98 - విభూతి ద్వాదశీ వ్రతము

నన్దికేశ్వరః : అథాన్యదపి వక్ష్యామి విష్ణో ర్ర్వత మనుత్తమమ్

విభూతిద్వాదశీ నామ సర్వామర నమస్కృతా

 కార్తి కే చైత్రవై శాఖే మార్గశీర్ఘథ ఫాల్గునే

ఆషాఢచ దశమ్యాంతు శుక్లాయాం లఘుభు జరః

 కృత్వా సాయ స్తనీం సన్ద్యాం గృహ్ణీయా న్ని యమం నరః

ఏకాదశ్యాం నిరాహార స్సమభ్యర్చ్య జనార్ధనమ్

 ద్వాడ శ్యాం ద్విజసంయుక్తః కరిష్యే భోజనం విభో

 తవ విఘ్నం మమైవాస్తు సఫలం మధుసూదన

నమో నారాయణాయేతి వాచ్యంచ స్వపతా నిశి

 తతః ప్రభాత ఉత్థాయ కృతస్నానజప(గాయత్య్రష్టశతంజపేత్) శ్శుచిః

పూజయే త్పుణ్ణరీకాక్షం గడ్గమాల్యానులేపనైః

విభూతయే నమః పాదౌ విశోకాయచ జానునీ

 నమ శ్శివాయేత్యూరూచ విశ్వమూ ర్తే నమః కటిమ్

 కన్జరాయ నమో మేడ మాదిత్యాయ నమః కరౌ

దామోదరాయేత్యుదర మాదిదేవాయచ స్తనౌ

మాధవాయే త్యురో విష్ణోః కణం వైకునే నమః

 శ్రీధరాయ ముఖం కేశా నేశవాయేతి నారద

పృష్ఠం శార్జధరాయేతి శ్రవణే ధనదాయ వై

 స్వనామ్నా శ జ్ఞచ క్రాసిగదాజలజపాణయే

 శిర స్సర్వాత్మనే బ్రహ్మ న్నమ ఇత్యభిపూజయేత్

 మత్స్య ముత్పలసంయుక్తం ప్రామం కృత్వాతు శ క్తితః

 ఉదకుమ్బసమాయుక్త మగ్రత స్థాపయే ద్విభోః

 గుడపాత్రం తిలై ర్యు క్తం పీతవస్త్రాభి వేష్టితమ్

కృత్వా జాగరణం కుర్యా దితిహాసక దినా

 ప్రభా తాయాంతు శర్వర్యాం బ్రాహ్మణాయ కుటుమ్బినే

 సక్చానోత్పలం దేవం సోదకుమ్భం నివేదయేత్

యథా న ముచ్య సే విష్ణో సదా సర్వవిభూతిభిః

తథా మాముద్దరా శేషదుఃఖసంసార కర్ణ మాత్

 దశావతార రూపాణి ప్రతిమాసం క్రమా న్మునే

దత్తాత్రేయం తథా వ్యాస ముత్పలేన సమన్వితమ్

దద్యా దేవం సమా యావ త్పాషణ్డా నభివర్జయేత్

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పసాగెను: సర్వోత్తమమగు విష్ణుదేవతాక వ్రతమును మరియొక దానిని చేప్పెదను. విభూతి ద్వాదశీ వ్రతమనునది సర్వామరుల ప్రశంసలనందుకొనునది. చైత్ర వైశాఖాషాఢ కార్తీక మార్గశీర్చ ఫాల్గున మాసములలో దేనియందై న శుక్ల దశమినాడు లఘు భోజనము చేసి ఆనాటి సాయం సంధ్యావందనమయిన తరువాత "నేను రేపు ఏకాదశినాడు నిరాహారుడనై జనార్ధ సుని అభ్యర్చించి ద్వాదశినాడు ద్విజులతో కూడి భుజింతును. సో ఈ వ్రతము నిర్విఘ్న మును సఫలమును అగుగాక! మధుసూదనా!” అని సంకల్పించి నియమము పూనవలెను. రాత్రి నిద్రించునపుడును 'నమో నారాయణాయ' అని ధ్యానించుచుండవలెను.

ఏకాదశినాటి ఉదయమున మేల్కాంచి స్నాన జపములు చేసి శుచియై గంధమాల్యాను లేపనములలో పుండరీ కాక్షునీ పూ జీంచవలేను.

