మత్స్య మహా పురాణము
162 - హిరణ్యకశిపు వధాది కథనము॥
సూతః : ఖరాః ఖరముఖాశ్చైవ మక రాశవిషాననాః ।
ఈహామృగము ఖాశ్చాన్యే వారాహముఖసంస్థితాః॥
బాలసూర్యముఖాశ్చాన్యే ధూమ కేతుముఖా స్తథా ।
ఆర్ధచన్ద్రాభవక్త్రాశ్చ అగ్నిదీప్తముఖ స్తథా॥
హంసకుక్కుటవక్త్రాశ్చ వ్యాది తాస్యా భయావహాః ।
సింహాస్యా లేలీహానాశ్చ కాకగృధ్రముఖా స్తథా॥
విద్యుజ్జిహ్వాశ్చ క్రశీర్షా స్తథోలాముఖసంస్థితాః ।
(మహాగ్రహముఖాశ్చాన్యే)కపోతకముఖాశ్చాన్యే దానవా బలగర్వితా॥
కైలాసవపుష స్తస్య శరీరే శరవృష్టయః ।
అవధ్యస్య మృగేన్ద్రస్య న వ్యథాశ్చక్రురాహవే॥
ఏవం భూయోఽపరాన్ఘోరా నసృజ న్దాన వేశ్వరాః ।
మృగేన్ద్రస్యోపరి క్రుద్దా విశ్వసన్త యివోరగాః॥
తే దానవశరా ఘోరా దానవేన్ద్రసమీరితాః ।
విలయం జగ్మురాకా శే ఖద్యోతా ఇవ పర్వతే॥
తతశ్చక్రాణి దివ్యాని దైత్యాః క్రోదసమన్వితాః ।
మృగేన్ద్రాయా సృజన్నా శు జ్వలితాని సమ న్తతః॥
తైరాసీద్గగనం చక్రై స్సమ్పతద్బి రిత స్తతః ।
యుగాన్తేసంప్రకాశ ద్బీ శ్చన్ద్రాదిత్యగ్ర హైరివ॥
తాని సర్వాణి చక్రాణి మృగేన్ద్రేణ మహాత్మనా ।
గస్తాన్యు దీర్ణాని తదా పావకార్చిస్సమానిచ॥
తాని చక్రాణి వదనం విశమా నాని భా న్తివై ।
మేఘోదరదరీ ష్వేవ చన్ద్రసూర్యగ్రహా ఇవ॥
హిరణ్యకశిపుర్దైత్యో భూయః ప్రాసృజదూర్జితామ్।
శక్తి ప్రజ్వలితాం రౌద్రాం దౌతాంశస్త్రతటిత్ప్రబామ్॥
తామాపత న్తీ ముత్ప్రేక్ష్య మృగేన్ద్ర శ్మ క్రిముత్తమామ్ ।
హుజ్గారేణైవ రౌద్రేణ బభఞ్జ భగవాం స్తదా॥
రరాజ భగ్నా సా శక్తి ర్మృగేన్ద్రేణ మహీతలే ।
సవిస్పులిజ్గ జ్వలితా మహోల్కేవ దివ శ్చుతా॥
నారాచప జ్కిస్సింహస్య ప్రాప్తా రేజేవి దూరతః ।
నీలోత్పలపలాశానాం మా లేవోజ్జ్వలదర్శనా॥
సూతుడు ఋషులకింకను ఇట్లు చెప్పసాగెను॥ గోడిదలు పొములు మొసళ్ళు ఈహా మృగములు వరాహములు హంసలు కోళ్ళు సింహములు॥ కాకులు - గ్రద్దలు పావురములు॥ ఈ, ప్రాణుల మోములవంటి మొగములు బొలసూర్యుడు ధూమకేతువు ఆర్ధ చంద్రుడు ప్రజ్వలించు అగ్ని మెరపులు చక్రములు కోరవులు॥ వీటిని పోలిన మొగములు కలిగి నోరులు తెరచుకొని భయంకరులై నాలుకలు కోయుచు బలగర్వితులగు దానవులు కైలాస సదృశ శరీరము కలిగి ఆవధ్యుడగు ఆ మృగేంద్రుని పై యుద్దమందు కురియించిన బాణ వర్షములు అతనికి ఏమియు వ్యథ కలిగించలేదు॥ దాన వేశ్వరులపుడింకను మరికొన్ని ఘోర బాణముల నామృగేంద్రునిపై సర్పములవలే బుసకొట్టుచు కుద్దులయి ప్రయోగించిరి॥ కాని దానవేంద్రులు ప్రయోగించిన ఆ ఘోర శరములన్నియు పర్వతమునందు మెరపులువలె ఆ నృసింహ శరీరమున లయమందెను॥ అంతట దైత్యులు క్రోధ సమన్వితులయి జ్వలించు చక్రములను అన్ని వైపులనుండి శీఘ్రముగా ఆతని పై వినరిరి॥ అన్ని వైపులనుండి పడుచున్న చక్రములతో ఆకాశ ము ప్రళయకాలమున మిగుల ప్రకాశించు చంద్రాదిత్యాది గ్రహములతోవలే వెలుగుచు కనబడెను॥ అగ్ని జ్వాలలవలే చెల రేగు ఆ చక్రములనన్నిటినీ మహాత్ముడా మృగేంద్రుడు మింగేను॥ ఆవి అతని నోటిలోనికి పోపుచు మేఘపు నడుమ అనుగుహలలో చోరు చంద్ర సూర్యాదులవలె నుండెను॥ మరల హిరణ్యకశిపు దైత్యుడు చాల పెద్దదియై ప్రజ్వలించుచు భయంకర మై - శుద్ద మొనర్చబడి తనయందలి ఆయు ధములనుండి వెలువడు మేర పుల కాంతులతో వ్యాప్తమయిన శ క్తిని ప్రయోగించెను॥ తన పైకి వచ్చిపడుచున్న ఆ ఉత్తమ శక్తిని మృగేంద్ర భగవానుడు భయంకర హుంకారముతో వీర చేను॥ అది విరిగి నేలపయి బడుచు నిప్పు రవ్వలతో అంతరిక్షమునుండి రాలిపడు మహోల్కవలే కనబడెను॥ రాక్షసులు ప్రయోగించు) శరవం ! నృసింహునికి దూరమందే నిలిచి ప్రకాశించు రూపముకల నల్ల కలువ పూ రేకుల దండలవలే కనబడెను॥
