయం చ పరం బ్రహ్మ పుంస్త్వం వై కశ్యపో మునిః ।
పృషేచ వసవో దేవా మరుత స్సర్వసన్దిషు॥
సర్వసూల్తాని దశ నా జ్యోతీంషి విమలాః ప్రభాః ।
వషిస్ధలే మహాదేవో హృది చాస్య మహార్ణవాః॥
ఉదరే చాస్య గన్గర్వాః సమ్భూతాశ్చ మహాబలాః ।
లక్ష్మీ ర్మేధా ధృతిః కా స్త్రీ స్సర్వా విద్యాశ్చ వై కటౌ॥
సర్వజ్యోతీంషి జానీహి తస్య తత్పరమం మహః ।
తస్య దేవాదిదేవస్య తేజః ప్రోద్భూత ముత్తమమ్॥
స్తనౌ కుక్షీ చ వేదాశ్చ ఉదరే చ మహామఖాః ।
ఇష్టయః పశుబ స్థాశ్చ ద్విజానాం చేష్టితానిచ॥
చంద్ర సూర్యులు నేత్రములు - ద్యులోకము శిరము --క్షితి-చరణములు పిశాచులు పాదాంగుళులు గుహ్యకులు హస్తాంగుళులు విశ్వదేవులు జానువులు సురోత్తములగు సాధ్యులు జంఘాలు యక్షులు నఖములు రేఖలు అప్సరసలు ఆ శేష జ్యోతిర్గోళములు దృష్టులు సూర్యాంశువులు కేశములు తారకలు రోమ కూపములు ఓషధులు రోమము విదిశలు బాహువులు దిశలు చేవులు ఆశ్వినులు శ్రవణము (ఆఇంద్రియతత్వము) వాయువు నాసిక ప్రసాద రూపుడగు చంద్రదేవుడు మనస్సు జీహం దేవమాతయగు అదితి గీవ-విద్యలు ముడుతలు సరద్వారము గుదము తంషయు పూషయు కనుబొమలు వైశ్వానరుడు ముఖము ప్రజాపతివృషణములు పరబ్రహ్మము హ్మదయము కశ్యపముని పుం స్వము వసువులు కృష్ణము మరుతులు సర్వసంధులు సర్వసూక్తములు దంతములు జ్యోతిస్సులు విమలకాంతులు మహాదేవుడు వక్షము మహాసముద్రములు హృదయము గంధర్వులు ఉదరము లక్ష్మీ మేధాధృతి కాంతులును నర్వవిద్యలును కటిదేళము నర్వజ్యోతిః కాంతులును అతని పర మహతేజస్సు వేదములు స్తనములును కుక్షియు మహామఖములు ఇష్టులు పశుబంధ ములు ద్విజులు ఆచరించు కర్మానుష్ఠానములును ఉదరము ఆ మహాత్మునక య్యెను.
తస్య దేవమయం రూపం దృష్ట్వా విష్ణో ర్మహాబలాః ।
ఉపాసర్ప న దై తేయాః పతజ్గా ఇవ పావకమ్॥
ప్రమథ్య సర్వా నసురా న్పాదహ స్తతలై ర్విభుః ।
కృత్వా రూపం మహా కాయం జహారాశు స మేదినీమ్॥
తస్య విక్రమతో భూమిం చన్దాదిత్యా స్తనా న్తరే ।
నభో విక్రమమాణస్య సళ్లీ దేశే స్థితా వు॥
పరం విక్రమమాణస్య జానుమూలే ప్రభాకరౌ ।
విష్ణో రాస్తాం మహీపాల దేవపాలనకర్మణి॥
జిత్వా లోకత్రయం కృత్స్నం హత్వా చాసుర పుజ్గావాక ।
పురనరాయ త్రైలోక్యం దదౌ విష్ణు రురుక్రమః॥
త్రివిక్రమనియోగాద్బలేః పాతాళ గమనమ్.
