మత్స్య మహా పురాణము
187 - ఈశ్వరుడు బాణాసురుని త్రిపురముల దహించుట॥
మార్కణ్డేయః : యన్మాం వృచ్ఛసి కౌంతేయ తన్మే నిగదత శ్శృణు ।
ఏతస్మిన్న నరే రుద్రో నర్మదాతట మాశ్రితః॥
నామ్నా మా హేశ్వరం స్థానం త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
తస్మింస్థానే మహాదేవ శ్చి క్షయం స్త్రైపురం వధమ్॥
గాణ్డీవం మన్దరం కృత్వా గుణం కృత్వాన వాసుకిమ్।
స్థానం కృత్వాతు వైశాఖం విష్ణుం కృత్వా శరో త్తమమ్॥
శల్యే చాగ్ని ప్రతిష్టాప్య ముఖే వాయుం సమర్పయః ।
హయాంశ్చ చతురో వేదా శర్వదేవమయం రథమ్॥
అభీషవోశ్వినౌ దేవా వక్షో వజధర స్వయమ్ ।
స తస్యాజ్ఞాం సమాధా(దా)య తోరణే ధనద స్థితః॥
యమస్తు దక్షిణే హస్తే వామే కాలస్తు దారుణః ।
చకే త్వమర కోట్యస్తు గన్జర్వా లోక విశ్రుతాః॥
ప్రజావతీ రథప్రషే బ్రహ్మా చై వతు సారథిః ।
ఏవం కృత్వాతు దేవేశ స్సర్వదేవమయం రథమ్॥
సోతిష్ఠల్గొణుభూతస్తు సహస్రపరివత్సరాః ।
యదా త్రీణి సమేతాని అ నరికే స్థితానివై॥
త్రివర్వణా త్రిశ ల్యేన తథా తాని వ్యభేదయత్ ।
శరః ప్రస్థాపిత స్తత్ర రుద్రోణ త్రిపురం ప్రతి॥
భ్రష్ట తేజాః స్త్రియో జాతా బలం తాసాం వ్యశీర్యత ।
ఉత్పాతాశ్చ పురే తస్మి నాదుర్భూతా స్సహస్రశః॥
త్రిపుర స్య వినాశాయ కాలరూపాభవం స్తదా ।
ఆట్టహాసం ప్రములోని హయాః కాష్ఠమయా స్తదా॥
నిమేషోన్మేషణంచైవ కుర్వంతే చిత్రరూపిణః ।
స్వప్నే పశ్యన్తి చాత్మానం రక్తామ్బర విభూషితమ్॥
మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను: ధర్మరాజా! నీవు నన్నడిగినది తెలి పెదను వినుము; ఈ నడుమ కాలములో నర్మదాతీరమునందు త్రిలోక ప్రసిద్ధమగు మా హేశ్వరమను స్థానమునందుండి త్రిపురవధ విషయ మాలోచించేను॥ మందర పర్వతమును (గాండీవ) ధనువుగా వాసుకిని ఆల్లే తాటినిగా కుమారస్వామిని శరము నిలుపు స్థానమునుగా విష్ణుని శరమునుగా చేసికొనెను; బాణపు మొనయందు అగ్ని ని పై ప్రదేశమున వాయువును నిలిపేను; దేవత లందరు కూడి రథము కాగా నాలుగు వేదములు గుర్రము లయ్యెను; అశ్వినులు పగ్గములు ఇంద్రుడు ఇరుసు అయ్యెను॥ కుబేరుడిశ్వరాజ్ఞచే ప్రధాన ద్వారమందు నిలిచెను; కుడి చేతి వైపున యముడును ఎడమచేతి వైపున భయంకరుడగు కాలదేవుడును ఉండిరి॥ చక్రమునందు కోట్లకొలదిగా లోకప్రసిద్దులగు దేవతలును గంధర్వులు నుండిరి॥ రథపు ముందు భాగమున ప్రజాపతి యుండెను; బ్రహ్మ సారథి యయ్యెను; ఇట్లా దేవేశుడు సర్వదేవమయమగు రథమును నిర్మించుకొని స్థాణు భూతుడై నిశ్చలుడై ॥వేయి పరివత్సరముల కాలము అట్లే వేచియుండెను॥ ఎపు డా మూడు పురములును ఒకటిగా కూడి అంతరిక్షమునందుండెనో ఆపుడు రుద్రుడు త్రిపురముల మీదకు తన శరమును ప్రయోగించేను॥ ఆది మూడు కణుపులుకు మూడు మొనలును కలది; దానితో రుద్రుడు త్రిపురములను భేదించదల చేను; అప్పటికే త్రిపుర స్త్రీలు తేజో హినలయిరి; వారి బలము శిథిలమయ్యెను; ఆ త్రిపురమందును వేలకొలది ఉత్పాతములు-ప్రాదుర్భవించి కనబడెను; అవి యన్ని యు త్రిపుర వినాశకరములగు కాలపురుషరూప మయినవి; అవి ఏవీ అనిన కొయ్యతో చేసిన గుర్రములు ఆట్టహాస ములు చేసేను; చిత్తరువులలో బొమ్మలును కన్నులు మూయుచు తెరచుచు ఉండెను; కలలో ఎవరికి వారు తాము రక్త వస్త్రము ధరించి యున్నట్లు కనబడిరి॥
స్వప్నే పి సర్వే పశ్యంతి విపరీతాని యానిచ ।
