జాతక నిరూపణము

సనందన మహర్షి పలికెను: శిరస్సు, ఆస్యము, బాహువులు, హృదయము, క్రోడము, నఖములు, జానువులు, జంఘలు, అంమ్రియుగళము ఇవి అన్నియు కాలపురుషుని అంగములు. క్రియాదులు కూడా కాలాంగములే. మేషాది రాశులను అధిపతులను తెలియుము. మేష వృశ్చికములకు కుజుడు అధిపతి. వృషభ తులలకు శుక్రుడు అధిపతి. మిధున కన్యా రాశులకు బుధుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడధిపతి, ధనుర్మీనములకు బృహస్పతి అధిపతి. మకరకుంభ రాశులకు శని అధిపతి. హోరలో సూర్యచంద్రులు విషమ నక్షత్ర గతులైనపుడు, చంద్ర సూర్యులు సమ నక్షత్ర గతులైనపుడు ఆది పంచ నవాధీశులు ద్రేష్కాణాధిపతులని చెప్పబడినది. పంచ ఇష్ట అష్టాది పంచాంశలు కుజ శని గురు బుధ శుక్ర గతములని తెలియవలయును. ఓజో విషయమున విపర్యయము వలన, యుగ్మమున త్రింశాంశేశులుగా చెప్పబడిరి. మేషాది రాశులలో తులా కర్కాట కాదులు నవాంశలుగా తెలియవలయును. తమతమ నక్షత్రము నుండి ద్వాదశ భాగేశులు రాశి పూర్వకముగా షడ్వర్గమును తెలియవలయును. వృషభ మేషములు కర్కాటక మిధునములతో రాత్రి అనుపేరుతో పృష్ఠ కోదయములు. మిగిలిన రాశులు దినముగా పేర్కొన బడినవి. ఉభయములు తిమి, క్రూర, సౌమ్య, పుమాన్ అను పేర్లచే వ్యవహరించ బడును. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు, చరము, స్థిరము, ద్వి స్వభావములు కలవిగా ఉండును. మేషాది రాశులు తూర్పు దిక్కున ఉండును. తమతమ స్థానములలో తిరుగు చుండును. సూర్యాది గ్రహములకు మేషాదిరాశులు ఉచ్ఛరాశులు ఇట్లు చెప్పెదరు. రవికి మేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, బుధునికి కన్య, గురునికి కటకము, శుక్రునికి మీనము, శనికి తుల ఇవి ఉచ్చరాశులు. ప్రతి గ్రహమునకు తన ఉచ్ఛరాశికి సప్తమ రాశి నీచరాశిగా తెలియవలయును. అనగా రవికి తుల, చంద్రునికి వృశ్చికము, కుజునికి కటకము, బుధునికి మీనము, గురునికి మకరము, శుక్రునికి కన్య, శనికి మేషము ఇవి నీచరాశులు. ఇవి క్రమమును అనుసరించి, ప్రాక్, మధ్య, అంత్యాశలు కలవగును. వర్గోత్తమములు భావమువలన ద్వాదశ మూర్తులు కలిగియుండును. ఇట్లే రవికి సింహము, చంద్రునికి వృషభము, కుజునికి మేషము, బుధునికి కన్య గురువునకు ధనుస్సు, శుక్రునికి తుల, శనికి కుంభము ఇవి మూల త్రికోణములు అనబడును. రాశికి, మరియు రాశినుండి నాలుగవ, ఏడవ పదియవ రాశులకు కేంద్రములని పేరు. రాశికి, రాశినుండి అయిదవ, తొమ్మిదవ రాశులకును కోణములని పేరు. కేంద్ర కోణములందున్న గ్రహములు ప్రబలులుగా ఉండును. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పాటలవర్ణము, ధూమ్రవర్ణము, పాండురవర్ణము, చిత్రవర్ణము, కృష్ణ వర్ణము, పసుపుపచ్చ, పింగళ వర్ణము, బభ్రువర్ణము, స్వచ్ఛవర్ణము గ్రహములకు ప్రభాక్రియవలన ఏర్పడును. సూర్యుడు కాలస్వరూపుడు, చంద్రుడు మనస్సు, కుజుడు సత్త్వము, బుధుడు వాక్కు, గురువు జ్ఞానము, శుక్రుడు సుఖము, కామము, శని దుఃఖము స్వరూపముగా కలవారు. సూర్య చంద్రులు రాజులు, కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు. శని అనుచరుడు అని జ్యోతిర్విదుల సిద్ధాంతము. సూర్యునికి ఆయారాశి సంచారమును అనుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత్, పీత, చిత్ర, కృష్ణ వర్ణములు కలుగుచుండును. రవి, శుక్ర, కుజ, రాహు, శని, చంద్ర, బుధ, గురువులు వరుసగా అష్టదిక్కులకు అధిపతులు. క్షీణచంద్రుడు, రవి, కుజుడు, శని ఈ నాలుగు పాప గ్రహములు. పాప గ్రహములతో కలిసినపుడు బుధుడు పాపుడగును. బుధుడు, శని నపుంసకులు, శుక్రుడు, చంద్రుడు స్త్రీలు, మిగిలిన గ్రహములు పురుషులు అని తెలియవలయును. అగ్ని, భూమి, నీరు, వాయువులలో భూసుతాది గ్రహములు నివసించును. గురు, శుక్రులు బ్రాహ్మణులు. రవి, చంద్ర, గురులు సాత్వికులు. బుధ, శుక్రులు రాజసులు. కుజ, శని, రాహు, కేతువులు తామసులు. రవికి అగ్ని, చంద్రునికి జలము, కుజునకు కుమారస్వామి, బుధునకు విష్ణువు, గురునకు దేవేంద్రుడు, శుక్రునకు శచీదేవి, శనికి బ్రహ్మ, రాహు కేతువులకు శివుడు అధిదేవతలు. వస్త్రము స్థలము కొత్తది వహ్నికహతము మద్యదము, స్ఫుటితము, రవికి తామ్రము, తారము, తామ్రపుని, బంగారము, ఇనుము, ఉక్కు ఈ మూడు అంశలతో ఉండును. శశిరాదులు గుణములు. అనగా రవికి రాగి, ముదుగు బట్ట, దేహపు ఎముకలు దేవతాస్థానము పూజా సంబంధములు ఉండును. చంద్రునకు రత్నములు, క్రొత్తబట్ట, దేహరక్తము జలసమీపము స్నాన ప్రదేశములు. ఇట్లే ఇతర గ్రహములకు తెలియవలయును. శని, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, బుధుడు, గురువు ఉదయించుచుండగా క్రమముగా కేంద్రకోణ, చతుర్ధ అష్ట సప్తమ స్థానములను వృద్ధి చెందించును. శని, గురువు, కుజుడు పూర్ణులుగా ఉన్నపుడు క్రమముగా చూతురు. ఆయన, క్షణ, ఘస్ర, ఋతు, మాస, షాణ్మాసములు సూర్యునికి కటు, తిక్త, క్షార, మధుర, ఆమ్ల, కషాయ రసములు ఉండును. త్రికోణ స్థానము నుండి ధర్మాయువు మిత్రుడు. గురుడు, గురు, బుధులు, శుక్ర బుధులు, సూర్య రహితులు, కుజ రహితులు క్రమముగా చంద్ర సూర్య రహితులు, కుజ చంద్రార్కర రహితులు, ఇతరులు సూర్యునికి మిత్రులు. పరస్పరముగా ధన, వ్యయ, ఆయ త్రిబంధు వ్యాపార గతుడైనచో మిత్రుడగును. ఏకానుభుక్తములుగా తెలుసుకొని సహజులుగా తెలియ వలయును. అయాకాలములను అనుసరించి అధిసుహృత్ మిత్ర పూర్వకములను మరల కల్పించు కొనవలయును. తనకు ఉచ్చరాశులందు, త్రికోణ రాశులందు ఉండువారు నవాంశలతో స్ధానముల వలన బలము కలుగును. దిక్కులలో బుధ బృహస్పతులకు, సూర్య కుజులకు, శని విషయమున శుక్ర చంద్రులకు ఆకాశము నుండి ఋతువులలో, ఇతరులు సమాగమములో, ఉత్తరమున ఉన్నవారు దీప్తకారులు అగుదురు. ఇష్టులైనపుడు వీర్యయుతులు అగుదురు. రాత్రిపూట చంద్ర కుజ శనులు ఎల్లపుడు శుభకరులు. ఇతర గ్రహములు పగలు శుభకరులు. వీరు కృష్ణపక్షమున క్రూరులు, శుక్ల పక్షమున సౌమ్యులని కాలబలమును బుధులు చెప్పెదరు. శని కుజ బుధ గురు శుక్ర చంద్ర సూర్యులకు పరస్పరాధిక్యము గలవారు అగుదురు. ఎప్పుడు పాపులు బలయుతులు. సౌమ్యులు స్థానాధీనులుగా ఉందురు. క్లీబుల విషయమున శుక్రుని కంటే చంద్ర సూర్యాంశ సమముగా ఉండును. స్వాంశమున నున్న గ్రహములు పాపులు, పరాంశమున సౌమ్యులు వియోనిజమైనపుడు లగ్న భేదము ఏర్పడును. వియోని జన్మ దుర్బలమగును. శిరస్సు, వక్త్రము, కంఠము, పాదములు, భుజములు, పృష్ఠ భాగము, వక్ష్స్థ్సలము, పార్శ్వములు, కుక్షి, అపానము, చరణములు, మేఢ్రము, ముష్కములు (వృషణములు) పుచ్ఛములు, మొదలగు అవయవములందు మేషాది రాశులు ఉండునని తెలియవలయును. లగ్నంశము నుండి గ్రహయోగమును చూచి బలయుతముగా వర్ణములను చెప్పవలయును. దృక్సమాన ప్రమాణములను ఇష్టమున ఉన్న రేఖను గుర్తు చేసుకొనవలయును. నక్షత్రముల రాశుల త్రంశము బలాగ్రముగా ఉన్నప్పుడు చరమాంశము గ్రహాన్వితముగా ఉన్నపుడు అంశములో స్థలమున చంద్రుడు శనికి ద్వీక్ష ఉన్నపుడు యోగ భవులు ద్విజులగుదురు. విడిగా ఉన్న చంద్ర గురు సూర్యులచే వృక్షముల జన్మను చెప్పవలయును. స్థల వృక్షముల జల వృక్షముల భేదము గ్రహముల స్థితిని అనుసరించి ఇతరములకు కూడా చెప్ప వలయును. లగ్నము నుండి ఎంతమానము గల గృహమున సూర్యుడు అధిపతిగా ఉన్నపుడు అదేసంఖ్యచే స్థలజములు జలజములగు వృక్షములు ఉండును. రవి రాశ్యాధిపతిగా ఉన్నపుడు అంతస్సారముగల వృక్షములు, శని అధిపతిగా ఉన్నపుడు దుర్భగములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా ఉన్నపుడు క్షీరములుగల వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు ముళ్ళచెట్లు, గురువు అధిపతిగా ఉన్నపుడు ఫలమంతములగు వృక్షములు, బుధుడు అధిపతిగా ఉన్నచో ఫల రహితములగు వృక్షములు, శుక్రుడు అధిపతిగా ఉన్నపుడు పుష్పితములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా ఉన్నపుడు దట్టమగు వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు కటురసముగల వృక్షములు, అశుభ నక్షత్రములో శుభగ్రహము శుభకరుడగును. కుభూమిలో పుట్టిన వృక్షము కూడా శుభకరమగును.

అట్లే అశుభ గ్రహమున్నపుడు ఉత్తమ భూమికూడా ఉత్తమ వృక్షమునకు జన్మనీయ జాలదు. స్త్రీలకు ప్రతిమాసమున జరుగు ఋతు ధర్మము కూడా కుజ చంద్ర గ్రహముల ప్రభావమువలననే జరుగును. చంద్రుడు స్త్రీరాశికి ఇష్టరాశిలో ఉండనపుడు, బృహస్పతిచే చూడబడినపుడు స్త్రీకి పురుషునిచే సంయోగము లభించును. సప్తమ భావమున పాపగ్రహ యోగము ఉన్నపుడు రోషపూర్వక పతి పత్నీసంయోగము, సప్తమభావమున శుభగ్రహమ యోగమునపుడు ప్రీతిపూర్వక సంయోగము ఏర్పడును. సంయోగకాలమున శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు నవమాంశలో ఉండి, బృహస్పతి కేంద్రమున కాని, త్రికోణ స్థానమున కాని ఉన్నచో పురుషునికి, చంద్రునినుండి సప్తమ స్థానమున ఉన్నచో స్త్రీకి రోగము సంభవించును. ఇట్లే గ్రహములు సూర్యునినుండి పన్నెండవ స్థానమున, రెండవ స్థానమునకాని ఉన్నచో పురుషునికి, చంద్రుని కలిసియున్నచో స్త్రీకి మృత్యువు సంభ వించును. పగలు గర్భాధానమైనచో శుక్రుడు సూర్యుడు మాతా పితృ గ్రహములగును.

