216 - రాజధర్మాః- రాజ్ఞో యుక్త దేశావస్థానమ్ - రాజు ఉండవలసిన స్థానము - (రాజధానీ స్థాన వివేచనము) - దుర్గ వ్యవస్థ - దుర్గము ఉండవలసిన స్థానము.

మత్స్యః : రాజా సహాయసంయుక్తః ప్రభూతయవ సేన్దనమ్

రమ్య మానత సామ ర్గం మధ్యమం దేశ మావ సేత్

వైశ్యశూద్ర జనప్రాయ మనాహార్యం తథా పరైః

కిఞ్చి ద్భ్రాహ్మణసం యుక్తం బహుకర్మకరం తథా

అదైవమాతృకం రమ్య మనురక్త జనాన్వితమ్

కరై (ర) రాపీడితం చాపి బహుపుష్పఫలం తథా

ఆగమ్యం పరచకాణా మారాధ్యం సహసోఒపది

సమదుఃఖ సుఖం రాజై సతతం ప్రియ మాస్థితమ్

సరీసృప విహీనం చ వ్యాఘ్రతస్కర వర్జితమ్

ఏవం విధం యథాలాభం రాజా విషయ మావ సేత్

మత్స్య నారాయణుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: రాజు తన రాజధానిగా ఏర్పరచుకొని దుర్గము నిర్మించవలసిన చోటున తనకు సహాయులు అందుబాటులో నుండవలయును; ఆదిగడ్డి కట్టెలు సమృద్ధిగా దొరకు చోటు కావ లెను; సామంతులందరు ఆడ కువతోనుండి తన కడకు వచ్చి సేవింప వీలుగా దేశ మధ్యము కావలెను; వైశ్య శూద్ర జనులధికముగా నుండి ఆవశ్యకమయినచో ఇతరులును ఉండుటకు నువగునదియే బ్రాహ్మణులు కొలది మంది యుండి కర్మ కరులు (ఆయా పనులవారు) ఆధికముగా నుండుచోటు కావలెను; పంటల విషయమున దేవమాతృక ము (మెట) కారాదు; నదీమాతృకము (మాగాణి) కావలెను; రమ్యమై అను రక్తులగు జనులతో కూడి యుండవలెను; ఆచటిజనులకు పన్ను లపీడ అధిక ముగా నుండరాదు; పుష్పఫలో పేతమై శత్రు సేనలకు అగమ్యమై ఆపదలు (శత్రు భయాదికము) వచ్చినపుడు శీఘ్రమే ఆశ్రయించి రక్షించు కోన ననుకూలమై సుఖ దుఃఖములు సమానముగా కలిగి (ఈ రెంటిలో ఏవియు అధికముగా లేక) సతతము ప్రీతిదాయకమయి నరీ సృపములు (సర్పాదులు) ర్యాఘములు తస్కరులు లేక యుండవలెను; ఈ ఆనుకూల్య ములలోలభించినన్ని ఉన్న చోటిని రోజు తన నివాసమునకే ఎన్ని కచేసి కొనవలెను; (విషయము = ఆశ్రయము).

