211 - సావిత్రీ యమ సంవాదము-సావిత్రికి తృతీయ వరలాభము.

సావిత్రి : ధర్మార్జనే సుర శ్రేష్ఠ కుతో గ్లానికి క్లమోథవా

త్వత్పాదమూల సేవా చ పరమం ధర్మకారణమ్

 ధర్మార్జనం సదా కార్యం పురు షేణ విజానతా

తల్లాభ స్సర్వలాభేభ్యో నిత్యమేవ విశిష్యతే

 ధర్మశ్చార్థశ్చ కామశ్చ త్రివర్లో జన్మనః ఫలమ్

 ధర్మహీనస్య కామార్థా వన్ద్యాసుతసమౌ ప్రభో

ధర్మా దర్థ స్తతః కామో ధర్మా ల్లోకద్వయం తథా

ధర్మ ఏకో నయత్యేనం యత్ర క్వచన గామినమ్

 శరీరేణ సమం నాశం సర్వ మన్యద్ధి గచ్చతి

 ఏక్ హి జాయతే జన్లు రేక ఏవ ప్రమీయతే

 ధర్మ స్త ముహత్యేకో న సుహృన్న చ బాగ్దవా

క్రియా సౌభాగ్యం లావణ్యం సర్వం ధర్మేణ లభ్యతే

 బ్రహ్మేశ్లో పేన్జ శర్వేన్దుయమార్కాగ్న్యనిలామ్భసామ్

వస్వశ్విధనదాద్యా నాం యే లోకా స్సర్వకామదాః

ధర్మేణ తా నవాప్నోతి పురుషః పురుషా స్తోక

మనోహరాణి ద్వీపాని వర్షాణి సుబహూనిచ

ప్రయాని ధర్మేణ నరా స్తథైవ నరగళ్లికాః

నన్దనాదీని ముఖ్యాని దేవోద్యానాని యాని చ

తాని పుణ్యేన లభ్య నే నాకపృష్ఠం తథా నరై 

విమానాని విచిత్రాణి తథై వాప్సరస శ్శుభాః

తై జసాని శరీరాణి సదా పుణ్యవతాం ఫలమ్

రాజ్యం నృపతిపూజా చ కామసిద్ది స్తథేప్సితా

 సంస్కారాణి చ ముఖ్యాని ఫలం పుణ్యస్య దృశ్యతే

 రుక్మవే డూర్య వస్త్రాణి చన్దాతు సదృశాని చ

 చామరాణి సురాధ్యక్ష భవన్త శుభకర్మణామ్

పూర్ణేన్దుమణలాభాని రత్నాంశుఖచితాని చ

ధార్యతాం యా న్తి ఛత్రేణ నరాః పుణ్యేన కర్మణా

 జయశ జ్ఞస్వరౌ ఘణ సూతమాగధనిస్వనై

వరాసనం సకృష్ణారం ఫలం పుణ్య స్య కర్మణః

వరాన్న పానగీతం చ నృత్తమాల్యానులేపనమ్

 రత్నవస్త్రాణి సకలం ఫలం పుణ్యస్య కర్మణః

రూఔదార్యగుణో పేతా స్ప్రియ శ్చాతిమనోహరాః

 వాసఃప్రాసాదపృషేమ భవన్త శుభకర్మిణః

సువర్ణ కిజిణీ మిశ్ర చామరా పీడ చారిణః

 వహ తురగా దేవ నరః పుణ్యేన కర్మణా

 హేమపద్మేశ్చ మాత జై శ్చలత్పర్వతసన్నిభై

 ఖేలద్భిః పాదవిన్యాసై రా ని పుణ్యేన కర్మణా

 సర్వకామప్రదే దేవే సర్వాఘదురితాప హే

వద ని భక్తిం పురుషా స్సదా పుణ్యేన కర్మణా

తస్య ద్వారాణి యజనం తపో దానం దమః క్షమా

 బ్రహ్మచర్యం తథా సత్యం తీర్థానుసరణం శుభమ్

స్వాధ్యాయ సేవా సాధూనాం సహవాస స్సురార్చనమ్

 గురూణాం చైవ శుశ్రూషా బ్రాహ్మణానాం చ పూజనమ్

ఇంద్రియాణాం జయశ్చైవ బ్రహ్మచర్య మమత్సరమ్ 

