1 - ఋషుల ప్రశ్నము-మత్స్యా వతార కథనము

శ్లో శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

 ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నో పశాన్తయే

 యస్యాజ్ఞయా జగత్సష్టా విరిజ్చ పాలకో హరిః

 సంహర్తా కాలరుద్రాభ్యో నమస్తస్మై పినాకినే

 నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్

 దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

 అజోపి యః క్రియాయోగా న్నారాయణ ఇతి స్మృతః

 త్రిగుణాయ త్రివేదాయ నమస్తస్మై స్వయమ్ళువే

 దిక్కాలాద్యనవచ్చిన్నా న న్తచిన్మాత్రమూర్తయే

 స్వానుభూత్యేకహనాయ నమశ్శాస్తాయ తేజ సే

 సూత మేకాస్త మాసీనం నైమిశారణ్యవాసినః

 మునయో దీర్ఘసతా స్తే పప్రచ్చు ర్ధివ్యసంహితామ్

 ప్రవృత్తాసు పురాణానాం ధర్మ్యాసు లలితాసు చ

 కథాసు శౌనకాద్యా స్త మభినన్ద్య ముహుర్ముహుః

 కథితాని పురాణాని యాన్యస్మాకం త్వయానఘ

తాన్యేవామృతకల్పాని శ్రోతు మిచ్ఛామ హే పునః

 కథం ససర్జ భగవా న్మత్స్యరూపిత్వ మాశ్రితః

భైరవత్వం భవస్యాపి పురారిత్వం నిగద్యతే

ఆ కుతో హేతోః కపాలిత్వం జగామ స వృషధ్వజః

 ఏతత్సర్వం సమాచక్వ సూత విస్తరతః క్రమాత్

త్వద్వాక్య స్యామృత స్యైవ న తృప్తి రిహ జాయతే 

శ్లో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

 ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే

యస్యాజ్ఞయా జగత్సష్టా విరించిః పాలకో హరిః

 సంహర్తా కాలరుద్రాభ్యో సమ సస్మె పినాకినే

 అజోపి యః క్రియాయోగా న్నారాయణ ఇతి స్మృతః

 త్రిగుణాయ త్రివేదాయ నమస్తస్మై స్వయంభువే

 దిక్కాలాద్యనవచ్ఛిన్నా నంతన్మాత్రమూర్తయే

 స్వానుభూత్యేక మానాయ నమః శాంతాయ తేజ సే

(ఈ నాలుగు శ్లోకములును చూలములో 1-2-4-5 శ్లోకములుగా ఉన్నవి. ఏమయినను ఇవి మూలగ్రంథముతో సంబంధము కలవిగా తోచవు. రెవ సంఖ్యగల 'నారాయణం' అనుశ్లోకమును 6వ శ్లోకమునుండి తరువాతనున్న శ్లోకము లును వ్యాసుడు రచించిన శ్లోకములును మూలముతో సంబంధముకలవియును అనిపించుచున్నది.)

1. తెల్లని వస్త్రములు ధరించిన వాడును చంద్రుని వర్ణమువంటి దేహవర్ణము - కలవాడును నాలుగు భుజములు కలవాడును అనుగ్రహమును కురియు ముఖము కలవాడును అగు విష్ణుని సర్వవిఘ్నములును ఉపశమించుటకు ధ్యానించ వలయును.

2. ఎవని ఆజ్ఞచేత బ్రహ్మ లోకములను సృష్టించువాడును హరి పాలించువాడును కాలరుద్రుడు అను దేవుడు సంహరించువాడును అయ్యెనో పినాకము అనుధనువును ధరించిన అటువంటి శివునకు నమస్కారము.

3. ఎవరు పుట్టుక లేనివాడై యుండియు తాను చేయు క్రియల సంబంధమువలన నారాయణుడు (జలములు ఆధారస్థానముగా గలవాడు - జీవులకు ఆధారమయినవాడు) అని తలచబడు చెప్పబడుచున్నాడో - మూడు గుణములు కల వాడును వేదత్రయ స్వరూపుడును అగు స్వయంభువు తనంతట తానే ఉన్న వాడు) నకు నమస్కారము.

