మత్స్య మహా పురాణము
289 - కల్పనామాను కీర్తనము.
మనుః : కల్పమానం త్వయూ ప్రోక్తం మన్వన్తర యుగేషు చ ।
ఇదానీం కల్పనామాని సమాసా త్కథయాచ్యుత॥
శ్రీమత్స్యః : కల్పానుకీ ర్తనం పక్ష్యే సర్వపాపప్రణాశనమ్ ।
యస్యానుకీర్తనా దేవ వేదపుణ్యేన యుజ్యతే॥
ప్రథమం శ్వేతకల్పస్తు ద్వితీయో నీలలోహితః ।
వామదేవ సృతీయస్తు తతో రాథ నరోవరః॥
గౌరవః పఞ్చమః ప్రో క్తష్షష్టో దేవ ఇతిస్మృతః ।
సప్తమోథ బృహత్కల్ప కన్హర్పోష్టమ ఉచ్యతే॥
సద్యోథ నవమః ప్రోక్త ఈశానో దశమ స్స్మృతః ।
తమ ఏకాదశః ప్రోక్త స్తథా సారస్వతః పరః॥
త్రయోదశ ఉదానస్తుగారుడోఽథచతుర్దశః ।
కౌర్మః పఇ్చదశో జేయః పౌర్ణమస్యా మజాయత॥
షోడశో నారసింహస్తు సమానస్తు తత్ప రః ।
ఆగ్నేయోఽష్టాదశ ప్రోక్త స్సోమకల్ప స్తథాపరః॥
మానవో వింశతిః ప్రోక్త స్తత్పుమానితి చాపరః ।
వై కుణ శ్చాపర స్తద్వ లక్ష్మీకల్ప స్తథాపరః॥
చతుర్వింశతిమః ప్రోక్త సావిత్రికల్పసంజ్ఞకః ।
పజ్ఞ్చవింశ స్తతో మోరో వారాహస్తు తత్పరః॥
సప్తవింశో2థ వై రాజో గౌరీకల్ప స్తథాపరః ।
మాహేశ్వర స్తథా ప్రోక్త పురో యత్ర ఘాతితః॥
పితృకల్ప స్తథైవా నే యా కుహూ రహ్మణః స్మృతా ।
ఇత్యేవం బ్రహ్మణో మాస స్సర్వపాతకనాశనః॥
ఆదా వేవహి మాహాత్మ్యం యస్మిన్న స్య విధీయతే ।
తస్య కల్పస్య తన్నామ విహితం బ్రహ్మణా పురా॥
మనువు మత్స్యరూప జనార్ధనుని ఇట్లడిగేను: భగవన్! అచ్యుతా! నీవు నాకు యుగములయు మన్వంతరములయు పరిమాణమును వానితో ఏర్పడు కల్ప పరిమాణమును ప్రవచించితివి; ఇపుడిక సమాస నం జేపరూపమున కల్పముల నామములను చెప్పుము; అనగా శ్రీమత్స్యు డిట్లు చెప్పెను: సరి; నీ వడిగినట్లు కల్ప నామములను అనుకీర్తించినంత మాత్రముననే వేదముల నధ్యయనము చేయుటచే కలుగు పుణ్యమును మానవుడు పొందును.
మొదటిది శ్వేతకల్పము. రెండవది నీలలోహితకల్పము.మూడవది వాసుదేవము నాల్గవది రథంతరము ఐదవది గౌరవము ఆరవది దేవము ఏడవది బృహత్-ఎనిమిదవది కందర్పము తొమ్మిదవది సద్యము పదియవది ఈశానము పదునొకండవది తమము పండ్రెండవది సారస్వతము పదుమూడవది ఉదానము పదునాలుగవది గారుడము పదునై దవది. కౌర్మము; ఇది శుక్లపక్ష పంచదశ తిథియగు పూర్ణిమ యగును; అనగా శ్వేతకల్పము మొదలుగా ఒక్కొక్క కల్పము ప్రతిపత్ మొదలుగా శుక్లపక్షమునందలి పదునై దు తిథులగునని యర్థము.