స గర్జిత్వా యథా న్యాయం విక్రమ్యచ యథాసుఖమ్ ।
తత్సైన్యముత్పాదితం సృణాగ్రానీవ మారుతః॥
తతోశ్మవర్షం దైత్యేన్ద్రాత్యేన్ద్రా వ్యసృజన నభోగతాః ।
నగమాత్రైశ్శిలాఖణ్డై ల్గిరిశృజ్గై ర్భ్రహాప్రభై ॥
తదశ్మవర్షం సింహస్య మహస్మూర్ద్నీ నిపాతితమ్ ।
దిశో దశ వికీర్ణంపై ఖద్యోతప్రకరా ఇవ॥
తదాశ్మా ఘైర్దైత్యగణాః పునస్సింహరిస్ధమమ్ ।
ఛాదయాంచిరే మేఘా ధారాభిరివ పర్వతమ్॥
న తం సక్చరయామాసుర్థిత్యాఘా దేవస త్తమమ్ ।
భీమవేగోఽచల శ్రేష్ఠం సముద్రణవ మన్దరమ్॥
తతోశ్మవర్షే పతితే జలవర్షమనన్తరమ్ ।
ధారాభిరక్షిమాత్రాభిః ప్రాదురాసీత్సమ స్తతః॥
నభసః ప్రచ్యుతా ధారా స్తిగ్మ వేగా స్సమ స్తోతః ।
ఆవవ్రే సతతం వ్యోమ దిశశ్చ విదిశ స్తథా॥
ధారా దీవిచ సర్వత్ర వసుధాయాం చ సర్వశః ।
న స్పృశ నిస్మ తా దేవం నిపత్కన్తోఽ నిశం భువి॥
బాహ్యతో వవృషుర్వర్షం నోపరిష్టాచ్చ తా స్తదా ।
మృగేన్ద్ర ప్రతిరూపస్య స్థితస్య యుధి మాయయా॥
హతేశ్మవర్షే తుములే జలవర్షే విశోషితే ।
సోఽసృజద్దానవో మాయామగ్ని వాయుసమీరితామ్॥
మ హేన్ద్రస్తోయదై స్సార్దం సహస్రాక్షో మహాద్యుతిః ।
మహతా తోయవర్షేణ శమయామాస పావకమ్॥
తస్యాం ప్రతిహతాయాంతు మాయాయాం యుధి దాసవః ।
అసృజద్ఘోరసజాశం తమస్తీవ్రం సమ స్తతః॥
తమసా సంవృతే లోకే దైత్యేష్వాత్రాయుధేషు చ ।
స్వతేజసా పరివృతో దివాకర ఇవాబభౌ॥
త్రిశాఖాం భ్రుకుటీం చాస్య దదృశుర్దానవా రణే ।
లలాటస్థాం త్రిశూలాజ్కాం గజ్గాం త్రిపథగామివ॥
తతస్సర్వాసు మాయాసు హతాసు రీతినన్దనాః ।
హిరణ్యకశిపుం దైత్యం వివర్ణాశ్శరణం యయుః॥
ఆ దేవుడు యథా న్యాయముగా లోక మందలి ఆన్ని సింహములవలే గర్జించి యథా సుఖముగా లోక సాధా రణ సింహమువలె) విక్రమించి గాలి గడ్డి కొనలను వలె ఆ సేనను నశింపజే నెను॥ అంతట దైత్యేంద్రులు ఆకాశమందుండి మహాకాంతిగల కొండలంతటి శీలా ఖండములతో గిరి శృంగములతో రాల వాన కురియించిరి॥ ఆది ఆ దేవునీ తలపయి పడియు మీణుగురు పురువుల గుంపులవలే వది దిక్కు లకు చేద రెను॥ మరల వారు శత్రు నాశ కుడగు ఆతనిని మేఘములు జలధారలతో కొండనువలె రాలరాసులతో కప్పిరి॥ అయినను భయంకర వేగముగల సముద్రము పర్వత శ్రేష్ఠమగు మందరమును కదల్చలేనట్లే వారా దేవుని చలింపచేయలేక పోయిరి॥ ఇట్లది వ్యర్థమయి పడిపోగా జలవర్షము బండి ఇరుసంత లావగు ధారలతో అన్ని వైపులనుండి పడసాగేను॥ ఆకాశమునుండి తీవ్రవేగము గలిగి అన్ని వైపుల నుండి పడు జలధారలతో ఆకాశము దిక్కులు విదిక్కులు అంతరిక్షము ద్యులోకము భూమి అంతయు క్రమ్మబడెను॥ కాని అవి ఆ దేవుని వాక నేస తోకకుండెను॥ ఆ ధారలు యుద్ధమున మృగేంద్ర రూపమున నిలిచిన అతనికి వెలుపలనే కాని మీద పడ కుండెను॥ ఇట్లు రాల వాన ఆణగగా నీటివాన ఎండగా ఆ దానవుడు అగ్ని, వాయువులను చెలరేపుచు మాయను పన్నెను॥ సహస్ర నేత్రుడగు మ హేంద్రుడా యగ్ని ని మేఘములతో కూడ కురియించిన మహాజల వర్షముతో చల్లార్చేను॥ ఆదియు శమించగా ఆ దానవుడు అన్ని వైపులనుండి ఘోరమయి క్రమ్ము తీవ్రంధకారమును సృజించెను॥ ఇట్లు క్రమ్మిన చీకటి నడుమ దానవు లాయుధములు పట్టి చుట్టు నిలువగా భగవానుడు సూర్యుడువలే తన తేజముచే చుట్టబడి ప్రకా శించెను॥ మరియు దానవు లా దేవుని లలాటమున త్రిశూలపు గురుతులతో మూడుగా చీలిన కనుబొమ ముడి రేక త్రిపథగ యగు మూడు త్రోవల ప్రవహించు గంగవలే కనబడెను॥ ఇట్లు తమ మాయలన్నియు హతములు కాగా దైత్యులు వివర్ణులయి హిరణ్యకశిపుని శరణు వేడిరి॥
