రాధాకృష్ణ సహస్రనామ కథనము

సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా! నీవు పూర్వ జన్మలో సాక్షాత్తు భగవంతుడు శంకరుని దర్శించి యుగలాత్మకమును కృష్ణ మంత్ర రహస్యమును పొందుటను తెలిసియున్నావు. ఒకవేళ మరిచినచో గుర్తుతెచ్చుకొనుము.

సూత మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా! ఇట్లు సనత్కుమారుడు పలుకగా ధ్యానముచే పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొనెను. భగవత్ర్పియుడగు నారదుడు చాలా కాలము ధ్యానమున ఉండి తన వృత్తాంతమును తెలుసుకొని ప్రసన్నముఖుడై ఓ మహానుభావా? పూర్వకల్పమున జరిగిన వృత్తాంతమంతయు ఒక యుగ లంభనము తప్ప గుర్తుకొచ్చినది అని పలికెను. అని నారదుని మాటలను వినిన సనత్కుమార మహర్షి యథార్థమును చెప్ప సాగెను.

సనత్కుమార మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? నీవు ఏ జన్మలో శంకరుని నుండి కృష్ణ రహస్యమును పొందితివో దానిని చెప్పెదను. సావధానముగా వినుము. ఈ సారస్వత కల్పము కంటే మొదట ఇరువదియైదవ కల్పమున నీవు కాశ్యపునిగా ఒకనామముచే పుట్టి ఉంటివి. ఆ కల్పమున ఒకనాడు నీవు కృష్ణ రహస్యమును అడుగుటకు కైలాసవాసియగు శంకరుని వద్దకు వెళ్ళి ఉంటివి. నీవు అడుగగా శంకరుడు నిత్య లీలాచరుడగు శంకరుడు నిత్య లీలాచరుడగు కృష్ణుని రహస్యమును చెప్పసాగెను. అట్లు చెప్పిన తరువాత కృష్ణ భగవానుని నిత్యలీలను చూడమని చెప్పెను. “గోపీ జనవల్లభ చరణా శరణం ప్రపద్యే" అనునది మంత్రము. ఈ మంత్రమునకు సురభి ఋషి. గాయత్రీ ఛందస్సు. వల్లవీ వల్లభుడగు కృష్ణ పరమాత్మ దేవత. 'ప్రసన్నోఽస్మి' అని వినియోగము చేయవలెను. ఈ మంత్రమునకు సిద్ధి మొదలగునవి, శోధనము, న్యాసములు ఉండవు. ఈ మంత్రము కేవలము చింతన మాత్రముననే శ్రీహరి నిత్యలీలా ప్రకాశకము. ఇక ఇపుడు అభ్యంతర ధర్మసాధనమును చెప్పెదను. గురుభక్తి కలవాడై గురువు నుండి మంత్రమును పొంది, చింతనము గావించి నిజధర్మమున నిలిచి, గురుకృపను తలచుచు గురువును సంతోషపరచ వలయును. శ్రేయోదాయకములగు సజ్జన ధర్మములను తెలియవలయును. ఇష్టదైవబుద్ధిచే ఎల్లప్పుడు విష్ణు భక్తులను సంతోషపరచవలయును. విష్ణు భక్తులను నిందించుట, బెదిరించుట మొదలగు వాటిని మనసులో కూడా ఆలోచించరాదు. పూర్వకర్మవశమున జరుగవలసిన ఐహికమును, అనుభవమును, ఆయుష్యమును శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా చేయగలడు. ఎల్లప్పుడు తన బుద్ధిచే నిత్యలీలాస్థితుడగు శ్రీకృష్ణుని చింతించ వలెను. ఆర్చావతారమున నన్ను కృష్ణుని ఎప్పుడూ సేవించవలెను. ప్రసన్నులచే, శరణార్థులచే సేవించదగినవాడు శ్రీకృష్ణ భగవానుడొక్కడే, శరీర గృహాది విషయములలో ఉదాసీనముగా నుండవలెను. గురువును అవమానించరాదు. సాధునింద చేయరాదు. హరిహరులందు భేదమును చూడరాదు. వేదనిందకూడదు. బలముతో పాపములను ఆలోచించరాదు. హరి నామమున అర్థవాదమును, నామ సంగ్రహమున పాషండ వాదమును చేయరాదు. అలసునికి నాస్తికునికి హరి నామమును ఉపదేశించరాదు. హరి నామమును విస్మరించుట, హరి నామము నందు అనాదరమును చూపుట విడువవలెను. పైన చెప్పబడినవి మహా భయంకరములగు దోషములు. హృదయస్థితుడగు శ్రీహరిని ఎల్లప్పుడు ప్రసన్నుడనని చింతించవలెను. ఆ శ్రీహరియే ఎల్లప్పుడూ నన్ను కాపాడునని తలచుచుండవలెను. ఓ రాధికానాథ! మనసుచే మాటచే పనిచే నీవాడను అనియే ఉన్నాను. మీరే నాకు గతి. శ్రీహరిదాసులను, మిత్రులను, తల్లిదండ్రులను, ప్రేయసులను ఎల్లప్పుడూ స్మరించుచుండవలెను. గోష్ఠము నుండి వనమునకు, వనము నుండి గోష్ఠమునకు గోచారణమును మిత్రులతో కలిసి చేయుచు వచ్చి పోవు శ్రీకృష్ణుని చింతించుచుండవలెను. శ్రీదాముడు మొదలగువారు పన్నెండు మంది శ్రీకృష్ణుని మిత్రులుగా చెప్పబడిరి. రాధిక నుండి సుశీల వరకు ముప్పదిరెండు మంది ప్రేయసులు. వారిమధ్యన తానున్నట్లుగా భావించవలెను. అట్లే వారి మధ్య మనోరమను ధ్యానించవలెను. ఈ మనోరమ రూపయౌవన సంపన్న, కిశోరి, స్వలంకృత, నానాశిల్పకలాభిజ్ఞ, కృష్ణ భోగానురూపిణి, శ్రీకృష్ణసేవన సుఖాహ్లాద భావాతినిర్వృతనుగా ధ్యానించవలెను. బ్రాహ్మీ ముహూర్తమునుండి అర్థరాత్రి వరకు ఆయాకాలానుగుణమగు సేవలతో రాధాకృష్ణులకు పరిచర్య చేయవలెను. రాధాకృష్ణ సహస్ర నామములను నిత్యమూ పఠించవలెను. ఇది ప్రసన్న జనసాధనముగా చెప్పెబడినది. దీనిని పరీక్షించక ఎవరికీ తెలుపరాదు. నేను నీకు చెప్పితిని.

సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా అపుడు నీవు సదాశివుని రాధాకృష్ణ సహస్ర నామములపే అడిగితివి. సదాశివుడు దానిని కూడా చెప్పెను. వినుము. సుందరమగు బృందావనమున యమునా తీరమున ఉన్న కల్పవృక్షమును ఆశ్రయించి రాధికాయుతుడగు శ్రీకృష్ణ భగవానుని ధ్యానించి యుగలమను పేరుగల నామ సహస్రమును పఠించవలయును.

శ్రీకృష్ణ నామములు: దేవకీనందనుడు, శౌరి, వాసుదేవుడు, బలానుజుడు, గదాగ్రజుడు, కంస మోహుడు, కంససేవక మోహనుడు, భిన్నార్గలుడు, భిన్నలోహుడు, పితృబాహ్యుడు, పితృ స్తుతుడు, మాతృస్తుతుడు, శివధ్యేయుడు, యమునా జలభేదనుడు, వ్రజవాసి, వ్రజానంది, నందబాలుడు, దయానిధి, లీలా బాలుడు, పద్మ నేత్రుడు, గోకులోత్సవుడు, ఈశ్వరుడు, గోపికానందనుడు, కృష్ణుడు, గోపానందుడు, సద్గతి, బకప్రాణహరుడు, విష్ణువు, బకముక్తి ప్రదుడు, హరి, బలడోలాశయుడు, శ్యామలుడు, సర్వసుందరుడు, పద్మనాభుడు, హృషీకేశుడు, క్రీడామనుజ బాలకుడు, లీలా విధ్వస్త శకటుడు, వేదమంత్రాభిషేచితుడు, యశోదానందనుడు, కాంతుడు, మునికోటి నిషేవితుడు, నిత్య మధువనవాసి, వైకుంఠుడు, సంభవుడు, క్రతుడు, రమాపతి, యదుపతి, మురారి, మధుసూదనుడు, మాధవుడు, మానహారి, శ్రీపతి, భూధరుడు, ప్రభువు, బృహుద్వన మహాలీలుడు, నందసూనుడు, మహాసనుడు, తృణావర్త ప్రాణహారి, యశోదా విస్మయప్రదుడు, త్రైలోక్య వక్త్రుడు, పద్మాక్షుడు, స్వరాట్, అజాధ్యక్షుడు, శివాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, మహేశ్వరుడు, వేదాంత వేద్యుడు, బ్రహ్మస్థుడు, ప్రజాపతి, అమోఘదృష్టి, గోపీకరాలంబి, గోపజాలక సుప్రియుడు, బాలానుయాయి, బలవాన్, శ్రీదామ ప్రియుడు, ఆత్మవాన్, గోపీ గృహాంగణరతి, భద్రుడు, సుశ్లోకమంగళుడు, నవనీతహరుడు, బాలుడు, నవనీత ప్రియాశనుడు, బాలబృందీ, మర్కబృందీ, చకితాక్షుడు, పలాయితుడు, యశోదా తర్జితుడు, కంటమాయారోదితశోభనుడు, దామోదరుడు, అప్రమేయాత్ముడు, దయాళువు, భక్తవత్సలుడు, సుబద్ధాలూఖలుడు, నమ్రశిరుడు, గోపీ కదర్థితుడు, వృక్షభంగి, శోకభంగి, ధనదాత్మజ మోక్షణుడు, దేవర్షివచన శ్లాఘి, భక్తవాత్సల్యసాగరుడు, వజ్రకోలాహలకరుడు, వ్రజానంద వివర్ధనుడు, గోపాత్మ, ప్రేరకుడు, సాక్షి, బృందావన నివాసకృత్, వత్సపాలుడు, వత్సపతి, గోపదారక మండనుడు, బాలక్రీడుడు, బాలకుడు, కనకాంగది, పీతాంబరుడు, హోమమాలి, మణిముక్తా, విభూషణుడు, కింకిణి, కటకి, సూత్రి, సూపురి, ముద్రికాన్వితుడు, వత్సాసుర పతిధ్వంసి, బకాసుర వినాశనుడు, ఆఘాసుర వినాశి, వినిద్రీకృత బాలకుడు, ఆద్యుడు, అత్మప్రదుడు, సంగి, యమునాతీర