నారద మహా పురాణము
లలితా స్తోత్రకవచ సహస్ర నామ కథనము
సనత్కుమార మహర్షి పలికెను: ఇక ఇపుడు ఈ ఆవరణములలో ఉండు శక్తుల నియమములను అనుసరించి గురుధ్యాన పురస్సరముగా నామసహస్రమును చెప్పెదను. ప్రకాశ మొదలుకొని సుభగ వరకు తొమ్మిదిమంది నాధలుగా చెప్పబడిరి. భూమి మొదలుకొని శివ వరకుండునవి తత్త్వములని తెలియుము. గురుజన్మ మొదలుకొని దర్శవరకు ఏడుపరలు. వీటిని సాధకుడు మొదట ధ్యానించవలెను. తద్గత మనస్కుడై గురుస్తోత్రమును జపించవలెను. ఓ నాథ! గురురూపుడవగు శివా! నీకు నమస్కారము. విద్యావతార సంసిద్ధికొరకు అనేక రూపములను స్వీకరించితివి. నవునకు, నవరూపునకు, పరమార్థక రూపునకు, సర్వా జ్ఞానతమోభేద భానునకు చిద్గనరూపునుకు, స్వతంత్రునకు, దయాక్లుప్త విగ్రహునకు, శివస్వరూపునకు, భక్త పరతంత్రునకు భవ్యులకు భవ్య రూపునకు, వివేకులలో వివేకమునకు, విమర్శుల, విమర్శకు, ప్రకాశముల ప్రకాశమునకు, జ్ఞానుల జ్ఞాన రూపునకు ముందు, ఇరు ప్రక్కల వెను, ఉపరి భాగమున, అధోభాగమున నమస్కరించెదను. ఎప్పుడూ నా చిత్త మందిరమున నీ నివాసమును ఏర్పరచుకొనుము. ఇట్లు భక్తిచే గురువును స్తుతించి పరాదేవిని ధ్యానించవలెను. గణేశ గ్రహ నక్షత్ర యోగినీ రాశి రూపిణి, మంత్ర స్వరూపిణి అగు మాతృకా పీఠరూపిణి, పరమేశ్వరి కాలహృల్లో హల్లోల్లోహ కలానాశన కారిణి యగు మహాదేవికి నమస్కారము ఈ దేవి మంత్రములోని ఒక అక్షరము సిద్ధించిననూ సూర్యగరుడ చంద్ర మన్మథ శంకర అగ్ని విష్ణువులతో నరుడు పోటీపడును. ఈ భువనత్రయము ఈ మంత్రాక్షర చంద్ర చంద్రకాంతులచే అలంకరించబడి ఉన్నది. అట్టి మహాశ్రీ సిద్ధ మాతృకయగు సర్వేశ్వరీ దేవికి నమస్కరించెదను. ఈ జగత్రయము ఈ దేవీ మంత్రాక్షర సూత్రమున కూర్చబడియున్నది. అట్టి సిద్ధ మాతృకకు నమస్కారము. ఈ దేవి యొక్క ఏకాదశాధారము కోణత్రయోద్భవ బీజము బ్రహ్మాం డాది కటాహాంతముగా గోచరమగుచున్నది. ఆ కచట తపయశ అక్షర వర్గిణి జ్యేష్టాంగ బాహు హృత్కంఠ కటిపాద నివాసిని ఈ కారాక్షరోద్ధార సారములన్నింటిలోని సారము, పరముల కంటే పరమగు దేవికి నమస్కారము. పరమానంద రూపిణియగు మహాదేవికి నమస్కారము. అయిననూ ఈ దేవియొక్క ఒక్కకలను కూడా దేవతలు తెలియజాలరు. ఎవరీమె. ఎక్కడి నుండి వచ్చినది? ఎక్కడుండును? ఎట్లుండును? దేనిచే ఉండును? సరూపారూప భానవలను తెలియజాలరు. అట్టి క్షయరహిత క్షకారాక్షర రూపిణి కులకలోల్లోల ప్రోల్లసంతి, శివ, పరయగు దేవికి నమస్కరించెదను. వర్గాను క్రమయోగముచే ఈమెకు ఉమాష్టకమని పేరు కలిగినది. అట్టి అష్టవర్గ భవమగు మహా సిద్ధ్యాదికేశ్వరునికి నమస్కరించెదను. కామ పూర్ణజకార సుపీళాంగ నివాసిని, చతురాజ్జా కోశ భూత శ్రీత్రిపురాదేవికి నమస్కరించెదను. ఇట్లు నిత్యాదేవుల స్తోత్రమును సావధానముతో పూజాదియందు పఠించు వానికి నిత్యాదేవతలందరు వరప్రదులు అయ్యెదురు.
