95 - ఫలత్యాగ (పండ్లను తినక మానేడు) వ్రతము

నన్దికేశ్వరః : తథా సర్వఫలత్యాగమాహాత్మ్యం శృణు నారద

 య దక్షయం పరం లో కే సర్వకామఫలప్రదమ్

 మార్గశీర్షే శుభే మా సే తృతీయాయాం మునే వ్రతమ్

ద్వాదశ్యామథవాఋష్టమ్యాం చతుర్ధశ్యా మథాపి వా

 ఆరభే చ్ఛుక్లపక్షస్య కృత్వా బ్రాహ్మణవాచనమ్

 అన్యేష్వపిచ మా సేషు పుణ్యేషు మునిసత్తమ

 సదక్షిణం పాయ సేన భక్తితః పూజయే ద్ద్విజాక్

 అష్టాదశానాం ధాన్యానా మన్యచ్చ ఫలమూలకమ్

 వర్జయే దేకవర్షంతు వినే పౌషధ కారణమ్

 సవృషం కాంచనం రుద్రం ధర్మరాజంచ కారయేత్

 కూశ్మాణం మాతులుజ్ఞంచ వార్తాకం పనసం తథా

 ఆమ్రతకకపిత్థాని కలిజ మథ వారుకమ్

 శ్రీఫలాశ్వత్థబదరం జమ్బీరం కదళీఫలమ్

కాశ్మరం దాడిమం శక్త్యా కలధౌతాని షోడశ

మూలకామలకం జమ్బూతి స్త్రీణి కరమర్ధకమ్

తక్కోలై లాక జమ్బీర శరీర కుటజం శమీ

 ఉదుమ్బరం నాళి కేరం ద్రాక్షాథ బృహతీద్వయమ్

రౌప్యాని కారయే ద్బక్త్యా ఫలానీమాని షోడశ

 తామం తాళ ఫలం కుర్యా దగ స్తిఫలమేవచ

 పిజ్జేత కాశ్మర్యఫలం తథా సూర ణకన్టకమ్

రక్తాలుకాకస్థకంచ కేత కామ్లాక చిద్బటమ్

 చితవల్లీఫలం తద్వ తూటశాల్మలికాఫలమ్

 యామ్య నిష్పావ మధుక వటేజ్గుద పటోలకమ్

 తామ్రని షోడశైతాని కారయే చ్ఛక్తితో నరః 

నందికేశ్వరుడు నారదునకు ఇంకను ఇట్లు చెప్పెను. నారదా! ఇట్టిదేయగు సర్వఫలత్యాగ వ్రత మాహాత్మ్య మును వినుము. ఇది ఇహపర లోకములందు ఆక్షయమును.సర్వకామ ఫలప్రదమును శుభమునగునది. మార్గశీర్ష మానము నందు కాని పుణ్యములగు ఇతర మాసములలో వేనియందుకాని శుక్లపక్షమున తదియ. అష్టమి-ద్వాదశి, చతుర్దశి-వీనిలో నేడైన తిథినాడు బ్రాహ్మణులచే స్వస్తివాచనము జరిపించి ఈవ్రతము నారంభించవలేను. ఆనాడు బ్రాహ్మణులకు పాయస సహితముగా భోజనము పెట్టించి దక్షిణనీయవలెను. ఔషధ (ఆరోగ్య) కారణము లేకుండగనే సంవత్సరము పాటు పదునెనిమిది విధములగు ధాన్యములు తప్ప మిగిలిన ఫలములు (కూరగాయలు కూడ) దుంపలు వేళ్ళు ఏవియు తినక వదలవలయును.