దుర్గనిర్మాణక్రమః - దుర్గ నిర్మాణక్రమము

తత్ర దుర్గం నృపః కుర్యా త్షణ్ణా మేక తమం బుధః

ధన్వదుర్గం మహీదుర్గం నర(నడ) దుర్గం తథైవచ

వార్ణం చై పొమ్బుదుర్గంచ గిరిదుర్గంచ పార్థివః

సర్వేషామేవ దుర్గాణాం గిరిదుర్గం ప్రశస్యతే

దుర్గంచ పరిజ్లో పేతం వప్రాబ్దాలక సం యుతమ్

శతఘ్నీ యనముఖ్యైశ్చ శతశశ్చ సమావృతమ్

గోపురం సక వాటంచ తత్ర స్యా త్సుమనోహరమ్

సపతాకం గజారూడో యేన రాజా విశే త్పురమ్

చతస్రశ్చ తథా తత్ర కార్యా స్వాయతవీథయః

ఏకస్మిం స్తత్ర వీథ్య గ్రే దేవవేశ్మ భవే దృడమ్

వీథ్య గ్రేచ ద్వితీయేచ రాజ వేశ్మ విధీయతే

ధర్మాధికరణం కార్యం వీథ్య గ్రేచ తృతీయ కే

చతుర్థచే వ వీథ్యగ్రే గోపురంతు విధీయతే

ఆయతం చతురశ్రం వృత్తంవా కారయే త్పురమ్

ముక్తిహీనం త్రికోణంచ యవమధ్యం తథైవచ

అర్ధచంద్రప్రకారంచ వజ్రాకారంచ కారయేత్

అర్ధచంద్రం ప్రశంసంతి నదీతీ రేషు తద్వశాః

అన్యత్తత్ర న కుర్వీత ప్రయత్నేన విజానతా

ఇట్టి ప్రదేశమునందు రాజు *ధన్వదుర్గము మహీదుర్గము *నర దుర్గము వృక్ష దుర్గము జలదుర్గము గిరిదుర్గము, ఆను ఆరు విధములగు దుర్గములలో ఏదో ఒక విధమగు దానిని నిర్మించవలెను; వీనిలో ఆరవది చాల మేలు; దుర్గమునకు

చుట్టును గడ్డయు ప్రాకారమును బురుజులును శతఘ్నులు మొదలగు వందల కొల దిగ యంత్రములు తలుపులుగల మనోహరమగు పుర ద్వారము (గోపురము ) దాని పై జెండా కలిగి రా జేనుగు పె దానినుండి ప్రవేశింప దగినంతగా ఉండ వలేను; దుర్గపు లోపల నాలుగు పొడవగు వీథులు వానిలో మొదటి వీథి చివర దృఢ దేవాలయము రెండవ దాని చివర రాజ భవనము మూడవ దాని చివర ధర్మాధికరణ స్థానము నాలుగవ దాని చివర గోపురము (పుర ద్వారము) ఉండ వలేను; పురము ఆయతము (దీర్ఘ చతురస్రము) చతురస్రము వృత్తము త్రికోణము యవమధ్యము దీర్ఘ వృత్తము) ఆర్ధ చంద్రము వజ్రము (అష్టాగ్రము అష్టభుజాకృతి). ఈ ఆకృతులలో దేనిలో నైన ఉండవచ్చును; ఇన్ని టిలోను రాజాజ్ఞ (రాజ పురుషాజ్ఞ లేనిదే జనుల రాకపోకలకవకాశము లేకుండవలెను; నదీ తీరములందు కట్టు దుర్గము అర్ధ చంద్రాకృతిలోనే యుండుట ప్రళ స్తమని శాస్త్రజ్ఞులందురు; (దుర్గముల ఆకృతులు 923 పుటలో పటములో చూడుడు.)

(*ధన్వము అనగా ఎడారి; ఎడారిలో ఐదుయోజనముల భుజముతో ఏర్పడు చతురసమునకు నడుమ కట్టినకోట.)

(* ఇది బహుశ : ‘నడ’ (జమ్ము గడ్డితో నిండిన విశాల ప్రదేశమునందుండు) దుర్గము; ‘నడ’ క్రమముగా 'నర' అని పాఠము మారి యుండును.)

