40 - యయాతి అష్టకునకు గృహస్థాది ధర్మముల నుపదేశించుట

 అష్టక  : చర నృహస్థః కథమేతి ధర్మా స్కథం భిక్షుః కథ మార్యకర్మా

వాన ప్రస్థః ప్రస్థితే సన్ని విష్టో బహూ నస్మి నమ్పతివేదయంతి

 యయాతిః : ఆహూతాధ్యాయీ గురు కర్మ స్వచోద్యః పూర్వోత్థాయీ చరమే చోపశాయీ

మృదుర్దాన్తో ధృతిమా నప్రమత్త స్వాధ్యాయ శీల సిద్ద్యతి బ్రహ్మచారీ

 ధర్మాగమం ప్రాప్య ధనం యజేత దద్యా త్సదై పాతిథి నోజయేచ్చ

అనాద దానశ్చ పరై రదత్తం సైషా గృహస్ధాపనిష త్పురాణీ

 స్వవీర్య జీవీ వృజినా న్ని వృత్తో దాతా పరేభ్యో న పరోపతాపీ

 తాదృఙ్ముని స్సీద్ది ము వైతి ముఖ్యాం చరన్న రణ్యే నియతాహార వేషః

 అశిల్పజీవీ గుణవాంశ్చైవ నిత్యం జితేన్జీయ స్సర్వతో విప్రయుక్తః

 అనోకశాయీ లఘు ఓప్సమాన శ్చర స్టేశా నేక చర స్స భిక్షుః

 రాత్యా యయా చాభిహితాశ్చ లోకా భవ స్త్రీ కామాభిజితా స్సుఖాశ్చ

తామేవ రాత్రిం ప్రయతీత విద్వా నరణ్యసంస్లో భవితుం యతాత్మా

 దశైవ పూర్వా నశ చాపరాంశ్చ జొతీ నథాత్మాన మథే కవింశమ్

అరణ్యవాసీ సుకృతం దదాతి ముక్త్వా త్వరణ్యే స్వశ రీర ధాతూన్,

అష్టక  : కతిస్వీ దేవ మునయః కతి మౌనాని చాస్యుత

 భవ నీతి తదాచక్ష్వ శోతు మిచ్చామ హే వయమ్

 యయాతిః : అరణ్యే వసతో యస్య గ్రామో భవతి పృష్ఠతః

 గ్రా మేవా వసతో ఒరణ్యం స ముని స్యా న్న రాధిప

 అష్టక  : కథక్చొ ద్వసతోరణ్యే గ్రామో భవతి పృష్ఠతః

గ్రా మేవా వసతో రణ్యం కథం భవతి పృష్ఠతః

 యయాతిః : న గ్రామ్యా నుపయుక్టోత య శ్చారణ్యే ముని ర్భవేత్

తథాస్య వసతో ఒరణ్యే గ్రామో భవతి పృష్ఠతః

 అనగ్ని రని కేతశ్చా ప్య గోత్రచరణ్ మునిః

కౌపీనాచ్ఛాదనం యావ త్రావడి చ్చేచ్చ చీవరమ్

 యావ తాణాభిసన్దానం తావ దిచ్ఛే చ్చ భోజనమ్

 తథాస్య వసతో గ్రామేఒరణ్యం భవతి పృష్ఠతః

 యస్తు కామా న్పరి త్యజ్య త్యక్త కర్మా జితేన్టియః

ఆతి షేచ్చ ముని ర్మౌనం స లో కే సిద్ది మాప్నుయాత్

 ధోతదనం కృత్త నఖం సదా స్నాత మలజ్కృతమ్

 అసితం సితకర్మస్థం క సం నార్చితు మర్హతి

 తపసా కర్శితః క్షామః క్షీణమాంసాస్టిశోణితః

 స చ లోక మిమం జిత్వా లోకం విజయ తేపరమ్

 యదా భవతి నిర్వ శ్వో ముని ర్మౌనం సమాశ్రితః

 అథ లోక మిమం జిత్వా కం వా విజయతే పరమ్

 ఆ స్యేన తు యదాహారం గోవ న్మృగయతే మునిః

 అథాస్య లోకపూర్వో య సోమృతత్వాయ కల్పతే

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చంద్రవంశానువర్ణనే యయాతిచరితే గృహస్థాద్యాశ్రమధర్మ విచారో నామ చత్వారింశోఽధ్యాయః

