27 - శర్మిష్ఠా దేవయానీ విరోధకారణము

శౌనక : కృతవిద్యే కచే ప్రాప్తే హృష్ట రూపా దీవౌకసః

కచా దధీత్య తాం విద్యాం కృతార్థా భరతర్షభ

సర్వ ఏవ నమాగమ్య శతక్రతు మథాబ్రువః

కాల స్స్యా ద్విక్రమ స్యాద్య జహి శత్రూ న్పురందర

ఏవ ముక్తస్తు సహితై స్త్రీదశై ర్దేవరా ట్తదా

తథేత్యుక్త స్సునం క్రుద్ధ స్సోఽపశ్య ద్విజనే స్త్రీయః

క్రీడన్తీనాం తు కన్యానాం వనే చైత్రరథోపమే

వాయుభూత స్స వస్త్రాణి సర్వాణ్యేవా హ్యమిశ్ర యత్

తతో జలా త్సముత్పే తు స్తాః కన్యా స్సహితా స్తదా

వస్త్రాణి జగృహు స్స్వాని యథా నాన్య దనేక శ

తత్ర వాసో దేవయాన్యా శ్శర్మిష్ఠా జగృహే తదా

వ్యతిక్రమ మజానన్తీ దుహితా వృషపర్వణః

తత స్తయో ర్మిథ స్స్తత్ర విరోధ సమజాయత

దేవయాన్యాశ్చ రాజేన్ద్ర శర్మిష్ఠాయాశ్చ తత్కృతే

దేవయానీ: యస్మా ద్గృహ్ణాసి మే వస్త్రం శిష్యా భూత్వా మమాసురి

సముదాచార హీనాయా న తే శ్రేయో భవిష్యతి

శర్మిష్ఠా : ఆసీనం చ శయానం చ పితా తే పితరం మమ

 స్తౌతి పృచ్ఛతి చాభీక్ష్ణం నీచస్థ స్సువినీతవత్

యాచత స్త్వం చ దుహితా స్తువతః ప్రతి గృష్ణతః

సుతాహం స్తూయమానస్య దదతో న తు గృహ్లాతః

అనాయుధా సాయుధాయాం కిం త్వం కుప్యసి భిక్షుకి

లక్షణం ప్రతియోద్దారం న చ త్వాం గణయా మ్యహమ్

శౌనక:  : సవిస్మయాం దేవయానీం నతాo సక్తాం చ వాససి

శర్మిష్ఠా ప్రాక్షిప త్కూ పే తత స్స్వపుర మావజత్

హతేయ మితి విజ్ఞాయ శర్మిష్ఠా పాపనిశ్చయా

అసంప్రేక్ష్య గతా తస్మా త్క్రోధ వేగపరాయణా

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను:- కచుడు శుక్రుని వలన విద్యను - సంపాదించికొని రాగా దేవతలు మిగుల సంతోషించి ఆ విద్యను కచునినుండి అధ్యయనము చేసి కృతారు లయిరి.. తరువాత వారు ' అందరును ఇంద్రుని కడకు పోయి-ఇది మనము విక్రమము చూపదగిన సమయము. శత్రువులను చంపుదము. అనిరి. వారి మాటను వినుచునే క్రోధముతో చూచిన ఇంద్రునకు విజన ప్రదేశమున కుబేరుని చైత్రరథమువంటి వనమున జలమున క్రీడించుచున్న రాక్షస కన్యలు కనబడిరి. అతడు వాయువుగా, నయి వారి. వస్త్రములను అన్ని టిని కలిపివేసెను. కొంత సేపటికి నీటినుండి పైకి వచ్చిన ఆ కన్యలు అందరును చాల వరకు ఒకరిది "మరియొక రికి రాకుండునట్లు వస్త్రములను తీసికొని ధరించిరి. వారిలో "వృషపర్వుని కూతురు శర్మిష్ట వస్త్రముల మార్పిడి, గుర్తించలేక తాను, దేవయాని వస్త్రమును తీసికొని ధరిం చెను. అంతట దాని నిమిత్త్రమై శర్మిష్ణా దేవయానులకు విరోధము ఏర్పడెను. -

దేవయాని: “నీవు రాక్షస కన్యవు నాకు. శిష్యురాలవు 'ఐయుండి, నా వస్త్రమును ధరించితివి,. కనుక, నీకు శ్రేయస్సు కలుగకుండు గాక!”