4. దిక్కులు కాలము మొదలగు వానిని బట్టి ఇక్కడ ఇటు ఈ కాలమునందు ఉన్నాడు అని నిర్ణయించ బడక అంతము లేని జ్ఞానము మాత్రము స్వరూపముగాగలదై (ఉపాసకుల) తమ అనుభూతి మాత్రమే ప్రమాణముగా కలది అగు శాంత (సాత్విక) మగు తేజస్సునకు నమస్కారము.

నరులలో ఉత్తముడయిన నారాయణమునిని అటువంటివాడే అయిన నరమునిని సరస్వతీదేవిని వ్యాసమహా మునిని నమస్కరించి అటు తరువాత 'జయము' అను సంప్రదాయ సిద్దము అయిన వ్యవహారముకల పురాణమును ప్రవచించవలెను.

 నైమిశారణ్యమున నివసించుచు ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము అను దీర్ఘసత్రయాగము జరుపుచుండిన మహా మునులు ఆసత్రపు విరామకాలమున ఏకాంతమున ఏకాగ్రమనస్సుతో కూర్చుండియున్న సూతుడు అను కథకు సంనిధికి వెళ్లి రి. అంతవరకును ఆయన ఆ దీర్ఘసత్ర విరామ సమయములందు ధర్మమునుండి తొలగనివియు మనోహరములును అగు పురాణ . కథలు వినిపించి ఉం డేను. మునులు ఆ కథలను ఆయన వాటిని తమకు చేప్పిన విధమును మాటిమాటికీని మెచ్చుకొనిరి. తరువాత ఏ రాయనను దివ్యమగు పురాణ సంహితా విషయమున ఇట్లు ప్రశ్నించిరి: అనసూ! మీరు మా కొంతవరకును గొన్ని పురాణములు ప్రవచించితిరి. అవి అమృతముతో సమానముగా నున్న వి. ఇంకను వినవలెనని మాకు వేడుకగ నున్నది. భగవానుడు ఏవిధముగ ఏకారణమున మత్స్యరూపమును ధరించి సృష్టి చేసెను? భవు(శివు)నకు భైరవుడు అనియు పురారి అనియును పేరులు కలవుకదా! ఆవృషభధ్వజున కే కపాలి అనియు వ్యవహారము కలదుకదా? వీటికి హేతువు ఏమి? ఇది అంతయు విస్తరించి మాకు చెప్ప వేడుచున్నాము. మీ వాక్యములు సాక్షాత్ అమృతమేయని మాకనిపించుచున్నది. ఇంతవరకును ఎంతగ వినినను మాకు తృప్తి కలుగుట లేదు. అని పలికిరి.