రాత్రిపూట గర్భాధానమైనచో చంద్రుడు శని మాతృ పితృ గ్రహములగును. పితృ గ్రహము విషమరాశిలో ఉండుట తండ్రికి శుభము. మాతృగ్రహము సమరాశిలో ఉండుట తల్లికి శుభము. పన్నెండవ స్థానమున పాప గ్రహములు ఉన్నపుడు, శుభగ్రహములకు బదులు పాప గ్రహములచే చూడబడుచున్నపుడు, లేదా లగ్నమున శని యుండి క్షీణ చంద్రునిచే కుజునిచే చూడబడుచున్నపుడు గర్భాధానము జరిగినచో స్త్రీకి మృత్యువు సంభవించును. లగ్నము నుండి కాని, చంద్రుని నుండి కాని చతుర్ధ స్థానమున పాపగ్రహములు ఉండిన, కుజుడు అష్టమ భావమున ఉన్నచో, లేదా లగ్నము నుండి నాలుగవ స్థానమున కాని, పన్నెండవ స్థానమున కాని కుజుడు శని యున్నచో గర్భముతో స్త్రీకి కాని, కేవలము స్త్రీకి కాని మృత్యువు సంభవించవచ్చును. లగ్నమున కుజుడు సప్తమమున సూర్యుడు ఉన్నచో గర్భవతికి శస్త్రమువలన మరణము సంభవించును. గర్భాదాన సమయమున అయా మాసాధిపతి అస్తగతుడైనచో అస్తగతుడగు అధిపతిగల మాసమున గర్భపాతము సంభవించవచ్చును. గర్భాధాన సమయమున లగ్నమున చంద్రునితో శుభస్థానములలో శుభగ్రహ ములు, అశుభస్థానమున పాపగ్రహములు ఉన్నపుడు గర్భము సురక్షితముగా నుండును. సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు, లగ్నము ఈ నాలుగు విషమ రాశులైనపుడు, నవమాంశలైనపుడు, లేదా సూర్యుడు బృహస్పతి విషమరాశి గతులైనపుడు పుత్రుడు కలుగునని చెప్పవచ్చును. ఇట్లే ఈ గ్రహములే సమరాశిలో నవమాంశలలో ఉన్నపుడు, లేదా కుజుడు, చంద్రుడు, శుక్రుడు సమరాశిలో నున్నచో స్త్రీ శిశువు కలుగునని చెప్పవచ్చును. ఈ గ్రహములే ద్విస్వభావ రాశులలో ఉన్నపుడు, ఈ గ్రహముల మీద బుధుని దృష్టి ఉన్నపుడు కవల పిల్లలు కలుగుదురు. లగ్నము నుండి విషమ స్థానమున ఉన్న శని ప్రభావము వలన పుత్రుడు కలుగును. విషమ సమములగు రాశులలో ఉన్న సూర్యచంద్రులు లేదా శని బుధులు ఒకరినొకరు చూచుకున్నపుడు, లేదా సమరాశిలో ఉన్న సూర్యుని విషమ రాశిలోనున్న కుజుడు చూచినపుడు, చంద్రుడు సమరాశిలో కాని లగ్న విషమరాశిలో కాని ఉన్నపుడు, మరియు అట్టి చంద్రుని మీద కుజుని దృష్టి ఉన్నపుడు, లేదా లగ్నము, చంద్రుడు శుక్రుడు మూడు పురుషరాశి నవమాంశలో ఉన్నపుడు గర్భధానమైనచో నపుంసకుడు పుట్టును. శుక్ర చంద్రులు సమరాశిలో ఉండి, బుధుడు, కుజుడు, లగ్నము, బృహస్పతి విషమరాశులలో ఉంటూ పురుష గ్రహముచే చూడబడు నపుడు గర్భాదానము జరిగినచో, కవల పిల్లలు పుట్టెదరు. లేదా లగ్నము చంద్రుడు సమరాశిలో ఉండుట, లేదా బుధుడు, కుజుడు, లగ్నము గురు సమరాశి అయిననూ కవల పిల్లలు పుట్టెదరు. బుధుడు నవమాంశలో ఉండి, ద్విస్వభావరాశులగు గృహమును, లగ్నమును చూచినచో ఒకేసారి ముగ్గురు సంతానము కలుగు అవకాశమున్నది. ఆ ముగ్గురిలో ఒకడు లగ్నసదృశుడు, ఇద్దరు బుధ సదృశులగుదురు. ధనురాశి అంతిమాంశము లగ్నమైనచో, ఆ యంశలో బలవంతుడగు గ్రహమున్నచో, బలవంతుడగు బుధునిచే కాని శనిచే కాని చూడ బడినపుడు ముగ్గురి కంటే ఎక్కువమంది సంతానము కూడా ఒకేసారి కలుగవచ్చును. గర్భాధాన సమయదశ, మాసముల దశలకు అధిపతులను జ్యోతిషశాస్త్రమున చూపిరి. వారు క్రమముగా శుక్రడు, కుజుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శని, బుధుడు. ఆధీన లగ్నేశులు సూర్యుడు చంద్రుడు. ఏ నెలలో ఎట్లు సబలనిర్బల గృహములుండునో ఆయా నెలలో అట్లే శుభాశుభ ప్రభా వము గర్భము పైన, గర్భవతిపైన ఉండునని చెప్పవలయును. బుధుడు త్రికోణ స్థానముననుండి ఇతర గ్రహములు నిర్భలులైనచో శిశువునకు రెండు ముఖములు, నాలుగు చేతులు, నాలుగు కాళ్ళు మొదలగు ఆకారములు లభించును. చంద్రుడు వృషభరాశిలో ఉండి ఇతర గ్రహములు నిర్బలులైనచో బాలకుడు వికారాకారము గలవాడగును. గ్రహములపై శుభగ్రహదృష్టి ఉన్నచో బాలకుడు చాలాదినములకు మాట్లాడగలుగును. కుజుడు శని బుధుని రాశి నవమాంశలో ఉన్నచో శిశువు పండ్లతో పుట్టును. చంద్రుడు కర్కటకరాశిలో ఉండి లగ్నగతులై శని కుజుల దృష్టి కూడా చంద్రునిపై ఉన్నపుడు శిశు గర్భములోనే కుబ్జుడగును (మూడు వంకరలుగలవాడు) లగ్నము మీనరాశి అయి శని చంద్రుడు కుజుల దృష్టి ఉన్నచో బాలకుడు కాళ్ళు లేనివాడుగా (కుంటివాడుగా) పుట్టును. పాపగ్రహములు, చంద్రుడు రాశిసంధిలో ఉండి, శుభగ్రహ దృష్టి లేనిచో బాలకుడు జడుడు (బుద్ధిహీనుడు) అగును. లగ్నము మకరరాశి అంశములో ఉండి శని చంద్ర సూర్యుల దృష్టి ఉన్నచో శిశువు పొట్టివాడగును. పంచమ నవము లగ్నముల ద్రేష్మాణమున అశుభ గ్రహము లున్నచో కాళ్ళులేనివాడుగా, చేతులు లేనివాడుగా పుట్టును. సూర్య చంద్రులు సింహ లగ్నమున ఉండి శని కుజుల దృష్టి కలిగియున్నచో గుడ్డివాడుగా పుట్టును.

శుభాశుభ గ్రహముల దృష్టి ఉన్నచో నేత్రములలో బిందువులు ఏర్పడును. లగ్నము నకు ద్వాదశభావమున చంద్రుడు ఉన్నచో ఎడమకన్ను, సూర్యుడున్నచో కుడి కన్ను నశించును. ఇట్లు పైన చెప్పబడిన గ్రహ ప్రభావముల వలన కలుగు అశుభ ఫలములు ఆ గ్రహములపై శుభగ్రహముల దృష్టి కలిగినచో ప్రభావము తగ్గును. గర్భాధానము లగ్నము యొక్క నవమాంశమై ఆ గ్రహము సప్తమ భావమున ఉన్నచో శిశువు మూడు సంవత్సరముల తరువాత పుట్టును. శనికాక చంద్రుడు ఈ స్థితిలో ఉన్నచో పన్నెండు సంవత్సరముల తరువాత శిశువు పుట్టును. గర్భాధాన సమయమున చంద్రుడు ఉన్న ద్వాదశాంశ సంఖ్యలో ముందున్న రాశిలోనికి చంద్రుడు వెళ్ళినపుడు శిశువు పుట్టును. ద్వాదశాంశ యుక్తములగు అంశలను రెండుచే హెచ్చింది అయిదుచే భాగించినచో రాశి మానము తెలియును. చంద్రుడు జన్మలగ్నమును చూడనిచో శిశువు తండ్రి పరోక్షమున పుట్టును. సూర్యుడు చరరాశిలో మధ్యభావము నుండి వెనుకకో ముందుకో అయినచో తండ్రి దేశాంతరమున ఉన్నపుడు శిశువు పుట్టును. లగ్నమున శని సప్తమ భావమున కుజుడు ఉన్నచో, లేదా బుధ శుక్రుల మధ్యన చంద్రుడున్నచో తండ్రి లేనపుడు శిశువు కలుగును. పాపరాశియుక్త లగ్నమున చంద్రుడున్నపుడు, లేదా వృశ్చికరాశి ద్రేష్కాణమున నున్నపుడు సర్పము పుట్టును. సూర్యుడు చతుష్పద రాశిలో ఉండి, ఇతర గ్రహములు బలము కలిగియున్నపుడు ఒకే మావిలో కవలలు పుట్టెదరు. శని కుజులు సింహరాశి గతులైనపుడు, బుధుడు మేషరాశి నవమాంశలో ఉన్నపుడు, భాంశముతో సమానముగా కన్యాలగ్నము కూడియున్నచో గురువు లగ్నమును చంద్రుని, సూర్యునితో కలిసియున్న చంద్రుని చూడనిచో, సూర్యుడు పాపగ్రహములతో కలసియున్నపుడు భర్తవీర్యముచే కాక ఇతర పురుష వీర్యముతో శిశువును ప్రసవించును. పాప గ్రహములు పాప రాశులలో ఉండి సూర్యుడు కుజుడు త్రికోణ స్థానములలో లేనిచో శిశువు తండ్రి విదేశములకు వెళ్ళియుండును. లేదా వృద్ధుడుగా ఉండును. రాశి అంత్యాంశమున గ్రహమున్నను, పూర్ణచంద్రుడు ఉన్నపుడు బుధుడు స్వరాశి నవమాంశలో ఉన్నపుడు, కుజుడు శుభగ్రహ వీక్షణము కలిగియుండి లగ్నమున చంద్రుడున్నపుడు, చంద్రుడు రెండోస్థానమున ఉన్నపుడు స్త్రీ శిశువు కలుగును. ప్రసవించును. పూర్ణచంద్రుని బృహస్పతి చూచునపుడు, స్వగృహము లగ్నమై అందులో చంద్రుడున్నపుడు నీటిలో స్త్రీ ప్రసవించును. పూర్ణచంద్రుని బృహస్పతి చూచునపుడు, స్వగృహము లగ్నమై అందులో చంద్రుడున్నపుడు నీటిలో స్త్రీ ప్రసవించును. అనగా నీటిలోనే శిశువు పుట్టునని భావము. శని పాపగ్రహములచే చూడబడునపుడు, మేషరాశి పన్నెండవ రాశిగా ఉన్నపుడు, శని కర్కాటక లగ్నమున నున్నపుడు చంద్రుని దృష్టి ఉన్నపుడు గోతిలో శిశువు పుట్టును. స్త్రీ ప్రసవము గోతిలో అగునని భావము. శని జన్మలగ్నములో ఉండి బుధ సూర్యచంద్రులచే చూడబడినచో, క్రీడాస్థానమున, దేవాలయమున, మరుభూమిలో వరుసను అనుసరించి శిశువు పుట్టును. అనగా జన్మలగ్నముననుండి శనిని బుధుడు చూచిన క్రీడా స్థానమున, సూర్యుడు చూచిన దేవాలయమున, చంద్రుడు చూచిన మరుభూమిలో పుట్టునని భావము. కుజుడు లగ్నమును చూచినచో శ్మశానమున శిశువు పుట్టును. చంద్ర శుక్రులు కలసి ఉన్నచో గ్రామ్య స్థానమున పుట్టును. బృహస్పతి సూర్యులు కలసి ఉన్నచో అగ్నిహోత్ర గృహమున పుట్టును. బుధుడు లగ్నమున నున్నచో బలవంతుడై శిల్పాల యమున శిశుజన్మను కలిగించును. స్థిరమగు గ్రహములు తమ తమ రాశి నవమాంశములలో ఉన్నపుడు గృహమున శిశువు పుట్టును. కుజుడు శని త్రికోణ స్థానములందు ఉన్నపుడు, లేదా అస్తంగతులైనపుడు కూడా గృహమున శిశువు పుట్టును. శిశువునకు గురుదృష్టి యున్నచో దీర్ఘాయుష్మంతుడు, ఉత్తముడు అగును. చంద్రుని పాప గ్రహములు చూచునపుడు, లగ్నమున కుజుడు అస్తమించినచో శిశువు త్వరలో మృతిచెందును. శిశువు పుట్టినపుడు కుజశనులచే చూడ బడినచో తల్లి దండ్రులవద్ద కాక ఇతరులవద్దనుండి సుఖవంతుడగును. పాపగ్రహ వీక్షణమున్నచో కొన్ని నెలలలో మృతి చెందును. ఆయా లగ్నాధిపతుల ప్రభావము వలన పితృ గృహమున, లేదా మాతృ గృహమున స్త్రీ ప్రసవించును. శుభగ్రహము నీచ స్థానమున ఉన్నపుడు, లగ్నమున ఉన్న చంద్రుడు ఒక్కో స్థానమును చూడనపుడు, వృక్షము క్రింద శిశువు కలుగును. ఇట్లు లక్షణములు ఉన్నచో ఏకాంతమున ప్రసవించును. శని రాశి నవమ అంశములో ఉన్నపుడు, చంద్రుడు నాలుగో స్థానమున ఉండి, చంద్రుడు శనిచే చూడబడినపుడు, కొద్దివెలుగున్న చీకటిలో, నీచ భూస్థానమున శిశువు పుట్టును. శీర్షిదయము, పృష్టోదయముగల పుట్టుకను కూడా గ్రహముల ప్రభావము వలననే చెప్పవలయును.

