52 - కర్మయోగము 

ఋషయః : ఇదానీం ప్రాహ య ద్విష్ణుః పృష్టః పరమ ముత్తమమ్

 త్వ మిదానీం సమాచక్వ ధర్మాధర్మస్య విస్తరమ్

 ఏవ మేకార్ణవే తస్మి న్మత్స్యరూపీ జనార్దనః

 విస్తార మాదిసర్గస్య ప్రతిసర్గ స్య చాఖిలమ్

 కథయామాస విశ్వాత్మా మనవే సూర్యసూనవే

 కర్మయోగం చ సాజ్యం చ యథావ ద్విస్తరాన్వితమ్

 శ్రోతు మిచ్చామ హే సూత కర్మయోగస్య లక్షణమ్

 యస్మా దవిదితం లో కే న కిక్చో తవ సువ్రత

 సూతః : కర్మయోగం ప్రవక్ష్యామి యథావ చ్ఛుతిభాషితమ్

జ్ఞానయోగ సహస్ర ద్ధి కర్మయోగః ప్రశస్యతే

 కర్మయోగోద్భవం జ్ఞానం తస్మాత్త త్పరమం పదమ్

కర్మ జ్ఞానోద్భవం బ్రహ్మ న చ జ్ఞాన మకర్మణః

 తస్మా త్కర్మణి యుక్తాత్మా తత్వ మాప్నోతి శాశ్వతమ్

 వేదోఖిలో ధర్మమూల మాచార శ్చైవ తద్విదామ్

 అష్టా వాత్మగుణా స్తస్మి ప్రధానత్వేన సంస్థితాః

దయా సర్వేషు భూతేషు క్షా ని రప్యాతురస్య తు

 అనసూయా తథా లో కే శాచ మన్త ర్బహి ర్ద్విజాః

అనాయాసస్తు కాయేషు మజ్జల్యాచార సేవనమ్

ఈ తథా ద్రవ్యే ష్వకార్పణ్య మర్డే షూపార్జితేషు చ

 తథాస్పృహా పరద్ర వ్యే పరస్త్రీషు చ సర్వదా

 అష్టా వాత్మగుణాః ప్రోక్తాః పురాణస్య తు కోవిదై

 అయ మేవ క్రియాయోగో జ్ఞానయోగస్య సాధకః

 కర్మయోగం వినా జ్ఞానం కస్యచి స్నేహ దృశ్యతే

 శ్రుతిస్మృత్యుదితం ధర్మ ముపతిష్ఠే త్ప్రయత్నతః

ఋషులు సూతు నిట్లడిగిరి: “మనువు ప్రశ్నించగా మత్స్యరూప విష్ణువు అతనికి తెలిపిన పర మో త్తమమగు ధర్మాధర్మ విస్తరమును తెలుపుము. ఈ చెప్పిన విధమున ఏకార్ణవమయిన జలమునం దుండిన మత్స్యరూప జనార్దనుడు. సూర్యపుత్రుడగు మనువునకు మొదట ఆదిపర్తము ప్రతిసర్గము మొదలగునదంతయు -అనగా వంశ మన్వంతర-వంశాను. చరితములను కూడ తెలిపియుండెను. అతడు వాటితోపాటు కర్మయోగమును సొంఖ్య యోగ) మును ఉన్న దియున్నట్లు సవి నర ముగ చెప్పియుండెను. అని విందుము. (వానిలో సర్త ప్రతిసర్గ వంశమన్వంతర వంశాను చరితములను నీవలన వింటిమి.), ఇక ఇప్పుడు కర్మయోగ లక్షణమును వినగోరెదము. ఏలయన నీవు సువతుడవు. (యథావిధిగ గురు శుశ్రూష చేసి అన్ని విషయముల నెరిగినవాడవు.) లోకమునందు. నీకు తెలియనిది ఏ కొంచెమును లేదు.”

