మత్స్య మహా పురాణము
విషయశేషము - తారకోపాఖ్యానమునందలి ఉపాసనాం(ఆలోచనీయాం)శములు.
ఈ అధ్యాయములో ముఖ్యముగా తాత్విక విచారణ చేయవలసిన అంశములు మూడు కలవు.
అందు మొదటిది 'విభావరీ' అను దేవతకు సంబంధించిన తత్వము. రెండవది కుమారస్వామి తాత్త్వికరూపము ఏమి? ఈ పౌరాణిక దేవుని వైదిక దేవతారూపము ఏమి? అనునది. మూడవది. శ్రీదేవీ సప్తశతియందలి ఉత్తమ చరితమునకు ఆధిష్ఠాత్రీ దేవతయగు మహాసరస్వతీ (కౌశికీ- కాళీ) దేవీ వృత్తాంత మునకు ఈ అధ్యాయమునందలి గౌరీ వృత్తాంతముతోడి సమన్వయము.
1. శ్రీదేవీ-విభావరి-అనుత్తరతత్త్వము.
శ్రీ దేవీ సప్తశతీ పారాయణమునకు పూర్వాంగముగా 'రాత్రిసూక్త’ పఠనమునకు హేతువు శ్రీమత్స్య మహాపురాణమునందలి (అ. 158) బ్రహ్మ విభావరితో చెప్పిన వచనములను బట్టి స్పష్టముగా తెలియుచున్నది. ఇదియేకాదు; మధు కైటభ తత్త్వము మహిష- శుంభులను విష్ణువు చంపక- వారు దేవి చేతిలో చావవలెననుట. గౌరినుండి ‘కౌశికి' జనించుట మొదలగు అంశములు- శ్రీ దేవీ సప్తశతికి సంబంధించినవి. ఈ శ్రీమత్స్య- మహాపురాణమునుండి తెలియును. .
ఈ మహాపురాణమున (158 ఆ, శ్లో. 47)దేవతలతో బ్రహ్మ-తారకుని గూర్చి 'తైలోక్య దహ నాత్మకః' అనెను; అట్టివానిని చంపుటకు తాత్విక దహనాత్మకుడే కావలయును. అట్టివాడు సాక్షాత్ అగ్ని మూర్తియే యగు కుమారస్వామియే; ఆతని అవతరణమునకు విభావరియు - హేతుభూత కావలయును; ఏలయన ఆమె బ్రహ్మదేవుని పూర్వతనువు (బ్రహ్మదేవుని శరీరపు పూర్వతర రూపము) (చూ. 158 అ; శ్లో. 55]; అనగా అది అవ్య క్తతత్వము; మాయా శబల బ్రహ్మము; కావుననే మాయా శబల బ్రహ్మ రూపయే యగు శ్రీదేవిని వర్ణించు సప్తశతిని పారాయణము చేయుటలో తత్పూర్వాంగముగా రాత్రి సూక్త పారాయణము విహితము. ఏలయన ప్రళయరాత్రి ఆవ్య క్తత త్త్వముతో అభిన్న.
బ్రహ్మ విభావరితో “నిన్ను కొందరు “ఏకా' ‘అనంశా' “ఏకానంశా”నామములతో ఉపాసింతురు." అనెను; (చూ. 158 ఆ; శ్లో. 71); 'ఆనంళా' అనగా-అంశరహిత-ఆవయవర హిత-ఆఖండరూప అనియర్ధ ములు; ‘అనుత్తర'శబ్దమునకును ఇదియే అర్థము; అనుత్తరము' - ఉత్తరము- దీనికంటె గొప్పది. లేనిది (న-విద్యతే-ఉత్తరం-పరతరం. అధికతరం వా-ఆస్మాత్) అనునది ఒక వ్యుత్పత్తి; ఇది అట్లుండు గాక!
