2 - మత్స్యరూపుడగు విష్ణువు మనువునకు అవాంతర ప్రళయాదిక మెరిగించుట

 సూతః: ఏవ ముకో మను స్తేన పప్రచ్ఛాసుర సూదనమ్

 కియద్బి ర్భగవాన్వర్జె ర్భవిష్య త్యంతర క్షయః

 సత్త్వాని చ కథం నాధ రక్షి ష్యే మధుసూదన

త్వయా సహ పున ర్యోగం కథం వా భవితా మమ

శ్రీమత్స్యః: ఆద్య ప్రభృ త్యనావృష్టి ర్భవిష్యతి మహీతలే

 యావ దబ్దశతం సాగ్రం దుర్భిక్షం మరణావహమ్(నిర్జనావహం)

 తతోఒల్పసత్త్వక్షయదా రశ్మయ స్సప్త దారుణాః

 సప్తసప్తి ర్భవిష్య ని ప్రతపాణ్ణరవర్షిణః

 ఔర్వానలోపి వికృతిం గమిష్యతి యుగక్షయే

 దృష్ట్వాగ్ని శాపి పాతాళా త్సజర్షణముఖోద్దతః

 భవస్యాపిలలాటోత్తతృతీయనయనానలః

త్రిజగ నిర్ధహక క్షోభం నయిష్యతి మహీపతే

 ఏవం దగ్గా మహీ సర్వా యదా స్యా త్కూర్మసన్నిభా

 ఆకాశం సూర్యసన ప్తం భవిష్యతి పర స్తప

 తత స్సదేవనక్షత్రం జగ ద్యాస్యతి సంక్షయమ్

 సంవర్తో భీమనాధశ్చ ద్రోణ శ్చేనో వలాహక

 విద్యుత్పతాక శోణస్తు సప్తతే(శ్శోషమాపన్నాస్సప్తైక్యేన) లయవారిదాః

 అగ్నిప్ర స్వేదసమ్భూతాః ప్లావయిష్య ని మేదినీమ్

 సముద్రాః క్షోభ మేష్య ని సప్త క్యేన వ్యవస్థితాః

 ఏతే చైకార్ణవం సర్వం కరిష్య ని జగత్త్రయమ్  

దేవనావ మిమాం గృహ్య స త్వం బీజాంసక్చాయమ్

 ఆరోప్య రక్ష యోగేన మతవృత్తేన సువత

 సంయమ్య నావం మచ్చృజే మతభావాభిరక్షితః

 ఏకః స్థాస్యసి దేవేషు దగ్గేష్వపి పర స్తప

 సోమసూర్యా వహం బ్రహ్మా చతుర్లోక సమన్వితః

 నర్మదాచ నదీ పుణ్యామార్కజేయో మహానృషి

 భవో వేదః పురాణాని విద్యాభి స్సహితో భువః

 త్వయా సార్థ మిదం సర్వంస్థాస్య త్య నరసంక్షయే

 ఏవ మే కార్ణవే జాతే చాకు షేఒత్తర సంక్షయే

 వేదా నవ ర్తయిష్యామి త్వత్సర్గాదౌ మహీతలే 

ఆ మత్స్యము ఇట్లు పలుకగా మను వా విష్ణుని ఇట్లడిగెను: భగవన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును! ప్రభూ! మధుసూదనా! ప్రాణులను ఎట్లు రక్షింతును? నేను మరల నీతో ఎట్లు కలియగలను? మత్స్యము ఇట్లనెను: ఇది మొదలుగా మహీతలమున అనావృష్టి కలుగును. నూరేండ్ల వరకు కరపులు కలిగి ప్రాణులకు మరణము కలిగించును. పిమ్మట అల్పప్రాణులకు నాశముకలిగించుచు సూర్యుని ఏడు కిరణములు కాలెడి నిప్పు కణికలను వర్షించును. ఆ ప్రళయ కాలమున బడబాగ్నియును విజృంభించును. పాతాళమునుండి సంకర్షణుని భగవంతుని ఒక వ్యూహము) ముఖమునుండి అగ్ని వెలువడును. శివుని నుదుటి మూడవకంటి అగ్నియు మూడులోకములను నిర్దహించుచు క్షోభము కలిగించును. ఇట్లు భూమియంతయు తగులబడి తాబేటి(వీపు)వలె అగును. ఆకాశము సూర్యునిచే మిగుల వేడిమిపొందును. దానివలన దేవతలు నక్షత్రములు కూడ నశించును. సంవర్తము భీమనాదము ద్రోణము ఇంద్రము వలాహకము విద్యుత్పతో కము శోణము అను ఈ ఏడు ప్రళయమేఘములును ప్రళయాగ్ని వేడిమికి పుట్టి భూమిని తమ వాననీటితో ముంచివేయును. ఏడు సముద్రములును కలిసి ఒకటిగా ఏర్పడి కలవరము చెందును. ఇవి మూడు లోకములను పూర్ణముగా ఏకార్ణవముగా చేయును. అట్టి స్థితిలో నీవు ఈ దేవనౌకను తీసికొని బీజములు మొదలగు వాని నిలువను దీనియందు ఉంచి నేను ప్రవర్తిల్ల చేయు యోగము రక్షణ విధానము)తో వాటిని రక్షించుము. ఈ నావను నాకొమ్మున కట్టి వేసి నాప్రభావమున అన్ని విధముల రక్షింపబడుచు దేవతలును నశించినను నీవు ఒక్కడవు ఉందువు. ఈ అవాంతర ప్రళయకాలమున చంద్ర సూర్యులు-నేను బ్రహ్మ-నాలుగు లోకములు (స్వర్గమ ర్య పాతాళ బ్రహ్మలోకములు)-పుణ్య అగు నర్మదానది-మార్కండేయ మహాఋషి శివుడు వేదము(లు) పురాణములు ఇతర విద్యలు నీవు ఇవి అన్నియు నిలుచును. ఇట్లు చాక్షుష మన్వంతరము తరువాత అవాంతర ప్రళయముతో ఏకార్ణవము కాగా 'పిమ్మట నీ సృష్టికి ఆరంభమున మహీతలమున వేదములను ప్రవర్తిల్ల జేయుదును.