 సూతు డిట్లు చెప్పనారంభించెను: శ్రుతులయందు చెప్పబడిన విధమున మీకు కర్మయోగమును తెలిపేదను. (అది తెలిసికొనవలసినదే.). ఏలయన వేయి - జ్ఞానయోగములకంటెను కర్మయోగము మేలయినది. కర్మయోగము. ననుష్ఠించుట వలననే జ్ఞానము కలుగును. జ్ఞానమువలన పరమపదము -పరమాత్మ తత్వము లభించును. కనుక కర్మము వలనను జ్ఞానము వలనను బ్రహ్మము లభించును. కర్మాచరణము లేనివానికి జ్ఞానము లభించదు. కావున కర్మయోగము,నాశ్రయించినవాడు శాశ్వత తత్వమును పొందును. వేదము అంతయును దాని తత్వమును ఎరిగినవారి ఆచరణమును ధర్మమునకు (ధర్మ కర్మల ననుష్ఠించుటకు) మూలము. ఆ ఆచారమునందును ఎనిమిది ఆత్మగుణములు ప్రధానములు. సర్వ భూతములయందు దయ.ఎన్ని బాధలయందును ఓర్పు లోకము విషయమున అసూయ (దోషారోపబుద్ది) లేకుండుట-దేహమునను చిత్తమునను పవిత్రత -అక్కరలేని శ్రమ పడకుండుట శ రీరమున శుభలక్షణమును వేషమును కలిగియుండుట లేని ద్రవ్యముల విషయమున కాని సంపాదించిన ద్రవ్యముల విషయమున కానీ పిసిని గోట్టుతనము లేకుండుట. పర ద్రవ్యములందును పర స్త్రీల విషయమునందును కోరిక లేకుండుట (దయ -శాంతి-అనసూయ-శౌచము అనాయాసము-మంగళ్యాచార సేవనము -అకార్పణ్యము. అస్పృహ) అనునవి ఈ ఎనిమిది గుణములు. ఇట్టి నడువడియే క్రియా యోగము - ఇది జ్ఞాన సాధకము . ఇది లేనిచో అది లేదు. ప్రయత్న పూర్వకముగా ప్రతియొక రును శ్రుతి స్మృతి ప్రోక్తమగు కర్మల నాచరించుచుండవలయును.

