మత్స్య మహా పురాణము
62 - అనంత తృతీయా వ్రతము
మనుః : సౌభాగ్యారోగ్యఫలదమముత్రాక్షయకారకమ్ ।
భుక్తిముక్తి ప్రదం దేవ తన్మే బ్రూహి జనార్దన॥
శ్రీమత్స్యః : య దుమాయాః పురా దేవ ఉవాచాన్దక సూదనః ।
కైలాసశిఖరానో దేవ్యా పృష్ట స్తదా కిల॥
కథాసు సంప్రవృత్తాసు ధర్మ్యాసు లలితాసు చ ।
త దిదానీం ప్రవక్ష్యామి భుక్తిముక్తిఫలప్రదమ్॥
ఈశ్వరః : శృణుష్వావహితా దేవి తథైవాన న్తపుణ్యకృత్ ।
నరాణా మథ నారీణా మారాధన మనుత్తమమ్॥
నభ స్యే వాఽథ వైశాఖే మాఘేవా మార్గశీర్ష కే ।
శుక్లపక్షతృతీయాయాం స్నాతస్స న్గౌరసర్ష వైః॥
గోరోచనాంచ గోమూత్రం కృష్ణ గోశకృతం తథా ।
దధీచన్దనసమ్మిశ్రం లలాటే తిలకం న్య సేత్॥
సౌభాగ్యారోగ్యకృత్తస్మా తత్సచా లలితాప్రియమ్ ।
ప్రతిపక్షం తృతీయాసు దధానః పీతవాససీ॥
ధారయే దథ రక్తాని నారీచే త్పతిసంయుతా ।
విధవా వా త్వరక్తాని కుమారీ శుక్లవాపసీ॥
దేవీంచ పఇ్చగవ్యేన తతః క్షీ రేణ కేవలమ్ ।
స్నాపయే న్మధునా (తద్వత్పుణ్యగన్దోదకేనతు) తద్వ త్పుష్పగన్దోద కేనతు॥
పూజయే చ్ఛుక్లపుష్పైస్తు ఫలై ర్నా నావిధై రపి ।
ధాన్యకై ర్జీర లవణై ర్గుడ క్షీర ఘృతాన్వితై: ॥
శుక్లాక్షతతిలై రర్చాం తతో దేవీం సమర్చయేత్ ।
పాదా ద్యభ్యర్చనం కుర్యా త్ర్పతిపక్షం వరాననే॥
సౌభాగ్యారోగ్య ఫలప్రదమును పరలోకమున. అక్షయఫల మిశ్చనదియు - భుక్తి ముక్తిప్రదమును నగు వ్రత మును నాకు తెలువుమని మనువు అడుగగా మత్స్యకారాయణు డిటులు చెప్పేను. పూర్వము అంధకాసురహంతయగు పర మేశ్వరుని ఉమాదేవి యడుగ కైలాస శిఖరమం దాసీనుడై యున్న ఈశ్వరుడు ధర్మమునకు అనుకూలములును లలిత ములును అగు ప్రసంగముల నడుమ చెప్పిన వ్రతము ఒకటి కలదు. దానిని చేప్పెద; వినుము.
ఈశ్వరుడు ఉమకు ఇటులు చెప్పెను: నరులకు కాని సారులకు కాని అనంత పుణ్యఫలమును ఇచ్చు ఆత్యుతమ మగు వ్రతము ఒకటి కలదు; అవహితురాలవయి వినుము. భాద్రపద వైశాఖ మాఘ మార్గశిర మాసములలో దేనియందైన శుక్ల తృతీయనాడు తెల్లని ఆవాలతో (ఆవపిండితో ఆవనూనేతో) స్నానము చేయవలెను. గోరోచనము గోమూతము నల్లని ఆవు గోమయము పెరుగు చందనము - ఇవన్నియు కలిపిన తిలకమును నుదుట ధరించవలయును. ఏలయన ఈ తిలకము సదా లలితా ప్రీతికరమును సౌభాగ్యారోగ్యకరమును. తరువాత పట్టు వస్త్రములు ధరించవలయును. ముత్తైదువలు ఎర్రని వస్త్రములను విధవమైనచో ఎర్రనివి కాని వస్త్రములను కన్యలే నచో తెల్లని వస్త్రములను ధరించవలయును. దేవిని వరుసగా పంచగవ్యముతో కేవలము గోక్షీరములతో తేనెతో పన్నీటితో స్నానము చేయించవలేను. తెల్లని పూపులతో తెల్లని అక్షతలతో తెల్లని పూవులతో పూజించవలయును. నానావిధ ఫలములు జీలక ధనియాలు ఉప్పు బెల్లము పాలు నేయి నివేదించవలయును.
