మత్స్య మహా పురాణము
160 - హిరణ్యకశిపూపాఖ్యానము - ఆరంభము - నరసింహ ప్రాదుర్భావము - హిరణ్యకశిపు సభా వర్ణనము॥
ఋషయః : ఇదానీం శ్రోతుమిచ్ఛామో హిరణ్యకశిపోర్వధమ్ ।
నరసింహస్య మాహాత్మ్యం తథా పాపవినాశనమ్॥
సూతః : పురా కృతయుగే విప్రా హిరణ్యకశిపుః ప్రభుః ।
దైత్యా నామాదిపురుష శ్చకార సుమహత్తపః॥
దశవర్షసహస్రాణి దశవర్ష శతానిచ ।
జలవాసీ సమభవ త్స్నా నమౌనదృఢవ్రతః॥
హిరణ్యకశిపోర్వరప్రదానాయ దేవై స్సహ బ్రహ్మావిర్భావః॥
తతశ్శమదమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చై వహి ।
బ్రహ్మా ప్రీతోభవ త్తస్య తపసా నియమేన చ॥
తతస్స్వయమ్భూ గ్భగవాన్త్స్వమాగమ్య తత్ర హి ।
విమానేనార్కవర్ణేన హంసయుక్తేన భాస్వతా॥
ఆదిత్యైర్వసు భిస్సాధ్యైర్మరుద్భి ర్దైవతై స్తథా ।
రుద్రైర్విశ్వసహాయైశ్చ ఖేచరైశ్చ మహాగ్రహైః॥
దిగ్బిశ్చైవ విదిగ్భిశ్చ నదీభి సాగరై స్తథా ।
నక్షత్రైశ్చ ముహూర్తైశ్చ యక్షరాక్షసపన్నగైః॥
దేవ బ్రహ్మర్షిభిసార్ధం సిద్ధైస్సప్తర్షిభి స్తథా ।
రాజర్షిభిః పుణ్యకృద్భి ర్గన్దర్వా ప్సరసాజ్గణై ॥
చరాచరగురు శ్శ్రిమా నృతస్సర్వేర్దివౌక సైః ।
(బ్రహ్మా బ్రహ్మ॥) బ్రహ్మా యజ్ఞవిదాం శై ష్ఠో దైత్యం వచనమబ్రవీత్॥
పితామహః : ప్రీతోఽస్మి తవ భక్తస్య తపసాఽ నేన సువ్రత ।
వరం పరయ భద్రం తే యథేష్టం కామమాప్ను హి॥
హిరణ్యకశిపుః : న దేవాసురగన్దర్వా న యక్షరగరాక్ష సాః ।
న మానవాః పిశాచావా హన్యుర్మాం దేవసత్తమ॥
ఋషయో వా నమాం శాపైశ్శపేయుః ప్రపితామహ।
యది మే భగవాన్ప్రీతో వర ఏష వృతో మయా॥
శస్త్రేణ వా న చాస్త్రేణ గిరిణా పాద పేన చ ।
న శుష్కేణ న చా న్ద్రేణ న దివా న నిశాథవా॥
భవేయమహమేవార్క స్సోమో వాయు ర్హుతాశనః ।
సలిలం చాన్తరిక్షంచ నక్షత్రాణి దిశో దశ ॥
అహం క్రోధశ్చ కామశ్చ వరుణో వాసవో యమః ।
ధనదశ్చ ధనాధ్యక్షో యక్షః కిమ్పురుషాధిపః॥
ఋషులు సూతు నిట్లడిగిరి: ఇపుడు మేము హిరణ్యకశిపు వధమును పాపనాశ కమగు నర సింహదేవ మాహాత్మ్య మును విన కుతూహలపడుచున్నాము॥ అన సూతు డిట్లు చెప్పనారంభించెను: విప్రులారా! పూర్వము కృతయుగమున దైత్యుల మొదటి తరమువాడు( ఆదిపురుషుడు)ను దైత్యప్రభువు నగు హిరణ్యకశిపుడు పదునొకండు వేల ఏండ్లపాటు జల వాసియై స్నాన దృఢ మౌన వ్రతములు శమదమ బ్రహ్మచర్యములు అనుష్ఠించుచు సుమహాతపమాచరించెను॥ అతని తపమును నియమములను బ్రహ్మ మెచ్చి ప్రీతుడై ఆ స్వయంభూ భగవానుడు స్వయముగా అచ్చటికి రవితేజోయుత మయి హంసలను పూన్చినదై ప్రకాశించు వీమాసముపయి ఆదిత్యవసు మరుద్ రుద్ర విశ్వదేవ ఖేచర మహాగ్రహదిక్ విదిక్ నదీసాగర నక్షత్ర ముహూర్త యక్షరాక్షస పన్నగ దేవర్షి బ్రహ్మర్షి సిద్దన పర్షి (పుణ్యకృత్) రాజర్షి గంధర్వాప్సరోగణము లతో వచ్చెను॥ యజ్ఞత త్వ మేరిగినవారి లో శ్రేష్ఠుడు చరాచర లోక పితగురుడు) ఆగు శ్రీమద్ బ్రహ్మ సర్వదేవతా పరి వృతుడయి ఇట్లు వచ్చి ఆ దైత్యునితో సువతా! (ఉ త్తమ నియమ తపముల ననుష్ఠించినవాడా!) భక్తుడవగు నీ ఈ తప ముతో ప్రీతుడనయినాను॥ నాయనా! వరము కోరుము; ఇష్టముల నీడేర్చుకొనుము; అనగా హిరణ్యకశిపు డిట్లనెను: దేవ శ్రేష్టా! దేవాసుర గంధర్వ యక్షపన్న గ రాక్షస మానవ పిశాచు లేవ్వరును నన్ను చంపగలుగరాదు; ప్రపితామహా! ఋషు లై నను నన్ను శపింపగలుగరాదు; భగవానులగు తమకు నా పై ప్రీతి కలిగినచో నేను మిమ్ము కోరు వర మిదియే॥ శస్త్ర ముతో అస్త్రముతో పర్వతముతో వృక్షముతో ఎండినదానితో తడిగనున్న దానితో పగటియందు రాత్రియంగు నన్నెవరును చంపగలుగరాదు; నేనే రవిచంద్ర వాయు వహ్ని జలాంతరిక్ష నక్షత్రదశ దిశా క్రోధ కామ వరుణేంద్ర యమ కుబేర ధనపతి యక్ష కింపురుషాధిపతులుగా కావలయును॥
బ్రహ్మా: ఏతే దివ్యా వరాస్తాత మయా దత్తా స్తవాద్భుతాః ।
సర్వా న్కామాన్త్స దావత్స ప్రాప్స్యసి త్వం న సంశయః॥
ఏవముక్త్వా స భగవాఞ్జగామాకాశ మేవ హి ।
వై రాజం బ్రహ్మసదనం బ్రహ్మర్షిగణసేవితమ్॥
తతో దేవాశ్చ నాగాశ్చ గ న్దర్వా ఋషిభిస్సహ ।
వరప్రదానం శ్రుత్వైవం పితామహముపస్థితాః॥
దేవాః : వరప్రదానాద్భగవ న్వధిష్యతి స నోఽసురః ।
తత్ర్పసీదాశు భగవన్వధోఽప్యస్య విచి న్యతామ్॥
భగవాన్త్సార్వభూతానా మాదికర్తా స్వయంప్రభుః ।
స్రష్టా త్వం హవ్యకవ్యానా మవ్య క్తప్రకృతిర్బుధః॥
సర్వలోకహితం వాక్యం శ్రుత్వా దేవః ప్రజాపతిః ।
ఆశ్వాసయామాస సురాన్త్సు శీతై ర్వచనామ్బుభిః॥
అవశ్యం త్రిదశా స్తేన ప్రాప్తవ్యం తపసః ఫలమ్ ।
తప స్తోఽ న్తేఽస్య భగవాన్వధం విష్ణుః కరిష్యతి॥
తచ్చ్రుత్వా విబుధ వాక్యం సర్వే పజ్కజన్మనః ।
స్వాని స్థానాని దివ్యాని విప్రా జగ్ముర్ముదాన్వితాః॥
లబ్దమాత్రవర స్సోథ సర్వా స్సోఽబాధత ప్రజాః ।
హిరణ్యకశిపుర్ధర్యో వర దానేన దర్పిత॥
ఆశ్ర మేషు మహాభాగాన్ము నీన్వై శంసితవ్రతాక్ ।
సత్యధర్మపరా న్దాన్తా న్దర్షయామాస దానవః॥
దేవాంశ్రిభువనస్థాంశ్చ పరాజిత్య మహాసురః ।
త్రైలోక్యం వశ మా నీయ స్వర్గే వసతి దానవః॥
యదా వర మదో త్సిక్త శ్చాదితః కాలకర్మణా ।
యజ్ఞీయా నక రో ద్ధైత్యా నయజ్ఞీయాంశ్చ దేవతాః॥
హిరణ్యకశిపుబాధితామరాణాం విష్ణులోకగమనమ్॥
తదాదిత్యాశ్చ సాధ్యాశ్చ విశ్వేచ వసవ స్తథా ।
రుద్రా దేవగణా యక్షా దేవద్విజమహర్షయః॥
శరణ్యం శరణం విష్ణుముపతస్తు ర్మహాబలమ్ ।
దేవదేవం యజ్ఞమయం వాసుదేవం సనాతనమ్॥
తాతా! (నాయనా!)॥ ఈ అద్భుత దివ్యవరములు నేను నీ కిచ్చుచున్నాను॥ వత్సా! నీవు సదా సర్వకామముల (సంకల్పముల) నీడేర్చుకొనగలవు॥ ఇది నిస్సంశయము॥" ఇట్లు పలికి ఆ భగవానుడు అంతరిక్షమును ప్రవేశించి అటనుండి విరాట్ రూపత త్త్వాతీతమయి విశేషముగ విరాజిల్లుచు బ్రహ్మర్షి గణ సేవిత మగు వై రాజమనెడు బ్రహ్మ సదన(లోక మును చేరెను॥
ఇట్టి వరప్రదానమును విని దేవనాగ గంధర్వ ఋషులు పితామహుని ఎదుటికి పోయిరి॥ అట్టి దేవతలు బ్రహ్మతో “భగవన్! ఆ అసురుడు నీ వరప్రదానముతో మమ్ములను వధించును॥ కావున మీ రనుగ్రహ ముంచి శీఘ్రమే హని వధము నాలోచింప ప్రార్థించుచున్నాము॥ తాము॥ సర్వభూతములకు ఆదికర్తయు స్వయముగ సర్వ సమర్థులును ఆగు సృష్టి కర్తయు హవ్యకవ్యములను వ్యవస్థ చేసినవారును అగు భగవానులు ఆవ్య క్తత త్వము ప్రకృతి (జన్మ వ్యక్తి హేతువు)గా గల పండితులు మీరు॥" - అనగా ప్రజాపతి దేవుడు సర్వలోక లోకహితమగు ఈ వాక్యము విని శీతల వచన జలములతో దేవతల నోదా ర్చెను: దేవతలారా! వాడు తపమాచరించినందులకు తత్పల మాతడు పొందవలయును॥ తప శిఫలము ముగియగానే విష్ణు భగవానుడు వీనిని చంపును॥ అనిన పంకజగర్బుని వాక్యమును విని దేవతలు (నుఋషు లును) సంతోషయుక్తులయి తమ తమ దివ్యస్థానముల కేగిరి॥
