నారద మహా పురాణము
త్య్రంబక మాహాత్మ్యము
మోహిని పలికెను: గురువర్యా! నీవు చెప్పగా గౌతమ పుణ్య చరిత్రమును త్ర్యంబక మాహాత్మ్యమును గోదాపంచవటి ప్రభావమును వింటిని. ఇక ఇప్పుడు పుండరీక పురోద్భవమగు మహిమను విన దలచితిని. అచట మహాదేవుడు తాండవ నృత్యమునెట్లు చేసెనో ఆ పరమ పావన చరిత్రమును తెలుపుము.
వసువు పలికెను: మహాదేవుడు భక్తవశ్యుడు. సద్యోవర ప్రదుడు. భక్తులకు ప్రత్యక్షమగును. వారి అభీష్టమును ప్రసాదించును. ఒకపడు జైమిని అను వ్యాసశిష్యుడు మునీశ్వరుడు, అగ్నివేదాది శిష్యులతో తీర్థములను పర్యటించుచు వెళ్ళుచుండెను. అమరావతిని పోలిన పుండరీకపురమునకు వెళ్ళెను. సర్వఋతుయుతమగు వృక్షములచే అలంకరించబడినది. శీతలఛాయలతో శుభ్రవారి జలాశయములచే నానా పక్షి సంఘాకీర్ణములగు రమ్యమగు కలాకరములచే విద్యాధరుల కాంతి గల నరులచే అప్సరసలచే యువతులచే ప్రకాశించు భవనములచే విమానమువలె ప్రకాశించుచుండెను. ఆ నగర శోభను చూచి జైమిని మహర్షి ప్రీతి చెందెను. అచటి సరోవరమున స్నానమాడ సంకల్పించెను. దట్టమైన నీడకలిగి నానాపుష్ప సుగంధితమగు చెట్టు క్రింద సరస్తీరమున క్షణకాలము విశ్రమించి స్నానమాడి నిత్యకృత్యములను దేవర్షి పితృతర్పణమును గావించెను. పార్థివ లింగమును నిర్మించి అర్ఘ్యపాద్యాద్యుపచారములచే యధావిధిగా పూజించెను. ధూపదీపగంధ నైవేద్యములను సమర్పించెను. సుగంధి పుష్పములతో పూజించి నిలుచునంతలో ప్రసన్నుడగు శంకరుడు సాక్షాత్కరించెను. నానారత్న ప్రభలను వెదజల్లు ఆ పార్థివ లింగమున ప్రత్యక్షమైన శివునిచూచినజైమిని భూమిమీద దండమువలెపడి నమస్కరించి మరల లేచి చేతులు జోడించి ప్రపన్నార్తిహరుడు హరార్ధాంగుడగు హరిని గూర్చి ఇట్లు పలికెను.
జైమిని పలికెను: నేను ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని. దేవదేవా! జగత్పతీ! బ్రహ్మాదిధ్యేయుడ వగు నీవు దృష్టిగోచరుడవైతివి. అనగా అంతట ప్రసన్నుడైన శంకరుడు తన హస్తమును జైమిని శిరస్సుపై ఉంచి పుత్రా! ఏమికావలయునో చెప్పుము అని పలికెను. శంకరుని మాటలను విన్న జైమిని మహర్షి పార్వతితో విఘ్నేశ, కుమారులతో మిమ్ములను దర్శించవలయునని కోరెను. వెంటనే శంకరుడు జైమిని కోరికమేరకు దర్శనమిచ్చి ఇంకనూ ఏమి కావలయునని కోరెను. జగద్గురువగు శంకరుని దయను గుర్తించిన జైమిని విస్మయము చెందుచు తాండవ నృత్యమును చేయుచున్న తమను చూడవలెనని కోరుచున్నాను అని పలికెను. జైమినికోరికను నెరవేర్చుటకు పార్వతీపతి నానాక్రీడావిశారదులగు ప్రమధుల నందరిని స్మరించెను. ఇట్లు తలచిన వెంటనే నంది భృంగి మొదలగు ప్రమధ గణములన్నియూ కౌతూహలముతో పరస్పరము మాటలాడుచు వచ్చిరి. పార్వతీ పరమేశులకు విఘ్నేశునికి, కుమారునికి నమస్కరించి దేవదేవుని ఆజ్ఞను ఎదురు చూస్తూ నిలిచిరి. అంతట శంకరుడు ఆ విచిత్ర వేష భూషణములు కలవాడై అద్భుత వేషమును ధరించి నటించుటకు సన్నద్ధుడాయెను. కదలాడు సర్పకంకణములను ధరించి చిరునవ్వు మోముతో శిరమున ఉన్న చంద్రలేఖతో కేశములుమెరయ శోభించుచుండెను. చక్కని కనులు చూపులతో భస్మదేహపు కాంతిలో చంద్రుని వెన్నెలను జయించి, జటాకలాపమునుండి బయలు వెడలు గంగతో తడిసిన దేహము కలవాడై లలాటనేత్రము నుండి ప్రకాశించు అగ్నిచేత తపించు చంద్రుడు కలవాడై చంద్రుని నుండి వచ్చిన అమృతముచే బ్రతుకుచున్న లేడి కలవాడుగా నుండెను. కుమారస్వామి వాహనమగు నెమలి చంచువుచే లాగబడుచున్న సర్పపుంకృతి కలవాడై ప్రవహించు అమృతముచే జీవించు అబ్జయోని, సర్పములకు భయపడు వినాయక వాహనమగు ఎలుక చేయు ధ్వని కలవాడై పార్వతి వాహనమగు సింహము గర్జనతో భయమును ప్రకటించు కనులు గల నంది అంబారావము కలవాడుగా ఉండెను. మాటిమాటికి చేయు పదపాతములచే భూమిని కంపింపచేయుచు ప్రకర్ష వాద్యధ్వనులచే సంతోషించి పులకాంకురములు కలవాడు దేవ దానవ మకుట కిరీట రత్నరాజిత పాదపద్మునిగా గణేశ కుమారస్వామి పార్వతులచే చూడబడుముఖాంబుజము కలవాడు సంతోషముపెరిగిన భక్తులు చేయు జయశబ్దములు కలవాడు, పెరిగిన తాండవముతో దిక్కులను ప్రకాశింపచేయుచు శివుడు విరాజిల్లెను. శంకరుని నృత్యమును చూచిన జైమిని మహర్షి ఆనంద సాగరమున మునిగి వేదపాదస్తవముతో శివుని స్తుతించెను.