వరదాయై నమః పాదౌ తథా గుల్పౌ శ్రియై నమః ।
అశోకాయై నమో జజ్ఘే పార్వత్యై జానునీ తథా॥
ఊరూ మజ్గళ కారిణ్యై వామదేవ్యై తథా కటిమ్ ।
పద్మోదరాయై జఠర మురః కామ శ్రియై నమః॥
కరౌ సౌభాగ్యదాయిన్యై బాహూ హరముఖ శ్రియే ।
ముఖం దర్పణవాసిన్యై స్మరదాయై స్మితం నమః॥
గౌర్యై నమ స్తథా నాసా మతులాయై చ లోచనే ।
తుష్టై లలాటఫలకం కాత్యాయన్యై నమ శిరః॥
నమో గౌర్యై నమో దృత్యై నమః కాళ్యై నమశ్శ్రియై ।
రంభాయై లలితాయైచ వామదేవ్యై నమోనమ॥
ఏవం సమ్పూజ్య విధివ దగ్రతః పద్మ మాలిఖేత్ ।
పత్రై ర్ద్వాదశభి ర్యుక్తం కుజ్కు మేన సకర్ణికమ్॥
పూర్వేతు విన్యసే ద్గౌరీ మవర్ణాంచ తతః పరే ।
భవానీం దక్షిణే తద్వ ద్రుద్రాణీంచ తతః పరే॥
విన్య సే త్పశ్చిమే సౌమ్యాం తథా మదనవాసినీమ్ ।
వాయవ్యే పాటలా ముగ్రా ముత్తరేణ తథాఽప్యు మామ్॥
సాధ్యాం సత్యాం శుభాం సౌమ్యాం మజ్గళాం కుముదాం సతీమ్ ।
రుద్రంచ మధ్యే సంస్థాప్య లలితాం కర్ణికోపరి॥
కుసుమై పక్షతై ర్వాపి నమస్కా రేణ విన్య సేత్ ।
గీతమజ్గళ నిర్ఘోషం కారయిత్వా సువాసినీ॥
పూజయే ద్రక్తవాసోభీ రక్తమాల్యానులేపనై ।
సిన్దూరం స్నానచూర్ణంచ తాసాం శిరసి దాపయేత్॥
సిన్దూరం కుజ్కుమస్నాన ముపదిష్టం యత స్తత ।
తథోపదేష్టారమది పూజయే ద్యత్నతో గురుమ్॥
సమ్పూజ్యతే గురు ర్యత్ర సర్వా సస్య ఫలాః క్రియాః ।
పాదాది పూజా మంత్రములు: 1. వరదాయై నమః పాదౌ పూజయామీ; 2. శియే నమః గుల్ఫౌ పూజయామి 3. అశోకాయై నమః జంఘే పూజయామి; 4. పార్వత్యై నమః జానునీ పూజయామి; 5. మంగళ కారిడ్యై నమః ఊరూ పూజయా మి; 6. వామ దేవ్యై నమః కటిం పూజయామీ; 7. పద్మోదరాయై నమః జఠరం పూజయామి; 8. కామశియె నమః ఉరః పూజయామి; 9. సౌభాగ్యదాయిన్యై నమః కరౌ పూజయామి; 10. హరముఖియే నమః - బాహూ పూజ యామి; 11. దర్పణ వాసిన్యై నమః ముఖం పూజయామి; 12 న్మరదాయై నమః స్మితం పూజయామి; 13. గౌర్యై నమః నాసికాం పూజయామి; 14. అతులాయై నమః నేత్రే పూజయామి; 16. తుష్యై నమః లలాట ఫలకం పూజయామి; 16. కాత్యాయన్యై నమః శిరః పూజయామీ; గౌరికి ధృతికి కాశికి శ్రీకి రంభకు లలితకు వామదేవికి నమస్కారము. అని ఇట్లు పూజించవలెను.