భోజనుడు, గోపాల మండలీమధ్యుడు, సరసగోపాల భూషణుడు, అరచేతిలో భోజనము చేయువాడు, వ్యంజనాశ్రిత శాఖినుడు, కొమ్మును, దండమును చేతిలో ధరించినవాడు, గురివిందల మాలను ధరించిన వాడు, నెమిలిపింఛమును శిరమున ధరించినవాడు, వనమాలా విభూషితుడు, గైరికా చిత్రిత వసువు, నవమేఘ శరీరుడు, స్మరుడు, కోటి కందర్పలావణ్యుడు, మకర కుండల శోభితుడు, ఆజానుబాహువు, భగవంతుడు, నిరహిత లోచనుడు, కోటిసాగర గాంభీర్యుడు, కాలకాలుడు, సదాశివుడు. బ్రహ్మను మోహింపచేయు శరీరముగలవాడు, గోపవత్సముల రూపమును ధరించిన వాడు, బ్రహ్మాండ కోటి జనకుడు, బ్రహ్మమోహ వినాశకుడు, బ్రహ్మ, బ్రహ్మచే స్తుతించబడువాడు, స్వామి, శక్రదర్పాది నాశకుడు, గిరిపూజను ఉపేక్షించినవాడు, గోవర్ధనాచలధారి, ఇంద్రునిచే స్తుతించబడువాడు, పూజ్యుడు, కామధేను ప్రపూజితుడు, సర్వతీర్థాభిషిక్తుడు, గోవిందుడు, గోపరక్షకుడు, కాళీయార్తికరుడు, క్రూరుడు, నాగపత్నులచే స్తుతించబడినవాడు, విరాట్, ధేనుకారి, ప్రలంబారి, వృషాసుర విమర్దనుడు, మాయాసురాత్మజ ధ్వంసి, కేశికంఠ విచారకుడు, గోపగోప్త, ధేనుగోప్త, దావాగ్ని పరిశోషకుడు, గోపకన్యా వస్త్రహారి, గోపకన్యా వరప్రదుడు, యజ్ఞపత్న్యన్నభోజి, ముని మానాపహారకుడు, ఖలేశమాన మధనుడు, నందగోపాల జీవనుడు, గంధర్వ శాపమోక్త, శంఖ చూడ శిరోహరుడు, వేణుధారి, వటధారి, వేణువాది, గోపీ చింతాపహారకుడు, సర్వగోప్త, సమాహ్వానుడు, సర్వగోపీ మనోరథుడు, వ్యంగ ధర్మప్రవక్త, గోపీమండల మోహనుడు, రాసక్రీడారసాస్వాదీ, రసికుడు, రాధికాధవుడు, కిశోరీ ప్రాణనాథుడు, వృషభానుసుతా ప్రియుడు, సర్వగోపీ జనావందీ, గోపీ జన విమోహనుడు, గోపికా గీత చరితుడు, గోపీ నర్తనలాలసుడు, గోపీ స్కందాశ్రితకరుడు, గోపికా చుంబన ప్రియుడు, గోపికా మార్జిత ముఖుడు, గోపీ వ్యజన వీజితుడు, గోపికాకేశ సంస్కారి, గోపికా పుష్ప సంస్తరుడు, గోపికా హృదయాలంబీ, గోపీవహన తత్పరుడు, గోపికామదహరి, గోపికా పరమార్చితుడు, గోపికాకృత సంనీలుడు, గోపికా సంస్కృత ప్రియుడు, గోపికావందితపదుడు, గోపికా వశవర్తనుడు, రాధాపరాజితుడు, శ్రీమంతుడు, నికుంజ విహారి, కుంజ ప్రియుడు, కుంజవాసి, బృందావన వికాసనుడు, యమునా జలసిక్తాంగుడు, యమునా సౌఖ్యదాయకుడు, శశిస్తంభనుడు, శూరుడు, కామి, కామ విమోహనుడు, కామాద్యుడు, కామనాథుడు, కామ మానస భేదనుడు, కామదుడు, కామరూపుడు, కామినీ కామ సంచయుడు, నిత్య క్రీడుడు, మహాలీలుడు సర్వుడు, సర్వగతుడు, పరమాత్మ, పరాధీశుడు, సర్వకారణకారణుడు, నారదుని వాక్యమును గ్రహించినవాడు, అక్రూరునిచే ధ్యానించబడినవాడు, ఆక్రూర వందిత పదుడు, గోపికాతోష