వాస్తవమున-ఉత్తరించు- అనగా ఖండించు; ముక్కలుగా చేయు- అని యర్థము; కనుక 'ఉత్తర' శబ్దమునకు ‘ఖండము' ఆవయవము ‘అంశము' అను అర్థములు ఉపపన్నములు; కావున ఓ అను త్తరం” ఆనగా “ అనంశము' 'అఖండము” “అనవయవము' అను అర్థములు ఏర్పడుచున్నవి. ఇట్లు బ్రహ్మ పలికి కినట్లు శ్రీదేవిని‘ఏకా' ఆనంళా'' ఏకానంశా' అనుటయుసరిపోవుచున్నది. మాతృకా పాఠమునందు' అకారము' “అనుత్తరము” “అకారః సర్వవర్ణాగ్ర్యః', 'అక్షరాణామక్రోస్మి' ఇత్యాది ప్రమాణవచనములును కలవు కదా; అకారమునకు అనుత్తరము అని తంత్ర శాస్త్రములందు వ్యవహారము; (చూ. నిత్యాషోడశికార్ణవ సేతుబంధము - ఉపోద్ఘాత ప్రకరణము). భాషాతత్త్వాను సారమును వ్యాకరణ శాస్త్రాను సారమును ఆకార మే స్వరముల మూల రూపము; ఇ-ఉ- అకారపు 'పరిణామములు; కావున 'ఆ' వర్ణముకూడ అనుత్తరము అఖండము - అనవయవము- అనంశము-ఏకము; కావుననే ఇది - శ్రీ దేవీవాచకము ఆనుట సమంజసము.
విభావరీ శబ్దార్థ విచారణము
‘విభావరీ': విభా=విశిష్టా-భా; విశిష్టమగు బుద్ది ప్రతిభాసనము; విభావరీ= ఈదృశీ విభా-విశిష్టం .. బుద్ధిప్రతిభాసనం-వియతే-ఆనయా ఇతి; ఈ రాత్రి తత్వముచే ప్రాణులకు గల ‘విభా’ ‘విశిష్టమగు బుద్ధి ప్రతిభాసనతత్వము' ఆవరింపబడును; లేదా - ‘విభా-వియతే- అస్యాం రాత్ర్యాం ’ - ఈ రాత్రియందు ప్రాణుల బుద్ది ప్రతి భాసనతత్వము కప్పివేయబడును. ఈ విధముగా ‘విభావరీ' శబ్దమునకు 'మహా మాయా” “యోగమాయా” “యోగనిద్రా' అను అర్థము కూడ సముచితమగును; ఏలయన. విసదృశ (విల క్షణ)ప్రతీతి సాధనం-మాయా- అని మాయా శబ్దార్థమును ప్రామాణికులు చెప్పియున్నారు. (చూ. శ్రీదేవీ సప్తశతీ- అధ్యా. 1;శ్లో 2.). 'విభావరీ' శబ్దమునకు 'రాత్రి' అను అర్థమున వ్యుత్పత్తి ఇట్లు చెప్పవచ్చును: ‘విభాతి నక్షత్రాదిభిః' 'నక్షత్రాదులచే విశేషముగా ప్రకాశించును.'; వి( ఉపసర్గభా(ధాతువు) + వన్ (క్వనిఫ్ ప్రత్యయము) >విభావర్ (వనో-ర-చ-పా. 4.1.7 అను సూత్రముచే- న్>ర ) దీనిపై 'ఈ' (జీప్) రాగా ‘విభావరీ'.
