మత్స్య మహా పురాణము
290 - పురాణ విషయాను క్రమణిక
సూతః : ఏతద్వః కథితం సర్వం యదు క్తం విశ్వరూపిణా ।
మాత్స్యం పురాణ మఖిలం ధర్మకామార్థసాధనమ్॥
యత్రాదౌ మనుసంవాదో బ్రహ్మాణకథనం తథా ।
సాజ్ఖ్యం శారీరకం తద్వ చ్చతుర్ముఖముఖోద్భవమ్॥
దేవాసురాణా ముత్పత్తి రారుతోత్పత్తి రేవచ ।
మదనద్వాదశీ తద్వ ల్లోకపాలాభిషేచనమ్॥
మన్వ నరాణా ముద్దేశో వైన్యరాజాభివర్ణనమ్ ।
సూర్యవైవస్వతోత్పత్తి ర్బుధస్యాగమనం తథా॥
పితృవంశానుకథనం శ్రాద్ధకల్ప స్తథైవచ ।
పితృతీర్థ ప్రచారశ్చ సోమోత్పత్తి స్తథైవచ॥
కీర్తనంసోమవంశస్య యయాతిచరితం తథా।
కార్తవీర్యస్య మాహాత్మ్యం వృష్ణవంశానుకీర్తనమ్॥
భగుృశాప స్తథా విష్ణోర్దిత్యశాప స్తథైవచ ।
కీర్తనం పురువంశస్య వంశో హతాశన స్తథా॥
పురాణకీర్తనం తద్వ త్రియా యోగ స్తథైవచ ।
వ్రతం నక్షత్రపురుషం మా రణశయనం తథా॥
కృష్ణాష్టమీవ్రతం తద్వ ద్రోహిణీ చన్దసంజ్ఞితమ్ ।
తటాక విధిమాహాత్మ్యం పాదపోత్సవ ఏవచ॥
సౌభాగ్యశయనం తద్వ దగ స్త్రీవ్రత మేవచ ।
తథాన క్షతృతీయాతు రసక ల్యాణినీతథా॥
ఆర్దానన్దకరీ తద్వ ద్ర్వతం సారస్వతం పునః ।
సప్తమీస ప్తకం తద్వ ద్విశోక ద్వాదశీవ్రతమ్॥
ఉపరాగాభి షేకం చ సప్తమిస్నపనం పునః ।
భీమాఖ్యా ద్వాదశీ తద్వ దనజశ యనం తథా॥
అశూన్యశయనం తద్వ తథైవాఙారక వ్రతమ్ ।
మేరుప్రదానం దశ ధా గ్రహశాస్త్రి స్తథైవచ॥
గ్రహస్వరూపకథనం తథా శివచతుర్దశి ।
తథా సర్వఫలత్యాగః సూర్యవారవ్రతం తథా॥
సఔన్యు ద్యాపనం తద్వ ద్విభూతి ద్వాదశీవ్రతమ్ ।
షష్టివ్రతానాం మాహాత్మ్యం తథా స్నానవిధిక్రమః॥
ప్రయాగస్య చ మాహాత్మ్యం భువనస్యతు కీర్తనమ్ ।
ఐలాశ్రమఫలం తద్వ ల్లో కే ద్వీపానుకీర్తనమ్॥
తథా న్తరిక్షచారం చ ధ్రువమాహాత్మ్యమేవచ ।
భువనాని సురేన్హాణాం త్రిపురమౌషణం తథా॥
పితృపిణ్ణదమాహాత్మ్యం మన్వ స్తరవివిర్ణయః ।
వజ్రాజ్ఞస్యచ సమ్భూతి స్తార కోత్పత్తి రేవచ॥
తారకాసుర మాహాత్మ్యం బ్రహ్మ దేవానుకీ ర్తనమ్ ।
పార్వతీసమ్భవ సద్వత్తథా శివతపోవనమ్॥
అనజదేహదాహస్తుర తీశోక స్తథైవచ ।
గౌరీతపోవనం తద్వ ద్విశ్వనాథప్రసాద నమ్॥
పార్వతీ ఋషిసంవాదం తథై వోద్వాహమజ్గళమ్ ।
కుమార స్య తథోత్పత్తిః కుమార విజయ స్తథా॥
తారకస్యవధో ఘోరో నార సింహోపవర్ణనమ్ ।
పద్మోద్భవవిసర్గస్తు తథైవాన్షక ఘాతనమ్॥
వారాణస్యాస్తు మాహాత్మ్యం నర్మదాయా స్తథైవచ ।
ప్రవరానుక్రమ స్తద్వత్పితృగాథానుకీర్తనమ్॥
తథోభయముఖీ నామ దానం కృష్ణాజినస్యచ ।
తత్ర సావిత్యుపాఖ్యానం రాజధర్మ స్తథై వచ॥
యాత్రానిమిత్తకథనం స్వప్నమజ్ఞశ్య కీర్తనమ్ ।
వామనస్య తు మాహాత్మ్యం తథైవాథవరాహజమ్॥
క్షీరోదమథనం తద్వ తాలకూటాభిశాసనమ్ ।
దేవాసుర విమర్దశ్చ వాస్తువిద్యా తథై వచ॥
