నారద మహా పురాణము
రాధాది మంత్ర నిరూపణము
సూతమహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు దేవ జ్ఞానముగల నారదుడు, అన్ని అవ తారముల యొక్క మంత్ర ధ్యాన పురస్సరముగా పూజా విధానమును విని సర్వాధి దేవత జగన్మాత అగు రాధాదేవి యొక్క అవతార కళాసమర్చనమును వినయముతో నడిగెను.
నారద మహర్షి పలికెను: ఓ మునిసత్తమా? జగన్మాతల మంత్ర వైభవమును విని నేను ధన్యుడనైతిని. అనుగ్రహించబడితిని. లక్ష్మి మొదలగు అవతారములను చెప్పిన విధముగా రాధా అవతారములు వైభవమును వినగోరుచున్నాను. ఎన్ని అవతారములు? ఏ ఏ రూపములు? ఎంత ప్రభావములు కలవి? ఆరాధా అవతారములను అన్నింటిని అశేష సిద్ధి ప్రదములను తెలుపుము. అని అడుగగా నారద మహర్షి పలికిన మాటలను వినిన బ్రహ్మ పుత్రుడగు సనత్కుమార మహర్షి రాధాపాద పద్మములను ధ్యానించి ఇట్లు పలికెను.
సనత్కుమార మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! పరమ రహస్యమగు, సేవించువారికి ఇష్టప్రదమగు రాధావతార చరితముల చెప్పెదను వినుము. రాధాదేవికి చంద్రావతి, లలిత అను ప్రియసఖులు ఇరువురు. మాలావతిమొదలగు ఎనిమిదిమందికి చంద్రావతి అధీశ్వరి. కళావతీ మొదలగు ఎనిమిది మందికి లలిత అధీశ్వరి. రాధాదేవి పూజా ప్రకరణమున మాలావతీ మొదలగు వారి నామములను చెప్పితిని, కళావతీ మొదలగు వారి నామములను ఇప్పుడు చెప్పెదను. కళావతి, మధుమతి, విశాఖ, శ్యామల శైబ్య, బృంద, శ్రీధరా అనువారలందరు లలితా సమరూపులు. సుశీల మొదలగు వారు మరికొంతమంది ముప్పదిరెండు మంది చెలులు చెప్పబడిరి. ఇప్పుడు వారి పేర్లను చెప్పెదను వినుము. సుశీల, శశిలేఖ, యమున, మాధవి, రతి, కదంబమాల, కుంతీ, జాహ్నవీ, స్వయంప్రభ, చంద్రానన, పద్మముఖీ, సావిత్రి, సుధాముఖి, శుభా, పద్మ, పారిజాత, గౌరిణి, సర్వమంగళ, కాళిక, కమల, దుర్గ, విరజ, భారతీ, సురా, గంగా, మధుమతి, సుందరీ, చందూ, సతీ అపర్ణా, మనసానందా, అనువారలు ముప్పది రెండు మంది రాధికా ప్రియ సఖులు, ఒకప్పుడు లలితాదేవి పుంరూపమును ధరించి కృష్ణరూపము గలదై పదునారు కలలను సృజించెను. వారందరు లలితాసమకాంతులు. వారి మంత్రమును, ధ్యానమును, యంత్రఅర్చాది క్రమమును సర్వతంత్ర రహస్యమును చెప్పెదను వినుము. వాతము, మరుత్తు, అగ్నివహ్నులు, ధరాక్ష్మలు, జలచారిణులు, విముఖము, చరశుచి విభువన స్వశక్తులు, స్వరములు, ప్రాణము, తేజస్సు, స్థిర, వాయువు, ప్రభజ్యకు అభ్రవాదములు, దావకము, పాధము, వ్యోమరయము, శిఖి, గోత్రములు, తోయము, శూన్యజవీద్యుతి, భూమి, రసము, నమస్సు, వ్యాప్తము, దాహము, రసాంబు, వియత్ స్పర్శము, హృదయము, హంస, హలాద్రాసము, హలాత్మికలు, చంద్రావలి లలితా అనువారలు హంసేలలు నాయికలు. స్వయముగా శక్తి స్వరూపిణి అగు రాధ స్వయముగా గ్రాసస్థిత. మిగిలినవారు పదునారుకళలు. వారి కలలు ముప్పది రెండుమంది. వీరిచేతనే సకల వాఙ్మయము వ్యాపించి ఉన్నది. లలితా ప్రముఖులు షోడశత్వమును పొందిరి. శ్రీరాధా సుందరీదేవి తాంత్రికులచే చెప్పబడినది. కురుకుల్ల వారాహి చంద్రాలలితలు ఇద్దరు. వారిద్దరు కలిసియున్న మంత్రవర్గమును నీకు ఇపుడు చెప్పెదను. హృత్పాణ ఇలా హంస దాహవహ్ని స్వములచే లలిత చెప్పబడినది. హంస భేదముచే త్రివిధము యథాక్రమముగా ఆ భేదములను వినుము. మొదటిది హంసాద్యముచే ఉండును. మధ్యమము ఆదిమధ్యస్థ హంసచే ఏర్పడును. మూడవది ప్రకృతి. నాలుగవది. అంత్యమాయచే ఏర్పడును. ఈ నలుగురిలో నాలుగవది ముక్తికి, మిగిలిన ముగ్గురు సంపద కొరకు చెప్పబడిరి. ఇట్లు త్రిపుర సుందరీ విద్యలను చెప్పితిని. దాహభూమి రసాక్ష్మ స్వములచే వశినీ బీజము చెప్పబడినది. రసాశక్తియుతమగు ప్రాణము కామేశ్వరీ అక్షర మంత్రము, శూన్యము అంబురసా వహ్నిస్వములచే యుక్తము మోహినీ మంత్రము. రసాక్ష్మాస్వయుతముగా వ్యాప్తము అగునది. విమలాబీజము. జ్యానభోదాహ వహ్ని స్వయోగములచే అరుణామంత్రము. జయినీ మంత్రము అంతట జయప్రదము. నభోదాహ సహితమగు జలము వ్యాప్తక్ష్మాస్వయుత మంత్రము సర్వేశ్వరి సర్వసిద్ధికరముగా చెప్పబడినది. నభోదాహవహ్నిస్వయుతమగు గ్రాసము కౌలినీ మంత్రము. ఇట్లు వర్గ సంయుతములగు శక్తులుగల ఎనిమిది మంత్రములచే వాగ్దేవతాంతముగా న్యాసముచేసిన దేవ్యాత్మకము అగును. రంధ్రమున, ఫాలమున, ఆజ్ఞయందు, గళమున, హృదయమున వ్యాసము చేయవలెను. నాభియందు ఆధారమునందు, పాదద్వయమున మూలాగ్రావధిగా షడ్డీర్ఘాఢ్య బీజముచే షడంగ న్యాసము చేయవలెను. లోహితవర్ణ, బాణా చాప పాశసృణులను కరములచే ధరించిన, కామ రాజాంక యంత్రిత, ముదితయగు లలితను ధ్యానించవలెను. మధ్యస్థదేవి ఒక్కతే షోడశ ఆకారములచే ఉండును. కావున ఆ దేవి శరీరము నందే మిగిలిన పదిహేను మందిని అర్చించ వలెను. శిబషి, లలితాదికలు దేవతలు. నిత్యములగు అందరి నామ సంచయమున అవృతులను, పదమున చేయు ప్రయోగములను ముందు సవిస్తరముగా చెప్పెదను.