కారకుడు, అక్రూర వాక్య సంగ్రాహి, మధురావాసకారణుడు, అక్రూరతాప శమనుడు, రజకాయుః ప్రణాశనుడు, మధురానందదాయి, కంసవస్త్ర విలుంఠనుడు, కంస వస్త్రములను ధరించినవాడు, గోపవస్త్ర ప్రదాయకుడు, సుదామ గృహగామి, సుదామ పరిపూజితుడు, తంతువాయక సంప్రీతుడు, కుబ్జా చందన లేపనుడు, కుబ్జరూప ప్రదుడు, విజ్ఞుడు, ముకుందుడు, విష్టరశ్రవుడు, సర్వజ్ఞుడు, మధురాలోకి, సర్వలోకాభి నందనుడు, కృపాకటాక్షదర్శి, దైత్యారీ, దేవపాలకుడు, సర్వదుఃఖ ప్రశమనుడు, ధనుర్భంగి, మహోత్సవుడు, కువలయా పీడహంతా, దంత స్కంధ బలాగ్రణి, కల్పరూపధరుడు, ధీరుడు, దివ్య వస్త్రాను లేపనుడు, మల్లిరూపుడు, మహాకాలుడు, కామరూపి, బలాన్వితుడు, కంసత్రా సకరుడు, భీముడు, ముష్టికాంతకుడు, కంసహంత, చాణూరఘ్నుడు, భయహరుడు, శలారిస్తుడు, శలాంతకుడు, వైకుంఠవాసి, కంసారి, సర్వదుష్ట నిషూదనుడు, దేవ దుందుభి నిర్ఘోషి, పితృశోక నివారణుడు, యాదవేంద్రుడు, సజ్జనాధీశుడు, యాదవారి ప్రమర్ధనుడు, శౌరీశోక వినాశి, దేవకీ తాపనాశనుడు, ఉగ్రసేన పరిత్రాత, ఉగ్రసేనాభి పూజితుడు, ఉగ్రసేనాభిషేకి, ఉగ్రసేన దయాపరుడు, సర్వ సాత్వతసాక్షి, యదు జనాభినందనుడు, సర్వమాధుర సంసేవ్యుడు, కరుణుడు, భక్తబాంధవుడు, సర్వగోపాల ధనదుడు, గోపీగోపాల లాలసుడు, శౌరిదత్తోపవీతి, ఉగ్రసేన దయాకరుడు, గురుభక్తుడు, బ్రహ్మచారి, నిగమాధ్యయనరతుడు, సంకర్షణ సహాధ్యాయి, సుదామ సుహృత్, విద్యానిధి, కలాకోశుడు, మృతపుత్ర ప్రదుడు, చక్రి, పాంచజని, సర్వనారకిమోచనుడు, యమార్చితుడు, పరుడు, దేవుడు, నామోచ్చారణవశుడు, అచ్యుతుడు, కుబ్జావిలాసి, సుభగుడు, దీనబంధువు, అనుపముడు, అక్రూర గృహగోప్త, ప్రతిజ్ఞాపాలకుడు, శుభుడు, జరాసంధ జయి, విద్వాన్, యవనాంతకుడు, ద్విజాశ్రయుడు, ముచుకుంద ప్రియకరుడు, జరాసంధ పలాయితుడు, ద్వారకా జనకుడు, గూఢుడు, బ్రహ్మణ్యుడు, సత్యసంగరుడు, లీలాధరుడు, ప్రియకరుడు, విశ్వకర్మ, యశఃప్రదుడు, రుక్మిణీ ప్రియ సందేశుడు, రుక్మిశోక వివర్థనుడు, చైద్య శోకాలయుడు, శ్రేష్టుడు, దుష్టరాజన్య నాశనుడు, రుక్మివైరూప్యకరణుడు, రుక్మిణీ వచన రతుడు, బలభద్రవచోగ్రాహి, ముక్తరుక్మి జనార్దనుడు, రుక్మిణీ ప్రాణనాథుడు, సత్యభామా పతి, భక్తపక్షీ భక్తివశ్యుడు, అక్రూరమణి దాయకుడు, శతధన్వాప్రాణహారి, ఋక్ష రాజసుతా ప్రియుడు, సత్రాజిత్త నయాకాంతుడు, మిత్ర విందాపహారకుడు, సత్యాపతి, లక్ష్మణాజిత్, పూజ్యుడు, భద్రా ప్రియంకరుడు, నరకాసుర ఘాతి, లీలా కన్యాహరుడు, జయమురారి, మదనేశుడు ధరిత్రీదుఃఖనాశనుడు, వైనతేయీ, స్వర్గగామి, అదితికి కుండలముల