192 - దశాశ్వమేధాది తీర్థ మహిమాను వర్ణనము॥

మార్కణ్డేయః : తత స్వనరకం గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్

స్నాతమాతో నర స్తత నరకం చ నశ్యతి

అస్య తీర్థస్య మాహాత్మ్యం శృణు త్వం పాణునన్దన

తస్మిం స్తీర్థేతు రాజేంద్ర యస్యాస్థీని వినిక్షిపేత్ పేత్

విలయం యాంతి సర్వాణి రూపవా స్టాయతే నరః

గోతీర్థంతు తతో గచ్చే దృష్ట్వా పాపా త్ర్పముచ్యతే

తతో గచ్ఛేత్తు రాజేంద్ర కపిలాతీర్థముత్తమమ్

తత్ర స్నాత్వా నరో రాజ నోసహస్రఫలం లభేత్

జ్యేష్టమా సేతు సమ్ర్పస్తే చతుర్ధశ్యాం విశేషతః

తత్రోపోష్య నరో భక్త్యా కపిలాం యః ప్రయచ్ఛతి

మృతేన దీపం ప్రజ్వాల్య ఘృతేన స్నాపయే చివమ్

సఘృతం శ్రీఫలం జగ్ద్వా దత్వా చాంతే ప్రదక్షిణమ్

ఘట్టాభరణసంయుక్తాం కపిలాం యః ప్రయచ్ఛతి

శివతుల్యబలో భూత్వా నే వానీ జాయతే పునః

అజ్గారకదినే ప్రాప్తే చతుర్ధ్యాంతు వి శేషతః

స్నా పయిత్వా శివం దద్యా ద్బ్రాహ్మణేభ్యస్తు భోజనమ్

ఆజ్గారకనవమ్యాం తు అమాయాం చ వి శేషతః

స్నాపయే త్తత్రయత్నేన రూపవా న్స్తుభగో భవేత్

మృతేన స్నాపయేల్లిజ్గం పూజయే ద్భక్తితో ద్విజాక్

పుష్ప కేన విమానేన సహ స్రైః పరివారితః

శైవం పద మవాప్నోతి యత్ర చాభిమతం భవేత్

అక్షయం మోదతే కాలం యథా రుద్ర స్తథైవ సః

యదాతు కర్మసంయోగా న్మ ర్యలోక ముపాగతః

రాజా భవతి ధర్మిష్ఠో రూపవా స్ట్రాయతే కులే

మార్కండేయుడు ధర్మరాజుతో ఇట్లు చెప్పెను: తరువాత నరక తీర్థము: దానియందు స్నా సమాడినచో నరక దర్శనమేయుండదు: పాండునందనా! ఈ తీర్థపు మాహాత్మ్యమును తెలి పెదను; వినుము: దీనియందు ఎవనివైన ఆస్తులను వైచినచో అవి అందు విలీనమగును; ఇందు స్నానమాడినవాడు రూపవంతుడగును; తరువాత దర్శనమాత్రమున పాపము క్తిని కలిగించు గోతీర్థము; తరువాత కపిలతీర్థము; దానియందు స్నానముచే గోసహస్ర దాన ఫలము లభించును; జ్యేష్ట (శుక్ల) చతుర్దశినాడచట ఉపవసించి భక్తితో కపిలా గోదాన మొనరించినచో ఆది ఎట్లన నేతి దీపము వెలిగించి నేతితోనే శివు సిభి షేకించినచో నేతితో మారేడు ఫలమాహారముగా తినిపించి నివేదించినచో తరువాత శివుని కపీలా గోవును కూడ ప్రదక్షిణించి ఘంటలతో ఆభరణములతో కూడిన ఆ గోవును దానమిచ్చినచోశివతుల్య భోగముల ననుభవించును; వాని కీక పునర్జన్మముండదు; చవితి మంగళ వారమున నవమీ మంగళ వారమున అమావాస్యా మంగళ వారమున అచ్చట శివు నభి షేకించినచో రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునగును; అంతమున పుష్పక విమానము పై వేలకొలది మంది పరి వారముతో శివస్థానమునందును; తన కభిమతమగు చోట్ల నెల్ల రుద్ర సమ భోగములతో ఆనంతకాలము సుఖించును; ఫల భోగానంతరము కర్మ సంయోగ వశమున భూలోకమునకు వచ్చినను ఉత్తమ వంశమున రూపవంతుడును ధార్మికుడునగు రాజగును

