243 - శ్రీవామన చరిత్రము - కథారంభము. అదితికి విష్ణువర ప్రాప్తి-అదితి గర్భమున విష్ణుప్రవేశము.

ఋషయః : రాజధర్మ స్త్వయా సూత కథతో విస్తరేణ చ

తథైద్భుతమజ్గళ్యం స్వప్న దర్శన మేవచ

 విష్ణోరిదానీం మాహాత్మ్యం పున ర్వక్తు మహార్హసి

 కథం స వామనో భూత్వా బబన్ల బలిదానవమ్

క్రమతః కీదృశం రూప మాసీ ల్లోకత్రయం హరేః సూతః :

 ఏతదేవ పురా వృష్టః కురు క్షేత్రే తపోధనః

 శౌనక సీర్థయాత్రాయాం వామనాయతనే పురా

 యదా సమయభేదిత్వం ద్రౌపద్యాః పార్థివం ప్రతి

 అర్జునేన కృతం తత్ర తీర్థయాత్రాం తదా య

 ధర్మరేత్రే కురు క్షేత్రే వామనాయతనే స్థితః

 దృష్ట్వా స వామనం తత్ర అర్జునో వాక్యమబ్రవీత్

వామనావతారవిషయక శౌనకార్జునసంవాదం.

అర్జునః : కింనిమిత్త మయం దేవో వామనాకృతిరిష్యతే

 వారాహరూపీ భగవా నస్మా త్పూజ్యోభవత్పురా

కస్మాచ్చ వామన స్వేద మిష్టం క్షేత్ర మజాయత

వామనస్య ప్రవక్ష్యామి వారాహస్య చ ధీమతః

 త్యక్త్వాతి విస్తరం తస్య మాహాత్మ్యం కురునన్దన

 పురా నిర్వాసితే శక్తీ సురేషు విజితేషు చ

 చి శ్రయామాస దేవానాం జననీ పునరుద్భవమ్

అదితిర్దేవపానాంచ మాతా పరమదుఃఖితా

 తపశ్చచార వర్షాణాం సహస్రం వృథివీ పతే

 ఆరాధనాయ కృష్ణస్య వాగ్య తా వాయు భోజనా

 దైత్యై ర్ని రాకృతా నృష్ట్వా తనయా నురునన్దన

 వృథాపుత్తాహ మస్మీతి నిర్వేదా తణతా హరిమ్

 తుష్టావ వాగ్ళి రర్థ్యాభిః పరమార్థావబోధనీ 

దేవదేవం హృషీ కేశం నత్వా సర్వగతం హరిమ్

ఋషులు సూతునితో నిట్లనిరి: సూతా! నీవు మాకు రాజధర్మమును అద్బుత (ఉత్పాత) యాత్రా-స్వప్న శకున విషయములను విస్తరించి తెలిపితివి. ఇపుడిక మరల విష్ణు మాహాత్మ్యమును తెలుపవేడుచున్నాము; అత డేట్లు వామనుడయి బలిదానవుని బంధించెను; హరి లోకత్రయమాక్రమించునపుడతని రూపము ఎట్లుండేను? అన సూతుడిట్లనెను: పూర్వము అర్జునుడు ద్రౌపదీ విషయమన సమయ భంగమొనరించి తీర్థయాత్ర కై వేడ లేను. ఆ ప్రసంగమందతడు కురు క్షేత్రమునందలి వామనాయతనమందలి వామనుని చూచి ఆటనున్న తపోధనుని శౌనకుని ఇదే ప్రశ్న మడిగెను: ఏ హేతువుచే ఈ దేవుడు వామనాకృతి యయ్యెను? ఈ పూజ్య భగవానుడు పూర్వము వరాహ రూపుదేలయయ్యెను? ఇది. వామనునకు ఇష్ట క్షేత్రమెటులయ్యెను? అనగా శౌనకుడిట్లు చెప్పెను: కురునందనా! ధీమంతులయిన వామన వారాహుల మాహా త్మ్య మనతివి స్తరముగ చెప్పెదను; పూర్వము ఇంద్రుడు ఆసురులచే నిర్వాసితుడై దేవతలు వారిచే విజితులు కాగా దేవ జనని యగు అదితి పర మదుఃఖిత యై తన కుమారులెట్లు మరల ఆభ్యుదయమందుదురాయని చింత చేయుచు వేయి దివ్య సంవత్సరములు కృష్ణుని మెప్పించుటకై మౌనము దాల్చి వాయు భోజనమై తపమాచరించెను; కురునందనా! దైత్యులచే నిరాకృతులయిన తన తనయులను చూచి నేను వ్యర్థ పుత్తనయితినే యని నిర్వేదముతో ప్రణతురాలయి పరమార్థ ప్రకా శక బుద్ధితో అర్థవంతములగు వాక్కు లతో దేవదేవుడును సర్వగతుడునగు హరిని నమస్కరించి ఇట్లు స్తుతించేను:

అదితికృత వాసుదేవ స్తుతిః.

అదితిః: నమస్స్మృతార్తినాశాయ నమఃపుష్కరమాలినే

 నమః పరమకల్యాణకల్యాణాయాఒదివేధ సే

నమః పజజనేత్రాయ నమః పజ్కజనాభయే

 నమః పజజసమ్భూతి సమ్భవాయాత్మయోనయే

కాన్తాయ దా నదృశ్యాయ పరమార్థాయ చక్రిణే

 నమ శ్శజ్ఞాసిహస్తాయ నమః కనక రేతసే

 తథాత్మజ్ఞానవిజ్ఞానయోగిచిన్త్యాత్మ యోగినే

 నిర్గుణాయ విశేషాయ హరయే బ్రహ్మరూపిణే

 జగతతిష్ఠితం యత్ర జగతా యో న దృశ్యతే

 నమస్థూలాతిసూక్ష్మాయ తస్మై దేవాయ శబ్దినే

యం న పశ్య ని పశ్యన్తో జగదప్యఖిలం నరాః

 అవశ్యద్భిర్జగద్యత్ర దృశ్యతే హృది సంస్థితః

యస్మిన్న న్నం పయ శ్చైవ నద్యశ్చైవాఖిలం జగత్

 తస్మై నమోస్తు జగతా మాధారాయ నమోనమః

ఆద్యః ప్రజాపతి ర్యశ్చ యః పితృణాం పరః పతిః

 పతి స్సురాణాం య స్తస్మై నమః కృష్ణాయ వేధ సే

 యః ప్రవృత్తి నివృత్తా చ ఇజ్యతే కర్మభి స్స్వకై

 స్వర్గాపవర్గఫలదో నమ స్తస్మై గదాభృతే

యశ్చి న్యమానో మనసా సద్యః పాపం వ్యపోహతి

 నమస్తస్మై విశుద్దాయ పరాయ హరిమేధసే

 యం బుద్ధ్వా సర్వభూతాని దేవదేవేశ మవ్యయమ్

 న పునర్జన్మమరణే ప్రాప్నువ స్తి నమామి తమ్

యో యజ్ఞే యజ్ఞపరమై రిజ్యతే యజ్ఞనంజ్ఞితః

 తం యజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభు మీశ్వరమ్

 స్మరించినవారి ఆర్తి నశింపజేయువాడును పద్మమాలియు పరమ కల్యాణ కల్యాణుడును ఆది బ్రహ్మరూపుడును పంక జనేత్రుడును పంక జనాభుడును పద్మనంభవుని జన్మ కారణుడును ఆత్మయోనియు మనోహర రూపుడును ఇంద్రియ నిగ్రహము కలవాడును దృశ్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రియు శంఖ ఖడ్గహస్తుడు హిరణ్య రేతస్కుడు ఆత్మ జ్ఞానముగల యోగులచే చింతింపబడువాడు న్వయం యోగియు నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు నగు హరికి నమస్కారము, ఎవనియందు జగము ప్రతిష్టితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతి స్థూలునకు శంఖికి నమస్కారము; అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖులగు జనులేవనిని చూడజాతి రో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయములందేయున్న వానిగా చూతురో ఎవనియందన్న ము జలము నదులు సమస్త జగము ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజా పతియు పితరులకును పరమపతి(పిత)యు దేవతాపతియునగు కృష్ణునకు వేధో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కా రము. ఎవడు ప్రవృత్తి మార్గములందాయా కర్మములచే ఆరాధింపబడునో అట్టి స్వర్గాపవర్గ ఫలదుడగు గదా ధారికి నమ స్కారము; మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్దుడు పరుడునగు హరీకి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; నర్వభూతములును దేవదేవేశుడు నవ్యయుడునగు ఎవని నెరిగినంతనే జన్మ మరణరహితులగుదురో(నో) ఆ హరిని నమస్క రింతును; యజ్ఞ పరాయణులు యజ్ఞమందు ఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషుని విష్ణుని ప్రభుని ఈశ్వరుని నమస్కరింతును.