పూజకు ముందే ఆయా దేవతలను కూర్చుండ పెట్టవలసిన విధానమును స్థానములును ఏవి యనిన- మొదట కుంకుమతో పండ్రెండు రేకులును నడుమ దుద్దుకల పద్మము ముగ్గుగా వేయవలెను. దాని పై తూర్పున గౌరిని అపర్ణను. దక్షిణమున భవానిని రుద్రాణిని పడమట సౌమ్యను మదనవాసినిని వాయువ్యమున పాటలను ఉగ్రను- ఉత్తరమున ఉమా సాధ్యా సత్యాశుభా సౌమ్యా మంగళా కుముదా సతీ-దేవులను నడుమ కర్ణిక పై రుద్రుని స్థాపించవలయును. అట్లు నిలుపు నపుడు వారి పై కుసుమములను అక్షతలను ఉంచి (ఆవాహయామి స్థాపయామి పూజయామి అనుచు) నమస్కరించుచుండ వలయును.
ఇట్లు మొదట ఆవాహనము తరువాత పైన చెప్పినట్లు పూజనము నివేదనము ఐన తరువాత మంగళ వాద్యములు మ్రోగుచుండ ముత్తైదువలను రావించి ఎర్రని వస్త్రములతో ఎర్రని పూలతో ఎర్రని గంధ ద్రవ్యములతో వారిని పూజించ వలేను. సిందూర కుంకుమ కుసుమ చూర్ణములతో స్నానము చేయించవలయునని శాస్త్రమున చెప్పబడియున్నది. కావున వారి శిరస్సుపై సిందూరమును కుంకుమమును వేయవలయును. తనకు మంత్రోపదేశము చేసిన గురునికూడ యత్న పూర్వకముగా పూజించవలయును. గురువునకు అర్చన చేసిన సమ స క్రియలు సఫలము లగును.
నభ స్యే పూజయే ద్గౌరీముత్పలై రసితై స్సదా॥
ఆశ్వినే బన్దుజీవై శ్చ కార్తికే శతపత్ర కైః ।
జాతీపుష్పై ర్మార్గశీర్గే పౌషే పీతైః కురణ్ట కైః॥
కున్దకుజ్కుమపుష్పైశ్చ మాఘే దేవీం సమర్చయేత్ ।
సిన్దువారేణ జాత్యావా ఫాల్గునే పూజయే దుమామ్॥
చైత్రే తు మల్లికాశోకై ర్వైశాఖే గన్దపాటలై ।
జ్యేష్ఠే కమలమన్దారై రాషాఢేచ జపామ్బుజై॥
కదంభైరథ మాలత్యా శ్రావణే పూజయేత్సదా ।
గోమూత్రం గోమయం క్షీరం దధి సర్పి: కుశోదకమ్॥
బిల్వపత్రార్కపుష్పంచ యవా గోశృజ్గవారిచ ।
పఞ్చగవ్యంచ బిల్వంచ ప్రాశయే తమశ స్సదా॥
ఏత ద్భాద్రపదాద్యంతు ప్రాశనం క్రమశ స్మృతమ్ ।
ప్రతిక్షంచమిథునం తృతీయాయాం వరాననే॥
భోజయిత్వాఽర్చయే ద్భక్త్యా వస్త్రమాల్యానులేపనై: ।
పుంసః పీతామ్బరం దద్యాత్ప్రియః కౌసుమ్బవాససీ॥
నిష్పావ జాజీ లవణ మిక్షుదణ్డం గుడాన్వితమ్ ।
నార్యా దద్యా త్ఫలం పుంస స్సువర్ణోత్పలసంయుతమ్॥
యథా న దేవి దేవ స్త్వాం పరిత్యజ్యేహ గచ్ఛతి ।
తథా మా ముద్దరా శేషదుఃఖసంసార సాగరాత్॥
కుముదా విమలా నన్దా భవానీ వసుధా శివా ।
లలితా కమలా గౌరీ సతీ రమ్బచ పార్వతీ॥
నభస్యాదిషు మా సేషు ప్రీయతా మిత్యుదీరయేత్ ।
భాద్రపదాదిగా పండ్రెండు మాసములందును పూజకు పుష్పములు ఉపవాసమునాడు ఆహారముగా తీసికొన వలసిన ద్రవ్యము దాన సమయమున చెప్పు మంత్రము వేరు వేరుగా నుండును. ఎట్లన.
