కార్తవీర్యకవచ కథనము

నారద మహర్షి పలికెను: ఓ సర్వ తంత్ర విశారదా! మహాప్రాజ్ఞా! మీరు నాకు తంత్ర రహస్యమును చెప్పితిరి. ఓ మహానుభావా! కృపానిధీ! ఇపుడు కార్తవీర్య కవచమును హనుమత్కవచమును వినగోరుచున్నాను. కావున చెప్పుము.

సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా పరమాశ్చర్యకరమైన కార్తవీర్యుని కవచమును చెప్పెదను వినుము. ఈ కవచముచే కార్తవీర్యార్జునుడు ప్రసన్నుడై కార్యసిద్ధిని ప్రసాదించును. సహస్ర సూర్య సన్నిభము, నానారత్న సముజ్జ్వలము, ప్రకాశించు ధ్వజపతాకయుతము దశసహస్ర తురగ భూషితము ప్రళయకాల సముద్ర భయంకరఘోషవలె ధ్వనించునది, మహాఛత్రములచే వితానముగా చేయబడిన ఆకాశముగలది, నానాయుధ విరాజితము అగు మహారథవరమున చక్కగా కూర్చొని ఉన్నవాడు, విపులోదారుడు, సహస్ర భుజ మండితుడు వామ బాహువులచే ఉద్దండమగు కోదండములను, దక్షిణ బాహువులచే శరములను ధరించి ఉన్నవాడు, కిరీటహారమకుట కేయూర వలయంగద ముద్రికోదర బంధాదులచే, మౌంజీ నూపురకాదులచే భూషితుడు, వివిధ కల్పములు భాస్వరములు అగు మహాధనములచే ఆబద్ధకవచుడు, వీరుడు, సుప్రసన్న అనాంబుజుడు ధనుర్దాసింహ నాదములచే జగత్రయమును కంపింపచేయుచున్నవాడు, సర్వశత్రుక్షయకరుడు, సర్వ సంపత్ప్రదాత, విజయశ్రీ నిషేవితుడు, సర్వ సౌభాగ్యప్రదుడు, భద్రుడు, భక్తాభయ విధాయి, దివ్యమాల్యాను లేపాఢ్యుడు, సర్వలక్షణ సంయుతుడు, రథ గజ అశ్వ పాదాత బృందమధ్య గతుడు, ఈశ్వరుడు. వీరదుడు, చక్రవర్తి, సర్వలోకైక పాలకుడు, సమానోదిత సహస్ర దివాకర సమప్రభుడు, మహాయోగ భవైశ్వర్యకీర్యాక్రాంత జగత్తయుడు, శ్రీహరి చక్రాంశగా అవతరించినవాడు అగు కార్తవీర్యార్జు నుని చక్కగా ఆత్మాదిభేదముచే ధ్యానించి రక్షను పలుకవలయును. కార్తవీర్యార్జునుని అయిదు అంగ మూర్తులు స్ఫటికోజ్జ్వలులు నన్ను రక్షింతురుగావుత. అగ్నేయ ఈశాన్య నైఋతి వాయవ్య కోణములందు హృదయాదికములు, అంతట అస్త్రజ్వలద్రూపులు శంఖ చర్మ ఖడ్గ పాణులు అవ్యాహత బలైశ్వర్య శక్తి సామర్థ్య విగ్రహులు కాపాడుదురుగావుత, క్షేమంకరీ శక్తియుతుడు చోరగర్వభంజకుడు, బాణధనుర్దారియగు కార్తవీర్యార్జునుడు తూర్పు దిక్కున నన్ను కాపాడుగావుత. శ్రీకరీశక్తి సహితుడు మారీ భయవినాశకుడు, శరచాపధరుడు శ్రీమంతుడు సర్వశత్రు వినాశకుడు మహేషుచాపధరుడు పశ్చిమ దిక్కును కాపాడుగావుత. యశఃకరీయుతుడు, దైత్యసంఘ వినాశకుడు ఆగ్నేయకోణమును కాపాడుగావుత. విద్యాకరీ సమాయుక్తుడు మహదుఃఖ నాశకుడు, చాపపాణియగు ఈశ్వరుడు నైఋత దిక్కును కాపాడుగావుత. ధనకరీ సమాయుతుడు మహాదురిత నాశకుడు ధనుర్బాణధారి వాయవ్యదిశను కాపాడుగావుత. ఆయుఃకరీయుతుడు శ్రీమంతుడు, మహాభయ వినాశకుడు