ఇక ఇపుడు నీకు నవరతాత్మకమగు దేవీకవచమును చెప్పెదను. ఈ కవచమును ఉపాసించు నరుడు దేవాసురనరులను జయించువాడు అగును. అంతటా అన్నివేళలా అంతట ఉండు లలితాదేవి కాపాడుగావుత. ముందు భాగమున కామేశి, వెనుక భాగమున భగమాలిని, కుడి ప్రక్క అన్ని వేళలా నిత్యక్లిన్న, నైరుతి దిశను భేరుండ కాపాడుకావు. వహ్నవాసిని పశ్చిమ దిక్కును, వాయవ్యదిక్కున మహావజ్రేశ్వరి, వామపార్శ్వమును లలిత కాపాడుగావుత. సిద్ధిదాయిని ఈశాన్య దిక్కును కాపాడుగావుత. కులసుందరిదేవత ఊర్థ్వభాగమును కాపాడుదువుగాత. నీలపతాకాదేవి ఆధోభాగమును, విజయ అన్ని దిక్కులందు కాపాడుగావు. సర్వమంగళాదేవి నాకు ఎల్లప్పుడు శుభములను ఇచ్చుగాక. జ్వాలామాలిని విగ్రహాదేహేంద్రియ మనః ప్రాణములును, చిత్తమును, చిత్తాదేవి ఎల్లప్పుడూ కాపాడుగావుత. కామ క్రోధ లోభ మోహమదముల నుండి, పాపశోకముల నుండి అంతటా అన్ని వేళలా కాపాడుగావుత. అసత్యమునుండి, సంక్షయము నుండి, క్రూరాలోచన నుండి, వాసాచార్యములనుండి సౌమిత్యమునుండి కాపాడుచు శుభములవైపు ప్రేరణ చేయుగావుత. తమ తమ శక్తులచే కూడుకొని గజారూఢులైన షోడశనిత్యలు నన్ను కాపాడుదురుగాత. అట్లే హయారూఢలు, సింహారూఢలు, ఋక్షారూఢలు, రథా రూఢలు, గరుడారూఢలు, వ్యోమగతలు, భూగతలు అసర్వగతలు అన్ని వేళలా అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగావుత. భూత ప్రేతపిశాచ పురకృత్యాదికలను, రోగములను స్వశక్తి భూషణాయుధములచే పారద్రోలుగావుత. గజవ్యాఘ్రసింహ గరుడారూఢలు, అఖిలాయుధ ధారిణులు అసంఖ్యాక శక్తులు దేవీ సముదాయము అంతటా అన్ని వేళలా నన్ను కాపాడువు గావుత. ఇట్లు ప్రతి దినము ప్రాత స్సాయంకాల ములో సర్వ రక్షకమగు నిత్యా కవచమును పఠించువారు ఎప్పుడూ అశుభమును చూడరు. ఎల్లప్పుడూ ఆనందమునే అనుభవింతురు. ఇట్లు నీకు శుభావహమగు లలితా కవచమును చెప్పితిని. ఈ కవచమును ధరించుటచే నిర్భయుడూ విజయుడూ కాగలడు.
ఇక ఇపుడు నీకు లలితా సహస్ర నామములను షోడశ శక్తుల క్రమాగతమగు ఆవరణార్చన మును చెప్పెదను. లలితా, కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా భేరుండా, వహ్నివాసినీ, వజ్రేశ్వరీ, దూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, సంవిత్, నీల పతాకా, విజయా, సర్వమంగళికా, జ్వాలామాలినీ, చిత్ర అను పదునారుమంది ఇష్ట