130 - దానవులచే బాధితులగు దేవతలు మహేశుని స్తుతించుట 

సూతః : సుశీ లేషు ప్రదుష్టేషు దానవేషు దురాత్మసు

 లో కేషూత్పాట్య మానేషు తపోధనవనేమచ

 సింహనాదేన దైత్యానాం భయభీతేషు జన్తుషు

త్రైలో క్యే థియసమ్మూ డే తమోనత్వ ముపాగతే

 ఆదిత్యా వసవ సాధ్యాః పితరో మరుతాం గణాః

 భీతాశ్చ శరణం జగ్ము రహ్మాణం ప్రపితామహమ్

 బ్రహ్మదర్శనార్థం ఆదిత్యాదిదేవతానాం సత్య లోకగమనమ్

లేతు స్వర్ణామ్బుజాసీనం దదృశు స్సముపొగతా 

 తే తమూచుశ్చ సహితాః ప్రణమ్య ప్రపితామహమ్

 దేవాః: వర దృప్త స్తవైతే చ దానవా స్త్రీపురాలయా

 బాధ న్తస్మా న్య భాదేవ పేష్యాన్వే స్వామినోనఘ

 చరామః పృథివీం నర్వాం మృగా స్సింహభయా దివ

దానవానాం భయా తద్వ దమామః ప్రపితామహ

 పుత్రాణాం నామధేయాని కళత్రాణ్యమరాధివ

 దానవై రామ్యమాణానాం విస్మృతానీహ నోఒనఘ

 దేవవేశ్మప్రభబ్దాశ్చ ఆశ్రమభంశ నానిచ

 దానవై ర్లోభ మోహాన్డే క్రియ నే పాపబుద్ధిభిః

 యది న త్రాయ సే లోకాక దానవేభ్యశ్ఛ విద్రుతాక్

పేక్ష్యస్యకాలే నిర్దేవం నిర్మానుష మిదం జగత్

 ఇత్యేవం త్రిదశైరుక్తః పద్మయోనిః పితామహః

 ప్రత్యాహ త్రిదశా స్స్తేందా నిస్తుతుల్యాననప్రభాక్

 దానవానాం వినాశాయ తథా మతిమతాంవరాః

 తస్మా ద్ద్వారశ్చ సమ్పావో యః పురోక్తో మయాఒమరాః

 తచ్చ తేషా మధిష్టానం త్రిపురే త్రిదశర్షధాః

 ఏకేషపాత మో క్షేణ హ న్తవ్యం తత్పురం యతః

 భవతాంచ న పశ్యామీ ఏకమ ప్యమరర్షభాః

యస్తు చైక ప్రహారేణ పురం హన్యా త్సదానవమ్

 త్రిపురా ణ్యాత్మవీర్యేణ శక్తం హర్తుం శ రేణతు

ఏకం ముక్త్వా మహేశానం మహాదేవం జగత్పతిమ్ 

ఆంతవరకును సుశీలురుగా నుండిన త్రిపుర దుర్గ స్థులగు దైత్యులు దానవులు ఇట్లు దుష్టులును దురాత్ములు నయిరి. వారు లోకములను నాశము చేయసాగిరి. తపోధనుల తపోవనములను పెకలింపసాగిరి. దైత్యుల సింహనాద ముతో ప్రాణులు భయభీతములు కాసాగేను. త్రైలోక్యమును భయముతో సమ్మోహిత మే చీకటిలో కన్నులు ఈనబడ నట్లయ్యెను. అంతట ఆదిత్యులు వసువులు సాధ్యులు పితరులు మరుద్గణములు భీతులయి లోక ప్రపితామహుడగు బ్రహ్మను శరణు వేడ బోయిరి. వారు సువర్ణ కమల పీఠమున ఆసీనుడయి యున్న ప్రపితామహుని సమీపించి దర్శించి అందరు నొక్కటిగ నమస్కరించి ఇట్లు పలికిరి: దేవా! నీ వరములచే దర్పించి ఈ త్రిపుర దుర్గావాసులగు దానవులు ప్రభువులు తమ సేవకులను బాధించినట్లు మమ్ముల బాధించుచున్నారు. వారి భయమున మేము సింహములకు భయపడు మృగముల వలే పృథివి యందంతట తిరుగుచున్నాము. వారి భయముతో తిరుగు మాకు మా పత్నీ పుత్తుల పేరులు కూడ ఆ పిలో లేకుండ పోయినవి. లోభమోహాంధులు పాపబుద్ధులు నయి వారు దేవాలయములను దేవతా భవనములను ఆ శమములను నాశము చేయుచున్నారు. దానవుల ఉపద్రవముల నుండి నీవు మమ్ము కాపొడనిచో త్వరలోనే జగమున దేవతలు కాని మానవులు కాని ఒక్క డును లేక పోవుట నీవే చూడగలవు.