తతో గచ్ఛేత్తు రాజేంద్ర గణేశ్వర మనుత్తమమ్

శ్రావణే మాసి సమ్ర్పస్తే కృష్ణపక్షే చతుర్ద శీ

స్నాతమాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే

పితౄణాం తర్పణం కృత్వా ముచ్య తేచ ఋణత్రయాత్

తతో గచ్చేత్తు రాజేంద్ర ఋషితీర్థ మనుత్తమమ్

తృణ బిందు రృషిర్నామ శాపదగ్దో వ్యవస్థితః

తత్ర తీర్థ ప్రభావేన శాపముక్తో భవే ద్ద్విజః

గ జ్గేశ్వర సమీ పేతు గజావదన ముత్తమమ్

ఆకామోవా సకామోవా తత్ర స్నాత్వాతు మానవః

ఆజన్మజనితై  పావై ర్ముచ్యతే నాత్ర సంశయః

తత్ర తీర్థ నర స్స్నా త్వా వ్రజతే యత్ర శఙ్కరః

సర్వదా పర్వదివ సే స్నానం తత్ర సమాచరేత్

పితౄణాం తర్పణం కృత్వా హ్యశ్వమేధఫలం లభేత్

ప్రయాగే యత్ఫలం దృష్టం శఙ్కరేణ మహాత్మనా

తదేవ నిఖిలం పుణ్యం గజ్గావదనసజ్గ మే

తరువాత ఆనుత్తమము (అంతకంటే గొప్పదిలేనిది) ఆగు గణేశ్వర తీర్థము; శ్రావణ కృష్ణ చతుర్దశినాడందు స్నానమాడినంతనే రుద్రలోక ప్రాప్తుడగును; పితృ తర్పణముతో దేవ ఋషి పితృ ఋణత్రయ మూర్తియగును; తరు వాత అను త్తమమగు ఋషి తీర్థము; తృణ బిందుడను ద్విజ ఋషి అందు స్నానమాడి ఆ తీర్థ ప్రభావమున శాపముక్తు డయ్యెను; గంగేశ్వర సును లింగమునకు దగ్గరలో గంగావదన తీర్థము కలదు; (దాని మహిమ) తెలిసికానీ తెలియక కాని (కోరిక లుండి కాని లేక కాని) స్నానమాడినచో ప్రాణి తన పుట్టుక మొదలు చేసిన పాపములు తొలగును; తుదకు శంకర లోక ప్రాప్తుడగును; అందు ప్రతి పర్వ సమయమందును స్నానమాడి పితృ తర్పణము చేసినచో అశ్వమేద , ఫలము లభించును; ప్రయాగ తీర్థమునకు ఏ ఫలము కలదని మహాత్ముడగు శంకరుడ నేనో ఈ గంగా వదన సంగమ తీర్థము కూడ అంత ఫలము నిచ్చును మ పు 108