 సూతః: పుణ్యం పవిత్ర మాయుష్య మీదానీం శృణుత ద్విజాః

మాత్స్యం పురాణ మఖిలం య జ్ఞగాద గదాధరః

 పురా రాజా మనుర్నామ చీర్ణవా నరమం తపః

పుత్తే రాజ్యం సమారోప్య క్షమాపా నవినన్దనః

 మలయ స్యైక దేశే తు సర్వాత్మగుణసంయుతః

 సమదుఃఖసుఖం చైవ ప్రాప్తవా న్యోగ ముత్తమమ్

 బభూవ వరద శాస్య వరాయుతశతే గతే

 వరం వృణీ ష్వేత్యువాత ప్రేతాత్మా కమలాసనః

 ఏవ ముక్తోబ్రవీ ద్రాజా ప్రణమ్య చ పితామహమ్

 ఏక మే వాహ మిచ్చామి త్వతో వర మనుత్తమమ్

 భూతగ్రామస్య సర్వస్య స్థావరస్య చరస్య చ

 భవేయం రక్షణాయాలం ప్రళయే సముపస్థితే

 ఏవ మ వితి విశ్వాత్మా తతైవాన్తరధీయత

 పుష్పవృష్టిశ్చ మహతీ ఖాత్పపాత సురార్చితా

అది విని సూతు డిట్లు చెప్పనారంభించెను: బ్రాహ్మణులారా! సాక్షాత్ విష్ణువే చెప్పిన మత్స్యపురాణమును మీకు ఇప్పుడు చెప్పుచున్నాను. వినుడు. అది పుణ్యకరమును పవిత్రమును ఆయువును వృద్ధి చేయునదియును. పూర్వము సూర్యుని కుమారుడు అయిన మనువు అను రాజుం డెడివాడు. ఆయన ఆత్మ సంస్కారమునకు కావలయుగుణములన్నియు కలవాడు. క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారునకు రాజ్యము సప్పగించి మలయపర్వతముమీద నొక ప్రదేశ మున ఉత్తమతపమాచరించెను. సుఖదుఃఖముల యందు సమదృష్టి కలిగి ఉత్తమ యోగసాధన నవలంబించేను. పదిలక్షల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ వర మీయదలచి ప్రత్యక్షమయ్యెను. వరము కోరుకొమ్మని మనుపుతో పలికెను. మనుపు బ్రహ్మకు నమస్కరించి ఇట్లు పలికెను: “అన్నిటికం ఉత్తమమగు ఒ కేఒక వరము నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు చరములునగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును.” విశ్వమునకు ఆత్మరూపుడు అగు బ్రహ్మ అట్లే కానిమ్మని పలికి అక్కడనే అంతర్గాన మందెను. దేవతలు కలిగించిన పూలవాన ఆకాశము నుండి పడేనుకూడ .