ఇప్పుడు షోడశ సఖీ సముదాయమున రెండవదియగు కామేశ్వరి అను దేవతను సర్వకామ ప్రదనుగూర్చి చెప్పెదను వినుము. స్వయుతమగు శుచి మొదటిది. లలిత రెండవది. అగ్నియుతమగు శూన్యము తరువాత రయోవ్యాప్త సంయుతము. రసాగ్ని సహితమగు ప్రాణము చరాన్వితమగు శూన్యయుగ్యము. వీటి దాహముచే సమయోజితమగు నభో గోత్రములు చరసంయుక్తమగు అంబు, నవశక్తియుతమగు హృదయము. ఇదియే నిత్యమగు రామేశ్వరి. సర్వకామప్రదా ఏకాదశాక్షరి. మూల విద్యాక్షరములచే క్రమముగా అంగకల్పన చేయవలెను. హృదయమును శ్లోకమును ఒక దానితో, ద్వయము వలన ద్వయమును, నాలుగింటితో నయనమును, ఒకటితో అస్త్రమును కల్పించ వలెను. నేత్రశ్రోత్రనాసికా జిహ్వా హృదయగుహ్యకములందు మూర్థాది పాదపర్యంతము సర్వాంగములందు వ్యాపక ముచే విద్యాక్షరములను ఈ స్థానములందు ఉంచవలెను. తరువాత ఉక్త క్రమముచే సమస్తముచే వ్యాపకము నాచరించవలెను. ఇక ఇప్పుడు నిత్య పూజలలో చెప్పబడిన న్యాసమును చెప్పెదను. ఈ ధ్యానముచే కామేశ్వరీదేవి ప్రసన్నురాలై అప్రయత్నముగా ఇష్టములను ఇచ్చును. ఈ కామేశ్వరీ దేవి బాలార్కకోటి సంకాశ, మాణిక్య ముకుటోజ్జ్వల, హారగ్రైవేయ కాంచీ ఊర్మికా నూపురాదులచే అలంకరించ బడినది, రక్తవసన, రత్నాభరణ శోభిత, షడ్భుజ, త్రినయన, ఇందు కలాకలిత మౌలిక, పంచాష్ట షోడశ ద్వంద్వ షట్కోణ చతురస్రగత, మందస్మితలసద్వక్త్ర, దయామంధర వీక్షణ, పాశాంకుశ పుండ్రేక్షు చాప పుష్పేషు ధారిణి, సీధు పూర్ణరత్న పాత్రను, వరదమును ధరించినది అగు దేవిని ధ్యానించవలెను. తరువాత సాధకుడు మంత్రమును సిద్ధించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును.
భగమాలిని అయను పేరుకల మూడవ దేవతను చెప్పెదను. కామేశ్వర్యాది అది అగును. రసము అపస్థిరరసము. చర సహితమగు ధరాయుక్కు తరువాత స్థిర. తరువాత రసము. అగ్ని సంయుక్తములగు స్థిరాశూన్యములు. తరువాత రసము భూ సమిత అగు స్థిర. గోత్ర. సదాహము అగు అగ్నిరసము. స్థిర మరుద్యుక్తమగు నభస్సు, రసవర్ణ సమన్వితము. తరువాత రసము, స్థిర. తరువాతి మరుద్యోజితము హంసచరమగు అంబు మరల రసము. మరల స్థిర, ధరాన్వితమగు స్థిర. చరమగు వ్యాప్తముచే హంసము. రసము. స్థిర వ్యాప్తము. భూయుతమగు శూన్యము. అగ్ని యొక్క రసయుతము. తరువాత హృదయము హంసరసము. స్థిరాంబు. స్వయుతమగు వియత్ ప్రాణము. అగ్ని యుగ్దాహము రసము. స్థిర, క్షమ దాహ సంయుతము. సచరమగు జవీ పూర్వ విద్య. తృతీయాది నుండి క్రమముగా నుండును. తరువాత వర్ణ చతుష్టయము రసము స్థిర. అంబుయుక్ హృదయము క్ష్మా దాహము సచరము. జవీ హృదయము, దాహము అంబు మరుద్యక్తము వ్యోమమున అగ్ని రసయుతము. మద్యుక్తమగు స్థిర, సాగ్నికభశ్చరములగు శూన్యము. వ్యాప్త మరుద్యుక్తమగు హంస. శూన్యము. వ్యాప్తమగు అంబువు. దయము. చరసమన్వితములగు దాహ రయములు. రసము స్థిరము ప్రాణము. రసాగ్ని సహితమగును. చరయుతమగు శూన్య యుగ్మము. మరల శూన్యయుగ్మ గోత్రవ్యసి దాహమరుద్యుక్తకాంబువుచే చరము. ప్రాణము, రసాచరయుతము గోత్రర్యసి దాహమరుద్యుక్త గోత్ర. ఇది అంబున్యాసము. భూ యుక్తము అంబురహితము. చర సమన్వితము ధరాయుత గ్రాసము. శక్తి సమన్విత రసము. భూ సమిత గ్రాసము. వ్యాప్త రసము హృదయము. అంబు రహిత దాహము హృదయము అంబుమరుదన్విత రయము. కేవల శూన్యము రసము. సుచర స్థిర. అంబుయుత వియత్, అగ్నియుగ్దాహము. సయుతశుచి భూమి రసక్ష్మాస్వయుత ఇవన్నియు పంచైకాంతరితములు స్వసంయుక్తములు అయిదు. ఇవి అన్నియు