తిథి మొదలగు వాని నిర్ణయము

సనకమహర్షి పలికెను: తిథి నిర్ణయమును ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను. ఓ మునిశ్రేష్ఠా! దీనివలన కర్మ సిద్ధి కలుగును. కావున వినుము. శ్రౌతస్మార్తవ్రతధానాదికములు వైదికము లగు కర్మలు తిథి నిర్ణయము జరుగనిచో ఫలించజాలవు. ఏకాదశి, అష్టమి, షష్ఠి, పూర్ణిమ, చతుర్దశి, తృతీయ, ఈ తిథులు ఉపవాస వ్రతాదులందు తరువాతి తిథితో విద్ధమైనచో ప్రశస్తములగును. పూర్వతిథితో కూడినవి గ్రహించదగినవి కావు. నాగవిద్ధ అగు షష్ఠి శివ విద్ధయగు సప్తమి, ఏకాదశీ విద్ధయగు దశమి, ఉపవాసమునకు యోగ్యములు కావు. అమావాస్య, పూర్ణిమ సప్తమి పితృవాసరము పూర్వ తిథి విద్దమైన దానిని ఆచరించినచో నరకమును చెందును. కృష్ణపక్షమును సప్తమి, చతుర్థశి, తృతీయ, నవమి పూర్వతిథి విద్ధయైనచో ప్రశస్తమని కొందరు చెప్పెదరు. అన్ని వ్రతములకు శుక్ల పక్షము ప్రశస్తము. అపరాహముకంటే పూర్వాహముశ్రేష్ఠము. వ్రతాదులకు పూర్వాహ్లికీ తిథి కుదరనిచో సూర్యో దయము తరువాత రెండు ముహూర్తముల కాలమున గ్రహించవలయును. సూర్యుడు అస్తమించు నక్షత్రమును తిథితో కూడియున్న దానిని విహిత కర్మలలో స్వీకరించ వలయును. ప్రదోషకాలవ్యాపిని అగు తిథిని గ్రహించవలయును. అట్లు కానిచో నిష్పలమగును. నక్షత్రమున విధించిన వ్రత విషయమున అర్ధరాత్రము తరువాత నక్షత్ర వ్యాప్తిని అగు తిథిని స్వీకరించవలయును. రెండు అర్ధ రాత్రములలో నక్షత్రము వ్యాపించి ఉన్నచో తిథియుక్త మైన నక్షత్రమును గ్రహించవలయును. తిథి నక్షత్రములు రెండర్థ రాత్రములలో క్షయమునకు పూర్వము వృద్ధికి ఉత్తరము ప్రశస్తము. నక్షత్రముతో కూడిన తిథి అర్థరాత్ర ద్వయ వ్యాప్తమైనచో ప్రసవృద్ధి శూన్యమైనచో పూర్వమును పరమును కూడా గ్రహించవచ్చును. జ్యేష్ఠా నక్షత్రముతో కూడిన మూల, కృత్తికతో కూడిన రోహిణి, అనూరాధతో కూడిన జ్యేష్ఠ సంతానాది వినాశిని అగును. కర్మానుష్ఠానమునకు పగటి తిథులు ప్రశస్తములు. రాత్రి వ్రతములు అన్నిటిలో రాత్రి యోగము ప్రశస్తము. ఏ నక్షత్రముతో కూడియున్న ఏతిథి పవిత్రముగా పేర్కొనబడినదో ఆతిథిలో అవ్రతమును చేయవలయును. శ్రవణ ద్వాదశీ వ్రతమున ఉదయ వ్యాపినీ తిథిని గ్రహించవలయును. సూర్య చంద్ర గ్రహణములు ఉన్నంతవరకే జపాదులతో స్వీకరించ వలయును. అన్ని సంక్రమణములలో పుణ్యకాలము విశేషించిన అక్షయ ఫలము లభించును. కర్కాటక సంక్రమణమున దక్షిణాయన పుణ్యకాలము సంక్రమించును.

దక్షిణాయన పుణ్యకాలమున మొదటి ముప్పది ఘటికలు పుణ్యకాలమని పండితులు చెప్పెదరు. వృషభ వృశ్చిక సింహ కుంభ సంక్రమణములలో స్నాన జపాదులకు మొదటి ఎనిమిది ముహూర్తములను గ్రహించవలయును. తులా మేష తరువాతి పదునారు ఘటికలు పుణ్యకాలము. మకర సంక్రమణము ఉత్తరాయణ పుణ్యకాలమందురు. తరువాతి ముప్పది ఘంటికలు, మొదటివలె నలుబది ఘటికలు ప్రశస్తములు. సూర్యచంద్రులు గ్రహణముతో అస్తమించిన యెడల మరునాడు శుద్ధ మండలమును చూచి స్నానము చేసి భుజించవలయును. ధర్మమును పొందగోరు విద్వాంసులు సినివాలీ కుహూ అను పేర్లచే అమావాస్య రెండు విధములని చెప్పిరి. చంద్రుడు కనబడిన అమావాస్య సినీవాలీ అని, కనపడని అమావాస్య కుహూ అని సిద్దాంతము. సాగ్నిహోత్రులగు విప్రులు శ్రాద్ధ కర్మలో సినీవాలినే గ్రహించవలయును. స్త్రీలు శూద్రులు అనగ్నిహోత్రులు కుహరాను స్వీకరించ వలయును. అమావాస్య తిథి అపరాష్ట్ర వ్యాపిని అయినచో క్షయమునకు (మృతాహము) పూర్వ మును, వృద్ధికి అపరమును గ్రహించవలయును. మధ్యాహ్నము తరువాత అమావాస్య ప్రతీయ మానమగుచో శాస్త్ర విశారదులగు సజ్జనులు భూతవిద్ధా అందురు. అమావాస్య అత్యన్త క్షీణమై రెండవరోజు అపరాష్ట్ర వ్యాపిని కానిచో సాయాహ్నవ్యాపిని అగు సినీవాలినే గ్రహించవలయును. రెండవరోజు క్షీణించినచో సాయాహ్నవ్యాపినిగా ఉన్నచో తరువాత నున్న సినీవాలిని గ్రహించ వలయును. అమావాస్య అత్యంతవృద్ధిగా ఉన్నచో భూతవిద్ధను పరిత్యజించవలయును. పితృకర్మలో అపరాహవ్యాప్తిని అగు కుహూను స్వీకరించవలయును. రెండవ దినమున వృద్ధియైనచో భూతవిద్ధను విడువవలయును. రెండవ దినము పరాహవ్యాపిని అయినచో కుహూను గ్రహించ వలయును అని పండితులు చెప్పెదరు. రెండు మధ్యాహ్నములలో అమావాస్య వ్యాపించి యున్నచో యథేష్ఠముగా మొదటి దానిని కాని, రెండవదానిని కాని స్వీకరించ వచ్చును. ఇక ఇప్పుడు సంపూర్ణ పర్వలో అన్వాధానమును (పితృయజ్ఞము) చెప్పెదను. ప్రతిపద్దినమున యాగమును చేయవలయును. పర్వలోని నాలుగవ అంశము ప్రతిపత్తులోని మొదటి మూడు ఘటికలు ప్రశస్తములు. ఈ సమయమే యాగకాలమని తెలియవలయును అని పండితులు నిర్ణయించిరి. అమావాస్యకాని పూర్ణిమకాని రెండు మధ్యాహ్నములలో ఉండెనేని రెండవదినమే సద్యఃకాలముగా గ్రహించవలయును పూర్వద్వయమైనచో పరసంగమున్న రెండవదినమునే గ్రహించవలయును. తిథిక్షయమున్నచో సద్యఃకాలము రెండవదినమే అగును. దశమీ విద్దకాని ఏకాదశినే అందరూ గ్రహించవలయును. దశమీ విద్దయగు ఏకాదశి జన్మత్రయ సంచితమగు పుణ్యమును నశింపచేయును. ద్వాదశీ తిథియందు ఏకాదశి కళామాత్రముగా నున్ననూ, త్రయోదశి తిథిలో ద్వాదశి కళామాత్ర మున్ననూ అది చాలా శ్రేష్ఠము. శుద్ధమైన సంపూర్ణేకాదశి ద్వాదశి తిథియందు కూడా ప్రతీతియగుచో, రాత్రి చివర త్రయోదశీ ప్రతీతయున్నచో అచట