తస్యైవ పశ్చిమే పార్శ్వే సమీ పేనాతిదూర తః

దశాశ్వమేధ నామానం త్రిషు లో కేషు విశ్రుతమ్

ఉపోష్య రజనీ మకాం మాసి భాద్రపదే తథా

అమాయాం చ నర స్స్నాత్వా వ్రజతే యత్ర శఙ్కరః

సర్వదా పర్వదిన సే స్నానం తత్ర సమాచరేత్

పితౄణాం తర్పణం కృత్వా చాశ్వమేధఫలంలభేత్

దశాశ్వమేధా త్పశ్చిమతో భృగు రాహ్మణ సత్తమః

దివ్యం వర్ష సహ సంతు ఈశ్వరం పర్యుపాసత

వల్మీ కే వేష్టిత శ్చాసౌ పక్షిణాం చ ని కేతనః

ఆశ్చర్యంతు మహజ్ఞాత ముమాయా శ్శజ్కరస్య చ

గౌరీ పప్రచ్ఛ దేవేశం కోఽయ మేవం తు సంస్థితః

దేవో వా దానవో వాఽథ కథయస్వ మహేశ్వర

ఈశ్వరః : భృగు ర్నామ ద్విజ శేష ఋషీణాం ప్రవరో మునిః

ద్యాయతే మాం సమాధిస్థో వరం ప్రార్థయతే ప్రియే

తతః ప్రహసితా దేవీ శజ్కరం ప్రత్యభాషత

ధూమవ త్తచ్ఛిఖా జాతా తతోఽద్యాపి న తుష్య సే

దురారాధ్యోఽసి తేన త్వం నాత్ర కార్యా విచారణా

ఈశ్వ రః: న జానాసి మహాదేవి హ్యయం! క్రోధేన వేష్టితః

దర్శయామి యథాతథ్యం ప్రత్యక్షం తే కరోమ్యహమ్

తత స్స్మృతోఽథ దేవేన ధర్మరూపో వృష స్తదా

స్మరణా ద్దేవదేవస్య వృష శ్శీఘ ముపస్థితః

వదంస్తు మానుషీం వాచ మాదేశో దీయతాం ప్రభో

ఈశ్వరః : వల్మీకం తం ఖనస్వైనం విప్రం భూమౌ నిపాతయ

యోగస్థస్తు తతో ధ్యాయ నృగుస్తేన నిపాతితః

తత్తణాత్క్రోధన నప్తో హస్త ముత్క్షిప్య సోఽశపత్

ఏవం సమ్భాషమాణస్తు కుత్ర గచ్ఛసి రే వృష

ఆద్యాహం త్వాం సకో పేన ప్రళయం త్వాం నయే వృష

ధర్షితస్తు తదా విప్ర శ్ఛా న్తరిక్షం గతో వృషం

ఆకా శే ప్రేక్షతే విప్ర ఏత దద్భుత ముత్తమమ్

దీని పశ్చిమ పార్శ్వమున చాల దగ్గర లో త్రిలోక విశ్రుతమగు దశాశ్వమేధ తీర్థము గలదు; భాద్రపదమావాస్య నాడందు స్నానమాడి ఒక అహోరాత్రముపవసించి పితృ తర్పణము చేయుటచే దశాశ్వమేధ ఫల ప్రాప్తుడగును; దీనికి పశ్చిమమున భృగు తీర్థము గలదు; (దీని ఉత్పత్తి ఇది:) పూర్వము బ్రాహ్మణ సత్తముడగు భృగుడు సహస్ర దివ్య వర్ష కాలము ఇట ఈశ్వరుని ఉపాసించుచుండెను; అతని చుట్టును మీదను పుట్టి పెరిగి చుట్టివే నెను; అందు పక్షులు గూండ్లు పెట్టెను; ఇది చూచి ఉమాశంకరుల కాశ్చర్యము కలిగెను; ఇట్లున్న ఈత డెవ్వడు? దేవుడా! దానవుడా! మ హేశ్వరా! తెలుపుమని గౌరి దేవేశునడిగెను; ఈశ్వరుడును: ప్రియా! ఇతడు భృగుడను ద్విజూ శ్రేష్ఠుడు; మునియును ఋషిప్రవరుడును; ఇతడిందు సమాధిస్థుడయి నన్ను ధ్యానించుచున్నాడు అనెను అంతట దేవి పెద్దగ నవ్వి: “ఇతని పై ఇతని జుట్టుకొన (అగ్ని జ్వాల) పొగవలే (పొగతో కూడినదై) ఏర్పడినది; ఇప్పటికిని నీవతనిని మెచ్చకున్నావు; దీనిని బట్టి నీవు దురా రాధ్యుడవు సులభముగా మెప్పించరానివాడవు); ఇందు సందియము లేదు" అనెను: శివుడది విని “దేవీ! ఇతని విష యము నీవు ఎరుగవు; ఇతడు క్రోధ వేష్టితుడు; దీని యథార్థత్వము చూపి నీకు ప్రత్యక్షము చేయుదును; అనెను అంతట మహాదేవుడు ధర్మరూపుడదిగు వృషభమును స్మరించెను; దేవ దేవుడు స్మరించినంతనే శీఘ్రముగా ఆ వృషము వచ్చి ఎదుట నిలిచేను: అది మానుష వాక్కుతో ప్రభూ! ఆదేశ మునిమ్మ నేను: అంత ఈశ్వరుడును ఈ వల్మీక మును తవ్వుము: ఈ విప్రుని క్రిందకు పడ వేయుము; అనెను, యోగస్థుడయి ధ్యానమందున్న భృగుని ఆ ధర్మ రూప వృషభము క్రింద పడ వే నెను తత్క్షణమతడు క్రోధ నంతపుడయి చేయి ఎత్తి ఇట్లు పలుకుచు దానిని శపించెను: “ఓరీ! (సీ!) ఎద్దా! ఎక్కడకు పోయెదవు! వృషమా! నేనిపుడే నాకోపముతో నాశ మొందించును” ఆంత వృషభమతనిని ఎత్తివేయగా ఋషి అంత రిక్షమునకు ఎగిరిపోయేను: అచ్చట అతనికా వృషభమంతరిక్షమందున్నట్లు కనబడెను: ఇది అతనికి ఉత్తమమగు అద్భుత మనిపించెను