కదాచి దాశ్ర మే తస్య కుర్వతః పితృతర్పణమ్

పపాత పాణ్యో రుపరి శఫరీ జలసంయుతా

 దృష్ట్వా త చ్చఫరీరూపం సదయోఒయం మహీపతిః

 రక్షణా యాకరో న్మత్స్యం స తస్మి నరకోద కే

 అహోరాత్రేణ చై కేన షోడశాజుళివి స్తృతః

 కోభవా న్మను ముద్వీక్ష్య పాహిపాహీతి చాబ్రవీత్

 స త మాదాయ మణి కే ప్రాహిణే జలచారిణమ్

 తత్రాపీ చై కరాత్రేణ హ సత్రయ మవర్ధత

పునః ప్రాహార్తనాదేన సహస్రకిరణాత్మజమ్

 స మత్స్యః పాహిపాహీతి త్వా మహం శరణం గతః

 తత స్ప కూపే తం మత్స్యం ప్రాహిణో ద్రవినన్దనః

 యదా న మాతిచక్రన్ద తదా మత్స్య స్సరోవరే

 క్షిప్త స్స పృథుతా మాగా త్పున ర్యోజనసమ్మితామ్

 తత్రా ప్యాహ పున ధీనః పాహిపాహీతి తం నృపమ్

 తత స్స మనునా ప్రో గజ్ఞాయా మభ్యవర్ధత

 యదా తా మఖిలాం తద్వత్తదాబై పాక్షిపన్నృపః

 తదా సముద్ర మఖిలం వ్యాప్యాసౌ సముపస్థితః

 తదా ప్రాహ మను రీతః కోసి త్వ మసు రేశ్వరః

 అథవా వాసుదేవ స్వ మన్యఖేడృ కథం భవేత్

 యోజ నాయుతవింశత్యా కస్య తుల్యం భవే ద్వపుః

 జాత స్వం మత్స్యరూపేణ మాం భేదయసి కేశవ

 హృషీ కేశ జగన్నాథ జగదామన్న మోస్తు తే

ఏవ ముక్త స్స భగవా న్మత్స్యరూపీ జనార్దనః

 సాము సాధ్వితి హోవాచ సత్యం జ్ఞాతం త్వయానఘ

 అచిరేకైవ కాలేన మేదినీ మేదినీపతే

 భవిష్యతి జలే మగ్నా సశెలవనకాననా

 నౌ రియం సర్వదేవానాం నికాయేన వినిర్మితా

 మయా జీవనికాయస్య రక్షణార్థం మహీపతే

 స్వేదాజ్ఞవోద్భిదా యే చ యే చ జీవా జరాయుజాః

 అస్యాం నిధాయ సర్వాం స్త్రీ నసర్దా తాహీ సువత

 యుగా నవాతాభిహతా యదా చలతి నౌ ర్నృప

 శృజేస్మీ న్మమ రాజేన్గ నిధేహి త్వం చ మాన్యధా

 తతో లయా నే సర్వస్యస్థావరస్య పరస్య చ

 ప్రజాపతి స్వం భవితా జగతః పృథివీపతే

 ఏవం కృతయుగ స్యాదౌ సర్వజ్ఞో భగవానృషిః

 మన్వ నరాధిపశ్చాపి దేవపూజ్యో భవిష్యసి

 ఇతి శ్రీ మత్స్యపురాణే మత్స్యమనుసంవాదే మత్స్యావతార  కథనం నామ ప్రథమోఽధ్యాయః

ఒకానొకనాడు మనువు తన ఆశ్రమమున పితృతర్పణము చేయుచుండగా ఒక ఆడు చేప నీటితో కూడి అతని రెండు చేతుల పై పడెను. ఆరోజు ఆచేషరూపమును చూచి దయకలిగి దానిని రక్షింపదలచి తన కమండలు జలములలో వై చేను. ఆ మత్స్యము ఒక అహోరాత్రములో పండ్రెండంగుళముల పొడవు కలదై మొగమె శ్రీమనువును చూచి రక్షించుము రక్షించుము అని పలికెను. ( బ్రిటిషు అంగుళము = ప్రాచీన భారతీయుల 1 అంగుళము మనువు ఆ చేపను తీసికొని వేడలు పైన మూతిగల మట్టిపాత్రలో వై చెను. అచ్చట అది ఒక అహోరాత్రములో మూడు మూరలంతగా పెరిగేను. మరల ఆ చేప సహస్ర కిరణాత్మజుడగు మనువుతో ఆర్తనాదముతో నేను నిన్ను శరణు పొందితిని. రక్షించు రక్షించు మనెను. ఆ రవినందనుడు దానిని బావిలో పడవే చేను. అది దానిలోను ఇముడక ఆక్రందనము చేయగా మనువు దానిని సరోవరమున పడవే చెను. అది అచ్చట రెండు యోజనములంత (1600 మూరలు) పెద్దది అయ్యెను. అచ్చటను అది దీనమయి రక్షించు రక్షించుము అని ఆరాజుతో పలికెను. అతడు దానిని అంతట గంగలో వేయగా అది అచ్చటను అట్లే ఆనది నిండుగా సరిపోవునంతగా పెరిగెను. అపుడారాజు దానిని సముద్రమున వేచెను. అపు డది సముద్రమంతట వ్యాపించి కనబడెను. అపుడు మనువు భయపడి నీవు ఎవ్వరవు? రాక్షస రాజవా? లేక వాసుదేవుడవా? అట్లు కానిచో నీవు ఇట్లు ఎట్ల గుదువు? రెండు లక్షల యోజనములంత శ రీరము ఎవ్వనికుండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై నన్ను శ్రమ పెట్టు చున్నావు. హృషీ కేశా! హృషీక + ఈశ_..విషయేంద్రియములకు అధిపతి) జగన్నాథా! జగద్దామా! (లోకములను తన యందు ఉంచుకొనుచు లోకములయందు తానుండువాడు) నీకు నమస్కారము. మనువు ఇట్లు పలుకగా మత్స్యరూపుడు అగు ఆభగవానుడు జనార్ధనుడు బాగుబాగు! అనఘా! నీవు సత్యము గ్రహించితివి. అచిర కాలముననే ఈ భూమి పర్వతముల-మహావనముల_వనములతో కూడ నీట మునుగును. ఇదిగో! ఈ నౌకను జీవసమూహములను రక్షించుటకై నేను దేవతల సమూహము చేత నిర్మింపజేసితిని. స్వేదజములు అండజములు ఉద్భిజ్ఞములు జరాయుజములు (చెమటనుండి ఉష్ణమునుండి పుట్టు దోమలు గ్రుడ్లనుండి పుట్టుపక్ష్యాదులు -నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు చెట్లు - మావినుండి పుట్టు మనుష్యులు మొదలగు ప్రాణులు) అగు ప్రాణులను అన్నింటికీ ఏకీడును కలుగకుండ కాపాడుము. ఈ ఓడ ప్రళయకాలపు వాయువశమున కదలిపోవు నేడల నీవు ఇది నా కొమ్మునకు కట్టివేయుము. మరొక విధముగ చేయవద్దు. ప్రళయ కాలము ముగిసిన తరువాత స్థిర చర రూపమయిన ఈ జగత్తున కంతటికి నీవు ప్రజాపతి వగుదువు. ఇట్లు కృతయుగారంభమున సర్వజ్ఞుడు భగవానుడు ఋషి మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేతను పూజింపబడెదవు.

ఇది మత్స్య మహాపురాణమున మత్స్యమనుసంవాదమున మత్స్యావతార కథనము అను మొదటి అధ్యాయము.