ఆ హిరణ్యకశిపు దైత్యుడును॥ వరము లభించినంతనే దర్పితుడై సర్వ ప్రజలను బాధించేను॥ ఆ దానవుడు ఉత్తమ కర్మానుష్టానములతో సత్యధర్మపరులం దమముతో ఉండు (దాంతులు బహిరింద్రియ ప్రవృత్తులను అదుపులో ఉంచుకొనినవారు) ఆశ్రమములందలి మునులను బాధించుచు భయ పెట్టుచునుండెను॥ త్రిభువన పతులయియున్న) దేవతలను ఓడించి ఆ మహాసురుడు తే లోక్యమును వశీకరించికోని స్వర్గమందు వసింపసాగేను॥ ఎపుడు వరమద గర్వితుడై వాడు కొలకర్మములచే పేరితుడై దైత్యులను యజ్ఞ భాగభోక్తలనుగాను దేవతలను ఆ అధికారములేని వారిని గాను చేసెనో అపుడు ఆదిత్య సాధ్య విశ్వదేవ వసు రుద్ర నాయక దేవగణ-యక్ష సోమ దేవతాభేద ద్విజమహర్షులు మహాబలుడు దేవదేవుడు యజ్ఞమయుడు (యజ్ఞమునకు సంబంధించిన ఉపకరణములు మంత్రములు॥యజ్ఞ కర్మ ప్రకి యలు-ఋత్విక్కులు పశువు యజమానుడు॥ యజ్ఞభాగముల ననుభవించువారు యజ్ఞ ఫలముల నిచ్చు వాడు॥యజ్ఞ ఫలము - ఇట్టివన్ని యు తానే యైనవాడు) వాసుదేవుడు (సర్వము తనయందు వసింపగా॥॥ సర్వమునందు తాను వసించువాడు) సనాతనుడు (ఎల్లపుడు నుండువాడు) శరణ్యుడు నగు విష్ణుని శరణు కోరి ఆతని ఎదుటికి పోయిరి॥
దేవాః : నారాయణ మహాభాగ దేవాస్త్వాం శరణం గతాః ।
లౌయస్వజహి దైత్యేన్ద్రం హిరణ్యకశిపుం ప్రభో॥
త్వం హి నః పరమో ధాతా త్వం హి నః పరమో గురుః ।
త్వం హి నః పరమో దేవో బ్రహ్మాదీనాం సురోత్తమ॥
విష్ణుః : భయం త్యజధ్వ మమరా అభయం వో దదామ్యహమ్ ।
తథైవ త్రిదివం దేవాః ప్రతిప త్స్యథ మా చిరమ్॥
ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పితమ్ ।
అవధ్యమమరే న్ద్రాణాం దానవేన్ద్రo నిహన్మ్యహమ్॥
నృసింహావతారః-హిరణ్యకశిపోస్సలావర్ణనం చ॥
ఏవముక్త్వాతు భగవాన్విసృజ్య త్రిదశేశ్వరాః ।
వధం సజ్కల్పయిత్వాశు హిరణ్యకశిపోః ప్రభుః॥
సహాయంచ మహాబాహు రోజ్కారం గృహ్య సత్వరః ।
అథోజ్కార సహాయస్తు భగవాన్విష్ణురవ్యయః॥
హిరణ్యకశిపుస్థానం జగామ హరిరీశ్వరః ।
తేజసా భాస్కరాకార శ్శశీకా న్యేవ చాపరః॥
నర స్య కృత్వార్థ తనుం సింహస్యార్ధతనుం తథా ।
నారసిం హేన వపుషా పాణిం సంస్పృశ్య పాణినా॥
తతోఽపశ్యత విస్తీర్ణాం దివ్యాం రమ్యాం॥ మనోర మామ్ ।
సర్వకామయుతాం శుభాం హిరణ్యకశిపో స్సభామ్॥
విస్తీర్ణాం యోజనశతం శతమధ్యర్ధమాయతామ్ ।
వై హాయసీం కామగమాం పఞ్చయోజనముచ్చ్రితామ్॥
జలాశోకక్లమా పేతాం నిష్క్రకమ్యాం శివాం సుఖామ్।
(వేశ్మహర్మ్యవతీం)వేశ్మాసనవతీం రమ్యాం జ్వల స్త్రీమివ తేజసా॥
అన్తస్సలిల సంయుక్తాం విహితాం విశ్మకర్మణా ।
(దివ్యరత్నమయైర్వృక్షై)దివ్యమాల్యాకులై ర్వృక్షై: ఫలపుష్పప్రదైర్వృతామ్॥