ఇట్లు పలికిన చంద్రుని వంటి ముఖ కాంతులుగల దేవతల వచనములు విని పద్మ భపుడగు బ్రహ్మ వారితో ఇట్లనెను: దేవతలారా! మీరును గొప్ప బుద్ధిమంతులు కదా! ఆలోచింపుడు. నేను వారితో వరప్రదాన సమయమున పలికి నట్లు వారి సొశమునకు ద్వార భూత మగు సమయము దగ్గరకు వచ్చినది. కాని నే ననినట్లు వారి తిపుర దుర్గ మును. ఒకే బాణముతో కొట్టగలవారు పరమేశ్వరుడు తప్ప మీలో నొక ్కరును నున్నట్లు నాకు కనబడుట లేదు. జగత్పతియు మ హే శ్వరుడు మహాదేవుడు నగు శివునకు తప్ప ఇతరులకు ఈ త్రిపుర దుర్గమును ఒకే బాణముతో ఒకే మారు ఆత్మ వీర్యముతో పడగొట్టుట శక్యమా?

 తే యూయం యది మన్యధ్వం క్రతు విధ్వంసకం హరమ్

యాచామ స్సహితా దేవం త్రిపురం స హనిష్యతి

 కృతః పురాణాం విషమ్భో యోజనానాం శతం శతమ్

యథా చైకప్రహారేణ హన్యా దేవం మయం న తు

 పుష్య యోగేన యుక్తాని క్షణమేక స్థితానితు

 పురాణ్యేకప్రహా రేణ ధక్ష్యతీతి త్రిలోచనః

తతో దేవేశ్వరః ప్రోక్తో యాస్యామ ఇతి దుఃఖిత్రే 

 పితామహ స్సురై స్సార్గం భవసంపద మాగతః

 ఈశ్వరదర్శనార్థం బ్రహ్మాదిదేవతానాం కైలాసగమనమ్

తే భవం భూతభవేశం జగత్సంహారకం(గిరిశంశూలపాణినం) ప్రభుమ్

 పశ్యన్త స్మోమయా సార్గం నల్గినాచ మహాత్మనా

 అగ్ని వర్ణమయం దేవ మగ్నిపుడ్డానిభేక్షణమ్

 అగ్న్యాదిత్యసహసాభ మగ్నివర్ణ విభూషణమ్

 చన్గావయవల్మణం చన్దసౌమ్యతరాననమ్

 ఆగమ్యం త మజం దేవం మదనారిం త్రిలోచనమ్ 

బ్రహ్మాదిదేవకృతమహాదేవస్తుతి

 సర్వేషాం సర్వదం శమ్బుం గోపతిం పార్వతీపతిమ్

దేవాః : నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ

 పశూనాం పతయే నిత్య ము గ్రాయచ కపర్దినే

 మహాదేవాయ భీమాయ త్ర్యమ్బకాయ విశామ్పత్యే

 ఈశ్వరాయ భగఘ్నాయ నమ స్వనకఘాతినే

 నీలగ్రీవాయ భీమాయ వేధసే వేధసాం పత్యే

కుమారశత్రువిఘ్నాయ కుమార జననాయచ

 విలోహితాయ భూమాయ ధరాయ కథనాయచ

 నిత్యం నీలశిఖజ్ఞాయ శూలినే దివ్యశాయినే

ఉరగాయ సునేత్రాయ హిరణ్యవసు రేతసే

 అచిన్త్యా యామ్బికాభ గ్రే సర్వదేవస్తుతాయ చ

 వృషధ్వజాయ చణ్ణాయ(ముణ్డాయా) జటినే బ్రహ్మచారిణే

 తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయచ

 విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ట తే

 నమోస్తు దివ్య సేవ్యాయ ప్రభవే సర్వసమ్పదామ్

 ఆభిగమ్యాయ కామ్యాయ సవ్యాపారాయ(స్తుత్యాయార్యాయే) సర్వదా

 భక్తానుక మినే తుభ్యం దిశ తే జన్మనో గతిమ్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే త్రిపురోఖ్యానే దేవకృత మహేశ్వర స్తవాది కథనం నామ త్రింశదుత్తర శతత మోధ్యాయః