గీయతే సర్వవేదేషు వేద విద్బి ర్విదాంపతిః

 య స్తస్మై వేద వేద్యాయ విష్ణవే జిష్ణవే నమః

 యతో విశ్వం సముత్పన్నం యస్మింశ్చ లయ మేష్యతి

 విశ్వోద్భవప్రతిష్ఠాయ నమస్తస్మై మహాత్మనే

 బ్రహ్మాది సమ్బపర్యన్తం యేన విశ్వమిదంతతమ్

 మాయాజాలం సముత్తర్తుం తము పేస్ట్రోం నమామ్యహమ్

విషాదతోషదోషాద్యే ర్యోఒజస్రం సుఖదుఃఖజై కి

నృత్యత్యఖిలభూతస్థ స్తము పేన్దం నమామ్యహమ్

యమారాధ్య విశుద్దేన కర్మణా మనసా గిరా

 తర న్యవిద్యా మఖిలాం తము పేస్ట్రోం నమామ్యహమ్

యస్సుతో విశ్వరూపస్లో బిభర్యఖిల మీశ్వరః

 విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్

 మూర్త స్తమోఒ సుర మయం తద్వధాద్వినిహన్తి యః

రాత్రిజం సూర్యరూపీవతము పేస్త్రం నమామ్యహమ్

కపిలాది స్వరూపణ్ణి యశ్చాజ్ఞానమయం తమః

 హనీ జ్ఞానప్రదానేన త ము పేంద్రం నమా మ్యహమ్

 యస్యాక్షిణీ చన్దసూర్యౌ సర్వలోక శుభజ్కరమ్

పశ్యతః కర్మ సతతం తము పేనం నమా మ్యహమ్

యస్మి న్సర్వేశ్వరే విశ్వం సత్య మేతన్మయోచితమ్

 నానృతం త మజం విష్ణుం నమామి ప్రభు మవ్యయమ్

యథైత త్సత్యము క్తంచ భూయాంశ్చాతో జనార్దనః

 సత్యేన తేన సఫలాః పూర్యంతాం మే మనోరథాః

సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యుడగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్న మయి ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు ఆట్టి మహాత్మునకు నమస్కారము; బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ విశ్వమేవనిచే వ్యా ప్రమో ఆట్టి యు పేంద్రుని నేను ఈ మాయాజాలము తరించుటకై నమస్కరింతును; తోయ న్వరూపుడై యుండి ఆఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణునీ నమస్కరింతును; ఎవనిని విశుద్ధ మనో వాక్కాయ కర్మలతో ఆరాధించి అఖిలమగు అవిద్యను తరింతురో ఆ యు సేంద్రుని నమస్కరింతును; సుఖదుఃఖములకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వంద నము; రాత్రులందేర్పడు చీకటిని రవివలె ఆసురమయమగు రూపొందిన చీకటిని వధించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును; కపిలాది యోగి స్వరూ పముననుండి అజ్ఞానమయతమమును జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింప జేయు హరిని నమస్కరింతును; ఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమును సతతము చూచుచున్నారో అట్టి యు సేంద్రుని నమస్కరింతును; సర్వేశ్వరుడును సర్వుడునునగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు నత్యమో అసత్యము కాదో ఆట్టి అజుని విష్ణుని ప్రభుని ఆవ్యయుని నమస్కరింతును;నేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్దనుడింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథములన్ని యు సఫలములయి పూరింపపడుగాక!

