222 - భేదోపొయ విచారము.

శ్రీమత్స్యః : పరస్పరంచ యే దుష్టాః క్రుద్ధా భీతా విమానితాః

తేషాం భేదం ప్రయుఞ్జీత; భేదసాధ్యా హి తే మతాః

యే తు యేనైవ దో షేణ పర స్మా న్నాపి బిభ్యతి

తే తు తదోషపాతేన భేద నీయా భృశం తతః

 ఆత్మీయాం దర్శయే దాశాం పరస్మా దర్శయే ద్బయమ్

ఏవం హి భేదయే ద్బిన్నా న్యథావ ద్వశ మానయేత్

సంహతా హి వినా భేదం శ కేణాపి సుదుస్సహాః

భేద మేవ ప్రశంస ని తస్మా న్న యవిశారదాః

స్వముఖేనాశ్రయే ద్భేదం భేదం పరముఖేన చ

పరీక్ష్య సాధు మన్యేత భేదం పర ముఖా చ్చుతమ్

సద్య స్వకార్య ముద్దిశ్య కుశలై, ర్యే హి భేదితాః

భేదిన స్తే వినిర్దిష్టా నైవ రాజ్ఞార్థవాదిభిః

అన్తఃకోపో బహిఃకోపో యత్ర స్యాతాం మహీక్షితామ్

అ న్తఃకోపో మహా సత్ర నాశకః పృథివీకి తామ్

సామ నకోపో బాహ్యస్తు కోపః ప్రోక్తో మనీషిభిః

మహిషీయువరాజభ్యాం తథా సేనాపతే ర్నృప

అమాత్యమ స్త్రీణాం చైవ రాజపు శ్రీ తథైవ చ

ఆ న్తఃకోపో వినిర్దిష్ణో దారుణః పృథివీక్షితామ్

బాహ్యకోపే సముత్పన్నే సుమహత్యపి పార్థివః

శుద్దాను మహాభాగ శీఘ్రమేవ జయీ భవేత్

ఆపి శక్ర సమో రాజా అన్తఃకో పేన నశ్యతి

సో నఃకోపః ప్రయత్నేన తస్మా ద్రవ్యో మహీక్షితా

పరతః కోప ముత్పాద్య భేదేన విజిగీషుణా

జొతీనాం భేదనం కార్యం పరేషాం విజిగీషుణా

రక్ష్య స్సలు ప్రయత్నేన జ్ఞాతి భేద సథాత్మనః

జ్ఞాతయః పరితప్య నే సతతం పరితాపితాః

తథాపి తేషాం కర్తవ్యం సుగమ్భీరేణ చేతసా

గ్రహణం దానమానాభ్యాం భేద స్తేభ్యో భయజ్కరః

*సజ్జాతి రనుగృహ్ణతి స జ్ఞాతి ర్ధగు మిచ్ఛతి

జ్ఞాతిభి ర్భేదనీయా స్యూ రిపవ స్తేన పార్థివై

భిన్నా హి శక్త్యా రిపవః ప్రభూతా స్సల్పేన సైన్యేన నిహన్తు మాజౌ

సుసంహతానాం హి తతస్తు భేదః కార్యో రిపూణాం నయశాస్త్రవిద్భిః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే రాజధర్మే భేదోపాయకథనం నామ ద్వావింశత్యుత్తర ద్విశతతమోధ్యాయః

(*న జ్ఞాతి మనుగృహ్ణంతి సజ్ఞాతిం వై(వి)శ్వసంతిచ)