రాజ్ఞా కోశగృహం కార్యం దక్షిణే రాజ వేశ్మనః

తస్యాపి దక్షిణే భాగే గజస్థానం విధీయతే

గజానాం ప్రాజ్ముఖీ శాలా కర్తవ్యా వాప్యుదజ్ముఖి

ఆగ్నే యేచ తథా భాగే ఆయుధాగార మిష్యతే

మహానసం చ ధర్మజ్ఞ కర్మశాలా స్తథాపరాః

గృహం పురోధసః కార్యం వామతో రాజవేశ్మనః

మ క్రొవేదవిదాం చైవ చికిత్సాకర్తు రేవచ

తతైవ చ తథా భాగే కోష్ఠగారం విధీయతే

గవాం స్థానం తథ్లె వాత్ర తుర గాణాం తథైవచ

ఉత్తరాభిము నా శ్రేణీ తుర గాణాం విధీయతే

దక్షిణాభిముఖా వాథ పరిశిష్టాస్తు గర్తి తాః

తుర గా స్తే తథా ధార్యాః ప్రదీపై సార్వరాత్రి కేః

కుక్కుటా నానరాంశ్చైవ మర్కటాంశ్చ నరాధిప

ధారయే దశ్వశాలాసు సవత్సాం ధేను మేవచ

 అజాశ్చ తత్ర వై ధార్యాస్తురగాణాం హితైషిణా

గోగజాశ్వాదిశాలాసు తత్పురీషస్య నిర్గమః

అ స్తజ్ఞతే న కర్తవ్యో దేవదేవే దివాక రే

తత్ర తత్ర యథాస్థానం రాజా విజ్ఞాయ సారథీ

దద్యా దావసథస్థానం సర్వేషా మనుపూర్వశః

యోధానాం శిల్పినాం చైవ సర్వేషామవి శేషతః

దద్యా దావసధా న్గురే మంత్రకాలవిదా ఞ్చుభాక్

గోవే ద్యా నశ్వవైద్యాంశ్చ గజవై ద్యాం స్తథైవచ

ఆహరేత భృశం రాజో దుర్దేహి ప్రబలా రుజః

కుశీలవానాం విప్రాణాం దుర్గే స్థానం విధీయతే

న బహూనా మతో దుర్గే వినా కార్యం తథా భవేత్

రాజ భవనము సకు దక్షిణముగా కోశ గృహము దానికి దక్షిణముగా గజ స్థానము తూర్పు మొగముగా గాని ఉత్తరపు మొగముగాగాని ఉండవలెను; పురాగ్నేయమున ఆయుధా గారము వంటశాల కర్మశాలలు (కమ్మరము-వడ్రం గము కంచరము మొదలగునవి) రాజ భవనమున కేడమగా పురోహిత గృహము మంత్రి గృహము వేద పండిత గృహము వైద్య గృహము కోష్ఠిగారము (వంట సామగ్రీశాల. ఉగ్రాణము) గోస్థానము ఆశ్వ స్థానము ఉండవలెను; అందశ్వ శ్రేణి ఉత్తరపు మొగమై కాని దక్షిణపు మొగ మైకాని ఉండవలెను; మిగిలిన మొగములు పనికిరావు; అశ్వశాలలలో రాత్రిం బవళ్లు ప్రదీపములు (కాగడాలు) వెలుగుచుండ వలెను. అందు కోళ్లు కోతులు విశేషించి ఎర్రమూతి కోతులు దూడలతోకూడ పాడియావులు మేకలు (ఇవి ఆశ్వరోగములు పోగొట్టు రక్తము మూత్రము మొదలగునవి ఇచ్చును:) ఉండవలెను. గోగ జైశ్వాది శాలలందు పేడ సూర్యాస్తమయమునకు లోపలనే తీసివేయవలెను; వీటి సారథులకు క్రమమెరిగి (ఈ శాలలున్న వరుసననుసరించి) అందరకు గృహములను ఈ శాలలకు దగ్గరలో నిర్మించవలెను; యోధులకును శిల్పులకును మంత్రుల కును దైవజ్ఞులకును ఒకే విధముగా మంచి ఇండ్లు నిర్మించి ఈయవలెను; దుర్గములందు రోగములును ప్రబలముగానుండు అవకాశము కలదు; కావున రాజు గోగజాశ్వాది వైద్యులను తప్పక తగిన వారిని సంపాదించి దుర్గమందు నిలుపుకొన వలెను; కుశీలవులు (గాయనులు) విపులు మొదలగు వారికిని దుర్గమందు వసతి ఉండవలెను; ఐనను పనిలేనిదే వీరెవ్వరును చాలమంది దుర్గములోపల నుండరాదు.

దుర్గే ఆయుధాదిసజ్గ్రహః - దుర్గమందాయుధాది సంగ్రహణము.