చంద్రుడు అస్తగతుడై పాపులతో కూడియున్నచో తల్లికి పీడను కలిగించును. శనితో కలిసి ఉన్నచో జీర్ణమైన గృహము ఉద్ధరించబడును. సూర్యునిచే కలిసి ఉన్నచో కాష్టములతో సుందర గృహము ఉండును. బుధుడు ఉన్నచో గృహము బహు శిల్పయుతమగును. శుక్రుడున్నచో చిత్ర యుక్తముగా నూతన గృహముండును. గురువు విషయమున దృఢము రమ్యముగా గృహముండును. బుధుడు కుంభ మేష కర్కాటక రాశులలో ఉన్నచో గురువు గృహమున కలిసియున్నచో ఉత్తర దిక్కును చూచుచున్నపుడు, వృషభము నుండి మృగ శిరమున నుండి, సింహమును చూచినపుడు దక్షిణ దిక్కున నివాసము ఉండును. గృహమున ప్రాచ్యాది దిక్కులలో రెండు రెండు గ్రహముల మేలనముండి, ద్విస్వభావ రాశులలో, కోణస్థాన రాశులలో ఉన్నచో ఫలితము మారియుండును. పర్యంకమున వాస్తువువలె పాదములుండును. త్రిషదంకాంత్య రాశులున్నపుడు, చంద్రుని, అంగారకుని మధ్యలో గ్రహములచే కలిసి ఉన్నపుడు సూచికములు చెప్పబడినవి. చక్రము నుండి బహిర్భాగమున అంతర్భాగమున దృశ్యాదృశ్యముగా ఉండును. మరియొక విధముగా అయినచో ఇతరులు ఉండును. లగ్నాశయ సమానాంగము బాలిఖీటము సమముగా నున్నను చంద్ర నవాంశము వలె వర్ణము కలిగి శిరస్సు మొదలగు అవయవ విభాగములచే కూడియుండును. శిరస్సు, నాసిక, కపోలములు, దవడలు, ముఖము, కంఠము, భుజములు, పార్శ్వములు, హృదయము, బాహువులు, క్రోడము, నాభి, బాస్తికము, శిశ్నము, వృషణములు, పిరుదులు, మోకాళ్లు, పిక్కలు, పాదములు, రెండుచోట్ల కలిపి చెప్పవలయును. ఆయా అవయవముల అధిపతి పాప గ్రహములచే కలిసి ఉన్నచో ఆయా అవయవములకు వ్రణములు కలుగును. లేదా మచ్చలు ఏర్పడును. తమతమ రాశ్యంశమున స్థిరయుక్తమైనచో నైజమగును. లేనిచో ఆగంతకుడగును. శని ఉన్నచో వాయు పాషాణముల వలన భయము కలుగును. కుజుడున్నచో విషశస్త్రాగ్నుల వలన భయము కలుగును. సూర్యుడు కోణస్థానము నందు ఉన్నచో కాష్ఠముల వలన పశువుల వలన భయము కలుగును. మేషరాశిలో పుట్టినవారికి శృంగములు కలవాటి వలన భయము కలుగును. ఏ రాశిలో మూడు గ్రహములు ఉండును అతనికి పృష్ఠమున వ్రణము నిశ్చతము. రాశినాశ్రయించి ఉన్నచో శరీరమున వ్రణము కలుగును. సౌమ్యగ్రహములచే కూడియున్నచో మచ్చలు కలవాడగును. చతురస్రాకారముగా పింగళ వర్ణములు కల నేత్రములు కలవాడు పిత్త స్వభావము కలవాడు కొద్ది జుట్టు కలవాడుగా సూర్యుడుండును. చంద్రుడు వృత్తాకారము కలవాడు వాత కఫ ప్రకృతి కలవాడు, ప్రాజ్ఞుడు, చిన్నగా మాట్లాడగలవాడు, శుభకరమైన నేత్రములు గలవాడు. కుజుడు క్రూరదృష్టి కలవాడు, యువకుడు, పిత్త ప్రకృతి కలవాడు, చపల స్వభావము కలవాడు. బుధుడు మూడు విధముల స్వభావము కలవాడు, హాస్యరుచి కలవాడు, క్లిష్ట వాక్కు గలవాడు. గురువు పింగళ కేశములు కలవాడు, శక స్వభావము కలవాడు, పొడగరి, కఫస్వభావము కలవాడు బుద్ధిమంతుడు. శుక్రాచార్యులు చక్కని శరీరము కలవాడు, చక్కని నేత్రములు కలవాడు, నల్లని ఉంగరాల జుట్టు కలవాడు సుఖము కలవాడు. శని పొడగరి, కపిల నేత్రములు కలవాడు, తక్కువ పొడుగు కఠినమైన జుట్టుకలవాడు, సోమరి, స్నాయువు, అస్తి, రక్తము, చర్మము, శుక్రము, వస, మజ్జ అను ఏడు ధాతువులు శరీరమున ఉండును. ఈ ఏడు ధాతువులకు వరుసగా శని, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు అధిపతులు. రాశి అంత్యాంశలో చంద్రాంగ పాపులు ఉన్నపుడు, చంద్రునితో కలిసి నాలుగు పాపగ్రహములు ఉన్నపుడు, చక్రములోని పూర్వాపరములు ఇందు పాపులు, సౌమ్యులు కలిసియున్నపుడు, లగ్నమున కీటమున్నపుడు మృతి తథ్యము. పాపగ్రహములు ఉదయీస్తగతులై క్రూరగ్రహములచే కలిసియున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడనిచో ఆ సమయమున పుట్టిన శిశువు నిశ్చయముగా వెంటనే మరణించును. క్షీణచంద్రుడు పన్నెండవ స్థానమున నుండి పాప గ్రహములు లగ్నమునకు అష్టమ స్థానముననుండి, శుభగ్రహ ములు లేనిచో, కేంద్రస్థానములందు గ్రహములతో కలిసి చంద్రుడు ఉన్నచో మృత్యువు లగ్నమని తెలియుము. కేంద్రాది స్థానములందు గ్రహముల వీక్షణము లేనపుడు మృత్యువు కలుగును. షష్ఠ స్థానమున చంద్రుడు పాప గ్రహములచే చూడబడక శుభ గ్రహములచే చూడబడునపుడు వెంటనే మృత్యువు కలుగును. సమాష్టకమున మిశ్రగ్రహములచే చూడబడినపుడు శిశువు మరణించును. క్షీణ చంద్రుడు అంశమున ఉన్నపుడు, రంధ్రకేంద్ర స్థానములలో పాపులు ఉన్ననూ, పాపుల మధ్యలో ఉన్ననూ భూద్యూన నిదన స్థానములలో చంద్రుడు ఉన్నపుడు, లగ్నమున ఉన్నపుడుకూడా శిశువు మృతి చెందును. చంద్రుడు అస్తగతుడైనపుడు పాప గ్రహములచే చూడబడినపుడు, శుభ గ్రహములచే చూడబడనపుడు, రాశి అంత్యాంశమున చంద్రుడున్నపుడు త్రికోణ స్థానమున దుష్ట గ్రహములు లేనిచో, లగ్నమున చంద్రుడున్నపుడు కూడా, పాపగ్రహములు అస్తమొందినపుడు శిశువు మృతి చెందును. చంద్రుడు గ్రసించబడినపుడు, అష్టమ స్థానమున దుష్టగ్రహములు ఉన్నచో, తండ్రి కొడుకుల మృతి సంభవించును. లగ్నమున సూర్యుడుండి, బలవంతులగు దుష్ట గ్రహములు అష్టమ స్థానమున ఉన్నచో శస్త్రముచే మృతి సంభవించును. కర్కాటక రాశిలో బృహస్పతితో చంద్రుడు కలిసున్నచో, లగ్నమున కేంద్రమున బుధుడు శుక్రుడు ఉన్నప్పుడు, మిగిలిన గ్రహములు మూడవ స్థానమున, శత్రు స్థానమున ఉన్నచో దీర్ఘాయువు లభించును. వర్గోత్తమము మీన లగ్నమైనచో, చంద్రుడు వృషభరాశిలో ఉన్నపుడు అన్ని గ్రహములు ఉచ్ఛస్థానములలో ఉండగా దీర్ఘాయువు నిశ్చయము. బలవంతుడగు గ్రహము శుభ గ్రహములచే చూడబడినపుడు, కేంద్రమున ఉండగా ఆయువును అర్ధమును ఇచ్చును. చంద్రుడు స్వోచ్చస్థానమున ఉండి శుభరాశులలో సౌమ్య గ్రహములు బలవంతులై, బలవద్దహము లగ్నముననుండగా, కేంద్ర స్థానమున సౌమ్యులు ఉండగా అరవై సంవత్సరములు ఆయుష్యముండును. అష్టమ శుద్ధి కలిగి గురువు అనుకూలముగా ఉండగా దెబ్బది సంవత్సరముల ఆయుష్యము మూల త్రికోణ స్థానములలో సౌమ్య గ్రహములుండి గురువు స్వోచ్చరాశిలో ఉండగా లగ్నాధిపుడు బలయుతుడైనచో ఎనుబది వత్సరములు ఆయువు నిశ్చితము. కేంద్రమున బలయుతులైన గ్రహములుండి, కేంద్రమున శుభగ్రహము లుండి అష్టమ శుద్ధియుండి, లయేశుడు ధర్మస్థానమున నుండి, బృహస్పతి అష్టమ స్థానమున ఉన్నచో, క్రూర గ్రహదృష్టి పడినచో జితులగుదురు. లగ్నాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానమున నున్నపుడు ఆయుః కారకులగుదురు. లగ్నమున అశుభ గ్రహము గురువు ఉన్నపుడు చంద్రుని దృష్టి ఉన్నపుడు మృత్యువునకు ఒక అవకాశము ఏర్పడును. శని ధర్మాంగస్ధుడైనపుడు, శుక్రుడు కేంద్రమునుండి చంద్రుడు పన్నెండవ స్థానమున నున్నచో నూరు సంవత్సరము ఆయుష్యము ఉండును. బృహస్పతి కర్కటకరాశిలో ఉన్నపుడు, కర్కటకమున శుక్ర బృహస్పతులున్నపుడు లయేశుడు అంగమున ఉన్నపుడు, అష్టమమున శుభగ్రహములు లేనిచో దీర్ఘాయువు నిశ్చితము. లగ్నాధిపతి అష్టమ స్థానమున, అష్టమాధిపతి లగ్నమున నున్నచో అయిదు సంవత్సరములు ఆయుష్యము. శుక్ర బృహస్పతి యోగమున, బుధ చంద్రులు లగ్నమున ఉన్నచో మృత్యువు నిశ్చితము. ఇది గ్రహయోగము వలన తెలియు ఆయుష్యము. ఇపుడు స్పష్టముగా చెప్పెదను వినుము. సూర్యాధిక బలమున్నచో పిండము ఆరోగ్యబలములు కలిగి ఉండును. చంద్రబలమున్నచో సహజముగా ఉండును. లగ్నము బలయుతమైనచో అంశాయువు నిశ్చితము. ఆ అంసాయువును తెలియు విధానమును చెప్పెదను వినుము. గోబ్జములు తత్త్వతిధులు, సూర్యుడు, తిధి స్వర్గములు నఖములు క్రమముగా చేర్చబడ వలయును. నఖములు, విధువు, రెండంకములు, ధృతి స్వాక్షి మార్గణములు చూడబడవలయును. పిండము నిసర్గముగా ఉన్నపుడు స్వోచ్చస్థానమున ఏ గ్రహము లేనపుడు ఆరవ స్థానమున క్షీణబలయుతుడగు గ్రహమున్నపుడు చక్రశుద్ధిని స్వీకరించవలయును. చక్రశుద్ధి అంశములే ఆయుష్యమును తెలుపు ప్రమాణములు. అంశోనములు శత్రురాశిలో చేర్చబడి, వక్రగతిలేని గ్రహమును చూడవలయును. శని శుక్రులు అర్ధానులు కాక అస్తంగత గ్రహమునకు హాని ద్వయ మున్నచో అధికాంశలను కూర్చవలయును. లగ్నమున క్రూర గ్రహములున్నపుడు శత్రువు లను వదిలి, అంశాదులతో కొట్టివేసి ఆయువు భాగములను చూడవలయును. భగణాంశములతో హీనలబ్దిని చూచి వాటిని విచక్షణతో పరిశీలించవలయును. పాపగ్రహాంశలను సమగ్రముగా తక్కువగా చేసి బుధగ్రహాంశలను సగము వదిలి ఆ అంశలను స్పష్టములుగా 1, 6, 3 సంఖ్యలచే భాగించి, తమ గణములతో గుణించి శేషమును సంవత్సరములుగా, పన్నెండుతో కొట్టివేయగా వచ్చినవి నెలలుగా తెలియవలయును. అట్లు చేయగా మిగిలిన దానిని మూడురెట్లు చేసినపుడు వచ్చిన దానిని దినములుగా తెలియవలయును. శేషమును అరవైచే భాగించగా వచ్చినవి ఘటికాదులుగా తెలియవలయును. భాజ్యాంగ భాగములను విడిచి 1,1,2తో గుణించగా వచ్చిన వివర్షములని, మిగిలిన దానిని ద్వాదశాదులచే గుణించగా ద్విసప్తాంశ మాసాదులుగా లగ్నాయువు స్ఫుటముగా తెలియును. లగ్నముల అంశలు ఆయుష్యము లగ్నాంశములచే గ్రహాంశలచే తెలియ వలయును. ఖ యుగములచే ఆయురంశలు తెలియును. ఇపుడు నీకు ఆ సంస్కారమును గూర్చి తెలిపెదను.

గ్రహాన లగ్నము షడ్రాంత్యమైననే సంస్కారము చేయవలయును. అట్లు కానిచో చేయరాదు. ఆ అంశము నాలుగుచే భాగించగా వచ్చిన తక్కువ భాగము గుణమగును. ఎక్కువగా ఉన్నవి అంశములు తక్కువగా ఉన్నవి భూగుణమని తెలియవలయును. సౌమ్య గ్రహమునకు అర్ధభాగముచే, పాపగ్రహమునకు సమగ్ర భాగముచే చేయవలయునని సిద్ధాంతము. ఆరింటిని గుణభాగముచే కొట్టివేయబడినవి అయురంశములు. దీనినే సంస్కారమందురు. ఆయురంశ కలభక్తమునుండి పన్నెండుచే కొట్టివేసి ఇరువదిచే భాగించబడినవి సంవత్సరములు. మిగిలినదానిని ద్విశతముచే భాగించగా నెలలు, మిగిలినవి దినాదికములని తెలియవలయును. లగ్నంశములను, ఆయురంశ ములను మూడుచే గుణించి 8చే భాగించినపుడు సంవత్సరములగును. మిగిలిన దానిని పన్నెండుచే గుణించి రిచే భాగించగా మాసాదికములగును. బలవంతుడగు గ్రహమున్న రాశిలో సమానమగు సంవత్సరములు ఆయుష్యమని స్పష్టముగా తెలియును. అంశద్విఘ్నము, అక్షాంశము 1, 3 మొదలగు వాటిచే గుణించగా మాసములు తెలియును. మిగిలినవి దినాదికములుగా తెలియవలయును. ఈ గణితము పిండ నిసర్గములకు చేయరాదు. లగ్నార్క చంద్రుల మధ్యలో ఏ గ్రహము బలీయమో ముందు ఆ దశ ప్రారంభమగును. తరువాత కేంద్రాది స్థానములలో ఉన్న గ్రహముల దశలు రెండు మూడు మొదలగు వాటియందు బలీయుని దశవచ్చును. ఈ దశలలోకూడా కేంద్రాది స్థానములలో ద్వితీయ, తృతీయ స్థానములలో బలీయునితో క్రమము ప్రారంభమగును. బలీయులై సూర్యాదులతో కూడియున్న గ్రహములదశ ప్రారంభమైనపుడు దీర్ఘాయుష్మంతుడగును. విపరీతి “మైనచో యాచకుడగును. షడ్వర్గార్థము, త్రింశాంశ, త్రికోణ స్థానములలో ఉన్న గ్రహదశ యేర్పడినచో స్మరగుడగును. సప్తమాసములలో చతురస్రగతుడైనచో ఇచట కూడా కేంద్రాది స్థానములలో ద్రిత్ర్యాదులలో సబలగ్రహములు క్రమమే ప్రారంభమగును. పాకాధిపుడైనచో నాలుగు ఎనిమిది స్థానములు, సహగుడైనచే నాలుగు స్థానములు. త్రికోణ స్థానమున నున్న వానికి 8, 3, 12 సంఖ్యలు ఈయవలయును. నాలుగు ఎనిమిది స్థానములలో ఉన్నవానికి స్వరగ్గుణితము చెప్పబడినది. దశాగుణములో హతములై భాగముచే గుణైక్యముచే వచ్చినవి అగును. మిగిలిన భాగము అర్కాదిహతమైనచో మాసాద్యైక్యముచే భాగము చేయవలయును. అంతర్దశలలో విదశలు, విదశలలో ఉపదశలుండును. దశలో అంశమిత్ర స్వోచ్చరాశులలో ఉన్న చంద్రుడు నాలుగు ఒకటి మొదలగు వాటిచే వృద్ధినందినచో శుభస్థానమున ఉన్నచో శుభకరుడగును. ఏ రాశిలో ఉన్నపుడు అయా స్థానములకు అనుగుణముగా ఫలితములను ఇచ్చును. చెప్పిన స్థానముల కంటే భిన్న స్థానములలో ఉన్నచో ఆయా భావములను క్షీణింపచేయును.