ఏతాన్పశ్యన ఉత్పాతాం స్తత్ర స్థానేతు యే జనాః॥
తేషాం బలంచ బుద్ధిశ్చ హర కో పేన నాశితే ।
తత సాంవర్తకో వాయు ర్యుగా నప్రతిమో మహా॥
సమీరితోఒనల స్తేన ఉత్తమాజ్గేష ధావతి ।
జ్వల పాదపా సత్ర పత ని శిఖరాణిచ॥
సర్వతో వ్యాకులీభూతం హాహాకార మచేతనమ్ ।
భగ్నో ద్యా నాని సర్వాణి క్షిప్రం తతత్యభజ్యత॥
తేనైవ పీడితం సర్వం జ్వలితం త్రిశిఖై శ్శరై : ।
ద్రుమాళ్చారామఖడ్గాని గృహాణీ వివిధాని॥
దశ దికు ప్రవృత్త్యం సమృద్దే హవ్యవాహనః ।
మనశ్శిలాపుజ్జునిలో దిశాదశ విభాగతః॥
శిఖాశతై రనే కై స్తు ప్రజజ్వాల హుతాశనః ।
సర్వం కింశుక వర్ణాభం జ్వలితం దృశ్య లేపురమ్॥
గృహాద్గృహాన్తరం నైవ గస్తుం ధూ మేన శక్యతే ।
హరకోపాగ్ని నా దగ్గం కన్దమానం సుదుఃఖితమ్॥
ప్రదీ ప్తం సర్వతోదీకు దహ్యతే త్రిపురం పురమ్ ।
ప్రాసాద శిఖరాగ్రణి వ్యకీర్యస్త సహస్రశః॥
నానామణివిచిత్రాణి విమానాన్య వ్యనేకశః ।
గృహాణేచైవ రమ్యాణి దహ్య నే దీ ప్రవహ్ని నా॥
ధావ నీ ద్రుమఖణ్డేషు వలభీషు తథా జనాః ।
దేవాగా రేషు సర్వేషు ప్రజ్వలన్తః ప్రదావితాః॥
క్రన్ద ని చానలం దృష్ట్వా నర్ద ని వివిధై స్స్వరైః ।
గిరికూటనిభా స్తత్ర దృశ్యంత్రేజ్జ్గార రాశయః॥
అచటివారి కందరకును లోక విరుద్ధములగు ఏయే విషయములు స్వప్న మునందు కనబడెనో అవియే ఉత్పాత ములుగా జాగ్రదావస్థలో జనులకు కనబడసాగెను॥ వారి బుద్ధియు బలమును హరుని కోపమున నాళ మందెను॥ కల్పాంత మందు వలే ప్రళయమారుతము చెల రేగి వీచసాగెను; ఆ వాయువుచే పేరణ నందిన అగ్నియు అచటి వారి తలల పైగా పరుగే తసాగెను; వృక్షములు మండుచుండెను; భవనములు మొదలగు వాని శిఖరములు పడసాగెను; అంతటను కలవర పాటు హాహాకారము చైతన్యము లేక పోవుట వ్యాపించెను; ఉద్యానములన్నియు భగ్నము లయ్యెను; ఇంత లో ఆ నగర మే ముక్కలు కాసాగెను; ఆ రుద్రుని మూడు మొనల శరములతో సర్వ నగరము పీడితమయ్యెను; వృక్షములు ఉద్యాన భాగ ములు వివిధ గృహములు అన్నియు దగ్గము లయ్యెను; ఈ సమృద్ధిగల యగ్ని మనశ్శిలల రాశివలె వెలుగుచు పది దిక్కులందును పది విధములుగ భాగములయి ప్రవర్తిల్లి వ్యాపించేను; వురముతయు మోదుగ పూవన్నె తో మండుచు కనబడెను; పొగ మూలమున ఒక ఇంటినుండి మరియొక ఇంటికి పోవుటకును శక్యము కాకపోయెను; ఆది హర కోపాగ్ని తో దగ్గమగుచు ఏడ్చుచు దుఃఖించుచు నుండెను; అట్లా త్రిపురపురము పెద్దగా మండుచుండ ఆ మంట లన్ని దెసలకును వ్యాపించెను; వేలకొలదిగా ప్రాసాద శిఖరాగ్రములు శిథిలము లయ్యెను; నానా మణులతో విచిత్రములయి కనబడు అనేక విమానములు (మహాభవనములును॥ ఆకాశ యానములును) రమ్యములగు గృహములును అనేక ములు ఆ ప్రజ్వలించు అగ్ని లో కాలిపోయెను; అచటి జనులందరును తామును కాలిపోవుచు రక్షణకై చెట్ల గుబురులలోనికిని భవనములమీది గూడులవంటి గృహభాగములవలభులలోనికిని పరుగే తసాగిరి; వారా యగ్ని ని చూచి వివిధ స్వరములతో ఏడువసాగిరి; కేకలు వేయ సాగిరి; అచట కొలది సేపటిలో కొండల శిఖరములంతటి బొగ్గుల-నిప్పు కణికెల-కుప్పలు కనబడసాగేను॥
స్తువంతి దేవదేవేశం పరితాయస్వ సామ్పతమ్ ।
అన్యోన్యంచ పరీష్వజ్య హుతాశశరదీసితాః॥
దహ్యంతే దానవో సత్ర శతశోథ సహనశః ।
హంసకారణ్డవాకీర్ణా నళిన్య స్సహపజ్కజాః॥
దృశ్య నేనలదళాని పురోద్యానాని దీర్షి కాః ।
అనపజ్కజచ్ఛన్నా విస్తీర్ణా యోజనాయతాః॥