ప్రతిమలక్షణం తద్వన్మణ్ణవానాంచ లక్షణమ్ ।
ప్రాసాదలక్షణం తద్వ త్పతిష్ణావిధి ముత్తమమ్॥
భవిష్యరాజ్ఞా ముద్దేశో మహాదానానుకీర్తనమ్ ।
కల్పానుకీర్తనం తద్వ ధోస్థానుక్రమణం తథా॥
ఏతత్పవీత మాయుష్య మేత తీర్తివివర్ధనమ్ ।
ఏత త్సర్వగుణో పేత మేత తల్మషనాశనమ్॥
ఏతత్సవిత్రం కల్యాణం మహాపాపహరం శుభమ్ ।
ఏత త్పురాణం పరమం సర్వదోష విఘాతుకమ్॥
అస్మా త్పురాణా త్సుకృతం నరాణామ్ ।
తీర్థావలినా మవగాహనానామ్ ।
సమ స్తధర్మాచరణోద్బవానామ్ ।
సదైవ లాభశ్చ మహాఫలానామ్॥
ఆస్మా త్పురాణాదపి పాద మేకమ్ ।
పరేత్తు యః స్కోపి విముక్తపాపః ।
నారాయణస్యాస్పద మేతి నూనమ్ ।
అనంగవ ద్దీవ్యవపుః సుఖీ స్యాత్,
పురాణ మేత త్సకలం రహస్యమ్ ।
శ్రద్దాన్వితః పుణ్య మిదం శృణోతి ।
సచాశ్వమేధావ భృథ ప్రభావమ్ ।
ఫలం సమాప్నోతి హరప్రసాదాత్॥
మత్య్సరూ పేణ హరిణా కథితం మనవేఒర్ణవే ।
శివం విష్ణుం సమభ్యర్చ్య బ్రహ్మాణం సదివాక రమ్॥
శ్లోకం శ్లోకార్దపాదం వా శ్రద్ధయా యః శృణోతివా ।
శ్రావయే ద్వాపి ధర్మజ్ఞ స్తత్ఫలం శృణుత ద్విజాః॥
బ్రాహ్మణో లభతే విద్యాం క్షత్రియో లభతే మహీమ్ ।
వైశ్యో ధన మవాప్నోతి సుఖం శూద్రస్తు విందతి॥
ఆయుష్మాన్ పువాం శ్చైవ లక్ష్మీవాన్ పాపవర్జితః ।
శ్రుత్వా పురాణ మఖిలం శత్రుభి శ్చాపరాజిత॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదే చతుర్ధశ సాహస్యాం సంహితాయా మేతత్పురా ణానుక్రమణి కాదికథనం నామ నవత్యుత్తరద్విశతతమోధ్యాయః॥
సమాప్త మిదం శ్రీమత్స్యమహపురాణం-స్వస్త్యస్తు॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: విశ్వ రూపుడగు మత్స్య జనార్దనుడు ఏది చెప్పెనో అట్టిదియు ధర్మకో మార్థ నామక పురుషార్ధత్రయ సాధనమునునగు మాత్స్య పురాణమును ఏ మాత్రమును వదలక సర్వమును ఇదిగో మీకు చేప్పితిని; దీని యందు 1. మొదటి అంశము మత్స్యమను నంవాదము; తరువాత వరుసగా, 2. బ్రహ్మాండ సృష్టి ప్రతి పాదనము 3. శారీరక సాంఖ్య తత్వ వివేచనము. 4. బ్రహ్మకు చతుర్ముఖోత్పత్తి. 5. దేవాసురుల ఉత్పత్తి. 6. మారు తోత్పత్తి. 7. మదనద్వాదశీవ్రతము. 8. లోక పాలుర అభి షేచనము. 9. మన్వంతరములను ఉద్దేశించుట (పేర్కొనుట) 10. వైన్య(పృథు)రాజాభివర్ణ నము. 11. సూర్యోత్పత్తి. 12. వైవస్వతోత్ప త్తి. 13. బుధుని సంగమనము. 14. పితృ వంశాను కథనము. 15. శ్రాద్దకల్ప ప్రతిపాదనము. 16. పితృతీర్థ ప్రసం) చారము. 17. సోమోత్ప త్తి. 18. సోమవంశ కీర్తనము. 19. యయాతి చరితము. 20. కార్తవీర్యుని మాహాత్మ్యము (గొప్పదనము) - 21. వృష్టివంశాను. కీర్తనము. 22. విష్ణునకు భృగుద త్తవము. 23. దైత్యులకు భృగుళాపము. 24. పూరువంశ కీర్తనము. 26, ఆగ్ని వంశ వర్ణనము. 