హిరణ్యకశిపో ర్వినాశనమయే నానావిధోత్పాతప్రాదుర్భావః॥
సచప్రజల్వితః క్రోధాత్ర్పదహన్నివ తేజసా ।
తస్మిన్క్రుద్ధేతు దై తేన్ద్రే తమోభూతమభూజ్జగత్॥
ఆవహః ప్రవహశ్చైవ వివహోథ హ్యుదావహః ।
పరావహస్సంవహశ్చ మహాబలపరాక్రమాః॥
తథా పరివహశ్రీమా నుత్పాతభయశంసినః ।
ఇత్యేతే క్షుభితా స్సప్త మరుతో గగనేచరాః॥
యే గ్రహా స్సర్వలోక స్య క్షయే ప్రాదుర్భవ న్తివై ।
తే సర్వే గగనే దృష్టా వ్యచర న్త యథాసుఖమ్॥
అన్యం గతే చాప్యచర న్మార్గం నిశి నిశాచరః ।
సగ్రహైశ్చ సనక్షత్రై స్తారాపతిర రిన్దమః॥
వివర్ణతాంచ భగవాన్గతో దివి దివాకరః ।
కృష్ణం కబన్దంచ తథా లక్ష్యతే సుమహద్దివి॥
అముఞ్జచ్చార్చిషాం బృన్దం భూమివృత్తిర్వీభావసుః ।
గగనస్థశ్చ భగవో నభిక్ష్ణ్యం పరీలక్ష్యతే॥
సప్త ధూమ్రనిభా ఘోరా సూర్యాదివ సముత్థితాః ।
సోమస్య గగనస్థస్య గ్రహా స్తిష్టన్తి శృజ్గగా॥
వామేతు దక్షిణే చైవ స్థితా శుక్రబృహస్పతి ।
శనైశ్చరో లోహితాజ్గో జ్వలనాగ్ని సమద్యుతీ॥
సమo సమధిరోహన్త సర్వే తే గగనేచరాః ।
శృజ్గాణి శనకై ర్ఘోరా యుగాన్తావ ర్తినో గ్రహాః॥
చన్ద్రమాశ్చ సనక్షత్రైర్గైస్సహ తమోనుదః ।
చరాచర వినాశాయ రోహిణీం నాభ్యనన్దత॥
గృహీతో రాహుణా చన్ద్ర ఉల్కాభిర బిహన్యతే ।
ఉల్కాః ప్రజ్వలితాశ్చన్ద్రే విచర న్తి యథాసుఖమ్॥
దేవానామపి యో దేవస్సోఽప్యవర్షత శోణితమ్ ।
ఆపతన్గగనాదుల్కా విద్యుద్రూపా మహాస్వనాః॥
అకాలేచ ద్రుమాస్సర్వే పుష్ప్య న్తి చ ఫల న్తి చ ।
లతాశ్చ సఫలాస్సర్వా యే చాపు ర్ధై త్యనాశనమ్॥
హిరణ్యకశిపుని మృతిని సూచించు ఉత్పాతములు॥
ఆ హిరణ్యకశిపుడును తన తేజస్సుతో మిగుల దహించువాడు వలె క్రోధముతో ప్రజ్వలించసాగేను॥ దానితో జగత్తు తమస్సుతో నిండెను॥ ఆవహము ప్రవహము వివహము ఉదావహము పూవహము సంవహము పరివహము అను శ్రీమంతములును మహాబల పరాక్రమములును అగు గగన సంచారులగు ఈ సప్త వాయువులును ఉత్పాత భయమును సూచించుచు క్షోబలైను॥ సర్వలోక క్షయ(ప్రళయ కాలమున ప్రాదుర్భవించు గ్రహములు గగనమున తమ ఇచ్చకు వచ్చి నట్లు తిరుగుచు కనబడెను॥ శత్రు నాశకుడు తారాపతి నిశాకరుడు నగు చంద్రుడు తన సహజ మార్గమును విడిచి గ్రహ నక్షత్రములతో కూడి మరియొక మార్గమున సంచరింపసాగేను॥ పగలు సూర్య భగవానుడు వివర్లు డయ్యెను॥ ఆంతరిక్ష మున నల్లని పెద్ద మొండెము కనబడెను॥ ఆగ్ని భగవానుడు భూమి పై ఉండియు అచట జ్వాలలతో వెలుగక మాటి మాటికి ఆకాశమున మండుచు కనబడెను॥ అంతరిక్షమున పొగ వన్నె తో వెలుగు సప్త సూర్యులు ఉదయించి కనబడిరి॥ అంతరిక్షమున వెలుగు చంద్రుని కొమ్ముల పై (పూర్ణిమ కాని తిథులందు) గ్రహములు - ఎడమ కొమ్మున శుక్రుడు కుడి కొమ్మున బృహస్పతి ఎడమను శనియు కుడి కొమ్మున అంగారకుడును ఈ ఇద్దరును మండు అగ్ని వలే నుండి కనబడిరి॥ యుగాంతమున మాత్రమే ఇట్లు కనబడవలసిన ఆ గ్రహములు మెల్లగ ఇట్లు చంద్ర శృంగముల పై నీలిచి కనబడెను॥ గ్రహములతో నక్షత్రములతో కూడి రోహిణీ సహితుడై లోకపు చీకట్లు పోగొట్టవలసిన చంద్రుడు రోహిణిని మెచ్చక ఆమెకు దూరమయ్యెను॥ ఇది చరాచర లోకనాశ సూచకము, చంద్రుని రాహువు (పూర్ణిమ కాక యే) మింగేను॥ ఉల్కలు , చంద్రుని క్రమ్మెను॥ ఆవి ప్రజ్వలించుచు తమ ఇచ్చ వచ్చిన కక్ష్యలలో చంద్రుని ఆశ్రయించి తిరుగసాగేను॥ దేవతలకు దేవుడు (రాజు) ఆగు ఇంద్రుడు నెత్తుటి వాన కురియించెను॥ గగనమునుండి మహాధ్వనులతో మెరపులవంటి ఉల్కలు పడెను॥ వృక్షము లకాలమందు పూచెను; ఫలించెను॥ (పండ్లు పండని) తీగలు ఫలించెను॥ ఇవన్ని యు ఇట్లు దైత్య నాశ మును సూచించెను॥