దుర్గేతు యంత్రః కర్తవ్యా నానాప్రహరణాన్వితాః

సహస్రఘాతినో రాజం సైస్తు రక్షా విధీయతే

దుర్గే ద్వారాణి గుప్తాని కార్యాణ్యపేచ భూభుజా

సజ్గ్రహశ్చాత సర్వేషా మాయు ధానాం చ శస్యతే

ధనుషాం షేపణీయానాం తోమరాణాంచ పార్థివ

శ రాణా మథ ఖడ్గానాం కవచానాం తథైవచ

అశ్మనాంచ ప్రభూతానాం ముద్దరాణాంతథైవచ

పట్టసానాం త్రిశూలానాం శూలానాం చ తథైవచ

ప్రాసానాం చైవ శస్త్రాణాం శక్తీనాంచ తథైవచ

పరశ్వథానాంచక్రాణాం చర్మణాం వర్మభి స్సహ

కుఠార ముర వేత్రాణాం పరిమాణాం తథై వచ

తుషాణాం చైవ దాత్రాణా మజారాణాం తథైవచ

సర్వేషాం శిల్పిధాజ్ఞానాం సఇ్చయ సత్ర చేష్యతే

వారిత్రాణాం చ సర్వేషా మోషధీనాం తథై వచ

యవ సానాం ప్రభూతానా మిన్లనస్య చ సజాయః

గుడస్య సర్వతే లానాం రసానాం చ తథైవచ

వసానా మథ మజ్జానాం స్నా యూనా మస్లిభి స్సహ

గోచర్మవటహానాం చ ధాన్యానాం సర్వత స్తథా

త వాభపటానాం చ యమగోధూమయోరపి

చణసర్జరసం భూర్జం జతు లాక్షౌ చ టజ్కణమ్

రాజా సజ్చానుయా దుర్గే యచ్చా న్యదపి కించన

రత్నా నాం సర్వలోహానాం వస్త్రాణాం చాప్య శేషతః

కోద్రవం ముద్దమాషాణాం చణకానాం పాలై స్సహ

తథాన సర్వసస్యానాం పాంసుడోమయయో రపి

కుమ్బాశ్చాశీవి షేః కార్యా వ్యాళ సింహాదయ స్తథా

మృగాశ్చ పక్షిణ శ్చైవ రష్యా స్తే చ పరస్పరమ్

స్థానాని చ విరుద్దానాం సుగుప్తాని పృథకృథక్

కర్తవ్యానీ మహాభాగ యత్నేన పృథివీక్ష్మి తా

ఉక్తాని చోప్యనుక్తాని రాజన్ ద్రవ్యాణ్య శేషతః

సుగుప్తానీ పురే కుర్యాజ్జనానాం హితకామ్యయా

దుర్గమందు నానా యుధ యుక్ర యంత్రములు వేల కొలది మందిని చంపగలవియు గుప్త ద్వారములు నుఉండ వలయును. సర్వ విధానేకా యుధములును ధనుపులు వడి నేలలు పిరంగులు తోమరములు ఖడ్గములు కవచములు రాలు ముద్ధర ములు పట్టసత్రిశూల శూల ప్రాసశస్త్రక కి పరశ్వథ చక్ర చర్మ (డాలు) వర్మ (కవచ కుఠార (గొడ్డలి) కుర (చురక తి వేత్ర (పేము క ర్రలు బెత్తములు) పరిఘతుష ధాన్యాదుల పొట్టు దాత్రములు (కొడవళ్లు) అంగారములు (బొగ్గులు) నర్వశిల్పి భాండములు (ఆయా పనివారల పనిముట్లు) సర్వ వాద్యములు ఔషధములు సమృద్ధిగా అనేక విధములగు యవసము లు (మేత గడి తేగలు) వంట క లు బేలము సర్వ తెలములు సర్వ రస సామి. (పాలు పెరుగు తేనె మొదలగునవి) వన (క్రొవ్వువంటిది) మజ్జ-స్నాయువులు (నులినరములు) ఎముకలు ఎద్దుల చర్మముతో చేసిన తప్పె టలు మొదలగు చర్మ వాద్యములు సర్వ ధాన్యములు అభ్ర పటములు (శిబిరముల నిర్మింప పనికివచ్చు వస్త్రములు మొ.) యవలు గోధుమలు రత్నములు సర్వవిధ వస్త్రములు సర్వవిధ లోహములు బఠాణి పెసలు మినుములు శనగలు నూపులు ఇట్టి అన్ని పంట ధాన్యములు ధూళులు గోమయములు జనుపనార సర్జ రసము భూర్జ పత్రము జతులా (అను రెండు విధముల లక్కలు) టంకణము ఇట్టివిం కేన్నీ యో దుర్గ మందు సేకరించి ఉంచవలేను; వీటిలో ముఖ్యముగా రత్నములు సర్వ లోహములు సర్వవిధ వస్త్రములు కొర్రలు పెసలు మినుములు శనగలు నూవులు ఇంకను ఇట్టి సర్వ సస్యములును ధూళులును గోమయమును పాములతో కూడిన కుంభములు (సింహాదులగు) క్రూర మృగములు మృగములు పనులు మొద లగునవి వాటి పరస్పర మైత్రీ ద్వేషముల నెరిగి నిలుపవలెను; పరస్పర విరోధముగల పదార్థములకును ప్రాణులకును ఏర్పరచు స్థానములు అతి రహస్యములయి సురక్షితములయి ఉండవలెను; రాజు ఈ విషయములందు ప్రయత్న పరుడు కావలెను; ఈ చెప్పినవియు ఇందు చెప్పనివియు ద్రవ్యములు పురమందు జనుల హితమున కై సేకరించి రహస్యముగా భద్ర పరచి ఉండవలేను.

