169 -  మధుకైటభుల ఉత్ప త్తి-వారి వధముచే సృష్టి విఘ్న నివారణము॥

శ్రీమత్స్యః : వి ష్ణౌ స్వపితి సన్బూతో మధుర్నామ మహాసుర :

తేనై వచ సహోద్భూతో హ్యసురో నామ కైటభః

తౌ రజస్తమసౌ విఘ్నో సమ్భూతో తామసౌ గణౌ

 ఏకార్ణవే జగత్సర్వం క్షోభయన్తౌ మహాబలౌ

 దివ్యరక్తామ్బరధ రౌ శ్వేతదీప్రోగ్రదంష్ట్రిణౌ

 కిరీటకుణ్డలోదగ్రౌ కేయూరవలయోజ్జ్వలౌ

మహావిక్రమతామ్రాక్షౌ పీనోరస్కౌ మహాభుజౌ

మహాగి రేస్సంహననౌ జజ్గమావివపర్వతౌ

నవమేఘప్రతీకాశా వాదిత్యప్రతి భాననౌ

 విద్యు దాభౌ గదోగ్రాభ్యాం కరాభ్యా మతిభీషణౌ

 తౌ పాదయాస్తు విన్యాసా దుత్క్షివన్తా వివార్ణవమ్

 కమ్పయన్త వివ హరిం శయానం మధుసూదనమ్

 తౌ తత్ర విచరన్తౌ స్మ పుష్కరే విశ్వతోముఖే

 యోగినాం శ్రేష్ఠ మాసాద్య దీప్తం దదృశతు స్తదా

 నారాయణసమాజ్ఞాతం-సృజన్త మఖిలాః ప్రజాః

 దైవతానిచ విశ్వాని మానసా నసురా నృషీక్

చతుర్ముఖమధు కైటభసంపాదః

తతస్తా వూచతు సత బ్రహ్మాణ మసురోత్తమౌ

 దీప్తౌ యుగపత్సజ్కుద్ధౌ రోషవ్యాకులితేక్షణా

 క స్వం పుష్కరమధ్యస్థ స్సీతోష్ణీష శ్చతుర్ముఖః

ఆధాయ నియమం మోహా త్తదా సే విగతజ్వరః

 ఏహ్యాగచ్ఛావయో ర్యుద్ధం దేహి త్వం కమలోద్భవ

ఆవాభ్యాం పర మీశాభ్యా మశ క స్వమిహార్ణవే

 తత్ర కశ్చోద్భవ స్తుభ్యం కేన వా త్వం నియోజితః

కస్స్రష్టా కశ్చ తే గోప్తా కేన నామ్నా విధీయ సే

బ్రహ్మా : ఏక ఇత్యుచ్యతే లోకై రవిచిన్త్యఃసహస్రదృక్

 తత్సంయోగేన భవతోః కర్మ నామావగచ్ఛతమ్

శ్రీ మత్యుడు మనువున కిట్లు చేప్పెనని సూతుడు ఋషుల కిట్లు చెప్పసాగెను శ్రీ మహావిష్ణువు ఏకార్ణవ జలమున నిద్రించుచుండ మధు కైటభులను మహాసురులు జనించిరి *వారిద్దరును రజస్తమోగుణప్రధానులయి తామసగణములలోని వారుగా రజస్తమోగుణములందలి దోషములుగా) జనించి ముందు భగవానుడు జరుపనున్న) సృష్టికి విఘ్న భూతులుగా నుండిరి వా రేకార్లవ జలరూపమున నున్న జగత్తు నంతటిని తమ మహాబలముతో క్షోభింపజేయుచుండిరి ప్రకా శించు ర క్షవస్త్రములను ధరించి తెల్లగ ప్రకాశించు కోరలు కలిగి, కిరీట కేయూర (భుజుకీ రి) వలయ (చేతికంకణములతో