శర్మిష్ఠ: మా నాయన ఉన్నత స్థానమున కూర్చున్నప్పుడును పండుకొన్న ప్పుడును ఆయనను మీ నాయన తాను క్రింద నిలువబడి మాటికిమాటికీ వినీతుడై స్తుతించుచు యాచించుచు ఉండును. నీవు పొగ డెడి.అడుగుకొనేది.దాని కూతురవు. నేనో. పొగడబ డెడి యాచింపబడెడివానీ కూతుర ను. - నీవు నిరాయుధవు. నేను సాయుధను. బిచ్చగ తెవు నీవు నా పై ఏమి కోపింతువు? నీకు సాటియగు ప్రతియోధ (ఎదిరించి యుద్ధము చేయువాడు) లభించును లెమ్ము. నేను మాత్రము నిన్ను నొ సరిదానిగా లెక్కింపను.".

జరిగిన దానికి ఆశ్చర్యపడుచు దేవయాని వంగి తన వస్త్రమున కై పట్టుదలతో నుండెను. ఆమెను బావిలో త్రోసి శర్మిష్ణ తన పురమునకు పోయెను. పాప సంకల్పము గలదియే ఆ శర్మిష దేవయాని మరణించియుండునని తలంచుచు క్రోధవేగవశురాలయి తిరిగియైన చూడక అక్కడినుండి వెడలిపోయెను.