క్రమముగా జ్యాస చరమగు రసము భూమి నభోయుతము. చరయుత హంస రెండుమార్లు తరువాత ప్రాణమ రసాగ్ని యుతము. చరయుతమగు శూన్యయుగ్మము. చిరయుతమగు హృదయము. దాహాంబు మరుద్యుతము. హోమాగ్ని సహిత రసము. మరుద్యుత స్థిర. సాగ్ని నభోయుత శూన్యము. చర సహితము. అంబునియత్తు. మరుదన్వితమగు నభస్సు. శూన్యము, వ్యాప్తము చరయుక్తము దయ దహ స్వవహ్నులచే సదాహమగు హంస అంబురసములు చరస్వములతో సంయుత మగును. సదాహ వహ్ని స్వయుక్తమగు హంస అంత్యముగా చెప్పబడినది. నిత్యయగు సౌభగమాలికా నూట ముప్పది యేడు ఏక్షరములచే ఉండును. మంత్ర వర్ణములచే అంగన్యాసము చేయవలెను. ఆద్యముచే హృదయము. నాలుగింటిచే శిరస్సు, మూడింటిచే శిఖ, గుణ వేదాక్షరములచే శిష్టాంగములు ఆరు క్రమముగా న్యాసము చేయవలెను. అరుణ, అరుణాకల్ప సుందరి, సుస్మితానన, త్రినేత్ర, షడ్బాహు యుక్త, కమలాసనము కహ్లార పాశ పుండ్రేక్ష కోదండము లను వామ బాహువులందు ధరించి, దక్షిణ బాహువులచే పద్మమును, అంకుశమును పుష్ప బాణములను ధరించి ఇట్టిశక్తులచే చుట్టూకూడుకొని ఉన్నది, స్తుతించబడుచున్నదై, ఇరాక్షరోక్తములచే స్మరోన్మాద మదాత్మలచే కూడియున్నది. ఇట్లు జనమోహినియగు తృతీయ దేవత చెప్పబడినది. ఇక ఇపుడు నిత్యక్లిన్న అనబడు నాలుగవ దేవతను చెప్పెదను వినుము.
దాహవహ్ని స్వయుక్తమగు హంస మొదట చెప్పబడినది. కామేశ్వరి యొక్క తృతీయాది వర్ణాష్టకము ఉండును. మరుద్యుక్తమగు హృదయము అంబువు ఏకాదశాక్షరి. విద్యా వర్ణములచే అంగకల్పనము చేయవలెను. ఆద్యమంత్ర వర్ణముచే హృదయ న్యాసమును, రెండు రెండు వర్ణములచే శేషాంగ న్యాసమును చేయవలెను. అంగుష్ఠ మూలాది నుండి కనిష్టాగ్రాంతము ఊర్ధ్వగముగా న్యాసమును చేయవలెను. మిగిలిన దానిని వలయమున న్యాసముచేసి, హృదయ నేత్ర శ్రోత్ర నాసికా ద్వయమున, చర్మమున ధ్వజమున, పాయువున, పాదముల యందు వర్ణ న్యాసమును చేయ వలెను. అరుణ, అరుణాకల్ప, అరుణాంశుకధారిణి, అరుణమాల్యానులేపన, చారుస్మిత ముఖాంబుజ, నేత్ర త్రయలసదాస్య, ఘర్మ జలముక్తా శోభిత ఫాలభాగ, మకుట అసదర్ధేందుశేఖర, బాహు చతుష్టయముచే పాశాంకుశ పాన పాత్రాభయ ధారిణి, పద్మాసనాసీన, మదాలస, అగు నిత్యక్లిన్నను ఇట్లు ధ్యానమును చేయవలెను. ఇట్లు నిత్య క్లిన్ననుగూర్చి చెప్పితిని. వనిత నవనీత దావాగ్ని, జయాదిచే స్వయుక్త భూమి దాహయుక్తమగు ప్రాణము, రసము, తద్యుక్త ప్రభ, దాహయుక్త జ్యా, తుద్యుతమగు నిత్యక్లిన్నాంత గద్వయము. ఇది నవాక్షరీ నిత్యా సర్వసిద్ధిప్రదయగు భేరుండా, ప్రణవమును ఠద్వయమును వదిలి మధ్యలో నున్న షడక్షరములచే షడంగన్యాసముచేసి తరువాత వర్ణన్యాసమును చేయవలెను. ముఖ, కంఠములందు రంధ్రాద్యములు హృదయనాభులచే ధారయ ద్వయమును మాతృకాన్యాస పూర్వకముగా మంత్రాక్షర నవకన్యాసమును చేయవలెను. ఇక ఇపుడు సర్వార్థసిద్ధి ప్రదమగు దేవీ ధ్యానమును చెప్పెదను. తప్త కాంచన సంకాశ దేహ, నేత్ర త్రయాన్విత, చారుస్మిత, చిత్రముఖి, దివ్యాలంకార భూషిత, తాటంకహార కేయూర రత్నస్త బక మండిత, రసనా నూపురోర్మ్యాది భూషణ రమ్య, పాశాంకుశ చర్మ ఖడ్గ గదావహ్ని ధనుశ్చర ధారిణి, పద్మాసనస్థ తత్స మానాకార తేజోహేతి సంయుతలగు శక్తులను కూడా భేరుండా దేవితో బాటు పూజించవలెను. ఈ శక్తులే విజయాదికలు. ఇట్లు పంచమీ దేవిని గూర్చి చెప్పితిని. ఈ దేవిని స్మరించినంతనే త్రివిధ విషములు నశించును. ఇక ఆరవదగు వహ్ని వాసినీ విధానమును సుసిద్ధి ప్రదమును చెప్పెదను.