విరించి విష్ణుగిరిశ ప్రణతాంఘ్రి సరోరోహే|
జగన్మాతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని ||
విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత |
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే |
ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటకమ్ |
హిరణ్య మండలం వందే కుమారం పుష్కర స్రజమ్
శివం బ్రహ్మాది దుర్దశ్శం నరః కస్త్పోతు మర్హతి |
దర్శనాంతే స్తుతిర్మే సా చాభ్రా ద్వృష్టిరివాజని
నమశ్శివాయ సాంబాయ నమశ్శర్వాయ శంభవే |
నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః
పాదభిన్నాయ లోకాయ మౌలి భిన్నోండభిత్తమే |
భుజభ్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః
శంకరాయ నమస్తుభ్యం మంగళాయ నమోనమః |
ధనానాం పతయే తుభ్య మన్నానాం పతయే నమః ||
కాలాకాలాయ సోమాయ యోగినే శూలపాణయే |
అస్థిభూషాయ శుద్ధాయ జగతాం పతయే నమః ||
పాత్రే సర్వస్వ జగతో నేత్రే సర్వదివౌకసామ్ |
గోత్రాణాం పతయే తుభ్యం క్షేత్రాణాం పతయే నమః
ఆత్మాధి పతయే తుభ్యం నమో మీఢుష్టమాయచ |
అష్టాంగాయాతి హృద్యాయ క్లిష్ట భక్తేష్ట దాయినే |
ఇష్టిఘ్నాయ సతుష్టాయ పుష్టానాం పతయే నమః ||
పంచభూతాధి పతయే కాలాధి పతయే నమః |
నమ ఆత్మాధిపతయే దిశాం చ పతయే నమః ||
విశ్వకర్త్రే మహేశాయ విశ్వభర్త్రే పినాకినే
విశ్వహంత్రే అగ్ని నేత్రాయ విశ్వరూపాయవై నమః |
ఈశాన తే తత్పురుష నమో ఘోరాయ తే సదా
వామదేవ నమస్తే అస్తు సద్యో జాతాయవై నమః |
భూతి భూషాయ భక్తానాం భీతి భంగ ప్రదాయినే
నమో భవాయ భర్గాయ నమో రుద్రాయ మీఢుషే |
సహస్రాంబాయ సాంబాయ సహస్రాభీషవే నమః
సహహ్రా బాహవే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే |
సుకపోలాయ సోమాయ సులలాటాయ సుభ్రువే
సుదేహాయ నమస్తుభ్యం సుమృడీకాయ మీఢుషే |
భవక్లేశని మిత్తోరు భయచ్ఛేద కృతే సదా
నమస్తుభ్య మషాఢాయ సహమానాయ మీఢుషే |
వందే అహం దేవమానంద సందోహం లాస్య సుందరమ్
సమస్త జగతాం నాధం సదసస్పతి మద్భుతమ్ |
సుజంఘం సుందరం క్షేమం రక్షోభూత క్షతిక్షమమ్
యక్షేశ్రేష్టం నమామీశ మక్షరం పరమం ప్రభుమ్ |
అర్థాలక మవస్త్రార్ధ మస్థ్యుత్పల దలస్రజమ్
అర్తపుం లక్షణం వందే పురుషం కృష్ణ పింగలమ్ |
సకృత్ప్రణత సంసార మహాసాగర తారకమ్
ప్రణమామి తమీశానం జగతస్త స్థుషస్పతిమ్ |
ధాతారం జగతా మీశం దాతారం సర్వసంపదామ్
నేతారం మరుతాం వందే జేతార మపరాజితమ్ |
తం త్వా మంతకనేతారం వందే మందాకినీధరమ్
దధాతి విదధద్యోమాం ఇమాని త్రీణి విష్టపా |
సర్వజ్ఞం సర్వగం సర్వం కలిం వందే తమీశ్వరమ్
యతశ్చ యజుషా సార్థ మృచస్సామాని జజ్ఞిరే |
భవంతం సుదృశం వందే భూత భవ్య భవంతి చ
త్యజన్తీ తర కర్మాణి యో విశ్వాభి విపశ్యతి |
హరం సురనియంతారం హంతార మహమానతః
యదాజ్ఞయా జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః |
తం నమామి మహాదేవం యన్నియోగాదిదం జగత్
కల్పాదౌ భగవాన్ దాతా యథా పూర్వమకల్పయత్ |
ఈశ్వరం తమహం దేవం యస్య లింగమహర్నిశమ్
యజంతే సహ భార్యాభిరింద్ర జ్యేష్టా మరుద్గణాః |
నమామి తమిమం రుద్రం యమభ్యర్చ్య సకృత్పురా
అవాపు స్వృంస్వమైశ్వరం దేవాసః పూతరాతయః |
తం వందే దేవ మీశానం యం జపం హృదయాంబుజే
సతసం యత శ్శాంతా స్సంజానానా ఉపాపతే ||
తదస్మై సతతం కుర్మో నమః కలమ కాంతయే ||
ఉమాకుచ పటోరస్క యాతే రుద్ర శివాతమాః |
నమస్తే రుద్ర భావాయ నమస్తే రుద్ర కేలయే
నమస్తే రుద్ర శాన్యైచ నమస్తే రుద్ర మన్యవే ||
వేదాశ్వర ధనిష్ఠాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక
బాణకార్ముక యుక్తాభ్యాం బాహుభ్యాముత తే నమః |
నమస్తే వాసుకి జ్యాయ విష్కిరాయ చ శంకర
మహతే మేరు రూపాయ నమస్తే అస్తు ధన్వనే |
నమః పరశవే తే అస్తు శూలాయాతుల రోచిషే
హయగ్రీవాత్మనే తుభ్య ముతోత ఇషవే నమః
ధరాధర సుతాలీల సరోజాహత బాహవే
తస్మై తుభ్య మఘోరాయ నమో అస్మో శ్రవస్యచ
రక్షమా మజ్ఞ మక్షీణ మశిక్షిత మనన్యగమ్
అనాధం దీన మాపన్నం దరిద్రం నీల లోహితమ్ |
దుర్ముఖం దుష్క్రియం దుష్టం రక్ష మా మీశ దుర్దశమ్
ఆదృశా తమహం నత్వ దన్యం విందామి రాధసే |
భావాఖ్యే నాగ్నినా శంభో రాగద్వేష మదార్చిషా