 పూజా మంత్రములు: 1. వీభూత యేనమః-పాదౌ పూజయామి; 2. విశోకాయనమః జానునీ పూజయామి; 3. శివాయనమః ఊరూ పూజయామి; 4. విశ్వమూర్తయేనమః కటిం పూజయామి; 6. కందరాయనమః-మేడం పూజ యామి; 6. ఆదిత్యాయనమః -కరౌ పూజయామి; 7. దామోదరాయనమః ఉదరం పూజయామి; 8. ఆదిదేవాయనమః స్తనౌ పూజయామీ: 9. మాధవాయ నమః – ఉరః పూజయామి; 10. వైకుంఠినే నమః కంఠం పూజయామి; 11. శ్రీధరాయ నమముఖం పూజయామి; 12. ధనదాయ నమః- శ్రవణే పూజయామి; 18. సర్వాత్మనే నమః శిరః పూజయామి; 14. కేశ వాయ నమః - కేశాన్ పూజయామి; 15. శార్జధరాయ నమః - పృష్ఠం పూజయామి; 16. శంఖచక్రగదా జలజపాణయే బ్రహ్మణే నమః అని పూజించవలయును.

బంగారుతో కలువపూవును మత్స్యమును చేయించి అవియును.పానితోపాటు ఊదకుంభమును-పాత్రయందు. నూవులును బెల్లమును నింపి పచ్చని వస్త్రముతో దానిని కప్పి అదియు స్వామి ముందు చవలేను. ఇతిహాస కథాది శ్రవ ణముతో జాగరణము చేసి ఆ రాత్రి గడుపవలేను. ద్వాదశినాటి ఉదయమున కుటుంబియగు బ్రాహ్మణునకు కలువపూవును మత్స్యమును ఉద కుంభమును గుడతలపాత్రమును దానము చేయవలెను. దాన ప్రార్థనామంత్రము : “విష్ణో! సర్వ విభూతి యుక్తుడవగు నీవు అశేష దుఃఖ సంసార పంకమునుండి నన్ను దరించుము.” ఇబై సంవత్సరముపాటు మత్స్యాది దశావ తార ప్రతిమలను దత్తాత్రేయ  వ్యాసాదుల ప్రతిమలను కలువపూవును బంగారుతో చేయించి ఇచ్చుచుండవలెను. ఈ కాలమునందు పాషండుల(వేద నిందకులతో సంబంధమును ఏ మాత్రము పెట్టుకొనరాదు.

సమా వైవం యథాశ క్త్యా ద్వాదశ ద్వాదశీ ర్నరః

 సంవత్సరాంతే లవణపర్వతేన సమన్వితామ్

శయ్యాం దద్యా న్ముని శ్రేష్ఠ గురవే ధేసుసంయుతామ్

 గ్రామంచ శ క్తిమాన్షద్యా క్షేత్రంచ భవనాన్వితమ్

గురుం సమ్పూజ్య విధివ ద్వస్త్రాలఙ్కారభూషణే

 అన్యానపి యథాశక్త్యా భోజయిత్వా ద్విజోత్తమాక్

 తర్పయే ద్వ గోదానై రత్నా దిధన సఞ్చయైః

 అల్పవితో యథాశ క్త్యా స్తోకం స్లోకం సమాచరేత్

 యశ్చా వ్యత్వ నిస్స్వ స్యా ద్భక్తిమా న్మాధవంప్రతి

 పుష్పార్చనవిధానేన స కుర్యా ద్వత్సరత్రయమ్

 అనేన విధినా యస్తు విభూతిద్వాదశీవ్రతమ్

 కుర్యా తాపవినిర్ముక్తః పితృణాం తారయే చ్ఛతమ్

జన్మనాం శతసాహసం సఏవ ఫలభా గ్భవేత్

న వా వ్యాధి ర్భవే తస్య న దారిద్ర్యం న బన్దనమ్

 వైష్ణవో వాథ శైవ్ వా భవే జన్మని జన్మని

 యావ ద్యుగ సహస్రాణాం శత మష్టోత్తరం భవేత్

తావ త్స్వర్గే వసే ద్భ్రహ్మ న్భూపతిశ్చ పున ర్భవేత్

ఇట్లు యథాశ క్తిగా పండ్రెండు ద్వాదశులను గడపి సంవత్సరాంతమున గురుని వస్త్రాలం కొర భూషణములతో పూజించి లవణ పర్వతమును శయ్యను పొడియావును గ్రామమును పొలమును భవనమును శ క్తిని బట్టి) ఈయవలెను. ఇతర బ్రాహ్మణులను కూడ యథాశక్తి భుజింపజేసి వస్త్ర గోరత్నధనాదిక దానములచే సంతోషపరచవలేను. శ క్తిలేని వాడు అల్పముగను ఈయవచ్చును. మరియు ఆల్పధనుడు పుష్పార్చన ఏధానముతో మూడు సంవత్సరములు మాధవుని ఇట్లర్చించవచ్చును.

