మత్స్య మహా పురాణము
214 - రాజ ధర్మములు. రాజు ఎన్నుకొనవలసిన అధికారుల లక్షణములు - రాజు ప్రజాపాలనలో తాను నడుచుకొనవలసిన రీతి.
మనుః : రాజ్ఞోభిషిక్తమాత్రస్య న్ను కృత్యతమం భవేత్ ।
ఏతత్సర్వం సమాచశ్వ సమ్యగ్వేత్తి యతో భవా॥
మత్స్యః : అభి షేకార్ధశిరసా రాజ్ఞా రాజ్యావలోకినా ।
సహాయవరణం కార్యం తత్ర రాజ్యం ప్రతిష్టితమ్॥
యదప్యల్పతరం కర్మ తద ప్యే కేన దుష్కరమ్ ।
పురు షేణాసహాయేన కింను రాజ్యం మహోదయమ్॥
తస్మా త్సహాయా న్వరయే తులీనా న్నృపతి స్వయమ్ ।
శూరా నులీనజాతీయా న్బలయుక్తా ఇయాన్వితాక్॥
రూపసత్వగుణో పేతా నజ్జనా న్షమయాన్వితాక్ ।
క్లేశమా న్మహోత్సాహా స్ధర్మజ్ఞాంశ్చ ప్రియంవదాక్॥
హితోపదేశ కా భ్రాజ స్వామిభక్తా న్యతోర్డినః ।
ఏవం విధా నృహాయాంస్తు శుభకర్మసు యోజయేత్॥
గుణహీనానపి తథా విజ్ఞాయ సృపతి స్వయమ్ ।
కర్మ స్వేష నియుక్టోత యథాయోగ్యేషు భాగతః॥
సేనానీ ప్రతీహారో కులీన శీలసమ్పన్న శ్చతుర్వేద విశారదః ।
హస్తిశిక్షాశ్వశిక్షాసు కుశల శ్రృక్షభాషితా॥
నిమి త్తే శకునజ్జానే వేత్తాచైవ చికిత్సతే ।
కృతజ్ఞః కర్మణాం శూర స్తథా క్లేశ సహో ఋజు॥
ప్యూహతత్త్వవిధానజ్ఞః ఫల్గుసార విశేష విత్ ।
రాజ్ఞా సేనాపతిః కార్యో బ్రాహ్మణః క్షత్రియోపి వా॥
ప్రాంశు స్సురూపో దక్షశ్చ ప్రియవాదీ నచోద్దతః ।
చిత్త గ్రాహశ్చ సర్వేషాం ప్రతీహారో విధీయతే॥
(గమనిక: ఈ రాజ ధర్మా ధ్యాయములలో 1. “శాస్త్రజ్ఞుడుత త్వజ్ఞుడు అనగా ఆయా శాస్త్రముల విష యమును చదివి బుద్ధి యందు బాగుగా కుదురుపరచుకొనినవాడు; 2. విధానజ్ఞుడు అనగా దానిని ఆచరించ గలవాడు; (1. శాస్త్రము.Knowledge in Theory 2. విధానము.Capability in Practice).
పట్టాభిషేక మందిన ప్రతి యొక రాజునకును ముఖ్య తమ కృత్య మేమి? నీవింతయు ఎరిగినవాడవు కావున తెలుప వేడుచున్నా ననిన మనువుతో మత్యుడిట్లు చెప్పెను: రాజు ఆభి షేకముతో తలతడి ఆరకుండగ నున్నప్పటినుండియు రాజ్యమును చూచుకొనుటకై తగిన సహాయులను ఎన్ను కొనవలయును; ఏలయన వారియందే రాజ్యము నిలిచియున్నది; చాల చిన్న పనియును ఒక డే చేయజాలడనిన మహోదయమగు రాజ్యము మాట చెప్పవలసినదేమి? కావున రాజు తానే కులీ నులు కులీన జాతీయులు శూరులు బలయుక్తులు సంపద(ముఖశ్రీ)గలవారు రూపము సత్వము (నిబ్బరము) గుణములు కలవారు సజ్జనులు క్షమాపరులు క్లేశము నోర్చువారు మహోత్సాహులు ధర్మజులు ప్రియంవదులు రాజునందు స్వామి భకు హితము నుపదేశించువారు తమకును రాజునకును కీర్తి కోరువారునగు సహాయుల నెన్ను కొని వారిని ఆయా మంచి పను లందు నియోగించవలేను. రాజు స్వయముగా పరీక్షించి చూచి ఈ చేప్పినన్ని గుణములులేని గుణహీనులై నను గ్రహించి వారిని తగిన పనులయందు భాగక్రమమున నియోగించవచ్చును; (ఇది రాజ సహాయుల సామాన్య లక్షణము;) కులీనుడు శీల సంపన్నుడు చతుర్వేద విశారదుడు హస్తి శిక్షాఋశ్వ శిక్షలయందు కుశలుడు మృదుభాషి శుభాశుభ ములగు నిమిత్తము లను శకునములను ఆయా చికిత్సా విధానములను ఎరిగినవాడు కృతజ్ఞుడు కార్యశూరుడు క్లేశ సహుడు ఋజు స్వభావుడు వ్యూహముల తత్వమును వ్యూహ విధానమును ఎరిగినవాడు తేలిక యైన విషయమేదో బరువగు విషయ మేదో ఎరిగినవాడు అగు బ్రాహ్మణుని కాని క్షత్రియునికాని సేనాపతిగా నియోగించవలెను; పొడగరి సురూపుడు దక్షుడు ప్రియవాది పొగరు లేనివాడు సర్వుల మనస్సులకు నచ్చువాడు -అందర మనస్సులలోని భావములను గ్రహించగలవాడు అగు వానిని ప్రతీ హారునిగా (ద్వారాధికారిగా) నియమించుకొనవలెను. దూత (రాయ బారి) చెప్పిన విషయము చెప్పినట్లు ఇతరులకు ఆందించువాడు దేశ భాషా విశారదుడు శ క్తి కలవాడు క్లేశ సహుడు మాటకారి దేశ కాల విభాగముల నెరిగినవాడు దేశ కాలముల గుర్తించి ప్రవర్తించగలవాడు (ఏ దేశ మందే కాలమందెట్లు వర్తించవలయునో తెలిసియుండుట మొదటిది-దానిని ఆచరణయందుంచి ప్రవర్తించుట రెండవది); రాజ హితము కోరువాడు రాజనీతి విషయములను తగిన సమయమందు తగినట్లు మాటలాడు వాడునయి యుండవలయును.