చేతవ్యం దేశ మభ్య గా ద్యయాతి ర్నహుషాత్మజః

శ్రాన్తయుగ్యః శ్రాన్తహయో మృగలిప్సుః పిపాసితః

నాహుషిః పేక్షమాణోఽథ సనిపానే గతోద కే

దదర్శ కన్యాం తాం తత్ర దీప్తా మగ్ని శిఖా మివ

తా మపృచ్ఛ త్స తత్రైవ కన్యా మమరవర్ణీనీమ్

సా న్త్వయిత్వా నరశ్రేష్ఠ సామ్నా పరమవల్గునా

కా త్వం చారుముఖీ శ్యామా సుమృష్టమణికుడ్డలా

దీప్తా ధ్యాయసి చాత్యర్థం కస్మా చ్ఛోచని చాతురా

కథం చ పతితా హ్యస్మి న్కూ పే వీరు త్తృణావృతే

దుహితా చైవ కస్య త్వం వద సర్వం సుమధ్యమే

దేవయానీ : యోఽసౌ దేవై ర్హతా న్దైత్యా నుత్థాపయతి విద్యయా

తస్య శుక్రస్య కన్యాఽహం స మాంనూనం న మన్యతే

ఏష మే దక్షిణో రాజ న్పాణి స్తామనఖాజ్గుళిః

నముద్దర గృహీత్వా మాం కులీన స్త్వం హి మే మతః

జానామి త్వాం చ శంసన్తి వీర్యవన్తం యశస్వినమ్

తస్మా నాం పతితాం కూపా దస్మా దుద్దర్తు మర్హసి

శౌనక: తా మథ బ్రాహ్మణీం స్త్రీంచ విజ్ఞాయ నహుషాత్మజః

గృహీత్వా దక్షిణే పాణా వుజ్జహార తత్కోఽవటాత్

ఉద్ధృత్య చే నాం తరసా తస్మా తూపా న్న రాధిపః

ఆమన్త్రయిత్వా సు శోణీం యయాతి స్స్వపురం యయౌ  

అంతలో నహుష పుత్రుడగు యయాతి వేటకై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు మృగముల వెంటనంటిపోగా పోగా అతని రథపు గుర్రములును తానును అలసిపోయెను. దప్పిగొనెను. అతడు నీటికై వెదకుచు దగ్గరలో నీటితొట్టి ఉండియు నీరులేని గోతిలో ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలవలె ఉన్న కన్యను దేవయానిని చూచెను. ఆ నర శేష్టుడు మహా మనోహరమగుమాటలతో ఆమెను ఓదార్చుచు దేవక న్యవంటి ఆ దేవయానిని ఇట్లు ప్రశ్నించేను: “మనోహరముఖము చక్కని దేహచ్ఛాయ చక్కగా మెరుగు దీర్చిన మణికుండలములు కలిగి ప్రకాశించుచున్న నీవు ఎవరవు? ఏల చింతించుచు ఆతురురాలవయి శోకించుచున్నావు? తీగలతో గడ్డితో కప్పబడి ఉన్న ఈ గోతిలో ఎట్లు పడితివి? నీవు ఎవ్వరి కూతురవు? అంతయు నాకు విశదముగా చెప్పుము."

దేవయాని: “యుద్దమున మరణించిన దానవులను తన విద్యతో బ్రతికించెడి శుక్రుని ఎరుగుదువు కదా! నే నాతని కూతురను. కాని ఆయన నన్ను లెక్క పెట్టుచున్నట్లు లేదు. నీవు ఉన్నత వంశమున జన్మించినవాడవని నాకు తెలియును. నీవు వీర్యవంతుడవును యశోవంతుడవును అని అందరును నిన్ను గురించి చెప్పుచున్నారు. కావున నీవు నన్ను అంటినను దోషము లేదు. ఇదుగో! ఎర్రని గోళ్లును వ్రేళ్లును కలిగి ప్రకాశించు నా కుడి చేయి. దీనిని గ్రహించి బావిలోనుండి నన్ను పైకి తీయుము.”

- యయాతి ఆమె బ్రాహ్మణ స్త్రీయని ఎరిగి ఆమె కుడి చేతిని పట్టి ఆ గోతినుండి ఆమెను పైకి తీసెను. తరువాత ఆమె దగ్గర సెలవు తీసికొని అతడు తన పురమునకు పోయేను.

