270 – భవిష్యద్రాజానుకీ ర్తనము.

ఋషయః : పూరో ర్వంశ స్త్వయా సూత సభవిష్యో నివేదితః

సూర్యవంశే నృపా యే తు భవిష్యన్తి హి తా న్వద

 తథైవ యాదవే వం శే రాజానః కీర్తివర్ధనాః

 కలౌ యుగే భవిష్యoతి తానపీహ వదస్వ నః

 వంశాంతే జాతయో యాశ్చ రాజ్యం ప్రాప్స్యoతి సువ్రతాః

బ్రూహి సక్షేపత స్తాసాం యథా భావ్య మనుక్రమాత్

 సూతః : బృహద్బలస్య దాయాదో వీరో రాజా హ్యురుక్షయః

 ఉరుక్షయసుతశ్చాపి వత్సవ్యూహో మహాతపాః

 వత్సవ్యూహా త్ర్పతివ్యోమ స్తస్య పుత్త్రో దివాకరః

 తస్యైవ మధ్యదే శేతు అయోధ్యా నగరీ శుభా

 దివాకరస్య భవితా సహదేవో మహాయశాః

సహదేవస్య భవితా ధ్రువాశ్వో వై మహామనాః

 తస్య భావ్యో మహాభాగః ప్రతీపాశ్వశ్చ తత్సుతః

 ప్రతీపాశ్వ సుతశ్చాపి సుప్రతీపో భవిష్యతి

మరుదేవః సుత స్తస్య సునక్షత్ర స్తతోఽభవత్

 కిన్న రాశ్వః సునక్షత్రా ద్భవిష్యతి పరoతవః

 కిన్న రాశ్వా దన్తరిక్షో భవిష్యతి మహామనాః

సు షేణ శ్చాoత రిక్షాచ్చ సుమిత్రస్యాష్యమిత్రజిత్

 సుమిత్రజో బృహద్రాజో బృహద్రాజస్య వీర్యవాక్

 పుత్త్రః కృతఞ్జయో నామ ధార్మికశ్చ భవిష్యతి

వత్స ద్రోహో   

కృతఞ్జయసుతో విద్వా న్భవిష్యతి రణేజయః

 భవితా సఞ్జయశ్చాపి వీరో రాజా రణేజయాత్

 సఞ్జయస్య సుత శ్ళాక్య శ్శాక్యా చ్చుద్ధౌదనో నృపః

 శుద్దోదనస్య భవితా సిద్దార్థః పుష్కల స్సుతః

 ప్రసేనజి త్తతో భావ్యః క్షుద్రకో భవితా తతః

 క్షుద్రకా త్కులకో భావ్యః కులకా త్సురథ స్స్మృతః

 సుమిత్ర స్సురథా జ్జాతో అన్యస్తు భవితా నృపః

 ఏతే చైక్ష్వాకవః ప్రోక్తా భవిష్యoతి కలౌ యుగే  

ఋషులు సూతునిట్లడిగిరి: సూతా! నీవు భవిష్యులగురాజులతో గూడ పూరు వంశమును మాకెరిగించితివి; సూర్యవంశమునందు రాబోవు రాజులెవరు? యాదవ వంశమునందు కలుగబోవు కీర్తి వర్గ నులను కలియుగమునందు రాబోవు వారిని వీరి వంశాంతమందు సువ్రతులగు ఏ జాతులవారు రాజ్యమునకు వత్తురో వారి భవిష్యక్రమమును సం షేపముగా తెలుపుము; అన సూతుడిట్లు చెప్పసాగేను: బృహద్బలునకు వీర రాజగు ఉరుక్షయుడు వానికి మహాతపుడగు వత్స వ్యూహుడు వానికి ప్రతివ్యోముడు వానికి దివాకరుడు కలుగుదురు; దివాకరునికి మధ్య దేశమునందు శుభయగు అయోధ్య యను నగరి ఉండును; అతనికి మహాయశుడగు సహదేవుడు అతనికి మహామనుడగు ధ్రువాశ్వుడు అతనికి మహాభాగుడగు ప్రతీపాశ్వుడు అతనికి సుప్రతీపుడు అతనికి మరుదేవుడు అతనికి సునక్షతుడు అతనికి పరంతపుడగు కింనరాశ్వుడు అతనికి మహామనుడగు అంతరిక్షుడు అతనికి సు షేణుడును శత్రుజేతయగు సుమిత్రుడునను వారును వారిలో సుమిత్రునకు బ్రహహ్రజుడు అతనికి వీర్యవంతుడును ధార్మికుడునగు కృతంజయుడును అతనికి  విద్వాంసుడగు రణేజయుడు అతనికి వీరరాజగు సంజయుడును అతనికి శాక్యుడును అతనికి శుద్ధోదనుడును అతనికి సిద్ధార్థుడును అతనికి పుష్కలుడు ఆతనికి ప్రసేనజిత్తు అతనికి తుదకుడు అతనికి కులకుడు అతనికి సురథుడు అతనికి సుమిత్రుడు కలుగుదురు: ఇతడే వీరిలో కడపటివాడు; కలియుగమున కలుగబోవు ఐక్ష్వాకులు వీరు.