దయాలో దహ్యమానానా మస్మాక మవితా భవ |
పరదారం పరావాసం పరవస్త్రం పరాశ్రయమ్
హర పాహి పరాన్నం మాం పురుణామన్పురుష్టుత|
లౌకికైర్యత్కృతం దుష్టై ర్నావమానం సహామహే
దేవేశ తమ దాసేభ్యో భూరిదా భూరి దేహినః |
కులోకానా మయత్నానాం గర్విణా మీశ పశ్యతామ్
అస్మభ్యం క్షేత్ర మాయుశ్చ వసుస్పార్హం తదాభర ||
యాఞ్చాతో మహతీం లజ్జా మస్మదీయాం ఘృణానిధే
త్వమేవ వేత్సి నస్తూర్ణ మిదం స్తోతృభ్య ఆభర |
జాయా మాతాపితా చాన్యే మాం ద్విషన్త్య మితం కృశమ్
దేహి మే మహతీం విద్యాం రాయా విశ్వపుషా సహ |
అదృష్టార్దేషు సర్వేషు దృష్టార్దేష్వపి కర్మసు
మేరు ధన్వన్న శక్తేభ్యో బలం దేహి తనూషు నః ||
లబ్దానిష్ట సహస్రస్య నిత్యమిష్ట వియోగినః
హృద్రోగం మమ దేవేశ హరిమాణం చ నాశయ |
యే యే రోగాః పిశాచా వానరా దేవాశ్చ మామిహ
బాధన్తే దేవతా స్సర్వా నిబాధస్వ మహానసి |
త్వమేవ రక్షితా స్మాక మన్యః కశ్చిన్న విద్యతే
తస్మాత్స్వీకృత్య దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతే
త్వమేవో మాపతే మాతా త్వం పితా త్వం పితామహః
త్తమాయుస్త్వ మతిసత్త్వం శ్రీ రుత భ్రాతోత నస్సఖా |
యతస్త్వామేవ దేవేశ కర్తా సర్వస్వ కర్మణః
తతః క్షమస్వ తత్సర్వం యన్మయా దుష్కృతం కృతమ్ |
త్వత్సమో న ప్రభుత్వేన ఫల్గుత్వే న చ మత్సమః
తతో దేవ మహాదేవ త్వమస్మాకం తవాస్మ్యహమ్ |
సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహమ్
ప్రసన్నవదనం సౌమ్యం గాయే త్వా మనసా గిరా |
ఏష ఏవ వరో అస్మాకం నృత్యంతం త్వాం సభాపతిమ్
లోకయంత ముమాకాంతం పశ్యేమ శరదశ్శతమ్ |
అరోగిణో మహాభాగ విద్వాంసశ్చ బహుశ్రుతాః
భగవంస్త్వత్ప్రసాదేన జీవేమ శరదృతమ్ |
దేవ దేవ మహాదేవ త్వదీయాంఘ్రి సరోరుహమ్
కామం మధు మయం పీత్వా మోదామ శరద శ్శతమ్ |
కీటా నాగా పిశాచా వా యే వా కే వా భవే భవే
తవ దాసా మహాదేవ భవామశ్శరదశ్శతమ్ |
సభాయా మీశ తే దేవ నృత్య వాద్యగళ స్వనమ్
శ్రవణాభ్యాం మహాదేవ శృణుయామ శరద శ్శతమ్ |
సభా యా మీశతే చేత నృత్య వాద్యగల స్వనమ్
శ్రవణాభ్యాం మహాదేవ ర్పణుయామ శరదశ్శతమ్
స్మృతి మాత్రేణ సంసార వినాశన కరాణి తే
నామాని ఖలు దివ్యాని బ్ర్రవామ శరద శ్శతమ్ |
ఇషు సంధాన మాత్రేణ దగ్ధత్రిపుర ధూర్జటే
ఆదిభిర్వ్యాధిభిర్నిత్య అజితాస్స్యామ శరదశ్శతమ్ |
చారు చామీకరా భాసం గౌరీకుచ పటోరసమ్
కదాను లోకయిష్యామి యువాసం విశృతిం కలిమ్ |
ప్రమధేంద్రావృతం పీత వదనం ప్రియవాసనమ్
సేవిష్యే హం కదా సాంబం సుభాసం శుక్ర శోచిషమ్ |
బహ్వేనసం మామకృత పుణ్యలేశం చ దుర్మతిమ్
స్వీకరిష్యతి కిన్వీశో నీలగ్రీవో విలోహితః |
కాలశూలానలాసక్తం భీతం వ్యాకుల మానసమ్
కదానుద్రక్ష్యతీశో మాం తువిగ్రీవో అనానతః |
గాయకా యూయ మాయాత యది రాగాది లిప్సవః
ధనదస్య సఖాయం త ముపాస్మై గాతా నరః |
స్తస్త్వస్తు సఖి తే జిహ్వే విద్యాదాతురుమాపతేః
స్తవ ముచ్చతరం బ్రూహి జయతామిన దుందుభిః |
చేతయాజన శాంతస్త్వం నేదం వేదాఖిలం జగత్
అస్య తృప్త్యఖిలం శంభో ర్గౌరో సతృపితః పిబ |
సుగంధించ సుఖస్పర్శం కామదం సోమ భూషణమ్
గాఢమాలింగ మచ్ఛిత్తం యోషా జారమివ ప్రియమ్ |
మహామయూఖాయ మహా భుజాయ మహా శరీరాయ మహాంబరాయ మహాకిరీటాయ మహేశ్వరాయ మహో మహీం సుష్టుతి మీరయామి
యథా కధంచి ద్రచితాభిరీష త్ప్రసన్నత శ్చారుభిరాదరేణ
ప్రపూజయామి స్తుతిభిర్మహేశ మషాఢ ముగ్రం సహమానమాభిః
నమశ్శివాయ త్రిపురాంతకాయ జగత్త్రయే శాయ దిగంబరాయ
నమో అస్తు ముఖ్యాయ హరాయ భూయో నమో జఘన్యాయ చ బుద్ధ్నియాయ
నమో వికారాయ వికారిణే తే నమో భవాయాంతు భవోద్భవాయ
బహు ప్రజాత్యంత విచిత్ర రూప యతః ప్రసూతా జగతః
తస్మై సురేశోరు కిరీట నానా రత్నా వృతాష్టా పదవిష్టరాయ
భస్మాంగరాగాయ నమః పరస్మై యస్మాత్పరం నా పరమన్తి కించిత్ సర్పాధిరాజౌషధినాధ యుద్ధ క్షుబ్యుజ్జటా మండల గహ్వరాయ
తుభ్యం నమ స్సుందర తాండవాయ యస్మిన్నిదం సంచ విచైతి సర్వమ్
మురారి నేత్రార్చిత పాద పద్మ ముమాంఘ్రి లాక్షా పరిరక్త పాణిమ్
నమామి దేవం వృషనీల కంఠం హిరణ్యదంతం శుచి వర్ణమారాత్
అనంత మవ్యక్త మచింత్య మేకం హరంతమాశాంబర మంబరాంగమ్
అజం పురాణం ప్రణమామి యూప మణోరణీ యాన్మహతో మహీయాన్
అంతస్థ్స మాత్మాన మజం న దృష్ట్వా భ్రమంతి మూఢా గిరి గహ్వరేషు