దూతాదిలక్షణమ్
యథోక్తవాదీ దూత స్స్యా ద్దేశ భాషావిశారదః ।
శ క్తః క్లేశ సహో వాగ్మీ దేశ కాలవిభాగవిత్॥
విజ్ఞాత దేశ కాలశ్చ హితో య స్స్యా న్మహీక్షితః ।
వక్తా నయస్య యః కాలే స దూతో నృపతే ర్భవేత్॥
ప్రాంశవో వ్యాయతా శ్శూరా దృఢ భక్తా నిరాకులాః ।
రాజ్ఞా తు రక్షిణః కార్యా స్సదా క్లేశ సహా హితాః॥
అనాహార్యో నృశంసశ్చ దృఢభక్తిశ్చ పార్థివే ।
తామ్బూలధారీ భవతి నారీ వావ్యథ తద్గుణా॥
షాడ్గుణ్యవిధిత త్వజ్ఞో దేశ భాషావిశారదః ।
సన్టివిగ్రహకః కార్యో రాజ్ఞా నయవిశారదః॥
ఆయవ్యయజ్ఞో లోకజ్ఞో దేశోత్పత్తి విశారదః ।
కృతాకృతజ్లో భృత్యానాం జ్ఞేయ స్స్యా దేశరక్షితా॥
సురూప స్తరుణః ప్రాంశు ర్దృఢభక్తిః కులోద్భవః ।
శూరః క్లేశ సహ శ్చైవ ఖడ్గధారీ ప్రకీర్తితః॥
శూరశ్చ బలయుక్తశ్చ గజాశ్వరథకోవిదః ।
ధనుర్ధారీ భవేద్రాజ్ఞ న్సర్వక్లేశ సహ శ్శుచిః॥
నిమిత్తశకునజ్ఞానీ హయశిక్షా విశారదః ।
హయాయుర్వేదతత్త్వజ్ఞా భువో భాగవి శేషవిత్॥
బలాబలష్ణో రథిన స్థిరదృష్టిః ప్రియంవదః ।
శూరశ్చ కృత విద్యశ్చ సారథిః పరికీర్తితః॥
అనాహార్య శ్శుచి ర్ధక్ష శ్చికిత్సితవిదాం వరః ।
సూపశాస్త్రవిధానజ్ఞ స్సూదాధ్యక్షః ప్రశస్యతే॥
సూదశాస్త్రవిధానజ్ఞాః పరాభేద్యాః కులోద్భవాః ।
సర్వే మహాన సే కార్యాః కృత్త కేశనఖా జనాః॥
సమ శ్శత్రౌచ మిత్రేచ ధర్మశాస్త్ర విశారదః ।
విప్రముఖ్యః కులీనశ్చ ధర్మాధికరణే భవేత్॥
కార్యా స్తథావిధా స్తత్ర ద్విజముఖ్యా స్సభాసదః ।
పొడగరులు పొడవు బాహువులవారు శూరులు దృఢభక్తులు దేనికిని కలతపడనివారు క్లేశ సహులు హితకరులునై రాజ రక్షకులుండవలెను; తమ్ముపడిగ పట్టువారు (తాంబూల కరండధారులు) స్త్రీలుకాని పురుషులు కాని కావచ్చును; వారు అనాహార్యులు (ఆహార్యము- వేషధారణము) ఎక్కువ ఆకర్షణీయము ఆడంబర ద్యోతకము ఆగు వేషము ధరించనివారు క్రూర తలేని వారు రాజునందు దృఢభక్తులు అయియుండవలెదు; సంధి.విగ్రహము యానము. ఆసనము-ద్వైధము - ఆశ్రయము అను షాఢుణ్యపు తత్వమును దాని ఆచరణ విధానమును ఎరిగినవాడు దేశ భాషా విశారదుడు ; రాజనీతి విశారదుడునయి ‘సంధి విగ్రహకుడు’ విదేశ వ్యవహారముల చూచు మంత్రి) ఉండవలెను; రాజు కడ నుండు ఖడ్గధారి రాజ భృత్యులలో ఏదీ ఎవరు చేసి కో చేయుదురో చేయవలెనో ఎవరు తమ క రవ్యమును ఆచరించని వారో గమనించగలవాడు దేశ రక్ష జాసక్తుడు సురూపుడు తరుణుడు ప్రాంశుడు (పొడగరి) దృఢభక్తుడు సత్కులోద్భవుడు శూరుడు క్లేశ సహుడునయియుండ వలేను; రాజుకడనుండు ధనుర్ధారి శూరుడు బలయుక్తుడు గజాశ్వరథ (తత్వమునందును వానిని నడుపుటయందును) కోవిదుడు సర్వ క్లేశ సహుడు శుచీ (కపటము లేని వాడు) అయియుండవలయును; రాజసారథి నిమి త్తములందు. (ఉత్పా తములు మొదలగువానియందు శకునములందు) ఎరుక గలవాడు హయ శిక్షా విశారదుడు హయాయు ర్వేద తత్వజుడు భూభాగ ములు ఎచ్చట ఎట్టివిగా నున్న వో ఎచ్చట ఏయే ప్రదేశములున్న వో ఎరిగినవాడు రథికుని బలాబలముల నెరిగిన వాడు స్థిరదృష్టి కలవాడు ప్రియంవదుడు శూరుడు యుద్ధ విద్యయందారి తేరినవాడు నయియుండవలయును: సూదము నకు (వంటశాలకు వంటపనులకు) ఆధ్యక్షుడు ఆడంబరపు వేషము ధరించని వాడు (శరీసమున చిత్తమున) శుచి దక్షుడు చికిత్సా విధానముల నెరిగినవాడు సూద పాక శాస్త్రమును దానిని చేయుటను ఎరిగినవాడు అయియుండవలెను. మహా నసమందు (వంటశాలయందు) ఉండు పని వారు సూద పొక శాస్త్రమును దాని ప్రధానమును ఎరిగిన వారు ఇతరులకు (ఆంతర్బహిశ్శత్రువులు మొదలగువారి భేదోపాయములచే) భేదింపనలవికాని వారు గోళ్ళను జుట్టును కత్తిరించుకోని యుండు వారు నయియుండవలెను; ధర్మాధికృతుడు(Judge) శత్రుమిత్రులయందు సముడు ధర్మశాస్త్రము (Law) నందు పండితుడు కులీనుడు బ్రాహ్మణ శ్రేష్టుడునయియుండవలెను; ఇట్టి ద్విజముఖ్యులే అతనికి సహాయులగు ధర్మ సభాసదులుగా నుండవలయును.
