86 - తిలపర్వత దానము

 ఈశ్వరః : అతఃపరం ప్రవక్ష్యామి తిల శైలం విధానతః

త్రత్పదానపరో యాతి విష్ణులోక మనుత్తమమ్

 ఉత్తమో దశభి ర్ద్రోణై ర్మధ్యమః ప ఞ్చభి ర్మతః

 త్రిభిః కనిష్ఠో వి ప్రేన్ద్ర తిల శైలః ప్రకీర్తితః

 పూర్వవ చ్చాపరా న్త్సర్వా న్విషమ్బా సభితో గిరీక్

 దానమ న్త్రం ప్రవక్ష్యామి యథావ న్మునిపు జ్గవ

 యస్మా న్మధువధే విష్ణో ర్దేహాదథ సముద్భవాః

 తిలాః కుశాశ్చ మాషాశ్చ తస్మా చ్ఛ న్నో భవ త్విహ

 హవ్యక వ్యేషు యస్మాచ్చ తిలా ఏవాభిరక్షణమ్

భవా దుద్దర శైలేన్ద్ర తీలాచల నమోఽస్తు తే

 ఇత్యామంత్ర్యచ యో దడ్యా త్తిలాచల మనుత్తమమ్

 స వైష్ణవపదం యాతి పునరావృత్తిదుర్లభమ్

దీర్ఘ మాయు రవాప్నోతి పు త్త్రవ త్వంచ మానవః

 పితృభి ర్దేవగన్దర్వైః పూజ్యమానో దివం వ్రజేత్

ఇతి శ్రీమత్స్యమహాపురాణే తిలపర్వత దానమాహాత్మ్యకథనం నామ షడశీతిత మోఽధ్యాయః

 ఈశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను. ఇక మీదట తిలపర్వత దాన విధానమును తెలి పెదను. దీనినాచరించిన వారు సర్వోత మమగు విష్ణు లోకమును పొందుదురు. దీని కై పదికాని ఐదుకాని చూడుకాని ద్రోణముల తిలలు కావలెను. దీనియందు అన్ని యంశములును ధాన్య పర్వత దానమందువలేనే. (దానమంత్రము.) శ్రీ మహా విష్ణువు మధు దానవుని వధించునపుడు ఆతని దేహమునుండి తిలలును కుశ లును మినుములును జనించినవి. ఆటి తిలలు నాకు శాంతికలిగించు గాక ! హవ్యకవ్య దేవతా-పితృ దేవతా) - కర్మములందు తిలలే అభిరక్షించునవి: ఆటి తిలల పర్వతమా! నన్ను సంసా రమునుండి తరింపజేయుము. ఇట్లు మంత్రించి ఆ వాహనము చేసి) తిల పర్వత దానము చేయువాడు పునరావృత్తి రహిత మగు విష్ణులోకమునుచేరి సుఖించును. ఇహలోకమునందును దీర్ఘాయువును పుత్ర పౌత్తులను పొందును. పితరులు ను దేవతలును గంధర్వులును పూజించుచుండ స్వర్గమున సుఖించును.

ఇది శ్రీమత్స్య మహా పురాణమున తిల పర్వత దానమాహాత్మ్యకథనమను ఎనుబది ఆరవ అధ్యాయము.