దుర్గే సగ్రాహ్యవృక్షాః - దుర్గమందుండవలసిన వృక్షములు మొదలగునవి.

జీవకర్షభకాకోలమామలక్యాటరూషకా

శాలపర్ణిపృష్ఠి (శ్ని) పర్ణీ ముద్గపర్ణీ తథైవచ

మాషవర్ణీ చ మేదే ద్వే శారిబే ద్వే బలాత్రయమ్

వీరా శ్వస నీ వృష్యాచ బృహతీ కణ్ణకారికా

శృజీ శృఙాటకీ ద్రోణీ వర్షాభూ ర్దర్భరేణుకా

మధుపర్ణీ విదార్యేషా మహా క్షీరా మహాతపాః

ధన్వన స్సహదేవాప్వో కటు కై రబ్ధకం విషః

పర్లీ శతాహ్వా మృద్వీకా ఫల్గుఖర్జూరయష్టికాః

శుక్రాతిశుక్ర కాశ్మర్యం ఛత్రాతిచ్ఛత్రవీరిణాః

ఇక్షు రీమవికారాశ్చ ఫణి తాద్యాశ్చత్తమ

సింహీచ సహదేవీ చవి శ్వేదేవాశ్వరోధకమ్

మధుకం పుష్పహం సాఖ్యా శతపుష్పా మధూలికా

శతావరీ మధూ కేచ పిప్పలం తాల మేవచ

ఆత్మగుప్తా కట్పలాఖ్యా దార్వికారాజ శీర్షికీ

రాజస్వపధాన్యాక మృష్యప్రోక్తా తథోత్కటా

కాలశాకం పద్మబీజం గోవర్లీ మధువల్లికా

తపాకీ కుబేరాక్షీ కాక జిహ్వారుపుష్పికా

పర్వతత్రపుసౌ చౌభౌ గుజ్జతక పునర్నవే

క శేరు కారు కాశ్మీరీ వల్యాసాలూక కేసరమ్

శూక దాన్యాని సర్వాణి సర్వేషాం చ తథైవచ

క్ష్మీరం ఔద్రం తథా తక్రం తైలం మజ్జా వసా ఘృతమ్

నీపశ్చారిష్ట కాషోడ పోతామ స్సోమబాణకమ్

ఏవమాదీని చాన్యాని విషైయో మధురో గణ

 రాజా సఖ్చానుయా త్సర్వం పురే నిరవశేషతః

దాడిమామ్రాతకో చైవ తి శ్రోడీకామ్లవేత సమ్

భవ్యకర్కస్తులకుచ కరమర్దక రూషకమ్

బీజవూరకకడ్డూ రే మాలతీరాజ బన్దుకమ్

కోలకద్వయపర్ణాని ద్వయో రామ్లత యోర పి

పొరావతం నాగరకం ప్రాచీనోశక మేవచ

కపిత్థామలకం చు కఫలం ద నశఠస్యచ

జామ్బవం నవనీతంచ సౌవీర కలుషోదకమ్

సురాసవంచ మద్యాని మజ్ఞతకదధీని చ

యాని శుక్లాని సర్వాణి ప్లేయ మామ్లగణం ద్విజ

ఏవమాదీని చాన్యాని రాజా సహ్చానుయా త్పురే

సప్త సెనవోద్భిద పాలేయపాక్య సాముద్రలో మకమ్

కుప్యసౌవర్చలాబిల్వం బాల కేయం యవాహ్వకమ్

ఔర్వం ఔరం కాలభస్మ విష్ణోయే లవణో గణః

ఏవమాదీని సర్వాణి రాజా సహ్చానుయా త్పురే

పిప్పలి పిప్పలీమూల చిత్రకం నాగనం తథా

కుబేరకం మరిచకం శిగ్రుభల్లాత సర్షపాః

కుష్ణాజమోదా కిణిహీ హిజుమూలక ధాన్యకమ్

కారవీ కుట్టో కాయాజ్యాసుముఖా కాలమా(మూ)లికా

ఫణిజ్జుకోఓథలశునం భూ సృణం సురసం తథా

కాయస్థాచ వయస్థాచ హరితాళం మనశ్శిలా

అమృతాచ రుద స్త్రీచ రోహిషం కుజ్కుమం తథా