మాసము: పూజా పుష్పములు: ఆహారము: మంత్రము :
భాద్రపదము నల్ల కలువలు గోమూత్రము కుముదా ప్రీయతామ్
ఆశ్వయుజము మంకెన గోమయము విమలా ప్రీయతామ్
కార్తికము నూరు రేకుల తామర ఆవు పాలు నందో ప్రీయతామ్
మార్గశిరము జాజి ఆవు పెరుగు భవానీ ప్రీయతామ్
పుష్యము పచ్చ గోరంట ఆవు నేయి వసుధా ప్రీయతామ్
మాఖము మొల్ల లేదా కుంకుమ పూవులు దర్భలు వేసిన నీరు శివా ప్రియతామ్
ఫాల్గునము పేంకణము లేదా జాజీ మారేడు దళములు లలితా ప్రియతామ్
చైత్రము మల్లిక లేదా ఆశోకము తెల్ల జిల్లేడు పూలు కమలా ప్రీయతామ్
వైశాఖము సంపెగ -పాటల యవలు వేసిన నీరు గౌరీ ప్రీయతామ్
జ్యేష్ఠము కమలము- మందారము ఆవు కొమ్ము లో పోసి సతీ ప్రియతామ్
ఉంచిన- నీరు
ఆషాఢము జపాకుసుమ-పద్మములు పంచగవ్యము రంభా ప్రియతామ్
శ్రావణము కడిమి- మాలతీ బిల్వఫలము పార్వతీ ప్రియతామ్
ప్రతిమాస శుక్లపక్ష తృతీయాతిథినాడును బ్రాహ్మణ దంపతులను భక్తితో వస్త్ర పుష్ప గంధములతో అర్చించ వలెను. పురుషులకు పచ్చని వస్త్రము లీయవలెను. (పురుషులకు దోవతి ఉ తరీయము కాని రెండు దోవతులను కాని లకు చీరను రవిక గుడ్డను-ఇ పైవరి కై నను రెండు వస్త్రము లీయవలెను.) స్త్రీలకు బొబ్బరలు జాజికాయ లవణము చెరకుగడ బెల్లమును పురుషులకు ఈ పదార్థములతోపాటు బంగారు కలువపూవును కూడ ఈయవలేను. ఇవి ఇచ్చు నపుడును శయనము మొదలగునవి ఇచ్చునపుడును దేవిని “దేవీ! పర మేశ్వరుడు ఎన్నడును నిన్ను విడువక సుఖింప జేయుచున్న ప్లే నీవును నన్ను సంసార సాగరమునుండి తరింపజేసి సుఖింపజేయుము.” అని ప్రార్థించవలేను.