పశ్చాదుదగ్ధ క్షిణతః పురస్తా దధస్స్విదాసీ దుపరిస్విదాసీత్
ఇమం న మామీశ్వర మిందుమూలే శివం మహానంద అశోక దుఃఖమ్
హృదంబుజే తిష్ఠతి యః పరాత్మా యతశ్చ సర్వాః ప్రదితో దిశశ్చ
రాగాది కాపట్య సముద్భవేన బ్రాస్తం భవాఖ్యేన మహామయేన |
విలోక్య మాం పాలయ చంద్రమౌలీ భిషక్తమం త్వా భిష జా శృణోమి
దుఃఖాంబురాశిం సుఖలేశహీనం అస్పృష్ఠ పుణ్యం బహుపాతకం మామ్
మృత్యోః కరస్థం భవరక్షభీతం పశ్చాత్పురస్తా దధరాదుదస్తాత్
గిరీంద్రజా చారు ముఖావలోక సుశీతయా దేవ తవైన దృష్ట్యా
వయం దయాపూరితయైన పూర్ణ మపో న నావా దురితా తరేమ
అపార సంసార సముద్ర మధ్యే నిమగ్నముత్రోశ మనల్పరాగమ్
మామక్షమం పాహి మహేశజుష్ట మోజిష్ఠయా దక్షిణయేవ రాతిమ్
స్మరన్పురా సంచిత పాతకాని ఖరం యమస్యాపి ముఖం యమారే |
బిభేమి మే దేహి యధేష్ట మాయు ర్యదీక్షతాయుర్యది వా పరేతః
సుగంధి భిస్సుందర భస్మరాగై రనంత భోగైస్మృదులైరఘోరైః
ఇమం కదాలింగతి మాం పినాకీ స్థిరేభి రంగైః పురురూప ఉగ్రః
క్రోశస్త మీశం పతితం భావాబ్ధౌ నాకస్థ మండూక మివాతి భీతమ్
కదాను మాం రక్షతి దేవదేవో హిరణ్య రూప స్సహిరణ్య సందృక్
చారుస్మితం చంద్ర కలావతంసం గౌరీ కటాక్షారుహయుగ్మ నేత్రమ్
ఆలోకయిష్యామి కదాను సాంబ మాదిత్య వర్ణం తమసః పరస్తాత్
ఆగచ్చతానాది ముముక్షవో యే యూయం శివం చింతయతాంతరే అజ్ఞే
ధ్యాయంతి ముక్త్వర్థమముం హి నిత్యం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః
ఆయాత యూయం భవతాధిపత్యే కామం గుహేశం గిరిశం యజధ్వమ్
ఏవం పురాభ్యర్చ్య హిరణ్యగర్భో భూతస్య జాతః పతిరేక ఆసీత్
ఏకాయనం తే విపులాం శ్రియం తే శ్రీకంఠమేనం సుకృతా నమంతామ్
శ్రీమానయం శ్రీపతి వంద్యపాదః శ్రీణాముదారో ధరుణో రయీణామ్
సుపుత్ర కామా అపి యే మనుష్యా యువాన మేనం గిరిశం యజంతామ్ యతస్స్వయం భూర్జగతో విధాతా హిరణ్య గర్భస్సమవర్తతాగ్రే
అలం కిముక్తైర్భహుభి స్సమీహితం సమస్త మస్యాశ్రయణేన సిద్ధ్యతి
పురైన మాశ్రిత్య హి కుంభ సంభవో దివాన నక్తం పలితోయువాజని
అన్యత్పరిత్యజ్య మమాక్షిభృంగాః సర్వం సదైనం శివమాశ్రయధ్వమ్
ఆమోదవానేష మృదు శ్శివాయ స్వాదుః ష్కలాయం మధుమాం ఉతాయమ్
భవిష్యసి త్వం ప్రతిమాన హీనో వినిర్జితాశేష నరామరశ్చ
నమశ్చ తే వాణి మహేశమేనం సుహి శ్రుతం గర్త సదం యువానమ్ యద్యన్మనశ్చిన్తయసి త్వమిష్టం తత్త ద్భవిష్యత్యఖిలం ధ్రువం తే
దుఃఖేన వృత్తిం విషయే కదాచి ద్యక్ష్యా మహే సౌమనసాయ రుద్రమ్
అజ్ఞాన యోగాదప చారకర్మ యత్పూర్వ మస్మాభిరనుష్ఠుతం తే
తదేవ సోఢా సకలం దయాలో పితేవ పుత్రాన్ప్రతి నో జుషన్వ
సంసారాఖ్య క్రుద్ధ సర్వేణ తీవ్ర రాగద్వేషోన్మాద లోభాదిదన్తైః
దష్టం దృష్ట్వా మాం దయాలుః పినాకీ దేవ్నస్త్రాతా త్రాయతా మప్రయచ్ఛన్
ఇత్యుక్త్వాతే యే సమాధేర్నమంతే రుద్ర త్వాం తే యాంతి జన్మాహి దష్టాః
సంతో నీలగ్రీవ సూత్రాత్మనాహం తత్త్వా యామి బ్రహ్మణా వందమానః
భవాధి భీషణ జ్వరేణ పీడితాన హోమయా నశేష పాతకాల యా నదూరకాలలోచనాన్
అనాథనాథ తే కరేణ బేషజేన కాలహా ఉదూషణో వసేమహే మృశస్వ శూరరాధసే జయేమ యేన సర్వమేత దిష్ట మష్ట దిగ్గణం భువస్థ్సలం దివస్థలం చ తద్గతమ్
య ఏవ సర్వదేవ దానవ ప్రభు సభాపతి స్సనో దదాతు తం రయిం పురుం పిశంగ సదృశమ్
నమో భవాయ తే హరాయ భూతి భాసితో రసే నమో భవాభిభూతి భీతి సంగినే పినాకినే
నమశ్శివాయ విశ్వపాయ శాశ్వతాయ హేలయే న యస్య హన్యతే సఖా న జేయతే కదాచన
సురపతి పతయే నమోనమః ప్రజాపతి పతయే నమోనమః |
క్షపతి పతయే నమోనమో అంబికా పతయ ఉమాపతయే నమో నమః
వినాయకం నిత్యం ప్రణాతార్తినాశం కవిం కవీనా ముపమశ్రవంతమమ్
దేవా యుద్దేయాగే విప్రా స్త్వా మాహ్వాయంతి భువనే మముజాః
ద్వయం విదంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోమ్ నమశ్శివాయై జగదంబికాయై శివప్రియాయై శివవిగ్రహాయై
సముద్భభూవాద్రిపతే స్సుతాయా చతుష్కపర్దా యువతిస్సుపేశాః
హిరణ్య వర్ణాం మణినూపురాంఘ్రిం ప్రసన్నవక్త్రాం శుకపద్మ హస్తామ్
విశాల నేత్రాం ప్రణమామి గౌరీం వచో విదం వాచ ముదీర యంతీమ్
నామామి మేనా తనయామయేయా మిమా ముమాం కాంతిమతీ మమేయామ్
కరోతి యా భూతిసితౌ స్తనౌ ద్వౌ ప్రియం సఖాయాం పరిషస్వజావా