ఫలైః ఫలానజాయ న్త పుష్పైః పుష్పం తథైవచ ।
ఉన్మీలన్తి నిమీలన్తి హసన్తిచ రుదన్తిచ॥
విక్రోశ న్తి చ గమ్భీరం ధూమయ నే జ్వల న్తి చ ।
ప్రతిపస్సర్వదేవానాం కథయన్తో మహద్బయమ్॥
ఆరణ్యై స్సహ సంసృష్టా గ్రామ్యాశ్చ మృగపక్షిణః ।
చుక్రుశుర్భైరవం తత్ర మృగా యుద్ద ఉపస్థితే॥
న ద్య శ్చ ప్రతికూలాశ్చ వహన్తి కలుషోదకాః ।
న ప్రకాశ న్తి చ దిశో రక్తరేణుసమాకులాః॥
వానస్పత్యా నపూజ్య న్తే పూజన్హార్ధాః కథంచన ।
వాయువేగేన హన్య న్తే భజ్య న్తే ప్రణమ న్తిచ॥
యదాచ సర్వభూతానాం ఛాయా న పరివర్తతే ।
అపరాహ్ణగతే సూర్యే లోకానాం యుగసంక్షయే॥
తదా హిరణ్యకశిపోర్ధైత్యస్యోపరి వేశ్మనః ।
భాణ్డాగారాయుధాగారే నివిష్టమభవన్మదు॥
అసురాణాం వినాశాయ సురాణాం విజయాయచ ।
(ద)పశ్య న్తే వివిధోత్పాతా ఘోరా ఘోర నిదర్శనాః॥
ఏతే చాన్యేచ బహవో ఘోరోత్పాతా స్సముత్తితాః ।
దైత్యేన్ద్రస్య వినాశాయ దృశ్య న్తే కాలనిర్మితాః॥
మేదిన్యాం కమ్పమానాయాం దైత్యేన్ద్రేణ మహాత్మనా ।
మహీధరా నాగగణా ని పేతుర మితౌజసః॥
విషజ్వాలాకులై ర్వ క్త్రై ర్విము ఞ్చ న్తో హుతాశనమ్ ।
చతుశీర్షాః పఞ్చశీర్షా స్స ప్త శ్మీర్షశ్చ పన్న గాః॥
వాసుకి సక్షక శ్చైవ కర్కోటక ధనఞ్జయౌ ।
ఏలాముఖః కాలియశ్చ మహాపద్మశ్చ వీర్యవాక్॥
సహస్రశీ ర్షో నాగోవై హేమతాలధ్వజః ప్రభుః ।
శేషోఽనన్తో మహాభాగో దు ష్ప్ర్యకమ్యః ప్రకమ్పితః॥
దీప్తాన్య నర్జలస్థాని పృథివీచారణానిచ ।
తదా దైత్యేన్ద్ర కో పేన కమ్పితాని సమన్తతః॥
నాగా స్తేజోవరాశ్చాపి పాతాళ తలచారిణః ।
పాతాళే సహసా చక్రుర్దుష్ప్ర కమ్యాః ప్రకమ్పితాః॥
పండ్లనుండి పండ్లు పూలనుండి పూలు వచ్చుచుండెను॥ సర్వ దేవతా ప్రతిమలును కన్నులు తెరచును మూయును నవ్వును ఏడ్చును గంభీరము గా అర చును పొగలు గ్రక్కుచు మండును॥ ఇట్లవి మహాభయమును సూచించ సాగెను॥ గ్రామములందుండు మృగపక్షులు ఆరణ్య మృగపక్షులతో కలిసి తిరుగసాగెను॥ యుద్ధ సూచకములయి మృగ ములు భయంకర ధ్వనులు చేసెను॥ నదులు మలిన జలములతో ఎదురు ప్రవహించసాగెను॥ దిక్కులును నెత్తుటితో ధూళితో మలినములై కాంతిహీనములయ్యెను॥ పూజార్హములగు వనస్పతులు పూయక కాయు చెట్టు) వానస్పత్యములు పూచి కాయు చెట్లు) పూజలనందుకొనకుండెను॥ పూజించపోయిన వేళకు) అవి వాయువేగ వశమున వంగుటయే విరుగుటయో నమస్కరించుచున్నట్లు నేలకు లుటయో జరుగుచుండెను॥ ఏ ప్రాణులకును నీడయే కానరాక రవి మధ్యా హ్నము దాటి అపరాష్ట్రమును ప్రవేశించు సమయమున హిరణ్యకశిపుని భవనము మీదను వాని భాండాగారాయుధాగారము లందును తేనెతుట్టెలు పట్టెను॥ ఇట్లు ఇవియు ఇంకను అనేక ములును దైత్యనాశమును దేవజయమును సూచించునవియగు ఘోరోత్పాతములు కాల నిర్మితములై కనబడెను॥ మహాత్ముడగు దే తేంద్రుడు కోపముతో భూమిని కంపింపజేయుచుండ నాలుగు ఐదు ఏడు తలలు కల నాగులును వాసుకి తక్షకుడు కర్కోటక ధనంజయులు ఏలాముఖ కాళియ మహాపద్ములును విషజ్వాలలతో కలత నొందిన తమ నోళ్ల నుండి ఆగ్ని ని కక్కసాగిరి॥ సహస్ర శిర స్కుడు బంగరు తాటి చెట్టు ధ్వజ ముగా కలవాడు మహాసమర్థుడు మహాభాగుడు అనంతుడు ఆగు శేషుడు దేనికిని ఎన్నడును : ఏపింపని వాడు కూడ కంపిం చెను॥ నీటి నడుమను సంచరించుచు ప్రకాశించు అన్ని ప్రాణులును అపుడా దైత్యేంద్ర కోపకంపితము లయ్యెను॥ పాతాళ తల సంచారులయి మేలగు తేజస్సుగల పాతాళమందలి నాగములును అవి ఎంతగా కంపించచేయ నలవి కాని వయ్యును కంపితములుగా చేయబడెను॥
హిరణ్యకశిపుర్దైత్య సదా నంస్పృష్టవాన్మహీమ్ ।
సన్దష్టౌష్ఠపుటః క్రోధాద్వారాహ ఇవ పూర్వజః॥
నదీం భాగీరథీం చైవ కౌశికీం సరయూమపి ।
యమునామథ కావేరీం కృష్ణవేణించ నిమ్న గామ్॥
తుజ్గవేణీం మహావేగాం నదీం గోదావరీమపి ।
చర్మణ్వతీంచ సీన్దుంచ తథా నద నదీపతిమ్॥
మేఖల ప్రభవాం చైవ శోణం మణినిభోదకమ్ ।
నర్మదాం శుభతోయాంచ తథా వేత్రవతీం నదీమ్॥
గోమతీం గోకులాకీర్ణాం తథా పూర్ణాం సరస్వతీమ్ ।
మహీం కాళ మహీం చైవ తమసాం పుష్పవాహినీమ్॥
జమ్బూద్వీపం రత్నవన్తం సర్వరత్నోపశోభితమ్ ।
సువర్ణపుటకంచైవ సువర్ణాకరమణ్డితమ్॥
మహానదంచ లౌహిత్యం శైలకాననశోభితమ్ ।
పత్తనం కోష కారాణాం ఋషి వీర జనాకరమ్॥
మగ ధాంశ్చ మహా గ్రామా నన్ద్రానజ్గాం స్తథైవచ ।
కురుస్వాన్విదేహాంశ్చ మాళ వాన్కాశికోసలాక్॥
భవనం వైనతేయస్య దైత్యేన్ద్రేణాభికమ్పితమ్ ।
కైలాసశిఖరాకారం యత్కృతం విశ్వకర్మణా॥
రక్తతోయో మహాభీమో లౌహిత్యో నామ సాగరః ।
ఉదయశ్చ మహా శైల ఉత్తిత శ్శతయోజనమ్॥
సువర్ణ వేదికశ్రిమా న్మేఘవజ్త్కిని షేవితః ।
భ్రాజమానోర్కసదృశై ర్జాతరూపమయై ర్ధుమైః॥
సా లైస్తాలై సమాలైశ్చ కర్ణికాయై శ్చ పుష్పితైః ।
అయోముఖశ్చ విఖ్యాతః పర్వతో ధాతుమణ్డిత ॥
తమాలవనగన్దశ్చ పర్వతో మలయ శ్శుభః ।
సురాష్ట్రాశ్చ సబాహ్లికా శ్శూ ద్రాభీరా స్తథైవచ॥
ప్యాఃణ్డ్యా కలిజ్గా వజ్గాశ్చ భోజాశ్చ తామ్రలి ప్తకాః ।
తథైవ పుణ్డ్రాపౌణ్డ్రాశ్చ వాసశూలా స్తథై వచ॥
క్షోభితా స్తేన దైత్యేన సదేవాశ్చాప్సరోగణాః ।
అగ స్త్యభవనంచైవ యదగమ్యం కృతం పురా॥
సిద్దచారణసజ్ఘైశ్చ వికీర్ణంచ మనోరమమ్ ।
విచిత్ర నానావిహగః సుపుష్పితమహాద్రుమః॥
జాత రూపమయై శ్శృజ్ఘై రపకోగణనాదితః ।
గిరిః పుష్పితక శ్చైవ లక్ష్మీవాన్ప్రియదర్శనః॥
ఉత్థిత సాగరం భత్వా విశ్రామ శ్చన్ద్రసూర్యయోః ।
రరాజ యోమహాశృజ్గై ర్గగనం విలిఖన్నివ॥
చన్ద్రసూర్యాంశసజ్కాశై సాగరామ్బుసమావృతః ।
విద్యున్నామార్చిత శ్రీమా నాయత శ్శతయోజనమ్॥
విద్యుతాం యత్ర సజ్ఘాతా నిపాత్య న్తే నగోత్త మే ।
ఋషిభిః పర్వత శ్చైవ శ్రీమాన్వృషభసంజ్ఞతః॥
కుఞ్జరః పర్వతశ్రీ మాన్యత్రాగ స్త్యగృహం శుభమ్ ।
విశాలకక్ష్యాదుర్దర్షో సర్పాణాచలయః పురీ॥
తథా భోగవతీచాపి దైత్యేన్గాభిప్రకమ్పితా ।
మహాసనగిరిశ్చైవ పారియాత్రశ్చ పర్వతః ॥
చక్రపాంశ్చ గిరిశ్రేష్ఠో వారాహ శ్చైవ పర్వతః ।
ప్రాగ్జ్యోతిషపురం చాపి జాతరూపమయం శుభమ్॥
యస్మిన్వసతీ దుష్టాత్మా నర కో నామ దానవః ।
విశాలాక్షశ్చ దుర్దర్షో మేఘగమ్భీర నిస్వనః॥
షష్టి సత్ర నహస్రాణి పర్వతానాం విశామ్పతే ।
తరుణాదిత్యసజ్కాశో మేరు శ్చైవ మహాగిరిః॥
యక్షరాక్షసగన్దర్వైర్ని త్యం సేవితకనరః ।
హేమగర్బో మహా శైల స్తథా మేఘసఖో గిరిః॥
కైలాస శ్చైవ శైలేన్ద్రో దానవేన్ద్రోణ కమ్పితః ।