దేవతలు॥ విష్ణు నిట్లు ప్రార్థించిరి: నారాయణా! మహాభాగా!॥ దేవతలు నిను శరణు జొచ్చినారు; ప్రభూ! సురోత్తమా! రక్షించుము; దైత్యేంద్రుడగు హిరణ్యకశిపుని చంపుము॥ నీవే బ్రహ్మాదులమగు మాకు ఉత్తముడగు పోషకు డపు; రక్షకుడవు; నీవే మాకు పరమగురువు; తల్లిదండ్రులు॥ హితము తెలుపు-చేయువాడు) నీవే మాకు పరమ దైవతము; అనగా విని విష్ణువు “అమరులారా! భయము విడువుడు; మీకు అభయ, మిచ్చుచున్నా ను॥ ఆపై త్వరలో దేవులారా! మీరు స్వర్గమును తిరిగి పొందగలరు; ఇదిగో! నేను వర దానదర్పితుడు అను రెంద్రులకును చంపనలవి కానివాడు దైత్యుడు నగు ఆ దానవేంద్రుని సపరివారముగా చంపబోవుచును॥ అని పలికి ఆ భగవానుడు దేవ! శేష్టుల ననుమతించి పంపివే నేను॥ తరువాత హిరణ్యకశిపుని వధించు సంకల్పముతో సత్వరుడై॥ ఓం కారమును సహాయునిగా తీసికొని ప్రభువు భగవానుడు అవ్యయుడు (ఏ మార్పును లేని వాడు) విష్ణువు (ప్రతి వస్తువునందును వ్యాపించియుండువాడు) ఈశ్వరుడు భగవానుడు నగు హరీ హిరణ్యకశిపు స్థానమున కేగెను॥ "హరి అపుడు తేజస్సున భాస్కరుడు కాంతియందు చంద్రుడు తేజము॥తీక్లము; కాంతి మనస్సున కింపయినది) అయి సగము శరీరమున నరుడు అర్థ తనువున సింహమునై ఎడమ చేతిని (కుడి చేతితో తాకుచు నార సింహ శరీరముతో నుండెను॥ అచట ఆ దేవునకు వి సీరము -దివ్యము హాయి గొలుపునది మనస్సున కింపగు నదీ అన్ని కోరికలను తీర్చగల సౌకర్యములు గలది స్వచ్చమయినది అగు హిరణ్యకశిపు సభ కనబడెను॥ ఆది నూరు యోజనములు పొడవై ఏబది యోజనములకు తక్కువ కాని వెడల్పయినది; ఆకాశమునందు ఎగురుచు కోరిన చోటికి పోగలదీ; ఐదు జనముల ఎత్తయినది; వార్ధకము శోకము శ్రమ లేనిది; శిథిలపరచ (కంపింపజేయ) నలవి కానిది; శుభకరము సుఖకరమునై గదులు ఆసనములు కలిగి రమ్యమై తేజస్సుతో మండుచున్నట్లు కనబడుచు అంతర్భాగ మున నీరుండునట్లు విశ్వకర్మ నిర్మించినది; దివ్య పుష్పమాల్యములతో పుష్పములతో కూడి ఫలముల పుష్పముల నిచ్చు వృక్ష ములు కలది॥
నీలపీత సితై శ్శ్యామైః శ్వేతై ర్లోహిత కైరపి ।
అవతానై స్తథా గుల్మైర్మహోరీశ తధారిభిః॥
సితాభ్రఘనసజ్కాశ ప్లవమానేవ దృశ్యతే ।
రశ్మివతీ భాస్వరాచ నవ్యగన్దా మనోరమా॥
ససుఖా న చ దుఃఖా సా న శీతా న చ ఘర్మదా।
న క్షుత్పిపాసే గ్లానింవా ప్రాప్య తాం ప్రాప్నువ న్తి హీ॥
నానారూ వైరుపకృతా సువిచిత్రైస్సు భాస్వరైః ।
స్తమ్భైర్న విధృతా సా వై శాశ్వతీ చాక్షపాసదా॥
అతి చన్ద్రంచ సూర్యంచ శిఖినంచ స్వయం ప్రణా ।
దీప్యతీ నాకపృష్ఠస్థా భాసయన్తీవ భాస్కరమ్॥
సర్వేచ కామాః ప్రవరా యే దివ్యా యే చ మానుషాః ।
రసవన్తః ప్రభూతాశ్చ భక్ష్యభోజ్యమనుత్తమమ్॥
పుణ్యగన్దాస్సృజశ్చాపి నిత్యకామఫలద్రుమాః ।
ఉష్ణే శీతాని తోయాని శీతేచోష్ణాని స న్తి వై॥
పుష్పితాగ్రాన్ మహాశాఖాన్ ప్రవాళాజ్కరధారిణః ।
లతావతాననఞ్చన్నాన్ నదీషుచ సరస్సుచ॥
వృక్షాన్బహువిధాం సత్ర మృగేన్ద్రో దదృశే ప్రభుః ।
గన్ధవన్తిచ పుష్పాణి రసవత్తి ఫలానిచ ॥
తాని నోష్ణని శీతాని తత్ర తత్ర సరాంసి చ ।