పై విధమున విభావరి-రాత్రి-ప్రకాశాత్మకమును- ఆప్రకాశాత్మకమును; రాత్రియందు ప్రాణులకు ప్రపంచము (సరిగా) కనరాదు; విలక్షణముగా ఆవృతమగును; ఇది స్థూలదేహ-స్థూల ప్రపంచ- జాగ్రద్దశా దృష్టితో; ఇది రాత్రికి గల విభావరీత్వము; కాని - ఇచట స్వప్నదశ సూక్ష్మదేహము-సూక్ష్మ ప్రపంచము కలవు; ఇట్లే పరమేశ్వరునకు ప్రళయకాలమే 'విభావరి'; ఇచట - ఈ విభావరికిని ప్రకాశత్వమును ఆప్రకాశత్వమును రెండును కలవు; జాగ్రద్దశ-స్థూల ప్రపంచము వంటిది(సృష్టి ప్రక్రియా ప్రవృత్తి) ఇచట లేదు; కాని స్వప్నదశ వంటిది)కలదు; పర మేశ్వరుడు ఈ కాలమున యోగనిద్రయందుండును; తాను ఇక ముందు మరల చేయవలసిన ప్రపంచసృష్టి విషయమును అప్య క్తరూపమున యేజించుచుండును. ఇది ఆతని యోగనిద్రావస్థ స్వరూపము; ఇది మనవంటి వారి స్వప్నావస్థ వంటిది; అస్మదాదులకు (మనవంటి వారికి) జాగ్రద్దశ యందు స్వప్న దశ లేదు; స్వప్న దశయందు జాగ్రద్దశ లేదు; గాఢ సుషుప్తియందు ఈ రెండును లేవు; మన గాఢసుషుప్తి స్వప్రకాశ జీవచైతన్యము పై తమ తమ సత్త్వకృతమగు) ఆవరణము ఉన్నది; ఈ అవరణము కూడ లేని జాగ్రత్స్వప్న సుషుప్తి రహితదశ తురీయావస్థ; అది స్వప్రకాశాత్మ కము; అట్లే పరమాత్మకును స్థూల ప్రపంచ సృష్టియను జాగ్రద్దశయును సృష్టి విషయక ' భావనాత్మక యోగనిద్రావస్థయు అందే విక్రామాత్మక గాఢసుషుప్యవస్థలు కలవు; అట్లే ఇవి ఏవియులేని స్వ సకాశా వస్థయును కలదు; అని దీనిని బట్టియే స్పష్టము; అదియే సచ్చిదానందత త్వము; ఆదియే నిర్విషయక జ్ఞానము; అది స్వయముగనే చిదా (జ్ఞానా)త్మకమగు స్వయం ప్రకాశతత్త్వము; కావున ఆ జ్ఞానమునందు విషయమగు (గోచరించు) మరియొక వస్తువు ఏదియును ఉండదు. ఇది ‘సాక్షీ - చేతా- కేవలో- నిర్గుణశ్చ' అను శ్రుతిచే చెప్పబడిన పరమాత్మతత్వము.
2. స్కంద (కుమార తత్త్వము)
ఈ పురాణమునందు కుమారక్ష(స్కంద) తత్వనిర్ణయమునకు ఆవలంబనములగు శ్లోకములు (ఆ.. 158)
“క్రతవో మూర్తిమనస్త ముపాసంతేహ్యహర్నిశమ్ ।
కృతాపరాధసంత్రాసం సం(న)త్యజ ని కథంచన॥
తంత్రీలయత్రయో పేతం సిద్దగంధర్వహింన రైః ।
సరాగముపధాతీష్టం గీయతే తస్య వేశ్మసు॥
హంతాకృతోపకరణో మిత్రాంగురులాఘవై ।
శరణాగతసంత్యాగం త్యక్తసత్య పరిశ్రయః॥
ఇతి నిశ్శేష-మథవా నికి శేషం కేన కథ్యతే ।
తస్యా వినయ మాఖ్యాతుం; స్రష్టా తత్ర పరాయణమ్॥”
కుమార దేవుడు అగ్ని మూర్తీ; ఈ యంశమును ఇట్లు నిరూపించవచ్చును.
పరమశివుడు శబ్దార్థోభయాత్మక తత్వము; ఇతడు ధర్మి; శ క్తిరూపయగు పొర్వతి. ఈ శివుని ధర్మాంశము; ఆమె శబ్దాత్మిక; చితిరూప; చీతియనగా నిర్విషయక జ్ఞానము; ఆమెయే సకల చరాచరాత్మక విశ్వసముదాయసృష్టికిని మూలభూత; ‘చితిః స్వతంత్రా విశ్వసిద్ది హేతుః,' (శక్తిసూత్రమ్.); పరాపరాశబ్దాత్మికయగు ఈ మేనుండియే. సకల శబ్ద సృష్టియును.అర్థసృష్టియును; ఈమెయే పరమశివుని శబ్దాత్మకాంశము - సకల విశ్వస్థిత సమగ్ర ఐ క్షత్వమును; అధ్యాత్మ మున పిండాండమున. ఏది వాక్కో- అధి దైవతమున - దేవతగా- అదియే అగ్ని; 'ఆగ్ని రాగ్భూత్వా ముఖం ప్రొవిశత్'- ఆని, శ్రుతి; (ఐతరేయోపనిషత్ 2.4).
అగ్ని కి ఆయుధము శక్తి; కుమారుని ఆయుధమును శ క్తియే; కుమారుని వాహనము మయూరము; దానికి మరి యొక నామము శిఖి'; (శిఖ కలది కావున); ఆగ్ని యు “శిఖి' యే శిఖలు జ్వాలలు -కలవాడు కావున.
కుమారుని జన్మ ప్రకారమును ఆలోచింతము; . శివుని తేజస్సు ( వీర్యము). పార్వతీ గర్భమున ప్రవేశింపలేదు; ఏల యన- ప్రవేశించవలసిన ఆవశ్యకతయే లేదు; పార్వతి స్వయముగనే శబ్దాత్మిక; వాగ్రూప; వాక్-ఆగ్ని యే కదా! అగ్ని ఆ వీర్యమును గ్రహించెను; అనగా పార్వతియే శ క్తియే గ్రహించెను.
ఈ అగ్ని (దేవతాత త్వము) వాగ్రూపమున పరిణమించవలెను. అగ్ని ఆ తేజస్సును గంగలో 'వయి చేను. 'గంగ' ఇచట గంగానది కాదు; వాగ్గళాప్రతీకము; ఎట్లు? గచ్చతి గచ్చతి-ఇతి గంగా; 'నిరంతర గతిశీల' అని అర్థము; ఈ తత్వమే మరియొక నామమున 'నరస్వతీ'; 'సరస్' =సరణమ్; (సృ.గతె.ధాతువు; భావార్థమున 'ఆప్'ప్రత్యయము ); సరస్ (చరణం) నిరంతర గమనం- ప్రాణిషు ఆస్యాః - ఆస్తి ఇతి సర స్వతీ; ప్రాణులయందు నిరంతర ప్రవృత్తి కలది కావున నర స్వతీ; అనగా వాక్కు. భాష; ఇట్లు గంగా సరస్వతీ -శబ్దములు ‘వాక్' అను అర్థ మున సమానార్థకములు; 'గమ్' ధాతువు నుండి నిష్పన్న మగు 'గో' శబ్దము కూడ ‘వాక్కు' అను అర్థమును ఇచ్చును. అనుట గమనించవలయును; ‘నిరం తర గమనశీలము' అనియే ఈ వ్యుత్పత్తిలో కూడ అర్థము.
గంగ ఆ తేజస్సును తన తీరమునందలి 'శరవణము'నందు 'జెల్లు దుబ్బుల అడవి' యందు ఉంచెను; శరః= జలము; జలములు 'కర్మ'లకు ప్రతీకములు; (చూ. ఈ శావాస్యోపనిషత్.శాంకర భాష్యమ్- మంత్ర-4): - యజ్ఞాత్మక ములగు కర్మములనే ఇట గ్రహింపవలేను వాక్కు కూడ : శ్రుతిరూపమయినదే పారమార్థికవా స్తవమగు వాక్కు; ఏలయన లౌకిక ప్రవృత్తిరూప కర్మములును లౌకిక వ్యవహార ప్రయోజక మగు వాక్కును ఉపాసన దృష్టిలో ఉదాత్తతను సంత రించుకొనజాలదు; ఈ శ్రుత్యాత్మకమగు వాక్కునకు పరమ ప్రయోజనము యాగాది శ్రాతకర్మములు.
‘షట్కృత్తికలు' (కృత్తికా నక్షత్రజ్యోతి రధిష్ఠాత్రులగు దేవతలు), ఈ శరవణభవునకు తమ స్తన్యమును ఇచ్చిరి. కృత్తికా నక్షత్రము అగ్ని దేవతాక మే; అనగా జ్యోతిరూపమగు కృత్తిక - దేవతారూపమున అగ్ని దేవుడే; అతనిని స్త్రీరూపమున భావన చేయగా అగు . దేవతావ్యష్టి రూపములే షట్కృత్తికలు; కుమారునికి వారు స్తన్యము ఇచ్చుట 'అగ్ని' స్తన్యమును ఇచ్చుటయే.