ప్రకాశించుచు మహావిక్రములు రక నేతులు పీనవకులు మహాభుజులునై మహాగిరివంటి దృఢశ రీర నిర్మాణము కలిగి సంచ రించు పర్వతములవంటివారయి తోలుకరి మేఘములవలెను మెరపులవలేను మెరయుచు గదలతో భయంకరములగు కర ములతో మరింత భీషణులుగా నుండిరి వారు తమ పాదవిన్యాసములతో అర్ణవమును ఎగుర గొట్టుచున్నారేమో శయనించిన వాడును మధునీ కైటభుని) చంపనున్న హరినీ కూడ కంపింపజేయుచున్నారేమో - అనునట్లు సర్వతోముఖముగా నున్న ఆ ప్రళయార్లవపుష్కరము (పద్మమను వ్యవహారముకల జలము) నందు విచరించుచు పోయిపోయి ప్రకాశించుచుండు తమకు దగ్గరలో ఎదుట నున్న యోగి శేష్టుని చూచిరి అతడు నారాయణుని లేస్సయగు ఆజ్ఞతో సకల ప్రజలను అనగా సకల దేవతలను మానస ఋషులను అసురులను సృష్టించబోవుచుండెను అచ్చట ఆ ఆసురోత్తములు ఇద్దరును ఒకేమారుగా మిగుల కుద్దులును రోషముతో కలవరపడు కన్నులు కలవాగును ॥॥ఆగుచు బ్రహ్మతో ఇట్లనిరి: పుష్కర(పద్మమందు ఉండి తెల్లని తల పొగ ధరించి నాలుగు మోములు కలిగి అజ్ఞానముతో నియమము పూని అప్పటికి ఏ సంతాపమును లేక యున్న నీవేర వు? రమ్ము! రమ్ము! కమలోద్భవుడా! మాకు యుద్ద మీమ్ము! మిగుల ఈశుల సమర్థుల)మగు మా కంటె నీవసమర్థుడవు; ఇట్టి నీకు జన్మకారణు డేవరు? ఎవరు నీన్ను (ఈ పనికై) నియోగించినారు? నిన్ను సృష్టించినవా రేవ్వరు? రక్షించువా రెవ్వరు? ఏ పేరున వ్యవహరింపబడుదువు? అనగా “( ఆందరను సృష్టించువాడును రక్షించువాడును) ఒక్కడే

(*భగవానుడు జరుపు సృష్టి స్థితిలయములలో సృష్టికి రజోగుణమును స్థితికి సత్త్వగుణమును లయమునకు తమో గుణమును హేతువులైనను అవి శురూపముననుండక మాలిన్యమును పొందినచో ఆయాప్రక్రియలలో విఘ్న మేర్పడును మధు కైటభులు అట్టి రజ స్తమో మాలిన్యరూపులు

యనియు ఆతడు ఇట్టివాడని ఊహింపరానివాడును వేయి కన్నులుగలవాడును (అన్నిటిని చూచు శుద్ధసాక్షి చైతన్య స్వరూ పుడు) అనియు లోకములచే చెప్పబడుచున్నాడు కదా! ఆతడే నన్ను సృజించువాడు రక్షించువాడు ఈ పనికి నియోగించిన వాడు కూడ; మరి ఆది కాదని వేరుగా ప్రశ్నించు మీ రిరువురును ఎవరో తెలుపుడు” అని బ్రహ్మ పలికెను

