109 - ప్రయాగ మాహాత్మ్యము

 యుధిష్ఠిరః: కథం స్వర్గమిదం ప్రోక్తం ప్రయాగస్య మహామునే

ఏతన్మే సర్వమాఖ్యాహి యథాహి మమ తారయేత్

 మార్కండేయః : శృణు రాజ న్మహాబాహో ప్రోక్తం సర్వమిదం జగత్

 బ్రహ్మా విష్ణు స్తథా సోమో దేవతాః ప్రభు రవ్యయః

  బ్రహ్మ సృజతి భూతాని స్థావరం జజ్గమం చ యత్

తాన్యేతాని పరేలోకే విష్ణు సంవర్ధతే ప్రజాః

 కళా నేతత్సమగ్రంహి రుద్రస్సంహరతే జగత్

 తదా హరతి చాప్యేత న్న కదాచి ద్వినశ్యతి

ఈశ్వర స్సర్వభూతానాం యః పశ్యతి స పశ్యతి

 అత యే త్వవతిష్ఠని తే యా న్తి పరమాం గతిమ్

యుధిష్ఠిరః:  ఆఖ్యాహి మే యథాతత్త్వం యథే వాతిష్ఠతే శ్రుతిః

 కేనవా కారణేనైవ తిష్టనే లోకసత్తమాః

 మార్కణ్డేయః : ప్రయాగే యేన వసతి బ్రహ్మా విష్ణు ర్మహేశ్వరః

 కారణం త తవశ్యామీ శృణు త్వం త ద్యుధిష్ఠిర

 పక్చాయోజనవి సీర్ణం ప్రయాగ స్యతు మణ్డలమ్

 తిష్ఠని రక్షణార్థాయ పాపకర్మనివారణాత్

 యస్మి గ్టహ్యా త్స్వకం పాపం నరకంచ న పశ్యతి

 ఏవం బ్రహ్మా చ విష్ణుశ్చ ప్రయాగే నిత్య మీశ్వరః

 ఉత్తరేణ ప్రతిష్ఠానా చ్ఛద్మనా బ్రహ్మ తిష్ఠతి

 మహేశ్వరో వటో భూత్వా యావదాభూతసమ్లవమ్

 యే చాన్యే బహవశ్చైవ తిష్ఠనిచ యుధిష్ఠిర

 స్వరాజ్యం కురు రాజేంద్ర భాతృభి స్సహితో నఘ 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మార్కణ్డేయయుధిష్ఠిరసంవాదే ప్రయాగ మాహాత్మ్యే నవోత్తర శతతమోధ్యాయః

యుధిష్ఠిరుడు మార్కండేయుని ఇట్లడిగెను: మహామునీ: ప్రయాగ తీర్థప్రభావము స్వర్గప్రద మెట్లగును? అది నా పూర్వులను ఎట్లు తరింపజేయగలదు? తెలుపుమన మార్కండేయుడిట్లు చెప్పెను: ఈ లోకములన్నియును దాని యందలి స్టీరచర ప్రాణులును పదార్థములును బ్రహ్మ విష్ణు శివులును దేవతలును అన్ని యు అవ్యయుడగు ప్రభువగు ఆ పరమాత్మయే. అందునను బ్రహ్మ సృజింపగా విష్ణువా లోకములను వర్ధిల్లజేయును. కల్పాంతమందడియంతయు రుద్రుడు సంహరించును (మూల తత్వమునందు లయమంద జేయును.). ఐనను ఇది (ఈ ప్రయాగ) ఎన్నడును నశించునది కాదు. కాపున ఇచట నివసించువారు పరమపదము నందుదురు. అన యుధిష్ఠిరుడిట్లడిగేను: ప్రయాగ ఏల ఎన్నడును నశించదు? ఈ లోక సతములగు త్రిమూర్తులచట సదా ఏల నివసింతురు? తెలుప వేడెదను. ఆన మార్కండేయు డిట్లనెను: పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమునందు తీర్థ సేవకుల పాపమోచనము చేయుట కే వారు మువ్వురును మారు రూపములో ఉందురు. వారచట వట రూపముగ నున్నారు. ప్రళయుము వరకును ఉందురు కూడను. వారి మారు రూపములగునవి ఇంకను అచట అనేకములు గలవు. కావున అనఘా! (నామాట విశ్వసించి ప్రయాగ తీర్థ సేవచేసి) నీ సహోదరులతో కూడి రాజ్యపాలనము చేయుచుండుము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట తొమ్మిదవ అధ్యాయము.