నిచ్చిన వాడు, ఇంద్రార్చితుడు, రమాకాంతుడు, వజ్రభార్యా ప్రపూజితుడు, పారిజాతాపహారి, శక్రమానాపహారకుడు, ప్రద్యుమ్నజనకుడు, సాంబతాతుడు, బహుసుతుడు, విధు, గర్గాచార్యుడు, సత్యగతి, ధర్మాధారుడు, ధరాధరుడు, ద్వారకామండనుడు, శ్లోక్యుడు, సుశ్లోకుడు, నిగమాలయుడు, పౌండ్రకప్రాణహారి, కాశీరాజ శిరోహరుడు, ఆ వైష్ణవ విప్రదాహి, సుదక్షిణ భయావహుడు, జరాసంధ విదారి, ధర్మ నందన యజ్ఞకృత్, శిశుపాల శిరచ్ఛేది, దంతవక్త్ర వినాశనుడు, విదూర ధాంతకుడు, శ్రీశుడు, శ్రీదుడు, ద్వివిదనాశనుడు, రుక్మిణీ మానహారి, రుక్మిణీ మానవర్థనుడు, దేవర్షి శాపహర్త, ద్రౌపదీ వాక్యపాలకుడు, దుర్వాస భయహారి, పాంచాలీ స్మరణాగతుడు, పార్థదూత, పార్ధమంత్రి, పార్థ దుఃఖౌఘ నాశనుడు, పార్థమానాపహారి, పార్థ జీవనదాయకుడు, పాంచాలీ వస్త్ర దాత, విశ్వపాలక పాలకుడు, శ్వేతాశ్వ సారధి, సత్యుడు, సత్యసాధుడు, భయావహుడు, సత్యసంధుడు, సత్యరతి, సత్యప్రియుడు, ఉదారధీ, మహాసేన జయీ, శివసైన్య వినాశనుడు, బాణాసుర భుజచ్ఛేత్థా, బాణబాహు వరప్రదుడు, తార్ క్ష్యమానాపహరి, తార్ క్ష్య తేజో వివర్థనుడు, రామస్వరూపధారి, సత్యభామా ముదావహుడు. రత్నాకర జలక్రీడుడు, ప్రజలీలా ప్రదర్శకుడు, స్వప్రతిజ్ఞా పరిధ్వంసి, భీష్మాజ్ఞా పరిపాలకుడు, వీరాయుధ హరుడు, కాలుడు, కాలికేశుడు, మహాబలుడు, బర్బరీశ శిరోహారి, బర్బరీశశిరః ప్రదుడు, ధర్మపుత్రజయి, శూర దుర్యోధన మదాంతకుడు, గోపికా ప్రీతి నిర్బంధ నిత్యక్రీడుడు, వ్రజేశ్వరుడు, రాధా కుండరతి, ధన్యుడు, సదాందోళ సమాశ్రితుడు, సదా మధువనానండీ, సదా బృందావన ప్రియుడు, అశోకవన సన్నద్ధుడు, సదా తిలక సంగతుడు, సదాగోవర్థనరతి, సదా గోకుల వల్లభుడు, భాండీర వట సంవాసి, నిత్యం వంశీవట స్థితుడు, నందగ్రామ కృతావాసుడు, వృషభానుగ్రహ ప్రియుడు, గృహీత కామినీ రూపుడు, నిత్య రాసా విలాసకారి, వల్లవీ జనసంగోప్తా, వల్లవీ జనవల్లభుడు, దేవశర్మ కృపాకర్త, కల్పపాదప సంస్థితుడు, శిలానుగంధ నిలయుడు, పాదచారి, ఘనస్థలి, అతనీకుసుమ ప్రఖ్యుడు, సదాలక్ష్మి కృపాకరుడు, త్రిపురారి ప్రియకరుడు, ఉగ్రధన్వాపరాజితుడు, షడ్థుర ధ్వంసకర్త, నికుంభ ప్రాణహారకుడు, వజ్రనాభ పురధ్వంసి, పౌండ్రక ప్రాణహారకుడు, బహులాశ్వ ప్రీతికర్త, ద్విజవర్య ప్రియంకరుడు, శివసంకటహారి, వృకాసుర వినాశనుడు, భృగు సత్కారకారి, శివ సాత్త్వికతాప్రదుడు, గోకర్ణ పూజకుడు, సాంబకుష్ఠ విధ్వంస కారణుడు వేదస్తుతుడు, వేదవేత్త, యదువంశ వివర్ధనుడు, యదువంశ వినాశి, ఉద్ధవోద్థారకారకుడు. ఇవి శ్రీకృష్ణ నామములు. ఇక రాధికా నామములను వినుము.