హిరణ్యకశిపు దే త్వుడు ఆపుడు కోపముతో పెదవుల పుటమును కొరుకుచు తన అన్న యు యజ్ఞ వరాహుని చేతిలో మరణించువాడునగు హిరణ్యాక్షుడువలె భూమిని స్పృశించుచునే భూమినే కాక భాగీరథీ కౌశికీసర యూ యమునా కావేరీ కృష్ణవేణి తుంగవేణీ గోదావరీ చర్మణ్వతీసింధు నదులను మేకలమున పుట్టిన శుభ జలముగల నర్మదను మణివంటి నీరుగల శోణమును గోవుల మందలతో నిండిన గోమతిని పూర్ణా సరస్వతీ మహీ కాలమహీ నదులను పూవులతో కూడి ప్రవహించు సరయూనదిని సర్వ రత్నములతో ప్రకాశించు జంబూ ద్వీపమును బంగరు గనులతో అలంకృతమగు సువర్ణపుటక దేశమును మహానదములతో శైల వనములతో శోభించు లౌహిత్య దేశమును ఋషులకు వీరులకు గనియగు దేశమును కోశ కొరుల పట్టణమును మగధ మహాగ్రామాం(రాష్ట్రాం ) ధైంగ కురు సాళ్వవిదేహమాళవ కాళి కోసల దేశ ము లను కూడ తాకినట్లయి ఇన్ని యు కంపించేను॥ కైలాస శిఖరాకారమును విశ్వకర్మచే స్వయముగా నిర్మితమును అగు వైనతేయ (గరుడ) భవనమును ఎర్రని నీరు కలిగి మహాభయంకరమగు రౌహిత్యమను సముద్రమును శతయోజనోన్న తమును బంగరు వేదికలు కలదియు మేఘ పంక్తులకు ఆశ్రయమును సూర్యునివలె ప్రకాశించు బంగరు సాలతొలత మాల పుష్పిత కర్ణికార 'వృక్షములతో అలంకృతమును అగు ఉదయ పర్వతమును గైరిక ధాతువులతో అలంకృతమగు అయో ముఖమను (పై భాగమునందు ఇనుప ధాతు శిలలుకల) పర్వతమును చీకటి చెట్ల అడవుల వాసనలతో నిండిన శుభమగు మలయ పర్వతమును సురాష9 బాహ్లికాభీరపాండ్య క ళింగ వంగ భోజ తామలి ప్రపుండ పౌండవాసశూలదేశములును దేవతలు నప్పరసలును ఆ దైత్యునిచే కంపింపజేయబడెను॥ పూర్వమే ఎల్లరకు చేరరానిదిగా నిర్మించబడినదియు సిద్ధ చారణ సంఘములతో వ్యాప్తమును మనోరమమును ఆగు ఆగస్త్య భవనమును విచిత్ర నానాపకులు పూచిన పెద్ద చెట్లు స్వర్ణమయ శిఖరములు అప్పదోగణ నంగీత నాదములు కలిగి లక్ష్మీ { శోభా యు క్షమయి చూచుటకీంపగు పుష్పితకమను వర్వతమును సముద్రమునే చీల్చుకొని పైకి లేచినట్లుండీ చంద్రసూర్యులకు విశ్రామ స్థానమై చంద్ర సూర్య కిరణ నదృశములగు మహాశృంగములతో ఆకాశమును ఒరయుచున్న దో అనునట్లుండుచు సముద్రజలముతో చుట్టబడి శత యోజనోన్న తమయి ఋషులు పడవేయు ప్రసరింప జేయు) మెరపుల గుములుగల వై ద్యుతమను మహాపర్వతమును శ్రీమంతమగు వృషభ పర్వతమును శుభమగు అగస్త్య గృహముగలదై విశాల కక్ష్యలు గలిగి ఎవరికి ఎదిరించనలవికాని కుంజర పర్వతమును సర్పముల కొవాసమగు భోగవతీపురియు మహాసన గిరియు పారియాత్ర పర్వతమును గిరి శ్రేష్టమగు పర్వతములును లేత చక్రవంతమును వారాహ పర్వతమును సువర్ణ మయమగుచు ఎదిరించనలవి కాని వాడు మేఘ దుష్టాత్ముడు విశాలనేత్రుడు గంభీర ధ్వని కలవాడునగు నరకుడు వసించు శుభ ప్రార్ణ్యోతిష పురమునుఅచ్చటి అరువది వేల సూర్యునివలె ప్రకాశించునది యక్షరాక్షస గంధర్వులు ఎల్లప్పుడు సేవించు (ఆశ్రయించియుండు) నదియు తన నడుమ బంగరు కలదియు మేఘములకు మిత్రమును అగు మేరు పర్వతమును శైలేంద్రమగు కైలాసమును - ఆ దానవేంద్రునిచే కంపింపజేయబడేను॥
హేమపుష్కరసంఛన్నం తేన వైఖానసం సరః॥
కమ్పితం మానసం చైవ హంసకారణ్డవాకులమ్ ।
త్రిశృజ్గః పర్వతశ్చైవ కుమారీచ సరిద్వరా॥
తుషారచయసఞ్చన్నో మన్దరశ్చాపి పర్వతః ।
ఉశీర బిన్దుశ్చ గిరిర్ భద్రప్రస్థ స్తథాద్రిరాట్॥
ప్రజాపతిగిరి శ్చైవ తథా పుష్కరపర్వతః ।
దేవాభ్రపర్వత శ్చైవ తథా వై వాలు కాగిరి॥
క్రౌన్ఞ్చస్సప్తర్షి శైలశ్చ ధూమవర్ణశ్చ పర్వతః ।
(ఏతేచాన్యేచగిరయోదే॥)సోద్యానాః పర్వతా శ్చైవ దేశా జనపదా స్తథా॥