బృహద్బలాన్వయా యే తు భవిష్యాః కులవర్ధనాః

ని శ్శేషాః కథితా శ్చైవ నృపా యే వై పురాతనః

 అత్రానువంశ శ్శ్లోకోయం గీతో విప్రైః పురాతనైః

ఇక్ష్వాకూణా మయంవంశ స్సుమిత్రాన్తో భవిష్యతి

 సుమిత్రం ప్రావ్య రాజానం సంస్థాం ప్రాప్స్యతివై కలౌ

ఇత్యేవం మానవో వంశః ప్రాగేవ సముదాహృతః

 అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మాగధా యే బృహద్రథాః

పూర్వేణ యే జరాసoధా  త్సహదేవాన్వయే నృపాః

 అతీతా న్వర్తమానాంశ్చ భవిష్యాంశ్చ నిబోధత

 స ఙ్గ్రామే భారత్ వృత్తే సహదేవే నిపాతితే

సోమాధి స్తస్య దాయాదో రాజాఽభూ త్స గిరివ్రజే

 ప ఞ్చాశతం తథాఽష్టౌ చ సమా రాజ్య మకారయత్

 శ్రుతశ్రవా శ్చతుష్షష్టిం సమా స్తస్యాన్వయేఽభవత్

 అప్రతీపీ చ ష ట్త్రింశ త్సమా రాజ్య మకారయత్

 చత్వారింశ త్సమా స్తస్మా న్నిరామిత్రో దివం గతః

పఞ్చాశతం సమాష్షట్చ సురక్షః ప్రాప్తవా న్మహీమ్

 బృహత్కర్మా త్రయోవింశ దబ్దం రాజ్య మకార యత్

 శ్యేనజి త్సామ్ర్పతశ్చాయం భోక్తా పఞ్చశతం మహీమ్

 శ్రుతఞ్జయశ్చ వర్షాణాం చత్వారింశ ద్భవిష్యతి

 అష్టావింశతివర్షాణి మహీం సమ్ర్పాప్స్యతే విభుః

 అష్టపఞ్చాశతం చాబ్దా న్రాజ్యే స్థాస్యతి వై శుచిః

 అష్టవింశ త్సమా రాజా  క్షేమో భోక్ష్యతి మేదినీమ్  

అనువ్రత శ్చతుష్షష్టిం రాజ్యం ప్రాప్స్యతి వీర్యవాక్

పఞ్చత్రింశతివర్షాణి సునేత్రో భోక్ష్యతే మహీమ్

 భోక్ష్యతే నిర్వృతి శ్చేమా మష్టపఞ్చాశతం సమాః

 అష్టావింశత్సమా రాజ్యం త్రినేత్రో భోక్ష్యతే తతః

చత్వారింశ త్తథాఽష్టౌచ *మహా సేనో భవిష్యతి

 త్రయస్త్రింశత్తు వర్షాణి మహీనేత్రః ప్రకాశ్యతే

 ద్వాత్రింశత్తు సమా రాజా సుబలశ్చ భవిష్యతి

 రిపుఞ్జయస్తు వర్షాణి పఞ్చాశ త్ర్పాప్యతే మహీమ్

 ద్వాత్రింశత్తు నృపా హ్యేతే భవితారో బృహద్రథాః

 పూర్ణం వర్షసహస్రాత్తు తేషాం రాజ్యం భవిష్యతి

 జయతాం క్షత్త్రియాణాం చ బాలకః పాలకోభవేత్