రాధికా నామములు: రాధ, రాధికా, ఆనందా, వృషభానుజా, బృందావనేశ్వరీ, పుణ్యా, కృష్ణమానస హారిణీ, ప్రగల్భా, చతురా, కామా, కామినీ, హరిమోహినీ, లలితా, మధురా, మాధ్వీ, కిశోరీ, కనకప్రభా, జితచంద్రా, జితమృగా, జితసింహా, జితద్వీపా, జితరంభా, జితపికా, గోవింద హృదయోద్భవా, జితబింబా, జితశుకా, జితపద్మా, కుమారికా, శ్రీకృష్ణాకర్షణా, దేవీ, నిత్యయుగ్మ స్వరూపిణీ, నిత్యవిహారిణీ, కాంతా, రసికా, కృష్ణ వల్లభా, అమోదినీ, మోదవతీ, నంద నందన భూషితా, దివ్యాంబరా, దివ్యహారా, ముక్తామణి విభూషితా, కుంజ ప్రియా, కుంజవాసా, కుంజనాయక నాయికా, చారురూపా, చారువక్త్రా, చారుహోమాం గదా, శుభా, శ్రీకృష్ణవేణు సంగీతా, మురళీ హారిణీ, శివా, భద్రా, భగవతీ, శాంతా, కుముదా, సుందరీ, ప్రియా, కృష్ణ క్రీడా, కృష్ణరతి, శ్రీకృష్ణ, సహచారిణీ, వంశీవట ప్రియస్థానా, యుగ్మా, యుగ్మ స్వరూపిణీ, భాండీర వాసినీ, శుభ్రా, గోపీనాధ ప్రియా, సఖీ శ్రుతినిః శ్వసితా, దివ్యా, గోవిన్ద రసదాయినీ, శ్రీకృష్ణ ప్రార్థనీ, ఈశానా, మహానన్ద ప్రదాయినీ, వైకుంఠ జన సంసేవ్యా కోటి లక్ష్మీ, సుఖావహా, కోటికందర్ప లావణ్యా, రతి కోటి రతిప్రదా, భక్తిగ్రాహ్యా, భక్తిరూపా, లావణ్య సరసీ, ఉమా, బ్రహ్మరుద్రాది సంరాధ్యా, నిత్యకౌతూ హలాన్వితా, నిత్యలీలా, నిత్యకామా, నిత్య శృంగార భూషితా, నిత్య బృన్దా వనరసా, నంద నందన సంయుతా, గోపికా మండలీ యుక్తా, నిత్య గోపాల సంగతా, గోరస క్షేపణీ, శూరా, సానందా, ఆనందదాయినీ, మహాలీలా, ప్రకృష్ణా, నాగ, నగచారిణీ, నిత్యా ఘూర్ణితా, పూర్ణా, కస్తూరీ తిలకాన్విత, పద్మా, శ్యామా, మృగాక్షీ, సిద్ధిరూపా, రసావహా, కోటి చంద్రాననా, గౌరీ, కోటి కోకిల సుస్వరా, శీలసౌన్దర్య నిలయా, నంద ననందనలాలిత, అశోకవన సంవాసా, భాండీర వనసంగత, కల్పద్రుమ తలావిష్ణా, కృష్ణా, విశ్వా, హరిప్రియా, అజాగమ్యా, భావగమ్యా, గోవర్థన కృతాలయా, యమునా తీరనిలయా, శశ్వద్గోవిన్ద జల్పినీ, శశ్వన్మానవతీ, స్నిగ్థా, శ్రీకృష్ణ పరివన్దిత, కృష్ణస్తుత, కృష్ణవృతా, శ్రీకృష్ణ హృదయాలను, దేవద్రుమఫలా, సేవ్యా, బృందావన రసాలయా, కోటి తీర్థమయీ, సత్యా, కోటి తీర్థఫలప్రదా, కోటియోగ సుదుంప్యా, కోటియజ్ఞ దురాశ్రయా, మానసా, శశిలేఖా, శ్రీకోటి సుభగా, అనఘా, కోటిముక్త సుఖా, సౌమ్యా, లక్ష్మీకోటి విలాసినీ, తిలోత్తమా, త్రికాలస్ధా, త్రికాలజ్ఞా, అధీశ్వరీ, త్రివేదజ్ఞా, త్రిలోకజ్ఞా, తురీయాన్త నివాసినీ, దుర్గారాధ్య, రమారాధ్య, విశ్వారాధ్య, చిదాత్మిక, దేవారాధ్య, పరారాధ్య, బ్రహ్మారాధ్య, పరాత్మిక, శివారాధ్య, ప్రేమసాధ్య, భక్తారాధ్య రసాత్మిక, కృష్ణ ప్రాణార్పిణీ, భామా, శుద్ధ ప్రేమ విలాసినీ, కృష్ణారాధ్య, భక్తి సాధ్యా, భక్త బృంద నిషేవితా, విశ్వాధారా, కృపాధారా, జీవాధారా, అతి నాయికా, శుద్ధ ప్రమేమమయీ, లజ్జా, నిత్య సిద్ధా, శిరోమణి, దివ్య రూపా, దివ్యభోగా, దివ్యవేషా, ముదాన్వితా, దివ్యాంగనా బృందసారా, నిత్య నూతన యౌవనా, పరబ్రహ్మ వృతా, ధ్యేయా, మహారూపా, మహోజ్జ్వలా, కోటిసూర్య ప్రభా, కోటి చంద్రబింబాధికచ్ఛవి, కోమలా, అమృతవాక్, ఆద్యా, వేదాద్య, వేద