అపశ్యత్సర్వతీర్థాని సభాయామత్ర సో విభుః॥
నళినై : పుణ్డరీ కైశ్చ శతపత్రి సుగన్దిభిః ।
రక్తైః కువలయైర్నీలైః కుమురై సంవృతానిచ॥
సుకాన్తైర్ధార్తరాష్ట్రైశ్చ రాజహం నైశ్చ సుప్రియైః ।
కారణ్డవైశ్చక్రవాకై సౌర సైః కురరై రపి॥
విమలై స్స్ఫాటికాభై శ్చ పాణ్డురచ్చదనై ర్ద్విజైః ।
బహుహంసోపగీతానీ సార సైరారుతానిచ॥
నీలములు పచ్చనివి తెల్లనివి నల్లనివి ఎర్రనివి ఆగు తీగల పందిళ్లు గుబురులు వందల కొలది మంజరులు (తీగ వెంట ఒక దాని ప్రక్క నొక పూవుగా నుండు పూగుత్తులు మంజరులు; ఒకేచోటినుండి అన్ని వైపులకు వ్యాపించినట్లుండు పూగుత్తులు స్తబకములు లేదా గుచ్చములు అని భేదము) కలిగి॥ ఆ సభ తేలిపోవుచున్న తెల్లని మేఘముల గడవలే కన బడుచుండెను॥ ఆది కిరణములు కలిగి ప్రకాశించుచు క్రొత్త వాసనలతో మనోరమమయి సుఖములతో నిండి , దుఃఖములు లేక ఎక్కువ చలిగాని వేడిమిగాని కలిగించక యుండెను॥ - అచటికి పోయినవారికి దానియందున్నంత సేపును ఆకలి దప్పులు బడలికయుండవు॥ వారు మిగుల విచిత్రములును మీగుల ప్రకాశించునవియు నగు నానా రూపములు గల" సుఖ సాధనముల వలన ఉపకారముల నందుదురు॥ అది స్తంభములతో నిలిపి ఉంచబడినది కాదు॥ శాశ్వతమయినది; రాత్రియే ఎరుగనిది; చంద్రసూర్యాగ్ను లను మించి స్వయం సిద్ధములగు తేజః ' కాంతులు గలది; స్వర్గపు ఉన్నత స్థానమందుండి అది తాను ప్రకాశించుచు సూర్యుని కూడ ప్రకాశింప జేయుచున్న దో యగు నట్లుండెను॥ " దేవ మానుష సంబంధులును ॥ ( చేష్ట ములును గుచి గలవియు సమృద్ధములు నగు అన్ని కోరికలకు తగిన సామగులును ఉత్తమములగు భక్ష్యభోజ్యములును పవిత్రమగు వాసనగల పూలమాలలును సదా కోరిన పండ్ల నిచ్చు వృక్షములును ॥వేడిమి వేళ ల చల్లనే చల్లని కాలములం దుష్ణముగా నుండు నీరును అచ్చట గలవు॥ పూచిన కొనలు గల పెద్ద కొమ్మలును వాటియందు చిగురాకుల మొలకలు॥ను కలిగి తీగల పందిళ్లతో కప్పబడినవయి సరస్సులయు నదులయు సమీపములయందు పెరిగిన బహు" వీధ వృక్షములును వాటియందు సుగంధ పుష్పములును రసవంతములగు ఫలములును 'ఆంతగ వెచ్చనివి చల్లనివి కాని సరస్సులును సర్వ తీర్థములును ఆ నరసింహ దేవున కచ్చట' కనబడెను॥ అచటి ఆ సరస్సులును తీర్థములును సుగంధ యుతములగు పద్మ ములతో శతపత్ర పుండరీక ములతో ఎర్రని_నీలపు॥కలువలతో కప్పబడి మనోహరములగు ధార్తరాష్ట్ర ॥ (ఒక విధమగు హంసలు) ములతో మిగుల ప్రీతి గొల్పు రాజహంసములతో కారండ వము (నీటి కాకు : లతో చక్రవాకములతో బేగ్గురు పక్షులతో కుర రము ( ఒక విధమగు నీటి పక్షు) లతో స్పటిక లవలె ప్రకాశించుచు నిర్మలములయి తెల్లని రెక్కలుకల (మరికొన్ని జల) పక్షులతో కూడి బహు హంసార సముల కూతలతో నిండియుండెను॥
గన్దవన్తీ శ్శుభా స్తత్ర పుష్పమఞ్జరిధారిణీః ।
దృష్టవాన్పర్వతాగ్రేషు నానాపుష్పధరా లతాః॥
కేత కాశోక సరళా న్పున్నా గతిలకార్జునా ।
స్కన్దవన్త (త)స్సుశాఖాంశ్చ బహుకాలసముచ్చ్రయా॥
అర్జునాశోక కర్ణాంశ్చ॥ లకుచాం శ్చీనకద్రుమాక్ ।
చూ తాన్నీ పాన్నా గవృక్షా న్కదమ్బాన్వకుశాన్దవాక్ ॥
ప్రియజ్గుపాటలావృక్షా ఞ్చాల్మలీ న్త్సహరిద్రకాక్।