దేవయానీ : త్వరితం చూర్ణి కే గచ్ఛ సర్వ మాచ క్ష్వ మే పితుః

"నేదానీం తు ప్రవేక్ష్యామి నగరం వృషపర్వణః

శౌనకః : సా త్వపి త్వరితం గత్వా చూర్ణికాఽసుర మన్దరమ్

దృష్ట్వా కావ్య ము వాచేదం కమ్పమానా విచేతనా

ఆచచక్షే మహాభాగా దేవయానీ వనే హతా

శర్మిష్ఠయా మహాప్రాజ్ఞ దుహిత్రా వృషపర్వణః

శ్రుత్వా దుహితరం కావ్య స్తదా శర్మిష్ఠయా హతామ్

త్వరయా ! నిర్యయౌ దుఃఖా న్మార్గమాణశ్చ తాం వనే

బాహుభ్యాం సమ్పరిష్వజ్య దుఃఖితో వాక్య మబ్రవీత్

ఆత్మదో షై ర్ని యచ్ఛ న్తి సర్వే దుఃఖం సుఖం జనాః

మన్యే దుశ్చరితం తేఽస్తిత స్యేయం నిష్కృతిః కృతా

దేవయానీ: నిష్కృతి ర్వాఽస్తు మా వాఽస్తు శృణుష్వావహితో మమ

శర్మిష్ఠయా య దుక్తాఽస్మి దుహితా వృషపర్వణః

సత్యం కిలోతి చ ప్రాహ హీనా చాస్మిన బాధికా

సుతాఽహం స్తూయమానస్య దదతోఽప్రతిగృహ్ణతః

ఇతి మా మాహ శర్మిష్ఠా దుహితా వృషపర్వణః

క్రోధసంర క్తానయనా దర్పపూర్ణాననా తతః

యద్యహం స్తువత స్తాత దుహితా ప్రతిగృహ్ణతః

ప్రసాదయి ష్యే శర్మిష్ఠా మిత్యుక్త శ్చాబ్రవీ త్పితా

శుక్రః స్తువతో దుహితా న త్వం భద్రే న ప్రతిగృహ్ణతః

అత స్త్వం స్తూయమానస్య దుహితా దేవయాన్యసి

వృషపర్వైవ తద్వేద శకో రాజా చ నాహుషః

అచిన్త్యం బ్రహ్మ నిర్ద్వన్ద్వ మైశ్వరం హి బలం మమ

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్యమనుసందా న్తర్గత శౌనకశతానీక సంవాదే చన్ద్రవంశానువల్లనే యయాతిచరితే దేవయానీ శర్మిష్ఠావిరోధాదికథనం నామ సప్తవింశతిత మోఽధ్యాయః

తరువాత ఆ దేవయాని చూర్ణిక యను తన చేలిని చూచి నేను ఇక వృషపర్వుని పురము ప్రవేశించను. ఈ విషయ మును నీవు పోయి మా తండ్రికి చెప్పుము అనెను. చూర్ణికయును త్వరితముగా పోయి వృషపర్వుని భవనమున శుక్రుని దర్శించి తెలివి తప్పి వణకుచు “ఓ మహాజ్ఞా: మహాభాగురాలగు దేవయానిని వృషపర్వుని కూతురగు శర్మిష్ణ కొట్టినది.” అని చెప్పెను. అది విని శుక్రుడు దుఃఖముతో ఆమెను వెదకుచు ఆడవికి పోయెను. అడవిలో ఆమె కనపడ గానే అత డా మెను కౌగిలించుకొని దుఃఖముతో ఇట్లు పలికెను: “ఎల్ల ప్రాణులును తమ దోషముల (కర్మముల) ఫలముగానే దుఃఖ మునుగాని సుఖమునుగాని పొందుచుందురు. నీవు ఏదో దుష్కర్మమును చేసియుందువు. దానికి ఇది ప్రాయశ్చిత్త్రము ఐయుండును.” అనగా “ఇది ప్రాయశ్చిత్త్రము కావచ్చును. కాక పోవచ్చును. నా మాట సావధానముగా వినుడు. వృష పరు ని కూతురు శర్మిష్ట నేను తనకంటే హీనురాలనే కాని అధికురాలను కాదు అనినది. ఈ మాట నిజమే ఆగునా? ఆమె తన కన్ను లను క్రోధముతో మిగుల ఎర్ర జేసి తీక్షముగను పరుషముగను మాట లాడినది. నీవు స్తుతించుచు యాచించుచు దాన ములు అందుకొనెడి వాని కూతురవు. నేను స్తోత్రములు అందుకొనుచు యాచింపబడుచు దానములు పట్టక ఉం డేడి వాని కూతురను. ఆని శర్మిష్ట నన్ను తూలనాడినది. ఈ మాటలు పలుకునప్పుడు ఆమె మొగము ఎంత దర్పముతో నిండి యున్న దనుకొనుచున్నావు! నేను నిజముగ స్తుతించుచు యాచించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతుర నేమో నీవే చెప్పుము. అట్లయినచో నే నా మేను వేడికొని అనుగ్రహింపజేసికొందును." ఆని దేవయాని పలికెను. అది విని శుక్రుడు "ఇట్లనెను: “ప్రీయపు తీ! నీవు స్తుతించుచు దానములు ప్రతిగ్రహించుచు ఉండువాని కూతురవు కావు. స్తుతింప బడువాని కూతురగు దేవయానివి నీవు. ఈ విషయము వృషపర్వునికే తెలియును. ఇందునకును తెలియును. యయాతి కిని తెలియును. ఊహింప అలవికానిదియు ఉత్పత్తి నాశములు ఆనేడి ద్వంద్వము లేక నిత్యమును ఈశ్వర సంబంధియు నగు బ్రహ్మము (వేదము) నాకు గల బలము."

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను వర్ణనమున యయాతి చరితమున శర్మిష్ఠి దేవయానీ విరోధాది కథనము అను ఇరువది ఏడవ అధ్యాయము.