లేఖకలక్షణమ్
సర్వదేశాక్షరాభిజ్ఞ స్సర్వశాస్త్రవిశారదః॥
లేఖకః కథితో రాజ్ఞ స్సర్వాధికరణేషు వై ।
శీర్షోపేతా న్సుసమ్పూర్ణా నమ శ్రేణిగతా నమా॥
అక్షరా న్విలిభేద్యస్తు లేఖక స వర స్సృతః ।
ఉపాయపాక్య కుశల స్సర్వశాస్త్ర విశారదః॥
బహ్వర్థవక్త చాల్పేన లేఖక స్స్యా నృపో త్తమ ।
వాక్యాభిప్రాయత త్వజో దేశ కాల విభాగవిత్॥
ఆనాహార్యో భవే చ్ఛక్తో లేఖక స్స్యా నృపోత్తమ ।
పురుషా నరతత్త్వజ్ఞాః ప్రాంశవశ్చా వ్యలోలుపాః॥
ధర్మాధికారిణః కార్యా జనాదానకరా నరాః ।
ఏవంవిధా స్తథా కార్యా రాజ్ఞా దౌవారికా జనాః॥
ధనాధ్యక్షాదిలక్షణమ్
లోహవస్త్రాజినాదీనాం రత్నా నాం చ విధానవిత్ ।
విజ్ఞాతో ఫల్గుసారాణా మనాహార్య శ్శుచిస్మితః॥
నిపుణ శ్చాప్రమత్తశ్చ ధనాధ్యక్షః ప్రకీర్తితః ।
ఆయద్వారేషు సర్వేషు ధనాధ్యక్షసమా నరాః॥
వ్యయద్వారేషు సర్వేషు కర్తవ్యాః పృథివీక్షితా ।
పరమ్పరాగతో య స్స్యా దష్టాడ్గసు చికిత్సతే॥
అనాహార్య స్స వైద్య స్స్యొ ధర్మాత్మా చ కులోత్తితః ।
ప్రాణా చార్య స్స విజ్జీయో వచనం తస్య భూభుజా॥
రాజ నాజ్ఞా సదా కార్యం యథా కార్యం పృథర్జనైః ।
హ స్తిశిక్షా విధానజో వనజాతివిశారదః॥
హస్తిశిక్షకాదిలక్షణమ్
క్లేశక్షమ స్తథా రాజ్ఞో గజాధ్య క్షః ప్రశస్యతే ।
ఏతై రేవ గుణై ర్యుక్త స్వా సనశ్చ విశిష్యతే॥
గజారోహో నరేంద్రస్య సర్వకర్మసు శస్యతే ।
రాజునకు అన్ని అధికరణముల(Departments) యందును లేఖకులుండవలయును; లేఖకుడు తలకట్టులు కలవి నిండయినవి సరియగు వరుసలయందుండునని సమపరిమాణము కలవిఅగు అక్షరములు వాయువాడు ఉపాయముల నేరుగుటయందు ఆవగాహనము చేసికొనుటయందు నేర్పరియు సర్వశాస్త్ర విశారదుడును కొలది వాక్యములతోనే వి సృ తార్థమును చెప్పగలవాడు వాక్యాభిప్రాయ తత్వము నెరిగినవాడు దేశ కాల విభాగమును (ఏ కాలమందేది చేయవలెనో మాటాడవలెనో) ఎరిగినవాడు వేషాడంబర ము లేని వాడు (Simple in dress) శ క్తి (బుద్ది స్పురణము) కలవాడు ఆయి యుండవలయును; పురుషుల (ఆయా వ్యక్తుల) స్వభావములందలి భేదమును గురుతింపగలవారు పొడగరులు ధనాశా రహితులు జనులను తమవై పునకు తిప్పుకొనగలవారు ధర్మాధికరణ శాఖయందు నియోగింపబడవలెను; రాజునకు దేవా రికులు (ద్వార పాలురు)ను ఇట్టివారే అయి యుండవలెను; ధనాధ్యక్షుడు లోహములు వస్త్రములు చర్మములు రత్న ములు మొదలగువాని తత్వమును విధానమును (ఆయా వస్తువుల స్వరూప లక్షణములును ఏది ఎట్లున్నదో మంచిదో మంచిది కాదో తెలియుట తత్వమును ఎరుగుట. ఆయా వస్తువులలో ఏది ఏ పనికి వచ్చునో ఎట్లు దేనిని వినియోగించుకొనవచ్చునో ఎరుగుట విధాన జ్ఞానము) ఎరిగినవాడు కొంచేపుది ఏది యో గొప్పది ఏదియా ఎరిగినవాడు వేషాడంబరము లేనివాడు నిర్మలమగు నవ్వు కలవాడు నిపుణుడు ఏమరుపాటులేనివాడు ధనాధ్యక్షుడుగ నుండవలయును: ఆయ ద్వారము (ఆదా యపు సాధనములగు శాఖ)లన్నిటియందును వ్యయ ద్వారముల (శాఖల) యందును ధనాధ్యక్షునితో సములగువారేయుండ వలయును; శల్యము శాలాక్యము కాయ చికిత్స భూత విద్య కౌమార భృత్య ఆగదతంత్రము రసాయన తంత్రము వాజీ కరణ తంత్రము. లేదా-యము బాలము గ్రహము ఊర్ధ్వాంగకము శల్యము దంష్ట్ర-జర-వృషము అను ఎనిమిది వై ద్యొంగముల యందును చీకిత్సా ప్రక్రియయందును నిపుణుడు వంశ పరంపరాక్రమ మున వచ్చినవాడు వేషమున నిరా డంబరుడు ధర్మ మనస్కుడు ఉత్తమ వంశమున పుట్టినవాడు రాజ వై ద్యుడుగా నియోగింపబడవలేను. ఆతడు రాజునకు ప్రాణా చార్యుడు; కావున భూభర్తయగు రాజు ఎల్లప్పుడును ఆతడు చెప్పిన మాటను సాధారణ జనులు పాటించినట్లే పాటించి ఆచరించవలయును; గజ శిక్షా విధానము బాగుగ నేరిగినవాడు క్లేశమును ఓర్చుకొనువాడు వనగజ జాతులను బాగుగ నేరిగినవాడు గజాధ్యక్షుడుగా నుండవలెను; ఇవే గుణములతో కూడినవాడును అందునను ముఖ్యముగా మూల వ్యాధి మొద లగునవి లేక బాగుగ కూర్చుండగలవాడు రాజ గజారోహుడుగ (మావటివాడుగ) నుండవలయును; ఇట్టివాడు సర్వకర్మల యందును ప్రళస్తుడు.
