మత్స్య మహా పురాణము
105 - ప్రయాగ మాహాత్మ్యము
మార్కణ్డేయః : శృణు రాజ స్ప్రయాగస్య మాహాత్మ్యం పునరేవచ ।
యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్రసంశయః॥
మానసంనామ తీర్థంతు గజ్గాయా ఉత్తరేతటే ।
త్రిరాత్రోపోషిత స్స్నా త్వా సర్వాన్కామా నవాప్నుయాత్॥
ఏతత్ఫల మవాప్నోతి త తీర్థం లభతే పునః ।
అకా మోవా సకా మోవా గజౌంప్రాప్య విముచ్యతే॥
మృతస్తు లభతే స్వర్గం నరకంచ నపశ్యతి ।
అప్సరోగణసజీతై స్సుప్తో సౌ ప్రతిబధ్యతే॥
హంససారసయు కేన విమానేన స గచ్చతి ।
బహువర్షసహస్రాణాం రాజేన్ద దీవి భుజ్జతే॥
తత స్వర్గా త్పరిభ్రష్టః క్షీణకర్మా దివశ్చ్యుతః ।
సువర్ణమణిముక్తాడ్యే జాయతే మహతే కులే॥
షష్టితీర్థ సహస్రాణి షష్టికోటిశ తానిచ ।
మాఘమా సే గమిష్య ని గఙ్ఞాయమునసబ్దమే॥
గవాం శతసహస్రస్య సమ్యగత్తస్య యత్పలమ్ ।
ప్రయాగే మాఘమా సేతు త్ర్యహస్నాతస్య తత్పలమ్॥
గయమునయో ర్మధ్యే కాష్ఠగ్నిం యస్తు సాధయేత్ ।
అవ్యజ్ఞాంగో హ్యరోగస్తు పఞ్చేంద్రియసమన్వితః॥
యావంతి రోమకూపాణి తస్య గాత్రేషు దేహినః ।
తావద్వర్షసహస్రాణి స్వర్గలో కే మహీయతే॥
తతస్స్వర్గా త్పరిభ్రష్టో జమ్బూద్వీపవతి ర్భవేత్ ।
సభుక్త్వా విపులా నౌగాం స్తతీర్థం లభతే పునః॥
రాజా! ప్రయాగ మాహాత్మ్యము నింకను వినుము. దానిని వినినంతనే సర్వపాప విముక్తి యగుట నిస్సం శయము. ఇట్లు గంగోత్రరతటమందలి మానసమను తీర్థమున త్రిరాత్రము పవాన పూర్వకముగ స్నానమాడుటచే సర్వ కామ పూ ర్తియగును. ఈ ఫలానుభవానంతర మనంతర జన్మమున నాతడి తీర్థమునే సేవింపవచ్చును. తెలిసి కోరియేకాని కోరకయే కాని ఇట గంగను సేవించుట పాపము క్తికరము. ఇట వాడు మరణించినను స్వర్గప్రాప్తుడగును. నరకము చూడడు; అప్సరోగణ సేవితుడగుచు నిదుర మేలు కాంచును. హంస సారసములు మోయు విమానము పై స్వర్గ మేగి అటను దాని పై సంచరించుచు బహు సహస్ర వరములచట సుఖించి పుణ్యావసానమున స్వర్గ భ్రష్టుడయ్యు . సువర్ణ మణిముక్తాది ధన సంపన్న వంశమున అట్టి కుటుంబమున జనించును. మాఘమాసమునందు అరువది యారువేల తీర్థములు ప్రయాగమందలి గంగా యము లో సంగమమున కలియును. కావుననే లెస్సగా లక్ష గోదానములచే అబ్బునంత ఫలము మాఘమున గంగలో ఇట స్నానముచే కలుగును. ఈ గంగా యమునా మధ్యమున కాషాగ్ని ని (ఆరణి మథనముచే) సాగించి వేల్చినచో ఏరోగములు లేక పంచేంద్రియ సహికముగ సశరీర ముగ ఇహ జీవితమును గడపి మృతికి తరు పాత తన దేహమందలి రోమ కూపములెన్ని కలవన్నీ ఏండ్లు స్వర్గమున పూజితుడై సుఖించును. పిదప స్వర్గ పరిభ్రష్టు డయ్యు జంబూ ద్వీపాధిపతియై జనించి సుఖించుచు అదే తీర్థమును మరల సేవించును.