మధు కైటభౌ : నావయోః పరమం లో కే కి ఞ్చదస్తి మహామునే

ఆవాభ్యాం ఛాద్యతే విశ్వం తమసా రజసా చ వై

 రజస్తమోమయా వాహ మృషీణా మవలమ్బి తౌ

 చాద్యమానౌ ధర్మశీ లౌ దుస్తరౌ సర్వదేహినామ్

 ఆవాభ్యాముహ్యతే లోకో దుష్కరాభ్యాం యుగేయుగే

ఆవామర్థశ్చ కామశ్చ యజ్ఞ స్వర్గం పరిగ్రహః

 సుఖం యత్ర ముదా యుక్తం యత్ర శ్రీః కీర్తిరేవచ

 యేషాం యత్కా జ్క్షితం చైవ తత్తదాహం విచి నయ

బ్రహ్మా : యత్నా ద్యోగవతో దృష్ట్యా యోగః పూర్వం మయార్జితః

తం సమాదాయ గుణవత్స త్వం చాస్మి సమాశ్రితః

 యః పరో యోగమతిమా న్యోగాఖ్యః స త్త్వఏవ చ

 రజన సమ నశ్చైవ యస్సష్ణా విశ్వసమ్భవః

 తతో భూతాని జాయ న్తే సాత్వికానీత రాణిచ

స ఏవ హి యువాం నా శే వశీ దేవో హనిష్యతి  

మధు కైటభు లిట్లనిరి: మహామునీ! లోకమున మమ్ముల మీంచిన దేదియులేదు మేము రజ స్తమో గుణములతో విశ్వమును కప్పివేయుదుము మేము రజ స్తమోమయుల ము; ఋషులకును ఆవలంబనము మేమే; ఐనను మేము మరుగుపడి యుందుము; ధర్మశీలుర ము; ప్రాణు లేవ్వరును మమ్ము దాటిపోలేరు; ఎవరును ఏమియు చేయనలవికాని మేమే ప్రతియుగ మందును లోకమును నడపుచుందుము; మానవాదులు కోరు ఆర్థము కామము యజ్ఞము స్వర్గము సంతోషప్రదమగు సుఖము శ్రీకీర్తులు ఇవి అన్ని యు మేమేయని ఎరుగుము అన విని బ్రహ్మ ఇట్లనేను: నేను నా యత్నము వలనను యోగత త్వజ్ఞు డగు హరి కరుణాదృష్టితోను ఇంతకుముందే యోగ ఫలమును సమర్జించియుంటిని గుణవంతమగు ఆ ఫలము నాధా రముగా చేసికొనీ నేను న త్వగుణ మాశ్రయించియున్నాను కనుక రజస్తమో రూపులగు మీకు నేను యుద్ద మీయదగను; ఎవరు అందరకం టే అన్నిటికంటే పరుడో యోగతత్వ జ్ఞానవంతుడో యోగమను పేరుకలవాడో సత్వరూపుడో రజస్తమ ములకును జనకుడో విశ్వసృష్ట్యాది హేతువో ఆతని నుండియే సాత్త్విక ములును ఇతరములును రజస్తమో గుణ ప్రధా నములును) - ఆగు భూతములన్ని యు జనించును సర్వగుణ వశకర్తయగు ఆ దేవుడే మీ నాశమునకును సమర్థుడు; కావున మిమ్మతడు చంపును అనేను