కనుక మీరందరు సరే ఆనినచో మనమందరమును పోయి క్రతు విధ్వంసియగు హరుని వేడుకొందము. అతడు త్రిపుర దుర్గ మును నశింపజేయును. ఆ మయుడు త్రిపురములను తను ఒకే ప్రహారముతో కొట్టుట శక్యము కాకుండునట్లు ఒక్కొక్క పురపు విష్కంభముగాని ఒక పుర మునకు మరియొక పుర ముసకు అంతరము కాని నూరేసి యోజనములుండునట్లు వానిని నిర్మించినాడు. వాడు మౌనినీ పుష్యయోగమున నిర్మించెను. త్రిలోచనుడగు శిపుడే నచో ఒకే బాణమును పుష్యయోగమునందే అన్నిటి నొకేమారు క్షణమున దహించగలడు. (విష్కంభము = నడిమి కొలత)

దైత్యభయ దుఃఖితులగు దేవతలును “అట్లే పోదము' అనగా బ్రహ్మయు వారితో కలిసి శివుని కొలువునకు పోయెను. వార చట శివుని దర్శించిరి. ఆదేవుడు భూతభవ్వేశుడు; జగత్సంహారకర్త; ఉమతో నందితో కూడి అగ్ని వర్ణమయ దేహముతో అగ్ని రాశీ సమాననందునములతో ఆగ్ని వర్ణ విభూషణములతో వేలకొలది అగ్నులవలె సూర్యులవలె ప్రకాశీ చు చు చంద్రుని అవయవ లక్షణములు చంద్రునివలె సౌమ్యమగు ముఖము కలిగియుండెను. అతడు అగమ్యుడు ఆజుడు ప్రకాశ మానుడు మదన శత్రువు త్రినేత్రుడు ఎల్లరకు ఎల్ల కోరికల తీర్చువాడు సుఖకరుడు సర్వలోక పతి పార్వతీపతి.

ఇట్టి శివుని దర్శించి దేవత లా దేపు నిట్లు స్తుతించిరి. ఇది మాతృకా సంఖ్యతో ఏకపంచాశ నామాత్మక మగు సో తము భక్తులకు శుభకరుడు పాపులకు హింసకుడు బాధల తొలగించువాడు వర ములొసగువాడు జీపుల కధిపతి భయంకరుడు జ జైరాగటధారి ముహాదేవుడు దుషులకు భయంకరుడు తినే తుడుచఛాధిపతి ఈశ్వరుడు భగుడ సు ఆదిత్యుని కొట్టినవాడు అంధకుని చంపినవాడు నీలకంఠుడు సూర్యాగులచే కూడ భయముతో పనులు చేయించు వాడు లోకకర్తలకును క ర్తలకును అధిపతి కుమారస్వామికి శత్రువులగు వారి నశింపజేయువాడు కుమారస్వామికి తండ్రి వి శేషముగా జటాజూటమున ఎర్రనివాడు దూమ్రవర్ణుడు లోకముల ధరించువాడు పాపుల నరకుపొడు నీల కేశుడు శూలధారి దివ్య శయనుడు ఉరగభూషణుడు సునేతుడు హిరణ్యము వసువు రేతస్సుగాగల అగ్ని స్వరూపుడు ఆచింత్యుడు అంబికా భర్త సర్వదేవస్తుతుడు వృషభధ్వజుడు దుష్టుల విషయమున కోపి జటాధారి బ్రహ్మచారి జలములందుండి తపమాచరించు చుండువాడు బ్రహ్మత త్వవేత్త ఆజితుడు విశ్వ స్వరూపుడు విశ్వసష్ట విశ్వమందావరించియుండువాడు దివ్యుల సేవలందు కొనువాడు సర్వసంపదలకు ప్రభువు ఆశయింపదగినవాడు కోరికలు వేడదగిసవాడు ఎల్లపుడు పనిలో మునిగియుండు వాడు భక్తాను కంపి జన్మమునకు తగిన ఉత్తమగతి నిచ్చువాడునగు దేవా నీకు నమస్కారము.