చాపేషుధరుడు ఈశాన్యదిక్కును కాపాడుగావుత. విజశ్రీయుతుడు చక్రధారి, విభువు, సర్వదుష్ట, భయంకరుడు ఊర్ధ్వదిక్కును కాపాడుగావుత. సుమహాశక్తి సంయుతుడు, శంఖధారి అధర దిక్కును కాపాడుగావుత, మహాయోగ సమాయుక్తుడు సర్వదిక్చక్రమండలుడు, మహాయోగీశ్వరుడు, పద్మధారి అంతటా కాపాడుగావుత. ఈ మూర్తులు రక్తవర్ణులు రక్తమాల్యాంబరధారులు, ప్రధాన దేవతా రూపులు విడిగా రథమున ఉందురు. శక్తులు పద్మహస్తులు నీలేందీవర సన్నిభులు శుక్ల మాల్యాంబర ధారులు చక్కగా అలదిన చందనము కలవారు, వారి పార్షదేశ్వరులు స్వస్వవాహన ఆయుధ భూషణధారులు, తమ తమ దిక్కులలో ఉన్నవారు మహాబలులగు ఇంద్రాదులు నన్ను కాపాడుగావుత. వీరందరు కార్తవీర్యార్జునుని ఆవరణ దేవతలు. సర్వశక్తి సమన్వితులు అంతటా అన్ని వేళలా నన్ను కాపాడుగావుత. హృదయమున, ఉదరమున, నాభియందు, గుహ్య మండలమున తేజోరూపు లుగా ఉండు అభీష్ట కల్ప వృక్షములు కాపాడుగావుత. మహావర్ణులు మంత్రరూపులు మహోజ్జ్వలులు వ్యాపకముగా ఆపాదతల మస్తకముగా నన్ను కాపాడుగావుత. కార్తవీర్యుడు శిరమును, హైహయేశ్వరుడు లలాటమును, సుముఖుడు ముఖమును, వ్యాప్తజగత్రయుడు కర్ణములను కాపాడు గావుత. సుకుమారుడు హనువును. భ్రూ యుగమును ధనుర్ధరుడు, నయనమును పుండరీకాక్షుడు నాసికను గుణాకరుడు, అధరోష్ఠమును బ్రహ్మజేయుడు, దంతములను కవి కాపాడుగావుత. సర్వశాస్త్రకళాధారి జిహ్వను, అవ్యయుడు చిబుకమును, సర్వార్ధదుడు కరములను, జగత్రియుడు కరాగ్రములను, రేవాంబులీలాదృప్తుడు జఠరమును, వీరుడు శూరుడు నాభిని, సర్వదుష్టహరుడు పార్శ్వములను కాపాడుగావుత. సహస్రభుజధరుడు పృష్ఠమును, సప్తద్వీపాధిపతి కటిని, ఊరువులను మాహిష్మతీనాధుడు, జానువులను భూవల్లభుడు, వీరాధిపుడు జంఘములను, పాదములను మనో జవుడు, సర్వాయుధధరుడు సర్వాంగములను సర్వమర్మములందు కాపాడుగావుత. ధాత్వష్టకసహిత కలవరమును సర్వాదుష్టాంతకుడు, ప్రాణాదిశ జీవేశులను సర్వ శిష్టేష్టదుడు, జితేంద్రియుడు సర్వేంద్రియములను, ఇంకా చెప్పని స్థానములను శరీరాంతర్బహర్భాగములను సర్వలోక నాధేశ్వరేశ్వరుడు కాపాడు గావుత. ఈ కవచముచే ఆవృతమైన ఈ శరీరము వజ్రము కంటె సారతరము బాధశత వినిర్ముక్తమగు అంతరాత్మతో తిరుగుచున్నాను. రాజమార్గమున, మహాదుర్గమున, చోరసంకులమగు మార్గమున, విషమారణ్యమున, ఘోర దవాగ్నియందు, గిరి గుహలందు, సంగ్రామమున, శస్త్ర సంఘాతమున, సింహవ్యాఘ్ర నిషేవితమగు గిరిగుహలందు, సర్వ సంకీర్ణమగు సంధ్యాకాలమున, నృపాలయమున, వివాదమున, విపులావర్తములుగల సముద్రమున, నదీ తటమున, పరిపుంధి జనాకీర్ణమగు దేశమున, చోరగణావృతమగు దేశమున, సర్వస్వహరణము సంభవించునపుడు, ప్రాణ సంకటము