వ్రతాన్తేశయనం దద్యా త్సువర్ణకమలాన్వితమ్॥
మిథునాని చతుర్వింశద్ద్వాదశాథ సమర్చయేత్ ।
అష్టౌ షడ్వా ప్యథ పున రనుమాసం సమర్చయేత్॥
పూర్వం దత్వాఽథ గురవే శేషా నభ్యర్చయే త్తతః ।
ఉక్తాఽనన్త తృతీయైషా సదాఽనన్త ఫలప్రదా॥
సర్వపాపహరా దేవీ సౌభాగ్యారోగ్యవర్ధనీ ।
న చై నాం విత్తశాఠ్యేన కదాచిదపి లజ్ఘయేత్॥
నరో వా యది వా నారీ విత్తశాఠ్యా త్పతత్యధః ।
గర్భిణీ సూతికా నక్తం కుమారీ వాఽథ రోగిణీ॥
యదా శుద్దా తదా తేన కారయే త్క్రమశ స్సదా ।
ఇమా మన స్తఫలదాం య స్తృతీయాం సమాచరేత్॥
కల్పకోటిశతం సొగ్రం శివలో కే మహీయతే ।
విత్తహీనోఽపి కుర్వీత వర్షత్రయ మపోషణమ్॥
పుష్పై ర్మన్త్రవిధానైశ్చ సోపి తత్పల మాప్నుయాత్ ।
నారీ వా కురుతే యా తు కుమారీ విధవా తథా॥
సాఽపి తత్ఫల మాప్నోతి గౌర్యనుగ్రహలాలితా ।
ఇతి పఠతి శృణోతి వాయు ఇత్థం గిరితనయా(వ్రతమిన్ద్ర)వ్రత ముగ్రలోకసంస్థమ్॥
మతిమపిచ దదాతి సోఽపి దేవై రమరవధూజనకిన్నరైశ్చ పూజ్యః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అన క్షతృతీయావ్రతకథనం నామ ద్విషష్టితమోఽధ్యాయః॥
వ్రతము ఇట్లు పండ్రెండు మాసములు జరిగి ముగిసిన తరువాత మంచము పరపు మొదలయినవి బంగారు కమలముతో కూడ విప్ర దంపతులకు ఈయవలెను. ఇదిగాక ప్రతి మాసము నను విప్ర దంపతులను యథాశక్తిగా ఇరువది. నాలుగు మందిని కాని పండ్రెండు మందిని కాని ఎనిమిది మందిని కానీ ఆరు మందిని కాని అర్చించవలెను. (వారికి పుష్పగంధ తాంబూల దక్షిణాదిక ము నీయవలెను.) ఇట్లు అర్చించునపుడు మొదట తన గురుని పిమ్మట మిగిలినవాని ఆర్చించవలెను.
దేవీ! ఈ చెప్పిన అనంత తృతీయావ్రతము సదా అనంతఫలప్రదము సర్వపాపహరము; సౌభాగ్యారోగ్యవృద్ధి కరము. దీనిని స్త్రీలు కాని పురుషులు కాని ఎవరై నను చేయవచ్చును. కాని తనకు శ క్తి యున్నంతలో ధనమున లోభము చూపరాదు. చూపినచో అధః పతితు లగుదురు.
ఈ వ్రతమును చేయుట శ్రీ గర్బిణి. రోగిణి కుమారియైనను చేయవచ్చును. పగలే కాదు; రాత్రి (ప్రదోషకాల మున-రాత్రి ఎక్కువ గడువకుండ) చేయవచ్చును. ప్రసవించుట మొదలయిన కారణములచే అశుచిత్వము వచ్చినపుడు శుద్ధి అయిన తరువాత చేయవలెను.
అనంత ఫల పదమగు ఈ అనంతతృతీయా వతమును ఆచరించినవాడు కల్వకోటి శతములపాటు (పూర్తిగా) శివలోకమున సుఖించును. ధనము లేనివాడు మూడు సంవత్సరములు మాత్రమయిన ఆయా మాస శుక్ల తృతీయనా డుపవాసముండి పూవులతో మంత్రములతో యథాశక్తిగ దొరకిన ద్రవ్య నివేదనముతో ఈ వ్రతమును జరిపినచో నమగ్రఫలమును పొందును. దీనిని కన్య కాని విధవకాని చేసినను గౌరీకృపచే వ్రతము ఫలించును.
దీనిని చదివినను వినినను ఉత్తమ జ్ఞానము శివలోక ప్రాప్తి అచట కిన్నరాది దేవగణములచే పూజలు లభించును.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదాంతర్గత పార్వతీశ్వర సంవాదమున అనంత తృతీయావ్రతమను ఆరువది రెండవ అధ్యాయము.
Summary of chapter 62 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the Ādrānandakara-Vrata, a sacred vow observed when the moon enters the Ādrā constellation on a third lunar day, specifically aimed at satisfying Lord Parameshvara and Goddess Bhavānī. The devotee bathes in sanctified river water, dresses in clean garments, and constructs an auspicious altar to worship Lord Śiva and Goddess Pārvatī with bilva leaves, white lotus flowers, incense, and oblations of ghee. The practitioner maintains a night vigil while reflecting upon the transcendent divine nature of Mahādeva. Upon completing the ritual procedures and feeding virtuous Brāhmaṇas, the practitioner is granted long life, liberation from severe karmic debts, boundless happiness, and eternal residence in the divine realm of Kailāsa.