విగ్రహాలు, కురుకుల్ల, వారాహి అను ఇద్దరు ఇష్ట విగ్రహాలు వశిని, కామేశి, మోహినీ, విమలా, అరుణ, తపని, సర్వేశ్వరి, కౌలినీ, ఇష్వర్ణ రూపా, అపర్ణ విగ్రహా, పాశర్ణశరీర, ఆకుర్వర్ణసువపుర్ధరా, త్రిఖండా, స్థాపినీ, సన్నిరోధినీ, అవగుంఠనీ, ఇషు చాపాఖ్యా, పాశాంకుశాభిదా, సమస్కృతి, సంక్షోభణీ, విద్రావణీ, ఆకర్షణీ, విఖ్యాతా, అవేశకారిణీ, ఉన్మాదినీ, మహాపూర్వా, కుశాధ్, ఖేచరీ, బీజా, శక్త్యుత్థాపనా, స్థూలసూక్ష్మా పరాభిధా, అణిమా, లఘిమా, మహిమా, గరిమా, ప్రాప్తిః, ప్రకామితా, ఈశితా, వశితా, భుక్తి, సిద్ది, ఇచ్ఛా, సిద్ధిరూపా, బ్రాహ్మీ, మహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మీ, కామా, బుద్ధి, అహంకార శబ్ద స్పర్శ స్వరూపిణీ, ఆత్మరూపిణీ, కుసుమా, మేఖలా, మదనా, మదనాతురా, రేఖా, సంవేగినీ, అంకుశా, మాలినీ, సంక్షోభిణీ, విద్రావిణీ, ఆకర్షణ రూపిణీ, ఆహ్లాదినీ, సంమోహినీ, స్తంభినీ, జంభినీ, వశంకరీ, రంజినీ, ఉన్మాదినీ, అర్థసాధినీ, సంపత్తి పూర్ణా, మంత్రమయీ, ద్వంద్వక్షయంకరీ, సిద్ధి, సంపత్ప్రదా, ప్రియ మంగళకారిణీ, కామప్రదా, దుఃఖ విమోచనీ, మృత్యు ప్రశమనీ, విఘ్న నివారిణీ, అంగసుందరికా, సౌభాగ్యదాయినీ, జ్ఞానైశ్వర్య ప్రదా, జ్ఞానమయీ, పంచమి, వింద్యవాసనకా, ఘోర స్వరూపా, పాపహారిణీ, ఆనందమయీ, రక్షా, రూపేప్సిత ఫలప్రదా, జయినీ, విమలా, కామేశీ, వజ్రిణీ, భగాత్రే లోక్యమోహనా, స్థానా, సర్వాశాపరిపూరిణీ, సర్వసంక్షోభణ గతా, సౌభాగ్యప్రద సంస్థితా, సర్వార్థ సాధకాగారా, సర్వరోగహరా, స్థితా, సర్వరక్షాకరస్థానా, సర్వసిద్ధి ప్రదస్థితా, సర్వానన్దమయా, ఆధార బిందుస్థాన శివాత్మికా, ప్రకృష్టా, గుప్తా, జ్ఞేయా, గుప్తతరా, సంప్రదాయ స్వరూపా, కులకాలని గర్భగా, రహస్య, పరాపరప్రాకృత్, అతి రహస్యకా, త్రిపురా, త్రిపురేశీ పురవాసినీ, శ్రీమాలినీ, సిద్ధాన్తా, మహా త్రిపుర సుందరి, నవరత్నమయ ద్వీప నవఖండ విరాజితా, కల్పకోద్యాన సంస్థ, ఋతు రూపేంద్రియార్చకా. కాలముద్రా, మాతృకాఖ్యా, రత్న దేశోప దేశికా, తత్త్వాగ్రహాభిధా, మూర్తి, విషయద్విపా, దేశకాలాకార శబ్ద రూపా, సంగీత యోగినీ, సమస్త గుప్త ప్రకటసిద్ధ యోగిని చక్రయుక్, వహ్ని సూర్యేందు భూతాహ్వా, ఆత్మాష్టాక్ష రాహ్వయా, పంచధ్యార్చ స్వరూపా, నానావ్రత సమాహ్వయా, నిషిద్దా చారరహితా, సిద్ధ చిహ్న స్వరూపిణీ, చతుర్థా కూర్మ భాగస్థ, నిత్యాద్యచ్చా స్వరూపిణీ, దమనాది సమభ్యర్యా, షట్కర్మ సిద్ధిదాయినీ, తిధి వార పృధగ్ధవ్య సమర్చన శుభావహా, వాయోశ్య నంగకుసుమా, అనంగమేఖలా, అనంగమదనా, అనంగమదనాతురా, మదదేగినికా, భువన