దీని నాచరించుటచే తాను తరించి పొసిర్ముకుడై నూర్గురను పితరులను కూడ తరింపజేయును. ఈ ఫలము అతనికి నూర్ల-వేల జన్మములవరకు వెంట నుండును. అతనికి వ్యాధులు దారిద్ర్యము బంధనము కలుగవు. ఆతడు శైవు డై నను వైష్ణవుడై నను దీని ఫలముగ నూట ఎనిమిది వేల యుగములపాటు స్వర్గమున వసించి కల్పాంతానంతర సృష్టిలో భూపతిగా జన్మించును.

పుష్పవాహనోపాఖ్యానమ్ - పుష్పవాహనోపాఖ్యానము

పురా రాథ న్తరే కల్పే రాజాసీ త్పుషవాహనః

 నామ్నా లో కేషు విఖ్యాత స్తేజసా సూర్యసన్నిభః

 తపసా తస్య తుషేన చతుర్వక్త్రేణ నారద

 కమలం కాఞ్చనం దత్తం యథా కామగమం మునే

 లో కై స్సమ సై ర్నగరవాసిభి స్సహితో నృపః

 ద్వీపాని సుర లో కాంశ్చ యథేష్టం వ్యచర త్సదా

 కల్పాదౌ సప్తమే ద్వీపే తస్య పుష్కరవాసినా

 లో కేన పూజితం యస్మా త్పుష్కర ద్వీప ముచ్యతే

 తదేవ బ్రహ్మణా దత్తం యాన మస్య యతోమ్బుజమ్

 పుష్పవాహన మిత్యాహు స్తస్మా తం దేవదానవాః

 న సామ్య మస్యా స్త్రీ జగత్తయేపి  బహ్మామ్బజస్థస్యలు తస్య రాజ్ఞః

తపోనుభావా దధ తస్య పత్నీ నారీసహసైరభివన్ద్యమానా

 నామ్నా చ లావణ్యవతీ బభూవ సా పార్వతీ వేష్టతమా భవస్య

తస్యా స్సుతానా మయుతం బభూవ ధర్మాత్మనా మగ్ర్యధనుర్ధ రాణామ్

 తథాత్మజాం స్తానథ వీక్ష్య రాజా ముహుర్ముహుర్విస్మయ మాససాద

సో భ్యాగతం వీక్ష్య మునిప్రవీరం ప్రచేతసం వాక్య మిదం బభా షే

 పుష్పవాహనః: కస్మా ద్విభూతి రచలామరమర్త్యపూజ్యా జాయాచ రూపవిజితామరనున్దరీయమ్

భార్యా మమాల్పతపసా పరితోషితేన దత్తా తథామ్బుజగృహం మునివర్యద త్తమ్ 

యస్మాత్పవిష్టమపి కోటీశతం నృపాణాం సామాత్యకుజ్ఞురరథాఘ

జనావృతానామ్

నో లక్యతే క్వ గత మమ్బరమధ్య ఇక్టు స్తారాగజై రివ వృతః పరిత స్ఫుర ద్భిః

 తస్మా తిమన్య జననీ జఠరోద్బవేన ధర్మాదికం కృత మ శేషఫలా ప్తి హేతు

స్వామి న్మయాథ తనయై రథవా నయాపి మద్భార్యయా తదఖిలం కథయ ప్రచేతః

పూర్వము రాథంతర కల్పమున రవితేజస్కుడగు పుష్పవాహనుడను రాజుండెను. అతడు తపముచే బ్రహ్మను మెప్పించి కామగమనముగల కాంచన కమలమును సంపాదించి తన నగర వాసి జనముతోకూడ సమస్త ద్వీపములందును సురలోకమునందును సంచరించుచుండెను. అతడు కల్పాదియందు ద్వీపములలో ఏడవదియగు పుష్కర ద్వీపమున వసించుచుండెడివాడు. బ్రహ్మ అతని కిచ్చిన పుష్కరము(పద్మము) ఆదీయే. దీనిచే అతని దేవదానవాదులు పుష్పవాహను కనిరి. నా డా రాజునకు సాటి ఎవరును లేరు. అతని తపోనుభావ మట్టిది. ఆతని పత్ని నారీసహస్రముచే వంద్యమానయు. లావణ్యవతియునై భవునకు పార్వతివలె ఆ రాజునకు ప్రియయై యుండెను. ఆమెకు ధర్మాత్ములు ధనుష్క శేష్టులు నగు పదివేల మందీ తనయులు కలిగిరి. ఇదియంతయు చూచికొని రాజు తరచు వేర గొందుచుండి యొక నాడు తన కడ క భ్యా గతుడై వచ్చిన ప్రచేతసు నిట్లడిగేను: “నాకు దేవమానవ పూజ్యమగు ఈ యచల సంపద ఆమర సుందరులకంటె మిన్న యగు ఈ పత్ని అల్పతపముతోనే తుష్టుడే బ్రహ్మ ఇచ్చిన ఈ పుష్పయానము చంద్రుని పరివేష్టించిన తారాగణమువలె నా ముందు కాంతిహీనులై నన్ను పరివేష్టించి యుండు చతురంగ బలసమేతులగు ఈ శతకోటి నృపులు - ఇదంతయును కలుగుటకు గత జన్మమున నేనో నా పత్ని యో నౌ తనయులో అ శేష ఫలా ప్రి హేతువగు పుణ్య మేమి చేసియుంటి మో దయార్ద్ర చేత స్కుడవై తెలుపుము.”