హయశిక్షావిధానజ్ఞోశ్వచికిత్సతపారగః॥
ఆశ్వాధ్యక్షో మహీభర్తు స్స్యాసనశ్చ ప్రశస్యతే ।
అనాహార్యశ్చ శూరశ్చ వాగ్మీ ప్రాజ్ఞః కులోత్తితః॥
దుర్గాధ్యక్ష స్మృతో రాజ్ఞ ఉద్యుక్త స్సర్వకర్మసు ।
వాస్తువిద్యావిధానజో లఘహస్తో జితక్లమకి॥
దర్మీచ దీర్ఘశూరశ్చ స్థపతిః పరికీర్తితః ।
య స్త్రము కే పాణిము కే విముక్తి ముక్తధారితే॥
అస్త్రాచార్యో నీరుద్వేగః కుశలశ్చ విశిష్యతే ।
వృద్ధః కులోద్ధత సూక్తః పితృప్రేతామహ శ్శుచిః॥
రాజ్ఞా మనఃపురాధ్యక్షో వినీతశ్చ తāష్యతే ।
ఏవం సప్తాధికారేషు పురుషా స్సప్త తే పురే॥
పరీక్ష్య బాధికార్యా స్స్యూ రాజ్ఞా సర్వేషు కర్మసు ।
స్థాపనాజాతితత్వజ్ఞస్సతతం ప్రతిజాగృతః॥
రాజ్ఞ స్స్యా దాయుధాగారే దక్షః కర్మసు చోద్యతః ।
కర్మాణ్యపరిమేయాని రాజో నృపకులోద్వహ॥
ఉత్తమాధమమధ్యాని బుద్ధ్వా కర్మాణి పార్థివః ।
ఉత్తమాధమమధ్యేషు పురు షేషు నియోజయేత్॥
నరకర్మ విపర్యానా హ్రజా వ్యసన మాప్నుయాత్ ।
నియోగం పౌరుషం భక్తిం శ్రుతం శౌర్యం కులం నయమ్॥
జ్ఞాత్వా వృత్తి ర్విధాత వ్యా పురుషాణాం మహీక్షితా ।
పురుషాన్తర విజ్ఞానత త్త్వసారనిబందనాత్॥
హయశిక్షను హయచికిత్సను తుదముట్టనేరిగిన వాడును స్వాధనుడు (మూలవ్యాధి మొదలగునవి లేక ఎంత సేపయిన బాగుగ కూర్చుండగలవాడు), రాజునకు అళ్వాధ్యక్షుడుగ నుండవలయును; నిరాడంబర వేషుడు శూరుడు మాట నేర్పరి ప్రాజ్ఞుడు- కులీ నుడు సర్వకాలములందును సదా పూనికతో నుండు వాడు దుర్గాధ్యక్షుడుగా నుండవలయును; వాస్తు విద్యను వాస్తు విధాన మును బాగుగ నెరిగినవాడు లఘుహస్తుడు (శీఘ్రముగా పనులు చేయగలవాడు). శ్రమకోర్చు వాడు దూరదర్శియు శూరుడునగువాడు రాజునకు వడ్లంగిగా నుండవలయును; యంత్రములతో విడుచునవి చేతితో విడుచునవి ధనుస్సు నుండి విడుచునవి విడిచి మరల గ్రహించి పట్టుకొనునవి అగు ఆయుధములందు కుశలుడు ఉద్వేగము లేనివాడు రాజునకు అస్త్రాచార్యుడుగ ఉండవలయును; వృద్ధుడు కులీనుడు చక్కని మాటలాడువాడు పితృ పితామహాది వంశ క్రమాగతుడు మనశ్శరీరములందు శుచియగువాడు వినయము మంచి నడువడి) కలవాడు అంతఃపురాధ్యక్షుడుగా నుండవలయును; రాజు ఈ విధముగా (ఈ చేప్పిన వానిలో ప్రధానములగు) ఏడధికారములందును ఏడుమంది రాజ పురుషులను చక్కగా పరీక్షించి పురమందు ఆచరించవలసిన సర్వ కర్మముల నిర్వహణములందును నీయోగించవలేను; వీరుకాక . రాజు ఆయుధాగారాధ్యక్షునిగా ఆయా యాయుధములను అమర్చు విధపు తత్వమును బాగుగ నెరిగినవాడు నిరంతరము మెలకువతో నుండువాడు సర్వకర్మములందును సదా పూనికతో నుండువాడు అగు వానిని నియోగించవలయును; నృపకులోద్వహుడవగు మనూ! రాజునకు గల కార్యములు అపరిమితములు; అవి ఉత్తమములు ఆధమములుననీ మూడు విధములు; వాని తరము నేరిగి రాజు పోటిని వరుసగా ఉతములు మధ్యములు ఆధములునగు పురుషులయందు నిలుపవలయును; నరులు చేయు కర్మల వ్యత్యానము వలన రాజు వ్యననమును - (కీడును) పొందును; వారివారి అధికారమును . దానిని వారు నిర్వహించు తీరును వారిపౌరుషమును పోరాపనుల నిర్వహించుటలో చూపుపూనికను వారి రాజభ క్తిని శాస్త్ర జ్ఞానమును శౌర్యమును కులమును రాజనీతిజ్ఞానమును ఎరిగియే రాజు రాజ పురుషులను నియోగము (ఆయా అధికారములందు నిలుపుట) చేయవలసి యుండును; ఇది చేయుటలో రాజు ఆయా పురుషుల ఆంతర (చిత్తములందలి) విజ్ఞాన (అనుభవ పూర్వక విషయ పరిజ్ఞాన) సారమును త త్వ (విషయ పరిజ్ఞాన) జ్ఞాన సారమును ఎంతటివియో ఎరిగి వానిని ఆధారముగా తీసికొనవలెను.
రాజ్ఞో మంత్రిభిస్సహ మంత్రణక్రమః.