26. పురాణ సంఖ్యాను కీర్తనము. 27. క్రియాయోగము. 28. నక్షత్ర పురుషవ్రతము. 29. మార్తాండశ యనవ్రతము. 30. కృష్ణాష్టమీవ్రతము. 31. రోహిణీ చంద్రవ్రతము. 32. తటాక నిర్మాణ విధి మాహాత్మ్యము. 33. పాదపోత్సవము. 34. సౌభాగ్యశయన వ్రతము. 35. ఆగస్య వ్రతము. 36. ఆన నతృతీయావ్రతము. 37. రనక ల్యాణినీ వ్రతము 38. ఆర్గానందతృతీయావ్రతము. 39. సారస్వత వ్రతము. 40. గ్రహణ స్నా నవ్రతము. 41. న ప్తమీ న్న పనవ్రతము. 42. భీమద్వాదశీవ్రతము. 43. ఆనంగశయన వ్రతము. 44. అశూన్యశయనవ్రతము. 45. అంగారకవ్రతము. 46. కల్యాణ స పమీ పభృతి సప్తమీ వ్రతస ప్రకము. 47. విశోక ద్వాదశీవ్రతము. 48. పది విధములగు మేరుపర్వత దానవతము. 49. గ్రహశాంతి. 50. గ్రహస్వరూప కథనము. 51. శివచతుర్దశీవ్రతము. 52. సర్వఫలత్యాగవతము. 53. సూర్యహర వ్రతము. 54. సంక్రాంత్యుద్యాపనవ్రతము. 55. విభూతి ద్వాదశీవ్రతము. 56. షష్టి(30)వ్రత మాహాత్మ్యము. 57.స్నాన విధిక్రమము. 58. ప్రయాగ మాహాత్మ్యము. 59. భువనకోశ వ్యవస్థా వర్ణనము. 60. ఐలాశ్రమ(పురూరవ ఆశ్రమ) ఫల వర్ణనము. 61. ద్వీపాను కీర్తనము. 62. ఆంతరిక్షచార వర్ణనము. 68. ధ్రువ మాహాత్మ్యము. 64. సురేంద్ర భువన వర్ణ నము. 65. త్రిపుర దాహ వృత్తాంతము. 66. పితృపిండదాన మాహాత్మ్యము. 67. మన్వంతరవి నిర్ణయము. 68. వజ్రాంగ నంభవము. 69. తార కోత్పత్తి. 70. తారకాసుర మాహాత్మ్యము. 71. బ్రహ్మదేవాను కీ ర్తనము. 72. పార్వతీ సంభవము. 78. శివతపోవన వర్ణనము. 74. మన్మథ దహనము. 75. రతిశాకము. 76. గౌరీ తపోవన స్థితి వర్ణనము. 77. శివాను గ్రహము. 78. పార్వతీ ఋషి సంవాదము. 79. పార్వతీ కల్యాణము. 80. కుమారోత్పత్తి. 81. కుమార విజయము. 82. తారకవధము. 88. నార సింహావతార వర్ణనము. 84. పాద్మకల్ప సృష్టి వర్ణనము. 85. ఆంధకవధము. 86. వారా ణసీ మాహాత్మ్యము. 87. నర్మదా మాహాత్మ్యము. 88. ప్రవరాను కీ రనము. 89. పితృగాథాను కీర్తనము. 90. ఉభయ ముఖీ గోదానము. 91. కృష్ణాజినదానము. 92. సావిత్ర్యుపాఖ్యానము. 93. రాజధర్మాను. కీర్తనము. 94. యాత్రాకాల నిమిత్తములు. 96. మంగళకర స్వప్నాను .కీర్తనము. 96. వామన మాహాత్మ్యము. 97. వారాహ మాహాత్మ్యము. 98. క్షీరసాగర మథనము. 99. కాలకూట దమనము. 100. దేవాసుర యుద్దము. 101. వాస్తువిద్య. 102. ప్రతిమాలక్షము. 103. మండప లక్షణము. 104. ప్రాసాద లక్షణము. 105. పతిషావిధి. 106. భవిష్య దాజాను కీర్తనము. 107. షోడశ మహాదానాను కీర్తనము. 108. కల్పాను కీర్తనము. 109. గ్రంథానుక్రమణి కథనము. (108 వరకే గ్రంథమందలి ప్రధానాంశములుగా పెద్దలు లెక్కించదలచిరని తోచును.) అను నివి ఈ మత్స్యపురాణమందలి ప్రధాన ప్రతిపాద్య విషయములు.
