నిరుక్త లక్షణ నిరూపణము

సనందన మహర్షి పలికెను: “వేదమునకు శ్రోత్రాంగ రూపమైన నిరుక్తమును నీకు చెప్పెదను. ఈ నిరుక్తము అయిదు విధములు. వైదికము, ధాతురూపముగా ఉండును. కొన్నిచోట్ల వర్ణాగమము, కొన్నిచోట్ల వర్ణ విపర్యయము, కొన్నిచోట్ల వర్ణవికారము, కొన్నిచోట్ల వర్ణనాశము, వర్ణవికార నాశము లచే ధాతు యోగమువలన అతిశయమును పొందినచో సంయోగము అనబడును. ‘హస’ అను శబ్దమున అనుస్వారము ఆగమముగా వచ్చినచో హంసః అనురూపము సిద్ధించును. హింస అను వర్ణములు విపర్యయము నొందినచో సింహః అను రూపమును పొందును. ‘గూఢ’ ‘ఆత్మా’ అనుచోట ‘ఆ’ అను వర్ణము ‘ఓ’ రూపముగా మారినందున ‘గూఢోత్మా’ అను పదము సిద్ధించును. ‘పృషసదృశః ఉదరః’ అను వాక్యమున ‘సదృశ’ అను వర్ణములకు నాశమేర్పడుటచే ‘పృషోదరః’ అను రూపము సిద్ధించును. భ్రమరాది శబ్దములలో సంయోగమున్నదని తెలియవలయును. ఈ విధముగా నిరుక్తము అయిదు విధములు. వేదమున బాహులకమును విధించిరి. బాహులకమువలన ‘పునర్వసు, ‘నభస్వత్’, ‘వృషణ’, ‘అపరస్మైపది’ ఇత్యాది రూపములు సిద్ధించును. ధాతువునకు పరముగా వ్యవధానముగా ఉన్న అవ్యయాదులు గతిసంజ్ఞను పొందును. ఇచట హి, ఆ మొదలగునవి దృష్టాంతము. వైదికమున విభక్తి విపర్యాసము కూడా జరుగును. ‘దధ్నా జుహాతి’ అనునది ఉదాహర ణము. అభ్యుత్సాదయామకేతు, ‘ధ్వనయీత్’ మొదలగునవి కూడా ఇటులనే తెలియవలయును. ‘నిష్టర్కీ’ మొదలగునవి, ‘గృభాయ’ మొదలగునవి, సుప్’, ‘తిఙ్, ‘ఉపగ్రహ’, ‘లింగ’, ‘నర’, ‘కాల’, ‘హల్’, ‘చ్’, ‘స్వర’, ‘కర్తృ’, యజాదికమునకు కూడా శాస్త్రకారులు వ్యత్యయ మును అభిలషింతురు. ఈ వ్యత్యయము కూడా బాహులకముచే సిద్ధించును. ‘రాత్రీ’, ‘చింబీ’, ‘కద్రూః’, ‘అవిష్ట్వో’, ‘వాజసనేయినః’, ‘కర్ణేభిః’, ‘యశోభాగ్యః’ ఇత్యాది చతురక్షర పదములు, ‘దేవాసః’, ‘సర్వదేవతాతి’, ‘త్వావత’, అనునవి; ‘ఉభయావినం’ మొదలగునవి, ప్రలయాది శబ్దములు, స్తృచం అనునది అపస్పృధేధాంనో, ‘అవ్యాదాయః’, ‘అస్మాన్ముఖాః’, ‘సగర్భ్యః’, ‘స్ధాపదీ’, ‘ఋత్యో’, ‘అజిష్టం’, ‘త్రిపంచకమ్’, ‘హిరణ్యయేవ’, ‘నరం’, ‘పరమేర్యోమని ఉర్వియా’, ‘స్వప్రయా’, ‘వారవధ్వా’ ‘దుదుహవైవధీ’ ‘యజధ్వం’, ‘నమేమసి’, ‘స్నాత్వీ’, ‘గత్వా’, ‘పచాస్ధఖీః’, ‘గోనాం’, ‘అపరిహవృత్తాః’, ‘ఆతురిః’, ‘గ్రసితా’ మొదలగునవి, ‘పశ్యేత్’, ‘అధదు’, ‘అభూధ్’, ‘ప్రమిణాంతి’, ‘అవీవృధత్’, ‘మిత్రయుః’, ‘దురస్వా’, ‘హాత్వా’, ‘సుధితం’ అనునవి, దధర్తి