ప్రచేత కథిత పుష్పవాహన పూర్వచరితమ్

ప్రచేతాః : ప్రభవాన్తరితం సమీక్ష్య పుణ్యం పృథివీపతేః ప్రసభ విభూతి

 హేతువృత్తమ్

జన్మాభవ త్తవతు లుబ్దకు లేపి రాజక్ జాతో భవా ననుదినం కిల పాపకారీ

 వపుర వ్యభూ తవ పురా పరుషాజ్గసన్ది దుర్గ ని సత్వభయతాపక రం ప్రజానామ్

న చ తే సుహృజ్జనగణ స్సుతబస్తువర్ధో న చ తే పితా నజననీ చ తదా

 ఆభిసమతా పర మభీష్టతమా చ పత్నీ విముఖాతు పర్వతచరా వ్యభవత్

ఆసీ దనావృష్టి రతీవ రౌద్రా కదాచి దాహార నిమిత్త మస్మిక్

 క్షుత్పిడితేన భవతా తు యదా న కించి దాసాదితం ధాన్యఫలాదికంచ

తదా తు దృష్టం మహదమ్బుజాడ్యం సరోవరం పజపరీతరోధః

 పద్మా న్యథాదాయ తతో బహూని గతః పురం వై దిశ నామధేయమ్

తన్మూల్యలాభాయ పురం సమస్తం బ్రా నం త్వయా శేష మహ స్తదానీత్

 కేతా న కశ్చి తమలేషు జాతః క్లాన్తః పరం క్షత్పరిపీడితశ్చ

ఉపవిష్ట స్వ మేకస్మి భార్యో భవనాజ్గణే

అథ మజ్గళశబ్దశ్చ త్వయా రాత్రౌ మహా ఞ్చ్రుతః

సభార్య సత్ర గతవా న్యతాసీ న్మ జ్గళధ్వనికి

 తత్ర మపమధ్యస్థా విష్ణో రర్చా వలోకితా

 వేశ్యానజవతీ నామ విభూతిద్వాదశీవ్రతమ్

 సమాప్య మాఘమాసస్య ద్వాదశ్యాం లవణాచలమ్

నివేదయ నీ గురవే శయ్యాం చోపస్కరాన్వితామ్

 అలజృత్య హృషీ కేశం సౌవర్ణామరపాదపాక్

 తాంచ దృష్ట్వా తతస్త్యా మిదంచ పరిచి తమ్

 కి మేభిః కమలైః కార్యం పరం విష్ణు రలజ్కృతః

 ఇతి భక్తి స్తదా జాతా దమ్పత్యస్య నరేశ్వర

 తత్ర సజ్జా త్సమభ్యర్చ్య కేశవం లవణాచలే

 శయ్యాం చ పుష్పప్రకరైః పూజయిత్వాచ సర్వశః

 అథానజ్గవతీ తుష్టా తాభ్యాం ధేను శతత్రయమ్

 దీయతా మాదిదేశాథ కలధౌతపలత్రయమ్

 న గృహీతం తతస్తాభ్యాం మహత్సత్త్వావలమ్బనాత్

అనగా ప్రచేతు డిట్లు పలికెను: రాజా! నీ కీ సర్వసంపదలకును హేతువగు నీ పూర్వ జన్మవృత్తమును చూచి తిని. గత జన్మమున నీవు అనుదినము పాపకారియగు లుబ్ధకుడవు. నీ శరీరమును పరుషాంగసంధులు దుర్గంధము కలిగి ప్రాణులకు భయతాపకఠమయియుండెను. పర్వతచరురాలయినను నీయందు విముఖయేనను నీకు అత్యంత ప్రియతమ యగు భార్య, తప్ప, జననీ సుత సుహృద్బంధుజన మెవ్వరును నీకు లేకుండిరి. ఇట్లుండ ఒకప్పుడు రౌద్రమగు అనావృష్టి చే ఆహారము లేక పోగా నీవు ముత్పీడితుడవై ధాన్య ఫలాదికము కూడ దొరుకని తరి నీకు పంకావృత తటము కలిగి అనేక పద్మయుతమగు కొలను కనబడెను. నీవు దానినుండి అనేక పద్మ ములు కోసి వాని నమ్మి లాభ మార్షించుటకై విదిశ యను నగర మేగి అట పగలంతయు తిరిగితివి. వానిని కొనువా రేవ్వ రును దొరుకక నీవు నీ పత్నితో అలసి కుత్పిడితుడవై యొస భవనాంగణమున కూర్చుంటివి. అంత రాత్రి కాగా విసవచ్చిన మంగళ వాద్య ధ్వనీ జాడబట్టి అది వినవచ్చు. చోటికి భార్యతో ఏగితివి. అచట అనంగవతియను వేశ్య చేయుచుండిన విష్ణుపూజను చూచితివి. ఆమె అపుడు తన విభూతి ద్వాదశీ వ్రత సమా పి కె మాఘ శుక్ల ద్వాదశినాడు గురునకు లవణా చలమును సర్వోపసరయు క శయ్యను దాన మిచ్చుచుండెను. అది చూచి మీ రిరువురును భ క్తి కలిగి. 'ఈ కమలము లతో పని యేమి?' అని వానితో విష్ణుని అలంకరించి అర్చించితిరి.

అది చూచి తుష్టయే అనంగవతి వారికి మూడు వందల పాడియావులను మూడు పలముల సువర్ణమును నిమ్మని తన వారి నాదేశించెను. కాని మీరు అధిక సత్వము నవలంబించి అవి తీసికొనకుంటిరి.