కాంతా ముమాకాంతని భాంగకాంతి భాంతా ముపాత్తానతహర్య జేంద్రామ్
నతో అస్మి యాస్తే గిరిశస్య పార్శ్వే విశ్వాని దేవీ భువనాని చష్టే
వందే గౌరీం తుంగపీన స్తనీం తాం చంద్రచూడాం క్లిష్ట సర్వాంగరాగామ్
యైషా దుఃఖి ప్రాణినా మాత్మకాంతిం దేవీం దేవీం రాధసే చోదయంతీమ్
ఏనాం వందే దీన రక్షా వినోదాం మేనాకన్యాం మానదానందధాత్రీమ్
యా విద్యానాం మంగళానాం చ వాచామేషా నేత్రీ రాధసే సూనృతానామ్
సంసారతా పోరు భయాపహంత్రీ భవాని భోజ్యాభరణైకభోగే
ధియం వరాం దేహి శివే నిరర్గళాం యయాతి విశ్వాదురి తా తరేకేమ
శివే కథం త్వత్సమతా క్వ దీయతే జగత్కృతిః కేళిరయం శివః పతిః
హరిస్తు దాసో అను చరీందిరా శచీ సరస్వతీ వా సుభగా దదీర్వసు
బ్రహ్మ విష్ణు మహేశులచే నమస్కరించబడు పాదపద్మములు కలదానా, కాంపిల్య వాసినీదేవి! పార్వతీ! జగన్మాతా! నీకు నమస్కారము. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్రవందితా! బ్రహ్మాధిపతీ గణేశా! నీకు నమస్కారము. పార్వతీదేవి సుకుమార హస్తములచే లాలించబడు ముఖములుకల హిరణ్య మండలధారి పద్మమాలాలంకృతుడగు కుమారస్వామికి నమస్కరించుచున్నాను. బ్రహ్మాదులకు చూడ శక్యము కాని శివుని ఎవడు స్తుతించగలడు. నీ దర్శనము వలన మేఘమునుండి వర్షమువలె స్తుతి నానుండి ప్రసరించు చున్నది. శివునకు సాంబునకు, శర్వునకు, శంభునకు, నటునకు, రుద్రునకు సదసస్పతికి నమస్కారము. పాదభిన్నలోకునకు మౌలిభిన్నాండ భిత్తికి, భుజభ్రాంత దిగంతునకు భూతపతికి నమస్కారము. శంకరునకు మంగళునకు ధనపతికి జగత్పతికి నమస్కారము. క్వణ న్నూపురయుగ్మనకు, విలసత్కృత్తివాసునకు ఫణీంద్ర మేఖలునకు పశుపతికి నమస్కారము. కాలవాలునకు సోమునకు యోగికి శూలపాణికి అస్థి భూషునకు, శుద్ధునకు జగత్పతికి నమస్కారము. సర్వ జగత్పాలకునకు సర్వదేవనాయకునకు గోత్రపతికి మీఢుష్టమునకు నమస్కారము, అప్టింగునకు, అతి హృద్యునకు పుష్పపతికి, పంచభూతాధిపతికి, కాలాధిపతికి నమస్కారము. ఆత్మాధిపతికి దిక్పతికి విశ్వకర్తకు, మహేశునకు విశ్వభర్తకు పినాకికి నమస్కారము. విశ్వహంతకు, అగ్నినేత్రునకు విశ్వరావునకు ఈశానునకు తత్ఫురుషునకు భూతి భూషునకు, భక్త భీతిహరునకు నమస్కారము, భవునకు, భర్తునకు, రుద్రునకు, సహస్రాంబునకు, సాంబునకు, సహస్ర భీషునకు సహస్ర బాహువునకు, సహస్రాక్షునకు, సుకపోలునకు, సోమునకు సులలాటునకు సుభ్రువునకు, సుదేహునకు నమస్కారము. సుమృడీకునకు, భవక్లేశనిమిత్త ఉరుభయచ్ఛేద వారికి ఆషాఢునకు, సహమానునకు నమస్కారము, ఆనంద సందోహునకు, లాస్య సుందరునకు, సమస్త జగన్నాధునకు, సదసస్పతికి, అద్భుతునకు నమస్కారము. సుజంఘునకు, సుందరుని క్షాముని, రక్ష భూతనాశ దక్షుని, యక్షేశ ప్రియుని, అక్షరుని, పరమ ప్రభునికి నమస్కరించుచున్నాను. అర్థాలకుని, అవస్త్రార్థుని, అస్థ్యుత్పలదలమాలుని, అర్థపుంలక్షణుని, కృష్ణ పింగళ పురుషునికి నమస్కరించుచున్నాను. ఒకసారి ఆశ్రయించినవారిని సంసార సాగరము నుండి తరింపచేయువానిని, స్థావర జంగమనాధుని ఈ శానునికి నమస్కరించు చున్నాను. జగద్ధాతను, సర్వ సంపద్ధతను, మరున్నేతను, సకలజేతను, అపరాజితుని, అంతకనేతను, మందాకినీధరుని నమస్కరించుచున్నాను. ఈ మూడు జగములను ధరించువానిని, సర్వజ్ఞుని, సర్వగతుని, సర్వుని, కవిని ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. ఋగ్యజుస్సా మోద్ధవ స్థానునిభవుని, సునేత్రుని భూతభవ్యభవత్స్వరూపుని ఇతర కర్మలను విడిచి విశ్వమును సమీక్షించు వానిని హరుని సురనియంతను అహంకారహంతనునకు నమస్కరించుచున్నాను. నారాయణుడు ఈ జగత్తునంతటిని వ్యాపించి ఉండుటకు ఆజ్ఞ ఇచ్చిన వారిని జగన్నియనకు నమస్కరించుచున్నాను. కల్పాది అందు ఈ జగత్తును యధాపూర్వకముగా సృజించిన వానిని ఈశ్వరుని అహర్నిశము లింగరూపముగా పూజింపబడు వానికి రుద్రుని నమస్కరించు చున్నాను. ఒకసారి అర్చించినంతనే ఇంద్రాది దేవతలకు సకలైశ్వర్యములను ఇచ్చిన వానికి నమస్కరించుచున్నాను. శాంతులు సమ్యక్ జ్ఞానులగు యతులచే హృదయాంబుజమున సతతము ఉపాసించబడువానిని కమలసన్నిభునికి నమస్కరించుచున్నాను. ఉమాకుచపటోరస్క శివతనువునకు, రుద్ర భావునకు