ఇతి శ్రీమత్స్య మహాపురాణే భవిష్యద్రాజాను కీర్తనం నామ సప్తత్యుత్తర ద్విశతతమోఽధ్యాయః

బృహద్బలుని వంశమున కలిగిన పురాతన రాజులను కలుగబోవు వారిని నిః శేషముగ తెలిపితిని; ఈ విష యమందు పురాతనులగు విప్రులు గానము చేసిన ఆనువంశ శ్లోకము ఇది: ఇక్ష్వాకుల ఈ వంశము సుమీతునితో అంత మందును; అనగా ఈ సుమిత్రుడు రాజగుటతో ఈ వంశపు ఆంత్యస్థితి ఏర్పడును; లోగడనే మీకు తెలుపనారంభించిన మనువంశ వృత్తాంతము ఇది; ఇక మీదట మాగధులగు బృహద్రథవంశీయుల నెరింగింతును? లోగడ తెలిపిన జరాసంధుని పుత్రుడగు సహదేవుని వంశమునందలి భూత వర్తమాన భవిష్యరాజులను తేలి పెదను; భారత సంగ్రామము జరిగి ఆందు ఈ నహదేవుడు నిపాతితుడు (పడగొట్టబడినవాడు.మృతుడు) కాగా అతని కుమారుడు సోమాధి గిరివ్రజమున మగధ రాజయ్యేను; అతడు ఏబది ఎనిమిదేండ్లు రాజ్యమేలేను; అతని వంశమున శ్రుతప్రతుడు ఆరువది నాలుగు ఏండ్లు ఆప్రతీపి ముప్పది నాలుగేండ్లు నిరామిత్రుడు నలువది ఏండ్లు సురకుడు ఏబదియా రేండ్లు బృహత్కర్ముడు ఇరువది మూడేండ్లు రాజ్యమేలి; ఇపుడు శ్యేనజిత్ ఏలుచున్నాడు; అతడు ఏబది సండ్లు ఏలును; తరువాత శ్రుతంజయుడు నలువది ఏండ్లు విభుడు ఇరువది ఎనిమిదేండ్లు శుచి ఏబది ఎనిమిదేండ్లు క్షేముడు ఇరువది ఎనిమిది ఏండ్లు అనువ్రతుడు ఆరువది నాలుగేండ్లు సునేత్రుడు ముప్పదియైదు ఏండ్లు నిర్వృతి ఏబది ఎనిమిదేండ్లు త్రినేత్రుడు ఇరువది ఎనిమిదేండ్లు మహా సేనుడు నలువది ఎనిమిదేండ్లు మహీనేత్రుడు ముప్పది మూడేండ్లు సుబలుడు ముప్పది రెండేండ్లు రిపుంజయుడు ఏబది ఏండ్లు పాలింతురు; ఈ బృహద్రథ వంశీయరాజులు మొత్తము ముప్పది ఇద్దరును వేయియేండ్లు పాలింతురు: పులకుడను వాని కుమారుడు బాలకుడు ఆగు క్షత్రియుడు ఈ వంశపు కడపటి వాని తరువాత తాను రాజగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భవిష్యద్రాజాను కీర్తనమను రెండు పందల డెబ్బదియప యధ్యాయము.