గిరికూటనిధి సత్ర ప్రాసాదా రత్న భూషితాః ।
పత న్యనలనిర్దగా నిస్తోయా జలజా ఇవ॥
పరస్త్రీ బాలవృద్ధేషు గోషు పక్షీ షు వాటిషు ।
నిర్గయో దహతే వహ్నిరర్హరకోప పనోదితః॥
సహస్రశః ప్రసుప్తాశ్చ సుప్తాశ్చ బహవో జనాః ।
పుత్రమాలిజ్య తే గాడం దహ్య స్తే త్రిపురాగ్ని నా॥
అథ తస్మి న్పు రే దీ పై శ్రియశ్చాప్సరసోపమాః ।
అగ్ని జ్వాలాహతా సత్ర పత ని ధరణీతలే॥
కాచిచ్ఛ్యామా విశాలాక్షీ ముక్తావళివిభూషితా ।
ధూమేనాకులితా సౌ తు పతితా ధరణీతలే॥
కాచిత్కనకవర్ణాభా ఇన్దనీలవిభూషితా ।
భర్తారం పతితం దృష్ట్వా పతితా తస్య చోపరి॥
కాచిదాసీత్యసఙ్కాశా ప్రసుప్తాచ గృహే స్థితా ।
అగ్ని జ్వాలాహతా సా తు పతితా గతచేతనా॥
ఉత్తితో దానవ సత్ర గదాహస్తో మహాబలః ।
వైశ్వానరహత స్సోపి పతీతో ధరణీతలే॥
మేఘవర్ణాఒపరా నారీ హార కేయూర భూషితా ।
శ్వేతవస్త్రపరీధానా బాలం స్తన్యం న్యధాపయత్॥
దహ్యంతం బాలకం దృష్ట్వా రుదతే మేఘశబ్దవత్ ।
ఏవం సదహతే దీప్తో హర క్రోధేన పేరితః॥
మమ్ము ఇప్పుడు రక్షించుమాయని దేవదేవేశుని వారు ప్రార్థించసాగిరి; వారు ఒకరి నింకొకరు కౌగిలించుకొని అగ్ని మయ బాణజ్వాలలతో జ్వలించ జేయబడుచు వందల-వేలకొలదిగా దానవులు ఆచట దహించబడుచుండిరి॥ హంస లతో కారండవ పక్షులతో వ్యా ప్రములయి పద్మములతో కూడిన సరస్సులును పురో ద్యానములును వాడని పద్మములతో వ్యాపింపబడిన యోజనముల కొలది పొడవు వెడల్పులు కలిగి విశాలములై న నడ బావులును ఆగ్నిచే దగ్గములయి కనబడసాగేను॥ పర్వత శిఖర సమానములును రత్న భూషిత ములును నగు ప్రాసాదములును అగ్నిచే నిః శేషముగా కాల్చ బడి జలములేని మేఘములవలె బూడిదయ్ కసబడుచు క్రింద పడుచుండెను॥ హరుని కోపముచే పేరింపబడిన యగ్ని నిర్దయుడై యువతులయందును దొలుగయందును వృద్దులయందును క్ర మ్మీ వారిని దహించుచుండెను॥ గాఢనిద్రయందును స్వప్న ములందును మునిగియున్న వేలకొలది॥ జనులు తమ తమ పుత్రులను గాఢముగా కౌగిలించుకొని త్రిపురాగ్ని లో కాలిపోవుచుండిరి॥ ఆట్లు దీపించుచున్న ఆ త్రిపురములలో అప్సరసలవంటి స్త్రీలు అగ్ని జ్వాలల తాకిడికి చచ్చియు కొలియు ధరణీతలమున పడుచుండిరి॥ విశాల నయనములు కలదియు ముకాహార విభూషితయు నగు ఒకానొక చామనచాయగల సుందరి (శ్యామ) పొగతో కలత నంది ధరణీత లమున పడెను॥ బంగారుచాయ కలదియు ఇంద్రనీలమణి విభూషితయు నగు ఒక ముత్తైదువ తన భర్త పడిపోవుట చూచి తాను నతని పై పడిపోయెను; గాఢనిద్రలో తన ఇంటి నున్న సూర్యతేజస్కయగు ఒక స్త్రీ అగ్ని జ్వాలాహతయే తెలివి తప్పి పడిపోయెను; గదాహస్తుడై లేచి నిలువబడిన మహాబలుడగు దానవు డొకడు అంతలోనే ఆగ్నిహతుడయి ధరణీ తలమున పడెను; హారములతో కేయూరములతో (బాజూబందులతో) భూషితయగు మేఘ సమచ్ఛాయగల యొక యువతి తెల్లని వస్త్రము ధరించియుండి తన బాలునకు పాలు త్రావించుచుండి ఆంతలో బాలుడు కాలుచుండుట చూచి మేమధ్వనితో ఏడువసాగెను॥ హర క్రోధ పేరితుడగు అగ్ని త్రిపుర మును ఇట్లు దహించ సొగేను॥
కాచిచ్చన్దప్రభా సౌమ్యా వజ్రవైడూర్యభూషితా ।
సుత మాలిజ్గ్య వేపంతీ దగ్ధాపతత భూతలే॥
కాచిత్కున్దేనువర్ణాభా యా శయానా గృహేస్థితా ।
గృహే ప్రజ్వలితే సా తు ప్రతిబుద్దా శిభిర్దితా॥
పశ్య నం జ్వలితం సర్వం హా సుతో మే దివం గతః ।
సుతం సన్హగ్గ మాలిజ్య పతితా ధరణీతలే॥
కాచిత్సువర్ణ వర్ణాభా నీలరత్నై ర్విభూషితా ।