బహుభి ర్మంత్రయే త్కామం రాజా మంత్రం పృథక్పృథక్ ।
మంత్రిణామపి నో కుర్యాత్మంత్రీ మన్తప్రకాశనమ్॥
క్వచి న్న కస్య విశ్వాసో భవతీహ సదానృణామ్ ।
నిశ్చయస్తు సదా మనే కార్య ఏ కేన సూరిణా॥
భవేద్వా నిశ్చయావా ప్రిః పర బుద్ధ్యుపజీవనాత్ ।
ఏక స్యైవ మహీభర్తు ర్భూయః కార్యో వినిశ్చయః॥
బ్రాహ్మణా న్పర్యుపాసీత త్రయీశాస్త్రసునిశ్చితాక్: ।
నాసచ్ఛాస్త్రవతో మూణాం హి లోకస్య కజ్జికాః॥
వృద్ధాక్ హి నిత్యం సేవేత విప్రా న్వేద విద శ్శుచీజ్ ।
తేభ్యోహి శిక్షే ద్వినయం వినీతాత్మాహి నిత్యశః॥
సమగ్రాం వశ గాం కుర్యా త్పృథివీం నాత్ర సంశయః ।
బహవో వినయా ద్రృష్ణా రాజాన సపరిచ్చదాః॥
ధనాని చైవ రాజ్యాని వినయాత్రతి పేదిరే
రాజ్ఞో విద్యాగ్రహణవిధిః
త్రైవిద్యేథ్య స్త్రయీం విద్యాం దణ్డనీతించ శాశ్వతీమ్॥
ఆన్వీక్ష కీం చాత్మవిద్యాం వార్తారమాంశ్చ లోకతః ।
ఇంద్రియాణాం జయే యోగం సమా తిష్ఠ ద్దివానిశమ్॥
జితేన్డియో హి శక్నోతి వశ స్థాపయితుం ప్రజాః ।
యజేత రాజా క్రతుభి ర్బహుభి ర్బూరిదక్షిడై॥
ధర్మార్థ మేవ వి పేభ్యో దద్యా ద్భోగా స్థనాని చ ।
సాంవత్సరిక మా ఫ్రైశ్చ రాష్ట్ర దాహారయే ద్బలిమ్॥
స్యాత్స్వాధ్యాయపరో లోకే వర్రేత పితృబన్దువత్ ।
ఆవృత్తానాం గురుకులా ద్విజానాం పూజకో భవేత్॥
నృపాణా మక్షయో హ్యేష విధి రాహ్మొ భిధీయతే ।
తత స్తే మానవా మిత్రా హరంతి న వినశ్యతి॥
తస్మా ద్రాజ్ఞా విధాతవ్యో బ్రాహ్మా వై హ్యక్షయో విధిః ।
సమో త్తమాధమై రాజా హ్యాహూయ పాలయే త్ప్రజాః॥
రాజు తన ఇష్టము వచ్చినంత మందితో వేరువేరుగా మంత్రణము చేయవచ్చును; కాని మంత్రాలోచన పరుడగు రాజెప్పుడును మంత్రులకు కూడ ఇతర మంత్రులు చెప్పిన మంత్రమును బయలు పరచగూడదు; రాజు ఏ మానవులను నమ్మ రాదు; ఆయా మంత్రులు చెప్పిన మంత్రణముల పై నిశ్చయము మాత్రము తానే వివేచనపరుడై చేయవలెను; ఇతరుల బుద్ధినుండి పుష్టి పొందిననే కాని తాను నిశ్చయము చేసికొనలేడనుట నిజమే; కాని . రాజై నవాడు ఇతరులు చెప్పిన దానిమీద కూడ తన బుద్ధితో నే నిశ్చయము చేసికొనవలెను; వేద శాస్త్రములను బాగుగనేర్చి వాటియందు దృఢపాండితిగల బ్రాహ్మణులను రాజు సేవించవలేను; ఆసచ్చాస్త్రములను చదివిన మూఢులను సేవించరాదు; వారు లోకమునకు అపకారులు; వేద వేత్తలు నిర్మల మనస్కులునగు విపులనే సేవించవలేను; తాను వినయ సంపన్నుడే వారినుండి ఇంకను వినయ (సత్పవర్తన)మును ఎడతెగక శిక్షణ పొందుచుండవలెను; దీనిచే రాజు పృథివి నంతటిని తన వశము చేసికొనగలుగును; చాలమంది రాజులు అవినయము వలన తాము తమ పరివారముతో కూడ భ్రష్టులయిరి; వినయము వలన ధనములను రాజ్యములను పొందిరి.
రాజు వేదత్రయము నందును తదంగ శాస్త్రములందును పండితులగు వారినుండి వేద శాస్త్రాది విద్యలను శాశ్వతము (సార్వకాలికము) అగు దండనీతిని తర్కశాస్త్రమును ఆత్మ విద్యను నేరువవలేను; వాణిజ్యము కళలు మొద లగు వానిని లోకపు నడువడిక నుండి తెలిసికొనవలెను; ఇంద్రియ జయమునకై యోగమును నిరంతరమధ్యసించవలెను; ఏలయన జితేంద్రియుడే ప్రజలను తన అదుపులో ఉంచుకొనగలుగును. ధర్మసాధనకై రాజు బహుదక్షిణలతో కూడ క్రతువులతో దేవతల నారాధించవలయును; విప్రులకు ధనభోగముల నీయవలెను; ఆప్తుల ద్వారమున ఏటేట రాష్ట్రము నందలి ప్రజల నుండి రావలసిన పన్నులను సేకరించుకొనవలెను; స్వాధ్యాయపరుడై ఎప్పుడును వేద శాస్త్రాదుల నధ్యయనము చేయుచు ఉండవలెను. జనులకు తాను తండ్రివలె బంధువువలె నడుచుకొనవలెను; గురుకులము నుండి విద్యముగించి వచ్చిన స్నా తకులగు విప్రుల పూజించ (ఆదరించ)వలెను. ఇది రాజుల కై బ్రహ్మ (ప్రజాపతి) ఏర్పరచిన ఆక్షయ (శాశ్వత) విధానము; అని శాస్త్రమున చెప్పబడు చున్నది; ఈ విధమగు ప్రక్రియలచే సంపాదించిన అక్షయనిధిని దొంగలు కాని శత్రులు కానీ హరించజాలరు; అది తనంతట తాను నశించునదియు కొదు; కావున రాజు ఈ బ్రాహ్మమగు అక్షయ విధానమును పాటించి నడువవలెను; అపుడపుడు రాజు ప్రజల యందలి ఉత్తములు సాధారణులు ఆధములు అను మూడు వర్గములకు చెందిన ప్రజల(లోముఖ్యు)లను తన కడకు పిలిపించుకొని (వారిననువర్తించుచు) ప్రజలను పాలించవలెను.