సాలాంస్తాలాం స్తమాలాంశ్చ చమకాంశ్చ మనోరమాక్॥
తథై వాన్యాన్మహాశాఖా న్త్సభాయాం పుష్పితప్రభాక్ ।
విద్రుమాంశ్చ ద్రుమనేకాన్జ్వలితాగ్నీ సమప్రభాక॥
వరుణాన్వత్సనాభాంశ్చ పనసా న్త్సహచన్దనై ।
నీపాన్త్స మనసాం శ్చైవ నిమాంశ్చాశ్వత్థతిన్దుకాక్॥
పారిజాతాంశ్చ లోద్రాంశ్చ మల్లికా న్భద్రదారుకాక్।
ఆమలక్యస్తథా జమ్బూ ర్లకుచాన్ శైలవాలుకాక్॥
మన్దార కుస్తుమ్బరకా న్కదమ్బాన్ కుటజాం స్తథా।
రక్తాన్కుమరువకాం శ్చైవ నీలాంశ్చాగురుభిస్సహ॥
కుసుంభాంశ్చైవ భవ్యాంశ్చ దాడిమాన్భీ జపూర క్లాక్।
కాలీయకాన్దుకూలాంశ్చ హిజ్గవస్త్రైలపత్ర కాక్॥
ఖర్జూరనారికేళాంశ్చ హరీతక,విభీతక ।
మధూన్త్స ప్రపర్ణాంశ్చ బిల్వాన్పారావతాం స్తథా॥
ఆసనాంశ్చతమాలాంశ్చ నానాగుల్మ సమాస్థితా।
లతాశ్చ వివిధ కార: పుష్పపత్రఫలోపగాః ॥
ఏతే చాన్యేచ బహవ స్తత్ర కాననజా ద్రుమా: ।
నానాపుష్పఫలో పేతా వ్యరాజ న్త సమ స్తోతః॥
చకోరాసితపత్రాశ్చ మత్తాః కోకిలసారికాః ।
పుష్పితానుష్పితాగ్రస్థాసఞ్చరని మహా దుమా॥
రక్తపీతారుణా స్తత్ర పాదపాగ్రగతాః ఖగాక ।
పరస్పరమవేక్షన్త ప్రహృష్ఠా జీవజీవకాః॥
ఆ దేవునకు అచటి పర్వతాగ్రములందు సువాసన కల పుష్పమంజరుల ధరించి నానా పుష్పములతో నిండిన శుభ లతలును పెద్ద బోదేలును॥ చక్కని కొమ్మలును అనేక లతలును గల ఎత్తయిన కేతకాశోక ॥ సరళ నాగతిలకార్జున శోకకర్లలకుచ చీన వృక్ష చూత నీపనాగ వృక్షకదంబ వకుళ ధవ ప్రియంగుపాటల శాల్మలిహరిద్రక సాలతమాలతాల చంపక వృక్షములును ఇంక ను మనోహరములయి పూచి ప్రకాశించు మహాశాఖలు గల వృక్షములును మం డెడి ఆగ్నివంటి పగడపు చెట్లును వరుణ వత్సనాభ చందన సుమనస నింబాశ్వతతిందుక పారిజాత లోధ్ర మల్లికా భద్రదారు కామలకీ జంబూవృక్ష ములును లకుచ శైలవాలుక మందారకుస్తుంబరక కదంబకుటజ రక్షకురువక - నీలకురువ కాగురు కుసుంభ దాడిమ బీజపూరక కాలేయక దుకూలపొంగు తైలపతక ఖర్జూర నారికేళ హరీతక,విభీతక మధూక న ప్రపర్ల బిల్వపారా వత వృక్షములును అసనతమాల వృక్షములును పలు విధములగు గుబురులు తమ చుట్టు, నున్న మరి వేరు వేరు చేట్టును పూవులు పండ్లు ఆకులు కలిగి వాటి కై ఉపయోగపడు వివిధాకార లతలును నానా పుష్పఫలయుతములగు ఇవియు ఇంకను అనేక వృక్షములును లతలును ఆ సభకు చుట్టుప్రక్కల సన్ని వైపులను కనబడెను॥ చకోరములును సితపత్రములు (తెల్లని రెక్కలు గల ఒక జాతి పక్షులు మ త్తిల్లిన కోకిలలు గోరువంకలును పుష్పించిన చెట్ల పై పూచిన రేమ్మల కొన లందు కూర్చుండేను॥ చకోరములు సంతోషముతో అట్లు కూర్చుండి పరస్పరము చూచుకొనుచుండెను॥
తస్యాం సభాయాం దైత్యేన్ద్రో హిరణ్యకశిపు స్తదా ।
స్త్రీసహస్రైః పరివృతో విచిత్రాభరణామ్బరః॥
అనర్ఘ్యమణివజ్రార్చి శ్శిఖాజ్వలితకుణ్డలః ।
ఆసీనశ్చాసనే చితే దశ నల్వప్రమాణతః॥
దివాకర నిభే దివ్యే దివ్యా స్తరణసం సృతే ।
దివ్యగన్దవహ స్తత్ర మారుతస్సు సుఖో వవౌ॥
హిరణ్యకశిపుర్దై త్య ఆస్తే జ్వలితకుణ్డలః ।
ఉపవిష్టం మహాదైత్యం హిరణ్యకశిపుం తదా॥
దివ్యగానేషు గీతాని జగుర్గన్దర్వసత్తమాః ।