కుమారుడు షణ్ముఖుడు; ఆముఖములు ఏవి? ప్రాచీనులు శబ్దములను 1. నామములు 2. ఆఖ్యాతములు . 3. ఉపసర్గలు 4. నిపాతములు అని నాలుగుగా విభజించిరి; 5. అది స్థానకరణ ప్రయత్నములతో ఉచ్చరించబడును. 6. ప్రకృతి ప్రత్యయ విభాగముచే శబ్దతత్వము (శబ్దముల ఆర్థము) తెలియును. కావున ఇవియే ఆ ఆరుముఖములు కావచ్చును.
ఇట్లు 'ఆధిదై వత'మున 'అగ్ని 'యే 'అధ్యాత్మమున' (ప్రాణుల దేహములందు . పిండాండములందు) 'వాగ్' రూపమున ఉన్నాడు. ఈ ‘ఐక్ 'శ్రుతులు మొదలగు ఆర్ష పొగూపమున కర్మకాండోపాసనా కొండ జ్ఞానకాండములను లౌకిక వాగ్రూపము ప్రాణులకు ఆయా జీవన వ్యవహారములను నిర్వర్తించుచున్నది. ఇది ‘ఆగ్ని 'రూపమే.
ఈ అగ్ని యే 'వైశ్వానరుడు'గా ప్రాణుల దేహములందు ' అత్తా' = తినువాడు; తినిన ఆహారమును పచనమంద జేసి దానిచే ప్రాణి జీవనప్రవృత్తికి ఆవశ్యకమగు శ క్తిని . అందజేయు వాడుగా నున్నా డు; 'అహం వైశ్వానరో భూత్వా' ఆను ఇత్యాది గీతావచనమును ఛాందోగ్యోపనిషత్తునందలి వైశ్వానర విద్యయు ఇందులకు ప్రమాణములు, - ఈ ఆగ్ని యే దేవతలకు ముఖము (నోరు)గా ఉండి వారికి హవిస్సులను అందజేయుచున్నాడు. ఇట్లు ఈతడు రెండు విధములుగా యజ్ఞ ప్రవర్తకుడుగా ఉన్నాడు,
ఇంతే కాదు; ఈ అగ్ని కి దక్షునితో సంబంధముకలదు; ఎట్లు? దక్షుడు ఆగ్నీ షోమీయాత్మక (అగ్ని సోముల సమాహార) తత్వము. ఆగ్ని ఇట్లు దక్షుని అంశ మే; దక్షుని కన్యయగు ‘స్వాహా' ఆగ్ని కిపత్ని; అనగా ఆమె ఆగ్ని దేవుని క్ష్మీరూపత త్వము; దకునిమరియొక దుహిత 'అదితి’ ‘యా.ఆత్తి' సొ “అదితిః'; ఏ దేవతాత త్వము తినునో- ఆహారాదిక మును పక్వమొనరించే శక్తి రూపమున పరిణమింపజేయునో అట్టిది 'అదితి' అగ్ని యు లేదా 'అదనం' - 'తీనుటయు ? ఆదితియే.అత్తయే-ఆని చూచితిమి; అతడే దేవతలకుహవిస్సులనంద జేయుచు వారిని పోషించుచున్నాడు. కనుకనే దక్షుని. వుత్తి అదితి; ఆమె సంతానము ప్రాణులకు అమృతత్వమును సంపన్న మొనర్చు దేవతలు; (వీరుఇచ్చు అమృతత్వము పరతత్త్వా పేక్షయా గొప్పది కాక పోవచ్చును. ఐనను మర్త్యత్వము కంటే ఆది గొప్పది.) ఈ యర్థముతోనే శ్రీదేవ్యథర్వ శిర్టోపనిషత్తునందు ఒక ఋక్ ఇట్లున్నది:
“అదితి ర్హ్య జనిష్ట దక్ష యా దుహితా తవ ।
తాం దేవా అన్వజాయంత భద్రా అమృతబంధవః॥
ఈ విధముగ 'అతృరూపుడును వాగ్రూపుడును దేవముఖుడును ఆగు అగ్ని యే కుమారస్వామీ.'