దుర్లభా, కృష్ణాసక్తా, కృష్ణభక్తా, చంద్రావతి నిషేవితా, కలా షోడశ సంపూర్ణా, కృష్ణ దేహార్థ ధారిణీ, కృష్ణబుద్ది, కృష్ణ సారా, కృష్ణ రూపా విహారిణీ, కృష్ణకాంతా, కృష్ణ ధనా, కృష్ణ మోహన కారిణీ, కృష్ణ దృష్టి, కృష్ణ, గోత్రీ, కృష్ణ దేవీ, కులోద్వహా, సర్వభూత స్థితా, ఆత్మా, సర్వలోక నమస్కృతా, కృష్ణ దాత్రీ, మహాదేవీ, శుభంకరా, శ్రీ శేష దేవజననీ, అవతార గణ ప్రసూ, ఉత్పలాంకా, అరవిందాంకా, ప్రసాదింకా, ద్వితీయకా, రధాంకా, కుంజ రాంకా, కుండలాంక పదస్థితా, ఛత్రాంకా, విద్యుదంకా, పుష్పమాలాంకితా, దండాంకా, సుకటాంకా, పూర్ణచంద్రా, శుకాంకితా, కృష్ణాన్నహారపాకా, బృందా కుంజ విహారిణీ, కృష్ణ ప్రబోధనకరీ, కృష్ణ శేషాన్న భోజినీ, పద్మకేసర మధ్యస్థా, సంగీతా గమవేదినీ, కోటి కల్పాంత భ్రూభంగా, అప్రాప్తపులకాచ్యుతా, సర్వస్వనిధి, పద్మ శంఖాది నిధిసేవితా, అణిమాదిగుణైశ్వర్యా, దేవబృంద విమోహినీ, సర్వానన్ద ప్రదా, సర్వా, సువర్ణ లతికాకృతి, కృష్ణాభిసార సంకేతా, మాలినీ, నృత్య పండితా, గోపీ సింధు సకాశాహ్వా గోప మండప శోభినీ, శ్రీకృష్ణ ప్రతిదా, భీతా, ప్రత్యంగ పులకాంచితా, శ్రీకృష్ణా లింగనరతా, గోవింద విరహాక్షమా, అనంతగుణ సంపన్నా, కృష్ణ కీర్తన లాలసా, బీజత్రయ మయీమూర్తి, కృష్ణానుగ్రహవాంఛితా, విమలాది నిషేవ్యా, లలితాద్యర్చితా, సతీ, పద్మ బృందస్థితా, హృష్టా, త్రిపురా పరిసేవితా, వృంతావత్యర్చితా, శుద్ధా, దుర్జేయా, భక్తవల్లభా, దుర్లభా, సాంద్రసౌఖ్యాత్మా, శ్రేయోహేతువు, సుభోగదా, సారంగా, శారదా, బోధ, సదృృందావన చారిణీ, బ్రహ్మానందా, చిదానందా, ధ్యానానందా, అర్థమాత్రికా, గంధర్వా, సురతజ్ఞ, గోవింద ప్రాణ సంగమా, కృష్ణాంగభూషణా, రత్నభూషణా, స్వర్ణభూషితా, శ్రీ కృష్ణ హృదయా వాస ముక్తా కనక నాళికా, సద్రత్న కంకణయుతా, శ్రీమన్నీలగిరిస్థితా, స్వర్ణనూపుర సంపన్న, స్వర్ణ కింకిణి మండితా, అశేష రాసకుతుకా, రంభోరువు, తనుమధ్యమా, పరాకృతి, పరానందా, పరస్వర్గ విహారిణీ, ప్రసూన కబరీ, చిత్రా, మహా సింధూర సుందరీ, కైశోర వయసా, బాలా, ప్రమదామల శేఖరా, కృష్ణా ధరసుధాస్వాదా, శ్యామప్రేమ వినోదినీ, శిఖిపిఞ్చలసచ్చుడా, స్వర్ణ చంపక భూషితా, కుంకుమాలక్త కస్తూరీ మండితా, అపరాజితా, హేమహారాన్వితా, పుస్పాహారాఢ్యా, రసవతీ, మాధుర్య మధురా, పద్మా, పద్మహస్తా, సువిశ్రుతా, భూభంగా భంగ కోదండ కటాక్ష శర సంధినీ, శేషదేవా, శిరస్థ, నిత్య స్థల విహారిణీ, కారుణ్య జలమధ్యస్థా, నిత్య చిత్తాధిరోహిణీ, అష్టభాషవతీ, అష్టనాయికా లక్షణాన్వితా, సునీతిజ్ఞా, శ్రుతిజ్ఞా, సర్వజ్ఞా, దుఃఖహారిణీ, రజో గుణేశ్వరీ, శరచ్చంద్రనిభాననా, కేతకీ కుసుమాభాసా, సదాసింధు వనస్థితా, హేమ పుష్పాధిక వరా, పంచశక్తి మయీ, హితా, స్తనకుంభీ, నరాఢ్య, క్షీణపుణ్యా, యశస్వినీ, వైరాజ సూయ జననీ, శ్రీశా, భువన మోహినీ, మహాశోభా, మహామాయా, మహాకాన్తి, మహాస్మృతి, మహామోహా, మహావిద్యా, మహాకీర్తి, మహారతి, మహాధైర్యా, మహావీర్యా, మహాశక్తి, మహాద్యుతి, మహాగౌరీ, మహా సంపత్, మహా