ఈ మంత్రమున భేరుండాద్యము అద్యమగును. తరువాత నిత్యక్లిన్నాద్యము ఉండును. తరువాత అంబు శూన్యమున హంసాగ్ని ఉత్తమాంబు మరుద్యుతము. హృదగ్నియుత శూన్యము వ్యాప్తముచే శుచిచే యుతము. శూన్యము. ఇది నవాక్షరి. ద్వితీయ బీజముచే విద్యాస్వరములను దీర్ఘములను నియోగించవలెను. మాయాంతములను ఆరింటిచే కారంగన్యాసమును చేయవలెను. విద్యా నవ అక్షరములను నవ రంధ్రములందు న్యాసము చేయవలెను. సమస్తముచే వ్యాపకమును ఆత్మసిద్ధి కొరకు చేయవలెను. అన్ని విద్యలందు వ్యాపకములను ఆచరించవలెను. తరువాత కాంచన, సంకాశ, నవయౌవన సుందరి, చారుస్మేర ముఖాంభోజ, నయనత్రయ శోభిత, అష్ట బాహుయుత, మాణిక్యాభరణోజ్జ్వల, పద్మరాగ కిరీటాంశు సంభిన్నారుణి తాంబర, పీతకౌశేయ వసన, రత్నమంజీర మేఖల, రక్త మౌక్తిక సంభిన్న స్తబకాభరణోజ్జ్వల, రత్నాబ్దకంబు పుండ్రేక్షు చాప పూర్ణేందు మండలధారిణి, కహ్లారహేమ శృంగ పుష్పేష మాతులుంగములకు దక్షిణ కరములచే ధరించునది. స్వస్వ వామ శక్తులచే చుట్టుముట్టి యున్న వహ్ని విగ్రహయగు వహ్నివాసినిని ధ్యానించవలెను. ఇట్లు వహ్నివాసినిని ధ్యానించినచో జగత్తు వశమగును.
ఇక ఇప్పుడు సాధకులకు సిద్ధి ప్రదమగు ఏడవదగు మహా వజ్రేశ్వరీ మంత్రమును చెప్పెదను. వహ్నివాసినీ మంత్రములోని ద్వితీయమును నిత్యక్లిన్న మంత్రములోని చతుర్ధమును, భగమాలా ద్యమును పంచమును, భేరుండా మంత్ర ద్వితీయమును, నిత్యక్లిన్నా ద్వితీయమును, షష్ఠ సప్తములు చేసి షడంగ న్యాసమును చేయవలెను. ప్రత్యేకముగా శక్తి పుటిత మంత్రవర్ణములు పదింటిచే న్యాసమును చేయవలెయును. నేత్ర శ్రోత్ర నాసా వాగ్వక్షో నాభిగుహ్యములందు క్రమముగా న్యాసము చేయవలెయును. తరువాత రక్తవర్ణ, రక్తాంబర, రక్త గంధ మాల్య విభూషణ చతుర్భుజ, త్రినయన, మాణిక్యమకు టోజ్జ్వల, పాశాంకుశేక్షుచాప దాడిమి శాయక ధారిణి, దయా సుప్రీత శీతల నేత్ర, సాధకమగు అస్త్ర షట్కోణాబ్జ మహీపురమున చక్రమధ్యమున సుఖాసీన, స్మితాస్య, స్వస్వ రూపము లుగల శక్తులచే పరివృత, పీత మధ్యగత, సింహాసనమున అంతట పోతస్థ శక్తులచే పరివృత, ఆ శక్తులచే యాతాయాత వినోదములకు చేయుచుండునది, అరుణాం భోధి యందు మంత్ర నాయక మును చింతించవలెను. ఇట్లు సప్తమీ విద్యను చెప్పితిని. ఇక అష్టమీ విద్యను వినుము.
ఆద్యము వజ్రేశ్వర్యాద్యము, ద్వితీయము అగ్నియుతము. మరుద్యుక్తాంబు క్ష్మాసం యుత గోత్రా వ్యాస శుచియుతమగు రయము. వహ్నివాసిని దూతి అత్యార్ణ అని చెప్పబడినది. షడ్దీర్ఘ స్వరయుక్తముచే విద్యాషడంగ కల్పన చేయవలెను. విద్యాపుటితార్జములచే శ్రోత్రాది పంచకమున న్యాసమును గావించవలెను. అరవ దానిని నాసిక అందు, విద్యతో వ్యాపకన్యాసమును చేయవలెను. నిదాఘ కాల మధ్యాహ్న దివాకర సమప్రభ, నవరత్న కిరీట, త్రినయన, అరుణాంబర, నానాభరణ సంభిన్నదేహ కాంతి విరాజిత, శుచిస్మిత, అష్టభుజ, మహర్షి స్తూయమాన, వామ బాహువులచే పాశఖేట నదాపద్మరత్న చషకములను, దక్షిణ బాహువులందు అంకుశ ఖడ్గ కల్హార కమలములను ధరించునది, సాధకాభీష్ట దానోద్యమ సమన్విత, దుర్నీతి నాశినియగు దేవిని ఇట్లు ధ్యానించి పూజించ వలెను. ఇట్లు నీకు నమస్తాపన్నివారిణి శ్రీకరి, శివతావాసకారిణి, సర్వార్థ సిద్ధిదయగు దేవీ మంత్రమును చెప్పితిని.
