మత్స్య మహా పురాణము
276 - కల్పపాదప(వృక్ష)దాన కథనము
శ్రీమత్స్యః : కల్పపాదవదానాఖ్య మహాదాన మనుత్తమమ్ ।
మహాదానం ప్రవక్ష్యామి మహాపాతకనాశనమ్॥
పుణ్యం దిన మఠాసాద్య తులాపురుష దానవత్ ।
పుణ్యాహవాచనం కృత్వా లో కేశావాహనం తథా॥
ఋత్విజ్మణ్డపసమారభూషణాచ్ఛాదనాదికమ్ ।
కాఞ్చనం కారయే ద్వృక్షం నానాఫలసమన్వితమ్॥
నానావిహగవస్త్రాణి భూషణానిచ కారయేత్ ।
శ క్తితస్త్రీపలాదూర్ధ్వ మాసహస్రా త్ర్పకల్పయేత్॥
ఆర్ధస్త్ పసువర్ణస్య కారయే త్కల్పపాదపమ్ ।
గుడ్బళోపరిష్టాచ్చ సితవస్త్రయుగాన్వితమ్॥
బ్రహ్మ విష్ణుశివో పేతం వణ్చాశాఖం సభాస్కరమ్ ।
కామదేవమధస్తాచ్చ సకళత్రం ప్రకల్పయేత్॥
సన్దానం పూర్వత స్తద్వ తురీయాంశేన కల్పయేత్ ।
మన్గారం దక్షిణే పార్శ్వే శ్రియ సార్ధం మృతోపరి॥
పశ్చిమే పారిజాతంచ సావిత్ర్యై సహ జీర కే ।
సురభీసంయుతం తద్వ త్తలేషు హరిచన్దనమ్॥
తురీయాం శేన కుర్వీత సౌమ్యే చ ఫలసంయుతమ్ ।
కౌశేయవస్త్రసంయుక్తా నిడుమాల్యఫలాన్వితాక్॥
తథాష్ట్రా పూర్ణకల నాదుకాసనభాజనమ్ ।
దీపకోపానహచ్ఛత్ర చామరాసనసంయుతమ్॥
ఫలమాల్యయుతం తద్వ దుపరిష్టా ద్వితానకమ్ ।
తథాష్టాదశ ధాన్యాని సమంతా త్పరికల్పయేత్॥
శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇపుడిక నీకు అను(మహా) త్తమమగు కల్పవృక్ష ప్రదాన మను మహాదానపు విధానమును వివరింతును; వినుము; అది మహాపాతక నాశన మగునది; పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలెనే ఋత్విజులను మండపమును సంభారములను సమకూర్చుకొనవలయును; నానా ఫల సమన్విత మగు బంగరు వృక్షమును ఆందు నానా పడి వస్తాభూషణములను యథాశక్తిగ పలత్రయమునకును వేయి పలములకును నడుమ తూకముగల బంగరుతో చేయించవలయును; మొత్తము తూకములో సగము తూకపు బంగరుతో వృక్షమును చేయించి దానినీ ప్రస్థ మాత్రము గుడము పై తెల్లని వస్త్రద్వయము పై నుంచి మిగిలిన నగములో కొంతతో బ్రహ్మ విష్ణురుద్ర భాస్కరులను వక్షవస్త్ర భూషణాదికమును వృక్షము క్రింద నుండునట్లు కామదేవుని ఆతని పత్నియగు రతిని చేయించవలేను; దీనికి తూర్పున మొత్తము తూకములో నాలుగవ వంతుతో సన్హాన(మను కల్పవృక్ష విశేషమును దక్షిణమున నేతి పై ఆదే నాల్గవ వంతు తూకముతో మందారమను కల్పవృక్ష విశేషమును లక్ష్మీతో కూడను పశ్చిమమున పారిజాత మనెడు కల్పవృక్ష విశేష మును జీరకమునందు సావిత్రితో కూడ అదే నాలుగవ వంతు తూకపు బంగరుతోను ఆడై నాలుగవ వంతు తూకపు బంగరుతో నూవుల పై కామధేనువుతో కూడ ఉత్తర దిశ యందు హరిచందనమను కల్పవృక్ష విశేషమును ఫలములతో కూడను చేయించవలేను; వట్టు వస్త్రములను చెరకు గడలను పూవులను పండ్లను ఎనిమిది హర్ల కలశములను పాదుకలను ఆసన ములను పాత్రలను దీవక ములను పాదరక్షలను ఛత్ర చామరాననములను ఫలపుష్పాద్యలంకృత వితానకమును (మేల్కట్టు - చాందినీని) అష్టాదశ విధ ధాన్యములను సమకూర్చుకొని అన్ని వైపులను ఉంచుకొనవలయును.