విశ్వాచీ సహజన్యాచ ప్రమ్లోచ న్తీచ విశ్రుతా॥
దివ్యాచ సౌరభేయీచ సమీచీ పుఞ్జికస్థలా ।
మిశ్ర కేశీచ రమ్బాచ మిత్రలేఖా శుచిస్మితా॥
చారునేత్రా ఘృతాచీచ మేనకా చోర్వశీ తథా ।
ఏతాస్సహస్రశ శ్చాన్యా నృత్యగీతవిశారదాః॥
ఉపతిష్ఠన్తి రాజానం హిరణ్యకశిపుం తదా ।
అపుడా నభయందు గే త్యేంద్రుడగు హిరణ్యకశిపుడు వేలకొలది స్త్రీలు తను పరివేష్టించియుండ విచిత్ర ప్రలు విధములగు) వస్త్రాభరణముల ధరించి వెల ఇంత నరాని మణుల॥వజ్రముల-జ్వాలల కొనలతో ప్రకాశించు కుండలములు దాల్చి రవివలె ప్రకాశించుచు దివ్యము లగు పరపులు పరచినదయి పది నల్వముల ఘన పరిమాణము (నల్వము –నాలుగు వందల మూరలు) గల చిత్రమగు పలు విధముల అమరికలు అలంకరణములు గల) ఆసనమందు కూర్చుండెను॥ (20 మూరలు వెడల్పుx20 మూ॥ పొ॥ X 10 మూ॥ ఎత్తు = 4000 ఘన మూరలు ఆచట దివ్య గంధములతో మిగుల హాయి గొలుపు గాలి వీచుచుండెను॥ అట ఇట్లు జ్వలించు కుండలములతో కూర్చున్న మహాదైత్యుడగు హిరణ్యకశిపుని కొలుచుచు గంధర్వ సత్తములు దీవ్య గానములందలి గీతములు పొడుచుండిరి॥ విశ్వాచీ సహజన్య ప్రమ్లోచంతీ సౌర భేయి సమీచీ పుంజికస్థల మీశ్రకేశి రంభా మిత్రలేఖ శుచిస్మిత చిరునేత్ర అగు, ఘృతాచీ॥ మేనక ఊర్వశి-వీరును ఇంకను వేలకొలది నృత్యగీత విశారదలగు దేవ స్త్రీలును రాజగు హిరణ్యకశిపుని సేవించుచుండిరి॥
తత్రాసీనం మహాబాహుం హిరణ్యకశిపుం ప్రభుమ్॥
ఉపాసన్త దితేః పుత్రాస్సర్వే లబ్దవరా స్తథా ।
తమప్రతిమకర్మాణం శతశోఽథ సహస్రశః॥
బలిర్విరోచన స్తత్ర నరకః పృథివీసుతః ।
ప్రహ్లాదో విప్రచిత్తిశ్చ గవిష్ఠశ్చ మహాసురః॥
దశగ్రీవశ్చ వాలీచ మేఘవాసా' దురాసదః ।
ఘటాస్యోఽకంపనశ్చైవ ప్రజాన శ్చేన్ద్రతాపనః॥
దైత్యదానవసజ్ఘాశ్చ సర్వే తీవ్రపరాక్రమాః ।
సురహన్తా దుఃఖహన్తా సునామా సుమతిర్వరః॥
ఘటోదరో మహాపార్శ్వః క్రథనః కఠిన స్తథా ।
విశ్వరూప స్సురూపశ్చ స్వవలశ్చ మహాబలః॥
స్రగ్విణో వాగ్మి నస్సర్వే సర్వేచ చరితవ్రతాః ।
సర్వేలబ్దవరాశ్శూరా స్సర్వే, విగతమృత్యవః॥
ఏతే చాన్యేచ బహవో హిరణ్యకశిపుం ప్రభుమ్ ।
ఉపాస న్తే మహాత్మానం సర్వే దివ్యపరిచ్ఛదా॥
విమానై ర్వివిధాకారై ర్భ్రాజమానై రివాగ్ని భిః ।
మ హేన్ద్రవపుషస్సర్వే విచిత్రాజదబాహవః॥
భూషితాజ్గా దితేః పుత్రా స్తముపాసన్త సర్వశః ।
తస్యాం సభాయాం దివ్యాయా మసురాః పర్వతోపమాః॥
హిరణ్యవపుషస్సర్వే దివాకర సమ ప్రభాః ।
న శ్రుతం నైవ నో దృష్టం హిరణ్యకశిపోర్యథా॥
ఐశ్వర్యం దైత్య సింహస్య యథా తస్య మహాత్మనః ।
రజతకనకచిత్ర వేదికాయాం పరిధృతరత్న విచిత్రవీథికాయామ॥
సదదర్శ మృగాధిప సభాయాం సుర చిరత్నగవాక్ష శోభితాయామ్ ।
కనక విమలహార భూషితాజ్గం దితితనయం స మృగాధిపో దదర్శ॥
దివసకరకరప్రభం జ్వలన్తం దీపాజశ తై సతతం ని షేవ్యమాణమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే హిరణ్యకశిపూసౌఖ్యానే నరసింహ ప్రాదుర్భావ హిరణ్యకశిపు సభావర్ణనాది కథనం నామ షష్ట్యుత్తరశతతమోఽధ్యాయః॥