సూతః ఏవముక్త్వాథ భగవాం స్తత్రైవాస రధీయత

 మనుర ప్యాస్థితో యోగం వాసుదేవప్రసాదజమ్

అభ్యస న్యావదాభూతసంప్లవః పూర్వసూచితః

కాలే యథో కేసఙ్ఞాతే వాసుదేవముజోద్ధతే

 శృజీ ప్రాదుర్బభూవాథ మత్స్యరూపీ జనార్దనః

 అనన్తరజ్జురూ పేణ మునేః పార్శ్వ ముపాగమత్

 భూతాని సర్వాణ్యాకృష్య యోగేనారోప్య ధర్మవిత్

 భుజఙరజ్ఞ్వా మత్స్యస్యశృజే నావ మయోజయత్

 ఉపశృణ్ణం స్థిత స్తస్య ప్రణిపత్య జనార్ధనమ్

ఆభూతసమ్ప వే తస్మి న్న తీతే యోగ శాయినా

 పృషైన మనునా పూర్వం పురాణం మత్స్యరూపిణా

 తదానీం ప్రవక్ష్యామి శృణుధ్వమృషిస త్తమాః

 యద్భవద్భిః పురా పృష్ట స్సృష్ట్యాదిక మహం ద్విజాః

 తథై వైకార్ణవే తస్మి న్మనుః ప్రచ్ఛ కేశవమ్

 మనుః: ఉత్పత్తిం ప్రళయం చైవ వంశమన్వ నరాణి చ

 వంశానుచరితం చైవ భువనస్యచ విస్తరమ్

 దానధర్మంచ వివిధం శ్రాద్ధకల్పంచ శాశ్వతమ్

 వర్ణాశ్రమవిభాగం చ తష్టాపూ ర్తసంజ్ఞితమ్

 దేవతానాం ప్రతిష్టాది సర్వం వ్యాహత్తు మర్హసి

 ఇట్లు పలికి భగవానుడు అక్కడనే - అంతర్ధానము పొందెను. మనువుకూడ పూర్వము సూచింపబడిన ప్రాణి ప్రళయము వరకును తనకు వాసు దేవుని అనుగ్రహము వలన కలిగిన యోగమును అవలంబించి అభ్యాసము (మరలమరల అనుష్టించుట) చేయుచు ఉండెను. వాసుదేవుడు చెప్పిన సమయమున అట్లు జరుగగానే జనార్దనుడు కొమ్ముగల మత్స్యము రూపమున ప్రాదుర్భవించెను. ఆది శేషుడు త్రాటిరూపమున మునిమనువుకడకు వచ్చెను. ఆధర్మవేత్త సర్వభూతములను లాగి దగ్గరకు తీసికొని సర్పపు త్రాటితో చేపకొమ్మున నావను కలిపికట్టెను. జనార్దనుని నమస్కరించి ఆ మత్స్యపు శృంగమునకు సమీపమున నిలిచెను. ఆ అవాంతర ప్రళయము గడిచిన తరువాత మనువు అడుగగా మత్స్యరూపుడు అగు యోగ శాయి విష్ణువు పురాణమును ప్రవచించెను. ఋషిసత్తములారా! దానిని మీకు ఇప్పుడు చెప్పెదను వినుడు. ఇంతకు ముందు మీరు నన్ను అడిగిన సృష్టి మొదలగు విషయములను గూర్చియే అట్లే ఏకార్ణవమున ఉన్న మనువు కేశవుని ఇట్లు ప్రశ్నించెను: ప్రపంచపు ఉత్పత్తిని