జయా ఏరణకాణీరం సల్లకీ హజ్జికా తథా

సర్వపిత్తాని మూత్రాణి ప్రాయోహరిత కానిచ

ఫలాని చైవ సూక్ష్మాణి సూక్ష్మేలా హిజుపత్రికా

ఏవమాదీని సర్వాణి రాజా సజ్చెనుయాచ్చనైః

ఏవమాదీని సర్వాణి గణః కటుక సంహితః

రాజా సఞ్చినుయాద్దుర్గే ప్రయత్నేన నృపోత్తమ

జీవకము ఋషభము కాకోలము ఆమలకి ఆట రూషకము శాలపల్లి పృశ్ని (ష్ఠి) పర్ణీ ముద్ద పల్లి మాష పర్ణీ మేదో జోతి ఓషధులు రెండు శారిబా జాతి మూలికలు రెండు బలాజాతి ఓషధులు మూడు- వీర-శ్వసంతి-వృష్య-బృహతీ-కంట కారిక -శృంగి-శృంగాటకి-ద్రోణి-వర్షాభూ-దర్భరేణుక-మధువర్ణి-విదారి-మహాక్షీర -మహాతపస్-ధన్వనము -సహదేవ -కటుక - ఏరండకము విషము (ఒక మూలిక) పశ తిహ్వ-ద్రాక్ష-ఫల్గు. ఖర్జూరము - అతిమధుర శుక్ర –అతిశుక్రకాశ్మరి-ఛ శ్ర వీరిణి-  చెరకు-రకు నుండి ఉత్పన్న వస్తువులు ఫణితము మొదలగునవి సింహి.సహదేవి.వి శ్వేదేవ.అశ్వరోధకము.మధుకము-పుష్పహంస-శతపుష్ప-మధూలిక-శతావరి-మధుకా-పిప్పలము తాళము - ఆత్మగుప్త - కట్పలదార్వికా – రాజశీరకి-రాజ సర్షపములు ధాన్యాకము. ఋష్యపో క-ఉత్కట-కాలకము -పద్మబీజము గోవల్లి-మధువల్లిక – శీతపాకి-కుబేరా- కాకజిహ్వ - ఉరుపుష్పిక-పర్వతము-త్రవునము గుంజాతకము.పునర్నవమిక శేరువు -కరువు కాశ్మీరీ-వల్య - సాలూకము - కేసరము-సుంకు ఉం డెడి అన్ని ధాన్యములు. అన్ని పకు మృగజాతులపాలు-తేనే మజ్జిగ-తైలములు-మజ్జ-వసనేయి -నీపము - రిష్టకము - ఆవోటము-వాతామము. సోమబాణక (బాదా)ము ఈ మొదలగు మధుర (తీయని) గణమునకు చెందిన ఓషధీ-రస జాతి ద్రవ్య ములును.                      

దాడిమము- ఆమాతకము-తింత్రిణీకము- ఆమ్లము-వేతసము-భవ్యము కర్కంధువు లకుచముకర మర్దకము రూషకము- బీజపూరకము కండూరము-మాలతి-రాజబంధుకము- రెండు తెగల కోలకముల పత్రము రెండు తెగల ఆమ్లాతముల పత్తములు పారావతము నాగరక ము ప్రాచీనోళకము కపిత్తము ఆమలకము చు కఫలము దంతశఠఫలము-జంబూ ఫలము నవనీతము సౌవీరము కలుషోదకము.సుర.ఆసవము మద్యములు మండము తకము దధి మొదలగు తెల్లని ఆమ్ల పుల్లని గణమునకు చెందిన పదార్థములును-

సైంధవము ఉద్భిదము పాథేయము పాక్యము సాముద్రలోమకము కుప్యము సౌవర్చలము బిల్వము బాల కేయము య వాహ్వకము ఔర్వము క్షారము కాలభస్మము - ఈ మొదలగు లవణ గణ పదార్థములును.