ధూమేనాకులితా సా తు పతితా ధరణీతలే॥
అన్యా గృహీతహస్తాతు సఖ్యా దహ్యతి బాలికామ్ ।
అనేక దివ్యరత్నాథ్యాం దృష్ట్వా దహనమోహితా॥
శిరసి ప్రాజ్ఞలిం కృత్వా విజ్ఞాపయతి పావకమ్ ।
యది త్వ మిచ్చ సే వైరం పురు షే ష్వపకారిష॥
స్త్రియః కిమపరాధ్యంతే గృహపఞ్చర కోకిలాః ।
పాప నిర్దయ నిర్లజ్జ క స్తే కోపః శ్రీయోపరి॥
న దాక్షిణ్యం న తే లజ్ఞాన సత్యం శౌర్యవర్జిత।
అనేన హ్యుపసర్గేణ తూపాలమ్భం శిఖిన్యదాత్॥
కిం త్వయా న శ్రుతం లోకే ఆవధ్యా శ్శత్రుయోషితః ।
కిం తు తుభ్యం గుణా హ్యేతే దహనోత్సాదనం ప్రతి॥
నకారుణ్యం దయాదాపీ దాక్షిణ్యం న శ్రియః ప్రతి ।
దయాం కుర్వని మేచ్ఛాఒపి దహ క్లీం వీక్ష్య యోషితమ్॥
మేచ్చానామపి కష్టోసి దుర్ని వారో హ్యచేతనః ।
ఏతే చైవ గుణాస్తుభ్యం దహనోత్సాదనం ప్రతి॥
ఆసామపి దురాచౌరస్త్రీణాంకి తే నిపాత సే ।
దుష్ట నిర్ఘృణ నిర్లజ్జ హుతాశీ న్మందభాగ్యక॥
నిరాశత్వం దురాచారాబలం దహసి నిర్దయ ।
ఏవం విలప్యమానాస్తా జల్పమానా బహూన్యపీ॥
వజ్రవైడూర్యభూషితయు చంద్ర సమానకాంతియు సౌమ్య స్వభావయు నగు ఒక యువతి పుత్తుని కౌగిలించు కొని కాలిపోవుచు వణకుచు నేల పై బడెను; సూర్యుని వలెను అద్దమువలెను తళతళ మెరయు వన్నె కలదయి లక్ష్మియే యనదగి శోభిల్లు ఒక యువతి వహ్ని దహ్యమాన యగుచు ధరణి తలమున పడిపోయెను; మొల్లపూవువలేను చంద్రుని వలేను దేహకాంతిగల యొకతె తన గృహమున నిద్రించుచుండగా ఆ గృహము కాలుచుండ ఆగ్ని జ్వాలల తాపమునకు మేల్కాంచి అంతయు మండుచుండుట చూచి ఆయ్యో! నా సుతుడు మరణించేనేయని ఏడ్చుచు కుమారుని కౌగిలించుకొని ధరణి తలమున పడెను; బంగరుబోయ గలదియు నీలరత్న భూషితయు ఆగు ఒక స్త్రీ పొగతో కలవరపడి క్రింద పడి పోయెను; ఆనేక దివ్యరత్నా లంకృతయగు తన బాలిక దహింపబడుచుండుట చూచి దహనుని తాపముచే మోహితురాలయి (దిక్కు తోచక) యుండి తాను తన చెలితోడయి పట్టుకొనియుండగా శిరస్సునందు ఆంజలిఘటించి ఆగ్ని కి ఇట్లు మనవి చేయసాగెను; నీవు అపకారులగు పురుషులందు పగబూనిన పూనేదను కాక ! గృహమను పంజరమందు కోకిలలలవంటి వారగు స్త్రీలు నీ కేమి యపరాధ మొనర్చినారు? పాపా! నిర్గయా! నిర్ల జై! స్త్రీలపై నీకు కోప మేల? నీకు దాక్షిణ్యము లేదు; లజ్జ లేదు; నత్యము లేదు; శౌర్యము లేదు; అనుచు ఈ ఉపద్రవముతో బాధ నందిన ఆ స్త్రీ అగ్ని ని నిందింప సాగెను; శత్రుపక్షమువారినే యేనను స్త్రీలను చంపరాదను మాట నీవు వినలేదా? కాని అగ్నీ ! నీ గుణములన్నియు నాశము విషయమందే ప్రవ ర్తిల్లుచున్నవి॥ నీకు స్త్రీల పై దయలేదు; దాక్షిణ్యము లేదు; కారుణ్యము లేదు; కాలిపోవుచున్న ఆడు వారిని చూచినపుడు మ్లేచ్చుల కై నను దయ కలుగునే? నీవు ఆ మ్లేచ్చులకంటెను నీచతరుడవు; నిన్నెవరు కాని మానుష జాలరు; ఏలయన నీవు బుద్ధిరహితుడవు! ఈ స్త్రీలను ఇట్లు పడగొట్టుటలో నీకు కలుగు లాభ మేమి? దుష్టా! దయా రహితా! సిగ్గు లేనివాడా! వేల్చినదాని నెల్ల తినువాడా! మందభాగ్యుడా! పుణ్యాశలు లేని వాడా! దురాచారా! నీర్గయా! ఆబలలను దహించుచున్నావే! ఆనుచు ఆ స్త్రీలు ఇట్లు బహు విధములుగా విలపించుచు నిందాఐక్యములు వదరు చు ఉండిరి॥
అన్యాః క్రోశంతి సజ్జ్క్రుద్దా బాలశోకేన మోహితాః ।
దహసే నిర్ధయో వహ్నే సజుద్ధః పూర్వశత్రువత్॥
పుష్కరిణ్యాం జలం దగ్ధం కూ పేష్వపి తథైవచ ।