సుతలం నామ పాతాళ మధస్తా ద్వసుధాతలాత్ ।
బలే ఫత్తం భగవతా విష్ణునా ప్రభవిష్ణునా॥
అథ దై త్యేశ్వరం ప్రాహ విష్ణుః సర్వేశ్వరేశ్వరః ।
య త్వయా సలిలం దత్తం గృహీతం పాణినా మయా॥
అల్పప్రమాణం తస్మా త్తే భవిష్య త్యాయు రుత్తమమ్ ।
వైవస్వతే తథాతీతే బలే మన్వన్తరే తథా॥
సావర్ణి కే తు సమ్పా ప్లే భవా నినో భవిష్యతి ।
సామృతం దేవరాజాయ త్రైలోక్య మఖిలం మయా॥
దత్తం చతుర్యుగానాం చ సాధికా హ్యేకసప్తతిః ।
నియ న్తవ్యా మయా సర్వే యే తస్య పరివర్ణినః॥
తేనాహం పరయా భక్త్యా పూర్వ మారాధితో బలే ।
సుతలం నామ పాతాళం త్వ మాసాద్య మనోరమమ్॥
వసాసుర మమాదేశం యథావ త్పరిపాలయ ।
మహాబలులగు దైత్యులును ఆ విష్ణుని సర్వదేవమయ రూపము చూచినంతనే మిడుతలు ఆగ్ని నీవలే ఆ దేవుని సమీపించిరి; ఆ విభుడంతట హ స్తపాద తలములతో పాదతలములతో అసురుల నెల్లరను నలుగగొట్టి మహాకాయ రూపము దాల్చి శీఘ్రమే భూమినెల్ల హరించెను; అతడు భూమిని దాటి విక్రమించుచుండ మొదట చంద్రాదిత్యులు అతని స్తనములనడుమ ఇమిడిరి; అంతరిక్షమును దాటి విక్ర మీంచుచుండ వారే తొడలకడకు వచ్చిరి; అంతకుమించి ద్యులోక మునుక్రమ్మి విక్ర మించుచుండగా వారే జానుమూలమునకు సరిపోయిర్; మహీపాలా! విష్ణుడు చేసిన దేవరక్షాకార్యమున నిట్లు జరిగెను; ఉరుక్రముడు (విస్తృత పాదవిన్యాసములు కల) విష్ణుడు లోకత్రయమును నిః శేషముగ జయించి అసుర పుంగవుల వధించి ఇంద్రునకు త్రైలోక్యమునిచ్చెను; ప్రభవిష్ణుడగు విష్ణు భగవానుడు వసుధాతలా ధోభాగమందలి సుతల మనెడు పొతొశాంశమును బలికిచ్చి ఆ సర్వేశ్వరేశ్వరుడా దైత్యేశ్వరునితో నిట్లనెను: నీచే దత్తమయిన సలిలమును నేను నాపాణితో గ్రహించిన దాని ఫలముగా నీకు కల్పప్రమాణముగల ఉ త్తమాయువగును; వైవస్వత మన్వంతరా నంతరము సావర్ణికమన్వంతరమున నీవింద్రుడవగుదువు; నేనిపుడఖిలతైలోక్యమును దేవరాజునకిచ్చితినిగదా! ఇక డెబ్బదియొక చతుర్యుగముల వరకు నేనతని శత్రువులను నా ఆదుపులోనుంతును; ఏలయన పూర్వమతడు పరమభక్తితో నన్నా రాధించియుండెను: నీవంతవరకు నేను నీకిచ్చిన మనోరమమగు సుతల రామక పాతాళము ననే నా యాదేశము నేమాత్రమును తప్పక పాలించుచు నటవసింపుము.
