మత్స్య మహా పురాణము
240 - అవయవ స్పందనమును బట్టి శుభాశుభ విచారము.
మనుః : బ్రూహి మే త్వం నిమిత్తాని ఆశుభాని శుభాని చ ।
సర్వధర్మవిదాం శ్రేష్ఠ త్వం హి సర్వవి దుచ్య సే॥
శ్రీమత్స్యః : అజ్ఞదక్షిణభాగేతు శస్తం ప్రస్ఫురణం భవేత్ ।
అప్రశస్తం తథా వామే పృష్ఠస్య హృదయస్య తు॥
మనుః : అజ్ఞానాం స్పన్దనం చైవ శుభాశుభ విచేష్టితమ్ ।
తన్మే విస్తరతో బ్రూహి యేన స్యాం తద్విదో భువి॥
శ్రీమత్స్య : పృథ్వీలాభో భవే న్యూర్ధి లలాటే రవినన్దన ।
స్థానం వివృద్ధి మాయాతి భూదేశ ప్రియసజుమకి॥
భృత్యలబ్ది శ్చ్యా దే దృగుపా నే ధనాగమః ।
ఉత్కళోపగ మో మధ్యే దృష్టం రాజ న్విచక్షణే ॥
దృగృన్దనే సజరేచ జయం శీఘ్ర మవాప్నుయాత్ ।
యోషిల్లాభోపాజదేశే శ్రవణా నే క్రియాశ్రుతిః॥
నాసికాయాం ప్రీతి సౌఖ్యం ప్రియా ప్రి వధరోష్ఠయోః ।
కణ్ఠే తు భోగలాభ స్స్యా ద్బోగవృద్ధిర థాంసయోః॥
సుహృల్నేహశ్చ బాహుభ్యాం హస్తే చైవ ధనాగమః ।
పృషే పరాజయ స్సద్యో జయో వక్షస్థలే భవేత్॥
కుడి భ్యాం ప్రీతి రుద్దిష్టా శ్రియాః ప్రజననం స్తనే ।
స్థానభ్రంశో నాభిదేశే జమనే చ ధనాగమః॥
జానుసన్గా పరై స్సన్ది ర్బలవద్బి ర్బవే న్నృప ।
సలాభం చాధ్వగమనం భవే త్పాదతలే నృప॥
లాహ్ఛౌనం పిటకం చైవ జ్ఞేయం స్పురణవ త్తథా ।
దిశైక దేశ నాశాయజట్టాయాం రవినన్దన॥
ఉత్తమం స్థాన మాప్నోతి పద్భ్యాం ప్రస్ఫురణా న్నృప ।
విపర్యయేణ విహితా స్సర్వే స్త్రీణాం ఫలాగమాః॥
దక్షిణేతిప్రళ స్తేజే ప్రశ స్తం స్యా ద్వి శేషతః ।
అప్రశస్తే తథా వామే త్వ ప్రశస్తం విశేషతః॥
ఆతోన్యథా సిద్ది గజల్పనాత్తు ఫలస్య శ స్తస్య చ నిన్దితస్య ।
అనిష్ట చిహ్నో పగ మే ద్విజానాం కార్యం సువర్ణేన చ తర్ఫణం స్యాత్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే ఆవయవస్పంద నిమిత్తక శుభాశుభవిచారో నామ చత్వారింశదు త్తర ద్విశతతమోఽధ్యాయః॥
సర్వ ధర్వ విదులలో శ్రేష్ఠుడవగు భగవన్! నీవు సర్వజ్ఞుడని క్షప్రసిద్ధుడవు; శుభాశుభ నిమి త్తములను తెలుపుమనిన మనువుతో మత్సుడిట్లనెను; అవయవములు గాని వీపుగాని హృదయముగాని కుడివైపున స్పందించుట శుభము; ఎడమవైపున స్పందించుట ఆశుభము. ఆనగా ఆంగస్పందనమును శుభాశుభ విచేష్టితమును " విస్తరముగ నాకు తెలిపి నన్ను ఆది ఎరిగిన పోరిలో గొప్పవానినిగా జేయుమన్న మనువుతో మత్యుడిట్లుచే ప్పెను: కుడివైపున స్పందము కూడ మూర్గమందై నచో పృథ్వీలాభము - లలాటమందు. స్థానవృద్ధి - భూదేశమందు - ప్రియ జన నంగ మము; అక్షదేశమందు - భృత్యలాభము - కంటికోనయందు ధనాగమము . నడుమునందు తహతహపాటు . కంటికొలికి యందు యుద్దమందు శీఘ్రముగా జయము కడగంటియందు శ్రీభోగము చెవి కోనయందు-ప్రియ వార్తాశ్రవణము-నాసిక యందు ప్రీతిసౌఖ్యము. పెదవులయందు ప్రియలాభము కంఠమందు భోగలాభము భుజమూలముల యందు భోగవృద్ధి- భుజ ములయందు మిత్రులతోడి స్నేహలాభము-హ సమునందు ధనాగమము - వీపునందు పరాజయము.వక్షమునందు సద్యో జయము కుశులయందు ప్రీతి స్త్రీకి స్తనమందు అయినచో సంతానప్రాప్తి - నాభిదేశమందు - స్థానభ్రంశము - జఘన మందు ధనాగమము. మోకాళ్ళ సంధులయందు బలవంతులతో సంధి. అరికాళ్ళయందు ధనలాభకర ప్రయాణము. కలు గును. గుహ్యావయవమందై నచ్.బొబ్బలును పుండ్లును అగును; పాదములయందు ఉత్తమస్థాన ప్రాప్తి.యగును; ఈ చెప్పిన స్పందములన్ని యు స్త్రీలకు ఎడమవై పున కలిగినచో మంచి ఫలములనిచ్చును; పురుషులకయినచో ఈ స్పందము కుడివైపు నందలి ప్రశస్త్రాంగమందమయినచో విశేషముగ ప్రశ సఫలము; ఎడమ వైపునందలి అప్రశస్త్రాంగమందయినచో విశేషముగ అప్రశస్త ఫలము; ఈ చేప్పినవికాక మిగిలిన అవయవముల స్పందము విషయమున ఫలము సద్రాహ్మణులవలన నేరుగ వలయును; అనిష్టచిహ్న ములు కనబడినచో బ్రాహ్మణ సంతర్పణమును బ్రాహ్మణులకు సువర్ణ దానమును చేయవలయును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున అవయవ స్పందన నిమిత్తక శుభాశుభ విచారమను రెండు వందల నలువదియవ అధ్యాయము.
Summary of chapter 240 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya delivers an extensive treatise on Āyurveda, the sacred science of longevity, health, and holistic healing. Bhagavān Matsya details the three biological humors known as Tridoshas comprising Vāta, Pitta, and Kapha, explaining how their equilibrium maintains health while imbalance causes disease. The text catalogs numerous medicinal plants, herbal decoctions, mineral preparations, dietary therapies, and rejuvenation treatments, establishing Āyurveda as an essential science for human well-being.