రుద్రకేళికి నమస్కారము. రుద్రశాంతునకు, రుద్రమన్యునకు, వేదాశ్వరథనిష్టములగు పాదములు బాణ కార్ముక యుక్తములగు బాహువులు కలవానికి నమస్కారము. వాసుకిజ్యునకు, విష్కరునకు, శంకరునకు, మహామేరు స్వరూప ధన్వికి నమస్కారము. పరశురూపునకు శూలరూపునకు, అతుల రోచిష్కునకు, హయగ్రీవాత్మకునకు నమస్కారము. దానవ స్త్రీహార హారికి. ఇతరాస్త్రధారికి నమస్కారము. పార్వతీ లీలాపద్మఅహత బాహువునకు, అఘోరునకు నమస్కారము. అజ్ఞుని ఆక్షీణుని అశిక్షితుని, అనన్యగతిని, అనాధుని, దీనుని ఆపన్నుని, దరిద్రుని నీలలోహితుని, దుర్ముఖుని, దుష్క్రియుని, దుష్టుని, దుర్దశుని నన్ను రక్షించుము. నిన్ను తప్ప ఇతరులను ఆరాధించుట నా పుట్టుక నుండి నాకు తెలియదు. భావాగ్నిచే, రాగద్వేషమదజ్వాలలచే దహించబడు మాకు రక్షకుడవుకమ్ము. పరదారరతుని, పరావాసుని, పరవస్త్రుని, పరాశ్రయుని పరాఙ్మఖుని నన్ను పురునామా! పురుష్టుతా! కాపాడుము. దుష్టులగు లౌకికులచే చేయబడు అవమానమును సహించలేము. కావున నీ దాసులగు మాకు క్షేత్రమును ఆయువును ధనమును ప్రసాదించుము. యాచించు మేము పొందు బిడియము నీకు తెలుసు. కావున నిన్ను స్తుతించువారికి పరిపూర్ణతను ప్రసాదించుము. తల్లి తండ్రి భార్య ఇతరులు నన్ను అమితముగా ద్వేషించుచున్నారు. కావున నాకు మహావిద్యను, ధనము ధాన్యమును ప్రసాదించుము. అదృష్టార్థములు, దృష్టార్థములగు సర్వకర్మలందు శక్తి హీనులమగు మాకు శరీరములందు బలమును నింపుము. అనిష్టములను పొంది ఇష్టములను పోగొట్టుకొనిన మా హృద్రోగమును నశింపచేయుము. నన్ను బాధించు పిశాచములను నరులను దేవతలను మహాత్ముడవగు నీవు బాధించుము. మాకు నీవు తప్ప వేరొక రక్షకుడు లేడు. కావున ఓ దేవేశా! నీ కృత్యమగు మా రక్షణను చేయుము. పార్వతీపతీ! నీవే తల్లివి తండ్రివి తాతవు. నీవే ఆయువు బుద్ధివి, శ్రీవి, సోదరుడవు. మిత్రుడవు. అన్ని కర్మలకు కర్త నీవే. కావున నేను చేసిన దుష్కృతములను క్షమించుము. నీసాటి రాజు నాసాటి నీచుడు మరియొకరు లేరు. కావున నీవు నా వాడవు. నేను నీవాడను. సుస్మితముఅగు నీ రూపమును గానము చేసెదను. ఎప్పుడు సభాపతిగా నృత్యము చేయుచున్న నిన్ను నూరేండ్లు రోగ హీనులమై విద్వాంసులమై శాస్త్రార్థ జ్ఞానము కలిగి నూరు సంవత్సరములు బ్రతుకవలయును. భార్యా సహితులమై బంధు సహితులమై నీ తాండవా మృతమును పానము చేయుచు నూరువత్సరము ఆనందించవలయును. దేవదేవా! మహాదేవా! నీ పాద పద్మ మకరందమును యధేచ్ఛగా పానము చేయుచు చాలా సంవత్సరములు ఆనందించవలెను. కీటకములుగా కాని నాగులుగా కాని పిశాచములుగా కాని ఏదో ఒక ప్రాణి రూపమున నీ దాసులముగా చాలా సంవత్సరము లుండవలెను. ఓ దేవా! నీసభలో నృత్య వాద్యగలధ్వని శ్రవణములచే చాలా సంవత్సరములుపలుకుచుండవలెను. బాణ సంధాన మాత్రముననే త్రిపురములను దహించిన ధూర్జటీ! మేము ఆధివ్యాదులచే చాలా సంవత్సరములు గెలవక ఉండవలెను. చారు చామీకరా భాసుడు గౌరీకుచ పటోరసుడు విశ్పతి కలియగు నిన్నెపుడు చూచెదను. ప్రమధ గణాధిపతులచే కూడియున్న పీతవదనుడు, ప్రియవాసనుడు, సుభాసుడు శుక్ర శోభితుడగు సాంబశివుని ఎపుడు సేవించగలను. చాలా పాపములను చేసినవాడను, పుణ్య లేశమును కూడా చేయనివానిని, దుర్గతిని అగు నన్ను నీలగ్రీవుడు విలోహితుడగు శివుడు స్వీకరించునా? కాల శూలానలాసక్తుని, భీతుని వ్యాకులమానసుని నన్ను నీలగ్రీవుడు అగునీవు నన్నెప్పుడు కటాక్షించెదవో! ఓ గాయకులారా? మీరు రాగతాళాదులను నేర్వగోరినచో మీరొచ్చి కుబేర మిత్రుని సేవించుడు. ఓ జిహ్వా నీకు విద్యాదాతయ ఉమాపతి స్తోత్రమును పెద్దగా పఠించుము శుభమగుగాక. ఓ మనసా నీవీ సకల జగత్తును తెలియవు. శంకరునికి తృప్తిని కలిగించుటే లక్ష్యముగాగల ఓ చిత్తమా? జారుని యువతివలె గాఢముగా ఆలింగనము చేసుకొనుము. మహామయూఖునకు మహాభుజునకు, మహాశరీరునకు, మహాంబరునకు, మహాకిరీటునకు మహేశ్వరునకు చక్కని స్తుతిని పలికెదను. ఏదో విధముగా రచించబడిన ప్రసన్నములగు చక్కని స్తుతులచే అషాఢుని, ఉగ్రుని, మహేశుని పూజించెదను. శివునకు త్రిపురాంతకునకు, జగత్త్రయేశునకు, దిగంబరునకు నమస్కారము. ముఖ్యునకు, వికారికి భవునకు భవోద్ధరునకు