మొదలగునవి, ‘స్వవద్భిః’, ‘ససూవ’, ‘ధిష్య’, ‘ప్రపాయం’, ‘హరివతా’, ‘ఈక్షణ్వతః’, ‘సుపధితరః’, ‘రధీతరీ’, ‘నసత’ మొదలగునవి, ‘అమ్నః’, ‘భువః’, ‘రధః’, ‘బ్రూహి’ మొదలగు వాటికి, శ్రావయ ఇత్యాదులలో ప్లుతమును ఉచ్చరించ వలయును. ‘దాస్వాన్’, ‘స్వతవాన్’, ‘యావీ’, ‘త్రిభిష్ట్వం’, ‘నృభిష్ణుతః’, ‘అభీషుణ’, ‘ఋతావహం’, ‘న్యషీదత్’, ‘నృమణా’ ఇత్యాది రూపములు బాహులకము వలన సిద్ధించును. బాహులకము నాలుగు విధములుగా నుండును. శాస్త్రము ప్రవర్తించుట, ప్రవర్తించక పోవుట విభాషగా ప్రవర్తించుట అనగా ఒకసారి వచ్చుట, ఒకసారి రాకపోవుట, అన్యథా భావము అని. ఇట్లు నాలుగు విధములగు బాహుకలము వలన వైదిక రూపములు అన్నియూ సిద్ధించును.

‘భూ’ మొదలగు ధాతువులు పరస్మైపదులు. ‘ఏధ’ మొదలగు ముప్పది ఆరు ధాతువులు ఆత్మనేపదులు. ‘అత’ మొదలగు ధాతువులు ముప్పది యెనిమిది పరస్మైపదులు. ‘శ్నోకృ’ మొదలగు నలుబదిరెండు ధాతువులు ఆత్మనేపదులు. ‘పక్వ’ మొదలగు ధాతువులు యాబది ఉదాత్తవర్ణనము ఇత్తుగా గలవి. అనగా పరస్మైపదములు. ‘వర్చ’ మొదలగు ఇరువది యొకటి ధాతువులు అదుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఆత్మనే పదులు. గుపూ మొదలగు నలుబది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి కావున పరస్మైపదులు. ‘ధిణి’ మొదలగు పదిధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనేపదములు. ‘అణ’ మొదలగు ఇరువది యేడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగాగలవి. కావున పరస్మైపదములు. ‘ఆమా’ది ధాతువులు ముప్పది నాలుగు ఆత్మదే పదములు. మన్య మొదలగు డెబ్బది రెండు ధాతువులు పరస్మై పదములు. ‘హావు’ధాతువు ఒక్కటే స్వరితము ఇత్తుగా గలది. అనగా ఉభయపది. ‘క్షుధ్’ మొదలగు యాబది రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగాగలవి కావున ఆత్మనే పదములు. ‘ఘష్’ మొదలగు ఎనుబది ఎనిమిది ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరస్మైపదములు, ‘ద్యుతా’దులు ఇరువది రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. కావున ఆత్మనే పదములు. ‘ఘటా’దులలో నున్న పదమూడు షిత్తులను ధాతువులు అను దాత్తము ఇత్తుగాగలవి. కావున ఆత్మనే పదములు. జ్వలదాదులు యాబది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పరస్మై పదములు, రాజృధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఉభయపది స్తన హి భ్రా జృ అను మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. కావున ఆత్మనే పదములు. భాది ధాతువులు ఉదాత్తము ఇత్తుగాగలవి. అనగా పరస్మై పదములు. సహధాతులు ఒకటి అనుదాత్తము ఇత్తుగా కలది. అనగా ఆత్మనే పదము. ‘రమ్’ ధాతువు కూడా ఆత్మనే పదియే. ‘సద’ మొదలగు మూడు ధాతువులు ‘ఉదాత్తేత్తు’లు అనగా పరస్మై పదములు, ‘కుచ’ మొదలగునవి కూడా ఉదాత్తము ఇత్తుగా కలవే. కావున పరస్మై పదములు. ‘హిక్క’ మొదలగు ముప్పదియైదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయ పదులు. ‘శిఞ్’, ‘భృఞ్’ మొదలగు నాలుగు ధాతువులు కూడా స్వరితము ఇత్తుగా కలవే. కావున ఉభయ పదులు. ‘ధేట్’ మొదలగు నలుబది యారు ధాతువులు పరస్మైపదులు. ‘స్మిఙ్’ మొదలగు పదునెనిమిది ధాతువులు ఆత్మనే పదములు. ‘పూఙ్’ మొదలగు మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగాకలవి. అనగా ఆత్మనే పదములు. హృధాతువు పరస్సైపది. గుపాదులు మూడు ధాతువులు ఆత్మనే పదులు. ‘రబాది’ ధాతువులు రెండు అనుదాత్తేత్తులు, అనగా ఆత్మనే పదములుకలవి. ఞిక్ష్యి ధాతువు ఉదాత్తము ఇత్తుగా కలది కావున పరస్మైపది. స్కంభ్వాది పదిహేను ధాతువులు పరస్మై పదులు. కితధాతువు కూడా పరస్మైపదియే. దాన శాన ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఇట్లు భ్వాదిగణమున ఒక వేయి ఆరు ధాతువులు ఉండును. వద హన ధాతువులుకూడా పరస్మైపదులు. ద్విషమొదలగు నాలుగు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. చక్షిఙ్ అను ఒక ధాతువు మాత్రము ఆత్మనేపది. ‘ఇరాదులు పదమూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనే పదులు, ‘షూఙ్’, ‘శీఙ్’ అను రెండు ధాతువులు ఆత్మనేపదులు. ‘ఘ’ మొదలగు నేడు ధాతువులు పరస్మైపదులు. ‘ఊర్ణుఞ్’ ధాతువొకటి మాత్రము స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. ‘ఘు’ మొదలగు మూడు ధాతువులు పరస్మైపదులు. ‘ష్టు’ ‘ఞ్’ ధాతువొకటి ‘రా’ మొదలగు పదునెనిమిది ధాతువులు పరస్మైపదులు. ‘ఇఙ్’ ధాతువు ఆత్మనే పది. ‘విదాది’ ధాతువులు నాలుగు పరస్మైపదులు. ‘ఇషూ’ మొదలగు ధాతువులు కూడా పరస్మైపదికమే. స్యమాదులు కూడా పరస్మైపదులేనని నేను చెప్పియుంటిని. ‘ది’, ‘దీ’, ‘వే’, ‘వీ’, ధాతువులు ఆత్మనే పదులు. ప్రధాదులు మూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగాపరస్మైపదములు, చర్కరీతం, హృఙ్ అనునవి అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనేపదులు. అదాదిగణమున