గ్రహమునకు యే ద్రవ్యముండునో అది భావాంశలో క్షణయోగము వలన కలుగును. జీవన ఫలమంతయు దశలో కూర్చవలయును. విదశాది దశలలో శత్రు గ్రహముచే చూడబడు గ్రహము అపదలను కలిగించును. శుభగ్రహములచే మిత్రగములచేచూడ బడినచో, సద్వర్గలో ఉన్నగ్రహము ఇష్టుడగును. ఆ దశాకాలములో ఆ గ్రహము బలయుతు డైనచో ఆపదలను నశింపచేయును. అతనికి అష్టవర్గజ ఫలము పూర్తిగా శుభమే అగును. లగ్నమున మూర్తి స్థానమున నున్న చంద్రుడు వృద్ధిచెందిన వాడై స్వోచ్చరాశిలో నున్నచో, తనను త్రికోణ స్థానమున మిత్ర గ్రహములున్నచో మధ్యమ ఫలము కలుగును. విపరీతగతు డైనచో శ్రేష్ఠము శుభతరమగు ఫలమును చెప్పవలయును. ఉత్కాటానిష్టమును, స్వల్పముగా తెలిసి బలమును చెప్పవలయును. చరరాశిలో ఉంటూ మధ్యలో దుష్టగ్రహములచే విపర్యము వలన అంగ భంగము జరిగినచో, స్థిరరాశిలో ఇష్టమగు అష్టమ మధ్యలో నున్ననూ హోరాత్రంశములతో ఫలమును చెప్పవలయును. రాశ్యధిపతి బృహస్పతి బుధులచే కలిసి ఉన్నచో, లేదా చూడబడినచో సత్ఫలము నొసంగును. చూడబడిననూ కలిసి ఉన్ననూ పాపగ్రహముల మధ్యన ఉన్నచో వినాశము తప్పదు. ప్రాగ్జోంక్షముగా నున్నచో బంధు మృత్యువు సంభవించును. సూర్యుడు ఇద్దరికంటే తక్కువగా ఉన్ననూ, శుక్రాదులు షడ్రుతు లైనపుడు నాలుగు ఆరు పదకొండు స్థానములలో బృహస్పతి మొదలగు గ్రహములున్నూ, చంద్రునికి మూడింట ఆరింట ఉన్ననూ చెడు ఫలము కలుగునని తెలియవలయును. వృద్ధి స్థానమగు రాశిలోకాని, పదకొండింట, అయిదింట చంద్రుడు తన రాశిలో ఉన్నచో శుభకరుడగును. ఆరు, మూడు, పద కొండు, అయిదు స్థానములలో నుండి శనికి బుధునికి రెండు మూడు పదకొండు కేంద్ర స్థానములలో ఉన్ననూ కేంద్రము అష్టమ ఏకాదశ స్థానములలో ఉన్న బృహస్పతి కంటెను బుధుడు స్వస్థానమున ఉన్న శుక్రుని కంటే బలీయుడగును. వృద్ధిలో ఉన్న సూర్యుని కంటే మొదటి అయిదవ స్థానములలో ఉన్న పదకొండు అరు స్థానములలో ఉన్న చంద్రుని కంటే, కేంద్ర స్థానములలో అష్టమ స్థానములో శుభ రాశిలోనున్న శని కంటే గోష్ఠా ఆయకేంద్ర స్థానములలో నున్న గ్రహము బలీయము. అరు మూడు అయిదు స్థానములలో నున్న బుధుని కంటే ఆరు, అంశ, అష్టమ స్థానములలో ఉన్న శుక్రుని కంటే, నాలుగు పదకొండు పన్నెండు స్థానములలో ఉన్న కుజుడు గురువు కంటే బలీయుడు. ఆరు పదకొండు స్థానములలో నున్న శుక్రుని కంటే, అయిదు మూడు స్థానములలో ఉన్న శని కంటే బుధుడు బలీయుడు. అస్తగతుడైన కుజుని, కంటే బృహస్పతి కంటే పన్నెండు ఆరు స్థానములలో ఉన్న గ్రహము మృత్యుప్రదుడు. నాలుగు పదకొండు ఆరు స్థానములలో ఉన్న అంత్యములో ఉన్న సూర్యుని కంటే ప్రథమ, తృతీయ స్థానములలో ఉన్న అరు, ఒకటి, పదకొండు, ఎనిమిది, నాలుగు స్థానములలో ఉన్న బృహస్పతి కంటే భిన్న లగ్నములలో ఉన్న గ్రహములు బలీయములు, కోణ స్థానములలో అష్టమ స్థానములలో ప్రథమ స్థానమున ఉన్న కుజుని కంటే మూడవ స్థానమున ఉన్న గురువు బలీయుడు. మూడవ స్థానమున ఉన్న సూర్యుని కంటే, శుక్రునికంటే, మూడవ మొదటి స్థానమున 8, 9, 6 స్థానములలో ఉన్న గ్రహము బలీయము. నాలుగు అయిదు రెండు స్థానములలో ఉన్న చంద్రునికంటే, రెండు మూడు ఆరు స్థానములలో ఉన్న గ్రహము అదే స్థానములో ఉండు శనికంటే బలీయుడు. ఒకటి, నాలుగు, అయిదు, ఆరు, పదకొండు స్థానములలో ఉన్న గ్రహములు రెండు, పన్నెండు స్థానములలో భిన్న రాశులలో నుండు బుధునికంటే బలీయులు. రాశ్యంత్యాంశములలో ఉండు చంద్రుని కంటే శుక్రుడు శుభకరుడు. తన రాశిలో బుధునితో నున్న గ్రహములలో మూడు, అయిదు, నాలుగు, రెండు స్థానములలో, దిక్ భద్ర ఆనగతుడగు గ్రహము శనికంటే శుభకరుడు. రంధ్ర, ఆయ, వ్యయస్థానగతుడు 8, 5, 3 స్థానములలో నుండు సూర్యుని కంటే గురువు కంటే బలీయుడు. బుధుడు నాలుగు, మూడు, పదకొండు, ఆరు, రెండు స్థానములలో, మూడు, అయిదు, ఆరు, స్థానములలో ఉండు శని రాశ్యం త్యాంశములలో ఉండు కుజుని కంటే బలీయుడు. కేంద్ర, ఆయ, అష్ట ధన స్థానములలో ఉన్న సూర్యుడు లగ్నమునుండి వృద్ధి అద్యబంధువులలో గోఅధ్వఅష్టఅరి భవస్థానములలో రాంశ్యంత్య భాగములలోనుండు చంద్రునికంటే లాభత్రిషట్ స్థానములలోనుండగా బలీయుడు.

ఆరు, ఎనిమిది, అంత్యాంశగతుడు రెండు, అంత్యాంశల యందుండు గురువు కంటే శుక్రుని కంటే బలీయుడు. ఉక్త స్థానములలో రేఖలను ఈయవలయును. చెప్పని స్థానములలో బంధువుల నుంచవలయును. జన్మరాశి నుండి ద్విమిత్రోశ్చ రాశులు స్వస్థానము లైనచో శుభము. పరస్థానమై నచో అశుభమని తెలియవలయును. అర్హక్షయము క్లేశము. సమత అర్థ సుఖము నిచ్చును. ధనాప్తి, సుఖము, ఇష్టాప్తి అని క్రమముగా రేఖా ఫలమును చెప్పవలయును. సూర్యుని వలన పితృ మాతృ ద్విషన్మిత్ర భ్రాతృస్త్రీ సేవనలు లభించెదరు. స్వాబగా ఉన్నను మేష లగ్నములోను స్వస్థానములో ఉన్న సూర్య చంద్రుల వలన కీర్తి ప్రతిష్ఠలు పెరుగును. తృణ, స్వర్ణ, అశ్వ, ధోరణాదులచే సూర్యాం శలో జీవనమును చెప్పవచ్చును. చంద్రాంశలో, కృషి, అంత్వజ స్త్రీలచే జీవనమును చెప్పవలయును. కుజాంశలో ధాతువులచే, అస్త్రములచే, సాహసముచే జీవనము జరుగునని చెప్పవలయును.

బుధాంశలో కావ్య శిల్పాదులచే జీవనము సాగునని, దేవ ద్విజాకరములచే గుర్వంశలో జీవనము సాగునని చెప్పవలయును. శుక్రుని అంశలో రజత గోరత్నములచే, శని అంశలో హింసాశ్రమ అధములతో జీవనము సాగునని చెప్పవలయును. సూర్యుడు తన ఉచ్చ రాశులలో ఉండి గురు కుజులతోకలిసియున్నచో రాజులగుదురు. లగ్నములోకాని, వర్గోత్తమమున కాని చంద్రుడుండి నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహములచే చూడబడినచో రాజగును. ఉచ్చలో కుజుడు, ధనూరాశిలో సూర్యచంద్రులు, లగ్నమున శని ఉన్నచో రాజగును. ఉచ్చలో సూర్యుడు, స్వస్థానమున నుండు గురువు, శని చంద్రులు ఉచ్చలో నుండునపుడు, లగ్నమున సూర్యుడు, షష్ఠస్థానమున బుధుడున్నచో, శుక్రుడు, కుజుడు, గురువు కర్కటకమున ఉన్నపుడు, కుజుడు మేషమున కాని, లగ్నమున కాని ఉన్నచో రాజగును. సూర్యుడు, బృహస్పతి వృషభమున ఉన్నను, స్వస్థానమున బృహస్పతి ఉన్ననూ రాజగును. శని సింహమున మూడు, అరు, స్థానముల రాశ్యంశమున మేషాదులున్ననూ రాజగును. మేషమున బృహస్పతితో కూడిన గ్రహమునుండి, సింహమున కుజుడుండిన, ఉచ్ఛరాశితో మేషము చూడబడునపుడు రాజగును. లగ్నమున బృహస్పతితో కూడి సూర్యుడున్నపుడు, బుధ శుక్రులు మేషమున ఉన్నప్పుడు, మేషరాశిలో సూర్యుడుండి, కుజ చంద్రులతో కలిసి ఉన్ననూ చూపు పడిననూ, శని కుజులున్ననూ, సింహమున కుంభమున మేషమున ఉన్నచో రాజగును. మేషలగ్నమై, మేషమున కుజుడున్ననూ రాజగును. సూర్యుడు, బృహస్పతి లగ్నమున ఉన్ననూ, సూర్యుడు కుజుడు న్ననూ రాజగును. అయిదవ స్థానమున గురువు చంద్రుడు శుక్రుడున్నచో, స్వస్థానమున మూడింట ఉన్నను రాజగునని పండితులు చెప్పెదరు. సింహలగ్న జాతకుడు, సింహమున శని చంద్రుడు ఉన్నపుడు, శుక్రుడు కుజుడు తులారాశిలో కాని, ద్విస్వభావ రాశులలో కాని ఉన్నచో రాజు కీర్తిమంతుడగును. పైనచెప్పబడిన యోగములచే ఎవరిపుత్రుడైననూ రాజు కావచ్చును. ఇప్పుడు చెప్పబోవు యోగములచే రాజపుత్రుడు మాత్రమే రాజగునని తెలియును.

స్త్ర్యాదిగ్రహములు బలయుతులై తమతమ ఉచ్చ స్థానములలో కాని త్రికోణ స్థానము లందు కానియున్నచో రాజుకాగలడు. సింహమున సూర్యుడు, మేషమున చంద్రుడు, మకరరాశిలో కుజుడు, కుంభరాశి అష్టమము, ధనూరాశిలో బృహస్పతి, స్వస్థానమున శుక్రుడున్నచో జాతకుడు రాజగును. పాతాల ధర్మస్థానములలో నున్న చంద్రుడు శుభ గ్రహములచే చూడబడినచో మిగిలిన గ్రహములు త్రిలగ్న భవస్థానములలో ఉన్నచో రాజగును. బలయుతుడగు బుధుడు వృషభమున నుండగా, శుభ గ్రహములు శుభ స్థానములలో నున్నపుడు, ధర్మ ధన స్థానములలో మిగిలిన గ్రహములు ఉన్నపుడు రాజు ధర్మాత్ముడగును. మేష అయలగ్నములలో చంద్రుడు శని గురువులున్నచో ధన స్థానమున (2) బుధ కుజులున్నచో, శుక్రుడు హిబుకమున ఉన్నచో రాజగును.

వృషభమున, కుంభమున చంద్రుడు, రెండవ స్థానమున, అరవ స్థానమున గురు, శనులు, ఇతరులు పదకొండవ స్థానమున ఉన్నచో, నాలుగవ స్థానమున గురువు, సూర్య చంద్ర శనులు లగ్నమున, భవమున, కరిలో ఉన్నపుడు, లగ్నమున శుక్రుడు శని, చంద్రుడు, గురువు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు క్రమముగా శుభులు శుభరాశిలో ఉన్నపుడు పుట్టినవాడు రాజగును. పదవ స్థానమున, లగ్నమున నున్న గ్రహముయొక్క దశలో రాజ్యము లభించుట కలదు. బలీయమగు గ్రహముయొక్క దశలో కాని శత్రు గ్రహములు నీచ స్థానములలో ఉన్నప్పుడు ఆర్తిని కలిగించును. సూర్యుని సమీపమున సకల గ్రహములున్నచో వర్గదము అందురు. లగ్నమున గ్రహము అస్తగుడైనచో సకట యోగ మందురు. రాజ్య బంధు స్థానములలో గ్రహములున్నచో విహగయోగ మందురు. అయిదవ స్థానమున, ఎనిమిదవ స్థానమున గ్రహములున్నచో శృంగాటక యోగమందురు. లగ్నమున కంటే ఇతర స్థానములలో గ్రహములున్నచో హలయోగ మందురు. అంగమున శుభాశుభ గ్రహములు ఉన్నపుడు వర్ణయోగ మందురు. నాలుగవ స్థానమున నున్నచో అపయోగమందురు.