తతః ప్రహసితో రుద్ర  ఋ షే రగ్రే వ్యవస్థితః

తృతీయం లోచనం దృష్ట్వా వై లక్ష్యా త్పతితో భువి

ప్రణమ్య దండవద్భూమౌ స్తువతే పరమేశ్వరమ్

భృగుకృతశివస్తుతిః॥

ప్రణిపత్య భూతనాథం భవోద్భవం త్వా మహం దివ్యరూపమ్

భవాతీతో భువనపతే ప్రభోతు విజ్ఞాపయే కిళ్చాత్

 త్వద్గుణనికరం వక్తుం క ళ్ళకో భవతి మానుషో నామ

 వాసుకిరపి హి కదాచి ద్వదనసహసం భవే ద్యస్య

భక్త్యా తథాపి శఙ్కర భువనపతే స్తుతి ర్ముఖర యతి మాండు శ

 వదతః క్షమస్వ భగవ నసీద తవ చరణనిరతస్య

సత్వం రజ సమ స్వం స్థిత్యుత్పత్యో ర్వినాశనే దేవ

త్వాం ము క్త్వా భువనపతే భువనేశ్వర నై వదైవతం కిళ్చిత్

యమనియమయజ్ఞ దాన వేదాభ్యాసాశ్చ ధారణా యోగా

త్వద్భకే స్సర్వమిదం నార్హసి హి కలాసహస్రాంశమ్

ఉచ్ఛిష్టర స రసాయనఖడ్గాష్ట్రానపాదుకావివరసిద్ధి ర్వా

 చిహ్నం భవవతానాం దృశ్య నే జన్మి నః ప్రకటమ్

 శా శ్యేన నమతి యద్యపీ దదాసి త్వం భూతి మీచ్చతాం దేవ

 భక్తి ర్భవభేదకరీ మోక్షాయ వినిర్మితా నాథ

 పర దారపరస్వరతం పరిపరిభవదుఃఖశోక స నప్తమ్

 పరవద నవీక్షణపరం పర మేశ్వర మాం పరిత్రాహి

మిథ్యాభిమానదగ్గ క్షణభజుర విభవవిలసనమ్

క్రూరం కుపభిముఖం పతితం మాం పాహి దేవేశ

దీనే ద్విజగణ సార్ధే బన్ధుజనే నైవ దూషితా హ్యాశా  

తృష్ణా తథాపి శఙ్కర కిం మూఢం మాం విడమ్బయతి

తృష్ణాం హర స్వ శీఘం లక్ష్మీం మే దేహి హృదయవాసినీం నిత్యమ్

 ఛిన్ది మద మోహపాశా నుత్తారయ మాం మహాదేవ

కరుణాభ్యుదయం నామ స్తోత్రమిదం సర్వసిద్ధిదం దివ్యమ్

 యః పఠతి భక్తియుక్త స్తస్య తు ష్యే ద్భృగో ర్వథాహి శివః

 ఈశ్వరః : అహం తుష్టోస్మి తే విప్ర వరం ప్రార్థయ చేప్సితమ్

 ఉమయా సహితో దేవో వరం తస్య హ్యదాపయత్

అంతట రుద్రుడు పెద్దగా నవ్వుచు ఋషి ఎదుట నిలిచేను: మూడవ కన్ను కనబడినంత ఋషి వెలవెల పోవుచు క్రింద పడెను; దండవత్ గా భూమి పైపడి నమస్కరించి పర మేశ్వరునిట్లు స్తుతించసాగెను:

భృగు మహర్షి చేసిన శివ స్తుతి