డెబ్బదిమూడు ధాతువులున్నవి. దా మొదలగు ధాతువులు పరస్మైపదులు. భృఞ్ ధాతువు స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. ‘హాక్’ ధాతువు. ఉదాత్తేత్తు అనగా పరస్మైపది. ‘మాఙ్’, ‘హాఙ్’, అను రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మనే పదులు. దానధాతువులో స్వరితము ఇత్తుగా ఉండును. అనగా ఉభయపది. ‘వా’, ‘అణ’ మొదలగు మూడు ధాతువులు కూడా స్వరితేత్తులే. కావున ఉభయపదులు. ‘ఘు’ మొదలగు పన్నెండు ధాతువులు పరస్మైపదులు. హ్వాదిగణమున ఇరువది రెండు ధాతువులుండును. దివాదులగు ఇరువది అయిదు ధాతువులు పరస్మై పదులు. ‘ఘాఙ్’, ‘దూఙ్’ అను రెండు ధాతువులు మాత్రము ఆత్మనే పదులు. ‘ఓ’ కారము ఇత్తుగాగల పూఙ్ మొదలగు ఏడు ధాతువులు ఆత్మనే పదులు. ‘దీఙ్’ మొదలగు ధాతువులు కూడా ఆత్మనేపదులే. ‘స్యతి’ మొదలగునవి పరస్మైపదులు. ‘జని’ మొదలగు పదిహేను ధాతువులు ఆత్మనేపదులు. మృషాదులగు అయిదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. పదాదులను పదునొకండు ధాతువులు ఆత్మనేపదులు. స్వాదులలో చురాదులో సకర్మకత్వమే యుండును. అది కూడా ‘రాధు’ ధాతువు కర్మగా యుండును. తుదాదులు పదమూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పరస్మైపదులు. రధాదులు ఎనిమిది కూడా పరస్మైపదులే. సమాది ధాతువులు నలుబది ఆరు కూడా ఉదాత్తము ఇత్తుగా గలవే. కావున పరస్మైపదులే. దివాదులలో నూటనలబది ధాతువులున్నవి. స్వాదులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయపదులు, దునోతి మొదలగు ఏడు ధాతువులు పరస్మైపదులు. ‘అష్టి’, ‘ధా’ ధాతువులు రెండు అనుదాత్తము ఇత్తుగాగలవి కావున ఆత్మనేపదులు. తికాది ధాతువులు పదు నాలుగు పరస్మైపదులు. స్వాది గణములో ముప్పది రెండు ధాతువులున్నవి. తుదాదులు ఆరు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఋషిధాతువు పరస్మైపది. జుషి మొదలగు నాలుగు ధాతువులు ఆత్మనేపదులు. వ్రశ్చ మొదలగు నూటా అయిదు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. కావున పరస్మైపదులు ఒక్క ‘గూరి’ ధాతువు మాత్రము ఉదాత్తము ఇత్తుగా కలది. కావున పరస్మైపది. ‘ణూ’ మొదలగు నాలుగు ధాతువులుకూడా పరస్మైపదులే. ‘కుఙ్’ ధాతువు అనుదాత్తేత్తు కావున ఆత్మనేపదము. ‘కుటా’దులు పరస్మైపదులు. ‘పృజ్’, ‘మృజ్’ ధాతువులు మాత్రము ఆత్మనేపదులు. మిగిలిన ఆరు ధాతువులు పరస్మైపదులు. దృఙ్, ధృఙ్ అను రెండు ధాతువులు ఆత్మనే