పిమ్మట (వ్రత పూర్తికే) బంగారుతో ఎద్దును రుద్రుని ధర్మరాజును చేయించవలయును. బూడిద గుమ్మడి కాయ మాదీఫలము పందిలివంగ కాయ పనస మామిడిపండ్లు ఆమాతపు ఫలము (అంబాళము.దీని రసము మామిడిపండు రసమువలె నుండును. అని నిఘంటువు) వెలగపండు కళింగము అనేడు (విష్ణు ప్రీతికరమగు) పండు ఖర్బూజా దోస పండు మారేడుపండు రావికాయ రేగుపండు నిమ్మపండు అరటిపండు గుమ్ముడు దుంప దానిమ్మపండు ఇవి , పదునారును తన శ క్తికి తగినట్లు బంగారుతో చేయించవలెను. ముల్లంగి ఉసిరిగ నేరేడు చింత కాయ కలివిపండు తకోల ఫలము ఏలకికాయ నిమ్మపండు వెదురు మొలక కోడి నెకాయ జమ్మి కాయ మేడి కాయ టెంకాయ ద్రాక్షపండు చిన్న పందిలి వంగకాయ వాకుడుకాయ ఈ పదునారును వెండితో చేయించవలేను. తాటిపండు అవిసికాయ పొగడపండు కపిల ద్రాక్ష పండు కందదుంప చిలగడదుంప మొగలిపూవు (కాయ) చిద్భటము (ఒక కాయ) మంజిష్ఠ (తీగకు కాచిన) కాయ కొండ బూరుగుకాయ గంధపు కాయ బొబ్బర కాయ ఇప్పకాయ మర్రికాయ గార కాయ పొట్లకాయ-ఇవి పదునారును రాగితో చేయించవలేను.