ప్రళయమును వంశమును మన్వంతరములను వంశాను చరితమును భువన విస్తారమును వివిధములగు దానములను ధర్మములను శాశ్వతమగు శ్రాద్ధకల్పమును వర్ణాశ్రమ విభాగమును ఇష్టములు పూర్తములు అను సత్కర్మములను దేవతల ప్రతిష్టలు మొదలగునవి ఇది ప్రతియొక్కటియు చెప్పవేడుచున్నాను. 

 మత్స్య: మహాప్రళయకా లేతు ఏత దాసీ త్తమామయమ్

 ప్రసు ప్తమివ చాతర్క్య మప్రజ్ఞాత మలక్షణమ్

 అవిశ్లేయ మవిజ్ఞాతం జగత్సౌస్ను చరిష్ణు చ

 తత స్స్వయమ్భూ రవ్య క్తః ప్రభవః పుణ్యకర్మణామ్

వ్వఙ్ఞయన్నేవ తచ్చీలం ప్రాదురానీ త్తమోనుద

 అతీన్జియః పరోవ్యక్తా ద న్తర్యామీ సనాతనః

నారాయణ ఇతి ఖ్యాత స్స ఏష స్వయ ముద్బభౌ

 బ్రహ్మాండసృష్టి

 స్వశ రీర మభిధ్యాయ నిసృక్షు రఖిలం జగత్

 అవఏవ ససర్జాదౌ తాసు వీర్య మవాసృజత్

 తదేవాణం సమభవ ద్దేమరూపం పరం మహత్

 సంవత్సరసహసం త దసూర్యం తమసావృతమ్

 ప్రవిశ్యాన ర్మహాతేజా స్వయమే వాత్మసమ్భవమ్

ప్రహాయ మాత్స్య మవ్యక్తం విష్ణుత్వ మగమ త్పునః

 తద న రగవా నేష సూర్య స్సమభవ త్పునః

 ఆదిత్య శ్చాదిభూతత్వా దహ్మ బ్రహ్మపరత్వతః

 దివ్యం తదా సమభవ త్తదణ్ణం శకలద్వయమ్

 సచాక ఈ ద్దిశ స్సర్వా మధ్యే వ్యోమచ శాశ్వతమ్

 జరాయు మేత్య సజ్జితా శ్మేలా సస్యాభవం స్తదా

 యదుల్బం చాభవ న్మేషకి ప్రోతాంసి సరిత స్తథా

 సప్త సర్వే సముద్రాశ్చ నానారత్న సమన్వితాః

సద్యో ఒ థ నాడ్యఒస్సఙాతా స్సో తాంసీ సరిత స్తథా

 సప్త సర్వే సముద్రాశ్చ తే పి నా నగ్జలోద్భవాః

 లవణేముసురా ద్యొశ్చ నానారత్న సమన్వితాః

సిసృము రభవ ద్దేవః ప్రజాపతి రరిష్ణమః

య త్తేజ సత్ర తస్యైష మార్తాణ స్సమజాయత

 మృతే2న్డే జాయతే యస్మా స్మార్తాణ్ణి సేన స స్మృతః

రజోగుణమయం యత్త ద్రూపం తస్య మహాత్మనః

 చతుర్ముఖ స్స భగవా నభూ శ్లోక పితామహః

 యేన సృష్టం జగత్సర్వం సదేవాసురమానుషమ్

 తమ వేహి రజో రూపం మహత్తత్వము దాహృతమ్

ఇతి శ్రీమత్స్యమహాపురాణేమత్స్యమనుసంవాదేమత్స్యప్రోక్తావా న్తరప్రళయాదికథనంనామ ద్వితీయోధ్యాయః