సంభవించినపుడు, నానారోగజ్వరా వేశమున, పిశాచప్రేత యాతనలు సంభవించినపుడు, మారీ దుస్స్వప్న పీడలందు, క్లిష్టసమయమున, విశ్వాస ఘాతకులు ఎదురైనపుడు, శారీర దుఃఖము, మానస దుఃఖము మహాజ్వరము సంభవించి నపుడు, ఆధివ్యాధి భయములు ఉత్పన్నమైనపుడు, విఘ్నజ్వాలోప ద్రవములు సంభవించినపుడు కూడా కవచములో బద్దుడైనవానికి ఏ భయము కలుగదు. మాకు రాబోవు ద్రవ్యాపహారకులను మహారధుడు బాహు సహస్రము లచే నివారించుగావుత. కార్తవీర్యార్జునుడు తమ చేతులలోని పాశములచే బంధించి దుర్జయుల గతిసామర్ధ్యము అరికట్టుగావుత. బాణసాహస్రముచే ఛేదించు గావుత. రాజచూడామణి నా శత్రువులను ఖడ్గ సహస్రములచే ఛేదించు గావుత, చోరాది దుష్టప్రాణి సమూహములను ముసల సహస్రములచే భేదించుగావుత. అట్లే స్వశంఖనాదముచే సహస్ర బాహువు చక్రధారి భయపెట్టుకావుత. సాక్షాత్తు శ్రీహరి అవతారమగు కార్తవీర్యుడు నా సమస్తమును కాపాడుగావుత. ఓ కార్తవీర్యా! మహావీర్యా! సర్వదుష్ట వినాశన! అన్ని వేళలా అంతటా దుష్టులను చోరులను నశింపచేయుము.

నీవు నిద్రపోవుచున్నావా? ఓ దుష్టనాశకా? ఏల నిలుచుంటివి? ఎందుకు ఆలసించుచుంటివి? లెమ్ము మమ్ములను నీ పుత్రులవలె సర్వభయములనుండి కాపాడుము. చోరులు ధనాపహారకులు, శత్రువులు, హింసకులు, సాధుభీతికరులు, దుష్టఛద్మకులు, దురాశయులు, దుష్టహృదయులు, దుష్టరాజులు, దుష్టమంత్రులు, పాపులు, కార్య లోపమును చేయువారు, ఖలులు, పరిపంధులు, సర్వస్వహారకులు, పంచమాయావులు, మహా క్లేశకరులు, మ్లేచ్ఛులు, దొంగలు, వృషలులు, అగ్నిదులు, గరదులు, వంచకులు, శస్త్రపాణులు, పాపాత్ములు, దుష్టకర్ములు, దుఃఖప్రదులు, దుష్టబుద్ధులు, కపటులు, దుర్మార్గ చారులు, నానాభయప్రదులు, ఛిద్రాన్వేషణ తత్పరులు, ఎప్పుడూ మమ్ములను బాధించ నుద్యమించువారు, వీరందరు కార్తవీర్యుని మహాశంఖనాదముచే హతులై త్వరగా నశింతురుగావు. దూరమునుండి మాయా మోహితులు అగుదురుగావుత, దానవులు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, మహాసత్త్వులు, భూతబ్రహ్మ రాక్షసులు, అపస్మారగ్రహములు, పిశితాశన గ్రహములు, మహారక్త భోజనులు, భేతాళురు, గుహ్యకులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, దేవతలు, ఢాకినులు, ప్రేతములు, క్షేత్రపాలురు, వినాయకులు, మహవ్యాఘ్రములు, మహామేఘములు, క్షేత్రపాలురు, వినాయకులు, మహావ్యాఘ్రములు, మహామేఘములు, మహాతురగరూపులు మహాగజములు, మహాసింహములు, మహా మహిష జాతులు, ఋక్షవారాహ శునక వానర ఉలూకమూర్తులు, మహోష్ణఖరమార్థార సర్పగోవృషమస్తకులు, నానారూపులు, మహాసత్త్వులు, నానాక్లేశ సహస్రములను