ఇక ఇపుడు నీకు నవమి నిత్య త్వరిత నామముగల దేవిని గూర్చి చెప్పెదను. ఈ దేవి యశోవిద్యా ధనారోగ్య సుఖప్రదాయిని. ఆద్యము వహ్నివాసి న్యాది. ద్వితీయము దూత్యాది. హంస, ధరా, స్వయంయుక్తము చరసమన్విత తేజస్సు, ప్రభాచరయుత గ్రాసశక్తి సమన్విత వాయువు, హృదరయ దాహములచే వహ్నిస్వములు అష్టమము ఖక్ష్మాయుత హంస, చరయుత గ్రాసము ద్వితీయము. నాదయుత ద్వితి. నిత్యా త్వరితా ద్వాదశాక్షరి. చతుర్థవర్ణాది సప్తాక్షరములచే ఏర్పడు విద్య ఇది. యుగ్మ వర్ణములచే కరాంగములందు అంగన్యాసమును చేయవలయును. శిరోలలాట కంఠములందు, హృన్నాభ్యాధారకము లందు, ఊరుద్వయమున, జాను ద్వయమున, జంఘా ద్వయమున, పాదయుగ్మమున మంత్రాక్షరములను న్యాసమును చేయవలెను. ద్వితీయోపాంత్య మధ్యస్థ మంత్రాక్షరములచే, ఇతరములగు తారాద్యములచే న్యాసమును చేయవలెను. ఇక ఇప్పుడు సర్వసిద్ధి విధాయకమగు ధ్యానమును వినుము. శ్యామవర్ణ శుభాకార, నవయౌవన శోభిత, ద్వి ద్విక్రమముచే అష్ట నాగకల్పితా భరణ ప్రకాశములచే తాటంకాగద నూపుర వస్త్రములచే కూడి ఉన్నది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులచే భీమ విగ్రహులచే ధరింపచేయబడు నది. పల్లవాంశుక సంవీత, శుభములగు శిఖిపిచ్ఛకృత వలయ భూషిత భుజ, మాణిక్య ముకుటోజ్జ్వల, బర్హిబర్హ కృతాపీడ, బర్హి బర్హచ్ఛత్ర, బర్హిబర్హి పతాక, గుంజాగునలసద్వక్షః కుచకుంకుమ మండల, త్రినేత్ర, చారువదన, మందస్మిత ముఖాంబుజ, పాశాంకుశ వరాభీతి లసద్భుజ చతుష్టయయగు తోతలాదేవిని ఇట్లు ధ్యానించి శక్తి పరివృతను పూజించవలెను. ఈ దేవి యందు ఫట్కారి శర చాప కరోజ్జ్వలగా శోభించును. ఫల దానమునచే సాధకులకు త్వరగా అభీష్టప్రదగా ప్రసన్నురాలగును. ఇట్లునీకు నవమీ విద్యా చెప్పబడినది. ఈ దేవి విఘ్న దుస్స్వప్నవారిణి, సర్వాభీష్ట ప్రదాయిని, స్వయుతమగు శుచి అద్యము. వహ్ని సమన్వితయగు రసము. ద్వితీయము ప్రాణము స్వయుతము, వన దుచ్ఛక్తులచే తృతీయము, ఇట్లు త్ర్యక్షరయగు నిత్యకుల సుందరిని చెప్పితిని. ఈ దేవిని స్మరించుటచే సర్వజ్ఞత్వము లభించును. ఇట్లు చెప్పబడిన మూడు వర్ణములచే షడంగన్యాసమును కావించవలెను. ఆది మధ్యావసానములందు పూజా జపవిధి క్రమముచే ప్రత్యేకించి దీర్ఘ స్వర సమన్వితములగు మూడు బీజములచే కరాంగ వక్త్ర వ్యాసమును గావించవలెను. ఊర్థ్వ ప్రాగ్దక్షిణోత్తర పశ్చిమాధోనామముల గల సువినద్యంతరములచే యధాక్రమముగా నదాత్మలందు, ఆధార రంధ్ర హృదయములందు మొదటి దానిని, రెండవ దానిని ఆలోచన త్రయమున, తృతీయమును శ్రోత్ర చిబుకములందు, చతుర్ధమును ఘ్రాణ తాలువులందు, పంచమును అంసనాభులయందు, తరువాత పాణిపాద ద్వయమునందు, నవ వర్ణములచే తొమ్మిది విధములుగా మూల మధ్యాగములచే న్యాసమును గావించవలెను. లోహిత వర్ణ, లోహితాకారశక్తి బృన్ద నిషేవిత, లోహితాంశుక భూషా శ్లేషన, షణ్ముఖాంబుజ, అనర్ఘ్య రత్న ఘటిత మాణిక్యము కుటోజ్జ్వల, రత్నస్తబక సంభిన్న లసద్వక్షః స్థల, శుభ, కారుణ్యానంద పరమ, అరుణాంబుజ విష్టర, ద్వాదశ భుజ సంయుక్త, సర్వ వాఙ్మయి, ప్రవాలాక్ష స్రజ, దక్షిణ భుజములచే పద్మ కుండికా రత్న చషకలుంగీ వ్యాఖ్యాన ముద్రికలను, దక్షిణ బాహువులచే పుస్తకమును, అరుణోత్ఫలమును, సువర్ణలేఖినిని, కంబురవరమును ధరించునది. అంతటా దేవగంధర్వ కిన్నరులచే, యక్షరాక్షన దైత్యర్థి సిద్ధ విద్యాధరాదులచే స్తుతించబడునది యగు దేవిని ఇట్లు ధ్యానించి వార్లక్ష్మీ కాంతి సిద్ది కొరకు పూజించ వలయును. కేవల వాక్సిద్ది కొరకు సితవర్ణను, సంపద కొరకు హేమప్రభను, శత్రు ద్వేషమునకు మృతికి నిగ్రహమునకు ధూమ్ర వర్ణను, మూకీకరణము కొరకు నీలవర్ణను ధ్యానించవలెను. ఆయా కోరికల కొరకు ఆయా వర్ణములుగల దేవిని ధ్యానించవలెను. ఇట్లు నీకు దశమియగు కులసుందరి చెప్పబడినది. నిత్యానిత్యయగు ఏకాదశి త్రికూటను ఇప్పుడు చెప్పెదను.