నమస్కారము. బహుప్రజ! అత్యంత విచిత్ర రూప! నీ నుండియే ఈ జగత్తు ప్రభవించినది. దేవతా మకుటతట ఘటిత కిరీట రత్న శోభిత పాదపద్మునకు, భస్మాంగరాగునకు నమస్కారము. నీకంటే పరము అపరములేదు. సర్పరాజు చంద్రుడు పరస్పరము నీ శిరస్సునందు ఉత్తమ స్థానము కొరకు యుద్ధము చేయగా చిక్కుపడిన జటామండలముకలవానికి? సకల జగత్తును లయము చేసుకొను సుందర తాండవునకు నమస్కారము. మురారి నేత్రార్చిత పాదపద్మునికి, ఉమాచరణ లాక్షాపరిరక్త పాణినికి, నీలకంఠునికి హిరణ్యదంతునికి శుచి వర్ణునికి నమస్కరించుచున్నాను. అనంతుని అవ్యక్తుని, అచింత్యుని, ఏకుని దిగంబరుని, అంబర వర్ణుని, అజుని, పురాణుని, అణువులలో అణువును, మహత్తులలో మహత్తునకు నమస్కరించుచున్నాను. అంతర్యామిని, ఆత్మ స్వరూపుని, అజుని, చూడజాలక మూర్ఖులు గిరి గహ్వరములందు భ్రమించుచుందురు. పశ్చిమమున ఉత్తరమున దక్షిణమున పూర్వమున క్రింద మీద అంతటా ఉన్నవాడవైన ఓ చంద్రమౌళీ! మహానంద స్వరూపుని శోకదుఃఖ రహితుని ఈశ్వరుని హృదయాంబుజమున పరమాత్మగా నివసించు వానిని, సకలదిక్కులకు విదిక్కులకు మూలమగు వానికి నమస్కరించుచున్నాను. రాగకాపట్యమువలన పుట్టిన మహామయమగు సంసారముతో భ్రమించు నన్ను చూచి కాపాడుము. ఉత్తమ వైద్యుడవని వైద్యునిచే వినుచున్నాను. దుఃఖ జలరాశిని, సుఖ లేశహీనుని, పుణ్యస్పర్శ లేనివానిని, బహుపాతకుని, మృత్యువు చేతిలో ఉన్న వానిని భవరక్షణకై భీతుని ముందువెనుక ఊర్థ్వభాగమున అధోభాగమున చూడుము. పార్వతీ సుందర ముఖావ లోకనముచే చల్లబడిన దయాపూరితమగు నీయొక్క చూపు అను నావచే మేము దురిత సాగరమును దాటవలెను. అపారసంసార సముద్రమధ్యమున మునిగినవానిని ఉత్రోశించువానిని బహురాగములు కలవానిని అసమర్థుడను అగు నన్ను ఓజిష్టమగు దక్షిణచే సేవించబడు వానిని కాపాడుము. పూర్వ జన్మ సంచిత పాతకములను స్మరించి కఠినమగు యముని ముఖమునకు భయపడుచున్నాను. కావున క్షీణాయువునకు, లేదా గతాయువునకు నాకు ఆయుష్యము నిమ్ము, సుగంధులు సుందర భస్మరాగములుగల అనంత భోగములుకలవి మృదులములు సౌమ్యములు, స్థిరములు అగు తన అవయవములచే పురురూపుడు ఉగ్రుడగు శివుడు నన్ను ఎపుడాలింగనము చేసుకొనును? భవ సాగరమున పడి బిలమున పడిన మండూకమువలె క్రోశించుచున్న నన్ను హిరణ్య రూపుడు హిరణ్య నేత్రుడు అగు దేవదేవుడు ఎప్పుడు కాపాడును? చారుస్మితుని, చంద్ర కళావతంసుని గౌరీ కటాక్షారుహ యుగ్మనేత్రుని, అదిత్యవర్ణుని, తమమునకు పరుడగు సాంబుని ఎపుడు చూడగలను? అనాది ముముక్షువులై మీరు రండు మీ హృదయపద్మమున శివుని ధ్యానించుడు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్ధులు ఈ శివునే మోక్షము కొరకు ఎల్లపుడూ ధ్యానించుచుందురు. మీరందరూ రెండు. ఆధిపత్యమును పొందుడు. యధేచ్ఛముగా గుహేశుడగు శంకరుని పూజించుడు. పూర్వమిట్లే బ్రహ్మ పూజించి సకలప్రాణి నాథుడాయెను. పుణ్యాత్ములారా? శ్రీ ఆయతనమగు శ్రీకంఠుని నమస్కరించుడు. ఈ శంకరుడు శ్రీమంతుడు శ్రీపతి వంద్యపాదుడు. శ్రీలకు ఉదారుడు. వేగధారి ఇతడే. సుపుత్రనాములైననూ యువకుడగు శంకరుని పూజించును. జగద్విధాతయగు హిరణ్యగర్భుడు మొదటి ఇతని నుండే పుట్టెను. ఎక్కువగా చెప్పనేల? శంకరుని ఆశ్రయించుటచే లక్ష్యముగాగల సకలాభీష్టములు నెరవేరును. పూర్వము అగస్త్య మహర్షి శంకరుని పూజించియే జరావర్జితుడగు యువకుడు ఆయెను. కామనల తుమ్మెదలను ఇతరముల నొదిలి ఎపుడు శివునే ఆశ్రయించవలెను. ఇతను అపూర్వ సుగంధము కలవాడు. సుకుమారుడు. స్వాదువు మకరందము కలవాడు. ఈ మహేశ్వరుని నీ వాక్కు నమస్కారమును పలికిన సాటిలేనివాడవు సమస్త రామరులను జయించువాడవగుదువు. కావున కర్తపదుడగు యువకుని స్తుతించుము. నీవు మనసుచే చింతించిన దంతయూ సిద్ధించగలదు. దుఃఖ విషయములందు ఎపుడూ ప్రవర్తించకుము. సౌమనస్యము కొరకు రుద్రుని పూజించెదము. పూర్వము అజ్ఞానము వలన నీయెడ చేసిన సకలాపచారములను దయాలుడవగు నీవు పుత్రులను తండ్రివలె క్షమించుము. సంసారమును క్రోధ సర్పము తీవ్రములగు రాగద్వేషము ఉన్మాద లోభాది దంతములచే కరవబడిన నన్ను దయాలుడగు పినాకి రక్షించుగాక. ఇట్లు స్తుతించి సమాధి అంతమున నీకు నమస్కరించువారు జన్మ సర్పదష్టు లైననూ నిన్ను