108 - ప్రయాగ మాహాత్మ్యము

 మార్కండేయః : శృణు రాజ స్స్పయాగస్య మాహాత్మ్యం పునరేవతు

 నైమిశం పుష్కరంచైవ గోతీర్థం సిన్దుసాగరమ్

 గయా చైత్రధనూకంచ గజ్జ్గాసాగర మేవ చ

 ఏతే చాన్యేచ బహవో యేచ పుణ్యా శ్శిలో చ్చయాః

 దశ తీర్థ సహస్రాణి త్రింశత్కోట్య స్తథాపరే

 ప్రయాగే సంస్థితా నిత్య మేక మాహు ర్మనీషిణః

 త్రీణి చాథాగ్ని కుజ్ఞాని యేషాం మధ్యేచ జాహ్నవీ

 ప్రయాగా దభినిషాన్హా సర్వదేవనమస్కృతా

 తపనస్య సుతా దేవీ త్రిషు లో కేషు విశ్రుతా

యమునా గజ్ఞయా సార్ధం సజ్ఞతా లోకపావనీ

 గజ్రాయమునయే ర్మధ్యే పృథివ్యా జఘనం స్మృతమ్

ప్రయాగం రాజశార్దూల కళాం నార ని షోడశీమ్

 తీసః కోట్యర్ధకోటీచ తీర్థాసాం వసు బ్రవీత్

 దివి భువ్య నరి మేచ తత్సర్వం జాహ్న వీగతమ్

ప్రయాగసమధిష్టానో కమ్బశాశ్వతరో ప్రభూ

 భోగితల్పగత స్యైషా వేది రేషా ప్రజాపతేః

తత్ర వేదాశ్చయజ్ఞాశ్చ మూర్తిమన్తో యుధిష్ఠిర

 ప్రజాపతి ముపాస నే ఋషయశ్చ తపోధనాః

యజ నే క్రతుభి ర్దేవా స్తథా చక్రధరా నృపాః

 తతః పుణ్యతమం నాస్తి త్రిషులో కేషు భారత

ప్రభావ స్సర్వతీర్థభ్యః ప్రభవ త్యధికం విభో

 యత్ర గజ్గా మహాభా గా స దేశ స్తత్ర పావనః

మార్కండేయుడింక ను ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరా: ప్రయాగ మాహాత్మ్యమునింకను చెప్పేద; వినుము. నైమిశము పుష్కరము గోతీర్థము సింధు సాగరము గయ చైత్ర(ధనూక)ము గంగా సాగర (సంగమ)ము మొదలగు ముప్పదికోట్ల పది వేల తీర్థములును పుణ్య పర్వతములును సదా ప్రయాగ యందుండునని , విద్వాంసులు చెప్పెదరు. ప్రయాగ సమీపమున సర్వదేవ నమస్కృతయగు గంగ చూడగ్ని కుండముల నడుమగా ముంపునకు సాగివచ్చును. లోకత్రయ ప్రసిద్దయు సూర్యపు తొయు నగు యమునయు ఈ గంగయు అచట సంగమించును, ఈ గంగా యమునో మధ్యదేశము పృథివీ జఘనమని ప్రసిద్ధము. లోకత్రయమందలి మూడున్నర కోట్ల తీర్థములన్నియు కూడియు ప్రయాగ తీర్ధ షోడశాంశముతో సరిపోలవు. ఏలయన భూర్ భువః స్వరోక ములందలి తీర్ధములన్నియు నచట గలవు. అని సాక్షాత్ వసువు చెప్పెను. నాగ ప్రభువులగు కంబళాశ్వతరులును ఇచట నుందురు. శేషతల్ప శయనుడగు ప్రజాపతికి విష్ణునకు ఇది పడక యరుగు. తపోధనులగు మునులును ఋషులును మూ ర్తిమంతములగుచు వేదములును యజ్ఞములును నచట ప్రజాపతిని ఉపాసించుచుండును. దేవతలును చక్రవర్తులును నచట క్రతువులతో విష్ణు ప్రజాపతిని ఆరాధింతురు. త్రిలోకములందును ఈ ప్రయాగముకం టే పుణ్యతమమగు తీర్థ క్షేత్రము లేదు. మహాభాగయగు గంగ యుండుటచే ఆచోటు సర్వ తీర్థములకంటే అధిక ప్రభావ సంపన్న ము; పావనము.

సిద్ద క్షేత్రంచ విజ్ఞేయం గజ్గాతీర సమన్వితమ్

 ఇదం సత్యం విజానీయా తాధూనా మాత్మజస్యచ

  సుహృదశ్చ విశేషేణ శిష్యస్యానుమతస్యచ

 ఇదంధన్య మిదంస్వర్య మీడం సేవ్యమిదంసుఖమ్

 ఇదంపుణ్య మిదంకీర్త్యం పావనం ధర్మముత్తమమ్

 మహర్షిణా మిదంగుహ్యం సర్వపాప ప్రణాశనమ్

 అధీత్యచ ద్విజో హ్యేత న్నిర్మలం స్వర్గమాప్నుయాత్

 య స్విమం శృణుయాన్నిత్యం తీర్థంపుణ్యం సదాశుచిః

  జాతిస్మర త్వం లభతే నాకృషేచ మోదతే

 ప్రాప్య చైతాని తీర్థాని సద్చి శ్శిష్టానుదర్శిభిః

 స్నా హి తీర్దేషు కౌరవ్య నచ వక్రగతి రవేత్

 త్వయాచ సమ్యకృషైన కథితాని మయావిభో

 తారితాః పితరస్సర్వే తథైవచ పితామహాః

 ప్రయాగస్యతు సర్వే తే కళాం నార ని షోడశీమ్

 ఏవం జ్ఞానంచ యోగంచ తీర్థంచైవ యుధిష్ఠిర

 బహు క్లేశేన యుజ్య నే న తేషా మితరా గతిః

త్రికాలంచ జప జ్ఞానం స్వర్గలోకం గమిష్యతి

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయయుధిష్ఠిరసంవాదే ప్రయాగమాహాత్మ్యే

 అష్టోత్తరశతత మోధ్యాయః

గంగా తీరముతో కూడిన యాతీర్థము సిద్ధ క్షేత్రమని ఎరుగవలయును. ఈ సర్వ విషయమును సజ్జనులకును తన కుమారునకును తన మిత్రునకును తనకు ప్రీతిపాత్రుడగు శిష్యునకును తెలుపవలయును. ఈ తీర్థ క్షేత్రము ధన్యము; స్వర్గప్రదము; సేవింపదగినది; సుఖకరమయినది; పుణ్యప్రదము; కీర్తనీయము; పావనము; ఉత్తమ ధర్మరూపము; ఇది మహర్షులకును ఎరుగరాని గుహ్యత త్వము; సర్వపాపనాశక ము. నిర్మలమగు ఈ తీర్థ మాహాత్మ్యమును అధ్యయనము చేసినను విప్రులు స్వర్గ ప్రాప్తులగుదురు. శుచియై ఈ పుణ్యతీర్థ మాహాత్మ్యమును వినునతడు స్వర్గ సుఖములదు టేకాక తరువాతి జన్మములందును పూర్వజన్మ స్మృతి కలవాడగును. కావున యుధిష్ఠిరా! శిష్యులై సంప్రదాయము నెరిగిన వృద్దులతో కూడి నీవును ఈ తీర్థముల కేగి వానియందు స్నానమాడుము. నీకిక దుర్గతి యుండదు. రాజా! నీవు చక్కగా ఆడిగిన విషయమంతయు నీకు నేజెప్పితిని. నీ పితృ పితామహులందరును తరించినారు. లోకములందలి ఆ తీర్థములన్నియు కలిసియు ప్రయాగలో పదునారవ వంతునకు చాలవు; ఏలయన తీర్థము జ్ఞానము యోగము ఈ మూడును ఒకేచోట లభించుట దుస్సాధ్యము. ఇతర తీర్థములకు ఇట్టి యోగ్యత లేదు. దీని మహిమను త్రికాలమును జపించుచుండుటచే స్వర్గ ప్రాప్తియగును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఎనిమిదవ అధ్యాయము.