“బ్రహ్మచారి - గృహస్థుడు - సంప్రదాయానుసారముగ ఆ ఆశ్రమపు నియమములందు అభినివేశము కల పానప్రస్థుడు సంన్యాసి.వీరు ఎట్లు నడుచుకొనినచో ఆయా ఆశ్రమ ధర్మముల నాచరించిన పుణ్యమును ఫలమును పొంద గలుగుదురు? ఈ విషయమునందు అనేక విధములగు భేదముల) ఆయా ఋషులు చెప్పుచున్నారు.” అని ఆషకుడడుగ యయాతి ఇట్లు చెప్పెను. “బ్రహ్మచారి గురువు పిలిచినప్పుడు వచ్చి అధ యనము చేయవలెను. అడుగనిదే చెప్పనిదే గురుని పనులు చేయవలెను. గురునికంటే ముందు మేల్కొనవలేను. గురుని తరువాత నిదుర పోవలెను. మృదు స్వభావము ఇంద్రియనిగ్రహము నిబ్బరము హెచ్చరిక స్వాధ్యాయము చేయుట- ఈ గుణములు కలిగియున్న చో ఆతని ఆశ్రమ ధర్మములు సిద్ధించును. ధర్మముచే ధనము నార్జించవలెను. దానితోనే యజ్ఞములు చేయవలెను. దానినే దానము చేయ వలెను. దానితోనే అతిథులను భుజింపజేయవలెను. ఇతరులు తమంత తాము ఈయనిదానిని తీసికొనరాదు. ఇది సంప్ర దాయాగతమయిన గృహస్థ ధర్మము. తన శ్రమతో జీవించవలేను. పాపము చేయరాదు. ఇతరుల కీయవలెను. ఇతరులను నొప్పించరాదు. ఆహారమునందును వేషమునందును నియమముల పాటించవలెను. ఇట్లు వానప్రస్థ ధర్మమును పాటించుముని ఉత్తమ (వానప్రస్థధర్మ సిద్ధిని పొందును. విద్యలతో జీవనము గడుపరాదు. సద్గుణములు కలిగియుండవలెను. ఎల్లప్పుడు ఇంద్రియముల నిగ్రహించుకొనవలెను. అన్ని అనుభవములనుండియు విరక్తుడు కావలెను. ఏ స్థానము నందే నను పడుకొనవలెను. అత్యల్పములైన వానినే కోరవలేను. దేశ ములందంతట తిరుగుచుండవలెను. ఒంటరివాడే యుండవలెను. ఇది సంన్యాన ధర్మము. ఏ రాత్రియందు ఈ లోకములు నాకిక చాలుననియు కామములును సుఖములును నాచే జయింపబడినవి అనియును భావన కలుగునో ఆరాతియే వివేకవంతుడగు మానవుడు మనోనిగ్రహము పూని వానప్రస్థుడగుటకు యత్నించవలయును. తాను వానప్రస్థుడే జీవించి శరీర ధాతువులను - అరణ్యమునందు విడిచిన వాడు తన వంశమువారిలో తనకు ముందరి పదితరములవారికిని తన తరువాత రాబోవు పది తరములవారికిని తనకును తన సుకృతమును పంచగలుగును.” అష్టకుడు: “మునులును మౌనములును ఎన్ని విధములో వినగోరుచున్నాము.” యయాతి! “ఎవడు తాను అరణ్యమునందు నివసించుచున్న ను గ్రామము తన వెనుక నే యుండునో ఎవడు తాను గ్రామమునందున్న ను అరణ్యము తన వెనుకనే యుండునో అతడు ముని యనదగియున్నాడు.” ఇది ఎట్లని అష్ట కుడడుగ యయాతి: “అరణ్యమునందు మునిగా నున్నప్పుడు గ్రామములందు లభించు వానిని వేనిని ఉపయోగించరాదు. అట్టి వానికి గ్రామము తన వెనుక నున్న ట్లగును. గ్రామమునందు తానున్న ను అగ్ని హోత్రములను (కామముతో) ఆరాధించక ఇంటిని పట్టించుకొనక తన గోత్రము వేద శాఖ మొదలగు వానికి ప్రాముఖ్యమీయక కౌపీనమును (రహస్యాంగమును) కప్పునంత మాత్రము వస్త్రమును ప్రాణములు నిలుచునంత మా తమాహారమును ఉపయోగించుచుండు మునికి అరణ్యము తన వెనుక నున్నట్లగును, కామములను కామ్య కర్మములను విడిచి జితేంద్రియుడై మునియై మౌనమును (మనన ధర్మమును) పూనియున్న చో అట్టివాడు లోకమునందుండియు సిద్ధి పొందును. స్వచ్చపరుపబడిన దంతములు కత్తిరించబడిన గోళ్ళు కలిగి ఎల్లప్పుడును స్నానమాడి ఉండుచు అలంకరించుకొనియున్నను ఇవి ఏవియు లేక నల్లనివాడే మలినుడై) యున్న ను నిర్మలములగు నడువడులు కలిగియున్న చో అట్టివానిని ఎవరు అర్చింపడగరు? (ఎల్లవారును పూజింపవలసినదే.) తపస్సుచే కృశించి శుష్కించి మాంసము అస్థులు ర క్షము క్షీణించియుండువాడు ఈలోకమును పర లోకమును కూడ జయించును. సుఖ దుఃఖములు శీతోష్ణములు మొదలగు ద్వంద్వములను జయించి మౌనము ( మనన రూవమగు తపో ధర్మము)ను ఆశ్రయించి మునియె ఈ లోకమును జయించినవాడు మరి ఎవ్వరిని జయింపవలసియుండును? (అతడు సర్వమును జయించినట్లే.) మానవుడు తాను మునియె గోవువలె నోటితోనే ఆహారమును వెదకువాడగుచో అట్టి స్థితిలో లోక పూర్వుడు (సనాతనుడు) అగు పరమాత్ముడు ఇతనికి అమృతత్వము (మోక్షపదము)ను సిద్ధింపజేయును.”

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున యయాత్యష్టక సంవాదము అను నలువదవ అధ్యాయము.