పాలినీ, శశిలేఖా, సముద్దిష్టా, గతిలేఖాహ్వయా, శ్రద్ధా, ప్రీతి, రతి, ధృతి, కాని, మనోరమా, మనోహరీ, మనోరధా, మదనోన్మాదినీ, మోదినీ, శంఖినీ, శోషిణీ, శంకరీ, సింజనీ, సుభగా, పూషా, వాసుమనసా, రతి, ప్రీతి, ధృతి, బుద్ధి, సౌమ్యా, మరీచి, అంశుమాలినీ, శశినీ, అంగిరా, ఛాయా, సంపూర్ణ మండలా, తుష్టి, అమృతా, డాకినీ, లోకపా, బటుకా, ఇభ స్వరూపా, దుర్గా, క్షేత్రేశ రూపిణీ, కామరాజ స్వరూపా, మన్మథ రూపిణీ, కందర్ప రూపిణీ, మకర కేతనా, మనోభవ స్వరూపా, భారతీ వర్ణ రూపిణీ, మదనా, మోహినీ, లీలా, జంభినీ, ఉద్యమా, శుభా, హ్లాదినీ, ద్రావిణీ, ప్రీతి, రతి, రక్తా, మనోరమా, సర్వోన్మాదా, సర్వముఖా, ఆభంగా, అమితోద్యమా, అనల్పావ్యక్త విభవా, వివిధక్షోభ విగ్రహా, రాగశక్తి, ద్వేషశక్తి, శబ్దాది రూపిణీ, నిత్యా, నిరంజనా, క్లిన్నా, క్లేదినీ, మదనాతురా, మదగ్రవా, ద్రావిణీ, మదావిలా, మంగళా, మన్మధానీ, మనస్వినీ, మోహా, మోదా, మానమయీ, మాయా, మందా, మితావతీ, విజయా, విమలా, శుభా, విశ్వా, విభూతి, వనితా, వివిధా, వినతా, కమలా, కామినీ, ఢాకినీ, శాకినీ లాకినీ, కాకినీ, రాకినీ, ఇచ్ఛా, జ్ఞానా, క్రియా, ఆయుధాష్టక ధారిణీ, కపర్దినీ, కులసుందరీ, జ్వాలినీ, విస్ఫులింగా, మంగలా, సుమనోహరా, కనకా, కినవా, విద్యా వివిధా, మేసా, వృషా, మిధున, కర్కటా, సింహా, కన్యా, తులా, కీటా, చాపా, మకరా, కుంభా, మీనా, సారా, సర్వభక్షా, విశ్వాత్మా, వివిధోద్భూత చిత్రరూపా నిస్సపత్నా, నిరాతంకా, యాచనా, అచింత్య వైభవా, రక్తా, విద్యాప్రాప్తి స్వరూపిణీ, హృల్లేఖా, క్లేదినీ, క్లిన్నా, క్షోభిణీ, మదనాతురా, నిరంజనా, రాగవతీ, మదనావతీ, మేఖలా, ద్రావిణీ, వేగవతీ, కమలా, కామినీ, కల్పా, కలా, కలితా, అద్భుతా, కిరాతా, కాలా, కదనా, కేశికా, కంబువాదికా, కాతరా, కపటా, కీర్తి, కుమారీ, కుంకుమా, భంజినీ, వేగినీ కల్పా, కళా, కలితా, అద్భుతా, కిరాతా, కాలా, కదనా, కేశికా, కంబు వాదికా, కాతరా, కపటా, కీర్తి, కుమారీ, కుంకుమా, భంజినీ, వేగినీ, నాగా, చపలా, పేశలా, సతీ, రతి, శ్రద్ధా, భోగలోలా, మదోన్మత్తా, మనస్వినీ, విహ్వలా, ఆకర్షణీ, లోలా, మదనమాలినీ, వినోదా, కౌతుకా, పుణ్యా, పురాణా, వాగేశీ, వరదా, విశ్వా, విభవా, విఘ్నకారిణీ, బీజ విఘ్నహరా, విద్యా సుముఖీ, సుందరీ, సారా, సుమనా, సరస్వతీ, సమయా, సర్వగా, విద్ధా, శివా, వాణీ, దూరసిద్ధ, అథో విగ్రహావతీ, నాదా, మనోన్మనీ, ప్రాణ ప్రతిష్ఠా అరుణ వైభవా, ప్రాణా, అపానా, సమానా, వ్యానా, ఉదానా, నాగా, కూర్మా, కృకరా, దేవదత్తా, ధనంజయా, ఫట్కారీ, కింకరా, ఆరాధ్యా, జయా, విజయా, హుంకారీ, ఖేచరీ, చండా, ఛేదినీ, క్షపిణీ, స్త్రీ హుంకారీ, క్షేమకరీ, చతురక్ష రూపిణీ, శ్రీ విద్యామత వర్ణాంగీ, కాలీ, యామ్యా, నృపార్ణకా, భాషా, సరస్వతీ, వాణీ, ప్రాకృతా, సంస్కృతా, పరా, బహురూపా, చిత్తరూపా, రమ్యానందా, కౌతుకా, త్రయాఖ్యా, పరమా త్మాఖ్యా, అమేయ విభవా, వాక్స్వరూపా, బిందు సర్గరూపా, విశ్వాత్మికా, త్రైపుర కందాఖ్యా, జ్ఞాత్రాది త్రివిధాత్మికా, ఆయుర్లక్ష్మీ కీర్తి భోగసౌందర్యారోగ్య దాయికా, ఐహికా ముష్మిక జ్ఞానమయీ, జీవా, విజయా, విశ్వ విన్మయీ, హృదాది విద్యా, రూపాది భానురూపా, జగద్వపు, విశ్వమోహనికా, త్రిపురా, అమృతా, సర్వాప్యాయన రూపా, మోహినీ, క్షోభణీ, క్లేదినీ, మహోదయా, సంపత్కరీ, లక్షార్జా, సీమామాతృతను, రతి, ప్రీతి, మనోభవా, వారాధిపా, త్రికూటా, షట్కూటా, పంచకూటా, విశుద్ధగా, అనాహతగతా, మణిపూరక సంస్థితా, స్వాధిష్ఠాన సమాసీనా, ఆధారస్థా, అజ్ఞా సమాస్థితా, షట్తింశత్కూటరూపా, పంచాశ న్మిథునాత్మికా, పాదుకాదికసిద్దీశా, విజయదాయినీ, కామరూప ప్రదా, వేతాల రూపా, పిశాచికా, విచిత్రా, విభ్రమా, హంసీ, భీషణీ, జనరంజికా, విశాలా, మదనా, తుష్టా, కాలకంఠీ, మహాభయా, మహేష్ఠీ, శంఖినీ, ఐంద్రీ, మంగళా, వటవాసినీ, మేఖలా, సకలా, లక్ష్మీ, మాలినీ, విశ్వనాయికా, సులోచనా, సుశోభా, కామదా, విలాసినీ, కామేశ్వరీ, నందినీ, స్వర్ణరేఖా, మనోహరా, ప్రమోదా, రాగిణీ, సిద్ధా, పద్మినీ, రతిప్రియా, కల్యాణదా, కళాదక్షా, సుర సుందరీ, విభ్రమా, వాహకా, వీరా, వికలా, కోరకా కవి, సింహనాదా, మహానాదా, సుగ్రీవా, మర్కటా, శఠా, బిడాలాక్షా, బిడాలాస్యా, కుమారీ, ఖేచరీ, భవా, మయూరా, మంగళా, భీమా, ద్విపవక్త్ర, ఖరాననా, మాతంగీ, నిశాచారా, వృషగ్రాహా వృకాననా, సైరి భాస్యా గజముఖా, పశువక్రా, మృగాననా, క్షోభకా, మణిభద్రా, క్రీడకా, సింహచక్రకా, మహోదరా, స్థూలశిఖా, వికృతాస్యా, వరాననా, చపలా, కుక్కుటాస్యా, పాలినీ, మదనాలసా, మనోహరా, దీర్ఘజంఘా, స్థూలదంతా, దశాననా, సుముఖా, పండితా, క్రుద్ధా, వరాహాస్యా, సటాముఖా, కపటా, కౌతుకా, కాలా, కింకరా, కితవా, ఖలా, భక్షకా, భయదా, సిద్దా, సర్వగా, జయ, విజయా, దుర్గా, భద్రా, భద్రకరీ, అంబికా, వామదేవీ, మయామాయా స్వరూపిణీ, విదారికా, విశ్వమయీ, విశ్వా, విశ్వ విభంజితా, వీరా, విక్షోభిణీ, విద్యా, విభవా, వివిధా, విప్రా, మనోహరా, మంగలా, మదోత్సిత్తా, మనస్వినీ, మానినీ, మధురా, మాయా, మోహినీ, భద్రా, భవానీ, భవ్యా, విశాలక్ష్మీ, శుచిస్మితా, కకుభా, కమలా, కల్పా, కలా, పూరణీ, నిత్యా, అమృతా, జీవితా, దయా, అశోకా, అమలా, పూర్ణా, భాగ్యోద్యతా, వివేకా, విభవా, విశ్వావితతా, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రా, పద్మినీ, విద్యా, విశ్వేశీ, శివ వల్లభా, అశేష రూపా, ఆనందా, అంబుజాక్షీ, అనిందితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధా, వేద విగ్రహా, విద్యా, వాగీశ్వరీ, సత్యా, సంయుతా, సరస్వతీ, నిర్మలా, ఆనంద రూపా, అమృతా, మానదా, పూషా, పుష్టి, తుష్టి, రతి, ధృతి, శశినీ, చంద్రికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణా, పూర్ణామృతా, కామదాయిని, ఇందుకలాత్మికా, తపినీ, తాపినీ, ధ్రూమా, మరీచి, జ్వాలినీ, రుచి, సుషుణ్ణి, భోగదా, విశావ, బాధినీ, ధారిణీ, క్షమా, ధూమ్రార్చి, ఊష్మా, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, స్వరూపా, కపిలా, హవ్య కవ్యవహా, ఘస్మరా, విశ్వకబలా, లోలాక్షీ, లోల జిహ్వికా, సర్వభక్షా, సహస్రాక్షీ, నిస్సంగా, గతిప్రియా అచింత్యా, అప్రమేయా పూర్ణరూపా, దురాసదా, సర్వా, సంసిద్ధిరూపా, పావనీ, ఏకరూపిణీ, యామలవేధా, వేదస్వరూపిణీ, శాంభవవేదా, భావనాసిద్ధి సూచినీ, వహ్నిరూపా, ద్రసా, అమావిఘ్నా, భుజంగమా, షణ్ముఖా, రవిరూపా, మాతా, దుర్గా, విశా, ధనాధా, కేశవా, యమి, హరా, శతా, అశ్వినీ, యమి, వహ్నిరూపా, ధాత్రీ చంద్రా, శివా, అదితి, జీవా, సర్పిణీ, పితృ రూపిణీ, అర్యమా, భగా, సూర్యా, త్వాష్ట్రి, మారుతి ఇంద్రాగ్నిరూపా, మిత్రా, ఇంద్రాణీ, నిఋృతి, జలా, వైశ్వదేవీ, హరితభూ, వాసవీ, వరుణా, జయా, అహిర్బుధ్న్యా, పూషణీ, కారస్కరా, అమలా, ఉదంబురా, జంబువా, ఖదిరా, కృష్ణ రూపిణీ, వంశా, పిప్పలా, నాగా, రోహిణీ, సలాశకా, పక్షవా అమ్బష్ణా, బిల్వా, అర్జునరూపిణీ, వికంకతా, కకుభా, సరలా, సర్జికా, వంజులా, పనసా, అర్కా, శమి, హలిప్రియా, ఆమ్రకా, నింబా, మధూవా, అశ్వత్థా, గజా, నాగినీ, సార్పిణీ, శునీ, కపిరూపా, గోఘంటా, వానరీ, నరా, అశ్వినీ, నగా, గౌ, హస్తినీ, షట్చక్రవాసినీ, త్రిఖండా, తీరపాలా, భ్రామణీ, ద్రవిణీ, సోమా, సూర్యా, తిథి, వారా, యోగా, ఋక్షా, కరణాత్మకా, యక్షిణీ, తారణా, వ్యోమ శబ్దాద్యా, ప్రాణినీ, ధీ, క్రోధినీ, స్తంభినీ, చందా, ఉచ్చండా, బ్రాహ్మాదిరూపిణీ, సింహస్థ, వ్యాఘ్రగా, గజాశ్వగరుడస్థితా, భౌమ్యాప్యా, తైజసీ, వాయురూపిణీ, నాభసా, ఏకవక్రా, చతుర్వక్రా, నవవక్రా, కలావా, పంచవింశతి, వక్త్ర, షడ్వింశతి వదనా, ఊనపంచాశ దాస్యా, చతుషష్టిముఖా, ఏకాశీతిముఖా, శతానన సమన్వితా, స్థూలరూపా, సాక్షిరూపా, తేజోవిగ్రహ ధారిణీ, వృణా, వృత్తి రూపా, నాథా, వృత్తి, స్వరూపిణీ, తత్త్వావృత్తి స్వరూపా, నిత్యావృత్తివపుర్థరా, అంగావృత్తి స్వరూపా, ఆయుధావృత్తి రూపిణీ. గురుపంక్తి స్వరూపా, విద్యావృత్తితను, బ్రహ్మద్యా వృత్తిరూపా, పరా, పశ్యంతికా, మధ్యమా, వైఖరీ, శీర్షకంఠతాలోఽపదంతగా, జిహ్వామూలగతా, నాసాగతా, ఉరః స్థలగామినీ, పద వాక్య స్వరూపా, వేదభాషా స్వరూపిణీ, సేకాఖ్య, వీక్షణాఖ్యా, ఉపదేశాఖ్య, వ్యాకులాక్షర సంకేలీ, గాయత్రీ, ప్రణవాదికా, జపహోమార్చన ధ్యాన మంత్ర తర్పణ రూపిణీ, సిద్ధసారస్వతా, మృత్యుంజయా, త్రిపురా, గారుడా, అన్నపూర్ణా, అశ్వారూఢా, నవాత్మికా, గౌరీ, దేవీ, హృదయా, లక్షదా, మతంగినీ, నిష్క త్రయపదా, చేష్టావాదినీ, రాజలక్ష్మీ, మహాలక్ష్మీ, సిద్ధలక్ష్మీ, గవాననా,
ఇట్లు ఇవి లలితాదేవీ సహస్రనామములు సర్వార్థ సిద్ధి ప్రదములు. ఫల ప్రదములు ఈ సహస్ర నామస్తోత్రమును ఉషఃకాలమున చదివినచో అతను యోగీ, బ్రహ్మజ్ఞాని, శివయోగి, ఆత్మ జ్ఞాని అగును. ప్రతిదినము రెండు మార్లు జపించినచో ఆయురారోగ్య సంపదలు, లోకానురంజము, నారీనృపవశీకరణలు ఒకేసారి సిద్ధించును. మూడుమార్లు జపించినచో సమస్త ప్రపంచము వశ మగును. నాలుగు మార్లు జపించువానికి అఖిలాభీష్టములు సిద్ధించును. ప్రయోగార్హత లభించును. లోక రక్షాకరుడగును. అయిదు మార్లు జపించు వానికి, సరులు, నారీమణులు, దేవతలు, జంతువులు వశమగును. ఎప్పుడూ సాధకుని సేవించుచుండును. అరుమార్లు పఠించినచో తన్మయుడు అగును. దేవీ ప్రసాదము వలన వెంటనే అన్ని సిద్దులూ చేకూరును. ఏడుమార్లు జపించినచో శత్రు, రోగ, కృత్య, అపస్మారాదులు నశించును. ఎనిమిది మార్లు జపించినవాడు నిగ్రహానుగ్రహ సమర్థుడు అగును. తొమ్మిదిమార్లు జపించినచో వాక్ లక్ష్మీ కాంతులు సిద్ధించును. పదకొండుమారులు పఠిం చినచో అఖిల వృద్ధులు సమకూరును. జగత్తు అధీనమగును. పన్నెండు మార్లు పఠించినచో అంతట జయము సుఖము లభించును. పదునాలుగు మార్లు పఠించినచో అఖిలాభీష్టములు సర్వ మంగళములు లభించును. పదునైదుమార్లు పఠించినచో సకలాభీష్టములు అప్రయత్నముగా సిద్ధించును. పదు నారుమార్లు పఠించినచో నరుడు సాక్షాత్తుగా మహేశ్వరుడు అగును. ఈ ప్రపంచమును సృష్టించుటకు, కాపాడుటకు, సంహరించుటకు సమర్థుడగును. నలుబది రోజులు కాని ఒకనెల కాని కోరికతో ఈ సహస్ర నామ స్తోత్రమును జపించిన ఆ కోరికలు వెంటనే నెరవేరును. ఇట్లు నిత్యా వృత్యర్చ నాశ్రిత విధానమును నీకు తెలిపితిని. సకలాభీష్ట సాధనమగు సహస్ర నామ స్తోత్రమును కూడా తెలిపితిని. (3/89)