శ్రీ మత్యుడిట్లు మనువుతో చెప్పెను: రాజు తనకు గల శత్రువులనేకులు పరస్పరము (ఒకరి విషయమున మరియొకరు) దుష్టులుగా కుద్దులుగా. ఒక రిని చూచి మరియొకరు భయపడువారుగా ఒకరివలన మరియొకరు అవమా నితులుగా ఉన్న చో (వారొకరితో మరియొకరు కలియ కుండునట్లు ) వారి పై భేదోపాయము ప్రయోగించవలెను: ఏలయన ఇట్టివారు భేదోపాయ సాధ్యులు: ఎవరు ఏ దోషము కలవారై యుండి గర్వించి ఇతరుల వలన భయపడరో వారియందా దోషమునే ప్రయోగించి వారిని భేదోపాయముచే పరస్పరము విడదీయవలెను; ఆందులకై వానీకి తనవలని ఆశ నుగాని పరులనుండి భయమునుగాని చూపవలెను; ఇట్లు వారిని భేద పరచనిదే వారిని ఓర్చుకొనుట ఇంద్రునకు కూడ సాధ్యము కాదు; కావున నీతిశాస్త్ర విశారదులు భేదోపాయమునే ప్రశంసింతురు; భేదోపాయమును తాను స్వయముగనై న ప్రయో గించ వచ్చును: పరుల ద్వారముననే న ప్రయోగించవచ్చును. ఈ రెండవ విధమయిన దానిని తాను పరీక్షించి దాని ఔచిత్యమును నిర్ణయించుకొనవలెను; ఇంతేకాదు; రాజు తన కార్యసిద్ధినుద్దేశించి తన శత్రువులను పరస్పరము భేద పరచిన తరువాత గూడ వారు భేదపడినారు - లేమ్మని నమ్మియుండరాదని అర్థశాస్త్రకుశ లురగు అర్థ (రాజనీతి) వాదులందురు.

రాజు పై కోపించియుండు వారి కోపము ఆంతః కోపము బహిఃకోపముననీ రెండు విధములు; ఈ రెండింటి యందును అంతఃకోపము బలవత్తరమగుటలో గొప్పది. అది రాజులకు నాశము కలిగించును. సామంతుల కోపము బాహ్య కోపము; మహిషి-యువరాజు సేనాపత్యమాత్య మంత్రి రాజపుదుల కోపమంతఃకోపమునని మనీషలందురు. ఇది రాజు లకు దారుణతరమయినది; ఇందుచేతనే బాహ్యకోపము చాల గొప్పదిగా ఉత్పన్నమయియున్న ను అంతః కోపము శోధిత మయినచో ఈ రెండవ దానినతడు సులభముగా శ్రీ ఘముగా జయించును. ఇంద్రసుడగు రాజు కూడ ఆంతఃకోపముచే నశించును. - కొవున ఈ జెప్పుడును అంతఃకోపమును (నుండి) యత్నముతో రక్షించుకొనవలెను. భేదోపాయముతో శత్రు వుల జయింపగోరు రాజు శత్రు పక్షమునందలి జ్ఞాతుల నడుమ మరి ఇతరులగు (మూడవ) వర్గము వారి ద్వారమున భేదము పుట్టించి వారిని చీలదీసి వశపరచుకొనవలెను. ఇట్లే తన విషయమున శత్రువులు ఈ జ్ఞాతి భేదోపాయమును ప్రయోగింతు రేమోయని ఎచ్చరిక తో నుండవలయును; ఏలయన-జ్ఞాతులు ఎల్లప్పుడును మొదలే తమ జ్ఞాతుల విషయమున లోలోపల మండిపడుచుందురు. వారినీ ఇంకను రెచ్చగొట్టిన మరింత పరితాప (మండి) పడుచుందురు. ఆయినను రాజు తన శత్రు రాజులు తనకును తన జ్ఞాతులకును - నడుమ భేదము పుట్టించకుండుటకై ఆతి గంభీర చిత్తుడై దానముతో (నం) మానముతో వారిని తన వైపునకు తిప్పియుంచుకొనవలెను. ఏలయన వారినుండి తనకు భేదము కలుగు చో ఆది చాల భయంకరము అగును. ఏలయన జ్ఞాతి ఎల్లప్పుడును తన జ్ఞాతిని దహింపగోరునే కాని అనుగ్రహించడు. కావున రాజులెల్లప్పుడును తమ శత్రువులను వారి జ్ఞాతులనుండి భేదపర చవలెను.

శత్రువులు అధిక సంఖ్యాకులును ప్రబలురును ఐనను వారిని భేదపరచిన మీదట స్వల్ప సేనతోగూడ యుద్దమున చంప (జయింప) సాధ్యులగుదురు. కావున నయ (రాజనీతి) శాస్త్రవేత్తలగు రాజులు తమ శత్రువులు సుసంహులుగా (పరస్పరము దృఢ మిత్రులుగా) ఉండినను వారిని భేదపరచవలయును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున భేదోపాయ కథనమను రెండు వందల ఇరువది రెండవ ఆధ్యాయము.