సూతః : స్వపన్నేవ తత శ్రీమా నృహు యోజనవిస్తృతమ్

బాహుం నారాయణో బ్రహ్మ కృతవానాత్మమాయయా

కృష్యమాణౌ తత స్తేన హరిణా బాహుశాలినా

 చేర తు స్తౌ విగళి తౌ శకునా వివ పీవరౌ

 తత స్తా వాహతు ర్గత్వా తతో దేవం సనాతనమ్

 పద్మనాభం హృషీ కేశం ప్రణిపత్యచ తావుభౌ

 మధుకైటభౌ : జానీవస్త్వాం విశ్వయోనిం త్వామేకం పురుషోత్తమమ్

త్వమావాం పా(జ)హి త్వర్థమిదం నౌ శుద్దికారణమ్

 అమోఘదర్శన సత్యం యతస్త్వాం విద్మ శాశ్వతమ్

 తతస్త్వా మాగతా వావా మభితః ప్రసమీక్ష తుమ్

 తదిచ్ఛామో వరం దేవ త్వయా దత్త మరిన్దమ

 అమోఘదర్శనోఽసి త్వం నమస్తే సమితి ఞ్జయ

 శ్రీభగవాక్ : కిమర్థ మద్భుతం బ్రూత వరం హ్యసుర సత్తమౌ

దత్తాయుష్కో పునర్భూయో రహో జీవితు మిచ్ఛథః

 మధు కైటభౌ : యస్మి న్న కశ్చి నృతవా న్దేవ తస్మి న్పృభో వధమ్

తమిచ్ఛావో వధం చైవ త్వతో నోఽస్తు మహావ్రత

 శ్రీభగవాక్ : బాడం యువాం తు ప్రవరౌ భవిష్యత్కాలసమ్భవే

భవిష్యతో న సన్దేహ స్సత్యమేవ బ్రవీమి వామ్

 సూతః : వరం ప్రదాయాథ మహాసురా భ్యాం సనాతనో విశ్వవర స్సురోత్తమః

రజస్తమోవర్గ భవాయనౌ యమౌ మమస్థ తావూరుత లేన వై ప్రభుకి

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే నారాయణవనాభిద్మోద్భవ ప్రాదుర్భావ కథనే శ్రీవిష్ణుకృత మధు కైటభాసుర వధో నామ ఏకోనస ప్రత్యుత్తరశతతమోఽధ్యాయః

ఆంతలో పరబ్రహ్మరూపుడు శ్రీమంతుడు (పూజ్యుడునగు నారాయణుడు స్వమాయతో తన బాహువులను బహుయోజన దీర్ఘములుగా చేసెను బాహుశాలియగు ఆ హరి లాగుచుండ వారు బలిసిన పనులపలే జారిపోవుచునే సంచరించుచు దగ్గరకు వచ్చిరి సనాతనుడు పద్మ నాభుడు హృషీ కేశుడునగు ఆ దేవుని సమీపించి పారాతని నమస్క రించి ఇట్లనిరి: విశ్వజన్మ కారణుడగు పురుషోత్తముడు నీవొక్కడవేయని మేమెరుగుదుము; నీవు మమ్ము రక్షించుము చంపుము); ఇది సహేతుకము; దీనివలన మేము శుద్దులమగుదుము; నీవు సత్యముగా వ్యర్షము కాని దర్శనము కలవాడవు; శాశ్వతుడవు ఆని ఎరిగి నిన్ను సమగ్రముగ దర్శింపగోరి నీయొద్దకు వచ్చినాము; శత్రునాశ కా! అమోఘదర్శనొ! యుద్ద విజేతా! నీకు వందనము; నీవు మాకు వరమీయ ప్రార్ధించున్నా ము; అనగా భగవానుడు “ఈ అద్బుతమే మోయీ! నన్ను వర మేల అడుగుచున్నారు? నా వలన ఆయువు వర ముగా పొంది మరల రహస్యముగా బ్రదుక గోరుచున్నారు గదా! ఆనేను మధు కైటభులును ప్రభూ! దేవా! మహావ్రతాః  ఉత్తమ కర్మలాచరించువాడా!) ఇదివర కేవరును మరణించి యుండనిచోట మమ్ము చంపుము ఇదియే మాకు నీవిచ్చు వరము అనిరి “సరే! ముందొక కాలమున మీరు గొప్పవారగుదురు నందియములేదు; నేనీ చేప్పునది సత్యమే యగును అని హరి వారికి వరము ఇచ్చి అంతట సనా తనుడును విశ్వ శేషుడును సురో తముడును ప్రభుడును అగు నారాయణుడు ఈ రజ స్తమోగుణ జాతులయి వానికి ఆశ్రయములయిన ఆ కవల(జంట)ను తన తొడల పై నలుగగొట్టెను

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మధు కైటభవధముచే పద్మనాభుడు బ్రహ్మకు సృష్టియందు విఘ్న మును నివారించుటయను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము