మత్స్య మహా పురాణము
224 - దండోపాయ విచారము.
శ్రీమత్స్యః : న శ క్యా యే వశీకర్తు ముపాయత్రితయేన తు ।
దణ్డెన తా న్వశీకుర్యా ద్దణ్డో వా వశకృ న్నృణామ్॥
సమ్య క్ప్రణయనం తస్య తథా కార్యం మహీక్షితా ।
ధర్మ శాస్త్రానుసారేణ ససహాయేన ధీమతా॥
తస్య సమ్యక్పణయనం యథా కార్యం మహీకితా ।
వానప్రస్థాంశ్చ ధర్మజ్ఞా న్నిర్మమా న్నిష్పరిగ్రహాక్॥
స్వదేశీ పర దేశేవా ధర్మ శాస్త్రవిశార దా।
సమీక్ష్య ప్రణయే దణం సర్వం దళ్లే ప్రతిష్ఠితమ్॥
ఆశ్రమీ యది వా వర్ణి పూజ్యో వాథ గురు ర్మహాక్ ।
నాదణ్డ్యో నామ రాజ్ఞో స్త్రీ స్వధర్మే యో న తిష్ఠతి॥
అదజ్ఞ్యా న్టణయ శ్రాజా దణ్యాంశ్చైవాప్యదణయక్ ।
ఇహ రాజ్యపరిభ్రష్ణో నరకం ప్రతిపద్యతే॥
తస్తా దొజ్జా వినీతేన ధర్మశాస్త్రానుసారతః ।
దణ్ణప్రణయనం కార్యం లో కానుగ్రహకామ్యయా॥
యత్ర శ్యామో లోహితాక్షీ దణ్ణ శ్చరతినిర్భయః ।
ప్రజా సత్ర న ముహ్య ని నేతా చేత్సాధుపశ్యతి॥
బాలవృద్ధాతుర యతి ద్విజశ్రీ విధవా యతః ।
మాత్స్యన్యాయేన వ ర్తేర న్యది దణ్ణం న పాతయేత్॥
దేవదై త్యోరగగణా స్సర్వే భూతపత త్రిణః ।
ఉత్క్రామయ్య ర్మర్యాదాం యది దణ్డం న పాతయేత్॥
శ్రీమత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ చెప్పిన మూడుపాయములతోను వశీక ఎంచుకోన శక్యులు కాని వారిని దండోపాయముతో వశీక రించుకోనవలయును. ఏలయన దండము నరులను వశీక రించుకొని తీరును మహీపతి తగిన సహాయుల తోడ్పాటుతోను తాను తన బుద్ధితో విచారణ చేసియు ధర్మ శాస్త్రానుసారముగ దండమును చక్కగా ఆచరణలో నుంచవలెను. దానిని రాజు ఎట్లు లెస్సగా ఆచరణలో పెట్టవలయుననిన వానప్రస్థులు ధర్మజులు నిర్మములు నిష్పరిగ్రహులు (ఎవరినుండియు ఏమియు తీసికొననివారు) స్వదేశముదుగాని పర దేశమందు గాని ఉండు ధర్మశాస్త్ర విశారదులు. ఇట్టివారిని పిలిపించి వారిచే విషయమును సమీక్షింప (బాగుగా పరిశీలింప) జేసి వారి యభిప్రాయము ననుసరించి దండ మును ఆచరణమందుంచవలెను. ఏలయన రాజ్య సమ్యక్పరిపాలనమంతయు దండమునందే నిలిచియున్నది; బ్రహ్మ చర్యాద్యాశ్రమములందున్న వాడుగాని సంన్యాసిగాని పూజ్యుడు అగు మహా వ్యక్తిగానీ గురువుగాని స్వధర్మమునందు నిలువని వాడయిన చో రాజునకు దండ్యుడు కాని వాడెవడును ఉండడు; రాజు దండ్యులను దండింపకున్నను ఆదండ్యులను దండించినను అతడు ఇహమందు రాజ్య పరిభ్రష్టుడును పరమందు నరక ప్రాప్తుడును నగును. కావున రాజు లోకానుగ్రహ కాంక్షతో తాను వినీతుడై (సమ్యగ్వర్తనము గలవాడై) ధర్మ శాస్త్రానుసారముగ దండోపాయమునాచరణమందుంచవలెను. ప్రజానేత (రాజు) సరిగా చూచువాడయినచో.ఎచట నల్లని దేహచ్చాయయు ఎర్రని కన్నులు గలవాడునని శాస్త్రములందు చెప్పబడిన దండాధిష్టాన దేవత నిర్భయయై సంచరించునో. అచ్చట ప్రజలు మోహము ధర్మాధర్మ విషయములందు పొర బాటు పొందరు. ఏలయన రాజు దండ్యుల విషయమున దండమును ప్రవ గ్రిల్లజేయనిచో బాలురు వృద్ధులు యతలు ద్విజులు స్త్రీలు విధవలు. ఇట్టివారు మాత్స్యన్యాయముతో (బలవంతులచే బలహీనులు హింసించబడుటయు.తినబడుటయును అను విధానముతో) నుందురు. దేవదై త్యోరగ గణములును సర్వభూత ములును పశులును మర్యాదాతిక్రమణమును చేయుదురు (హద్దుమీరి వర్తింతురు).