హృత్ప్రాణ రసాదాహ కర్ణ సమన్వితమగు హంస సంప్రదాయబద్ధముగా కులసుందరిచే యోజితము. నిత్యా నిత్య త్రివర్ణములు గలదీ ఈ మంత్రము. ఆరు కూటాక్షరములచే కూడి ఉన్నది. ప్రతి లోమాది రూపములచే డెబ్బది రెండు భేదములు కలది. ఈ దేవిని సేవించుటవలన నరుడు సుఖవంతుడై ఖేచరుడు అగును. నిగ్రహానుగ్రహ సమర్థుడు అగును. దీర్ఘ స్వర సమేతలగు హంస హృదయములచే షడంగ కల్పన చేయవలెను. క్రమముగా భ్రూమధ్యమున కంఠహృన్నాభి గుహ్యాధారములందు క్రమముగా బిందు యుతములగు విద్యా స్వరములను వ్యాసము చేయవలెను. యధావిధిగా సమస్తముచే వ్యాపకము ఆచరించి, సమస్త సంపత్తి కొరకు సర్వాత్మయగు శివను ధ్యానించవలెను. ఉద్యద్భాస్కర బింభాభ, మాణిక్యముకుటోజ్జ్వల, పద్మరాగకృతాకల్ప, అరుణాంశుక ధారిణి, చారుస్మిత లసద్వక్త్ర షట్సరోజ విరాజిత, ప్రతిముఖమున మూడు కన్నులు కలది, ద్వాదశ బాహుయుత, పాశాక్ష గుణ పుండ్రేక్షు చాపఖేట త్రిశూలములను వామహస్తమున, అంకుశ పుస్తక పుష్పేషు పంకజ నృకపాలాభయములను దక్షిణ హస్తమున ధరించి ఉన్నది అగు దేవిని ఏకాగ్ర చిత్తముచే ధ్యానించవలెను. ఇట్లు ఏకాదశీ విద్యను చెప్పితిని. ఇపుడు ద్వాదవీ విద్యను వినుము. త్వరతోయాంత్యము అద్యమగును. యుతి దోహచరస్వయుక్ హృదయము దాహక్ష్మాస్వయుతము, వజ్రేశీ పంచమము, స్వయుక్త మధురము మధ్యాఢ్యము దశమి పరముగా రసక్ష్మాస్వయుత భూమి, వజ్రేశీ అనునది అష్టమము త్వరితా షడక్షరములు తృతీయము దాహచరస్వయుతమగు ద్యుతి ఈ మంత్రమునకు ఆద్యము. తరువాత నీల పతాకయనునది సప్తదశాక్షరి. ద్విద్విపక్షా సడ్వర్ణములతో మంత్రోతములచే అంగకల్పన చేయవలెను. శ్రోత్రాది నాసాయుగలమును వాక్కుయందు, కంఠమున, హృదయమున, నాభియందు, ఆధారమున, పాద సంధులందు క్రమముగా మంత్రాక్షరములను పదిహేండిటిని న్యాసము చేయవలెను. యథావిధిగా సమస్తముచే వ్యాపకమును ఆచరించవలెను. ఇంద్ర నీలనీభ, భాసన్మణి మౌళి విరాజిత, పంచవక్త్ర, త్రినయన, అరుణాంశుక ధారిణి, దశహస్త, లసన్ముక్తా మణ్యాభరణ మండిత, రత్నస్తబక సంపన్న దేహ, చారు స్మితానన, వామకరముల, పాశ పతాక చర్మ శాస్త్ర చాపవరములను, అంకుశ శక్తి ఖడ్గ బాణా భయములను దక్షిణకరములు ధరించియున్న పద్మవిష్టరాసీన, స్వాకార వర్ణవేషాస్య పాణ్యాయుధ విభూషణములు గల శక్తి బృందముచే పరివృత అగు దేవిని నిత్యార్చనా క్రమమున ధ్యానించవలెను. త్రిషట్కోణయుతమగు పద్మము, దానివెలుపల అష్టపత్ర పద్మము, దాని వెలుపల అష్టాస్రము, భూపురద్వంద్వావృతము తత్పురయుగ్మకము చతుర్ద్వార యుతము, దిక్కులందు శాఖాసమన్వితముగా చేసి నామావృత శక్తిని గణములతో అచట పూజించవలెను. ఇట్లు నీలపతాకిని అయను ద్వాదశ విద్యను చెప్పితిని. నీల పతాకిని సమరమున విజయమును ఖడ్గ పాదుకాంజన సిద్ధులను ఇచ్చునది. బేతాల యక్షిణీ ఖేట పిశాచాదిప్రసాదిని. నిధానబిల సిద్ధాన్న సాధినీ, కామ చోదిత, ఇపుడు త్రయోదశ విద్యను చెప్పెదను వినుము. రసమునథస్సు దాహము వ్యాప్తక్ష్మావన పూర్విక, ఖయుక్తముగా నిత్య యుండును. విజయా ఏకాక్షర. దీర్ఘ స్వర యుక్తములగు విద్యా వ్యంజనములచే చతుష్టయమును, మిగిలిన వాటిచే ద్వయమును, కరాంగములందు షడంగ కల్పన చేయవలయును. జ్ఞానేంద్రియములు అగు శ్రోత్రాదులందు చిత్తమున న్యాసము చేయవలెను. క్రమముగా బిందుయుతములగు అక్షరముల నుంచవలెను. మిగిలిన దంతయు పూర్వమువలెనే ఆచరించవలెను. పంచవక్త్ర, దశభుజ, ప్రతి వక్త్రమున త్రిలోచన, భాస్వన్మకుట విన్యాస చంద్రలేఖా విరాజిత, సర్వాభరణ సంయుక్త పీతాంబర సముజ్జ్వల, ఉద్యద్భాస్వద్భింబ తుల్య దేహకాంతి, శుచిస్మిత, వామబాహువులందు శంఖ పాశ భేటచాప కహ్లారములను, దక్షిణ బాహువులందు చక్రాంకుశ ఖడ్గ సాయకములను మాతులుంగమును ధరించి, ప్రయోగమున భీమదర్శన, ఉపాసనలో అతిసౌమ్య సింహోపరికృతాసన, వాఘ్రారూఢ శక్తులచే పరివృత, సమరమున పూజయందు, ఇతరత్ర సుఖాసన, పూజయందు శక్తులు కూడా సుఖాసనలుగా ఉండువారు, దేవీ సమస్తము సమాకారముఖ పాణ్యాయుధలుగా ఉందురు. చతురస్ర ద్వయము నేర్పరిచి, చతుర్ద్వారోప శోభితముగా, శాఖాష్టక సమోపేతముగా, పూర్వమువలె పూజించవలెను. దానిలోపల వృతయుగ్మాంతరమున అష్టకోణము నేర్పరచి, దానిలోపల షోడశదళ సంయుతమగు పద్మమును ఏర్పరచి, అట్లే అష్టదళపద్మము ఏర్పరిచి, అచట ఆ దేవిని ఆవహించి ఆయా శక్తులచే కూడియున్న దానిని ఉపచారములచే చక్కగా అర్చించవలెను. ఇది త్రయోదశీ విద్య, వాదమున, యుద్ధమున జయప్రద. ఇక ఇపుడు సర్వమంగళ అను పదునాలుగవ విద్యను చెప్పెదను.