నదీస్ససాగరాస్సర్వా సోఽకమ్పయత దానవః ।
క పిలశ్చ మహీపుత్రో వ్యాఘవాం శ్చైవ కమ్పిత ॥
ఖేచరాశ్చ సతీపుత్త్రాః పాతాళతలవాసినః ।
గణ స్తథాపరో రౌద్రో మేఘనామాజ్కుశాయుధః॥
ఊర్ధ్వగో భీమవేగశ్చ సర్వ ఏకాభిక మితాః ।
బంగరు(వన్నె) నీటితో కప్పబడిన వైఖానస సరస్సు హంసకారండవ (జల) పక్షులతో కలతనొందుచుండు మానస సరస్సు తీశృంగమను పర్వతము కుమారీనది మంచురా శితో కప్పబడియుండు మందర పర్వతము ఉశీర బిందు భద్రప్రస్థ పర్వతములు ప్రజాపతి పుష్కర దేవాభ్రపోలుకొ పర్వతములు క్రౌంచ న పరి॥ధూమవర్ణ-పర్వతములు మరియు ఆయా ఉద్యానములు పర్వతములు దేశములు జనపదములు నదులు సముద్రములు మహీపుత్రుడగు కపిలుడు వ్యాఘ్ర వంతుడు ఖేచరులు (గగన సంచారి దేవ జాతులు) సతీపుత్తులు (నత్ లోక నివాసులు) పాతాళ తల నివాసులగువారు వారు ॥ రౌద్రము ఆను నామముగల దేవగణము అంకుశ మాయుధముగా గల మేఘ నాముడు భయంకర వేగముగల ఊర్ధ్వగుడు॥ ఈ ఆంద రును హిరణ్యకశిపునిచే కంపింపజేయబడిరి॥
గదీ శూలీ కరాళ శ్చ హిరణ్యకశిపు స్తదా॥
జీమూతగణస జ్కాశో జీమూతగణ నిస్వనః ।
జీమూతగణని ర్ఘోషో జీమూతగణవేగ వాక్॥
దేవారిర్దితిజో వీరో నృసింహం సముపాద్రవత్ ।
సము త్ప్లుత్య తత స్తీక్ష్ణైర్మృగేన్ద్రేణ మహానఖైః॥
తదోఙ్కారసహాయేన విడార్య నిహతో యుధి ।
మహీచ కాలశ్చ శశి నభశ్చ గ్రహాశ్చ సూర్యశ్చ దిశశ్చ సర్వాః॥
నద్యశ్చ శైలాశ్చ మహార్ణవాశ్చ గతాః ప్రసాదం దితిపుత్త్రనాశాత్ ।
తతశ్చ ముదితా దేవా ఋషయశ్చ తపోధనాః॥
తుష్టుపుర్నా మభిర్దివ్యై రాదిదేవం సనాతనమ్ ।
య త్త్వయా విహితం దేవ నారసింహమిదం వపుః॥
ఏతదేవార్చయిష్య న్తీ పరాపర విదో జసౌః ।
అపుడు హిరణ్యకశిపుడు గదా శూలములు దాల్చి భయంకరుడై మేఘముల గణమువలె ప్రకాశించుచు ఆట్లే ధ్వని చేయుచు ఆట్టే వేగము కలిగి దేవశ త్రుడగు ఆ దైత్య వీరుడు నృసింహుని మీదకు పరుగెత్తుకోనుచు వచ్చెను॥ అంతట మృగేంద్ర రూపుడగు హరి ఓంకార మాత సహాయుడై వాని మీదకు దుమికి వాడియగు పెద్దగోళ్ళతో పోరి వానీనిచీల్చి చం పెను॥ ఆ దైత్యుసి నాశముతో భూమి కొలము చంద్రుడు ఆకసము గ్రహములు రవి సకల దిశలు నదులు పర్వతములు మహా సముద్రములు నైర్మల్యము నందెను॥ ఆంతట దేవతలు ఋషులు మునులు సనాదా) తనుడగు శాశ్వతుడగు) ఆ దేవదేవుని దివ్యనామములతో స్తుతించిరి॥ దేవా! నీవు ఏ ఈనార సింహ రూపమును ధరించితివో॥ దానినే పరాపరత త్వ మెరిగినవారు ఆర్చన చేయుదురు॥ అని పొగడిరి॥
హిరణ్యకశిపువధాన న్తరం బ్రహ్మాదిదేవకృతనృసింహస్తుతిః॥
బ్రహ్మా : భవా న్భ్రహ్మాచ రుద్రశ్చ మ హేన్ద్రో దేవసత్తమః॥
భవాన్కర్తా వికర్తాచ లో కానాం ప్రభవోఽ వ్యయః ।
వరంచ సిద్దంచ వరంచ దేవం వరంచ మస్త్రం పరమం హవిశ్చ॥
పరంచ ధర్మం పర మంచ విశ్వం త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ ।
వరంచ సత్యం పరమం తపశ్చ పరం పవిత్రం పరమంచ మార్గమ్॥
పరంచ యజ్ఞం వరమంచ హోత్రు త్వామాహురగ్ర్యం పురుషంపురాణమ్ ।
పరం శరీరం పరమంచ బ్రహ్మ పరంచ యోగం పరమాంచ వాణీమ్॥
పరం రహస్యం పరమాం గతించ త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ ।
పరం పరస్యాపి పరం రహస్యం పరం పర స్యాపి పరం పదం యత్॥
పరం పరస్యాపి పరంచ హృద్యం త్వామాహురగ్యం పురుషం పురాణమ్ ।
ఏపం పర స్యాపి పరం పదం యత్పరం పరస్యాపి పరంచ దేవమ్॥
పరం పర స్యాపి పరంచ భూతం త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ ।