ఏష బ్రహ్మాభిశా పేషు సర్వ ప్రహరణేషు చ ।
సర్వవిక్రమకో పేషు వ్యవసాయే చ తిష్ఠతి॥
పూజ్య నే దణ్డినో దేవై ర్న పూజ్య నే త్వదణ్డినః ।
న బ్రహ్మాణం విధాతారం న పూషార్యమణా వపి॥
యజ నే మానవాః కేచి తశాస్త్ర న్సర్వకర్మసు ।
రుద్ర మగ్నించ శక్రంచ సూర్యాచౄమసౌ తథా॥
విష్ణుం దేవగణా శాన్యా న్డట్టినః పూజయ స్తి హి ।
దణ్డ శ్శాస్తి ప్రజా స్సర్వా దణ్ణ ఏవ హి రక్షతి॥
దణ్డ స్సు స్తేషు జాగర్తి దణం ధర్మం విదు ర్బుధాః ।
రాజదణభయాదేవ పాపాః పాపం న కుర్వతే॥
యమదణ్డభయా దేకే పరస్పర భయా దపి ।
ఏవం సాంసిద్ది కే లో కే సర్వం దట్టే ప్రతిష్ఠితమ్॥
అఫ్ఘతమసి మజ్జీయు ర్యది దణ్ణం న పాతయేత్ ।
యస్మార్టణో దమయతి దుర్మదా న్దండ యత్యపి॥
దమనా దడ్దనా చ్చైవ తస్మా దణం విదుర్బుధాః ।
దజ్ఞస్య భీతై శ్రీద శై స్సమేతై ర్భాగో ధృత శ్శూలధర స్య యజే॥
చక్రుః కుమారం ధ్వజినీపతిం చ వరం శిశూనాం చ భయా ద్బలస్థమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే దణ్డోపాయ కథనం నామ చతుర్ వింశత్యుత్తర ద్విశతతమోఽధ్యాయః॥
ఈ దండ దేవత బ్రాహ్మణులిచ్చు శాపములందును నర్వాయుధములందును నర్వ విక్రమములందును నర్వ కోపములందును దృఢ ప్రయత్నమునందును ప్రతిష్టితమయియున్నది. దండించువారినే దేవతలును పూజింతురు. దండించని వారినెవ్వరును పూజించరు. మానవులలో కొందరు ప్రశాంతులగు బ్రహ్మ-విధాత.పూషన్. ఆర్యమన్. మొదలగు దేవతలను సర్వకర్మలందును పూజించకున్నారు. దండించువారగు రుద్రాగ్నీంద్ర సూర్యచంద్ర విష్ణులను ఇట్టి ఇతర దేవతలను పూజించుచున్నారు. ప్రజలనందరను దండమే శాసించుచున్నది. రక్షించుచున్నది. అందరును నిద్రించు చున్నను అది తాను మాత్రము మేలుక నియుండును. కావుననే దండమే ధర్మ స్వరూపమని పండితులందురు. రాజదండ భయమువలన కొందరును యమదండ భయము వలన మరికొందరును పరస్పర భయమువలన ఇంకను కొందరును పాపమునాచరించకున్నారు. ఇట్లు లోక వ్యవహార సిద్దియంతయు దండమునందే నిలిచియున్న దీ; రాజాదులు ఆప రాధులయందు దండమును ప్రవర్తిల్లజేయకున్న చో జనులు అంధతమస్సునందు మునిగిపోవుదురు. దుర్మదులను అణచి అదుపులో నుంచును. దండించును. అను ఈరెండు హేతువులచే దండ మునకు ఆ వ్యవహారము ప్రసిద్ధమయినది. శూల ధరుడగు శివుడు దండించునను భయమువలననే దేవతలందరును కూడి ఏకాభిప్రాయముతో ఆతనికి యజ్ఞమునందు భాగము నిచ్చిరి. శిశువులలో శ్రేష్ఠుడు (చాల పసివాడు) అయినను బలశాలియగు కుమారుని దేవతల దండ భయమువలననే సేనాపతినీగా చేసిరి.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజ ధర్మమున దండోపాయ కథనమను రెండు వందల ఇరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 224 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya provides precise ritual instructions for performing Shānti-karma, sacred fire sacrifices and purification rites designed to pacify inauspicious omens and environmental disturbances. Bhagavān Matsya details Homa rituals using specific sacred woods, samidhs, grains, ghee, and herbal extracts accompanied by Vedic hymns to neutralize negative subtle influences. The text mandates that conducting these rites restores balance, protects the kingdom from plagues, and ensures seasonal rainfall and agricultural abundance.