బ్రహ్మాండ సృష్టి

మనువుతో మత్స్యము ఇట్లు పలికేను : (ఈ జరిగినది అవాంతర ప్రళయము. కాని ఈ కల్పాదికి ముందు) మహాప్రళయము జరిగిన సమయమున 'ఇది అంతయు చీకటితో నిండినదై స్థిర చర రూపమయిన ప్రపంచమంతయు గాఢనిద్ర యందు మునిగినదో అన్నట్లు తరప్రమాణముతో ఎరుగరానిదిగా అనుభూతిలో గురుతింపరానిదిగా దీని లక్షణము ఇది అని నిశ్చయించి చెప్పవీలుకానిదిగా అనుభవముతో తెలియ శక్యము కానిదిగా ఇంతవరకును అనుభవముతో తెలియ బడనిదిగా ఉండెను. అంతట నామరూపములతో వ్యక్తముకానివాడు యజ్ఞాది పుణ్యకర్మలకు కారణుడు అగు స్వయంభూ పరమేశ్వరుడు తన ఆ స్వభావమును వ్యక్తముచేయుచు ఆ చీకట్లను పోగొట్టుచు సాక్షాత్కారమునండెను. అనగా ఇంద్రియ ములకు గోచరము కానివాడును ఈ అవ్య క్రముకంటె పరుడు ( శ్రేష్టుడు)ను అంతర్యామి ( సమస్త భూతములయందుండి వాటి చిత్తవృత్తులను తన అదుపునం దుంచువాడుయు సనాతనుడు అతి ప్రాచీనుడు శాశ్వతుడు)ను నారాయణుడు అని ప్రసిద్ధి పొందినవాడు అగు ఆపరమాత్మయే స్వయముగా ఉద్బూతుడు అయ్యెను. తనకు శరీరము కావలెనని సంకల్పించు కొనుచు సమస్త జగత్తును సృష్టింపదలచుచు మొదట జలములనే సృష్టించేను. వాటియందు వీర్యమును నిలిపేను. ఆ వీర్యమే గొప్పదియు పెద్ద పరిమాణము కలదియు అగు బంగారు గ్రుడ్లుగా అయ్యేను. అది వేల సంవత్సరముల కాలము పాటు సూర్యుడే లేనిదై చీకటితో ఆవరింపబడినదయి యుండెను. మహా తేజస్వరూపుడు అగు పరమాత్మ తననుండి పుట్టిన గ్రుడ్డులోపల ప్రవేశించి అవ్య క్తమగు మత్స్యరూపము వదలి మరల విష్ణుత్వమును పొందెను. మత్స్యము - కేవలసత్-చిత్ - ఆనంద రూప విష్ణువు-ప్రవేశించి యుండువాడు) దానిలోపల ఈ భగవానుడు మరల సూర్యుడయ్యెను. ఆదిభూతుడు కావున ఆదిత్యుడు వేదపరుడగుటవలన బ్రహ్మయును అయ్యెను.

అంతట దివ్యమగు ఆ అండము రెండు ముక్కల య్యెను. అతడు అన్ని దిక్కులను శాశ్వతమగు -అండమునడుమ ఆకాశమును నిర్మించెను. దానీమావి నాశ్రయించి లోపలివైపున పర్వతములు ఏర్పడెను. ఉల్బము (మావితో సంబం ధించిన నీటిబుడగ) జల ప్రవాహములును నదులును నానారత్నములతో కూడిన సముద్రములును అయ్యెను. పరమాత్ముడగు ఆ దేవుడే ప్రజలను సృష్టింప సంకల్పించినం దున శత్రువుల నణచి ప్రజలను రక్షించగల ప్రజాపతి అయ్యెను. అండము మృతము(చీలినది) అయిన తరువాత ఏర్పడినందున అతని . ఆ తేజస్సునకు సూర్యునకు) మార్తాండుడని పేరువచ్చెను. ఆ మహాత్ముని రజోగుణమయ మగురూపము లోకముల కన్నిటికిని పితామహుడు(తాత)అగు చతుర్ముఖ భగవానుడుగా అయ్యెను. దేవాసుర మనుష్యులతో నిండిన జగమంతయు ఆయన చేతనే సృష్టింపబడినది. ఈర జోగుణ ప్రధాన పరమాత్ముని రూపమే మహత్తత్వము అని చెప్పబడుచున్నది.

ఇది మత్స్యమహాపురాణమున మత్స్యమనుసంవాదమున మత్స్యరూప నారాయణుడు మనువునకు అవాంతర ప్రళయాదికము నెరింగించుట అను ద్వితీయాధ్యాయము.