జలప్రవేశం యః కుర్యా త్సజ్గమే లోక విశ్రుతే ।
రాహుగ్రస్తో యథా సోమో విముక్త స్సర్వపాత కైః॥
సోమలోక మవాప్నోతి సోమేన సహ మోదతే ।
షష్టివర్షచసహస్రాణి షష్టివర్ష శతానిచ॥
స్వర్గేచ శక్రలో కేస్మి నృషిగనర్వ సేవితే ।
పరిభ్రష్టస్తు రాజేంద్ర సమృద్దే జాయతే కులే॥
అధశ్శిరాస్తు యా జ్వాలా మూర్ధ్వపాదః పిబే న్నరః ।
శతవరసహ సాణి స్వర్గలో కే మహీయతే॥
పరిభ్రష్టస్తు రాజేన్ద చాగ్ని హోతీ భవేన్నరః ।
భుక్త్వాతు భోగా న్విపులాం సతీర్థం లభతే పునః॥
యస్స్వదేహం ద్విధా కృత్వా శకునేభ్యః ప్రయచ్ఛతి ।
విహగై రుపభు క్తస్య శృణు తస్యాపి యత్ఫలమ్॥
శతవర్ష సహస్రాణి సోమలో క మహీయతే ।
తతస్స్వర్గా తరిభ్రష్ణో రాజా భవతి ధార్మికః॥
గుణవా నూపసమ్పన్నో భవతి ప్రియదర్శనః ।
భుక్త్వాతు భోగాన్విపులాం సతీర్థం లభతే పునః॥
యామునే చోత్తరే కూలే పయాగస్యతు దక్షిణే ।
ఋణమోచనం నామ తీర్థంతు పరమం స్మృతమ్॥
ఏకరాత్రోషితస్స్నా త్వా ఋజై సర్వైః ప్రముచ్యతే ।
సూర్యలోక మవాప్నోతి హ్యనృణీచ సదా భవేత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయయుధిష్ఠిర సంవాదే ప్రయాగ
మాహాత్మ్యే పఞ్చోత్తర శతత మోధ్యాయః॥
ఇట్లు లోక విశ్రుతమగు ఈ గంగా యమునా సంగమమున జలప్రవేశము (స్నానము) చేసినచో రాహు గ్రహణమునుండి చంద్రుడువలే సర్వ పాపవిముక్తుడై సోమలోకము చేరి సోమునితో కూడి స్వర్గలోకమునందు శక్ర సన్నిధినంది ఋషి గంధర్వ సేవితములగు ఆ లోకములందు ఆరువదియారు వేలేండ్లు ఆనందించును. పుణ్యావ సానమున స్వర్గ పరిభ్రష్టుడయ్యు సర్వ సంపత్సుఖ సమృద్ధమగు కుటుంబమున జనించును. ఇచట అధఃశిరస్కుడై ! అగ్ని జ్వాలాపానము చేసినవాడు లక్ష వత్సరములు స్వర్గసుఖములంది స్వర్గ పరిభ్రంశము నందిన తరువాతను ఆహితాగ్ని యె జనించి విపుల భోగములనుభవించి మరల ఆ తీర్ధమునే సేవించును. ఈ ప్రయాగయందు తన దేహమును ఖండించి పక్షుల కేరగానిచ్చుటచే లక్ష వత్సరములు సోమలోకమున సుఖప్రాప్తుడై పుణ్యావసానమున స్వర్గ పరిభ్రష్టుడయ్యు ధార్మికుడు రూపవంతుడు గుణవంతుడు ప్రియదర్శనుడునగు రాజై జనించి విపుల సుఖానుభవములనంది మరల ఆ తీర్థమునే సేవించును. ప్రయాగకు దక్షిణమున యమునా దక్షిణతీరమున మేలగు ఋణ ప్రమోచనమను తీర్థము కలదు. అచట నొక దిన ముపవసించి స్నానమాడినచో సర్వ ఋణ ముక్తుడై సూర్యలోక ప్రాప్తుడగును. మరల నెన్నడును ఋణగ్రస్తుడుకాడు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను నూట యైదవ అధ్యాయము.
Summary of chapter 105 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya reveals the profound spiritual significance of departing from the physical body or practicing complete spiritual renunciation within the sanctified limits of Prayāga. Bhagavān Matsya clarifies that if a devout practitioner, free from worldly attachments and absorbed in meditation upon Bhagavān Nārāyaṇa, leaves the mortal frame at the holy Saṅgama or near the Akshaya-vaṭa tree, that fortunate soul achieves immediate liberation from the cycle of birth and death without undergoing the suffering of rebirth. Such a soul ascends to the supreme realm of Vishṇu, riding celestial chariots surrounded by Devas, and enjoys eternal bliss in the divine presence of Bhagavān Nārāyaṇa.