ఈ మత్స్య మహాపురాణము పవిత్రము ఆయుః ప్రదము యశోవృద్దికరము పవిత్రతరము శుభకరము, మహా పాపహరము శుభస్వరూపము; ఈ పురాణము వలన నరులకు సుకృత(సత్కర్మముల నాచరించినందువలన కలుగు) ఫల ములు లభించును; అనేక తీర్థవంక్తులయందు స్నాన మాడుటచే సమస్త ధర్మముల నాచరించుటచే కలుగు మహాఫలములు నదా లభించును; ఈ పురాణము ఉత్తమము. నర్వదోష విఘాతుకము; ఇది మత్స్యరూపుడగు హరి ఏకార్ణవమందు మనువు నకు చెప్పినట్టిది; (అత్యంతము ప్రాచీనమయినది.) ఈ పురాణమునుండి యొక శ్లోకపాదమునైన పఠించువాడు కూడ సర్వ పాపముక్తుడై నిశ్చయముగ నారాయణ స్థానము నందును; ఆ మన్మథునివలె దివ్యసుందర శ రీరుడై సుఖి యగును.
రహస్య తత్వ ప్రతిపాదకమగు ఈ పుణ్య పురాణమంతయు శ్రద్ధాయుక్తుడయి వినువాడు కూడ హరుని యను . గ్రహము వలన అశ్వమేధయాగ మాచరించి తత్పూర్తిగా అవభృథ మాచరించినవా డందు మహాఫలము నందును.
ద్విజులారా! ధర్మజ్ఞుడు (ధార్మికుడు-ధర్మము నెరిగి యనుష్ఠించువాడు) శివుని విష్ణుని బ్రహ్మను సూర్యుని, ఆర్చించిన తరువాత ప్రతిదినమందును) శ్రద్దాయుక్తుడై ఈ మహాపురాణమునుండి శ్లోక మునో శ్లోకార్థమునో శ్లోకపాదమునోఐన తాను వినునో ఇతరులకు వినిపించునో అట్టివానికి కలుగు ఫలమును వినుడు; బ్రాహ్మణుడు విద్యను క్షత్రియుడు భూమిని వైశ్యుడు ధనమును శూద్రుడు సుఖమును పొందును. ఈ పురాణమంతయు వినినచో ఆయుష్మంతుడును పుత్తవం తుడును లక్ష్మీవంతుడును పాపరహితుడును శత్రువులచే ఆపరాజితుడును నగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున సూత ఋషి సంవాదమున మత్స్యపురాణ ప్రతిపాదిత విషయానుక్రమణియు పురాణ శ్రవణఫల ప్రతిపాదనమునను రెండు వందల తొంబదియవ అధ్యాయము.
శ్రీ మత్స్య మహాపురాణము సర్వమును సమాప్తము.
పుట. పంక్తి తప్పు ఒప్పు
651 34 దగోసౌ దగ్ధోఽసౌ
685 22 వాల్లభ్యేని వాల్లభ్యేన
685 23 పతేర పతేరజ్జ్గ
776 15 కస్సస్తి కస్స్వస్తి
780 28 రవి రవి
8881 13 జై హ్యాపుడు జై హ్మ్యపుడు
1042 11 సూర్య సూర్యసత్య
1042 17 పాదములందు పితరులును హృదయమందు. అని చదువుకొనవలెను.
1109 1 క్రియాయోగ క్రియాయోగ