పిప్పలి-పిప్పలివేరు -చిత్రకము-నాగరము-కుబేరము-మరిచకము-శీగ్రువు – భల్లాతకము-సరపములు కుష్టము- అజమోద- కిణిహి- హింగువు-మూలక ము-ధాన్యకము-కార వీ-కుంజికా-యాజ్యా-సుముఖా - కాలమాలికా -ఫణిజ్జక ము-లశునము భూసృణము- సురసము-కాయస్థాపయస్థా-హరితాళము – మనశ్శిల-అమృత-రుదంతీ-రోహిషము- కుంకుమము-జయ-ఏరండము-కాండిరము-సల్లకీ-హంజికా-ఈ మొదలగు పిత్తజనక పదార్థములును ఇటువంటివేయగు (పిత్తజనకు ప్రాణుల మూత్ర ములును తరచుగా పచ్చనివియును సూక్ష్మములగు ఫలములును సూక్ష్మేలా-హింగు పత్తము- ఈ మొదలగు కటుక గణపు (కారపు) ద్రవ్యములును రాజు తన పురమునందు సేకరించి ఉంచుకొనవలయును.

ముస్తం చన్దనహ్రీబేర కృతమాలక దారవాః

హరిద్రా నళ దోశీర నక్తమాలకదమ్బకమ్

దూర్వా పటోల కటుకా దీర్ఘత్వక్పత్రకం వచా

కిరాతతి క్తభూ నిమ్బ విషా చాతి విషానిచ

తాళీసపత్ర తగరం సప్తపర్ణ ఏక జ్కతాః

కాకోదుమ్బరికా దివ్యా తథాచైవ సురోద్బవా

షడ్ఘ్రంధ్ర రోహిణీ మాంసీ పర్పటం చాథ దంతికా

రసాజ్జునం భృజరాజం పతజీ పరి పేలవమ్

దుస్పర్శాగురుణీ కామా శ్యామాకం గన్ధనాకులి

రూపపర్జీ వ్యాఘ్రనఖం మజ్ఞాషా చతుర జు

రమ్బాజై వాజురాసీతా తాలాస్ఫోతా హరేణు కా

వైత్రాగ్ర వేతన స్తుమ్బీ విషాణీ లోధ్రమజ్జరీ

మాలతీకరకృష్ణాఖ్యా వృశ్చికా జీవితా తథా

పర్పటంచ గళూచీచ సగణ సిక్తసంజ్ఞకః

ఏవమాదీని సర్వాణి రాజా స్చూనుయా త్పురే

 అభయామల కే చోభే తథైవచ విభీతకమ్

ప్రయజు ధాతకీపుష్పం మోచాఖ్యా చార్జునాసనాః

అనన్తస్త్రీ తువరికా స్యోనా కట్ఫలకం తథా

భూర్జపత్రం శిలాపత్రం పాటలా పత్రలో మకమ్

సమజ్ఞా త్రివృతా మూలకార్పాసం గై రికాజ్జనమ్

 తిందుకం(విద్రుమం) సమధూచ్ఛిష్టం కుమ్బీకా కుముదోత్పలమ్

న్యగ్రోధోదుమ్బర్వాల్డ్ కింశుకా శింశుపా శమీ

ప్రియాలపీలు కాసారి శిరీషాః పద్మకం తథా

బిల్వోగ్ని మన్దః ప్లక్షశ్చ శ్యామాకం చవకో ఘనమ్

రాజాదనం కరీరంచ ధాన్యకం ప్రియక స్తథా

కజోలాశోక బదరాః కదమ్బఖదిర ద్వయమ్

ఏషాం పత్రాణి సారాణి మూలాని కుసుమానిచ

ఏవమాదీని సర్వాణి కషాయాభ్యో మతో రసః

ప్రయత్నేన నృప శ్రేష్ట రాజా స్చనుయా త్పురే

కీటాశ్చ మారణే యోగ్యా వ్యజ్ఞతాయాం తథైవచ

వాతధూమాశ్చ మార్గాణాం దూషణాని తథై వచ

రితే ధార్యాణి పార్థివై దురే తాంస్తు వక్ష్యామి పార్థివ

విషాణాం ధారణం కార్యం ప్రయత్నేన మహీభుజా

విచిత్రా శ్చాగదా ధార్యా విషస్య శమనా స్తథా

రక్షోభూతపిశాచఘ్నా  పాపఘ్నా పుష్టివర్ధనాః

కలావిదశ్చ పురుషా దుర్గే ధార్యాః ప్రయత్నతః

భీతా నుద్దాన్ ప్రమత్తాంశ్చ తథైవచ విమానితాక్

కుకృత్యా నొపశీలాంశ్చ న రాజా వాసయే త్పురే

యంత్రాయుధాబ్దాలచయోపన్నం సమగ్రధాన్యౌషధి సమయుక్తమ్

వణిగనై శ్చావృత మావ సేత దుర్గం సుగు వం నృపతి స్సదైవ

ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే దుర్గ సమ్పత్తికథనం నామ షోడశోత్తర ద్విశతతమోధ్యాయః