గ్రహములు కలగాపులగముగా ఉన్నచో కమలయోగ మందురు. లగ్నమున నాలుగు గ్రహములున్నచో యూపయోగ మందురు. నాలుగవ స్థానమున నాలుగు గ్రహములున్నచో శరయోగ మందురు. ఏడు నాలుగు రెండవ స్థానములలో ఉన్నచో శక్తి, యోగమందురు. లగ్నమునుండి వరుసగా ఏడు స్థానములలో గ్రహములున్నచో నౌకా యోగమందురు. లగ్నమున మాత్రమే యున్నచో కూటయోగమందురు. స్వస్థానమున గ్రహమస్తంగతుడైనచో ఛత్రయోగమందురు. ఇతర స్థానములలో అస్తగుడైనచో అర్ధేందు యోగమందురు. లగ్నమునుండి ఒకటిని విడిచి తరువాతి రాశిలో గ్రహము లున్నచో చక్ర యోగమందురు. సమసప్త రాశులలో గ్రహములున్నచో వీణాది యోగములు అనబడును. వీణా దామ, పాశ, కేదార, శూల యుగ గోలకములని ఆరు యోగములు. అన్ని గ్రహములు చరరాశులలో ఉన్నచో రాజయోగమని చెప్పబడినది. స్థిరరాశులలో అన్ని గ్రహములున్నచో ముసలయోగ మందురు. ద్విస్వభావరాశులలో నున్నచో నలయోగము అందురు. కేంద్రమున సౌమ్య గ్రహములున్నచో బాలయోగమందురు. కేంద్రమున పాపగ్రహములున్నచో సర్పయోగ మందురు. రజ్జుయోగమున పుట్టినవాడు ఈర్ష్యాలువు ప్రయాణమున రుచి గలవాడుగా నుండును. ముసలయోగమున పుట్టినవాడు ధనము గౌరవము కలవాడగును. వీణా యోగమున పుట్టినవాడు అతినిపుణుడు, గీతనృత్యములందు మిక్కిలి అభిలాష కలవాడుగా నుండును. దామయోగమున పుట్టినవాడు సర్వసంపద్యుక్తుడు దాతయగును. పాశ యోగమున పుట్టినవాడు ధనవంతుడు శీలవంతుడగును. కేదార యోగమున పుట్టినవాడు వ్యవసాయము చేయువాడు అగును. శూలయోగమున పుట్టినవాడు శూరుడు తరగని ధనము కలవాడగును. యుగయోగమున పుట్టినవాడు పాషండులతో కలిసియుండును. గోలక యోగమున పుట్టినవాడు ధనహీనుడు మలిను డగును. చక్ర యోగమున పుట్టినవాడు రాజులచే నమస్కరించదగినవాడగును. సముద్ర యోగమున పుట్టినవాడు రాజభోగములు కలవాడగును. అర్ధచంద్ర యోగమున పుట్టినవాడు సౌందర్యము కల అవయవములు కలవాడు సుఖీ, శూరుడు దీర్ఘాయుష్మంతుడు అగును. ఛత్రయోగమున పుట్టినవాడు మిత్రులకు ఉపకారము చేయువాడగును. కూట యోగమున పుట్టినవాడు అసత్యవాది అగును. తేజోవంతుడు, కీర్తిమంతుడు, సుఖము కలవాడుగా నగును. యూధ యోగమున పుట్టినవాడు త్యాగి, యాగము చేయువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, గుహ్యాధిపు డగుచో శరములచే హింసించువాడగును. శక్తి యోగమున పుట్టినవాడు నీచుడు, అలసుడు, నిర్ధనుడు అగును. దండయోగమున పుట్టినవాడు ప్రియుల ఎడబాటును పొందును. సూర్యుడు కాక మిగిలిన గ్రహములు కుంభ మీన రాశులలో నున్నపుడు సునఫా, ఆనఫా యోగములందురు. చంద్రుడు మీనరాశిలో ఉన్నపుడు దురధరా యోగ మనబడును. అట్లు కానిచో కేముద్రుమయోగ మందురు. సునఫా యోగమున పుట్టినవాడు తాను సంపాదించిన ధనమును అనుభవించువాడు, దాత, ధన వంతుడు, సుఖవంతుడుగా ఉండును. ఆనఫా యోగమున పుట్టినవాడు రోగము లేనివాడు, శీల మంతుడు, ప్రసిద్ధిని పొందువాడు, చక్కనివేషము కలవాడగును. దురుధర యోగమున పుట్టినవాడు. భోగ వంతుడు, సుఖవంతుడు, ధనవంతుడు, దానము చేయువాడు, త్యాగము చేయువాడుగా నుండును. కేముద్రుమ యోగమున పుట్టినవాడు మిక్కిలి మురికిగా నుండువాడు దుఃఖము కలవాడు, నీచుడు, నిర్ధకుడుగా నుండును. కుజుడు పుష్కరాంశ మున నుండగా పుట్టినవాడు యంత్రకారుడు, అశ్మకారుడు, చక్కనిబాటలో నడచువాడు, చక్కని జ్ఞానము కలవాడు, చక్కని కీర్తి కలవాడు, నిపు ణుడు, విద్వాంసుడు, ధనవంతుడుగా ఉండును. లగ్నమున సూర్యుడున్నచో అన్యోన్యకార్య నిరతు డగును. శుక్రుడున్నచో శస్త్రజీవి అగును. శనితో కలిసియున్నచో ధాతుకుశలుడగును. కూటస్థానమున తిరుగువాడు శవవిక్రేత కుజడున్నచో యగును. చంద్రుడున్నచో సంతాన ద్వేషియగును. బుధునితో కలిసి ఉన్నచో అర్ధ నిపుణుడగును. వినయశాలి సత్కీర్తిమంతుడగును గురువుతో కలిసియున్నచో స్థిర వయస్కుడు, సద్వంశజుడు, విక్రాంతుడు సమర్ధుడగును. శుక్రుడున్నచో సుఖము తెలిసిన వాడగును. శనియున్నచో బలిష్ఠుడగును. బుధునితో కలిసి కుజుడున్నచో బాహు యుద్ధము చేయువాడు, గురువుతో కలసి ఉన్నచో పురాధ్యక్షుడు, శుక్రునితో కలిసి ఉన్నచో ద్యూతము నాడువాడు, శనితో కలిసి యున్నచో అబద్ధములు ఆడువాడు, ద్యూతము నాడువాడు, గురువుతో కలిసి బుధుడున్నచో నృత్యగీత నిపుణుడు, శుక్రునితో కలిసున్నచో మాయదక్షుడు, శనితో కలిసున్నచో పిసినారి క్రూరుడగును. శుక్రునితో కలిసి గురువున్నచో విద్వాంసుడు, శనితో కలిసున్నచో అన్న ఘటకరుడు, శుక్రుడు మాత్రమే ఉన్నచో చిన్నకన్నులు కలవాడు, అరణ్యము వలన వచ్చు డబ్బుగల వాడగును. ఒకే స్థానములో నలుగురు అంతకన్నా ఎక్కువ గ్రహములున్నచో, కుజుడు, బుధుడు, బృహస్పతి, చంద్రుడు, శుక్రుడు, శని, సూర్యులున్నచో పరివ్రాజకుడగును. శాకములను కంద మూలములను, ఫలములను తినువాడగును. రాశులు అధిపతులు ఐలీయులైనచో ప్రప్రణించినచో చ్యుతి కలుగదు. అదీక్షితుడు, అల్పుడు, అస్తగతుడు. బలీయులగు గ్రహములు కలిసి యున్నచో వారి భాగములచే ఫలములను చెప్పవలయును. జన్మలగ్నాధిపతి ఇతర గ్రహములచే చూడబడనిచో మెల్లగా చూచును. జన్మ లగ్నాధిపతిని శని చూచినచో నశించును. కుజ సూర్యాంశలు శనిచే చూడబడినచో, చంద్రుడు చూడబడి వచో దీక్షితుడగును.

అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు రూపవంతుడు అభరణ భూషితుడుగా ఉండును. భరణీ నక్షత్రమున పుట్టినవాడు సమర్థుడు సత్యమును పలుకువాడగును. కృత్తికా నక్షత్ర జాతకుడు తిండిపోతు, స్థిరబుద్ధి కలవాడు, ప్రియముగా మాటలాడువాడగును. రోహిణీ నక్షత్ర జాతకుడు ధనవంతుడు, మృగశిరా నక్షత్ర జాతకుడు భోగి, అర్ధా నక్షత్ర జాతకుడు హింసాశీలి, శఠుడు, పాపకారి యగును. పునర్వసూ నక్షత్ర జాతకుడు ఇంద్రియ నిగ్రహము కలవాడు, రోగి, శుభకరుడు, పుష్యమీ నక్షత్ర జాతకుడు కవి, సుఖి, ఆశ్లేషా నక్షత్ర జాతకుడు ధూర్తుడు, శరుడు, కృతఘ్నుడు, పాపి, అన్నిటిని తినువాడగును. మఘా నక్షత్ర జాతకుడు భోగి, ధని, భక్తుడు, పూర్వఫల్గునీ నక్షత్ర జాతకుడు దాత, ప్రియముగా మాట్లాడువాడు, ఉత్తరా నక్షత్ర జాతకుడు ధని, భోగి, హస్తా నక్షత్ర జాతకుడు చోరుడు, దుష్టుడు, దైన్యము కలవాడగును. స్వాతి నక్షత్ర జాతకుడు చిత్రాంబరధారి, చక్కని నేత్రములు గలవాడు, ధర్మపరుడు దయాపరుడు కాజాలడు. విశాఖా నక్షత్ర జాతకుడు లుబ్ధుడు శరుడు, కోపిష్ఠి, అనూరాధా నక్షత్ర జాతకుడు తిరుగుబోతు, విదేశములకు వెళ్ళువాడు, జ్యేష్ఠానక్షత్ర జాతకుడు ధర్మపరుడు, సంతోషశీలి, మూలానక్షత్ర జాతకుడు అభిమానము కలవాడు, ధనవంతుడు, సుఖము కలవాడగును. పూర్వాషాఢా నక్షత్ర జాతకుడు అభిమాని, సుఖీ, సంతోషము కలవాడు, ఉత్తరాషాఢా నక్షత్ర జాతకుడు వినయ శీలి ధార్మికుడగును. శ్రవణా నక్షత్ర జాతకుడు ధనవంతుడు, సుఖవంతుడు, ధనిష్ఠా నక్షత్ర జాతకుడు దాత, శూరుడు, ధనవంతుడగును. శతభిషా నక్షత్ర జాతకుడు శత్రు సంహారకుడు, వ్యసనములు కలవాడు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకుడు స్త్రీలకు లొంగినవాడగును. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు వక్త, సుఖ, ప్రియుడు, రేవతీ నక్షత్ర జాతకుడు శూరుడు, ధన వంతుడు పవిత్రుడగును. మేష లగ్న జాతకుడు కామి, శూరుడు, కృతజ్ఞుడగును. వృషభ లగ్న జాతకుడు ప్రియుడు, త్యాగి, ఓర్పు కలవాడగును. మిధున లగ్న జాతకుడు స్త్రీ విషయమును, ద్యూతమును, శాస్త్రములను చక్కగా తెలిసినవాడు, కర్కాటక లగ్న జాతకుడు స్త్రీస్వభావము కలవాడు, పొట్టివాడు అగును. సింహ లగ్నజాతకుడు స్త్రీలను ద్వేషించువాడు, కోపిష్ఠి అభిమానము కలవాడు, విక్రమము కలవాడు, స్థిరబుద్ధి కలవాడు సుఖవంతుడు అగును. కన్యాలగ్న జాతకుడు ధర్మాత్ముడు, వినయము కలవాడు, మంచి బుద్ధికలవాడు, తులాలగ్న జాతకుడు ప్రాజ్ఞుడు, పొడగరి, ధనవంతుడగును. వృశ్చిక లగ్న జాతకుడు రోగి, పూజ్యుడు, గాయములు కలవాడు, ధనుర్లగ్న జాతకుడు కవి, శిల్పి, ధనియగును. మకరలగ్న జాతకుడు సోమరి, తిరుగుపోతు, మంచి కనులు కలవాడు, కుంభలగ్న జాతకుడు పరస్త్రీలను, పరధనమును హరించువాడు, మీన లగ్న జాతకుడు బలవంతుడు, భయము కలవాడగును. ఏ లగ్నమున పుట్టిన వాడైనను లగ్నాధిపతి బలయుతుడైనచో ఫలము సంపూర్ణముగా ఉండును. బలహీను డైనచో విపరీత ఫలములు కలుగును. చంద్రుడు బలయుతుడుగా ఉన్నను సకల ఫలములు లభించును. క్షీణ చంద్రుడైనచో విపరీత ఫలములు కలుగును. మేషము మొదలు మీనాంతమగు రాశులలో సూర్యుడు ఉన్నపుడు వరుసగా ఖ్యాతిగలవాడు, స్త్రీ ద్వేషి, ధనవంతుడు, తీవ్ర స్వభావము కలవాడు, జ్ఞానము కలవాడు, కవి, శొండికుడు, ధనవంతుడు, పూజ్యుడు, లుబ్ధుడు, దరిద్రులతో స్నేహము చేయువాడు, బలవంతుడు అగును. సూర్యుడు లగ్నమున నుండగా పుట్టినవాడు ధనహీనుడు, కుజుడు ఉన్నచో ధనవంతుడు చంద్రుడు ఉన్నచో స్వభేదనుడు, బుధుడున్నచో కృతజ్ఞుడు, గురువున్నచో ఖ్యాతి కలవాడు, శుక్రుడున్నచో పరదార నిరతుడుగా ఉండును. మకర లగ్న జాతకుడు బహపుత్రుడు బహుధనవంతు డగును. కుంభ లగ్నమున పుట్టినవాడు దుఃఖవంతుడు, అసత్యవాది, ఖలుడగును. సూర్యునితో బుధుడు కలిసున్నచో స్త్రీలచే ద్వేషించబడువాడు, స్వజనులను ద్వేషించువాడు, దుఃఖములను పొందువాడు, బుద్ధిమంతుడు, ధనవంతుడు, సమానార్ధుడు, పుత్రులు స్త్రీలు ఋణములు కలవాడుగా నుండును. సూర్యునితో బృహస్పతి కలిసున్నచో సేనాధిపతి, స్త్రీలు ధనము పుత్రులు కలవాడు, సమర్ధుడు, అధికారము కలవాడు, వస్త్రములు కలవాడు మండలాధిపతి, ధనము సుఖము కలవాడు, ఋణము ప్రభుత కలవాడుగా నుండును. సూర్యునితో శుక్రుడు కలిసున్నచో స్త్రీలవలన ధనమును పొందువాడు, తక్కువ దుఃఖము కలవాడు, బంధువులను ద్వేషించువాడు, ధనము, పాపము గలవాడు, ధనవంతుడు, ఖ్యాతి గలవాడు, సముడు, ప్రాజ్ఞుడు స్త్రీలకు వశ్యుడగును. సూర్యునితో శని కలిసున్నచో విపరీత కార్యములచే ధనమును పొందువాడు, ఖప్రసూకుడు, విధిమిత్రుడు, సుఖత్రయము కలవాడు, సత్పుత్రులు, మంచి స్త్రీలు, మంచి ధనము కలవాడు, రాజు కాగలడు. కుజాదులచే చంద్రుడు చూడబడి మేషరాశిలో ఉన్నపుడు రాజు జ్ఞాని, గుణవంతుడు, పౌరుల ధనమును స్వీకరించువాడగును. మిధునమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధనహీనుడు, చోరుడు, రాజుల సేవలు చేయువాడుగా నుండును. కర్కాటకమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధాతువులు నమ్ముకొని బ్రతుకువాడు, రాజాజ్ఞకు భయపడువాడు, బట్టలను నేసి బ్రతుకువాడు, ధనములేని వాడుగానుండును. సింహమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు యుద్ధమునందు కోరికగలవాడు, కవి, పండితుడు, యజ్ఞములచే, ధాతువులచే బ్రతుకువాడు, కంటి జబ్బులు కలవాడు, జ్యోతిశ్శాస్త్ర జ్ఞానము కలవాడగును. కన్యలో చంద్రుడు శుభ గ్రహములతో కలిసియున్నచో రాజు, సేనాపతి, నైపుణ్యము కలవాడు మంచి ఆశయము కలవాడుగా నుండును. తులారాశిలో చంద్రుడు ఉండి ఇతర గ్రహములచే చూడబడినచో రాజు, స్వర్ణకారుడు, వాణిజ్యము చేయువాడుగా నుండును. వృశ్చికరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహముల దృష్టి ఉన్నచో ఇద్దరు తండ్రులు కలవాడు, సముద్రజీవి, సైన్యము గలవాడు, తన భూమిని కాపాడుకొనగలవాడుగా ఉండును. ధనూరాశిలో చంద్రుడుండి శుభగ్రహ వీక్షణమున్నచో జ్ఞాతులు కలవాడు, భూమి న్యాయములను చెప్పువాడు, శఠుడుగా ఉండును. మకరరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు రాజులచే సన్మానించబడువాడు, మిత్రుడు గలవాడు, యజ్ఞములు చేయు వాడుగా ఉండును. కుంభరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు హాస్యజ్ఞుడు, నృపజ్ఞుడుగా ఉండును. హారేసఋృక్ష దళములలో ఉండి వారిచే చూడబడి ననూ, కలిసియున్ననూ చంద్రుడు శుభుడు. త్ర్యంశమున తదధిపతి, మిత్రరాశులలో నున్ననూ, చూడబడిననూ శుభకరుడే.