 కారణ కారణుడవును భూత సాధుడవును దీవ్యరూవుడవునగు నిన్ను నమస్కరింనంతనే నేను నంసారమును దాటితీని; ఐనను ప్రభూ! భువనపతీ! ఏదో కొంచెము మనవి చేయుదును; వేయినోళ్లు గల వాసుకి కూడ ఎన్నటికిని నీ గుణ సమూహమును వర్ణించ జాలడనిన మానుషుడెవ్వడు అది చేయగలడు? ఆయినను భువన పతీ! శంకరా! భ కి తో నిన్ను స్తుతించు తలపు నన్ను వాగునట్లు చేయుచున్నది మహేశా ! భగవన్! నేను పలుకు మాటల లోనీ దోషముల)ను క్షమించుము నీ చరణములయందు నీరతుడ (అత్యంతా సక్తుడ)నగు నన్న ను గ్రహించుము; దేవా! నీవే సృష్టియందు రజో గుణముగా స్థితియందు సత్వముగా ప్రళయ మందు తమముగా నగుదువు; భువనపతీ! భువనేశ్వరా! నీవు తప్ప మరి దేవత ము ఏదియు లేనేలేదు యమ నియమములు (యోగాంగములు) యజ్ఞములు దానములు వేదాభ్యాసములు ధార ణాది యోగములు కాని ఉచ్చిషవిద్యా రసవిద్యారసాయన విద్యా ఖడ్గ విధ్యాం జనవిద్యా పాదు కొవిద్యా వివర-(సురంగా నిధి) విద్యా సిద్ధికాని ఇందేదియు నీ భక్తికి పదునారవపాలునకుకూడ నమ ముకాదు; భవ ! (శివ) ప్రతులగు వారికి దేహములందు ఆ దేహికిగల నీ చిహ్నము పుట్టుకతోనే ప్రకటమయి కనబడును; దేవా! కొంటెతనముతో (నిన్ను పరీ క్షించు తలంపుతో) నమస్కరించినవానికే యైనను నీవు ఐశ్వర్యము కోరిన వారికి అది ఇత్తువు నాథా! జీవులకు సంసార బంధమును ఛేదించి (నశింపజేసి వారికి ముక్తి నీ యదలచి నీ వందులకు సాధనముగా నీయందు భక్తినికూడ నీవే సృష్టించి తివి) పర దార పర ధనములందాస క్తిగల వాడను పరులవలన పరాభవమునంది దుఃఖ శోకములచే సంతాప మందిన వాడను ధనాద్యాశ చే పరుల ముఖముల వంగిచూచుట కలవాటు పడిన వాడను అగు నన్ను పర మేశ్వరా! రక్షించుము; మిథ్యాభి - మానముతో దగ్గుడను క్షణభంగురమగు విభపములనంది మిడిసి పడు వాడను క్రూరుడను కుపథా (చెడు తోవలకు) ఆభిముఖుడను పతితుడను అగునన్ను దేవేశా! రక్షించుము; దీనులగు ద్విజ సమూహముల హృదయములయందు మా కేవ రైన ధనమీయవలయుననియు దీనులగు బంధుజనుల హృదయములయందు మమ్ము ధనికులగు మా బంధు జనులు పోషించవలయుననియు ఆశ యుండుట దూషితము (తప్పిదము) కాదు; కాని శంక రా ఋషినగు నన్ను కూడ మూడునిగా జేసి ఆశ నన్ను తనకు వశునిగా చేసికొని వెక్కిరించుచున్న దే! ఇది బాగుగ లేదు; శీఘముగా ఆశ నుహరించుము; సదా నా హృదయమునందు నిలిచియుండు లక్ష్మిని (ఉన్నదే చాలునను హృదయానుభూతిని) ఇమ్ము మద మోహ పాశములను ఛేదించుము; మహాదేవా! నన్ను సంసొర మునుండి దాటిం చుము; కరుణా భ్యుదయమను ఈ దీవ్య స్తోత్రము సర్వసిద్ధి ప్రదము; దీనిని భక్తితో పఠించిన వాని విషయమున శివుడు భృగుని విష యమునందు వలెనే సంతుష్టుడగును