పదులు. ప్రచ్ఛాదులు పదునారు ధాతువులు పరస్మైపదులు. ‘మిల’ మొదలగు ధాతువులు నారు స్వరితము ఇత్తుగా గలవి. అనగా ఉభయ పదులు. కుతీ మొదలగు మూడు ధాతువులు పరస్మైపదులు. తుదాదులలో మాటా యాబది యేడు ధాతువులున్నవి. రుధ నంద ధాతువులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయ పదులు, ‘కృ’ మొదలగు ధాతువులు పరస్మైపదులు. ‘ఞి’ ‘ఇంధీ’ మొదలగు మూడుధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మనేపదులు. శిష, పిష రుధాది ధాతువులు ఇరువది అయిదు ఉదాత్తము ఇత్తుగా గలవి కావున పరస్మైపదులు. తను ధాతువు నుండి ఏడు ధాతువులు స్వరితము ఇత్తుగా గలవి. అనగా ఉభయ పదులు. మను, వను ధాతువులు ఆత్మనేపదులు. ‘కృఞ్’ ధాతువు స్వరితేత్తు కావున ఉభయపది. తరువాత పన్నెండు ధాతువులను శాబ్దికులు చెప్పిరి. ‘క్రీ’ మొదలగు ఏడు ధాతువులు ఉభయ పదులు. సూత్రములో పఠించిన ‘స్తంభ్వదులు నాలుగు ధాతువులు పరస్మైదులు, క్రుధాదులగు ఇరువది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పరస్మైపదులు. వృఙ్ ధాతువు ఆత్మనేపది. శ్రంధాదులగు ఇరువది యొక్క ధాతువులు పరస్మై పదులు, గ్రహ ధాతువు స్వరితము ఇత్తుగా కలది అనగా ఉభయపది. క్ర్యాదులలో యాబడి రెండు ధాతువులు పండితులచే చెప్పబడినవి. చురాది ధాతువులు నూట ముప్పది ఆరు. చితి మొదలగు పదునెనిమిది ధాతువులు ఆత్మనే పదులు. ఈ చురాదులు ణ్యంతములని చెప్పబడినవి. అదంతములగు ధాతువులు నలుబది యెనిమిది. పదాదులగు ధాతువులు పది ఆత్మనేపదులు. సూద్రాదులగు ఎనిమిది ధాతువులు కూడా ‘ఞ్యం’తములుగా చెప్ప బడినవి. అనగా ఉభయపదులు. ప్రాతిపదికము కంటే పరముగా ధాత్వర్ధమున ఇష్ట వదాదులు బహుళముగా వచ్చునని సిద్ధాంతము.

‘తత్ కరోతి’ (దానిని చేయుచున్నాడు) ‘తత్ ఆచష్టే’ (అట్లు చెప్పుచున్నాడు, ఆచరించుచున్నాడు) అను అర్ధములో, హేతుమదర్ధములో ధాతువునకంటే పరముగా ‘ణిచ్’ ప్రత్యయము వచ్చును. కర్తృ కర్మవాచక శబ్దములకంటే పరముగా ధాత్వర్ధమున ప్రత్యయములను చేర్చుకొన్న ‘చిత్ర’ మొదలగు శబ్దములు కూడా ధాతువులగును. సంగ్రామాది శబ్దములు ధాతువులుగా మారినపుడు సంగ్రామాదులు ఎనిమిది అనుదాత్తేత్తులు అగును. అనగా ఆత్మనే పదము వచ్చును. అని శబ్ద్ర శాస్త్ర విదులు చెప్పిరి. స్తోమాది శబ్దములు పదునారు ‘అదంత’ ధాతువులకు ఉదాహరములు. ఇట్లే బాహులకమును ఆశ్రయించుట వలన సూత్రములలో చెప్పబడినవి, లోకములో వ్యవహరిం చబడునవి, వేదములో