ఇంతవరకు ద్వాదశాంశ ఫలమును చెప్పితిని. ఇపుడు నవాంశఫలమును చెప్పెదను. కుజాంశలో శుక్రుడున్నచో తనను తాను రక్షించుకొనువాడు, ఇతరులను చంపుటలో రుచిగలవాడు, ద్వంద్వయుద్ధ కుశలుడు, ధనవంతుడు, కలహశీలి, మూర్ఖుడు, పరస్త్రీ లోలుడు అగును. బుధాంశలో కవి, సుఖము గలవాడు, నటుడు, చోరుడు శిల్పి యగును. స్వాంశలో అల్పతనువు, సుఖము కలవాడు, తపస్వి లోభపరుడగును. కుజాంశలో కోపిష్ఠి, నిధీశుడు, అమాత్యుడు, రాజు, వాంసా శీలుడగును. బృహస్పతి అంశలో హాస్యము తెలిసినవాడు, యోధుడు, బలశాలి, మంత్రి, ధార్మికుడు అగును. శన్యంశలో అల్ప సంతానము గలవాడు, దుఃఖితుడు, దుష్ట స్త్రీ సంగతిగలవాడగును. సూర్యుడు చంద్రాదులచే చూడబడినచో క్రమముగా శుభఫలము చెప్పబడినది. అంశాధిపతి బల యుతుడైనచో పుష్టము మధ్యమము, లఘుఫలమని తెలియవలయును. రాశీక్షణఫలమును ఆపి అంశ ఫలమును స్ఫుటముగా ఇచ్చును. సూర్యుడు లగ్నమున ఉన్నచో శూరుడు, స్తబ్ధుడు, వికల దృష్టి కలవాడు, నిర్దయుడుగా నుండును. మేషణ రాశిలో సూర్యుడున్నచో ధన వంతుడు, గుడ్డివాడు, సింహరాశిలో ఉన్నచో రేచీకట్లు కలవాడు, కర్కటరాశిలో ఉన్నచో నీచుడు, ధనహీనుడు, లగ్నమున ఉన్నచో త్రిప్పుడు కనులు గలవాడగును.

రెండవ స్థానమున సూర్యుడున్నచో బహుధనము కలవాడు, నృపునిచే దండించబడు వాడు, ముఖామయము గలవాడగును. సూర్యుడు మూడవరాశిలో ఉన్నచో పండితుడు పరాక్రమవంతుడు, విముఖుడు, పీడించబడువాడగును. అయిదవ స్థానమున ఉన్నచో ధనాపత్యములు కలవాడు, ఆరవరాశిలో ఉన్నచో శత్రువులచే పరాజయమును పొందువాడు అగును. ఏడవ రాశిలో ఉన్నచో స్త్రీలకు వశ్యుడు, 8వ స్థానమున నున్నచో అల్పసంతానము కలవాడు, అల్పదృష్టి కలవాడగును. 9వ రాశిలో నున్న ఉత్త అర్థసుఖము కలవాడు, 10వ రాశిలో ఉన్నచో శాస్త్ర జ్ఞానము, శౌర్యము కలవాడు, పదకొండవ స్థానమున సూర్యుడున్నచో బహుధన వంతుడు, గౌరవము కలవాడు, 12వ రాశిలో ఉన్నచో పతితుడగును. లగ్నమున చంద్రుడు ఉన్నచో మూగవాడు, చెవిటివాడు, సేవకుడుగా నుండును. రెండవ స్థానమున ఉన్నచో ధనవంతుడు. వటువు, మూడవ స్థానమున ఉన్నచో హింసాప్రియుడు, నాలుగవ స్థానమున నున్నచో సాధు స్వభావము కలవాడు, అయిదవ స్థానమున ఉన్నచో స్త్రీ సంతానము కలవాడు సోమరి. ఆరవ స్థానమున ఉన్నచో కొద్ది ఆకలి కొద్ది కామము కలవాడు, తీక్ష స్వభావము కలవాడు, ఏడవస్థానమున నున్నచో ఈర్ష్యకలవాడు మద త్రయము కలవాడు, 8వ స్థానమున ఉన్నచో వ్యాధిపీడా యుతుడు, 9వ రాశిలో నున్న మిత్రులచే ధనముచే కూడియుండువాడు, పదవ రాశిలో ఉన్నచో ధర్మబుద్ధి ధనము కలవాడు, పదకొండవ స్థానములో ఉన్నచో ప్రసిద్ధి, బుద్ధి, ధనము కలవాడు, పన్నెండవ రాశిలో చంద్రుడున్నచో క్షుద్రుడు అంగహీను డగును. కుజుడు లగ్నమున నున్నచో గాయములుకల శరీరము కలవాడు, ధన స్థాన ముననున్నచో దుష్టాన్నమును తినువాడు, కొంత ధర్మము కొంత పాపమును ఆచరించువాడుగా నుండును. మిగిలిన స్థానములలో కుజుడున్నచో సూర్యుడిచ్చు ఫలములనే ఇచ్చును. బుధుడు లగ్నమున నున్నచో విద్వాంసుడు, ధనవంతుడు, ప్రవరుడు పండితుడు, మంత్రి, శత్రువులు కలవాడు, ధర్మము తెలిసినవాడు, విస్తృత గుణములు కలవాడు అగును.

మిగిలిన స్థానములలో ఉన్నచో సూర్యుని వలెనే ఫలములు కలుగును. బృహస్పతి లగ్నమున ఉన్నచో విద్వాంసుడు, కృపణుడు, మంచి నేత్రములు కలవాడు, శత్రువులు కలవాడు, నీచుడు, తపస్వి, లోభి, దుష్టుడగును. శుక్రుడు లగ్నమున ఉన్నచో కాముకుడు, సుఖము కలవాడు, కలహ శీలుడు, సురతమునందు అభిలాష కలవాడు, సుఖించువాడుగా ఉండును. మిగిలిన స్థానములలో నున్నచో బృహస్పతివలెనే ఫలముల నిచ్చును. లగ్నమున శనియున్నచో నిర్ధనుడు, రోగి, కామవశుడు, మలినుడు, శైశవమున ఆర్తికలవాడు, సోమరి యగును. ఉచ్చస్థానమున నున్నచో రాజగును. గ్రామాధిపతి, విద్వాంసుడు, సుందరాంగుడు అగును. ఇతర స్థానములలో ఉన్నచో సూర్యునివలె ఫలముల నిచ్చును. ఉచ్చస్థానములలో నున్నచో పూర్ణఫలము నొసంగును. మూల త్రికోణ స్థానము లలో ఉన్నచో ఒక భాగము తక్కువ ఫలమును ఇచ్చును. శుభగ్రహము స్వస్థానమున నున్నచో పూర్ణ ఫలమును, మిత్రస్థానమున ఉన్నచో పాదఫలమును కలుగజేయును. శత్రు స్థానమున ఉన్నచో అల్పఫలము నిచ్చును. నీచ స్థానమున ఉన్ననూ అస్తగతు డైనను ఏ ఫలమును ఈయజాలడు. ఫ్రేష్మాణము, త్రికోణము మొదలగు స్థానములలో గ్రహములున్నచో క్రమముగా కులతుల్యుడు, కులాధికుడు, బంధు పూజ్యుడు, ధనవంతుడు, సుఖి, భోగి, రాజు అగును. అట్లే పరవిత్తమును హరించువాడు, మిత్రులను, బంధువులను పోషించువాడు, గణాధిపుడు, బలాధిపుడు అగును. మిత్ర స్థానములలోనున్నచో రాజగును. విషమ రాశిలో సూర్యహారలో శుభరాశులలో నుండగా ప్రసిద్ధి నొందువాడు, మహోద్యమము గలవాడు, అతి తేజోవంతుడు, ధీమంతుడు, ధనవంతుడు, బలవంతుడు అగును. శుభ గ్రహములు సమరాశులలోనుండగా చంద్రహోరలో పుట్టినవాడు కాంతి, మృదుత్వము, సౌభాగ్యము, భోగము, బుద్ధి కలవాడగును. పాపగ్రహము సూర్యహోరలో ఉండి, సమ రాశులలో మధ్యమ గ్రహములున్నచో, విషమరాశులలో శని మొదలగు వారుకాని సౌమ్య గ్రహములుకాని ఉన్నచో పైన చెప్పబడిన ఫలములు ఈయజాలవు. చంద్రుడు స్వమిత్ర గ్రహములతో కలిసి ఉన్నను, త్య్రంశగతుడైనను రూపవంతుని గుణవంతుని చేయును. మూడవ స్థానమున ఉన్నచో అట్లే అంతటి గుణములు, రూపము కలవానిని చేయును.