భోగవిలాసినీ, సమయా, భక్తిదా, అశోకా, వాత్సల్యరసదాయినీ, సుహృత్, భక్తిప్రదా, స్వచ్ఛా, మాధుర్య రసవర్షిణీ, భావ భక్తిప్రదా, శుద్ధప్రేమ భక్తి విధాయినీ, గోపారామా, అభిరామా, క్రీడారామా, పరమేశ్వరీ, నిత్యరామా, ఆత్మరామా, కృష్ణరామా, రామేశ్వరీ, ఏకా, అనేక జగద్వ్యాప్తా, విశ్వలీలా ప్రకాశినీ, సరస్వతీశా, దుర్గేశా, జగదీశా, జగద్విది, విష్ణువంశ నివాసా, విష్ణువంశ సముద్భవా, విష్ణువంశస్తుతా, వర్త్రీ, విష్ణువంశావనీ, ఆరామస్థా, వనస్థా, సూర్యపుత్రవ గాహినీ, ప్రీతిస్థా, నిత్యయంత్రస్థా, గోలోకస్థా, విభూతిదా. స్వానుభూతి స్థితా, వ్యక్తా, సర్వలోక నివాసినీ, అమృతా, అద్భుతా, శ్రీమన్నారాయణ సమీడితా, అక్షరా, కూటస్థా, మహాపురుష సంభవా, ఔదార్య బావసాధ్యా, స్థూల సూక్ష్మాతి రూపిణీ, శిరీష పుష్పమృదులా. గాంగేయ ముకురప్రభా, నీలోత్పలజలాక్షి, సద్రత్నక వరాన్వితా, ప్రేమ పర్యంక నిలయా, తేజోమండల మధ్యగా, కృష్ణాంగ గోపనా, అభేదా, లీలావరణ నాయికా, సుధా సింధు సముల్లాసా అమృతా స్యంద విధాయినీ, కృష్ణ చిత్తా రాసచిత్తా, ప్రేమచిత్తా, హరిప్రియా, అచింతన గుణగ్రామా, కృష్ణలీలా, మలాపహా, రాససిందు శశాంకా, రాసమండల మండినీ, నతవ్రతా, సింహరీస్థా, సుమూర్తి, సురవందిత, గోపీ చూడామణి, గోపీ గణేశాడ్యా విరజాధికా, గోపప్రేష్ఠా, గోపకన్యా, గోపనారీ, సుగోపికా, గోపదామా, సుదామాంబా, గోపాలీ, గోపమోహినీ, గోప భూషా, కృష్ణ భూషా, శ్రీ బృందావన చంద్రికా, వీణాది ఘోష నిరతా, వాసోత్సవ వినాసినీ, కృష్ణ చేష్టా, పరిజ్ఞాతా, కోటి కందర్ప మోహినీ, శ్రీకృష్ణ గుణగానాఢ్యా, దేవ సుందరి మోహినీ, కృష్ణ చంద్రమనోజ్ఞా, కృష్ణదేవ సహోదరీ, కృష్ణాభి లాషిణి, కృష్ణ ప్రేమానుగ్రహ వాంఛితా, క్షేమా, మధురాలాపా, భ్రువోమాయా, సుభద్రికా, ప్రకృతి, పరమానన్దా, నీప ద్రుమతలస్థిత, కృపాకటాక్ష, బింబోష్ఠీ, రంభా, చారునితంబినీ, స్మరకేలి నిధానా, గండతాటంక మండితా, హేమాద్రి కాంతి రుచిరా, ప్రేమద్యా, మద మంధరా, కృష్ణార్చితా, ప్రేమచింతా, రతిచింతా, కృష్ణదా, రానచింతా, భావచింతా, శుద్ధ చింతా, మహారసా, కృష్ణా దృష్టి త్రుటి యుగా, దృష్టి పక్ష్మ వినిందినీ, కన్దర్ప జననీ, ముఖ్యా, వైకుంఠగతి దాయినీ, రాసభావా, ప్రియాశ్లిష్టా, ప్రేష్ఠా, ప్రథమ నాయికా, సుద్ధా, సుధా దేహినీ, శ్రీరామా, రసమంజరీ, సుప్రభావా, శుభాచారా, స్వర్ణదీ, నర్మదాంబికా, గోమతీ, చంద్ర భాగేడ్యా, సరయూ, తామ్రపర్ణినూ, నిష్కలంక చరిత్రా, నిర్గుణా, నిరంజనా ఇది రాధాకృష్ణ యుగ్మరూప సహస్రనామము. బృందావన రసావహమున ప్రయత్నముచే పఠించవలయును. ఈ సహస్రనామము మహాపాప ప్రశమనము, వంధ్యాత్వ వినివర్తకము. దారిద్య్ర్య శమనము, రోగ నాశనము, కామదము, గొప్పది. పాపాపహము. శత్రునాశకము, రాధా మాధవ భక్తి ప్రదము. అకుంఠ మేధస్కుడైన భగవంతుడగు కృష్ణునకు నమస్కారము. రాధా సుధా సింధువున నిత్య విహారికి నమస్కారము. రాధాదేవి జగత్మర్త్రి, జగత్పాలన, జగల్లయ విధాత్రి, సర్వేశి, సర్వసూతికా, ఆమె నామ సహస్రమును నేను చెప్పితిని. ఈ సహస్ర నామము భుక్తి ముక్తి ప్రదము. ఇంకను ఏమి వినగోరుచున్నావు? (3/82)