అస్మా నన్హహ్య మ్లేచ్ఛత్వం కాం గతిం ప్రాపయిష్యసి॥
ఏవం ప్రలపతాం తాసాం పహ్ని ర్వచన మబ్రవీత్ ।
అగ్నిః : స్వవ శే నైవ యుష్మాకం వినాశంతు క రోమ్యహమ్॥
అహ మాదేశకర్తా వై నాహం కర్తాస్మ్య సుగ్రహమ్ ।
రుద్రకోధసమావిష్ణో విచరామి యథేచ్ఛగూ॥
తతో బాణో మహాతేజా స్త్రీపురం వీక్ష్య దీపితమ్ ।
ఆసనన్ద్నబ్రవీదేవ మహం దేవై ర్వినాశిత॥
అల్పసత్వై ర్దురా చారై రీశ్వరస్య నివేదితమ్।
అపరీక్ష్య త్వహం దగ్గ శ్శ్క రేణ మహాత్మనా॥
నాన్యశ్శక్తస్తు మాం హర్తుం వర్జయిత్వా మహేశ్వరమ్ ।
ఉత్తీత శిరసా కృత్వా లిజం త్రిభువనేశ్వరమ్॥
నిర్గత్యతు పుర ద్వారా త్పరిత్యజ్య సుహృత్సుతాక్ ।
రత్నానీ సువిచిత్రాణి శ్రియో నానావిధా స్తథా॥
గృహీత్వా శిరసా లిజం గచ్ఛ నగనమడ్డలమ్ ।
స్తువంశ్చ దేవదేవేశం త్రిలోకాధిపతిం శివమ్॥
త్వతోపానలనిర్ధగో యది వద్యోస్మి శఙ్కర ।
త్వత్ర్పసాదా న్మహాదేవ మా మే లిజం వినశ్యతు,
అర్చితం హి మయా దేవ భక్త్యా పరమయా సదా ।
త్వతోపా ద్యది వధ్యోఒహు తదిదం మా వినశ్యతు॥
శ్లాఘ్య మేత స్మహాదేవ త్వతోపా దహనం మమ।
ప్రతిజన్మ మహాదేవ త్వత్పాదనిరతో హ్యహమ్॥
తోటకచ్ఛన్దసా దేవంస్తౌమి త్వాం పరమేశ్వర ।
మరికొందరు స్త్రీలు తమ బాలురు మరణించిన శోకముతో ఏమియు తోచక ఏడ్చుచుండిరి॥ వహ్నీ ! నీవు మా పూర్వ శత్రువువలె నిర్దయుడవయి మహాక్రోధముతో దహించుచున్నా వే? మేచ్చుడా! నీవు పుష్కరిణులయందును బావు లందును గల నీటిని కూడ కాల్చితివి; మమ్ములను కూడ దహించి ఏ గతి పొందింతువో తెలియదు; అని ఇట్లు వారు ప్రలాపములు చేయుచుండ విని అగ్ని ఇట్లు పలికెను: నేను నా ఇచ్చతో మీకు నాశము కలిగించుట లేదు॥ నేను (శివుని) ఆదేశ మాచరింతునే కాని స్వయముగ అనుగ్రహము చూపగలవాడగాను; రుద్రుని క్రోధము నన్నా వేశించగా అతని ఇచ్ఛ ననుసరించి నడుచుకొనుచున్నాను; అనెను॥ అంతట తన ఆసనమందున్న మహాతేజస్కుడగు బాణుడు త్రిపురము జ్వలించు చుండుట చూచి ఇట్లనుకొనెను; దేవతలు నన్ను నాశమందించిరి॥ అల్పసత్వులు (మనస్సున నిబ్బరము అంతగా లేని పొరు) దురాచారులు నయి ఈశ్వరునకు నా మీద నివేదించినారు; శంకరుడు తాను మహాత్ముడయ్యు (గొప్ప మనస్సుకల వాడు అయియు) సరిగా విచారించకయే నన్ను దహించుచున్నాడు; మహేశ్వరుడు తప్ప నన్ను చంపగలవారు ఎవరును లేరు; ఆనుచు ఆతడు లేచి నిలిచి త్రిభువనేశ్వరుడగు లింగరూపుని- శిరమున ధరించి పుర ద్వారము వెలువడేను; పుత్త మిత్రులను మహా విచిత్ర రత్నములను నానా విధ స్త్రీ జనమును విడిచెను॥ లింగమును మాత్రము శిరమున నుంచుకొని గగన మండలములోనికి పోవుచు దేవదే చేశుడును త్రిలోకాధిపతియు నగు శివుని ఇట్లు స్తుతించసాగెను॥ శంకరా! నీ కోపాగ్ని చే నేను నిర్గగుడను అయితిని॥ఆగుచున్నాను; నేను నీకు వధ్యుడనుగా తోచితినేమో! అగుగాక ! మహాదేవా! నీ ప్రసాద ప్రభావమున నొ ఈ లింగము మాత్రము నశించకుండు గాక! దేవా! నేనింతవరకును పరమభ కీతో నీ॥ ఈ లింగ మును అర్చించియుంటిని గదా! కావున నేను నీకు వధ్యుడనుగా తోచినను ఇది మాత్రము నశించకుండవలయును; మహా దేవా! నీ కోపముచే నేను దహింపబడుటయు మెచ్చదగినదే! ప్రతిజన్మమందును నేను నీ పాదములం దాసక్తి కలవాడను కావలయునను నా కోరికను మన్నించి అనుగ్రహించుము; పరమేశ్వరుడవగు నిన్ను దేవా! తోటక ఛందస్సుతో ఇదే స్తుతింతును; అని ఇట్లు బాణుడు తోటక వృత్తములతో శివుని స్తుతించెను॥