హోమాధి వాసనా నేతు స్నా పితో విప్రపుజ్గవైః ।
త్రిః ప్రదక్షిణ మావృత్య మంత్ర మేత దుదీరయేత్॥
నమస్తే కల్పవృక్షాయ చి స్తితార్థప్రదాయినే ।
విశ్వమ్బరాయ దేవాయ నమస్తే విశ్వమూ ర్తయే॥
యస్మా త్వమేవ విశ్వాత్మా బ్రహ్మా స్థాణు ర్దివాకరః ।
మూర్తో ఒమూర్తః పరం బీజ మతః పాహి సనాతనః ॥
త్వమేవామృతసర్వస్వ మనన్తః పురుష్కోవ్యయః ।
సన్హానాద్యై రు పేతోఒస్మా నాహి సంసారసాగరాత్॥
ఏవ మామ్య తం దద్యా ధుర వే కల్పపాదపమ్ ।
చతుర్బ్యశ్చాపి ఋత్విగ్భ్య సన్తనాదీ గ్రకల్పయేత్॥
స్తూయమానో దీవః పృషే పుత్రపౌత్త ప్రపౌత్తకై ।
విమానేనారవన్దేన విష్ణులోకం స గచ్ఛతి॥
దివి కల్పశతం తిషే ద్రౌజరాజో భవేత్తతః ।
నారాయణబలో పేతో నారాయణపరాయణః॥
నారాయణకథాసక్తో నారాయణపురం వ్రజేత్ ।
యో వా పఠేత్సకలకల్పతరుప్రదానం యే వా శృణోతి పురుషోలధన స్మరేద్వా॥
సోపీంద్రలోక మధిగమ్య సహాప్సరోభి ర్మన్వన్తరం వసతి పాపవిముక్త దేహః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే కల్పపాదపప్రదానికో నామ
షట్ సప్తత్యుత్తర ద్విశతతమోధ్యాయః॥
హోమమును ఆధివాననమును ముగిసిన తరువాత విప్ర పుంగవులచే స్నానము చేయించుకొనబడి యజమానుడు కల్పవృక్షాదిక మునకు ఆగ్ను లకు ఆవాహిత దేవతలకు విప్రులకు త్రిః ప్రదక్షిణము చేసి ఈ మంత్రము నుచ్చరించ వలయును;
“చింతి(సంకల్పి)తార్థప్రదాయియగు కల్పవృక్షమునకును విశ్వంభరుడును విశ్వమూ ర్తియునగు దేవునకును తన్మూర్తియగు కల్పవృక్షమునకు నీకును నమ నీవు విశ్వాత్ముడవును బ్రహ్మవు రుద్రుడవు దివాకరుడవు మూ ర్తమగు (రూపముగల) ఆమూర్త(రూపములేని)మగు తత్వములును పరమ బీజరూపుడవును కావున సనాతన రూపా! నన్ను రక్షిం చుము; అమృత సర్వస్వమును అవ్యయుడగు అనంతపురుషుడవును నీవే; సంతానము పారిజాతము మందారము హరిచంద నము ననేడు వృక్ష వి శేషములతో కూడిన నీవు మమ్ము సంసార సాగరమునుండి రక్షించుము.”
ఇట్లు ఆమంత్రించి కల్పవృక్షమును గురున కీయవలయును; నలుగురు ఋత్విజులకును సంతానాది వృక్ష చతుష్టయమును ఈయవలయును; స్వల్ప పరిమాణముతో చేయు నపుడు ఏకాగ్ని విధానముతో హోమము జరిపి ( ఇందు ఋత్విజు లెవరు నుండరు కనుక) అంతయును గురునకే అర్పించవలయును; విత్తశాత్యమును ధన ముండియులేనివాని వలె కొరత) చేయరాదు; ఇంతయయినదేయని యాశ్చర్యపడరాదు; ఈ విధానమున ఈ మహాదానము నర్పించినవాడు సర్వ పాప వినిర్ముక్తుడగును; అశ్వమేధఫలము నందును; అప్సరః సిద్ధ చారణ కింకర పరివృతుడై వారిచే అంతరిక్షమున స్తూయ మానుడై పుత్ర పౌత్ర ప్రపౌత్తులతో కూడి రవిప్రకాశవిమాన మారోహించి విష్ణులోకమున కేగును; తన గోత్రమునందు తన కాదరణీయులగు గడచిన గడువనున్న తరముల మనుజులను తరింపజేయును; స్వర్గమందు నూరు కల్పములుండును; తరువాత చక్రవర్తియే జనించును; నారాయణుని బలగముతో కూడి నారాయణ పరాయణుడై నారాయణ కథాసక్తుడై నారాయణపుర మేగును; ఈ సకల కల్పవృక్ష ప్రదాన ప్రక్రియ నెవరు పఠింతురో వినోదరో అల్పధనులై నందున దీని నాచ రించలేక స్మరించుచునైన నుందురో వారును ఆప్సరసలతో కూడి ఇంద్రలోక మేగి పాపవిముక్త దేహులై మన్వన్తర కాల ముండి సుఖింతురు.
ఇది శ్రీమత్స్య మహా పురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కల్పపాదప ప్రదాన కథనమను రెండు వందల డెబ్బది ఆరవ అధ్యాయము.
Summary of chapter 276 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the procedure for Hiraṇyagarbha-dāna, the second Mahādāna involving a symbolic rebirth through a golden vessel representing the cosmic womb. Bhagavān Matsya describes fashioning a golden vessel equipped with a golden lid, filled with sanctified water, ghee, milk, and precious gems. The donor ceremonially enters the golden vessel, remains seated inside while priests chant Vedic rebirth mantras, and emerges rejuvenated as a spiritually purified person. The golden vessel and associated gifts are presented to the officiating priests, bestowing divine radiance and high spiritual realms.