65 - అక్షయ తృతీయా వ్రతము

ఈశ్వరః : అథానామపి వక్ష్యామి తృతీయాం సర్వకామదామ్

యస్యాం దత్తం హుతం జప్తం సర్వం భవతి చాక్షయమ్  

వైశాఖ శుక్లపక్షేతు తృతీయాయా ముపోషితః

అక్షయం ఫల మాప్నోతి సర్వస్య సుకృతస్యచ

సా తథా బ్రహ్మణో పేతా విశే షేణతు పూజితా

తత్ర దత్తం హుతం జప్తం సర్వ మక్షయ ముచ్యతే

 అక్షయా సన్తతిస్తు స్యా త్తస్యాం సుకృత మక్షయమ్

అక్షయైః పూజ్యతే విష్ణు స్తేన వ్యక్షయా స్మృతా

అక్షతైస్తు నర స్నాతో విష్ణో ర్దత్వా తథాఽక్షతాక్

విప్రేషు దత్వా తానేవ తథాసక్తాం తుసంస్కృతాక్

తదన్న భు జ్మహాభాగ ఫల మక్షయ మశ్ను తే

 ఏకామప్యుక్తవ త్కృత్వా తృతీయాం విధివ న్నరః

ఏతా మనుతృతియాయాం సర్వాసాంతు ఫలం లభేత్

తృతీయాయాం సమభ్యర్చ్య సోపవాసో జనార్దనమ్

రాజసూయఫలం ప్రాప్య గతి మగ్ర్యంచ విన్దతి

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే అక్షయతృతీయా వ్రతకథనం నామ పఞ్చషష్టితమోఽధ్యాయః

ఈశ్వరుడు పార్వతికి ఇట్లు చెప్పెను: సర్వకామప్రదమగు మరియొక తృతీయా వ్రతమును చేప్పెదను. ఈ తృతీయా దినమున చేసిన దానము హోమము జపము ఏదియైనను అక్షయ ఫలప్రద మగును.

వైశాఖ శుక్ల తృతీయాతిథి బ్రహ్మదేవునితో చేరియుండునది. అందుచే విశేషించి పూజ్యమయినది. కనుక ఈనాడు ఉపవసించి ఏ పుణ్యకర్మ మాచరించినను అక్షయఫలము లభించును. ఈ తిథినాడు క్షయము లేని శాశ్వతోపాస కులచే విష్ణువు పూజింపబడును. కావుననే దీనికి అక్షయ తృతీయ యని పేరు. ఈనాడు లక్షతోదకముతో స్నానము చేసి వాటిని విష్ణుని పై ఉంచి అర్చించి వాటిని చక్కగా సంస్కరించి బ్రాహ్మణులకు దానము చేసి వాటి అన్న మునే తినినచో ఈ చెప్పిన ఫలము తప్పక లభించును.

ఇట్లు ఒక వైశాఖ శుక్ల తృతీయనాడే నను మానవుడు యథావిధిగా ఈ చెప్పినట్లు చేసి దాని తరువాత వచ్చు ప్రతి శుక్ల తృతీయయందును పం డ్రెండు మాసముల శుక్ల తృతీయలందును ఉపవసించి విష్ణుని అర్చించినచో రాజసూయ యాగము చేసినంత ఫలమునంది ముక్తి నందును. [అక్షతలు ఆనగా ఏ మాత్రమును విరుగక శ క్తి తరుగక నిలిచి యున్న బియ్యము. అవి వరి ధాన్యమునుండి కాని యవలనుండి కాని గోధుమలనుండి కాని తీసినవి కావచ్చును. ఇట్టి వరి బియ్యముతో కానీ యవల గోధుమల పిండితో కాని సిద్దపరచిన ఆహారము అక్షతాన్న ము. ]

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అక్షయ తృతీయా వ్రత కథనమను ఆరువది ఐదవ అధ్యాయము.