సావిత్రి యమునితో ఇట్లనెను; సురశ్రేష్ఠా! ధర్మార్జనము చేయుట జరుగునప్పుడు శ్రమ ఎక్కడిది? అదీకాక ఇట్లు నీపాద మూల సేవనము పరమధర్మ సాధనము; విజ్ఞానియగు పురుషుడు సదా ధర్మమార్జించవలయును; ఈ లాభము సదా సర్వలాభముకంటెను విశిష్టమయినది; ధర్మార్థ కామములనెడు త్రివర్గపు సాధనమే జన్మఫలము; ప్రభూ! ధర్మము నార్జించనివానికి ఆర్థ కామములు రెండును గొడ్రాలి కొడుకువంటివి (ఉండనే ఉండవు;) ధర్మముచే అర్థమును దానిచే కామమును (లోకపు కోరికలను తీర్చుకొనుట) సాధ్యమగును; ధర్మము చేత (ఇహపర లోకములు రెండును సాధించుకొన వచ్చును; జీవుడు ఎక్కడకు పోవలెనో అక్కడకు (సుఖ స్థానమునకు) (అతని వెంటనుండి) తీసికొనిపోవునది ధర్మ మొక టియే; ఇతర మంతయు శరీరముతోపాటే నశించును; జీవుడు తానొక్కడే పుట్టును; తానొక్క డే చచ్చును; మిత్రులు కాని బాంధవులు కానీ కాక ధర్మమొకటి మాత్రము వానివేంట పోవును; తానాచరించు క్రియలలో సౌభాగ్యమును లావణ్య మును ధర్మముచేతనే లభించును; ప్రాణుల నంత మొందించు ధర్మరాజా! సర్వకామ (కోరికల) సుఖములనిచ్చు బ్రహ్మేంద్రో పేంద్ర శివచంద్ర యమ రవ్యగ్ని పొయు వరుణ వస్వశ్వదేవతా కుబేరాది దేవతల లోకములన్ని యు ధర్మము చేతనే ప్రాణులకు లభించును; మనోహరములగు (జంబూ ప్రభృతి) ద్వీపములను (భరత వర్గాది) వర్షములను నందనాది ముఖ్య దేవోద్యానములను స్వర్గమును నరులును నరోత్తములును కూడ పొందగలుగుట ధర్మము నోచరించుట చేతనే! హృద యాశ్చర్యకర విమానములును శుభరూపలగు అప్సరసలును పుణ్యవంతుల పుణ్యఫలమగు తేజస శ రీరములును రాజ్యమును రాజపూజయు ఈప్సిత కామసిద్ధియు పుణ్యఫలమయి కనబడు ఉత్తమ సంస్కారములును బంగారమును వైడూర్యా రత్నము బును. చంద్రకిరణములను పోలు వస్త్రములును పూర్ణ చంద్రమండలమువంటివియు రత్న ఖచితములునగు చామరములును సురాధ్యక్షా! - శుభధర్మ కర్మాచరణముతోనే లభించును; ఛత్త ధారణము జయశ బ్దములు శంఖధ్వనులు సూతమాగధుల స్తుతులు ఉత్తమాసనములు బంగారు జలపాత్రము ఉత్తమములగు అన్న పానీయ గీత నృత్తమాల్య సుగంధాను లేపనములు రత్న వస్త్రములు రూపౌదార్యగుణయుక్తలగు అతి మనోహర స్త్రీలు ప్రాసాద శిఖర ములయందు నివాసము బంగరు గజ్జెలతో మొవ్వలతో కూడ తలలపై చామరాలంకారములుకల అశ్వముల పై స్వారీ చేయుచు తిరుగుట బంగరు పద్మ చిహ్న ములతో అలంకృతములయి ప్రకాశించునవి పర్వతములవంటివి ఒయ్యారపు పొద విన్యాసములతో నడుచునవియగు మదపుటేనుగులు వాహనములగుట-ఇంతయు ధర్మ పుణ్యకర్మము చేతనే లభించును; సర్వకామ ప్రదుడును సర్వపాపదోష నాశ కుడునగు దేవునియందు భ క్తియు ధర్మ పుణ్య కర్మ లభ్యములే; యజగము (యజ్ఞముల నాచరించుట) తపము దానము దమ (బహిరింద్రియ నిగ్రహ)ము క్షమాగుణము బ్రహ్మచర్యము సత్యము శుభ తీర్థ(గురు) సేవనము స్వాధ్యాయ సేవనము సాధుసహవాసము దేవతార్చనము గురు శుశ్రూష బ్రాహ్మణ పూజనము - ఇం; దియ జయము బ్రహ్మచర్యము ఆమత్సరము.ఇవి అన్ని యు ధర్మార్జన సాధ్యములు.