మొదటి దానిని గృహస్థులు, రెండవ దానిని యతులు స్వీకరించవలయును. గృహస్థులు ఫలసిద్ధిని యతులు మోక్షమును కోరెదరు కదా! ద్వాదశీ తిథిని కలా మాత్రము కూడా పారాణా కాలము లభించినచో దశమీ విద్దయగు ఏకాదశి అయిననూ ఉపవసించవలయును. శుక్ల పక్షమున కాని కృష్ణపక్షము కాని కృష్ణ పక్షమునకాని ఏకాదశీ ద్వయము వచ్చినచో గృహస్థులు మొదటి దానిని, యతులు రెండవదానిని గ్రహించవలయును. దశమీ సంయుతమగు ఏకాదశి ద్వాదశీ తిథి ద్వాదశి ఉన్నచో విద్ధలేకున్ననూ మొదట ఏకాదశిని విడువవలయును. ఏకాదశి ద్వాదశి రాత్రి శేషముగా త్రయోదశి ఉన్నచో కూడా కొంచెమున్నచో దినక్షయమున అందరూ రెండవ దానినే స్వీకరించవలయును. రెండవ దినమున ద్వాదశి లేనిచో దశమీ విద్ధ అయిననూ ఏకాదశిని గ్రహించవలయును. రెండవదినమున ద్వాదశీ తిథిన ఉపవాస ముండి త్రయోదశిన పారణ చేయవలయును. ద్వాదశీ దినమున కలామాత్రము ఏకాదశి ఉన్నను, త్రయోదశిన ద్వాదశి ఉన్ననూ లేకున్ననూ దశమీ విద్ధయగు ఏకాదశిని గృహస్థులు, యతులు రెండవదానినే స్వీకరించవలయును. సంపూర్ణేకాదశి ద్వాదశినాడే మాత్రములేక, త్రయోదశిన ద్వాదశి కొంచెము ఉన్నచో మొదటి దానిని గృహస్థులు రెండవదానిని యతులు స్వీకరించవలయును. రెండవదినమునే ఉపవసించవలయునని కొందరి మతము, ఏకాదశీ దశమీ విద్ధ అయి ద్వాదశిన ప్రతీతికానిచో, ద్వాదశీ తిథి త్రయోదశిన వ్యాపించి ఉన్నచో అచటనే వ్రతమును చేయవలయునని మరికొందరి మతము. శుద్ధ ద్వాదశీ తిదినాడే అందరూ ఉపవసించవలయునని సిద్ధాంతము. కొందరు మొదటి దినమునే ఆచరించవలయు అందురు కాని అది సమంజనము కాదు.

సంక్రమణమున ఆదివారమున వ్యతీపాత్తున గ్రహణకాలమున పుత్రవంతుడగు గృహస్థుడు పారణమును కాని ఉపవాసమును కాని చేయరాదు. అమావాస్యనాడు పగలు పూర్ణిమారాత్రిన చతుర్దశీ అష్టములలో పగలు, ఏకాదశి పగలు రాత్రులు భుజించెనేని చాంద్రాయణ వ్రతము ఆచరించవలయును. సూర్య గ్రహణము ప్రాప్తించునపుడు ముందుగా మూడు ఝాములు భుజించ రాదు. భుజించెనేని సురాపాన సమపాపము కలుగును. అన్వాధాన యోగ మధ్య కాలమున చంద్ర సూర్యగ్రహణము వచ్చినచో యాజ్ఞికులు ప్రాయశ్చిత్తమును చేయవలయును. చంద్ర గ్రహణ సమయమున ‘దశమేసోమ’ అను ఋక్కుచే యాగమును చేయవలయును. ‘ఆప్యాయస్వ’ అను ఋక్కుచే ‘సోమపాస్త’ అను మంత్రముచే చేయవలయును. సూర్యగ్రహణ కాలము “ఉదుత్యం జాతవేదసం”; “ఆసత్యేన” అను మంత్రములచే హోమమును చేయవలయును. ఇట్లు పండితులు స్మృతి మార్గముచే తిథిని నిశ్చయించి వ్రతాదులను ఆచరించిచో అక్షయ ఫలము లభించును. ధర్మము వేదప్రణిహితము. ధర్మముచే శ్రీహరి సంతోషించును. కావున ధర్మపరులు శ్రీ విష్ణువు యొక్క పరమపదమును చేరెదరు. ధర్మమును ఆచరించ దలచువారు సాక్షాత్తు శ్రీకృష్ణస్వరూపులు, కావున ధర్మాచారపరులను సంసారవ్యాధి తాకజాలదు. (1/29)