అదిత్యై విష్ణుదత్త వరలాభః.

శౌనకః: ఏవం స్తుతోథ భగవా న్వాసు దేవ ఉవాచ తామ్

 అదృశ్య స్సర్వభూతానాం తస్యా స్సన్దర్శనే స్థితః

శ్రీభగవా : మనోరథా న్త్వానది తే యానిచ్ఛస్య భివాజ్ఛతాక్

 తాం స్త్వం ప్రాప్స్యసి ధర్మ మతసాదా న్న సంశయః

శృణుష్వ త్వం మహాభాగే వరో యస్తే_భివాక్చాతః

 తమాశు వియతాం కామం శ్రేయస్తే సమ్భవిష్యతి

 మద్దర్శనం హి విఫలం న క దాచి ద్భవిష్యతి

 అదితిః : యది దేవ ప్రసన్న స్వం మద్భక్త్యా భక్తవత్సల

త్రైలోక్యాధిపతిః పుత్ర సదస్తు మమ వాసవః

 హృతం రాజ్యం హృతాశ్చాస్య యజ్ఞభాగా మహాసురై

త్వయి ప్రసన్న వర దేప్రాప్నోతు సురకత్తమః

 హృతం రాజ్యం న దుఃఖాయ మమపుత్తస్య కేశవ

సాపత్నా ద్గాయనిరంతో బొధాం నః కురుతే హృది

 శ్రీభగవాక్ : కృతః ప్రసాద్ హి మయా తవ దేవి యథేపితమ్

స్వాం శేన చైవ తే గర్భే సమ్భవిష్యామి కశ్యపాత్

 తవ గర్భే సముత్పన్న స్తత్ర తే యే సురారయః

 తాజ్ హనిష్యామి సర్వాన్వే నిర్వృతా భవ నన్దిని

 అదితిః : ప్రసీద దేవదేవేశ నమస్తే విశ్వభావన

 నాహం త్వా ముదరేణై వ వోడుం శక్ష్యామి కేశవ

 యస్మి నతిష్టితం విశ్వం విశ్వస్య స్వయ మీశ్వరః

 తమహం నోదరేణ త్వాం వోడుం శశ్యామి దుర్గరమ్

ఇట్లు స్తుతింపబడి వాసుదేవ భగవానుడు సర్వభూతముల క దృశ్యుడయియు అదితికి దర్శనమిచ్చుచు ఆమెతో ఇట్లు పలికెను: ధర్మజ్ఞా? ఆదితీ! నీ మనోరథములన్నియు నాయనుగ్రహమున నిస్సంశయముగ సిద్ధించును; మహాభాగా! నామాట వినుము; నీ యభివాంఛితమగు వరము ఏదియే కోరుము; నీకత్యంత ! శేయము కలుగును; నెదర్శనమెన్నడును విఫలము కాదు; అన ఆదీతి ఇట్లనెను: దేవా! భక్తవత్సలా! నీవు నా భక్తితో ప్రసన్నుడవయినచో నాపుత్తడగు ఇంద్రుడు త్రైలోక్యాధిపతియగుగాక! మహాసురులతని రాజ్యమును యజ్ఞభాగములను హరించినారు; వరదుడవగు నీపు ప్రసన్నుడ వయినచో నొకుమారుడు మరల నవి పోందుగాక ! కేశవా! పోనీకి రాజ్యము పోవుట దుఃఖకరముగాదు; సొసవతి కొడుకు మావానీ దాయభాగమును హరించెననుట మాహృదయమునకు బాధ కలిగించుచున్నది; అన భగవానుడిట్లనెను: దేవీ? నీయభీప్సితము ననుగ్రహించితిని; నా యంశమున కశ్యపుని వలన నీగర్భమున జన్మింతును; తరువాత దేవశత్రువులను సంహరింతును; ఆనంద కరురాలా! సంతోషమందుము; అనగా అదితి ఇట్లనెను; దేవదేవేశా! అనుగ్రహించుము; (ప్రసన్నుడ వగుము;) విశ్వభావనా! నీకు వందనము; దేవా! కేశ వా! నేను నిన్ను నా గర్భమున మోయజాలనే మో! ఎవనియందు విశ్వము నెలకొన్నదో ఎవరు తాను స్వయముగా విశ్వరూపుడో అట్టి ఈశ్వరుడు అగు దుర్ధరుని నిన్ను నేను ఉదరమున మోయజాలను.