తస్మా ద్ధర్మ స్సదా కార్యః పురు షేణ విజానతా

న హి ప్రతీక్షతే మృత్యుః కృత మస్య న వాకృతమ్

 బాల ఏవ చ ద్ధర్మ మనిత్యం దేవజీవితమ్

కోహి జానాతి కస్యాద్య మృత్యు రేవాపతిష్యతి

 పశ్యతః పశ్య లోకస్య మరణం పురత స్థితమ్

ఆమర సేవ చరిత మత్యాశ్చర్యం సురోత్తమ

 యువత్వా పేక్షయా బాలో వృద్ధత్వా పేక్షరూ యువో

 మృత్యోరుత్సంగ మారూఢః స్థవిరః కిమ పేక్ష తే

 తత్రాపి విన్హత స్రాణం మృత్యుభీతస్య కా గతిః

 న భయం మరణం దేవ ప్రాణినా మభయం క్వచిత్

 తత్రాపి నిర్భయా స్సన్త స్సదా సుకృతకారిణః

యమః : తుష్టోస్మి తే విశాలాక్షి వచనై థర్మసంయుతై కి

 వినా సత్యవతః ప్రాణా న్వరం వరయ మా చిరమ్

 సావిత్రీ : వరయామి త్వయా దత్త పుత్రాణాం శత మౌర సమ్

 అనపత్యస్య లో కేషు గతిః కిల న విద్యతే

 యమః : కృతేన కామేన నివర్త భద్రే భవిష్యతీదం సకలం త్వయో క్షమ్

 మమోపరోధ స్తవ చ క్లమ స్స్యా త్తథాధునా తేన తవ బ్రవీమి

ఇతి శ్రీమత్స్య మహాపురాణే సావిత్ర్యుపాఖ్యానే సావిత్రీయమసంవాదే సావిత్య్రై యమదత్త  తృతీయ వర లాభో నామ ఏకాదశోత్తర ద్విశతతమోధ్యాయః

కావున విజ్ఞానవంతుడు అగు పురుషుడు (స్త్రీయయినను) ధర్మమాచరించవలయును; మనము చేయవలసినపనిని (ధర్మమును) చేసినను చేయకున్నను మృత్యువు (మనమది చేసివచ్చువరకు) ఎదురు చూడదు; ఇట్లు దేవా! జీవితమనిత్యము కావున బాలుడుగా ఉండగనే ధర్మమాచరించవలయును; ఎప్పుడు ఎవనికి మృత్యువు వచ్చి పడ నేపడునో ఎవరు ఎరు గుదురు? చూడుము; చూచుచుండగనే లోకమునకు (ప్రాణికి) మరణము తన ముందే నిలిచియున్నది; సురోత్తమా! ఇట్టి ప్రాణులు తాము ఆమరులేమో యనునట్లు గర్వించుట అత్యాశ్చర్యకర ముగదా! బాలుడు యౌవనమునను-యువకుడు వార్ధ కమునను -తనకు మరణము రావచ్చునేమో కాని ఇపుడే చావురాదు లేమ్మ ని ఆయా వయస్సులలో ధర్మమాచరించక వ్యర్థముగ గడపును; మృత్యుని ఒడిలో కూర్చుండిన వృద్ధుడు కూడ తన కిప్పుడిప్పుడే చావురాదు లెమ్మని ధర్మమాచరించ కుండును; కాని ప్రతివాడును చావునకు భయపడును; తాను ఎన్నటికీని* చావకుండవలయుననుకొనును; ఇక ఈ ప్రాణికి గతి ఏమి? దేవా! ప్రాణులకు అభయ స్థానము ఏదియు లేదు; మరణము అందరకును భయస్థాన (కారణ)ము; ఇట్టి భయ కారణమగు మృత్యువునకు భయపడనివారు పుణ్యకర్మ ఫలముగల ధర్మము నార్జించువారు మాత్రమే; అనగా ఈ సావిత్రి వచనములు విని యముడు “విశాలాక్షి! నీ ధర్మ సంయుత వచనములతో సంతుష్టుడ నయితిని; నత్యవంతుని ప్రాణములను తప్ప వర మిం కేదై న శీఘ్రముగా కోరుము.” అనెను; “అనపత్యునకు (పురుష-సంతతి లేనివారికి ఏ లోకములందును గతి (ప్రవేశము -సుఖప్రాప్తి లేదందురుగదా! కావున నాకు ఔరస కడుపున పుట్టిన) పుత్ర శతము వరముగా మిమ్ము వేడు చున్నాను.” అని సావిత్రి పలి కెను; యముడును ఆ వర మంగీకరించి “కల్యాణీ! నీ కోరిక నెర వేరినది; ఇక మరలుము; నీవనినదిదియంతయు జరుగును; ఇంకను నీవు నా వెంట వచ్చినచో నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే ఈమాట పలుకుచున్నాను.” అనెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున సావిత్ర్యుపాఖ్యానమున సావిత్రీయమ సంవాదము సావిత్రికి యముని వలన తృతీయవర లాభమునను రెండువందల పదునొకండవ అధ్యాయము.

(*మత్స్య-211 ఆ; శ్లో: 27, వాక్యాంతర్గత వాక్యము “న భయం మరణం దేవః ప్రాణినా మభయం క్వచిత్;” “హేదేవః ప్రాణినాం అభయం క్వచిత్ (అపి) న (విద్యతే): మరణం (సర్వ) ప్రాణినాం (సర్వత్ర) భయం-భయ హేతుః” ఇతివ్యవహితాన్వయః.

“దేవా! ప్రాణులకు అభయము అనునది ఎచ్చటను లేదు; మరణము సర్వ ప్రాణులకును సర్వత్ర భయము కలిగించునది.” అని యర్థము. )