బాణాసురకృతశివస్తుతః - బాణాసుర కృత శివస్తుతి॥
ఓం : శివ శ జ్కర శర్వ హరాయ నమో ।
భవ భీమ మ హేశ్వర దేవ నమః॥
కుసుమాయుధ దేహవినాశకర త్రిపురాంతక అన్దక శూలధర ।
ప్రమదా ప్రియకా నవిభ(ర)క్త నమ ।
స్ససురాసుర సిద్ధగజై ర్నమిత॥
హయవానర సింహగ జేన్దముతై
రతిహ్రస్వక దీర్ఘముఖే శ్చ గణైః ।
ఉపలబ్దు మశక్యత రై రమరై ర్వ్యథితోస్మి శరీరశతైర్బహుభిః
ప్రణతోస్మి భవం భవః భ క్తిమతిశ్చలచన్దక లాకులదేవః నమః ।
న హి పుత్తకళతహయాదీధనం! సతతం మమ దేవ తవ స్మరణమ్॥
వ్యథితోస్మి తు బాహుశ తై ర్బహుభి॥ కిర్గమితాచ మహానరకస్య గతిమ్ ।
న నివర్తతి జన్మ న పాపమతి శ్శుచికర్మ నిబద్దమపి త్యజతి॥
అనుకమ్పతి విభ్రమతి సతి మమ చైవ కుకర్మ నివార యతి ।
యః పఠే తోటకం వృత్తం ప్రయత శ్శుచిమానసః॥
బాణస్యైవ యథా రుద్ర స్తస్యై వం వరదో భవేత్ ।
ఇదం స్తవం మహాదివ్యం శ్రుత్వా దేవో మహేశ్వరః॥
ప్రసన్నస్తు తదా తస్య స్వయం దేవో మహేశ్వరః ।
ఈశ్వరః : న భేతవ్యం త్వయా వత్స సౌవన్డే తిష్ట దానవ॥
పుత్రపౌత్రోసుహృద్బన్దుభార్యాబన్హుజనై స్సహ ।
అద్యప్రబృతి బాణ త్వ మవధ్య దశైరపీ॥
భూ య స్తస్య వరో దత్తో దేవదేవేన పాణ్డవ ।
ఆక్షయశ్చావ్యయో లో కే విచరస్వాకుతోభయః॥
“ప్రణవ స్వరూపా! శుభరూపుడవు శుభకరుడవు పాపుల హింసించువాడవు పాపముల హరించువాడపు మన్మథ శరీర నాశకుడవు త్రిపుర నాశకుడవు ఆంధకుని చంపిన వాడవు శూలధరుడవు ప్రియురాలగు పార్వతియందలి ప్రీతితో దేహమును విభజించుకొని సగమామెకిచ్చి ఆమెకు ప్రీతిపాత్రుడయినవాడవు సుందరుడవు సురాసుర సిద్ధగణములచేతను హయకపి సింహగజ ముఖులును మిగుల పొట్టివోపాడవయిననో ఆగు ముఖములు గలవారునగు ప్రమథులచేతను నమ స్కారములందుకొనువాడవునగు నీకు నమస్కారము; వీరు ఇట్టి ॥ న్వభావము గలవారని గ్రహింపనలవికాని దేవతల వలనను అనేక జన్మములందు కలిగిన వందలకొలది శరీరముల వలనను చాల వ్యథలనందితిని॥ భవుడవగు నీయందు భక్తిగల మతిగల వాడనగుచు నిన్ను నమస్కరించుచున్నాను; చలించుచుండు చంద్రకళతో వ్యాప్తుడవగు దేవాః నమ స్కారము; దేవా! నాకు పు తకళత్ర హయాది ధనమువలదు; సతతము నీ స్మరణము కావలయును; ఈ ఆనేక శత బాహుపులతో కూడ నాకు వ్యథయే కలుగుచున్నది; వీని మూలమున నేను నరకగతిని పొందింపబడుదునే కాని పుణ్యగతి నందను; వీనిచే జన్మ నివృత్తి కలుగదు; పాపమతియగువాడు నిబద్దనుగు (శాస్త్ర విహితమగు) పవిత్ర కర్మమును విడిచి పెట్టును; కానీ నామనస్సు వెనువెంటనే మాటిమాటికి కంపించుచున్నది; భ్రాంతి నందుచున్నది; భయమందుచున్నది; అందుచే నన్ను దుష్కర్మమునుండి నివారించుచున్నది॥”
ప్రయతుడయి (స్నా నముచేసి మడుగు వస్త్రముల ధరించి) శుచి మనస్కుడయి ఈ తోటక వృత్త రూపమగు సవమును పఠించువానిని శివుడు॥ బాణు ననుగ్రహించిన బ్లే యనగ్రహించి ఆతనికి వరదుడగును॥ ఈ మహా దివ్య స్తవ మును విని మ హేశ్వర మహాదేవుడు బాణునియందు ప్రసన్ను డే అతనితో ఇట్లనెను: వత్సా! దానవా! భయమందకుము; నీవు నీపుత్ర పౌత్త మిత్రబంధు భార్యా తద్బంధుజనులతో కూడ సువర్ణ నగరమందుందువు; ఇక మీదటను నీవు దేవతలకును ఆవధ్యుడవగుదువు; ఆని ధర్మరాజా! శివుడు అతనికి ఇంకను మరోక వరమును ఎవరి వలనను దేని వలనను భయము లేక ఆక్షయమును అవ్యయమును (నశించనిది మార్పులేనిది) అగు లోక మందు విహరించునట్లును వర మును కూడ ఇచ్చెను॥