అనజ్గవత్యాచ పున స్తాభ్యా మన్నం చతుర్విధమ్

 ఆనీయ వ్యాహృతం చాత్ర భుజ్యతామితి భూపతే

 తాభ్యాం తదా తథోత్యు క్రం భోక్ష్యావ శ్శ్వో వరాననే

 ప్రసఙ్గ దుపవా సేన గతా రాత్రి(గతారాత్రి స్తదావయోః) శ్శుభావహా

 జన్మ ప్రభృతి పాపిష్ణా వానాం దేవి శుభప్రతే

 త్వతసజ్జా తయోర్మధ్యే ధర్మలేశ స్తతోనఘః

 ఇతి జాగరణం తాభ్యాం తత్ప్రసజ్జా దనుష్ఠితమ్

 ప్రభా కేతు తయా దత్తా శయ్యా సలవణాచలా

గ్రామాశ్చ గురవే భక్త్యా విపేభ్యో ద్వాద శై వతు

 వస్త్రాలజౌరసంయుక్తా గావశ్చ కనకాన్వితాః

భోజనంచ సుహృన్మిత్రదీనాన్షకృపణె స్సమమ్

 తద్వ ల్లుబక దమ్పత్యం పూజయిత్వా విసర్జితమ్

 స భవా న్లుబ్దకో జాత స్సపత్నీ కో జనేశ్వర

 పుష్కరప్రభవా త్తస్మా తేశవస్యచ పూజనాత్

 వినష్టా శేషపాపస్య తవ పుష్కరమన్దిరమ్

 తస్య వ్రతస్య మాహాత్మ్యా దల్పేన తపసా నృప

 అదా తామగమం యానం లోక నాధ శ్చతుర్ముఖ

 సన్తుష్ట సవ రాజేన్ద బ్రహ్మరూపీ జనార్దనః

సాప్యనవతీ వేశ్యా కామడే:స్య సామతమ్

 పత్నీ సపత్నీ సజాతా సా స్యాతీతిరితి శుతా

 లోకే ష్వానన్దజననీ సక లామరపూజితా

 తస్మా దుత్సృజ్య రాజేన్ద పుష్కరం త్వం మహీతలే

గఙాతటం సమాసాద్య విభూతిద్వాదశీ వ్రతమ్

కురు రాజేన్గ నిర్వాణ మవశ్యం సమవాప్స్యసి

నందికేశ్వరః : ఇత్యుక్త్వా స ముని రహ్మా తతైవాన్తర ధీయత

 రాజా యథోక్తంచ పున రకరో త్పుషవాహనః

 ఇమా మాచరతో బ్రహ్మ న్న ఖణఖిలభాగ్భవేత్

 యథాకథంచి తాలేన ద్వాదశ ద్వాదశీ ర్మునే

 కర్తవ్యా భక్తి తో దేయా విపేభ్యో దక్షిణా అపి

 విత్తశాఠ్యం న కుర్వీత భక్త్యా తుష్యతి కేశవః

ఇతి కలుషవిదారణం నరాణా మపి పఠతీహ శృణోతి వాథ భక్త్యా

 మతిమపిచ దదాతి దేవలో కే వసతి స రోమసమాని వత్సరాణి(సకోటిశతానివత్సరాణి)

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే విభూతిద్వాదశీవ్రత మాహాత్మ్య కథనం నామాష్ట్ర నవతిత మోధ్యాయః