తరువాత కృష్ణ ప్రతిపత్ మొదలుగా తిథులగు కల్పములు మరి పదునైదు; ఆవి-పదునారవది నారసింహము పదునేడవది సమానము పదునెనిమిదవది ఆగ్నేయము పందొమ్మిదవది సోమము ఇరువదవది మానవము ఇరువది యొకట వది తత్పురుషము ఇరువది రెండవది వైకుంఠము ఇరువది మూడవది లక్ష్మికల్పము ఇరువది నాలుగవది సావిత్రికల్పము ఇరువది ఐదవది ఘోరము ఇరువది ఆరవది వారాహము ఇరువది ఏడవది వై రాజము ఇరువది ఎనిమిదవది గౌరీకల్పము ఇరువది తొమ్మిదవది త్రిపురాసుర సంహారము జరిగిన కాలమగు మహేశ్వరకల్పము ముప్పదవది పితృకల్పము; ఇది బ్రహ్మజీవితమందలి మాసమునందలి తిథులలో కడపటిదగు కుహూరూపమగు అమావాస్య అని బ్రహ్మయే స్వయముగా న్మృతులందు (వేద ప్రమాణములగు శాస్త్రములయందు) చెప్పెను; (చతుర్దశితో ఏ మాత్రమును స్పర్శలేనిదై చంద్రదర్శ నము ఏ మాత్రమును లేని అమావాస్యకు “కుహూ” అని నంజ్ఞ )
ఇట్లు ఈ కల్పముల రూపమున చెప్పినవి బ్రాహ్మమాసము; ఇది వినినను అధ్యయనము చేసినను మహాపాతక నాశమగును.
ఒక్కొక్క కల్పము బ్రహ్మకు ఒక్కొక్క అహోరాత్రము; కావున ఆ ఆహోరాత్రపు పగటియందలి ఆరండ కాలమున- అనగా ఉదయమున. బ్రహ్మదేవుడు లోకనృష్టికి ప్రవృత్తుడగును; అట్టి సృష్ట్యాది ప్రవృత్తియందు ఏ రూపమగు భగవత త్వపు మాహాత్మ్యము(అనగా ఏ రూపమగు భగవదంశ తత్త్వపు ప్రాధాన్యము) ఆ కల్పమునందు ప్రతిపాదింప బడునో ఆ కల్పమునకు ఆ భగవదంశ త త్వపు పేరు పూర్వమందే స్వయంభూ బ్రహ్మచే ఈయబడినది.
సజ్కీర్ణా స్తామనే శ్చైవ రాజసా సాత్వికా స్తథా ।
రజస్తమోమయా స్తద్వ దేతే త్రింశ దుదాహృతాః॥
సజ్కిర్ణేషు సరస్వత్యాఃపితృణాం వ్యుష్టి రుచ్యతే ।
అగ్నే శ్శివస్య మాహాత్మ్యం తమోరూ పేషు వర్ణ్యతే॥
రాజ సేషుచమాహాత్మ్యమధికంబ్రహ్మణస్సృతమ్ ।
యస్మినల్పేతు యత్రోక్తం పురాణం, బ్రహ్మణా పురా॥
తస్య తస్య తు మాహాత్మ్యం తత్స్వరూ పేణ వర్ణ్యతే ।
సాత్వి కేష్వధికం తద్వ ద్విష్ణో ర్మాహాత్మ్య ముచ్యలే॥
తే ష్వేవ యోగసంసిద్ధా గమిష్య ని పరాం గతిమ్ ।
బ్రహ్మం పాద్మ మిమం యస్తు పరే త్పర్వణి పర్వణి॥
తస్య ధర్మే మతిం బ్రహ్మా కరోతి విపులాం శ్రియమ్ ।
యస్తు దద్యా దీమా నృత్వా హైమాన్పర్వణిపర్వణి॥
బ్రహ్మ విష్ణుపురే కల్పం మునిభిః పూజ్యతే దీవి ।
సర్వపాపక్షయకరం కల్పదానం యతో భవేత్॥
మునిరూపాం స్తథా కృత్వా దద్యాత్కల్పా న్విచక్షణః ।
పురాణసంహితా చేయం తవ భూప మందితా॥
సర్వపాపహరా నిత్య మారోగ్యశ్రీఫలప్రదా ।
బ్రహ్మసంవత్సరళ తా దేకాహం శైవ ముచ్యతే॥
శివవర్షశలా దేక నిమేషం వైష్ణవం విదుః ।
యదా న విష్ణు ర్జాగర్తి తదేదం చేష్ట తే జగత్॥
యదా స్వపితి శాస్త్రాత్మా తదా సర్వం ప్రలీయతే ।
సూతః : ఇత్యుక్త్వా సర్వదే వేశో మత్స్యరూపీ జనార్దనః॥
పశ్యతాం సర్వభూతానాం తతైవానర ధీయత ।
వై వస్వతోపి భగవా న్యసృజ ద్వివిధాః ప్రజాః॥
స్వాన్తరం పాలయామాస మారజ్ఞకులవర్ధనః।
యస్య మన్వ నరం చైత దధునా చానువర్తతే॥
పుణ్యం పవిత్ర మేత ద్వః కథితం మత్స్యభాషితమ్ ।
పురాణం సర్వశాస్త్రాణాం యదేత న్మూర్ద్ని సంస్థితమ్॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే కల్పనామానుకీర్తనం నామ
ఏకోననవత్యుత్తర ద్విశతత మోధ్యాయః॥
ఈ ముప్పది కల్పములును తామసములును రాజసములును సాత్విక ములును సంకీర్ణములును (గుణత్రయమునకో గుణద్వయమునకో సాంకర్యము పరస్పర సం మిశ్రణము-కలవియు) అని పలువిధములుగ నున్న వి; వీనిలో గుణత్రయ నంమిశ్రణముగల పురాణములయందు సరస్వతీ మహత్వమో పితరుల మహత్వమో ప్రతిపాదింపబడును; త మోరూప (తమోగుణప్రధాన)ములగు వానియందు అగ్ని శివుల మహత్వమును రజోగుణమయ కల్పములందు బ్రహ్మ మహత్వమును సాత్విక కల్పములందు విష్ణు మాహాత్మ్యమును ప్రధానముగా వర్ణింపబడును. పూర్వము బ్రహ్మ ఏ కల్పమునందు ఏ పురాణమును ప్రవచించెనో ఆ కల్పానుసారమా గుణతత్త్వము ప్రధానముగాగల ఆ దేవుని మాహాత్మ్యమా పురాణమునందు వర్ణింపబడును.