ఇందు దేవతాకృత శివస్తుతి మాతృకా (ఏకపంచాశత్) సంఖ్యాకముగానున్నది. ఇందలి మూల భూత భావనను ఇట్లు ఊహించవచ్చును : వాజ్మయమంతయు ఏకపం చాశ న్మాతృకా (వర్ణసమామ్నాయ మయము. అ-నుండి ఆ వరకు పదునారు; క-నుండి-మ-వరకు ఇరువదియైదు; య-ర-ల-వ-శ-ష-స హళ --పది; మొ త్తము ఏబదియొకటి. కావుననే శబ్దబ్రహ్మరూపయగు శ్రీదేవిని మాతృకారూపనుగా ఉపాసింతురు. కావున ఇట్లు మాతృకా సంఖ్యాక నామములతో స్తుతించుట సమస్త వాజ్మయముతో స్తుతిం టయు శబ్ద రూపయగు పర మేశ్వరికిని పరమేశ్వరునకును అర్థ (సమస్త జగద్) రూపుడగు ఆభేదమును భావనచేసి సకల బ్రహ్మతత్వమునుపాసించుటయునగును. ఇది సాధకులకు సకలార్థ సాధకము.

ఆ నామావళి ఈ విధముగ నున్నది :

ఓం భవాయనమః                వేధసాం పతయే                         వృషధ్వజాయ

శర్వాయ                            కుమారశతురినిఘ్నాయ                చండాయ

రుద్రాయ                            కుమార జననాయ                        జటినే

వరదాయ                           విలో హితాయ                             బ్రహ్మ చారిణే

పశూనాంపతయే                 ధూమాయ                             సలిలే తప్యమానాయ

ఉగ్రాయ                             ధరాయ                                       బ్రహ్మణ్యాయ

కపర్దినే                              కథనాయ                                      అజితాయ

మహాదేవాయ                     సిలశిఖండాయ                              విశ్వాత్మనే

భీమాయ                          శూలీనే                                          విశ్వసృజే

త్యంబకాయ                      ద్యీ శాయినే                           విశ్వం ఆపృత్య తిష్ఠతే

 విశాంపతయే                   ఉరగాయ                                   దివ్య సేవ్యాయ

ఈశ్వరాయ                       సునే తాయ                           సర్వసంపదాం ప్రభవే

భగమ్నాయ                      హిరణ్యరేతసే                                 అబీగమ్యాయ

ఆంధకఘాతినే                   వసు రేతసే                                   కామ్యా య

నీలగ్రీవాయ                      అచింత్యాయ                         సర్వదా సహ్యాచారాయ

భీమాయ                         అంబికాభ ర్త్రే                                భక్తానుకంపినే

వేధసే                          సర్వదేవస్తుతాయ          జన్మనః-గతిం-దిశ తే తుభ్యం నమః.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున బ్రహ్మాది దేవతలు మహేశుని

స్తుతించుటయను నూట ముప్పదియవ అధ్యాయము.