తతో నివారయామాస రుద్ర స్సప్తశిఖం తదా ।
తృతీయం రక్షితం తస్య పురం తేన మహాత్మనా॥
ద్రమత్తు గగనే దివ్యం రుద్రతేజః ప్రభావతః ।
ఏవం తత్త్రిపురం దగ్గం శఙ్కరేణ మహాత్మనా॥
జ్వాలామాలాప్రదీ హంతు పతితం ధరణీతలే ।
ఏకం నీపతితం తత్ర శ్రీ శైలే త్రిపురాన్త కే॥
ద్వితీయం పతితం తత్ర పర్వతేమర కణ కే ।
దగ్ధతు త్రిపురే రాజ స్రుద్రకోటికి ప్రతిష్ఠితా॥
జ్వల త్తదంత త్తత్ర తేన జ్వాలేశ్వరసృతః ।
ఊర్డ్వేన ప్రస్థితా స్తస్య తత్తజ్జ్వలా దివం గతాః॥
హహాకార స్తదా జాతో దేవాసుర కృతో మహాక్ ।
శర మ స్తమ్భయ ద్రుద్రో మా హేశ్వరపురోత్తమే॥
ఏవం వృత్తం తదా తస్మి స్పర్వతేమర కణ కే।
చతుర్ధశాఖ్యం భువనం స భుక్త్వా పాణునన్దన॥
వర్ష కోటిసహ సేతు త్రింశత్కోట్య స్తథాపరాః ।
తతో మహీతలం ప్రాప్య రాజా భవతి ధార్మిక ॥
పృథివీ మేకచ్ఛత్రేణ భు జ్కే నా సత్ర సంశయః ।
ఏవం పుణ్యోమహారాజ పర్వతోమరకజ్జిక
చన్దసూర్యోపరాగేమ యో యాత్యమరకణకే ।
అశ్వమేధా దశ గుణం ప్రపద మనీషిణః॥
స్వర్గ లోక మవాప్నోతి దృష్ట్వా తత్ర మ హేశ్వరమ్ ।
బ్రహ్మహత్యా గమిష్య స్త్రీ రాహుగ దివాకరే॥
తదేవం నిఖిలం పుణ్యం పర్వతే మరకణ్టకే ।
మనసాఒపి స్మరేద్యస్తు గిరిం త్వమరకణ్టకమ్॥
చాంద్రాయణశతం సాగ్రం లభతే నాత్ర సంశయః ।
త్రయాణామపి విఖ్యాతో లోకానామమరకణ్టకః॥
ఆంతట మహాత్ముడగు రుద్రుడు అగ్ని ని నివారించి బాణుని మూడవ పురమును రక్షించేను॥ (స్వర్ణ రజత లోహ పురములలో బంగరు పురము కొంత కాలక మిగిలెను॥) అది దివ్యమయి రుద్ర తేజః ప్రభావమున గగనమున తిరుగుచుండును; మహాత్ముడగు శంకరుడిట్లు త్రిపుర దహన మొనర్చెను; ఆవి జ్వాలామాలలతో ప్రదీ ప్రములగుచు ధరణీ తలమున పడెను; వానిలో ఒకటి శ్రీ శైల సమీపమున త్రిపురాంతకమున పడెను- రెండవది ఆమరకంటక పర్వతమున నర్మదా తీరమున పడెను; త్రిపుర దాహానంతగ మమరకంటక పర్వతమున కోటి రుద్రులు (లింగములు) ప్రతిష్టింప బడిరి; (త్రిపురములలో ఒకటి ఆచట అది జ్వలించుచు పడినందున ఆ ప్రదేశము జ్వాలేశ్వర మనబడెను; ఆ మం డేడు త్రిపుర ఖండపు జ్వాలలు పైకి బయలుదేరి ద్యులోకమునకు పోయెను; అపుడు దేవతలును అసురులును మహా హాహా కారము చేసిరి॥ మహేశ్వరానుగ్రహ పాత్రమయిన బాణుని సువర్ణపురమందలి ఆగ్ని మరి ప్రజ్వలించకుండ రుద్రుడది॥ స్తంభింపజే నేను; రాజా! పూర్వము అమరకంటకమున జరిగిన వృత్తాంతము ఇది; ఈ ఆమరకంటక పర్వతమందు మృతి నందు వాడు వేయియు ముప్పదికోట్ల సంవత్సరములపాటు చతుర్దశ భువన సుఖములనుభవించును; తరువాత భూతలమున ధార్మికుడగు రాజగును; పృథివిని ఏకచ్చతముగా పాలించును; ఇందు సంశయము లేదు; మహారాజా! అమరకంటక పర్వతము ఇంత పుణ్యకరమయినది; చండ్ర సూర్య గ్రహణకాలములందట యాత్ర చేసినచో ఆశ్వమేధ ఫలమునకు॥ పది రెట్ల ఫలము కలుగునని పెద్దలందురు: రవి గ్రహణమున ఆట శివుని దర్శించినచో స్వర్గ ప్రాప్తి బ్రహ్మహత్యా పాప నివృత్తి యగును; ఇట్లందంతయు పుణ్య మే; దానిని మనసాస్మరించినను సమగ్రముగా నూరు చాంద్రాయణ వ్రతములాచ రించినంత ఫలము లభించును; ఇది త్రిలోకప్రసిద్ధ ప్రదేశము॥
ఏష పుణ్యో గిరిశ్రేష్ట సిద్ధగందర్వ సేవితః ।
నానాద్రుమలతాకీర్ణో నానాపుష్పోపశోభితః॥
మృగవ్యాఘ సహస్రైస్తు సేవ్యమానో మహాగిరిః ।