హృదయంబున వన యుక్తమగు ఆకాశము నిత్యయగు సర్వమంగళ. ఈ మంత్రము ఏకాక్షరి. ఈ మంత్రముచే సిద్ధిని పొందినవాడు ఖేచరుడగును. షడ్దీర్ఘమూల విద్యను షడంగము లందు న్యాసమును చేయవలెను. ఈ సర్వమంగళను నిత్యము. కనక సన్నిభను, ముక్తామాణిక్య భూషణను, మాణిక్యముకుటను, నేత్ర ద్వయముచే దయా వీక్షణములు కలదానిని ద్విభుజను, పద్మాసనాసీన, అష్టషోడశపత్రోపేతమగు పద్మమున చతుర్ద్వార భూ సద్మయుగ్మకమున, దక్షిణ హస్తమున మాతులుంగ ఫలమును, వామకరముచే నిజ భక్తులకు ధనాదికములను ఇచ్చు దానిని, చుట్టూ స్వసమానులగు శక్తులచే కూడి ఉన్నదానిని, ఇతరులగు డెబ్బది ఆరు అప్సరసలచే కూడి ఉన్నదానిని, ప్రయోగములందు, ఇతరత్ర నపర్యాసక్త శక్తులు కలదానిని ధ్యానించవలెను. ఇట్లు చతుర్దశ విద్యను చెప్పితిని. ఇక పంచ దశ విద్యను వినుము.
హృదంబు వన యుక్తమగు ఆకాశము నిత్య అగు సర్వమంగళ. ఈ మంత్రము ఏకాక్షరి. ఈ మంత్రముచే సిద్ధిని పొందినవాడు ఖేచరుడు అగును. షడ్డీర్ఘాధ్యమూల విద్యను షడంగములందు న్యాసమును చేయవలెను. ఈ సర్వమంగళను నిత్యము. కనక సన్నిభను, ముక్తా మాణిక్య భూషణను, మాణిక్యముకుటను, నేత్రద్వయముచే దయా వీక్షణములు కలదానిని ద్విభుజను, పద్మాసనాసీన, అష్టషోడశపత్రో పేతమగు పద్మమున చతుర్ద్వార భూసద్మ యుగ్మకమున, దక్షిణ మస్తమున మాతు లుంగ ఫలమును, వామకర ముచే నిజభక్తులకు ధనాదికములనిచ్చు దానిని, చుట్టూ స్వసమానులగు శక్తులచే కూడి యున్నదానిని, ఇతరులగు డెబ్బది ఆరు అప్సరసలచే కూడియున్న దానిని, ప్రయోగము లందు, ఇతరత్ర పర్యాసక్త శక్తులు కలదానిని ధ్యానించవలెను. ఇట్లు చతుర్దశ విద్యను చెప్పితిని. ఇక పంచదశ విద్యను వినుము.
భూమి, శూన్యము, నభోయుతమగు భూమి, రసము, స్థిరాంబువు, అగ్నియుత రయము, ఇజ్యాంబు మరుద్యుక్త రసామరుత్ మరుద్యుక్త నభస్సు, శూన్యమున సంయుతమున చరసహిత గోత్రాంబు పూర్వాక్షరము, అంబ్వగ్నులు, హృదయము, దాహంబు రసోక్ష్మారయ హృత్స్వయుక్, మరుద్యుక్త హంస, దాహము, ప్రాణము, మరుద్యుతము, దాహము సాగ్ని ప్రాణచరములు, జ్యామరుత్సహితరయము, చరయుతాంబు, గోత్రా హృత్యాగ్ని జ్యాంబురసా స్వయుక్, రయము, సాగ్నిజ్యాంబు రసము, మరల ఇవియే జవీ, ఈ దాహముచే అవి రెండు అగును. హ్రస్వము దాహమరుత్స్వయుక్, హంసము, సదాహ వహ్నిస్వము, దాహోష్మ స్వయుతము. అట్లే ఈ విద్యకు సప్తదాహములు ఉండును. అష్ట మాద్యమములు అయిదు. ఉపాంత్యాధ స్థ్నితము నీలపతాకానం తరము త్వరిత, భేరుండాష్టమం నవమము. జ్వాలామాలిని. నిత్యా అరువది మూడక్షరములు కలదిగా చెప్పబడినది ఒకటి, రెండు, నాలుగు, అయిదు చతుష్టయ దశాక్షరములచే మంత్రాక్షరములచే వరాంగములందు షడంగ న్యాసమును చేయవలెను. మిగిలిన వాటిచే వ్యాపకము నాచరించ వలెను. తరువాత సనాతని, జ్వలజ్జ్వలన సంకాశ, మాణిక్య ముకుటోజ్జ్వల, షడ్వక్త్ర, ద్వాదశభుజ, సర్వాభరణ భూషిత, పాశాంకుశ ఖడ్గ ఖేటములను, చాప బాణములను, గదాశంఖములను, శూలవహ్నులను, వరాభయములను కర పద్మములచే ధరించునది, స్వ ప్రమాణలగు శక్తులచే పరివృత చారుస్మిత లసద్వక్త సరోజ, త్రినయనయగు దేవిని ధ్యానించి, ఉపచారములచే పూజించ వలెను. చతురస్ర ద్వయమును చతుర్ద్వార సమన్వితముగా సశాఖ మష్ట పత్రాబ్దము నేర్పరచి, అంతరము త్రస్రమును సిద్ధముచేసి, మధ్య భాగమున త్ర్యస్త్రముచేసి శివుని పూజించ వలెను. ఇట్లు పంచదశీ విద్యను చెప్పితిని. ఇక షోడశిని వినుము. వాయు ప్రణవ తత్త్వములచే చిత్రా మంత్రము అక్షర ద్వయాత్మకము. ఈ మంత్రము సిద్ధించినచో ధన ధాన్యాత్మ నిధి లాభమును కలిగించును. విద్యాద్యవాయువుచే దీర్ఘ స్వరయుతముచే షడంగ కల్పనను గావించవలెను. మంత్రము చేత మాతృకాన్యాసమును చేయవలెను. ఉద్యదాదిత్యబింబాభ, నవరత్న విభూషణ, నవరత్న కిరీట, చిత్రపట్టాంశు కోజ్జ్వల, చతుర్భుజ, నవరత్న విభూషణ, నవరత్నకిరీట, చిత్ర పట్టాంశు