ప్రయోగించబడినవి చాలా ధాతువులు సిద్ధించును. ఈ ధాతువులన్నియు అన్ని గణములలో ఉండును. అనేకార్ధములను చెప్పుచుండును. సనాద్యంత ధాతువులు, నామ ధాతువులు అని ఇట్లు ధాతువులు అనంతములని తెలియవలయును. ఇచట సంక్షేపముగా చెప్పితిరి. ఆయా సందర్భములలో విస్తరముగా చెప్పియుండును. చూచి తెలియవలయును, ఊకారాంతములు, ఋకారాంతములు, ‘యు’, ‘రు’, ‘క్ష్ణు’, ‘శీఙ్’, ‘స్ను, ‘సు’ ‘క్షు’, ‘శ్వి’, ‘ఈఙ్’, ‘శ్రి’, ‘వృఙ్’, ‘వృఞ్’ అను ధాతువులు తప్ప మిగిలిన అజంతములగు ధాతువులలో ఒక అచ్చుగల ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవగును. ‘శుక్ల్’, ‘పచ్’, ‘ముచ్’, ‘రిచ్’, ‘వచ్’, ‘విచ్’, ‘సిచ్’, ‘ప్రచ్ఛి’, ‘త్యజ్’, ‘నిజిర్’, ‘భజ్’, ‘భంజ్’, ‘భుజ్’, ‘భస్జ్’, ‘మస్జ్’, ‘యజ్’, ‘యుజ్’, ‘రుజ్’, ‘రంజ్’, ‘విజిర్’, ‘స్వంజ్’, ‘సంజ్’, ‘సృజ్’, ‘అద్’, ‘క్షుద్’, ‘భిద్’, ‘ఛిద్’, ‘తుద, ‘నుది’, ‘పద్య’, ‘ఖిద్’, ‘విద్య’, ‘వినద్’, ‘శద్’, ‘సద్’, ‘స్విద్య’, ‘స్కందిర్’, ‘హది’, ‘క్రుధ్’, ‘క్షుధి’, ‘బుధ్య’, ‘బంధిర్’, ‘యుధి’, ‘రుధి’, ‘రాధి’, ‘వ్యధ్’, ‘శుధ్’, ‘సాధి’, ‘సిధ్య’, ‘మన్య’, ‘హన్’, ‘ఆప్’, ‘క్షిప్’, ‘ఛుపి’, ‘తప్’, ‘తిప’, ‘తృప్’, ‘దృప్’, ‘లిబ్’, ‘లుబ్’, ‘వప్’, ‘శప్’, ‘స్వపూ’, ‘సృపి’, ‘యభ’, ‘రభ’, ‘లభ’, ‘గమ్’, ‘నమ్’, ‘యమ్’, ‘రభి’, ‘క్రుశి’, ‘దంశి’, ‘దిశి’, ‘దృశ్’, ‘మృశ్’, ‘రివ్’, ‘రుశ్’, ‘లిశ్’, ‘విశ్’, ‘స్పృశ్’, ‘కృష్’, ‘త్విష్’, ‘తుష్’, ‘దుష్’, ‘పుష్య’, ‘పిష్, ‘విష్’, ‘శుష్’, ‘శ్లిష్య’, ‘ఘసి’, ‘వస’, ‘దహ’, ‘దిహి’, ‘దుహ్’, ‘నహ్’, ‘రుహ్’, ‘లిహ్’, ‘వహి’ అను నూటారెండు హలంతములగు ధాతువులు అనుదాత్తము ఇత్తుగాగలవి. ‘చ’ మొదలగు నవి, దేశములలో కాలములో ఏర్పడిన ‘ప్ర’ మొదలగునవి నిపాతములు అనబడును. శబ్దములు అనేకార్ధములు కలవి మూడు లింగములు కలవిగా చెప్పబడినవి. గణపాఠము, సూత్రపాఠము, ధాతుపాఠము, అనునాసిక పాఠము ఈ విషయమున ప్రమాణముగా చెప్పబడినది. శబ్దములు సిద్ధములే, లౌకిక శబ్దములు వైదిక శబ్దములు కూడా సిద్ధములే. కావున శబ్దములను తెలియవలయు నన్నచో శబ్ద పారాయణము చేయవలయును. సులభము లఘువు అయిన మార్గములో శబ్దములకు సాధుత్వము తెలియుటకు ప్రకృతి, ప్రత్యయ, ఆదేశ, లోప, ఆగమములను తెలియవలయును. ఇట్లు నీకు నిరుక్తమును సంక్షేపముగా కొంచెమే చెప్పితిని. శబ్దములు అనంతములు కావున సంపూర్ణముగా ఎవ్వరూ చెప్పజాలరు. (2/53)