నిరుపమానములగు పనులు చేయ సమర్థుడగు ఆ దైత్యేంద్రుని హిరణ్యకశిపుని ప్రా ప్రవరులగు వందల కొలది వేల కొలదిగ దితిజులు సేవించుచుండిరి॥ బలి విరోచనుడు పృథివీ పుత్తుడగు నరకుడు ప్రహ్లాదుడు విప్రచి త్తి మహాసురు డగు గవిష్ఠుడు దశగ్రీవుడు (రావణుడు) వాలి (దైత్యుడు) చేరుటకు అలవికాని మేఘవాససుడు ఘటాస్యుడు అకంపనుడు ప్రజానుడు ఇంద్రజాపనుడు తీవ్ర పరాక్రములగు ఇట్టి దైత్యదానవ సంఘములవారును సురహంత దుఃఖహంత సునామన్ వరుడు ఘటోదరుడు మహాపార్శ్వుడు కథనుడు కఠినుడు విశ్వరూపుడు సురూపుడు మహాబలుడగు స్వవలుడు ఈ మొద లగు వారును వారిలో నుండిరి॥ వీరేకాక ఇంకను ఇతరు లనేకులు మహాత్ముడును ప్రభుడు నగు హిరణ్యకశిపుని సేవించు చుండిరి॥ వీరందరును పూలమాలలు దాల్చినవారు చక్కగ మాటాడువారు గొప్ప నియమముల పాటించువారు॥ వరముల పొందినవారు శూరులు మృత్యువు లేనివారు దివ్యములగు సాధనములును ఆలంకరణములును కలవారు వివిధాకారములు గలిగి అగ్ను లవలె ప్రకాశించు విమానముల పై సంచరించువారు మహేంద్రుని దేహమువంటి దేహములు కలవారు పలు విధములయి విచిత్రములగు భుజకీర్తుల దాల్చినవారు ఆయా అవయవములందు కూడ ఆలంకరణములుకలవారు కొండల వvటి దృడ శరీరములు కల వారు బంగారువలే మెరయు శరీరములవారు రవివలే వెలుగువారు నయి యుండిరి॥ దైత్యసింహుడు మహాత్ముడు నగు హిరణ్యకశిపునకు వలె నుండు ఐశ్వర్యము మరేచ్చట నెవ్వరికిని ఉండుట కనబడదు; వినబడదు॥ చక్కగ రచించిన రత్న గవాక్షములతో శోభిల్లు సభయందు చక్కగ తాపించిన రత్న ములతో ఆచ్చెరువు గోలుపు ఆసనముల వరుసలు కలిగి వెండితో బంగారుతో నిర్మించిన చిత్ర వేదికయందు విమల కనక హారములతో భూషి తొంగుడయి రవికిరణ తేజోవంతుడయి జ్వలించుచు వందల కొలది దైత్యుల సేవలందుకొనుచున్న హిరణ్యకశిపుడు ఇట్లు నర సింహ దేవునకు కనబడెను॥ (గమనిక :- హిరణ్యకశిపుని కొలువులో ప్రహ్లాద విరోచన బలి ప్రభృతి దైత్యులున్నా రని ఇచట చెప్పబడినది॥ దీనిని బట్టి ఈ కథ యందలి ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతమునందు వలె పసివాడు కాడు॥)
ఇది శ్రీమత్స్య మహాపురాణమున హిరణ్యకశిపుపాఖ్యానమున నరసింహ ప్రాదుర్భావ హిరణ్యకశిపు సభావర్ణన నిరూపణమను నూట ఆరువదియవ అధ్యాయము॥
Summary of chapter 160 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya recounts how the great Vaishṇava devotee Prahlāda, residing in the entourage of Andhakāsura due to ancestral bonds, attempted to avert total catastrophe by offering wise counsel to the demon king. Prahlāda warned Andhakāsura of the transcendent, unlimited power of Mahādeva and Bhagavān Vishṇu, reciting a sublime hymn praising Mahādeva as the ultimate source of creation, maintenance, and dissolution. Prahlāda urged Andhakāsura to abandon his foolish pride, surrender at the lotus feet of Mahādeva, and return Svarga to the Devas, but the stubborn demon king rejected the righteous advice.