ఆయా కల్పములందు ఉపాసకులు ఆ దేవతల నుపాసించి యోగనంసిద్ధి నంది వరమగతి నందుదురు; బ్రహ్మ ప్రోక్త మగు పొద్మకల్ప వృత్తాంతమును ప్రతిపాదించు ఈ మత్స్య పురాణమును ఎవరు పర్వదినములయందు పఠింతురో వారికి ధర్మమందు స్థిర చిత్తమును విపుల శ్రీని బ్రహ్మ కలిగించును.
ఈ కల్చ ప్రతిమలను- బంగారుతో చేయించి ఆయా పర్వదినములందు. దానము చేయువాడు బ్రహ్మపుర విష్ణు - పురములందు కల్పకాల ముండి అందును ద్యులోకమునందు ముని పూజితుడగును; విషయ వివేకముకల మానవులు ఈ కల్పములను ముని రూపముతో ప్రతిమలుగా రూపొందించి దానమీయ వలెను.
అని పలికి మత్యుడు మనువుతో పురాణోపసంహారవచనము నిట్లు పలికెను. మను రాజా! నీకు నేను చెప్పిన ఈ పురాణ సంహిత సంహిత – మహా రచన- వేదము.) సర్వ పాపహరమును నిరంతరమగు ఆరోగ్యమును శ్రీని ఇచ్చునదియును.
(కల్ప పరిమాణ వరిణామమును వినుము: ) ఇట్టి ముప్పది కల్పములతో ఏర్పడు మాసములు పండేండు ఒక సంవత్సర ముఠాగా ఆట్టి బ్రహ్మ సంవత్సర శతము శివునకొక దినము; శివుని నూరు సంవత్సరములు విష్ణునకొక రెప్ప పాటు; విష్ణుడు మెలకువతో నున్నప్పుడు (కను తెరచినప్పుడు) ఈ జగత్తు ప్రవర్తిల్లును; ఆవిశ్వాత్ముడు శాంతాత్ము డై నిద్రించునపుడు (కను మూయగా) ఇదీయంతయు ప్రలీనమగును; (అని మత్యుడు మనువునకు చెప్పి పురాణమును ముగిం చేను.)
అనుచు సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను.
ఇట్లు పలికి మత్స్య రూపుడును దేవేశుడునగు జనార్ధనుడు. సర్వ భూతములును చూచుచుండగా (సర్వ భూతములును సాక్షులుగా- నర్వ భూతముల అనుభూతియే ప్రమాణముగా) ఆ దేశ మునందే ఆ కాలమునందే అంతర్షితుడయ్యెను.
తరువాత భగవానుడగు వైవస్వతుడను ఈ మనువు వివిధ ప్రజలను సృజించెను; ఆ రవి కులానంద కరుడు తన అక్షరమును తన కాలావధి యందలి విశ్వ ప్రవృత్తిని పాలించేను; ఇపుడు ఆనువర్తితమగుచున్న మన్వంతరము ఆత నీదే; ఋషులారా! మీకు నే జెప్పిన ఈ మత్స్య రూప జనార్ధన భాషితమగు ఈ పురాణ సంహితను వింటిరి కదా? ఇది సర్వ శాస్త్రములకు మూర్ధ (శిరః) స్థానమునందున్నది. (‘సర్వస్య గాత్రస్య శిరః ప్రధానమ్.’ అను న్యాయముననునరించి ఇది సర్వపురాణ ప్రధానము.)
ఇది శ్రీమత్స్య మహా పురాణమున కల్పనామాను కీర్తనమను రెండు వందల ఎనుబది తొమ్మిదవ అధ్యాయము.