శ్రీభగవాన్ : సత్య మాత్థ మహాభాగే మయి సర్వ మిదం జగత్

 ప్రతిష్ఠితం న మాం శక్తా వోడుం సేంద్రా దివౌకసః

 కిం త్వహం సర్వలో కాంస్తా న దేవాసురమానుషా

జజ్ఞమాం త్త్షావరా నర్వాం స్త్వాంచ దేవి సకశ్యపామ్

 ధారయిష్యామి భద్రం తే తదలం సమమేణచ

 గ్లాని ర్న తే న చ స్వేదో గర్భస్టే భవితా మయి

 దాక్షాయణి ప్రసాద నే కరోమ్యన్యై సుదుర్లభమ్

 గర్భస్తే మయి పుత్రాణాం తవ యోభిభవిష్యతి

 తేజస స్తస్య హానిం చ కరిష్యే మా వ్యథాం కృథాః

 శౌనకః : ఏవ ము క్త్వా తతః సద్యో గతో నర్గాన మీశ్వరః

 సాపి కాలేన తం గర్భ మవాప పురుషో త్తమమ్

గర్భస్థితే తతః కృషే చచాల సకలా క్షితి

 చక మిరే మహా శైలా జగ్ముః క్షోభం తథాబ్దయః

 యతో యతోఒదితి ర్యాతి దదాతి లలితం పదమ్

 తత స్తతః క్షితిః భేదా న్న నామ వసుధాధిప

 దైత్యానా మథ సర్వేషాం గర్భస్తే మధుసూదనే

 బభూవ తేజసో హానిర్యథో క్తం పరమేష్ఠినా

 ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్య మనుసంవాదే వామనచరిత్రేదితిగర్బే విష్ణు ప్రవేశ కథనం నామ త్రీచత్వారింశదుత్తర ద్విశతతమోఽధ్యాయః

అనగా భగవానుడిట్లనెను: మహాభాగా సత్యమంటివి; నాయందే జగమంతయు ప్రతిష్ఠితము; నన్ను ఇంద్రాది దేవతలెవ్వరును మోయజాలరు; కాని నేను సర్వలోకములను అందలి స్థావర జంగమములతో దేవాసుర మనుషులతో నిన్ను ను కశ్యపునికూడ మోయగలను; భద్రరూపొ! కావున నీవు భయపడకుము; నేను నీగర్భమందుండగా నీకు శ్రమముకాదు, చెమటయు పట్టదు; దక్షపు తీ: నేను అన్యసుదుర్లభమగు అనుగ్రహమును నీయందు చూపుచున్నాను; నేను నీగర్భమందున్న కాలమున నీపుత్తుల కేవరయిన హాని కలిగించినచో వారికి తేజోహాని కలిగింతును; వ్యథ నందకుము; అని పలికి వెంటనే ఈశ్వరుడంత రైతుడయ్యెను. ఆ అదితియు కాలమున పురుషోత్తముని గర్భముగా పొందెను; కృష్ణుడు గర్భస్థుడై యున్న కాలమున సకల భూమియు చలించేను, మహా శైలములు వణ కెను; సముద్రములు షోభిల్లెను; అదితి లలితముగా నెచట అడుగుంచినను అచటనెల్ల భూమి భేదముచే వంగెను; ఆ కాలమున పరమేష్ఠియగు విష్ణువు చెప్పినటులే సర్వదైత్యులకును తేజోహానియయ్యెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వామన చరితమున అదితి గర్భమందు హరిప్రవేశ మను  రెండు వందల నలువది మూడవ అధ్యాయము.