ఉదకుమ్బద్వయం కృత్వా ధన్యోపరి సవస్త్రకమ్

 తతశ్చ కారయే చ్చయ్యాం శయ్యోపరి సవాససమ్

 తామ్ర పాత్రద్వయో పేతం యమరుద్రవృషాన్వితమ్

 ధన్వా సహైవ శాంతాయ విప్రాయాథ కుటుమ్బినే

సపత్నీ కాయ సమ్పూజ్య పుణ్యే హ్ని వినివేదయేత్

 యథా ఫలేషు సర్వేషు వస న్యమరకోటయః

 తథా సర్వఫలత్యాగవతా ద్భక్తి శ్శివేస్తు మే

యథా శివశ్చ ధర్మశ్చ సదాన స్తఫలప్రదౌ

 తత్యు క్తఫలదానేన తో స్యాతాం ఫలదౌ సదా

 యథా ఫలాననస్తాని శివభకేషు సర్వదా

 తథాన స్తఫలావాప్తి రస్తు మే జన్మజన్మని

 యథా భేదం నపశ్యామి శివవిష్ణ్వర్కపద్మజాక్

 తథా మమా స్తు విశ్వాత్మా శ జ్కర శ్మజ్కర స్సదా

ఇతి దత్వాతు తత్సర్వ మలజృత్యవిభూషణే

శక్తశ్చే చ్ఛయనం దద్యా త్సర్వోపసరసంయుతమ్

 అశ క్షస్తు ఫలాన్యేవ యథోక్తాని విధానతః

 తథోదకుమ్భసంయుక్తం శివధర్మో సకా ఇ్చనౌ

విస్రాయ దత్వా భుత వాద్యతః ఫలవర్జితమ్

 అన్యానపి యథాశక్త్యా భోజయే ద్విజపుజపాక్

ఏత ద్బాగవతానాంచ శైవవైష్ణపయోగినామ్

శుభం సర్వఫలత్యాగవతం వేదవిదో విదుః

 నారీభిశ్చ యథాశక్త్యా కర్తవ్యం మునిపుజవ

ఏతస్మా న్న పరం కించి దిహలో కే పరత్రచ

 వ్రతమ స్తి ముని శ్రేష్ఠ యదన స్తఫలప్రదమ్

సువర్ణ రూప్య తామేషు యావనః పరమాణవః

భవ ని పూజ్యమానేషు ఫలేషు మునిసత్తమ

 తావద్యుగ సహస్రాణి రుద్రలో కే మహీయతే

ఏతత్సమ సకలుషాపహరం నరాణాం సజ్జీవనాయ మనుజేషుచ సర్వదా స్యాత్

 జన్మా నరేష్వపి న పుత్త్రవియోగదుఃఖ మాప్నోతి ధామచ పురస్గర దేవజుష్టమ్

 యోవా శృణోతి పురుషోఒల్పధని పతేద్వా దేవాలయేషు భవనేష్వపి ధార్మి కాణామ్

 పావై ర్విముక్తవపు రత్ర పదం మురారే రానన్గకృత్పద ము ప్రతి శివస్య సోఒపి

ఇతి శ్రీమ్స్యమహాపురాణే ఫలత్యాగవ్రతమాహాత్మ్యకథనం నామ

పఞ్చనవతిత మోధ్యాయః

రెండు నీటి పాత్రలు చేయించవలెను. వీటిని ధాన్యము పై పరచిన నూతన వస్త్రము పై ఉంచవలెను. మంచము. దాని పైకి పర పులు మొదలగునవియు దుప్పటియు రెండు రాగిపాత్రలు (పళ్లెరములు) యమ రుద్ర వృషభముల ప్రతిమలు ధేను ప్రతిమ ఇవి అన్నియు శాంతుడు కుటుంబి సపత్నీ కుడు అగు బ్రాహ్మణునకు శుభ దినమున అతనిని దంపతులను) పూజించి ఈయవలెను.

సర్వఫలముల యందును దేవతలు అందరును నివసింతురు. కావున ఈ సర్వఫల త్యాగ వ్రత మాహాత్మ్యమున నాకు శివునియందు భక్తి సిద్ధించుగాక ! శివుడును ధర్మదేవుడును సదా అనంత ఫలప్రదులు. కావున వారి (ప్రతిమల)తో కూడ చేసెడి ఫలదానము వలన వారును అనంత ఫలప్రదులగుదురుగాక ! శివ భక్తులయందు (వలన) సదా అనంతఫల ములు నిలిచి (కలుగుచు) ఉండును. కావున నాకును జన్మజు స్మమునందును అనంత ఫలసిద్ధి యగుగాక! శివునికి - విష్ణు రవి బ్రహ్మలకు నడుమ నేను భేదమును భావన చేయను. కావున విశ్వాత్ముడగు శంకరుడు సదా నాకు శంకరు (శుభము కలిగించు వా) డగుగాక!” అను ఆర్థమునిచ్చు మంత్రముతో వారిని అలంకరించి ఆ విప్ర దంపతులకు ఇవి అన్నియు దానమీయవలెను. శక్తి ఉన్న చో సర్వోపస్కరములతో కూడ మంచమును ఈయవలెను. శ క్తిలేనిచో ఈ చెప్పిన ఫలము లను మాత్రము యథా విధానముగ ఈయవలెను. ఉద కుంభములను రెంటినీ శివుని ధర్ముని ప్రతిమలను తప్పక ఈడు వలేను. పిమ్మట ఆ బ్రాహ్మణుని శ క్తియున్న చో ఇంకను చాలమంది బ్రాహ్మణులను కూడ. భుజింపజేసి తానును పండ్లు ఏవియు లేకుండ భుజించవలెను.

వేదతత్వ వేత్తలును ప్రశంసిం చేడు ఈ సర్వఫల త్యాగ వ్రతము శివ విష్ణు భక్తులగు వారికిని - యోగులకును స్త్రీలకును గూడ క రవ్యము. ఇహపరముల రెంటియందును అనంతఫలముల నీయగల వ్రతము దీనిని మించినది మరియొకటి లేదు. ఈ వ్రతమున పూజింపబడు ఫల ప్రతిమల కుపయోగించిన సువర్ణ రజత తామములందు ఎన్ని పర మాణువులు కలవో అన్ని వేల యుగములపాటు రుద్ర లోకమునందు ఈ వ్రతక ర పూజితుడయి సుఖించును.

ఈ వ్రతము దాని నాచరించిన నరుల సమస్త కలుషములను హరించును. ఇహలోకమున సంజీవనమయి సర్వదా సుఖింపజేయును. జన్మాంతరముల యందును అట్టి వారికి పుత్తవియోగ దుఃఖము కలుగదు; ఇంద్రాది దేవత లనుభవించెడి స్వర్గ సుఖములు లభించును.

దీని నాచరించుటకు శక్తి లేనివారు పుణ్యకరమగు ఈ వ్రత విధానమును ధార్మికులెవరైన దేవాలయములందో భవనములందో చెప్పుచుండగ వినినను తామే చదివినను పాప విముక్తులై ఇహలోకమున సుఖించి పరమున విష్ణు స్థానమును పిమ్మట ఆనందప్రదమగు శివ స్థానమును పొందుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలత్యాగ వ్రత మాహాత్మ్య కథనమను తొంబదియైదవ అధ్యాయము.