అంతట అనంగవతి భక్ష్యభోజ్య లేహ్యచోష్య రూప - చతుర్విధాన్న ములు తెప్పించి మిమ్ము తిసుడన మీరును “అమ్మా! ప్రసంగవశమున అనుకొనకుండగనే ఉపవాసముతో శుభావహమయి రాత్రి గడచినది. కాన రేపు భుజింతుము. మేము జన్మప్రభృతిగా ఓ శుభవతా! దేవీ! పాపిష్టులము. అంటిరి. ఇట్లు ఈ ప్రసంగమున మీ ఇరువురకును ధర్మలేశమును జాగరణానుష్టానఫలమును అబ్బినవి.

 ఉదయమున ఆ ఆనంగవతి శయ్యయు లవణపర్వతమును గ్రామములును గురువునకును వస్త్రాలంకార కనక యుత ములై న పండేండు పాడియావులు బ్రాహ్మణులకును దానము చేసెను. సుహృన్మిత దీనాంధకృపణులతోపాటు ఆమె ఈ లుబ్దక దంపతులకును భోజనము పెట్టి వీడ్కొనెను. రాజా! ఆ లుబ్దక దంపతులుగా నుండిన మీరు ప్రత మున చేసిన పూజా మాహాత్మ్యమున మీ పాపములన్నియు నశించి ఈ పద్మ గృహమును కామగమనమును ఈ సంపదాదికమంతయును బ్రహ్మరూపుడగు నారాయణునిచే మీకు ఈయబడినవి. ఆ అనంగవతియను వేశ్యయు ఇపుడు మన్మథుని, రెండవ భార్యయై ప్రీతియను పేర రతీదేవికి సవతిగా నున్న దే లోకానంద జననియు సకలామర పూజిత యునై యున్నది.

కావున నా రాజేంద్రా! నీవును ఈ పద్మ గృహయానమును భూతలమున విడిచి గంగాతీరమున విభూతి ద్వాదశి వ్రతము నాచరింపుము. మోక్షము నం దేదవు.

ఇట్లు ప్రచేతుడు పలికి యంతర్షి తుడు కాగా ఆ రాజును నాతడు చెప్పినది యెల్ల అట్లే ఆచరించెను. ఆ ఫల మును కూడ పొందెను.

కావున నారదా! దీని నాచరించిన యాతడు అఖండఫలము నందును. శ క్తి యున్నంతలో పండ్రెండు ద్వాదశులయం దుపవాస పూజో దక్షిణాదానాదికమును విత్త శాఠ్యము చేయక భక్తితో నాచరించుట చే కేశవుడు - తుష్టు డగును.

కలుష నాశకమగు దేనిని భక్తితో వినినను చదివినను నితరులకు తెలిపినను కోటి శత వత్సరములపాటు దేవలోక మున వసీంచును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున విభూతి ద్వాదశీవ్రత మాహాత్మ్య కథనమను తొంబది ఎనిమిదవ అధ్యాయము.