ముస్తము చందనము బేరము కృతమూలకము దారవము- హంద్ర ఎనలదము-ఉశీరము-నక్త మాలము –కదంబకము- దూర్వ-పటోలము-కటుకొ-దీర్ఘ త్వక్-పత్రకము-వచాకిరాతతిక్తము- భూనింబము-విష- అతివిషతాళీస పత్రము-తగ రము-సప్తపర్ణము- వికంక తము- కాకోదుంబరికా-దివ్యా-సురోద్బవా-షడ్రంథా రోహిణి-మాంసి –పర్పటము-దంతికా-రసాం జనము- భృంగరాజమ-పతంగిపరి పేలవము-దుస్స్పర్శ గురుణి-కామా- శ్యామాకము-గంధ నాకులి-రూపవర్ణి- వ్యాఘ్రనఖము- మంజిష్టా-చతురంగుళ-రంథ- అంకురా-స్సీతో తాలాస్పోతామహరేణుకా-వై త్రాగ్రము వేతసము- తుంబీ-విషాణి-లోధ్రమంజరి మాలతి-కరకృష్ణా-వృశ్చికా జీవితా-పర్పటము-గళూగుడూచీ- ఈ మొదలగు తిక్త (చేదు) గణపదార్థములును. ఆభయా- రెండు తెగల ఆమలకములు- విభీతకము-ప్రియంగువు- ధాతకీ పుష్పము - మోచా-అర్జునము – ఆసనము- అనంతా-శ్రీ-లువరికా-సోనాకము కట్పలము - భూర్జప తము- శిలాపత్రము-పాటలా-పత్తలోమకము-సమంగా - త్రివృతా మూలము- కార్పాసముగై రికాంజనము-తిందుకము -తేనె మైనము-కుంభీకా -తెల్ల కలువ-నల్ల కలువ న్యగ్రోధము-ఉదుంబరము- అశ్వత్తము- కిండుకము శింశుపాశ మీ-ప్రియాలము-పీలు కొసారి శిరీషము-పద్మకము- బిల్వము, అగ్ని మంథము-ప్లక్ష ముత్యామా కము-వ(బ) - చఘనము.రాజాదనముక రీరము.ధాన్యకము ప్రియకము-కంకోలము ఆశోకము బదరము కదంబము - రెండు జాతుల ఖదిరము - ఈ చేప్పిన జాతుల.పత్రములు సారములు వేళ్ళు పూవులు మొదలగు కషాయ (వగరు) గణ పదార్థ ములును రాజు తన రాజధాని పురమందు సేకరించి ఉంచుకొనవలయును; ఇతరులను చంపుటకును వికలాంగులుగా చేయు టకును ఉపయు క్షములగు పురుగులను మార్గములందు బాధ కలిగించు వాయువులను పొగలను విషములను విషము శమింపజేయు విచిత్రములగు రోగ బాధా నివారక ద్రవ్యములను రక్షోభూత పిశాచములను పాపములను శమింపజేయు సాధనములను పుష్టి వృద్దీకర పదార్థములను కలావిదులగు పురుషులను రాజు యత్న పూర్వకముగా తన రాజధాని యందుంచుకొనవలయును; కుభృత్యులను పాపశీలురగు జనులను భీతురు)లను కుద్దులను ప్రమత్తులను ఆవమానితులగు వారిని రాజు తన పురమందుండ నీయరాదు; ఇట్లు రా జెల్లప్పుడును యంత్రములు ఆయుధములు ఆట్టాలములు. (బురుజులు) సర్వధాన్యములు సర్వౌష ధౌషధులు వణిగ్గనులు నిండినదై సుర క్షితమగు దుర్గమందు రాజు నివసించవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు దుర్గ వ్యవస్థా విధానమను రెండు వందల పదునారవ అధ్యాయము.