ఇచ్చువారు, నానారోగకరులు, క్షుద్రులు, మహావీర్యులు, మహాబలులు, వాతికములు, పైతికములు, ఘోరులు, శ్లేష్మికములు, సన్నిపాత రోగములు, మాహేశ్వ రములు, వైష్ణవములు, బ్రాహ్మములు అగు మహా గ్రహములు, స్కాందములు, వైనాయకములు, క్రూరులు, ప్రమధ గుహ్యకులు, మహాశత్రు గ్రహములు, రౌద్రములు, మహామారీమ సూరికలు, ఏకాహికములు, ద్వ్యాహికములు, త్ర్యాహికములు చాతురర్థికములు, పాక్షికములు, మాస్యములు, షాణ్మాసికములు, సాంవత్సరములు దుర్నివార్యములగు జ్వరములు, పరమదారుణ జ్వరములు, స్వాప్నిక మహోత్పాతములు, దుస్స్వాప్నిక గ్రహములు, కూష్మాండములు, జృంభికలు, భౌమములు, ద్రోణులు, సాన్నిధ్యవంచకులు, భ్రమికలు, ప్రాణహర్తలు, బాలగ్రహాదులు, మనోబుద్ధీన్ద్రియ హరులు, స్పోటకములు, మహాగ్రహములు, మహాశనులు, బలిభుజులు, మహాకుణప భోజనులు, దివాచరులు, రాత్రిచరులు, సంధ్యాచరులు, దారుణగ్రహములు, ప్రమత్తులు, అప్రమత్తులు, బాధించుటకు ప్రయత్నించువారు. వీరందరు కార్తవీర్యుని ధనువు నుండి వెలువడిన బాణములచే కొట్టబడినవారై సత్త్వ బలోద్యమములు భగ్నములై నశించుగావుత. సర్పములు, మహానాగులు, మహాగిరి ఐలేశయములు, కాలవ్యాళములు, మహాదంష్ట్రలు, మహాజగరములు, అనంత శూలికాదులు, దంష్ట్రా విష మహాభయములు. అనేక శత శీర్షములు, ఖండ పుచ్ఛములు, దారుణములు, మహావిష జలౌ కములు, వృశ్చికములు, రక్త పుచ్ఛకములు, ఆశీ విషములు, కాలకూటములు, మహాహాలాహలములు, జల సర్పములు, జలవ్యాళములు, జలగ్రాహములు, కచ్ఛపములు, మత్స్యములు, కృత్రిమములు, మహా విషములు, గుప్తరూపులు, గుప్తవిషులు, మూషికములు, ఇంటి బల్లులు. నానా విషములు, ఘోరములు, మహావిష సంజ్ఞకములు, ఇవి మమ్ములను శరీరప్రాణ నాశముచేసి బాధించ దలచినవి కార్తవీర్యుని ఖడ్గ సహస్రములచే ఖండితములై ఇంద్రియ సాహసములు నశించి దూరము నుండే ఖండితములై ఇంద్రియ సామసములు నశించి దూరము నుండే నశించుగావుత. మనుష్యులు, పశువులు, భల్లూకములు, వానరములు, వనగోచరులు, సింహ వ్యాఘ్ర వరాహములు, మహిషములు, మహామృగములు, గజములు, అశ్వములు, గవయములు, రాసభములు, శరభములు, వృకములు, శునకములు, పెద్ద పులులు, శ్వభ్రములు, మార్జాలములు, బిలములందు ఉండునవి, శృగాలములు, శశకములు, డేగలు, గరుడపక్షులు, ఇతరపక్షులు, గండభేరుండములు, కాకులు, గద్దలు, హంసాదిపక్షి జాతులు, ఉద్భిజములు, అండజములు, స్వేదజములు, జరాయుజములు నానాభేద కుల జాతములు, నానాభేదములు, వేరువేరు జాతులు, సంధ్యా కాలములలో, పగలు, రాత్రి మమ్ముల బాధించ గోరునవి అన్నియు కార్తవీర్యుని సహస్రగదలచే భిన్నములై గతి పౌరుషములు నశించి దూరము నుండే నశించుగావుత. క్షేమమును తొలగించునవి, కూటమాయావులు, మారణ, ఉత్పాదన, ఉన్మూలన, ద్వేష, మోహనకారకములు, విశ్వాస