ఇది విని ఈశ్వరుడు “విప్రా! నేను నీ విషయమున సంతుష్టుడనయితిని; ఈప్సిత వరము ప్రార్థించుము; అని ఉమతో కూడియున్న ఆ సోమ దేవుడు భృగునకు వర ము ఈయ సిద్దపడెను

భృగు : యది తుష్టో సి దేవేశ యది దేయో మరో మమ

 రుద్రవేదీ భవే దేవ మే తత్సమ్పాదయస్వ మే

ఈశ్వరః : ఏవం భవతు విప్రేన్ద క్రోధ స్తే న భవిష్యతి

 న పితాపుత్తయో శ్చైవ త్వైకవాక్యం భవిష్యతి

తదాప్రభృతి బ్రహ్మాద్యా స్సదేవాసుర కిన్నరాః

 ఉపాసనే భృగో స్త్రీర్థం తుష్ణో యత్ర మహేశ్వరః

 దర్శనా త్తస్య దేవస్య సద్యః పాపా తముచ్యతే

 ఆవశా స్వవశా వాపి మియ నే యత్ర జ స్తవః

 గుహ్యాతిగుహ్యా సుగతి స్తేషాం నిస్సంశయం భవేత్

 ఏత త్రం సువిపులం సర్వపాపప్రణాశనమ్

తత్ర స్నా త్వా దివం యా న్తి యే మృతా ఒపునర్భవాః

ఉపానహౌ తథా చ్ఛత్రం దేయ మన్నంతు కాడ్చానమ్

భోజనంతు యథాశక్త్యా హ్య క్షయం చ తథాభవేత్

 సూర్యోపరాగే యో దద్యా ద్దానం చైవ యథేచ్చయా

దీయమానంతు తద్దాన మషియం తస్య తద్భవేత్

 చన్దసూర్యోపరాగే తు యత్ఫలం త్వమరకణ కే

 తదేవ నిఖిలం పుణ్యం భృగుతీర్దే న సంశయః

క్షీయ స్తే సర్వదా నానీ యజ్ఞదాన తపః యాః

 న క్షీయతే తప సప్తం భృగుతీర్థ యుధిష్ఠిరః

 యస్య వై తపసో గ్రేణ తుషేనైవ తు శమ్బునా

సాన్నిధ్యం తత్ర కథితం భృగుతీర్దే నరాధిపః

 ప్రఖ్యాతం త్రిషు లోకేషు యత్ర తుష్టా మహేశ్వరః

ఏవం తు వదతో దేవీం భృగుతీర్థ మనుత్తమమ్

 న జాన ని నరా మూఢ విష్ణు మాయావిమోహితాః

నర్మదాయాం స్థితం దివ్యం భృగుతీర్థం నరాధిప

 భృగుతీర్థస్య మాహాత్మ్యం య శ్శృణోతి నర స్సకృత్

స ముక్త స్సర్వపా పేభ్యో రుద్రలోకం సగచ్ఛతి

ఆంతట భృగుడు “దేవేశా! నీవు నాయందు సంతుష్టుడవయినచో నాకు వరమీయ దగినచో నేను రుద్రత త్వ మెరిగిన వాడను కావలయును అను నా కోరిక సంపన్న మగు (నేర వేరు)నట్లు వర మిమ్ము అనెను, ఈశ్వరుడు “వి పేంట్రా? ఆటైయగుగాక! మరియు నీకిక మీదట కోపముండదు; నీ కుమారునకును నీకును ఏకాభిప్రాయముండదు; అనెను; అది మొదలు బ్రహ్మేంద్రులును దేవాసుర కించరాదులును మ హేశ్వరుడు భృగుని విషయమున తుష్టుడైన ఈ భృగు తీర్థ మును సేవించుచున్నారు; ఆట ఆ దేవుని దర్శించినంత నే పాపము క్తియగును; తమ ఇచ్చతోనే కానీ ఇచ్చలేక (తెలియక- ఆప్రయత్నముగా) కాని అచట మరణించిన ప్రాణులకు గుహ్యాతిగుహ్య పరమ రహస్య-ఉత్తమమగు సుగతి కలుగును; ఇది నిస్సంశయము; ఈ క్షేత్రము మహావి స్తర ము; సర్వ పాప ప్రణాశనకరము; ఇచట మరణించినవారికి పునరావృత్తి లేని ద్యులోక ప్రాప్తియగును; ఇచట సూర్యగ్రహణ కాలమున పొదర క్షలు ఛత్రము అన్నము కాంచనము యథాశ క్షిగ దాన మొనర్చినను ఆది ఆక్షయమగును; చంద్ర మార్య గ్రహణకాలములందు ఆమరకంటకమున చేసిన దానాదిక మెంత ఫలప్రద మో ఇచట చేసినది కూడ అంత ఫలప్రదమగును; ఇతరత్ర చేసిన సర్వదాన తపో యజ్ఞాదీ ఫలములయిన ఒక నాటికి క్షీణించవచ్చును కాని భృగుతీర్థమున చేసినవి ఏవియు ఎన్నటికిని క్షీణించవు సాక్షాత్ గ శంభుడు భృగుని ఉగ్రతపముతో తుష్టుడైన ఈ భృగు తీర్థము , తిలోక విఖ్యాతము; ఈ విషయమును స్వయముగా మహాదేవుడే దేవితో పలికినాడు; ఇది అంతగా ఆనుత్తమము అయినను విష్ణువు చూయా విమోహితులగు వారు మాత్రము దీని మహ త్వ మెరుగజాలరు సర్మదా నది (తీర) మందు ఉన్న ఈ భృగు తీర్థ మాహాత్మ్యమును విన్నవారు కూడ సర్వపాపముక్తులై రుద్రలోక మేగుదురు