తత్ర దివ్యాజ్గనో పేతే ప్రాసాదశ తజ్కులే॥
ప్రోత్బుల్లపద్మసరసి సర చ్చుభ్రసరిద్వరే ।
సుగందిధూపస్రగ్వస్త్రచామరాదివిభూషితే॥
ప్రక్చననాదిముదితే గేయనృత్యమనోరమే ।
పానాన్న భోగ్యా వివిధా న్బుజ్ఞాన స్వం మహాసుర॥
మమాజ్ఞయా కాల మముం తిష్ఠ స్త్రీశతసంవృతః ।
యావత్సురైశ్చ వికైశ్చ న విరోధం కరిష్యసి॥
తావరేతా న్మహాభోగా నవాప్స్యసి మహాసుర ।
యదా దేవవిప్రాణాం విరోధం త్వం కరిష్యసి॥
వధిష్య ని తదా పాశా వారుణా స్వా మసంశ యమ్ ।
ఏత ద్విదిత్వా వచనం మయాజ్ఞప్తం వి శేషతః॥
న విరోధ స్సురైః కార్యో వి హైర్వా దైత్యసత్తమ ।
ఇత్యేవ ముక్తో దేవేన విష్ణునా ప్రభవిష్ణునా॥
బలిః ప్రాహ మహారాజ ప్రణిపత్య ముదాన్వితః ।
బలిః: తత్రాసతో మే పాతా శే భగవన్ భవదాజ్ఞయా॥
కిం భవిష్య త్యుపాదాన ముపభోగోపపాదకమ్ ।
దివ్యాంగనాయుతమును ప్రాసాద శత సంకులమును ప్రవికసిత పద్మ సరోయుతమును ప్రవహమాణ నిర్మల నదీయుతమును సుగంధయుత ధూమ పుష్పమాలా వస్త్ర చామరాది విభూషితమును పుష్పమాలాచందనాదులచే సంతోష ప్రదమును గాన నృత్యములతో మనోరమమును నగు ఆ సుతలమునందు మహానురా! నీవు వివిధాన్న పొనాది భోగము అనుభవించుచు స్త్రీ శతపరివృతుడవయి నేను ఇపుడు - చెప్పిన ఈ కాలమంతయు ముగియువరకుండుము; దేవ బ్రాహ్మణు లతో విరోధము పూననంతవరకు నివీ భోగముల ననుభవింతువు; నీవది పనిననాడు నిశ్చయముగ వారుణ పాశములు నిన్ను వధించును; కావున ఇది ఎరిగి దైత్యనత్తమా! నాయాజ్ఞానుసారము ఈ పొర బాటు చేయకుండు ము; దేవ దేవుడును ప్రభ విష్ణుడునగు విష్ణువిట్లు పలుక విని బలి మోదముతో నమస్కరించి యతనితో నిట్లనెను: భగవన్! నీ యాజ్ఞతోనే పాతాళమున వసించునప్పుడు నాకు ఈ భోగములను సంపన్న మొనరించు ఉపాదానము (మూలసాధనము) ఏది? ఆన విష్ణువి విధముగా పలికెను.
*విష్ణుః : దానాని యానీ దత్తాని శ్రద్దయా శ్రోత్రియేషు చ॥
హుతాని శ్రద్దయా యాని తాని దాస్యంతి తే ఫలమ్ ।
సదక్షిణా స్తథా యజ్ఞక్రియాశ్చ వివిధాః కృతాః॥
ఫలాని తవ దాస్య స్తి ఆధీతాని వ్రతానిచ ।
శౌనకః : బలేర్వర మిమం దత్వా శక్రస్య త్రిదివం తథా॥
పామనేనైవ రూ పేణ జగామాదర్శనం హరిః ।
శ శాస చ యథా పూర్వ మిన్హ లోక్య మూర్జితమ్॥
సి షేవే చ వరా నామా న్బలిః పాతాళ మాస్థితః ।
ఇ హైవ దేవదేవేన బద్ధో సౌ దానవోత్తమః॥
దేవానాం కార్యకరణే భూయోఽపి జగతి స్థితిః ।
సమ్బనీ తే మహాభాగ ద్వార కాయాం వ్యవస్థితః॥
దానవానాం వినాశాయ భూభారోత్తారణాయచ ।
జాతో యదుకులే కృష్ణో భవత శ్శత్రునిగ్ర హే॥
సహాయభూత సారథ్యం కరిష్యతి బలానుజః ।
ఏతత్సర్వం సమాఖ్యాతం వామనస్య చ ధీమతః॥
అవతారం మహావీర శ్రోతు మిచ్చో స్తవార్జున ।
అర్జునః : శ్రుతవా నిహ తే పృష్టం మాహాత్మ్యం కేశవస్య చ॥
గజ్గాద్వార మితో యాస్యా మ్యనుజ్ఞాం దేహి మే విభో ।
ఏవ ముక్త్వా య పార్టో నైమిశం శౌనకో గతః॥
సూతః : ఇత్యేత దేవదేవస్య విష్ణో ర్మాహాత్మ్య ముత్తమమ్ ।
వామనస్య పరే ద్యస్తు సర్వపాపైః ప్రముచ్యతే॥
బలిప్రహ్లాదసంవాదం మ క్రొతం బలిశుభ్రయోః ।
బలే ర్విష్ణోశ్చ కథితం య స్స్మరిష్యతి మానవః॥
నాధయో వ్యాధయ స్తస్య న చ మోహాకులం మనః ।
భవిష్యతి కురు, శేష్ణ మనుజస్య కథంచన ॥
చ్యుతరాజ్యో నిజం రాజ్య మిష్టప్రాప్తింవియోగవాక్ ।
ఆవాప్నోతి మహాభాగ నర శ్శ్రుత్వా కథా మిమామ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే శౌనకార్జునసంవాదే శ్రీవామనచరిత్రే బలేః పాతాళ నియమనం నామపంచచత్వారింశదుత్తర ద్విశతతమోఽధ్యాయః॥
(*దానాన్యవిధిదత్తాని శ్రాద్ధాన్యశ్రోత్రియాణిచ ।
హుతాన్యశ్రద్ధయా యాని తాని దాస్యంతి తే ఫలం.