ఘాతకములు, దుష్టులు, స్వామి ద్రోహులు, అతతాయులు, పాపులు, గోప్యహరులు, దాహ, ఉపఘాత, గరల, శస్త్రపాత, అతి దుఃఖములను ఇచ్చునవి, క్షేత్రవిత్తాదిహారులు బంధనాది భయప్రదులు, వివిధాకారములగు ఈతి బాధలు, ఇతర దుష్టజాతులు, ఎల్లప్పుడు పీడాకరములు, ఛిద్రాన్వేషకులు, వీరందరు కార్తవీర్యుని సహస్రచక్రములచే ఖండితులై బలసాహసములు ఉడిగి దూరము నుండియే నశింతురుగావుత. మేఘములు, మహావర్షములు, మహేవాతములు, విద్యుత్తులు, మహాశనులు, నిర్ఘాతములు, దారుణములు, ఉల్కాపాతములు, ఘోరములగు మహాంద్రాయుధాదులు, సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు. నక్షత్రములు, రాశులు, తిథులు, సంక్రమణములు, మాసములు, వత్సరములు, యుగములు, యుగాధిపతులు, మన్వంతరాధిపులు, సిద్ధులు, ఋషులు, యోగి సిద్ధులు, నిధులు, ఋగ్యజుస్సామాధర్వణ వేదములు. అగ్ని హోత్రములు, ఋతువులు, లోకపాలులు, పితృదేవతలు, దేవతాగణములు, చతుష్షష్టి విద్యలు, భువనత్రయ గతములన్నియు, ఇచ్చట చెప్పబడినవి. చెప్పబడనివి అన్నియు యోగేంద్రుడు అమితద్యుతియగు కార్తవీర్యార్జునుని యాజ్ఞచే మాయెడ సౌమ్యములు సుఖప్రదములు అగుగావుత. కార్తవీర్యార్జునుడు, ధ్వని, రాజేన్ద్రుడు, హైహయేశ్వరుడు, దశాస్యదర్పహంత, రేవాలీలాదృప్తుడు, సుదుర్జయుడు, దుఃఖహా, చోరదమనుడు, రాజరాజే శ్వరుడు, ప్రభువు, సర్వజ్ఞుడు, సర్వప్రదుడు, శ్రీమంతుడు, సర్వశిష్టేష్టదుడు, కృతీ, రాజచూడామణి, యోగి, సప్తద్వీపాధి నాయకుడు, విజయి, విశ్వజిత్, వాగ్మి, మహాగతి, అలోలుపుడు, యజ్వ, విప్రప్రియుడు, విద్వాన్, బ్రహ్మజేయుడు, సనాతనుడు, మాహిష్మతీ పతి, యోధా, మహాకీర్తి, మహాభుజుడు, సుకు మారుడు, మహావీరుడు, మారీఘ్నుడు, మదిరేక్షణుడు, శత్రుఘ్నుడు, శాశ్వతుడు, శూరుడు, శంఖభృత్, యోగివల్లభుడు, మహా భాగవతుడు, ధీమంతుడు, మహాభయ వినాశకుడు, అసాధ్యుడు, విగ్రహుడు, దివ్యుడు, భావుడు, వ్యాప్తజగత్త్రయుడు, జితేంద్రియుడు, జితారాతి, స్వచ్ఛందుడు, అనన్త విక్రముడు, చక్రభృత్, పరచక్రఘ్నుడు, సంగ్రమ విధిపూజితుడు, సర్వశాస్త్రకలాధారీ, విరజస్కుడు, లోకవందితుడు, వీరుడు, విమల సత్త్వాఢ్యుడు, మహాబలపరాక్రముడు, విజయశ్రీ మహామాన్యుడు, జితారి, మంత్ర నాయకుడు, ఖడ్గభృత్, కామదుడు, కాంతుడు, కాలఘ్నుడు, కమలేక్షణుడు, భద్రవాద ప్రియుడు, వైద్యుడు, విబుధుడు, వరదుడు, వశి, మహాధనుడు, నిధిపతి, మహాయోగి, గురుప్రియుడు, యోగాఢ్యుడు, సర్వరోగఘ్నుడు, రాజితాఖిల భూతలుడు, దివ్యాస్త్రభృత్, అమేయాత్మా, సర్వగోప్తా, మహోజ్జ్వలుడు, సర్వాయుధధరుడు, అభీష్టప్రదుడు, పరపురంజయుడు, యోగసిద్ధుడు, మహాకాయుడు, మహాబృందశతాధిపుడు, సర్వజ్ఞాననిధి, సర్వసిద్ధి