కోజ్జ్వల, చతుర్భుజ, త్రినయన, శుచిస్మితలసన్ముఖ, సర్వానందమయి, నిత్యా, సమస్తేప్సితదాయిని, పాశాంకుశ వరదాభయములను నాలుగు భుజములందు ధరించియున్న, సర్వమంగళ, పద్మకర్ణికాయోని మధ్యగను, అట్లే అదే చక్రమునందు ఆమెను చుట్టుముట్టి ఉన్న శక్తులను కూడా పూజించవలెను. ధరాయుక్తములగు ప్రాణదాహములు, మరల రసమునందు అద్యము, మరుత్తు మరుచ్ఛక్తి యుతమగు వ్యాసము, స్వయుక్త భూమి, మరల త్రయము. ఈ మంత్రాద్యము రసాయుగ్మము చరణ ప్రయో జితము, దాహవహ్ని శక్తులచే కూడిన హంస, నభము హృత్ దాహాంబుజ్యా శూన్యములు స్వయు తాంబు, విషయుక్త మరుత్తు నభోయుతమగు శూన్యము భూ వ్యాప్త హంస పూర్వం త్యము ఈ మూడు మంత్రములు. ఈ మంత్రమునకు షష్ఠాది పంచవర్ణములు దైత్య అది అగును. ఏకాదశాక్ష రముల తరువాతది రెండవ ఖండము చెప్పబడినది. మూడవది ఇరువది అయిదక్షరములుకలది. బాలా బీజత్రయాద్యములచే రెండు మూడు మంత్రములచే షడంగకల్పన చేయవలెను. వికీర్ణకుంతల, నగ్న, రక్తవర్ణ, ఆనంద విగ్రహ, కరములలో బాణ చాప పాశసృణులను ధరించు దేవిని ధ్యానించ వలెను. ఈ దేవితో సమానమైన ఆయుధ ఆకార వర్ణములు గలవారు, ఋతుస్నాతలు, స్ఫురద్యోనులు సదానం దారుణేక్షణలు అగు దేవులు చుట్టూ ఉందురు. వారిని కూడా పూజించవలెను. ఇట్లు నీకు కురుకుల్లాంతమున చంద్రావళిని చెప్పితిని.
లలితాదేవియొక్క మరియొకరూపమైన వారాహీదేవిని గూర్చి చెప్పెదను. స్వయుతమగు శుచి, శూన్యము, నభోయుతమగు అభ్రరసస్థిరా, అంబుసాగ్నిరయము, మరుద్యుతాంబురయములు, ఇలాయుతాగ్ని మరల మరుద్యుతాంబు, దాహంబు మరుద్యుత హంస, అగ్నియుత త్రయము, మరుద్యుక్తాంబ దాహములు, ధరాయుక్త హంస, నభస్సు, అగ్నియుత తేజస్సు, మరల అయిదు, స్వయుత వాతము, చరయుత తోయము, తత్పూర్వము అగ్నియుత తోయము, వ్యాప్తముచే శుచిచే శూన్యము శక్తినభోయుతమగు దాహము ధరా, స్వసహిత తోయము చరసమన్వితము, ఇది పూర్వ మనువు. దీని తరువాత చతుష్టయము. జ్యాయుక్త సచరము రభము చర పూర్వకము అగ్నియుత రసము తోయ రహిత చతుష్కము. అభ్ర చరయుత శుభము స్వయుతము సపూర్వకము హంసము, అగ్నియు హంసము మొదట త్రితయము, స్వసమాయుత హృదయము చరసహితరసము, తత్పూ ర్వము, స్వసహిత మరుత్తు శూన్యము హృద్ధాహాంబువులచే చరము, స్పర్శను స్వసహిత మరుత్తు, హృదయము దాహముతో, అంబు సంయుతము, స్వసంయుతమగు జ్వాలాగ్ని హంసము, మరుద్యు తాంబు హృద్రూపమగు స్వయుతరసము, ధరాయుక్త ప్రాణ దాహములు, మరల ప్రాణ దాహములు వహ్నియుక్త వియత్తు, అంబు, దాహము, స్యాది షష్ట్యా స సంయుతము. మొదట చెప్పబడిన వర్ణ ములు, స్వయుత శుద్ధి, స్థిరా, రసా, స్వయుతము దావములు, హంసలు, స్వయుతధరా, నాద వతియుతి, హృదంబు మరుతా యుతము, మరుద్యుత హంసము, ఇట్లు ఈ మంత్రము నూటపది అక్షరములు గలది. వారాహీ, పంచమి, విశ్వ విజయా, భద్రాకౌముదీ, వార్తాలీ అను పేర్లచే ప్రసిద్ధి పొందినది. స్తంభనాది సకలాభీష్టప్రద. ఏడు, ఆరు, పది, ఏడు, ఏడు మంత్రాక్షరములచే అంగకల్పనమును చేయవలెను. త్రికోణ, వృత్త, షట్కోణ వృత్త ద్వయ సమన్వితముగా చక్రమును ఏర్పరచి, అచట స్వనామమును లిఖించి, పూజించవలయును. అట్లే కీలాస్య, కాంచన సన్నిభ, ఆ కంఠం వనితారూప, జ్వలత్సింగ శిరోరుహ, త్రినేత్ర, అష్టహస్త, చక్ర శంఖ గదా అంకుశ, పాశ, ముసల శీర్ష అభయ వరద ముద్రలను హస్తముల ధరించియున్న, గరుడస్కంధమున సుఖాసీనయగు దేవిని ధ్యానించవలయును. నిత్య పూజయందు ఆ దేవి శక్తులను తత్సమానులను స్మరించవలెను. ప్రయోగములందు సింహస్థనుకాని, వ్యాఘ్రగామిని కాని, గజారూఢను హయారూఢను, వృష భారూఢను శక్తి సంయుతను ధ్యానించవలెను. శ్యామ అరుణ పీతను, దుర్గమ మార్గమున శ్యామను, యుద్ధమున శత్రు నాశమునకు సీతను, ఉచ్చాటనమున ధూమ్రవర్ణను ధ్యానించవలెను. ఇట్లు షోడశ నిత్యదేవతలను నీకు పూజావిధానముతో వివరించితిని. ఈ దేవతలందరు తమను సేవించువారికి అభీష్టప్రదలు, సర్వపాప క్షయంకరలుగా తెలియుము. (3/88)