తత్ర సన్ని హితో రాజ శేవ్యా సహ మహేశ్వరః॥
బ్రహా విష్ణు స్తథా చన్హో విద్యాధరగడై స్సహ ।
ఋషిభిః కిన్నరై ర్యవై ర్నిత్యమేవ ని షేవితః॥
వాసుకిస్సహిత సత్ర క్రీడతే పన్న గోత్రమైః ।
ప్రదక్షిణంతు యః కుర్యా త్పర్వతేమర కణకే॥
పౌరీక స్య యజ్ఞస్య॥ ఫలం ప్రాప్నోతి మానవః ।
తతో జ్వాలేశ్వరం నామ తీర్థం సిద్ధని షేవితమ్॥
తత్ర స్నాత్వా దివం యా ని యే మృతా స్తే॥॥॥పునర్భవాః ।
జ్వాలేశ్వర్ మహారాజ న్యస్తు ప్రాణాన్పరిత్యజేత్॥
చన్దసూర్యోపరాగేషు శృణు తస్యాపి యత్పలమ్ ।
సర్వకర్మవినిరుకో జ్ఞానవిజ్ఞానసంయుతః॥
అమరా' నౌమ దేవా వర్వతేఒమరకణ కే ।
రుద్రలోక మవాప్నోతి యావదాభూతసమ్ల సమ్॥
అమరేశస్య దేవస్య పర్వతస్య ఉబే తటే ।
కోటిశో ఋషిముఖ్యా స్తే తవ స్తవ్యస్తి సువ్రతాః॥
సమస్తా ద్యోజనం రాజనేత్రం చామరకస్టకమ్ ।
అకామో వా సకా మో మౌ నర్మదాయాశ్శుబే జలే॥
స్నా త్వా ముచ్యత పాపేభ్యో రుద్రలోకం స గచ్ఛతి॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే ఈశ్వరకృతబాణాసుర త్రిపుర దాహో నామ సప్తాశీత్యుత్తర శతతమోధ్యాయః॥
పుణ్యకరమగు ఈ ఆమరకంటకము సిద్ధ గంధర్వ సేవితమగు పర్వత శ్రేష్ఠము; నానావృక్షలతా వ్యాప్తము; నానో పుష్పశోభితము; వేలకొలది మృగములును వ్యాఘములును దాని నాశ్రయించియుండును; రాజా! దానియందు దేవితో కూడి మ హేశ్వరుడును ; బహ్మయు విష్ణువును చంద్రుడును విద్యాధరులును ఋషులును యక్ష కిన్నరులును వాసుకియు అతని యనుచరులగు పన్నగ శ్రేష్ఠులును సన్నీ హితులయి దానిని ఆశ్రయించియుందురు; అమరకంటక పర్వతమునకు గిరి ప్రదక్షిణము చేసిన మానవునకు పౌండరీక యజ్ఞ ఫలము లభించును; ఈ అమరకంటకమునకు తరువాతిదియగు జ్వాలేశ్వరమను తీర్థ ము సిద్దులును సేవించునది; దానియందు స్నానమాడినవారు పునరావృతి లేక శాశ్వత స్వర్గ సుఖ మందుదురు; చంద్రసూర్యగ్రహణ సమయములందిందు స్నానమాడినవారు సర్వకర్మ వినిర్ముకులయి జ్ఞాన విజ్ఞాన సంయుతులగుదురు; ప్రళయకాలము వరకు రుద్రలోక వాసులగుదురు; అమరులనగా దేవతలు కావునను వారిచటనుందురు కావునను దీని కమరకటకమని వ్యవహారము; (కటకమనగా వసతి స్థానమనియు ఆర్థము; అమరులకు నివాస స్థానము కావున అమరకటకము అనబడినది; అదియే క్రమముగా వ్యవహారములలో కంటకము అని మారియుండును॥) దేవతాత్మ కమును అమరేశుని స్థానమును అగు ఈ అమరకంటక పర్వతపు రెండు ప్రక్కలందును సువతులగు ఋషీ ముఖ్యులు తపమాచరించుచుందురు; అమరకంటకమునకు చుట్టునుగల యోజన దూరములో నర్మదానదీ శుభజలమునందు స్నాన మాడినవారు పాపముక్తువై రుద్రలోక మందుదురు॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున ఈశ్వరుడు బాణాసురుని త్రిపురములను దహించుటయను నూట డెబ్బది ఏడవ అధ్యాయము॥
Summary of chapter 187 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes the holy origin site of river Narmadā upon the majestic Amarakantaka mountain range. The text details how the river descends through rocky canyons, sanctified forests, and holy valleys, surrounded by the hermitages of great Rishis. Bathers who perform ritual ablutions at Amarakantaka and offer ancestral Śrāddha secure eternal satisfaction for their ancestors and earn residency in Śivaloka.