చేరెదరు. నీలగ్రీవ సూత్రాత్మచే నేను బ్రహ్మచే నమస్కరించ బడువాడనే నిన్నుచేరెను. సంసారమను మనోవ్యాధియను భీషణ జ్వరముతో పీడితులను మహామయులను అశేష పాతకాలయాన దూర కాలలోచనులకు అనాధ నాధుడవగు నీకరముచే ఔషధమును పొందినీలో నివసింతుము. సర్వదేవ దానవ ప్రభువగు ఈశానుడు బలమును, వేగమును సూక్ష్మదృష్టిని ప్రసాదించిన అష్టదిక్పాలకులను, దివస్థ్సలమును, భూస్థలమును, నభస్థలమును అన్నిటిని జయించగలము. భవునకు హరునకు, భూతిభాసితోరస్కునకు భవాభిభూతి భీతి సంగికి, పినాకికి, శివునకు, విశ్వపాలునకు, శాశ్వతహేలకు నమస్కారము. ఇతని సేవకుడు చంపబడడు గెలువబడడు. సురపతి పతికి, ప్రజాపతి పతికి, క్షిపతిపతికి, అంబికాపతి పతికి, ఉమాపతికి నమస్కారము. వినాయకుని, నమస్కరించు మస్తకముల కిరీట సంఘటిత దేవమస్తకుని, ప్రణతార్తి నాశనుని, కవులకు కవిని నమస్కరించు చున్నాను. యుద్ధమున దేవతలు, యాగమున విప్రులు లోకమున మనుజులు నిన్ను పిలిచెదరు. కుమార స్వామివలన ఇహపరములను పొందెదరు. కావున సుబ్రహ్మణ్యునికి నమస్కరించుచున్నాను. శివకు జగదంబికకు, శివప్రియకు శివవిగ్రహకు నమస్కారము. చతుష్క పర్ధయువతి సుపేశగా ఈమెయే హిమవంతునికి పుత్రికగా జన్మించెను. హిరణ్య వర్ణను, మణనూపురాంఘ్రిని, ప్రసన్నవక్త్రను, శుకపద్మ హస్తను, విశాల నేత్రను, వేదార్థములందు బోధించు గౌరిని నమస్కరించుచున్నాను. మేనాతనయకు, వేదార్థములను బోధించు గౌరిని నమస్కరించుచున్నాను. మేనాతనయకు అమేయను కాంతిమతిని, సఖుడు ప్రియుడగు శంకరుని ఆలింగనము చేసుకొని స్తనములను భూతిసితములుగా చేసుకొను పార్వతీదేవికి నమస్కరించుచున్నాను.
శంకరుని శరీర కాంతిచే ప్రకాశించు తలవంచిన మృగరాజము కలది, శంకరుని పార్శ్వమున నివసించునది సకల జగత్తులను క్రియా శీలముల నాచరించు పార్వతీదేవికి నమస్కరించుచున్నాను. తుంగపీనస్తని, చంద్రచూడ, క్లిష్ట సర్వాంగరాగ, దుఃఖించు ప్రాణులకు ఆత్మకాన్తి నొసగి ఆరాధింపచేయు పార్వతిని నమస్కరించుచున్నాను. దీన రక్షా వినోదము కలది, ఆనందదాత్రి సర్వవిద్యలకు, శుభములకు వాక్కులకు అధినేత్రి సూనృత ప్రవర్తకురాలు మేనా పుత్రికయగు పార్వతికి నమస్కరించుచున్నాను. సంసారము వలన కలుగు ఘోర తాపమును హరించునది అందరిచే ఆనందమును అనుభవింపచేయు ఆభరణైక భోగురాలగు ఓ పార్వతీ దేవీ! నిరంతరము ఉత్తమమగు బుద్ధిని ప్రసాదించుము. ఆ బుద్ధిచే అన్ని దురితములను దాటించెదను. ఓ పార్వతీ నీ సములు ఈ లోకమన ఎవరుకలరు? నీకు ప్రపంచ సృష్టి వినోదము. శివుడు నీ భర్త, శ్రీహరిదాసుడు. లక్ష్మి అనుచరురాలు. శరీదేవి, సరస్వతి పరిచారికలు. మాకు ధన సంపదల నిమ్ము.
వసువు పలికెను: ఇట్లు జైమిని మహర్షి శివుని స్తుతించి ఆనందాశ్రు పూర్ణ నేత్రుడై శంకరునికి నమస్కరించెను. తాండవామృత మంగళుడగు శంకరుని మాటిమాటికి నేత్రములచే పానము చేయుచు సకలాభీష్టములను పొంది, అంతమున గణాధిపత్యమును పొందెను. జైమినిచే చేయబడిన ఈ స్తోత్రమును భక్తితో పఠించు వానికి వాక్సిద్ధి మతి సంపదలు ప్రజలు రాజును వరించునట్లు వరించును. యుద్ధము చేయగోరు రాజు ఈ స్తోత్రమును పఠించినచో అతని శత్రువులు యమ లోకమును చేరెదరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఈ స్తోత్రమును భక్తిచే పఠించినవారు దేహాంతమున శివపార్శ్వవర్తియై శివసామీప్యమును పొందెదరు. ఈ స్తోత్రమును పఠించువారు బుద్ధి కాములైనచో బుద్ధిని, పుష్టికాములు పుష్టిని, ధాన్యకాములు ధాన్యమును, పుత్రకాములు పుత్రులను పొందెదరు. ఈ స్తోత్రములోని ఒక శ్లోకము కాని, శ్లోకార్థమును కాని పాదమును కాని, పాదార్థమును కాని ప్రతినిత్యము పఠించువారు శివలోకమును చేరెదరు. శివుడు తాండవము చేసిన ప్రదేశము పరమపవిత్రమగు ప్రదేశము. ఇచట స్నానముచేసిన వారు ముక్తిని పొందెదరు. ఇచట పితరులను శ్రాద్ధమును ఆచరించినచో పితరులను తరింపచేయును. ఇచట గోవును, కాంచనమును, భూమిని, శయ్యను, వస్త్రమును, ఛత్రమును, జలమును, అన్నమును, బ్రాహ్మణునకు దానమును గావించినచో అది అంతయూ అక్షయమగును. పుండరీక పురమున జరిగిన ఈ కథను వినిన వారు, వినిపించినవారు కూడా రుద్ర ప్రియులగుదురు. (II/73)