తారకుడు నకల యజ్ఞములను యజ్ఞాంగములను యజ్ఞారాధనీయదేవతలను తనకు వశీభూతులనుగా చేసికొనగా అగ్నితత్వాత్మకుడగు కుమారుడు వాని నుండి వీనిని విడిపించెను. ఈ యర్థమును స్పష్టము చేయు సన్ని వేశము కూడ. జ్యోతిర్వ్యవస్థలో ఉండియుండును.
కుమార దేవుని నామములును - వాని యర్థములును: 1. గుహః-గుహూ సంవవరణే (ధాతువు); కప్పియుంచుట అని వాచ్యార్థము; రక్షించుట అని లక్ష్యార్థము; దీనినుండి క (ఆ) ప్రత్యయము (పాణిని.3-1-135); గుహ్+ఆ > గుహః.
2. కుమారః కుత్సితాన్ మారయతి - దుష్టులను సంహరించువాడు; మరియొక విధముగ-కుం - ఇయర్తి ఇతి కుమారః; భూమిని చేరి - ఆశ్రయించి. యుండుపొడు; ఎట్లు అనగా భూః- భువః - సువః - అను మూడు మహావ్యాహృతులలో, ప్రథమ ప్యాహృతికి ఆధిలోకముగా ఓ ‘ఈలోకము' అనియు.అధి దైవతముగా ‘అగ్ని’ అనియు ఆర్థములు.
అగ్ని కి గల స్థానములలో భూమి ఒకటి; (చూ , మత్స్య - 61 అ.) ఇట్లు భూమి నాశ్రయించియుండు అగ్ని రూపుడే కుమారుడు; మరియొక విధముగా-వాగ్రూపుడగు అగ్ని పిండాండమునందు పృథివీతత్త్వాత్మకమగు (కు అనబడు) పృథివిని ఆశ్రయించియుండును - కావునను . కుం - ఇయర్తి - ఇతి . కుమారః; 3. వాక్కునకు గల ఉత్తమ రూపము ప్రణవము; అది కుమారుని రూపము; కావున అతడు సుబ్రహ్మణ్యుడు.బ్రహ్మకు (వేదము నకు) శోభనత్వమును కలిగించు వాడు; 4. ఈతడు దేవతలకు హవిస్సునందించుచును. శ్రుతి వాగ్రూపమునను. దేవతలకు ముఖము (నోరు)గా నుండును; కావున (దేవ సేనాపతి) సేనానీ.
ఈ కుమారుడు షడ్డిన జాతమాత్రుడై (అనగా సప్త మదినమున) దేవ సేనాపతిత్వము వహించెను. పరాపరా వాగ్రూపమున నుండు కుమారుని వానస్థానము షట్చక్రములకు పైగా నుండు సహస్రార కమలమే కదా!
ఇట్లు కుమారుడు శ్రీదేవ్యభిన్న మగు మహాతత్వము.
3. కౌశికీ-మహాసరస్వతీ- తత్వము.
పార్వతి తన దేహమునందలి కాళిమ(నల్లదనము)ను పోగొట్టుకొనుటకు సంబంధించిన కథ వలన శ్రీదేవీ సప్తశతియందలి కౌశికీ (తృతీయ చరితాధి దేవతయగు మహాసరస్వతీ) వృత్తాంతము స్పష్ట ముగా తెలియుచున్నది.
Summary of chapter 291 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya concludes this supreme Mahāpurāṇa by summarizing its contents, structural divisions, and supreme spiritual benefits. Bhagavān Matsya reveals that hearing, reciting, transcribing, or sharing the fourteen thousand holy verses of the Matsya Purāṇa purifies the human soul from all accumulated sins of mind, speech, and body acquired across thousands of births. The scripture grants health, longevity, righteous progeny, material prosperity, victory over obstacles, and unshakeable devotion to Bhagavān Vishṇu and Mahādeva. Whosoever absorbs this divine discourse with unyielding faith transcends the cycle of birth and death, ascending directly to the supreme, imperishable spiritual realm of Vaikuṇṭha, where they abide in perpetual divine bliss in the presence of Bhagavān Janārdana.