తతో గచ్ఛేత్తు రాజేంద్ర గౌతమేశ్వర ముత్తమమ్

తత్ర స్నాత్వా నరో రాజ న్నుపవాసపరాయణః

 కాఞ్చనేన విమానేన బ్రహ్మలో కే మహీయతే

 ధోతపాపం తతో గచ్చేత్ క్షేత్రం యత్ర వృ షేణ తు

 నర్మదాయాం కృతం రాజు నర్వపాతకనాశనమ్

తత్ర తీర్దే నరస్స్నా త్వా బ్రహ్మహత్యాం వ్యపోహతి

తస్మిం స్త్రీ ర్ణేతు రాజేన్ద ప్రాణత్యాగం కరోతి యః

 చతుర్బుజ శ్రిణేత్రస్తు రుద్రతుల్యబలో భవేత్

వసే త్కల్పాయుతం సాగ్రం శివతుల్యపరాక్రమః

కాలేన మహతా ప్రాప్తః పృథివ్యా మేకరా డ్భవేత్

తతో గచ్ఛేత్తు రాజేంద్ర ఐరన్దేతీర్థ ముత్తమమ్

ప్రయాగే యత్ఫలం దృష్టం మార్కజ్జీయేన భాషితమ్

 తత్ఫలం లభతే సోపి స్నాతమాత్రే నరాధిప

మాసి భాద్రపదేచైవ శుక్లపక్షస్య చాష్టమీ

 ఉపోష్య రజనీ మేకాం తస్మిన్త్నానం సమాచరేత్

 యమదూతై ర్న బాధ్యత రుద్రలోకం స గచ్ఛతి 

తతో గచ్చేత్తు రాజేన్గ సిదో యత్ర జనార్దనః

 హిరణ్యద్వీపవిఖ్యాతం సర్వపాపప్రణాశనమ్

 తత్ర స్నా త్వా నరో రాజ న్లనవా నూపవా న్భవేత్

 తతో గచ్చేత్తు రాజేన్ద తీర్థం కనఖలం మహత్

 గరుడేన తవ స్త ప్తం తస్కిం సీర్దే నరాధివ

ప్రఖ్యాతం త్రిషు లో కేషు యోగినీ యత్ర తిష్ఠతి

 క్రీడతే యోగిభి స్సార్గం శివేన సహ నృత్యతి

తత్ర స్నా త్వా నరో రాజు నుద్ర లో కే మహీయతే

తతో గచ్ఛేత్తు రాజేన్ద హంసతీర్థ మనుత్తమమ్

హంసా స్తత వినిర్ముక్తా గతా ఊర్ధ్వం న సంశయః

 తతో గచ్ఛేత్తు రాజే సిద్ధే యత్ర జనార్దనః

వారాహం రూప మాస్థాయ ఆర్చితః పర మేశ్వరః

 వారాహతీర్థ య స్నాత్వా ద్వాదశ్యాం తు విశేషతః

విష్ణులోక మవాప్నోతి నరకం న చ పశ్యతి

 తతో గచ్చేత్తు రాజేంద్ర చంద్రతీర్థ మనుత్తమమ్

 పౌర్ణమాస్యాం విశేషేణ స్నానం తత్ర సమాచరేత్

 స్నాతమాత్రో నర స్తత చంద్రలో కే మహీయతే

తరువాత గౌతమేశ్వర తీర్థము; ఆందు స్నానము చేసి ఆనాడచట ఉపవసించిన వారు బంగరు విమానము పై బ్రహ్మలోక ప్రాప్తి నందుదురు; తరువాత నర్మదయందుండినదగు దౌత పావతీర్థము; దీనిని ధర్మరూపుడగు వృషభమే ఏర్పర చెను; ఈ తీర్థము తనయందు స్నానమాడినవారి బ్రహ్మహత్యా దోషమును కూడ పోగొట్టును; ఇచ్చట ప్రాణత్యాగ మొనర్చువాడు చతుర్భుజుడును త్రినేత్రుడునునై రుద్ర సమాన బలుడగును; పదివేల కల్పములు సంపూర్ణముగా శివతుల్య పరాక్రముడై శివలోక సుఖమందును; చాలకాలము తరువాత మరల భూలోకమునకు వచ్చినను పృథివి కంతటికి ఏకైక చక్రవర్తియగును; తరువాత ఉత్తమమగు ఐరండి తీర్థము; ఇచ్చట స్నానమాత్రముననే ప్రయాగయందువలే మహాఫల మబ్బును; భాద్రపద శుక్లాష్టమీనాడిచట స్నానమాడి ఒక అహోరాత్రముపవసించినవారు యమదూతల వలన బాధలందక రుద్రలోక మేగుదురు; తరువాత సాక్షాత్తుగ విష్ణున కే సిద్ధి కలిగించినదియు సర్వపాప ప్రణాశనమునగు హిరణ్య ద్వీపమను తీర్థ ము; ఇందు స్నానమాడిన వారు ధనవంతులును రూపవంతులును నగుదురు; తరువాత గొప్పదియగు కనఖల తీర్థము; ఇందు గరుడుడు తపమొనరించెను; యోగినీశ కి ఇందుండునని తిలోక ప్రసిద్దమిది; ఆమే యోగులతో కలిసి విహ రించును; శివునితో కలిసి నృత్యము చేయును; ఇందు స్నానమాడినవారు రుద్రలోక ప్రాప్తులగుదురు; తరువాత హంస తీర్థము; అందు హంసలు పొవ వినిర్ము క్రిములయి ఊర్ధ్వలోక మేగెను; తరువాత వరాహ తీర్థము; అందు విష్ణువు కూడ సిద్ధీనందేను; ఇచట శివుడు వరాహరూపుడై పూజింపబడును; ద్వాదశినాడు ఇందు స్నా సమాడినవారు నరక మును చూడరు; విష్ణులోకమున కేగుదురు; తరువాత అనుత్తమమగు చంద్రతీర్థము; ఇందు పూర్ణిమనాడు స్నానమాడుట ఆధిక ఫలప్రదము; దానిచే చంద్రలోక వాసమును దానిచే మహాసుఖ ప్రాప్తియునగును