అంగారకుడు చతురంశలలో త్ర్యంశలలో కాని ఉన్నచో తీక్ష రాశిలో ఉన్నచో అతి హింసా శీలుడు, గురుతల్పగతుడు, తిరుగుబోతు అగును. అట్లే చోరుడు, భోక్త, ధనవంతుడు, ధీమంతుడు, రాజు, నపుంసకుడు, శత్రు హంతకుడు, విష్టికారుడు, దాసవృత్తి కలవాడు, పాపి, హింసాశీలుడు, బుద్ధిహీనుడుగా మేషాది ద్వాదశరాశులలో కాని వాటి ఉత్తమాంశలలో కాని ఉన్నచో పైన చెప్పిన ఫలములు కలుగును. జాయా బలవిభూషణా డ్యుడు, సత్త్వము కలవాడు, అతిసాహసి తేజస్విగా అంగారకుడు త్రింశాంశలో ఉన్నచో అగును. శని స్వాంశలోకాని స్వరాశిలోకాని ఉన్నచో రోగిష్టి తన భార్యయందు విషముడు, పరదారలయందు ఆసక్తి కలవాడు, దుఃఖము కలవాడు, వస్త్రములు కలవాడు, మలినుడుగా ఉండును. బృహస్పతి త్రింశాంశలో ఉన్నచో సుఖము, బుద్ధి, ధనము, కీర్తి కలవాడు, తేజస్వి, లోక పూజితుడు, నీటిలో పుట్టినవాటిని, రహస్యముగా లభించిన వాటిని అనుభవించువాడుగా ఉండును. బుధుడు త్రింశాంశలో ఉన్నచో మేధావి, కళా కోవిదుడు, కావ్యకర్త, శిల్పకారుడు, వివాదములు, కపటము కలవాడు, శాస్త్రార్భజ్ఞుడు, సాహసి అగును. శుక్రుడు, స్వాంశలో ఉన్నచో బహు సంతానము, సుఖము, ఆరోగ్యము, రోగము, సౌందర్యము, ధనము కలవాడు, లలితాంగుడు, ఇంద్రియానుకూలముగా సంచరించువాడుగా ఉండును. కుజాది గ్రహము లతో సూర్యచంద్రులు కలిసున్నచో శూరుడు, స్తబ్ధుడు, విషమ వధను పొందువాడు, సద్గుణములు కలవాడు, సుఖమునందు అభిలాష కలవాడు, సుందరాంగములు కలవాడుగా ఉండును. మూల త్రికోణ స్వస్థాన ఉచ్చస్థానము లలో కంఠస్థానమున ఉన్న గ్రహములు పరస్పరము సహకార మందించువారు, విశేషించి కర్మసాధకులుగా ఉందురు. విషమరాశులలో గ్రహములుండగా వర్గోత్తమ మున జన్మించుట శుభకరము. కేంద్రములు శూన్యముగా ఉండక, కారక గృహములలో గురు, జ్మేశ లగ్నేశులుండగా కేంద్రములోనున్న గ్రహములు మధ్యకు సౌఖ్యమును ఇచ్చెదరు. అంత్యాంత రాశులలో నున్న గ్రహములు, భాస్కర కుజుల ప్రవేశమున, శుక్రగురులు మధ్యనుండగా, శని చంద్రులు అంత్యమున నున్నపుడు ఫలప్రదులగుదురు. బుధుడెప్పుడూ ఫలదాయకుడే. లగ్నమునుండి అయిదవ స్థానమున ఏడవ స్థానమున నున్న చంద్రుడు శుభ గ్రహములతో కలిసియున్నను, శుభ రాశ్యధి పతులతో చూడబడిననూ, సంపదలు సమృద్ధిగా కలుగును. స్వత్వము ఉండును. సూర్యుడు మీనరాశిలో శనితో కలిసున్నచో స్త్రీని చంపును. అయిదవ స్థానముననున్న కుజుడు కూడా ఘాతమును చేయును. నాలుగవ స్థానమున, ఎనిమిదవ స్థానమున క్రూర గ్రహములు ఉన్నపుడు, క్రూరాంతరమున శుక్రుడున్నపుడు, సద్గ్రహములతో కలిసి ఉండక చూడబడనిచో పుట్టిన స్త్రీకి అగ్నిపాతము వలన మృతి సంభవించును. సూర్యచంద్రులు లగ్నాద్యపాణి గతులైనపుడు, స్త్రీ గ్రహముతో కలిసియున్నపుడు, సప్తమ స్థానమున నున్నపుడు, శుక్ర సూర్యులు తొమ్మిదవ స్థానమున, అయిదవ స్థానమున నుండి వికల స్త్రీ గతులైనపుడు, కోణోదయమున, అస్తింత్య సంధిలో శుక్రుడు ఉన్నపుడు వంధ్యాపతి పుట్టును. అయిదవ స్థానము సౌమ్య గ్రహములు కలదికానపుడు, అంత్యాస్తు దయ రాశులలో గ్రహములు ఉన్నపుడు, పాపగ్రహముల అయిదింట ఉన్నపుడు, చంద్రుడు క్షీణదశలోనుండగా అల్పాయుష్కులగు భార్యాపుత్రులుందురు. శని శుక్రునితో కలిసిఉన్నను, శుక్రునిచే చూడబడినపుడు పుట్టినవాడు పరదార రతుడగును. శని శుక్రులు చంద్రునితో కాని, స్త్రీ గ్రహములతో కాని కలిసి ఉన్నచో పురుషుడు పుంశ్చలుడగును. శుక్రుడు, చంద్రుడు అస్తగతులైనపుడు పురుషుడు కాని, స్త్రీ కాని, పుత్రుడు కాని, శుభగ్రహములచే చూడబడిన స్త్రీ పురుషులు పరిణతాంగులౌదురు. చంద్రుడు, శుక్రుడు, పాపగ్రహములు, తమరాశిలో అస్తగతులైనచో వంశవినాశకుడు జన్మించును. త్రంశాధిపతి బుధునితో కలిసి కేంద్రములో ఉన్న శనిచే చూడబడినపుడు శిల్పియగును. శని అంశలో భృగువీక్షణమున్నపుడు, లేదా భృగువు నీచలో ఉన్నపుడు, సూర్య చంద్రులు అస్తగతులైనను, శనిచే చూడబడిననూ, దాసీ పుత్రుడగును. పాప గ్రహములచే చూడబడిన శని, కుజులు, లేదా అస్తగతులైన శని, కుజులు వాతరోగమును కలిగింతురు. కర్కాటక, వృశ్చికాంశ గతము కేంద్రమై నపుడు, లేదా పాపగ్రహములు కేంద్రమున ఉన్నపుడు గుప్త రోగములు కలుగును. చంద్రుడు పాపగ్రహ మధ్యమున ఉన్నపుడు, సూర్యుడు ఏడవ స్థానమున ఉన్నపుడు కుష్ఠురోగము కలుగును. చంద్రుడు తన స్థానమున నుండి, కుజుడు అస్తగతుడై, శని విషమ రాశిలో ఉన్నప్పుడు పుట్టినవాడు వికలమనస్కుడు అగును.

గ్రహములు ఒకదాని అంశలో వేరొకటి ఉన్నపుడు శూలరోగము కలుగును. సూర్య చంద్రులు కలిసియుండగా కృశాంగుడగును. ఏడవ స్థానమున సూర్యుడు, ఆరవ స్థానమున చంద్రుడు, రెండవ స్థానమున కుజుడు, అంత్యమున (12) శని ఉన్నచో చరగ్రహ గత దోషమువలన అంధుడు నిరాశ్రయుడగును. పాపగ్రహములు తొమ్మిది పదకొండు, మూడు, అయిదు స్థానములలో ఉండి సౌమ్య గ్రహములచే చూడబడనిచో చెవులకు హాని చేతురు. పాపగ్రహములు 7వ స్థానమున ఉన్నచో దంతములకు వికారమును కలిగింతురు. లగ్నమున గురువు, 7వ స్థానమున శనియున్నచో వాతరోగముచే పీడించబడును. కుజుడు నాలుగవ స్థానమున కాని, అస్తగతుడుగా కాని ఉన్నచో, బృహస్పతి లగ్నమున శనితో కలిసి ఉదయించినపుడు, కుజుడు అయిదవ స్థానము, ఏడవ స్థానమున బుధునితో కలిసి చంద్రుడున్నను ఉన్మాదావస్థను చెందును. 12వ స్థానమున చంద్రుడున్నను ఉన్మత్తు డగును. అయిదు, తొమ్మిది, రెండు, పన్నెండు స్థానములలో పాప గ్రహములు ఉన్నచో బంధనము కలుగును. సర్పశృంఖలతో పాప గ్రహములు చూచినపుడు, బలయుతులు పాప గ్రహముల చూపు ఉన్నప్పుడు, శనితో కలసియున్న చంద్రుడు వక్రదృష్టి గలవాడైనపుడు అపస్మారము కలవాడు, దుష్టవాక్కుగలవాడు, క్షయ రోగము కలవాడగును. సూర్యుడు శని కుజులు స్వస్థానము లలో నుండి సౌమ్య గ్రహములచే చూడబడినపుడు, మండలములతో కూడియున్నపుడు ఇతరులచే పోషించబడువారు వరుసగా ఉత్తమ మధ్య మాధములుగా నుందురు. ఈ సమయమున పురుషుడు జన్మించినచో వేశ్య స్త్రీలకు తగిన ఫలమును చెప్పవలయును. స్త్రీలు తమ భర్తలయందు సర్వకార్య భారమును ఉంచి, వారు మరణించి నపుడు మరణించుట స్త్రీల ఫలము. అట్లే వీరు కూడా యజమానులందు సర్వభారముంచి వారు మరణముతో మరణమును పొందెదరని చెప్పవలయును. చంద్రుడు లగ్నమున ఉన్నను, ఏడవ స్థానమున ఉన్ననూ ద్విస్వభావ రాశులలో కాని, లగ్నమున కాని చంద్రుడు ఉన్నచో స్త్రీ తన స్వభావముతో నుండును. లగ్న చంద్రుడు కాని, సప్తమ చంద్రుడు కాని శుభ గ్రహములచే చూడబడినపుడు పుట్టిన స్త్రీ సత్స్వభావము, ఆభరణములు కలిగి యుండును. లగ్నసప్తమ చంద్రులు ఓజస్టు లైనపుడు పురుషాకారము, పురుష స్వభావము కలదౌను. ఒకవేళ లగ్న, సప్తమ చంద్రులు పాపగ్రహములచే చూడబడినచో పాపులు, గుణహీనులు అగుదురు. కుజుని స్థానములో కుజుడు కాని, శని కాని, గురువు కాని, బుధుడు కాని, శుక్రుడు కాని ఉన్నచో వరుసగా స్త్రీ బాల్యమును దుష్టురాలు, దాసి, సాధ్వీ, మాయావతి, తొందరపాటు కలదగును. పైన చెప్పబడిన గ్రహములచే చూడ బడిననూ, ఆ ఫలములే కలుగును. ఆ గ్రహములు బలయుతులైనచో మంచిరూపము, మంచి శీలము కలదగును. ఆ గ్రహములు పాప గ్రహములచే చూడబడినపుడు పాపులు గుణహీనులు అగుదురు. శుక్రుడు స్వస్థానమున ఉన్నచో దుష్టవాక్కు గలది, పునర్భూ, గుణవంతురాలు, విజ్ఞురాలు, ఖ్యాతి గలది అగును. బుధుడు ఉన్నపుడు సమురాలు, దీనురాలు, సాధ్వి, గుణవతి చంచల స్వభావము కలది అగును.

ద్వి స్వభావ రాశులలో ఉన్నపుడు పుట్టిన స్త్రీ స్వైరిణి, భర్తను చంపునది, గుణాఢ్యు రాలు, శిల్పికా, అధమురాలు, వదరుబోతు, కులట అగును. సింహరాశిలో ఉన్నపుడు పురుష బుద్ధి గలది, అగమ్యురాలు అగును. బృహస్పతి అంశలో పుట్టిన స్త్రీ గుణాఢ్యురాలు, అల్పరతిగలది, గుణజ్ఞురాలు, జ్ఞానము కలది, సాధ్వి అగును. శని యంశలో పుట్టిస్త్రీ దాసి, నీచులందు ప్రీతిగలది, సాధ్వి, దుష్టురాలు, సంతానము లేనిదియగును. లగ్నములో చంద్రునితో కలిసి ఉన్న త్రింశాంశల బలానుసారమగు ఫలితమిది. శుక్ర శనులు దృగ్గోచరులై పరస్పరాంశలలో ఉన్నపుడు శుక్రుడు కుంభ రాశ్యంశలో ఉన్నపుడు స్త్రీలతో స్త్రీ సంగమమును చేయును. మదనాగ్ని తాపముచే దహించబడు చుండును. శూన్యముగా లగ్నము ఉన్నపుడు దుష్ట పురుషుడు జన్మించును. సప్తమ రాశిలో బల యుతుడగు గ్రహము ఉన్నచో నపుంసకుడు పుట్టును. బుధ శనులు చరరాశిలో ఉన్నపుడు పుట్టినవాడు ఎప్పుడు పరదేశములందు ఉండును. సూర్యుడు శనితో కలిసి ఉన్నపుడు పుట్టిన స్త్రీ అల్పగుణములు కలదిగా, కుజుడున్నపుడు బాలవితంతువగును. పాప గ్రహములచే చూడబడు శని సప్తమ స్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ కన్యగానే వృద్దురాలగును. అగ్ని గ్రహములు భూమి గ్రహములతో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను కోల్పోవును, క్రూర గ్రహము బలహీనుడై అస్తంగతుడైనపుడు, శుభగ్రహముల దృష్టి లేనిచో భర్తచే విడువబడును. శుక్ర కుజులు పరస్పరాంశలలో ఉన్నపుడు పుట్టిన స్త్రీ భర్తకంటే పరపురుషుని యందు ప్రీతికలదగును. చంద్రుడు ఏడవ స్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను అనుసరించి ఉండును. శని కుజుల రాశులలో చంద్రునితో కలిసున్న శుక్రుడు లగ్నములో ఉండగా పుట్టిన స్త్రీ బంధకి అగును. నాలుగవ స్థానములో కుజాంశ అస్తగాంశలో ఉన్నపుడు, పాపగ్రహముల దృష్టియున్నపుడు, శని దృష్టియున్నపుడు వ్యాధిగ్రస్తురాలగును. శుభగ్రహాంశలో మాత్రము భర్తయందు ప్రీతి గలదగును. శని గ్రహరాశిలో కాని, శన్యంశలో కాని, సప్తమాంశ వృద్ధిలో ఉన్నపుడు స్త్రీకి మూర్ఖుడు భర్తగా లభించును. కుజాంశలో పుట్టినవాడు స్త్రీలోలుడు కోపిష్టిగా యుండును. బుధాంశలో విద్వాంసుడు నిపుణుడుగా ఉండును. గుర్వంశలో జితేంద్రియుడు, గుణవంతుడు, చంద్రాంశలో కాముకుడు, మృదు స్వభావము కలవాడు, శుక్రాంశలో సౌభాగ్యవంతుడు, సుందరుడు, శన్యంశలో మృదు కర్మలను చేయువాడుగా ఉండును. శుక్రచంద్రులు లగ్నములో ఉండగా పుట్టిన స్త్రీ సుఖము కలది, ఈర్ష్యతో కూడియుండినది అగును. లగ్నములో బుధ చంద్రులు ఉన్నచో కళా నిపుణురాలు, సుఖవంతురాలు, గుణవంతురాలు, శుక్రుడు బుధుడున్నచో శుభకరురాలు, కళలు తెలిసినది, సుందరాంగి అగును. లగ్నమున మూడు సౌమ్య గ్రహములున్నచో బహు సౌఖ్యములు, అర్ధములు గుణములు కలదిగా నుండును. క్రూరగ్రహము అష్టమ స్థానమున నున్నచో, అష్టమాధి పత్యంశలో ఉన్నపుడు పుట్టినవాడు సమవయస్కురాలగు భార్యను పొందును. శుభ గ్రహములు అర్ధగతములుగా నున్నపుడు పుట్టిన స్త్రీకి వైధవ్యము మృతి సంభవించును. కన్యా వృశ్చికము సింహము వృషభ రాశులలో చంద్రుడున్నచో అల్ప సంతానము కలదగును. శని మధ్య బలీయుడైనపుడు చంద్ర శుక్ర బుధులు బలహీనులుగా ఉన్నపుడు, మిగిలిన గ్రహములు బలీయములై ఓజ స్థానమున ఉన్నచో, లగ్నమున ఉన్ననూ కురూపిణి అగును. బృహస్పతి కుజుడు బుధుడు బలీయులై సమ రాశులలో కాని, లగ్నములో కాని ఉన్నపుడు పుట్టిన స్త్రీ విఖ్యాతురాలు, అనేక శాస్త్రజ్ఞురాలు, బ్రహ్మవాదిని యగును. పాపగ్రహము అస్తగతమైనపుడు, నవమ స్థానమున నున్నపుడు పరివ్రాజకు రాలగును. వివాహసమయమున, కన్యావరణమున, కన్యనడుగునపుడు పైన చెప్పిన విషయములు అన్నింటిని విచారించవలయును. బలయుతమగు గ్రహము మృత్యు స్థానమును చూచునపుడు ధాతుకోపము వలన నరులకు మృత్యు పాతము యుక్తము అగును. బలయుతులగు గ్రహములు అశుభ స్థానములలో ఉన్నపుడు అగ్నిచే గాయములచే, జ్వరముచే రోగములు కలుగును. సూర్యాదులు అష్టమ స్థానమున ఉన్నచో అకలి దప్పులు ఎక్కువగా ఉండును. సూర్య కుజులు పరమగ్రహ స్థానములలో ఉన్నపుడు మృత్యువు సంభవించును. బంధు స్థానమున, కర్మస్థానమున, అస్తగులుగా శని కుజులు ఉన్నపుడు బంధువులలో ఉండగా శైలాగ్రమున ఉండగా మృతి సంభవించును. సూర్యచంద్రులు స్త్రీ రాశిలో ఉన్నపుడు, మిత్ర గ్రహములు పాప దృష్టి కలిగి ఉన్నప్పుడు పదకొండు పన్నెండు స్థానములలో సూర్యచంద్రులు ఉన్నప్పుడు, ఉదయావస్థలో ఉన్నప్పుడు జలమున మరణము సంభవించును.