రాజ్ఞః కృపణాదిరక్షణ విధిః
న నివ త్రేత సజామా జ్ఞాత్రవ్రత మనుస్మరణా ।
సజ్జామే ష్వనివర్తిత్వం ప్రజానాం పరిపాలనమ్॥
శుశ్రూషా బ్రాహ్మణానాంచ రాజ్ఞాం నిః శ్రేయసం పరమ్ ।
కృపణానాధవృద్దానాం విధవానాం చ పాలనమ్॥
యోగ క్షేమం చ వృత్తించ తథైవ పరికల్పయేత్ ।
వర్ణాశ్రమవ్యవస్థానం తథా కార్యం విశేషతః॥
స్వధర్మప్రచ్యుతా నొజా స్వే ధర్మే స్థావయే త్సదా ।
ఆశ్ర మేషు యథా కార్య మన్నం తైలంచ భాజనమ్॥
స్వయమేవానయే ద్రాజా సత్కృతా న్నావమానయేత్ ।
తాప సే సర్వకార్యాణి రాజ్య మాత్మాన మేవచ॥
నివేదయే తయత్నేన దేవవ చ్చిర మర్చయేత్ ।
ద్వే ప్రజ్డ్ వేదిత వ్యేచ ఋజ్వీ వకాచ మానవై ॥
వక్రాం జ్ఞాత్వా న సేవేత ప్రతిబాధేత చాగతమ్ ।
సాత్వికం భావ మాస్థాయ ఋజ్వీంచ పరిపాలయేత్॥
నాత్మచ్ఛిద్రం పరో విన్ద్యా ద్విస్ధ్యా చ్ఛిదం పరస్య తు ।
గూ హేత్కూర్మ ఇవాజ్ఞాని రమే ద్వివరమాత్మనః॥
న విశ్వ సే దవిశ్వస్తే విశ్వసే నాతి విశ్వ సేత్ ।
విశ్వాసా ద్భయముత్పన్నం మూలాన్యపి నికృన్తతి॥
విశ్వాసయే చ్చాప్యపరం తత్త్వభూతేన హేతునా ।
బకవ చ్చి న్తయే దర్గా సౌంహవచ్చ పరాక్ర మేత్॥
వృకవచ్చాపి లు మేత శ్యేనవచ్చ నిపాతయేత్ ।
దృడప్రహారీచ భవే తథా సూకరవ న్నృపః॥
చిత్రా కారశ్చ శిఖివ ద్దృఢ భక్త స్తథాశ్వవత్ ।
భవేచ్చ మధురాభాషీ సకోకిలవతన్నృపః॥
క్షత్రియ వ్రతధర్మమును జ్ఞప్తియందుంచుకొని యుద్ధము లందువెనుదిరుగ కుండవలెను; సంగ్రామములందు మరల కుండుట ప్రజలను సరిగా పాలించుట బ్రాహ్మణులను సేవించుట ఇవి రాజులకు పరమ నిః శ్రేయస (పర లోకసుఖ) సాధనములు; దీనులు అనాధులు వృద్దులు విధవలు. వీరిని కను పెట్టి చూచుచు పాలించుటతో పాటు వారి యోగక్షేమము లకు జీవనమునకు ఏర్పాటు చేయవలెను; రాజేప్పుడును స్వధర్మము తప్పి నడుచు వారిని దానియందు నిలుపవలెను; ముని ఋష్యాద్యా శ్రమములందలి వారి కై అన్న మునకు వస్త్రమునకు పాత్రలకు ఏర్పాటు చేయవలెను; వారిని సత్కార పూర్వకముగా రాజ్యములోనికి (నగరమునకు) పిలుచుకొనివచ్చి సత్కరించవలెను; వారిని సత్కరించవలెనే కాని లోక సత్కారము పొందుచుండు అట్టి పెద్దలనెన్నడు నవమానించరాదు; వారికి తాను చేయు (పరిపాలన సంబంధి) సర్వ కార్యములను (నేనిది ఇట్లు చేయుచుంటినని) నివేదించవలెను; రాజ్యమును తను తన పరివారాదిక మును కూడ (ఇది యంతయు తమ అధీనమేయని) యత్న పరుడై నివేదించవలెను; దేవతలనువలె వారి నర్చించవలెను; మను సంప ఊయముననుసరించి రాజులు ఋజ్వీ (వంకర లేనిది) వక్రా (వంకరయగునది) అను రెండు ప్రజ్ఞలను (వర్తన విధానము లను ఆలోచనా సరణులను) తెలిసికొనవలెను; కానీ తాను మాత్రము ఋజ్వీ ప్రజ్ఞనే పాటించవలెను; ఇతరులు వక్ర ప్రజ్ఞను తన పై ప్రయోగించుచో దానిని గుర్తించి దాని నెదుర్కొనీ దానికి ప్రతీకారము చేయవలెను; తాను మాత్రము సాత్విక భావము నవలంబించి ఋజ్వీ ప్రజ్ఞనే ఆచరణములోనికి తీసికొనవలెను; తన ఛిద్రము (లోపము )ను ఇతరులకు తెలియనీయక పరచ్చిద్రమును తెలిసికొనుచు తన అవయవములను కప్పుకొనునట్లును తనలో దొరలు లోపములను కూడ కప్పిపుచ్చు కొనుచు (ఇత రులకు బయలుపడనీయక) వాటిని రక్షించుకొనుచు తప్పులను సవరించుకొనుచు)ఉండవలయును; తను నమ్మని వానిని తాను నమ్మరాదు; నమ్మినవానినికూడ మితిమీరి నమ్మరాదు; దానివలన కలుగు భయము (కీడు) వేళ్ళను కూడ నరకును; (సమూలముగా నాశము కలిగించును;) వా స్తవములగు హేతువులతో ఇతరులను తాను నమ్మించవలెను; కొంగవలె (కపట ధ్యానముతో నిశ్చల చిత్తముతో) రాజకీయ విషయములలోచించవలయును; సింహమువలె పరాక్రమింపవలెను; తోడేలువలే దోచవలెను; డేగవలె శత్రువులను పడగొట్టవలెను; ఆడవి పందివలె గట్టి దెబ్బ కొట్టవలెను; నెమిలివలె పలువన్నెల రూపములు (వేషములోకాదు; తన ప్రవర్తనములో) తాల్చవలెను; కుక్కవలె అశ్వమువలే దృఢభక్తితో నుండవలెను; కోకిలవలె తీయగా పలుకవలెను.
రాజ్ఞోఽపరీక్షితాఽన్న భోజనాది నిషేధః.