 దక్షిణేన తు తీర్దేణ కన్యాతీర్థం తు విశ్రుతమ్

శుక్లపక్షే తృతీయాయాం స్నానం తత్ర సమాచరేత్

 ప్రణిపత్యతు చేశానం బలి నేన ప్రసీదతి

హరిచన్దపురం దివ్య మన్తరి క్షేతు దృశ్యతే

శక్రధ్వజే సమావృత్తే సుప్తే నాగరి కే జనే

 నర్మదా తోయ వేగేన తరూ నమ్ల్పవయిష్యతి

అస్మిల స్థానే నివాస స్సౌః ద్విష్ణు శ్శజ్కర మబ్రవీత్

ద్వీ పేశ్వరే నరస్స్నా త్వా లభే ద్బహుసువర్ణకమ్

 తతో గచ్ఛేత్తు రాజేస్త్ర రుద్రక న్యాసునల్గమే

 స్నా తమాత్రే నర స్తత్ర దేవ్యా స్థాన మవాప్నుయాత్

దేవతీర్థం తతో గచ్ఛే త్సర్వ తీర్థ మనుత్తమమ్

తత్ర స్నాత్వాతు రాజేన్ష దైవతై స్సహ మోదతే

తతో గచ్ఛేత్తు రాజేన్ద శిఖితీర్థ మనుత్తమమ్ 

య తత్ర దీయతే దానం సర్వం- కోటిగుణం భవేత్

అపరపక్షే త్వమాయాం స్నానం తత్ర సమాచరేత్ 

బ్రాహ్మణం భోజయే దేకం కోటి ర్భవతి భోజితా

భృగుతీర్ణేతు రాజేన తీర్థం కోటి ర్వ్యవస్థితా

 అకామా వా సూమో వా తత్ర స్నా యాచ్చ మానవః

 అశ్వమేధ మవాప్నోతి దేవతై స్సహ మోదతే

 తత్ర సిద్ధిం పరాం ప్రాప్తో భృగుస్తు మునిపుజ్గవః

అవతారః కృత స్తత్ర శఙ్కరేణ మహాత్మనా

ఇతి శ్రీమత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే దశాశ్వమేధతీర్థాది మహిమానువర్ణనం నామ ద్వినవత్యుత్తర శతతమోధ్యాయః

తరువాత నర్మదా దక్షిణ తీరమందలి క న్యాతీర్థము; ఇది చాల ప్రసిద్ధము; శుక్లపక్ష తృతీయనాడు ఇందు స్నానమాడి ఈశ్వరునికి నమస్కరించి బలి (నివేదనము) ఇచ్చినచో రుద్రుడు ప్రసన్నుడగును; అంతరిక్షమునందు హరిత (ఆకుపచ్చని) కాంతితో చంద్రుని నగరము కనబడుచుండగా ఇంద్ర ధ్వజోత్సవము ముగిసిన తరువాత మాసములో (రాత్రివేళ) నగరములందలి జనము నిదురించు సమయమున-నర్మద తన జల వేగముతో తన తీరములందలి) వృక్షము లను తేల్చివేయు కాలములో ఈ స్థానమునందు నివసించవలయును ఇది ఆధిక ఫలప్రదము; ఆని విష్ణువు స్వయముగా శివునితో పలి కెను; తరువాత ద్వీపేశ్వర తీర్థ ము; అందు స్నానము చేసినచో బహు సువర్ణము లభించును; (ఆధిక సంపద కలుగును) తరువాత రుద్రక న్యా (ఉపనది) సంగమ తీర్థము; ఆందు స్నానమాడిన మాత్రమున దేవీస్థాన ప్రాప్తుడగును; తరువాత మహోత్తమమగు దేవతీర్థము; దానియందు స్నానమాడినవారు దేవతలతో కూడి సుఖింతురు; తరువాత అనుత్తమ మగు శిఖినీర్థము; ఆందు చేసిన దానములు ఇతరత్ర చేసిన అదే దానపు ఫలమునకు కోటి రెట్లుగ ఫలమునిచ్చును; కృష్ణ పక్షమున అమావాస్యనాడు ఆచ్చట స్నానమాడి బ్రాహ్మణునొక్కని భుజింపజేసినను కోటిమంది బ్రాహ్మణులను భుజింప జేసినట్లగును; రాజేంద్రా! ధర్మజా! మొదట చేప్పిన భృగు తీర్థమునందు కోటి తీరముల మహిమమున్నది; దాని మహి నము ఎట్టిదన ఇది భృగుతీర్థమని తెలిసికొని తెలియక కాని చిత్తములో కోరికలుండికాని లేక కాని ఇందు స్నానము చేసినంత మాత్రముననే మానవులకు నహ సొశ్వమేధ యాగములు చేసినందున కలుగునంత ఫలము కలుగును; వారు దేవతలతో కూడి వారితో పాటుగ సుఖింతురు; ఏలయన ముని పుంగవుడగు భృగుడే మహాసిద్ధి పొందిన ప్రదేశమది; ఆందు మహాత్ము తగు శంకరుడు ఆతనికి సాక్షాత్కరించి తన అవతారము చూ పెను

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున దశాశ్వమేధ తీర్థాదీ మహిమాను వర్ణనమను నూట తొంబది రెండవ అధ్యాయము