అదక్షిణా స్తథాయజ్ఞాః క్రియాశ్చావిధినాకృతాః।
ఫలానితవదాస్యంతి అధీతాన్యవ్రతానిచ.)
నీవిదివరకు శ్రద్ధతో శ్రోత్రియులయందిచ్చిన దానములును అగ్ని యందు చేసిన హోమములును ఆచరించిన నదక్షిణాక వివిధ యజ్ఞములును ఆధ్యయనములును వేదవ్రతములును నీకాఫలమును అందజేయుచుండును; అని బలికి ఈ వరమునిచ్చి త్రిదివ రాజ్యమునీంద్రునకిచ్చి హరి మరల వామన రూపము నంది యనంతరము ఆదృశ్యుడయ్యెను; ఇంద్రుడు యథాపూర్వముగ పుష్టి సంపన్న త్రైలోక్య రాజ్యము నేలేను; బలియు పాతాళ మాశ్రయించి ఉత్తమ కామముల ననుభవిం చెను; ఆ దానవోత్తముడటనే ఆ దేవదేవునిచే బద్దుడె మరల దేవకార్యము నిర్వహింపనై ఈ జగమునందే వేచి యున్నాడు. మహాభాగా! అర్జునా! ఆ కృష్ణుడే ఇపుడు నీసంబంధి(బావమరదియే దానవ వినాశమును భూభారోత్తారణమును చేయబూని యదుకులమున జనించి ద్వారకయందున్నాడు; ఇక ముందు నీళత్రులను నిగ్రహించుటకై ఆ బలానుజుడే నీకు సహాయ భూతుడై సారథ్యము చేయును; మహావీరా! అర్జునా! వినగోరిన నీకు ఇట్లు ధీమంతుడగు వామనుని యవతార వృత్తాంతమంతయు తెలిపితిని. అనిన శౌనకునితో అర్జునుడిట్లనెను: విభూ! నేనడిగిన కేశవమాహాత్మ్యము ఇది నీచే వింటిని; ఇచటినుండి గంగాద్వారమునకు పోవుదును; అనుజ్ఞను ఇమ్ము; అని ముని యనుజ్ఞగోరి యర్జునుడేగెను: శౌనకుడును నే మీ శారణ్యమునకు పోయెను; ఇట్టి ఈ దేవదేవుడగు వామనరూపి విష్ణును త్తమ మాహాత్మ్యమును వినువారు సర్వపాపముక్తు లగుదురు; బలి ప్రహ్లాద బలి శుక్ర బలి విష్ణు సంవాదములను స్మరించు మానవుడు ఆధివ్యాధిమనోహములనందడు; రాజ్యభ్రష్టుడు రాజ్యమును ఇష్టజనవియుక్తుడు వారితోడి పొందును ఈ కథా శ్రవణఫలముగా నందగలడు.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున శ్రీ వామన చరిత్రమున విష్ణుడు బలిని పాతాళమున నియమించుట యనురెండు వందల నలువదియైదవ యధ్యాయము.
Summary of chapter 245 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes King Bali welcoming the radiant dwarf Brāhmaṇa with deep reverence, washing His holy feet, and offering to grant any gift of land, gold, cows, or kingdoms. Bhagavān Vāmana modestly requested merely three paces of land measured by His small feet for performing fire sacrifices. Despite warnings from his guru Śukrāchārya, who recognized the visitor as Bhagavān Vishṇu Himself, King Bali steadfastly stood by his solemn vow of charity, pouring sanctified water to seal the divine gift.