పరం పరస్యాపి పరం నిదానం పరం పర స్యాపి పరం పవిత్రమ్॥
పరం పర స్యా పి పరం చ దా న్తం త్వామాహురగ్ర్యం పురుషం పురాణమ్ ।
ఏవముక్త్వాతు భగవాన్సర్వలోకపితామహః॥
స్తుత్వా నారాయణం దేవం బ్రహ్మలోకం గతః ప్రభుః ।
తతో నదతు తూర్యేషు నృత్య న్తీష్వప్సరస్సుచ॥
క్షీరోదస్యోత్తరం కూలం జగామ హరిరీశ్వరః ।
నారసింహం వపుర్దేవస్థాపయిత్వా సుదీప్తిమత్॥
పౌరాణం రూపమాస్థాయ ప్రయయౌ గరుడధ్వజః ।
అష్టచ క్రేణ నూనేన భూతయు క్తేన భాస్వతా॥
అవ్యక్త ప్రకృతిర్దేవ స్స్వస్థానం గతవా న్పృభుః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే హిరణ్యకశిపూపాఖ్యానే నరసింహకృత హిరణ్య
కశిపు వధాది కథనం నామ ద్విషష్ట్యుత్తర శతత మోఽధ్యాయః॥
బ్రహ్మ ఆ నరసింహు నిట్లు స్తుతించెను: బ్రహ్మ రుద్రుడు దేవస త్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు ఏక ర్తయు(పరిణామము నొందించువాడు॥లయము నొందించువాడు) కారణభూతుడును నయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే॥ పరుడు॥ (ఉత్కృష్టుడు) అగు సిద్దుడు పరదేవుడు వర మంత్రము పరమ హవిస్సు ( దేవతల నుద్దేశించి అగ్నీ లో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పరను సత్యము పరమ తపము పరమ పవిత్రము పరమ మార్గము (మోక్ష సాధ? ము) పరమ యజ్ఞము పరమ హోత్రము (హోమ సాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి వాక్కు) పరమ రహస్యము పరమ గతి ( మోక్షము , పరమము కంటే పరమమగు రహస్యము పరమ పరమపదను (స్థానము) పరమ వర మహృద్యము (ప్రీతికరమగు తత్వము) పరమ పరమ దేవుడు పరమ పరమభూతము పరమ పరమ నిదానము (ఆది కారణము ; పరమ పరమ పవిత్రము పరమపరమ దాంతము (అన్ని టిని ఆణచునది) నీవేయని తత్వవేత్తలు చెప్పుచున్నారు॥ ఇట్లు నారాయణ దేవుని స్తుతించి సర్వలోక పితామహుడు భగవానుడు ప్రభువునగు బ్రహ్మ తన లోకమున కేగెను॥ తూర్యములు వ్రాయుచుండ అప్సరసలు నృత్య మొనర్చుచుండ ఈశ్వరుడగుహరి క్షీర సాగరపు ఉత్తర తీరమున కేగెను॥ గరుడ ధ్వజుడగు ఆ దేవు డచ్చట ప్రకాశించుచున్న నార సింహ శరీరమును ఉంచి తన ఎప్పటి రూపము ధరించి అష్ట చక్రములు కలదియు భూతము(పంచ తన్మాత్రలతో కూడి నదియు ప్రకాశించునదియు ఆగు వాహనముతో అవ్యక్త త త్త్వమునకు (మాయాశబలమునకు) కూడ మూలప్రకృతియగు (సర్వసానికి భూత శుద్ధ చైతన్య) రూపముతో ఆ ప్రభువు స్వస్థానమునకు ఏగెను॥
ఇది శ్రీమత్స్య మహా పురాణమున హిరణ్యకశిపూపాఖ్యానమున నరసింహుడు హిరణ్యకశిపుని వధించుటయను నూట అరువది రెండవ అధ్యాయము॥
హిరణ్యకశిపూపాఖ్యానము ముగిసినది॥
Summary of chapter 162 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the climactic destruction of Hiraṇyakashipu by Bhagavān Narasimha. Bypassing every condition of the demon king's divine boon, the Supreme Lord dragged Hiraṇyakashipu to the threshold of the assembly hall at twilight, placed him across His knees, and tore open his chest with His sharp claws. The text describes how this magnificent act destroyed the oppressive demon regime in a single moment, restoring freedom of worship across the universe and filling the hearts of the Devas with immense joy.