అశుభరాశి అంత్యాంశలో ఉన్నపుడు, కుజరాశిలో చంద్రుడున్నపుడు, మకరములో చంద్రుడు, శని కర్కాటకమున ఉన్నపుడు జలోదరవ్యాధిచే మరణించును. స్త్రీ రాశిలో చంద్రుడు, శని అశుభ స్థానమున ఉన్నపుడు వాయ్వగ్ని పాతము వలన మృతి సంభవించును. పాప గ్రహములు అయిదు తొమ్మిది స్థానములలో ఉన్నచో శుభ గ్రహముల దృష్టి లేనపుడు బంధనముచే ఆయసాదులచే మృత్యువు సంభవించును. పాప గ్రహములచే కూడియున్న చంద్రుడు స్త్రీరాశిలో ఉన్నపుడు, శుక్రుడు సప్తమి స్థానమున ఉన్నపుడు సూర్యుడు మేషమున కాని, లగ్నమున కాని ఉన్నపుడు స్త్రీ వలన ఇంట్లో మరణము సంభవించును. కుజుడు కాని, సూర్యుడు కాని నాలుగవ స్థానమున ఉన్నపుడు శని రాశ్యంశలోకాని త్రికోణ స్థానములో కాని ఉన్నచో పాప గ్రహములతో కలిసి క్షీణ చంద్రుడు ఉన్నపుడు, సూర్యుడు నాలుగవ స్థానమున ఉన్నపుడు, క్షీణ చంద్రునిచే కుజుడు చూడబడినపుడు సమిధలచే మరణించును. క్షీణచంద్రుడు, అంగారకుడు, శని, సూర్యుడు కలిసి ఉన్నచో రంధ్రాదులతో జలాదులతో మృతి సంభవించును. మొదటి స్థానమున, రెండు మూడు స్థానములలో పైన చెప్పబడిన గ్రహములున్నచో లగుడముచే మృతి సంభవించును. పొగచే, గడ్డపార మొదలగు పరికరములచే మృతి సంభవించును. బంధు స్థానమున, అస్తగునిగా, మొదటి స్థానమున కుజుడు సూర్యుడు శని ఉన్నచో, శస్త్రములచే అగ్నిచే, రాజులచే మృతి చెందును. శని, చంద్రుడు, కుజుడు, స్వస్థానమున జలస్థానమున మొదటి స్థానమున సూర్యుడు, నాలుగవ స్థానమున కుజుడున్నచో వాహనము నుండి పడుటవలన మరణము కలుగును. కుజుడు అస్తంగతుడై, క్షీణచంద్రునితో కలిసి ఉన్నచో యంత్రాదులచే మృతి చెందును. కుజుడు, శని చంద్రుడు తుల మేషమకర కుంభములలో ఉన్నచో, క్షీణచంద్రుడు సూర్యుడు, కుజుడు లగ్నమున, అస్తంగతుడుగా, జలస్థానమున ఉన్నచో వారజనము చేతిలో మృతి సంభవించును. క్షీణ చంద్రుడు బలయుతుడు అగు కుజునిచే చూడబడినపుడు శని ఏడవ స్థానమున ఉన్నపుడు గుప్త రోగములచే, కృములచే, శస్త్రములచే, అగ్నిచే దారువుచే మరణము సంభవించును అని అంగిర మహర్షి చెప్పెను. శని సూర్యుడు అస్తగంతులైనపుడు, శని ఏడవ స్థానమున ఉన్నపుడు క్షీణచంద్రుడు భూస్థానమున ఉన్నపుడు, లగ్నమున, పదకొండవ స్థానమున, అస్తంగతునిగా మొదటి స్థానమున సూర్యుడు, చంద్రుడు, కుజుడు, చంద్రుడు ఉన్నచో పర్వత శిఖరముల నుండి పడుటచే మరణము సంభవించును. దృక్కోణములలో, నాలుగవ స్థానములలో ఆ అధిపతులున్నచో వారిలో బలవంతుడగు గ్రహ ప్రభావమువలన తన గుణముల వలననే తాను మరణించును. లగ్నాంశమునకు అధిపతి దృష్టిపడు స్థానమున ఉన్నచో యోగేక్షణ లచే మృతి చెందును. అస్తంగతాంశలో ఉన్న గ్రహము అశుభగ్రహములచే చూడబడినచో రెండు రెట్లు కీడు సంభవించును. శుభగ్రహములచే చూడబడినచో మూడురెట్లు మేలుజరుగును. ఇతర విషయములను తమతమ బుద్ధిచే ఊహించుకొనవలయును. మృత్యు స్థానమున గ్రహములున్నచో అగ్నిజల భస్మ, క్లీద, శోష, సర్పాదులచే మృతి సంభవించును. గ్రహములున్న రాశ్యంశములను బిందు మాత్ర స్థానమునుకూడా పరిశీలించి బుద్ధి వైభవముచే ఫలితమును చెప్పవలయును. అష్టమ స్థానమున గురువుకాని, శుక్ర చంద్రులు, సూర్య అంగారకులు, శని బుధులు కాని ఉన్నచో నరకమును కలిగించును. సూర్య చంద్రాది గ్రహములు బలవంతులతో కూడి ఉన్నపుడు అంశాధి పతులతో కూడి ఉన్నపుడు శ్రేష్ఠ, సమ, అధములు అగుదురు. గురువు ఏడవ స్థానమున ఉన్నచో రిపు స్థానమును కేంద్ర స్థానమును నశింపచేయును. బృహస్పతి ఉఛ్చలో ఉన్నపుడు, పన్నెండవ స్థానమున బుధాంశ ఉన్నచో ఇతర గ్రహముల బలము కూడా ఉన్నపుడు మోక్షము సంభవించును.

గర్భాధానము పుట్టుక తెలియనపుడు లగ్నమును బట్టి చెప్పవలయును. లగ్నము యొక్క పూర్వార్ధా పదార్ధములు సౌమ్యముగా ఉన్నపుడు ఫలములు చెప్పవలయును. లగ్న త్రికోణస్థానమున అయిదవస్థానమున బృహస్పతి త్ర్యంశములతో వికల్పావ యవములు సమముగా ఉండును. సూర్యుడు గ్రీష్మగతుడైనపుడు ఇతరులు శుభస్థానగతులై నపుడు, సూర్యరాశి నుండి చంద్ర బుధ బృహస్పతుల ఆవృత్తులతో ఒక ఫలితము, శుక్ర కుజ శనుల ఆవృత్తిచే మరొక ఫలితము సంభ వించును. దృగ్గణితమును అనుసరించి కుజాదులచే పూర్వమాస తిథులను అనుపాతమువలన తెలియనగును. విలోమ జన్మ భాగములచే కాలమున రాత్రిపగలు అను సంజ్ఞలు ఏర్పడును. త్రికోణ ఉత్తమ వర్గలను అనుసరించి లగ్నమును లగ్నాంశములను గుర్తించవలయును. లగ్నము నుండి చంద్రుడెంత తక్కువగా నుండునో, అంత చంద్రుని నుండి తక్కువగా లగ్నరాశిని చూడ వలయును. 1, 11 స్థానములు, సరి స్థానములు, అష్టమరాశులు, క్రియాజనము, మకర కన్యలు 10, 8, 7 విషయమున స్వ సంఖ్యచే శేషమును గుణించవలయును. గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఆఘవా ద్యాయరములందు బుధునివలె అగును. రాశులకు నిత్యవిధి ఉండును. గ్రహముల వశము వలన అర్థగణములు ఏర్పడును. ఏడుచే కొట్టివేయబడిన దానిని పన్నెండుచే భాగించగా మిగిలిన దానిని నక్షత్ర సంఖ్యచే నవ, ద్వి సంఖ్యలచే ఋణముగొని రెండుచే భాగించగా సంవత్సర, ఋతు మాసములు ఏర్పడును. ఎనిమిదిచే కొట్టివేయగా పక్షములు తిధులేర్పడును. అయిదుచే భాగించగా పగలు రాత్రులు వచ్చును. గోంశాష్టము హోరలు అగును. కృష్ణ వర్ణుడు పరశుధారి అగు పురుషుడు, రక్తనేత్రుడు రక్షణకు సమర్థుడు. స్త్రీ అయినచో హృష్టర్తి. సపాదములు గలది. అశ్వము కలది, రక్తవస్త్ర, ఘటాకారము కలదిగా ఉండును. కపిలుడు అంధ దృష్టి కలవాడు, క్రూరుడు, రక్తవస్త్రుడు, క్షతవ్రతుడు, ఆకలి దప్పులచే అర్హుడు, తెల్లని వస్త్రములు కలవాడు, ఖండించబడిన పొట్టి వెంట్రుకలు కలవాడు, మలినుడు, క్షత్పరుడు, అజముఖుడు, కృష్యాది కర్మలలో దక్షుడు. ఏనుగువంటి శరీరము కలవాడు, సరభయము వలన పింగళ వర్ణుడు, వ్యాకులమైన మనసు కలవాడుగా పురుషుడు ఉండును.

శౌచము కలది, రూపవతి, సాధ్వి, సంతానములేనిది, బలిసియున్న చేతులు కలదిగా నుండును. కవచమును ధనువును ధరించి నరుదాననముతో ఉద్యానమున క్రీడేచ్ఛ గలవాడు నృత్యాదులు తెలిసనవాడు, వరుణుని వలె బహురత్నములు కలవాడు, ధనుర్ధరుడు, ఏనుగు ముఖము, కంఠము కలవాడు, క్రోధముఖముకలవాడు, అరణ్యమునందు శరములచే వేటాడువాడు, పలాశశాఖను ధరించువాడు. శిరస్సు సర్పమువలె కఠినముగా ఉండునది, చపలాస్యుడు, సంవీతుడు, నౌకలో ఉండువాడు, స్త్రీ కొరకు జలము పయనించువాడు. సారమేయము లేదా నరుడు జంబుకమును, గద్దను తీసుకొని బూరుగు వృక్షము మీద నిలుచుని అరుచువాడు, ధనుర్ధారి, కృష్ణాజినమును ధరించువాడు, సింహమువలె అశ్వమువలె గంభీరుడు, ఉన్నతుడు, ఆర్తుడు, ఫలా మిషములను హరించువాడు, కూర్చను ధరించువాడు, భల్లాస్యుడు, వానర చేష్టలు కలవాడు, స్త్రీ అయినచో పూలునిండిన బుట్టను ధరించునది, కన్య, మలినాంబరధారిణిగా తెలియ వలయును. పురుషుడైనచో ధనుర్ధారి, వ్యయమును తొలగించువాడు, శ్యాముడు, లిపికారుడు, ఆరామమును చేయువాడు, నరుడు. స్త్రీ అయినచో గౌరి, శుభ వస్త్రముకలది, మద్యశాలలో కుంభహస్త, అభిమానమును తొలగించువాడు, పాపిష్ఠుడు, భాండమును తాచువాడు, చింతకుడు, ఆకలిదప్పులు కలవాడు, మంభీ, గృధ్రాస్యుడు, స్త్రీ సుతోపగుడు, ధనుర్ధారి, కింకరచేష్టుడు, బంగారు కవచము కలవాడు, మృగముల వెంటవెళ్ళువాడు, సముద్రమున అరుచుచు వెళ్ళు స్త్రీ నానాసర్పహస్త, సౌఖ్యమునందు అభిలాష కలది, శరీరమును కప్పుకొనునది, కచ్ఛప ఆకారము కలది, మార్మాస్యుడు, మలయ పర్వతమున సింహము, శునక వరాహ మృగములకు భయమును కలిగించువాడు, వ్యాసుడు, శునక శరీరుడు, ధనుర్ధారి, తాపసు యజ్ఞములను రక్షించువాడు, చంపకము వంటి ఆసన మధ్యమున నుండునది, నదులను వృద్ధి పొందించునది, కూర్చాసనమున చంపక కాంతి గలవాడు, దండధారి, కౌశేయమును ధరించువాడు, ఉత్తముడు, గృధ్రముఖుడు, తైలమును మద్యమును సేవించుటలో అభిలాష కలవాడు, కాలిన బండిలో ఉండునది, లోహమును ధరించునది, భూషణ ములు కలది, భాండమును ధరించుచు తిరుగునది, భాండము కలది, రోమములుకల చెవులు కలది, శ్యాముడు, కిరీటము కలవాడు, ఫల యంత్రమును ధరించువాడు, నౌకలో ఉండువాడు, భుజములను అలంకరించుకొనుటకు నానా రత్నములను చేతులలో ధరించి ఉన్నవాడు, పడవలో ఉండిన సముద్రతీరమునకు వచ్చుచు, సైన్యముతో కూడి ఉన్నది, చంపకముఖి, గోతిలో సర్పములచే చుట్టబడి ఉన్నవాడు, నగ్నుడు, చోరులచే అగ్నిచే బాధించబడి ఏడ్చువాడు, అని పైన చెప్పబడిన ఈ ముప్పదియారు క్రియాంశలు క్రమముగా ఫలితములుగా ఉండును. ఓ మునీశ్వరా ! ఇది జాతకము. సంక్షేపముగా చెప్పితిని. లోక కృత్యములకు ఉపయోగించు సంహిత భాగమును ఇక తెలుసుకొనుము. (2/55)