దేవతానాం పితృణాం చ మసుష్యాణాం చ సర్వదా

*కుర్యా దహరహ ర్యజ్ఞై ర్దేవర్షిగణతర్పణమ్

 స్వాధ్యాయే నార్చయే(నార్చనౌనీ) దృషీక్ హోమై ర్దేవా న్యథావిధి

 పితృ స్ర్ఛద్దే దద న్న గ్నౌ భూతాని బలిక ర్మణా

పక్షాతే విహితా యః పజ్చసూనోఒపను తయే

ఖణ్డినీ పేషిణీ చుల్లీ జలకుమ్బీ ప్రమార్జనీ

 పజ్చ సూనా గృహస్థస్య తేన స్వర్గం న గచ్చతి

 తత్పాపనాశనాయాలం పజ్చ యజ్ఞాః ప్రకీర్తితాః

 ద్వివింశతి తథా చాప్టో యే సంస్కారాః ప్రకీర్తితాః

 త ద్యుకోపి న మోక్షాయ య స్త్వాత్మగుణవర్జితః

 తస్మా దాత్మగుణో పేత శ్రుతికర్మ సమాచరేత్

 గోబ్రాహ్మణానాం విత్తేన సర్వధా భద్రమాచరేత్

 గోభూహిరణ్యవాసోభి ర్ధనమాల్యాది కేన చ

పూజయే ద్ర్బహ్మ విష్ణ రరుద్రవస్వాత్మకం శివమ్

 వ్రతోపవాసై ర్విధివ చ్ఛద్దయాచ విమత్సరః

 యోసా వతీస్దాయ శాస్త్ర సూక్ష్మీ వ్యక్త సనాతనః

వాసుదేవో జగత్సూతి స్తస్య సమ్భూతయో హ్యమ్

బ్రహ్మా విష్ణుశ్చ భగవా న్మార్తాళో వృషవాహనః

 అష్టాచ వసవ సద్వ దేకాదశ గణాధిపాః

*ద్వాద శైవ తథాఒదిత్యాః పితరో మాతర స్తథా

 ఇమా విభూతయః ప్రోక్తా శ్చరాచర సమన్వితాః

బ్రహ్మాద్యా శ్చతురో మూల మవ్యక్తాధిపతే స్మృతాః

 బ్రహ్మణా చాథ సూర్యేణ విష్ణునాథ శివేన వా

 అభేదా త్పూజితేన స్యా త్పూజితం సచరాచరమ్

 బ్రహ్మాదీనాం పరం ధామ త్రయాణా మపి సంస్థితమ్

 దేవమూర్తి రతః పూషా పూజనీయః ప్రయత్నతః

తస్మా దగ్ని ద్విజముఖం కృత్వా సమ్పూజయే దిమాక్

దానై ర్ర్వతోపవా సైశ్చ జపహోమాదినా నరః

 ఇతి క్రియాయోగపరాయణస్య వేదాన్తశాస్త్రస్మృతివత్సలస్య

వికర్మభీతస్య సదా న కిషో దప్రాప్య మ స్త్రీహ పరే చ లో కే

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే కర్మయోగకథనం నామ

ద్వీపఞ్చాశోధ్యాయః

(*కుర్యాదహరహర్యజ్ఞైర్భూతర్షి)

(*లోకపాలా గ్రహశ్చెవ)

గృహస్థునకు ఇంటి పనులలో ప్రాణి హింసకు కారణములై పాపము కలిగించునవి ఐదు; అవి: కత్తిపీట తిరుగలి పొయ్యి-నీటికడవ-చీపురు అనునవి; వీనిని పోగొట్టుకొనుటకై అతడు హోమములచే దేవ యజ్ఞము శ్రాద్ధములచే పితృయజ్ఞము వేదాధ్యయనము చే ఋషియజ్ఞము అన్న దానముచే మనుష్యయజ్ఞము భూతములకు బలి (నూకలు మొద లగునవి) వేసి భూత యజ్ఞము అను పంచయజ్ఞములను దేవర్షి పితృ తర్పణములను చేయవలెను. ముప్పది సంస్కారములు పొందినవాని కై నను ఈ చెప్పిన ఆత్మ గుణములు లేనిచో మోక్షమురాదు. తనకున్న ధనముతో గో బ్రాహ్మణులకు శుభము కలిగించవలెను. గోవులు భూమీ ఊరణ్యము వస్త్రములు గంధమాల్యములు మొదలగుపోనితో బ్రాహ్మణులను పూజిం: వలెను. బ్రహ్మ విష్ణు భాస్కరరుద్ర వసురూపుడగు శివుని పరమాత్మను యథావిధిగా శ్రద్దాపూర్వకముగా మత్సరము లేకుండ మరియొకరితో పోటీపడక) వ్రతములు ఉపవాసములు మొదలగునవి ఆచరించుచు అర్చించుచు ఉండవలెను. అతీంద్రియుడు శాంతుడు సూక్ష్ముడు అవ్యక్తుడు సనాతనుడు జగజ్జన్మకారణుడు నగు వాసుదేవుని నుండి రూపొందిన తత్వములే బ్రహ్మవిష్ణు శివ రవి వసుగణ రుద్ర గణాదిత్య గణములు సప్త పితృ గణములు సప్త మాతృక లును చరాచరములగు సర్వ భూతములును, అవ్యక్త తత్వమగు పర మేశ్వరుడు అధిపతిగాగల ఈ విశ్వమునకు బ్రహ్మ విష్ణు శివ సూర్యులు వేళ్ళవంటివారు. కనుక వారిని పరస్పరము అభిన్ను లనుగాను వారిని పరమేశ్వరునితో అభిన్నులను గాను ఆరాధించినచో చరాచర విశ్వమును ఆరాధించుట' యగును. బ్రహ్మాది మూ ర్తిత్రయమును రవియందు రూపొంది యున్నోరు. కనుక ప్రయత్నముతో విధి విధానమున రవి నుపాసించవలయును. అగ్ని ముఖ ద్విజముఖములు చేసి (అగ్నియందు ఔపాసనము కాని దేవ సన్నీ ధిలో దీపము వెలిగించుటకాని చేసి బ్రాహ్మణుని పూజించి ఆతని నోటితో వేదమంతములు చెప్పించుచు) దాన వతోపాసన జప హోమాదులతో వీరి నారాధించవలెమ.

ఇట్లు క్రియాయోగ పరాయణు డై వేదాంత శాస్త్రమునందును స్మృతి విధానములందును ఆసక్తి కలిగియుండు వానికి ఇహపర లోకములందు పొంద రాని దేదియు" లేదు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున కర్మయోగమను ఏబది రెండవ యధ్యాయము.