దానకృతోద్యముడు, అని ఇవి అష్టోత్తరనామములు. దశమూర్తులు దిక్కులలో, మార్గమునందు, వ్యాపించి నన్నెపుడూ కాపాడుగాత. సర్వ ఇంద్రియములు స్వస్థములగు గావుత. నాకెప్పుడు శాంతి ఉండుగాత. శేషాది అష్టామూర్తులు విక్రమముచే భాస్వరములై అగ్ని నిరుతి, వాయు, ఈశ దిక్పాలురు నన్ను ఎల్లపుడూ కాపాడుగావుత. నాకు బాధలేని సౌఖ్యము, ఆరోగ్యము, జయము, దుఃఖహాని, విఘ్ననాశము, ప్రజావృద్ధి, సుభోదయము, ఇష్టప్రాప్తి, అతి కళ్యాణము, అద్వేషము, అరోగము, అనాలస్యము, అభీష్టము, మృత్యుహాని, బలోన్నతి, భయహాని, కీర్తికాంతి, విద్యాబుద్ధి, మహాసంపదలు, అనష్టద్రవ్యత, నష్టపునరాగములు, దీర్ఘాయుష్యము, మనోహర్షము, సౌకుమార్యము, అభీప్సితము, అప్రధృష్యత మత్వము, మహాసామర్థ్యము, ఇవి అన్నియు హైమయేంద్రుడగు కార్తవీర్యుని నామ కీర్తనము వలన కలుగునుగావుత.

ఇట్లు పుణ్యవర్ధనము, సర్వపాపప్రశనము, సర్వోపద్రవ నాశనము సర్వ శాంతి కరము, గుహ్యము, సమస్త భయనాశనము, విజయార్ధ ప్రదము సర్వసంపత్ప్రదము శుభము అగు కార్త వీర్యార్జున కవచమును వినిననూ, చదివిననూ సర్వాభీష్టములను పొందును. పశ్వాదిధనము చోరులచే అపహరించబడినచో రాత్రిపూట పశ్చిమ దిఙ్ముఖుడై ఏడుమార్లు ఏడురోజులు కవచమును జపిం చినచో అపహరించబడినవి తిరిగి లభించును. ప్రాఙ్ముఖుడై ఇరువది ఏడుమార్లు జపించినచో దేవాసురసములగు శత్రువులను కూడా జయించును. వివాదమున, ఘోరకలహమున అయిదు మార్లు పఠించినచో విజయమును పొందును. పరాజయమును పొందడు. సర్వరోగాది పీడలలో మూడుమార్లుకాని అయిదుమార్లుకాని చదివినచో రోగమృత్యు భేతాళ భూత ప్రేతములచే బాధించ బడడు. బంధముక్తి కొఱకు రాత్రిపూట చక్కగా పన్నెండుమార్లు పఠించవలయును. మూడు దినము లలో బంధముక్తు డగును. ఈ విధానముచే సర్వసాధన కర్మలలో ఏడు దినములు చదివినచో అసాధ్యమగు కార్యమును కూడా సాధించగలుగును. ప్రయాణ కాలమున ఈ కవచమును చదివి పయనించినచో మార్గమున దుష్టచోర వ్యాఘ్రాదులు భయము కలుగదు. ఈ కవచమును జపించుచు అంజలిచే జలనేచనము చేసుకొనినచో విషకృత్యాది రోగస్ఫోటములచే బాధింపబడడు. కార్తవీర్యుడు, ఖలద్వేషి, కృతవీర్యసుతుడు, బలీ, సహస్రబాహువు, శత్రుఘ్నుడు, రక్తవాసుడు, ధనుర్ధరుడు, రక్తగంధుడు, రక్తమాల్యుడు, రాజు స్మారకాభీష్ట ప్రదుడు అని ఈ పన్నెండు కార్తవీర్యుని నామములను పఠించం వానికి సర్వసంపదలు కలుగును. సర్వజనులు వశులగుదురు. శ్రీచక్రావతారమును సర్వదా సేవించు వాడు సర్వకాలములలో శ్రీమహావిష్ణుచక్రముచే కాపాడబడుచుండును. నేనీ కవచమును దత్తాత్రేయ మునివలన విని నీకు చెప్పితిని. అఖిలాభీష్టప్రదమగు ఈకవచమును ధరించుము. (3/77)