కాకశజ్కీ భవే న్నిత్య మఙ్ఞాతవసతిం వసేత్ ।
న పరీక్షితపూర్వం తు భోజనం శయనం వ్రజేత్॥
వస్త్రం పుష్ప మలక్ష్కారం యచ్చా న్యం మనుజోత్తమ ।
న గచ్చేజ్జనసమ్బాధం న చాతం జలాశయమ్॥
నాపరీక్ష తపూర్వం తు పురు షై రా ప్లకారిభిః ।
నారో హే తుజ్జరం బాలం నాదా న్తం తురగం తథా॥
నావిజ్ఞాశాం శ్రియం గచ్ఛే న్నైవ దేవోత్సవే వసేత్ ।
నరేన్ద లక్ష్మ్యా ధర్మజ్ఞ సాత్మాశ్రాంతో భవే నృపః॥
భృత్యాశ్చైవ తథా పుష్టా స్సతతం ప్రతిమానితాః ।
రాజ్ఞా సహాయాః కర్తవ్యాః పృథివీం జేతు మిచ్ఛతా॥
రాజ్ఞస్తత్తత్కర్మసు యోగ్య పురుష నియోగక్రమః॥
యథార్హం చావ్యసుభృతో రాజా కర్మసు యోజయేత్ ।
ధర్మిష్ణా స్ధర్మకార్యేషు శూరా నడ్గామకర్మసు॥
నిపుణా నర్థకృత్యేషు సర్వత్ర చ తథా శుచీజ్ ।
స్త్రీషు షణా న్ని యుఙ్ఞాత తీవ్లా స్థారుణకర్మసు॥
ధర్మే చార్గేచ కామేచ న(భ) యేచ రవినన్దన ।
రాజా యథార్హం కుర్వీత ఉపధాభిః పరీక్షణమ్॥
సమానీతోపదా నృత్యా న్కుర్యా చ్ఛ స్తవనేచరాక్ ।
తత్పదాన్వేషణాయత్తాం స్తదధ్యక్షాంస్తు కారయేత్॥
ఏవమాదీని కర్మాణి నృవైః కార్యాణి పార్థివ ।
సర్వథా నేష్యతే రాజ్ఞ స్తీక్ష్ణోపకరణక్రమః॥
అపరిచితులను త్వరగ నమ్మక కాకివలే సదాళంకతోనే ఇతరులను చూడవలెను; ముందుగా ఆప్తులతో పరీక్షించక ఆహారమును తినరాదు; వస్త్రాలంకార వుష్పాదికము ప్రయోగించరాదు; జనసమ్మర్గములోనికి పోరాదు; ఎరుగని నీటి తావులకు పోరాదు; అశి క్షితమగు చిన్న వయసు ఏనుగునేక్కరాదు; అట్టి గుర్రమునెక్కరాదు; ఎరుగని స్త్రీని కలియరాదు; దేవతోత్సవములందు నిలువరాదు; రాజు లక్ష్మీ రక్షకుడును శ్రమను లెక్కచేయనివాడును కావలయును; పృథివిని జయించగోరు రాజు తన భృత్యులను సరిగా పోషించుచు సంమానించుచు తనకు సహాయులుగా నుంచుకొన వలయును; *ఆర్హతానుసారము రాజు ఆయా పనులయందు భృత్యులను నియోగించపనియందుంచుకొనవలయును. ధర్మకార్యములందు ధర్మిష్ఠులను యుద్ధ కర్మలందు వీరులను ధనాది విషయములందు అర్థ విషయ నిపుణులను స్త్రీల రక్షణాదికములయందు నవుం నకులను దారుణకృత్యములందు తీక్షలను నియమించవలెను; చిత్త నిర్మలత్వము ఇందరకు అందరకు నుండవలసిన సాధారణ లక్షణము; ధర్మము అర్థము కామము భయము అను నాలుగు *ఉపధల యందు పరీక్షించిన తరువాతనే వారిని భృత్యులనుగా నియమించవలెను; ఆయా కొనుక లను తెచ్చి ఇచ్చుచుండు వనచరులను (అడవిజాతుల వారిని) రాజు అడవికి సంబంధించిన పనులకై కొలువు నందుంచుకొని వారిలో ఎవరే యే స్థానములందు బాగుగ వెదకుచు ఆయా స్థానవిషయములను గమనించి కను పెట్టి చూచుచుందురో ఆట్టి పూనీకగల వారిని ఆ పనులకు అధ్యక్షులనుగా నియమించవలెను; రాజు మొదలగు పనులను సరిగా చేయవలెను; ఏమయినను రాజు తీక్షోపకరణము మునకు పూనరాదు.
(*మత్స్య-214 ఆ; శ్లో 76. ఆసుభృతః - ఆసు – జీవికా- వేతనము అనునర్థముతో వాడినట్లు తోచును:
ధర్మే చార్థేచ కామేచ భ(న)యే చ రవినందన ! రాజా యథార్హంకుర్వీత ఉవధాభిః పరీక్షణమ్.)
(*214 ఆ; 80శ్లో ఉపధాభిః-రాజు తన కొలువునకు తీసికొనదలచిన వారిని వీటితో పరీక్షించవలెను. ఇవి నాలుగు.)
పాపసాధ్యాని కర్మాణి యాని రాజ్ఞో నృపోత్తమ ।
సన స్తాని న కుర్వ ని తస్మా త్తా న్నాశ్రయే న్నృపః॥
నేష్యతే పృథివీశానాం తీక్ష్ణోపకరణక్రియా ।
యస్మి నర్మణి యస్య స్యా ద్విశే షేణ చ కౌశలమ్॥
తస్మిన్కర్మణి తం రాజా పరీక్ష్య వినియోజయేత్ ।
పితృవైతామహా నృత్యా న్సర్వకర్మసు యోజయేత్
వినా దాయాదకృత్యేష తత్ర తే హి సమాగతాః ।
నియుక్ట్త మహాభాగ తస్య తే హితకారిణః॥
పర రాజగృహా తాపాన్ జనసహకామ్యయా ।
దుష్టాన్వా ప్యథవాదుష్టాన్నాశ్రయీత ప్రయత్నతః॥
దుష్టం విజ్ఞాయ విశ్వాసం న కుర్యా తత్ర భూమిపః ।
వృత్తిం తస్యాపి వర్త్త జనసహకామ్యయా॥
రాజా దేశా నగప్రాప్తం పురుషం పూజయే దృశమ్ ।
మమాయం దేశసమాప్తో నావమానేన చిన్తయేత్ ॥
కామం భృత్యార్జనం రాజా నైవ కుర్యా నృపోత్తమ ।
నచ వాసంవిభక్తాం స్తా నృత్యా న్కుర్యా త థఞ్చన॥
శత్రవోగ్ని ర్వేషం సర్పో నిస్త్రింశ ఇతి చిన్తయేత్ ।
భృత్యా మనుజశార్దూల రుషి తాశ్చ తథైకత॥
పాపాచరణముతో సాధింపదగు పనులను, సత్పురుషులు ఆచరించరు; కావున రాజులు అట్టివాని నవలంబించ రాదు; రాజులకు తీక్షోపకరణక్రియ తగదు; అనుమాటకు ఇదియే ఆర్థము; ఏ పనియం దేవరికి మిక్కిలి నేర్పుగలదో హరిని, వానియందు పరీక్షించి నియోగించవలేను; జ్ఞాతిసంబద్ధములగు పనులయందు కాక మిగిలిన ప్రతిపని యందును పితృపితామహక్రమాగతులగు భృత్యులను నియమించుట మంచిది; ఏలయన వీరు సదా రాజహితకరులుగా నుందురు; దాయాదులు (రాజ సోదరులును రాజకుటుంబముతో సన్నిహితులగు . ఇతర దాయాదులును) చేయవలసిన కొన్ని పనుల యందు మాత్రము వారే దాయాదులే-బాగుగ ఇమిడి పోవుదురు; వానిని ఇతరులు ఆచరించుట సముచితముగాదు; జనులను తనవైపునకు త్రిప్పుకొని తనలోనికి చేర్చుకొను కోరిక యున్నను పర రాజ గృహము నుండి వచ్చిన వారిని మాత్రము-వారు దుష్టులైనను ఆదుష్టులెనను. ఆశ్రయించరాదు; వారిని విడు చుటకే యత్నించవలయును; వారిలో దుష్టుని గుర్తించవలెను; అట్టివానిని రాజు నమ్మకుండవలెను; అట్టివానికి కూడ రాజు జీవనవృత్తి నేర్పాటు చేసి జనులను తనవైపున నుంచుకోన యత్నించవలెను; అంతేకాదు; దేశాంతరము నుండి వచ్చిన వానిని రాజు మిక్కిలిగ గౌరవించవలెను; వీడు గతిలేక నా దేశమునకు వచ్చినాడు లెమ్మను ఆవమాన దృష్టితో ఆలోచించరాదు; రాజెన్నడును అధిక సంఖ్యలో భృత్యులను నియమించుకొనరాదు; వారిలో బాగుగ పనిచేసిన వారిని బహుమానించకుండ రాదు; ఏలయస రాజునకు శత్రువులు. అగ్ని విషము - ఖడ్గము (మొదలగు ఆయుధములు) సర్పములు - ఇన్ని యును ఒక ఎత్తు; కోపించిన భృత్యులు ఒక ఎత్తు; (కావున వారిని కోపింపజేయరాదు.)
రాజ్ఞశ్చార నియోగక్రమః.
తేషాం చారేణ చారిత్రం రాజా విజ్ఞాయ నిత్యశః ।
గుణినాం పూజనం కుర్యా న్నిర్గుణానాం చ శాసనమ్॥
కథితా స్సతతం రాజ నాజాన శ్చారచక్షుషః ।
స్వకే దేశే పరే దేశే జ్ఞానశీలా న్విచక్షణాక్॥
అనాహార్యా న్టేశసహా న్ని యుఞ్జీత సదా చరాక్ ।
జనస్యా విదితా సౌమ్యాం స్తథా జ్ఞాతా న్పరస్పరమ్॥
వణిజో మంత్రకుశ లా నాంవత్సర చికిత్సకా ।
తథా ప్రవజితాకారాం శ్చారా నాజా నియోజయేత్॥
నై కన్య రాజా శ్రద్ధధ్యా చ్చారస్యాపి సుభాషితమ్ ।
ద్వయోస్సమ్బన్షమాజ్ఞాయ శ్రద్దధ్యా న్నృపతి (స్స) స్తదా॥
పరస్పరస్యావిదితో యది స్యాతాం చ తా వుభౌ ।
తస్మా ద్రజా ప్రయత్నేన గూఢాం శ్చారా నయోజయేత్॥
రాజ్ఞశ్చ ॥ మూల మేతావ ద్యొ రాజ్ఞ శ్చారదృష్టితా ।
చరాణా మపి యత్నేన రాజ్ఞా కార్యం పరీక్షణమ్॥
రాగాపరాగౌ భృత్యానాం జనస్య చ గుణాగుణమ్ ।
సర్వం రాజ్ఞాం చరాయ త్తం తేషు యత్నపరో భవేత్॥
కర్మణా కేన మే లోకే జన సర్వోను రజ్యతే ।
విర జ్యతే కేన తథా విజ్ఞేయం త న్మహీక్షితా॥
అనురాగకరం లో కే తచ్చ కార్యం మహీక్షితా ।
విరాగజనసంసర్గో వర్ణనీయః ప్రయత్నతః॥
జనానురాగప్రవా హి లక్ష్మ్యా రాజ్ఞాం మతా భాస్కరవంశ చంద్ర ।
తస్మా త్ప్రయత్నేన నరేంద్రముఖ్యైః కార్యోనురాగో భువి మానవేషు॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే రాజ్ఞస్సహాయసమ్పత్త్యాది కథనం నామ
చతుర్దశోత్తర ద్విశతత మోధ్యాయః॥
రాజు సర్వదా చారుల ద్వారమున భృత్యుల నడువడిని గుర్తెరిగి వారిలో సద్దుణులను గౌరవించుచు గుణహీను లను శాసించుచు. ఉండవలయును; మనురాజా! రాజులు చారచక్షులు (చారులే కన్నులుగా కలవారు;) అని శాస్త్రమునందు చెప్పబడినది; తన దేశ మునందును పర దేశమునందును జ్ఞానశీలురు విచక్షణులు నిరాడంబర వేషులు క్షేశ సహులునగు చరు లను నియోగించవలయును; వారు జనులకు తెలియబడక సౌమ్యులై పరస్పరము మాత్రము తెలిసియుండవలెను; వణిజు లను మాంత్రికులను జ్యోతిషికులను వైద్యులను సంన్యాసులవలెనుండువారిని (బైరాగులు సాధులు మొదలగువారిని) చారు లుగా నియోగించవలెను; గూఢచరుడొక్కడే చేప్పినది సుభాషితయైనను (విశ్వసనీయ మేయైనను) నమ్మరాదు; ఇరువుర మాటలలోని పర స్పర సంబంధమును వానిలోని ఐకమత్యమును ఎరిగి ఆది నరిపోయినవారి మాటలను నమ్మవలేను; అట్టి వారిరువురును పరస్పర మెరుగనివారై నను సరియే; కావున రాజు ప్రయత్నముతో చారులను గూడులనుగా చూచీ నియోగించ వలెను; ఏమయినను రాజులు చారులే తమ కన్ను లుగా నుండుట రాజునకు క్షేమమూలము; ఈచరులను కూడ రాజు యత్న పూర్వకముగా పరీక్షించవలెను; భృత్యులు కానీ రాజ్యజనులు (ప్రజలు) కాని రాజునందు రక్తులో విరక్తులో వారు సద్దుణులో దుర్గుణు లో తెలియుట మొదలగునవి చారాధీనము కావున వారి విషయమున రాజు ఎచ్చరిక కలిగియుండవలెను; రాజ్య మందలి జనులును భృత్యులును నో విషయమందుఏ హేతువుచే రక్తులగుచున్నారు; ఏ హేతువుచే విరక్తులగుచున్నారు? అను నది రాజులేరుగుచుండవలెను; అనురాగకరమగు పనులు చేయుచుండవలెను; విరక్తులగు జనులతోడి సంబంధమును ప్రయత్న ముతో విడువవలయును; భాస్కర వంశ చంద్రా! మనూ! రాజులకు లక్ష్ములు జనులకు తనయందు గల యనురాగము వలననే సిద్ధించును. కావున నరేంద్ర ముఖ్యులు మానవుల హృదయములలో తనయందనుగాగము కలుగ జేసికోన యత్నించవలేను.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజ ధర్మములందు రాజ సహాయ సంపత్త్యాది కథనమను రెండు వందల పదునాలుగవ అధ్యాయము.
Summary of chapter 214 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the essential security measures, personal safeguards, and protective protocols required to preserve the life and health of a monarch. Bhagavān Matsya outlines the layout of the royal palace, specifying hidden escape routes, fortified inner apartments, and specialized security personnel. The text provides guidance on inspecting food, drinks, garments, ornaments, and bedchambers for subtle poisons or hidden weapons, emphasizing that the stability of the entire state depends upon the continuous safety and physical well-being of the sovereign.